Allu Arjun To Attend His Uncle's Convention Hall Opening Ceremony - Sakshi
Sakshi News home page

మామయ్య కోసం పొలిటికల్‌ కార్యక్రమానికి వెళ్తున్న అల్లు అర్జున్‌

Published Sat, Aug 19 2023 8:59 AM | Last Updated on Sat, Aug 19 2023 3:12 PM

Allu Arjun Attend His Uncle Convention Hall Opening Ceremony - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నల్లగొండ జిల్లాలోని భట్టుగూడెం గ్రామానికి నేడు వెళ్లారు. తన మామ, బీఆర్‌ఎస్‌ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి స్వగ్రామం వద్ద నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను ఆయన ప్రారంభించారు. పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి భట్టుగూడెం వద్ద 'కంచర్ల కన్వెన్షన్‌' పేరుతో ఈ ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు.

(ఇదీ చదవండి: చిరంజీవిని అలా అంటుంటే చాలా బాధగా ఉంది: ప్రముఖ హీరో)

ఇప్పటికే ఆయన పెద్దవూర మండలం కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ఆధునిక వసతులతో కూడిన 1000 మందికి సరిపడే ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవానికి తన అల్లుడైన అల్లు అర్జున్‌తోపాటు మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆయన ఆహ్వానించారు. అంతేకాకుండా నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుమారు 10 వేల మందికి భోజనాలతో పాటు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేశారు.

(ఇదీ చదవండి: అక్షయ్‌ కుమార్‌ పారితోషికంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత)

2014 ఎన్నికల్లోనే చంద్రశేఖర్‌రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి 24 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఇప్పుడు తాజాగా వచ్చే ఎన్నికల్లో  తన స్వస్థలమైన నాగార్జునసాగర్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీ చేయాలని ఆయన ఉన్నారు. అందులో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా చంద్రశేఖర్‌రెడ్డి  పర్యటిస్తున్నారు. ఇలా తన మామయ్య కోసం పాలిటిక్స్‌ వేడుకలో అల్లు అర్జున్‌ పాల్గొంటున్నారు. చంద్రశేఖర్‌రెడ్డికి పార్టీ నుంచి సీట్‌ వస్తే బన్నీ తప్పకుండా  మామ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం నడుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement