
టాలీవుడ్ నటి దాసరి సాహితి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈమేరకు ఆమె నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేశారు. పొలిమేర, పొలిమేర 2 సినిమాలలో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న దాసరి సాహితి.. హీరోయిన్‌గా కూడా ఛాన్సులు దక్కించుకుంటున్నారు. పొలిమేర సినిమాలో గెటప్ శ్రీను భార్య రాములు పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. అదే సినిమా సీక్వెల్‌లో సత్యం రాజేష్‌ను ప్రేమించిన అమ్మాయిగా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అవకాశాలు రావాలే గానీ తన సత్తా ఏంటో చూపించే టాలెంట్ ఈ బ్యూటీలో ఉంది.
తాజాగా దాసరి సాహితి రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నేడు ఏప్రిల్ 24న నామినేషన్ దాఖలు చేశారు.
అయితే, చేవేళ్లలో బీఆర్‌ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, బీజేపీ తరపున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్‌రెడ్డి పోటీలో ఉన్నారు. నామినేషన్ ప్రక్రియ రేపటితో ముగుస్తున్న సమయంలో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంక్‌కు సాహితి నామినేషన్ సమర్పించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment