convention
-
ఆటా ఉత్సవాల్లో విజయ్ దేవరకొండ
-
18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్: అదిరిపోయిన ఆరంభం!
ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ జూన్ 7న బ్యాంకెట్తో మొదలయ్యి..మూడు రోజులు వివిధ కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగాయి. జార్జియా వరల్డ్ కాంగ్రె సెంటర్ ప్రాంగణం ఈ వేడుకుల కోసం అంత్యంత సుందరంగా ముస్తాబయ్యింది. అట్లాంటాలో ఈ వేడుకలు 2000, 2012లో జరగగా మళ్లీ ఇన్నేళ్లకు జరగడం విశేషం. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించిన అనంతరం కన్వెన్షన్ కోర్ టీం కన్వీనర్ కిరణ్ పాశం, అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని ఇంతలా దిగ్విజయంగా చేసుకునేందుకు సహకరించిన స్పాన్సర్లను కోర్ కమిటీ తోపాటు ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, బోర్డు అఫ్ ట్రస్టీలు ఘనంగా సత్కరించారు. ఇక ఆటా అవార్డ్స్ కమిటీ వివిధ రంగాలలో ప్రతిభాపాటవాలు చూపించిన వారికి అవార్డులు ప్రదానం చేసింది. ఈ వేడుకలో జరిగిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు దుద్దిళ్ల, సినీ నటులు శ్రీకాంత్, మెహ్రీన్, నేహా షెట్టి, తమ్మారెడ్డి భరద్వాజ, సందీప్ రెడ్డి వంగా వంటి పలువురు విశిష్ట అతిథులు ఆటా వారి ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలియ జేసి, అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనూప్ రూబెన్స్ బృందం చేసిన మ్యూజికల్ కాన్సర్ట్ చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఉర్రూతలూగించింది. రుచికరమైన భోజనాలు అందరి జిహ్వ చాపల్యాన్ని తీర్చాయి. ఇక ఈ వేడుకలో యూత్ కాన్ఫరెన్స్ హైటెట్గా నిలిచింది. ఎక్కడెక్కడ నుంచే పెద్ద ఎత్తున యువతీయువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ ఆటా నవత, యువత, భవితకు ఆటా పెద్ద పీట వేస్తుందంటూ దీని ప్రాముఖ్యత గురించి వివరించారు ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ఇంకా ఎన్నో ఆకట్టుకునే అలాగే అట్లాంటా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుండి పలు నాన్ ప్రాఫిట్ సంస్థల నుంచి ఎంతో మంది వచ్చారు. వారందరికీ కన్వీనర్ కిరణ్ పాశం అభినందనలు తెలిపి, ఈ కన్వెన్షన్ ఎలా మొదలయ్యిందీ, ఎంత మంది పాటుపడ్డారు, వాలంటీర్ల కృషి మున్నగు వివరాలు గురించి వివరించారు. ఆటా టీం గౌరవ అతిథులకు కృతజ్ఞతలు తెలియజేసి, సముచితంగా సత్కరించారు. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేసుకుని అందరం కలిసి పాల్గొని ఆనందిద్దాం అని అన్నారు కన్వీనర్ కిరణ్ పాశం.(చదవండి: 18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం!) -
18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం!
ఇక్కడ రెండు మూడు రోజులుగా వార్ రూమ్ అంటుంటే అర్థం కాలేదు. వెళ్లి చూస్తే, ఆటా నాయకులు కూర్చుని, రకరకాల కమిటీలతో, వెండర్లతో, వేరే టీంలతో మాట్లాడుతున్నారు, చర్చించుకుంటున్నారు, ఫోనుల్లో మాట్లాడుతున్నారు, వీడియో కాన్ఫరెన్సులు నడుస్తున్నాయి... అప్పుడు అర్థం అయ్యిందేమంటే.. జనతా గ్యారేజ్ సినిమాలాగా, 'ఇచ్చట అన్ని రకముల సమస్యలకు పరిష్కారం చూపబడును' అని. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఆటా వారు ఏ లెవెల్లో రెడీ అవుతున్నారో. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్యులు శ్రీధర్ బాబు దుద్దిళ్ల, భద్రాద్రి పండితులు, సినిమా వారు మెహ్రీన్, థమన్, అనూప్ రూబెన్స్, అంకిత, రోహిత్, సత్య మాస్టర్ వంటి ఎందరో విచ్చేశారు. మరి కొందరు బయలుదేరి, విహంగ వీక్షణ చేస్తున్నారు. వేరే ఊర్ల నుంచి ఆటా నాయకులు ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, పాస్ట్ ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, అజయ్, నర్సిరెడ్డి గడ్డికొప్పుల ఏతెంచారు. మిగతా వాళ్లు ఆన్ ది వే. అలానే, దూర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి, హోటళ్ళలోనో, బంధువుల ఇళ్లలోనో ఉంటున్నారు. కాన్సులేట్ జనరల్ అఫ్ ఇండియా, అట్లాంటా మేయర్, కాంగ్రెస్ మెన్, సెనేటర్స్, ఇక్కడి దేశీయ నాయకులు ఇలా చాలా మంది వేంచేయబోతున్నారు. వేరే వేరే నాన్ ప్రాఫిట్, సంస్థలు, మీడియా సంస్థల నుంచి చాలా మంది ప్రతినిధులు వస్తున్నారు. 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ అట్లాంటాలో ఈ శుక్రవారం, జూన్ 7 నుంచి 9 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఈ శుక్రవారం సాయంత్రం బ్యాంకెట్‌లో వివిధ రంగాలలో నిష్ణాతులకు ఆటా సాఫల్య అవార్డులు ప్రధానం చేస్తారు. ఇక శని, ఆదివారాలలో ఝుమ్మంది నాదం అంటూ పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ పోటీలు, ఆత్మ విశ్వాసం కోసం పెజంట్, ధ్యానం గురు దాజి ఉపన్యాసం, భద్రాద్రి కళ్యాణం, షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ పోటీలు, దడదడలాడించే అనూప్ రూబెన్స్, థమన్, త్రీఓరీ మ్యూజికల్ కాన్సర్ట్‌లు, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్, ఉమెన్స్ ఫోరమ్, అమెరికా, భారత దేశాల పొలిటికల్ ఫోరంలు, అల్యూమిని మీటింగులు, బిజినెస్ ఫోరంలు, సాహిత్య విభావరి, అష్టావధానం, లైఫ్ టైం అవార్డులు, ఆత్మీయ సత్కారాలు, వెండర్ స్టాల్ల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యువత గురించి సరే సరి.. వారికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే..మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆటా వారు. మరి ఇన్ని వినోదాలు, విశేషాలు ఒకే చోట ఉంటే, ఆలస్యం ఎందుకూ..? టిక్కెట్ల గడువు కూడా ముగియనుంది. వివిధ కాన్ఫరెన్స్ వివరాల కోసం www.ataconference.orgని, టిక్కెట్లకు https://ataconference.org/Registration/Attendee-Registrationని సందర్శించండి. ఆటా కమ్యూనిటీ రీచ్ సందర్భంగా అట్లాంటాతో పాటు వేర్వేరు నగరాలలో సమావేశాలు నిర్వహించారు, ఎంతోమంది రావడానికి ఉత్సాహం చూపించారు. అలానే, టాలీవుడ్ తారలతో కమ్యూనిటీ వార్‌కు 300 మందికి పైగా విచ్చేయడం హర్షణీయం. విశిష్ట అతిథులతో ఆత్మీయ సమ్మేళనాలు ఇప్పటికే మొదలయ్యాయి. కన్వెన్షన్ కోర్ టీం కన్వీనర్ కిరణ్ పాశం, అధ్యక్షురాలు మధు బొమ్మకంటి, కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ ఆధ్వర్యంలో దాదాపు 70 కమిటీలలో 500 మందికి పైగా వాలంటీర్లు అవిశ్రాంత కృషికి తగ్గ అజరామర ఫలితాలు త్వరలో చూడనున్నాం. కన్వీనర్ కిరణ్ పాశం మాట్లాడుతూ.. ఇప్పటికే చాలా పనులు పూర్తి అయ్యాయి., ప్రపంచమంతా ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది ముఖ్యంగా యువత ఆటాకి ఎంతో ముఖ్యమనీ, వారికి చాలా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. కావున అందరూ ఈ కార్యక్రమానికిచ్చేసి జయప్రదం చేయాలని అన్నారు. అధ్యక్షురాలు మధు బొమ్మినేని జార్జియా గవర్నర్ సందేశం అందరికీ వినిపించి.. జరగబోయే స్పిరిట్యుయల్, కంటిన్యూయస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత వివరించారు. ఎంతో మంది ఈ కార్యన్ని జయప్రదం చేసేందుకు ఆహర్నిశలూ కష్టపడుతున్నారనిన్నారు. అలాగే చాలా వెండర్ స్టాల్ల్స్, ఎన్నో ఫోరమ్స్ వంటి ఉపయుక్త కార్యక్రమాలు ఉన్నాయనీ చెప్పారు. అందువల్ల ఈ మహా పండుగకు అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. (చదవండి: నాట్స్ నాయకుడి సేవలకు నీతి ఆయోగ్ గుర్తింపు!) -
టీటీఏ అధ్యక్షులు వంశీరెడ్డి సారథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో టీటీఏ మెగా కన్వెన్షన్!
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం టీటీఏ మెగా కన్వెన్షన్ అమెరికాలోని సియాటెల్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగా వైభవంగా జరిగింది. మే 24 నుంచి మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో.. ప్రతిరోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు అలరించాయి. తెలుగు కన్వెన్షన్స్ చరిత్రలో మొట్ట మొదటి సారిగా వెస్ట్ కోస్ట్ సిటీలోని సియాటెల్ లో జరిగిన అతి పెద్ద టీటీఏ తెలుగు ఈవెంట్ విజయవంతంగా ముగిసింది. వాషింగ్టన్‌లోని సియాటెల్ కన్వెన్షన్ సెంటర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీటీఏ మెగా కన్వెన్షన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. సియాటెల్ తెలుగు వారితో పోటెత్తింది. ఇంత భారీ ఎత్తున అమెరికాలో మహా సభలు నిర్వహించటం తెలుగు కన్వెన్షన్స్ చరిత్రలో మొట్ట మొదటి సారి కావటం విశేషం. ఈ భారీ మొదటి తెలుగు మహాసభలను వ్యయ ప్రయాసలకు వెరవకుండా ఎంతో గ్రాండ్‌గా నిర్వహించటం మరో విశేషం. .కార్యక్రమాల నుంచి కళా ప్రదర్శనల వరకు, అవార్డుల నుంచి హాస్పిటాలిటీ వరకు, స్వాగతాల నుంచి భోజనాల వరకు మూడు రోజుల పాటు వేటికవే వినూత్నమైన కార్యక్రమాలతో నభూతో నభవిష్యతీ అనేలా నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు వంశీరెడ్డి కంచరకుంట్ల సారథ్యంలో పలు కమిటీలు, వాలంటీర్లు అలుపెరుగకుండా కృషి చేసి టీటీఏ వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించారు. ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార, అధికార ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున సినీతారలు విచ్చేసి సందడి చేశారు. కన్వెన్షన్ రెండవ రోజు సాయంత్రం సుమారు 13,500 మందికి పైగా, ముగింపు వేడుకల్లో ఏకంగా 17,500 మందికి పైగా హాజరైనట్లు నిర్వహకులు పేర్కొన్నారు. కన్వెన్షన్ బాంక్వెట్ డిన్నర్ : టీటీఏ మహాసభల్లో భాగంగా బాంక్వెట్ డిన్నర్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఇండియా నుంచి విచ్చేసిన అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కన్వెన్షన్ సావనీర్ ఆవిష్కరించారు. వ్యాపార, ఆరోగ్య, క్రీడలు, సామాజికసేవ, టెక్నాలజీ వంటి వివిధ రంగాలలోని అత్యద్భుతమైన ప్రతిభ పాఠవాలు కనబరచిన వారికీ టీటీఏ అవార్డ్సుఅందజేశారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. డోనార్స్ ని, ఇతర జాతీయ తెలుగు సంఘాల నేతలను శాలువా, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. ఈ మొత్తం బాంక్వెట్ డిన్నర్‌కి మూల స్తంభాలైన బాంక్వెట్ కమిటీని వేదిక మీదకు ఆహ్వానించి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కల్చరల్ పోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ సెలెబ్రిటీస్ పాల్గొని యూత్ ని అలరించారు. వందేమాతరం శ్రీనివాస్ మ్యూజికల్ షో ఆకట్టుకుంది. వందేమాతరం శ్రీనివాస్ సారధ్యంలోని గాయనీగాయకులు జానపద పాటలు పాడి అందరినీ మెప్పించారు. భక్తి పాటలు, జానపదాలు, సినిమా పాటలతో అలరించారు. కార్యక్రమం ఆసాంతం ప్రముఖ యాంకర్ సుమ కనకాల తనదైన శైలి వ్యాఖ్యానంతో నవ్వులు పూయించారు. కన్వెన్షన్ రెండోవ రోజు : మెగా కన్వెన్షన్ రెండో రోజులో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలియజేస్తూ నిర్వహించిన ఇండియా డే పెరేడ్ ఆకట్టుకుంది. బోనాలు, బతుకమ్మ, పోతురాజు తో మహిళలు, టీటీఏ నాయకులు ఊరేగింపుగా కన్వెన్షన్ ఇనాగరల్కి విచ్చేశారు. కన్వెన్షన్ రెండో రోజు కార్యక్రమాలు ఘనంగా ప్రారంబమయ్యాయి. అమెరికా, భారత్ జాతీయ గీతాల తోపాటు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా టీటీఏ అధ్యక్షులు వంశీరెడ్డి కంచరకుంట్ల, వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్ డా. విజయపాల్ రెడ్డి, కోఛైర్ డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి, తదితరులు ఆహ్వానితులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రెండో రోజు కన్వెన్షన్ లో బాగంగా బ్రేకౌట్ సెషన్స్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. టీటీఏ స్టార్ట్ప్ కబ్, మాట్రిమోనీ, సీఎంఈ, అష్టావధానం, టీటీఏ స్టార్ , బ్యూటీ పాజెంట్ , ఫైర్‌సైడ్ చాట్ , యూత్ సెషన్స్, పొలిటికల్ మీట్ & గ్రీట్స్ నిర్వహించారు. కన్వెన్షన్ లో భాగంగా టాలీవుడ్ హీరోయిన్స్ శ్రీలీల, మెహ్రీన్ లను వేదిపై ఆహ్వానించి, ప్రసంగాల అనంతరం సత్కరించారు. యాంకర్స్ సుమ, రవి యాంకరింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా పలువురికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందజేశారు. డా. హరనాథ్ పోలిచెర్ల చేసిన సేవలకుగాను టీటీఏ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందజేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన త్రీయరీ బ్యాండ్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ రెండోవ రోజు కన్వెన్షన్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైఎస్సార్ జయంతి వేడుకలు :మెగా కన్వెన్షన్‌లో పొలిటికల్ మీట్ & గ్రీట్స్ ఏర్పాటు చేశారు. మహాసభలో భాగంగా వైఎస్సార్సీపీ మీట్ అండ్ గ్రీట్ తో పాటు డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో హాజరైన వైఎస్సార్సీపీ నేతలు, రాజన్న అభిమానులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారని కొనియాడారు ప్రవాసాంధ్రులు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చించారు. కన్వెన్షన్ మూడోవ రోజు: కన్వెన్షన్ మూడో రోజు భధ్రాచలం నుంచి విచ్ఛేసిన పండితులు శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా జరిపించారు. ప్రవాసులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. మహాసభల్లో భాగంగా వివిధ ఎక్సిబిట్ రూమ్స్‌లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు వేటికవే సాటి అనేలా సాగాయి. టీటీఏ స్టార్ ఫైనల్స్, బ్యూటీ పాజంట్ ఫైనల్స్, బిజినెస్ సెమినర్స్, ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్, ఫిట్నెస్ వర్కషాప్ వంటి బ్రేకౌట్ సెషన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన సెట్టింగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి . సాంస్కృతిక కార్యక్రమాలు వీనుల విందుగా జరిగాయి. డోనార్స్ ని, కార్పొరేట్ స్పాన్సర్ని ఘనంగా సత్కరించారు. బ్యూటీ పాజంట్, టీటీఏ స్టార్ విజేతలకు క్రౌన్, బహుమతులను అందజేశారు. డా. ప్రేమ్ సాగర్ రెడ్డికి జీవిత సాఫల్య పురస్కారం : మెగా కన్వెన్షన్‌లో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. అమెరికాలోని ప్రముఖ డాక్టర్, ప్రైమ్ హెల్త్‌కేర్ అధినేత, తెలుగుసంఘాలకు, కమ్యూనిటికీ నేస్తంగా, దాతగా పేరు పొందిన డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డికి టీటీఏ లైఫ్ టైం అచీవ్మెంట్ ర్డు దించి, ఘనంగా సత్కరించారు. నాటా వ్యవస్థాపకలు డా. ప్రేమ్ సాగర్ రెడ్డికి టీటీఏకార్యవర్గం, బోర్డు సభ్యులు మరియు నాటా లీడర్షిప్ సమక్షంలో ఈ అవార్డు అందించారు. ఈ సందర్భంగా డా. ప్రేమ్ రెడ్డి తన జీవిత సత్యాలను యువతను ఇన్స్పైర్ చేసేలా వివరించారు. అతిథులకు సన్మానం: కన్వెన్షన్ వేదికపై టాలీవుడ్ సెలబ్రేటీలను ఘనంగా సన్మానించి, సత్కరించారు. టీటీఏ అధ్యక్షులు వంశీరెడ్డి కంచరకుంట్ల, టీటీఏ కన్వెన్షన్ కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజులను కుటుంబ సమేతంగా వేదిక మీదకు ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా వీరు ఈ కన్వెన్షన్ నిర్వహణ వివరాలు పంచుకొని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వివిధ కన్వెన్షన్ కమిటీల సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించి అభినందించారు. ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ తమన్ మ్యూజికల్ కాన్సర్ట్ యువతను అలరించింది. తమన్ టీమ్ సినిమా పాటలు పాడి ఆడియన్స్‌లో జోష్ నింపారు. థమన్ సంగీత విభావరి ప్రేక్షకులను మంత్రముగ్థులను చేసింది. టీటీఏ మహాసభలకు తమన్ మ్యూజిక్ కాన్సర్ట్ హైలైట్ గా నిలిచింది. టీటీఏ మెగా కన్వెన్షన్‌లో పాల్గొన్న అతిథులకు ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతిని, ఆనందాన్ని ఈ తెలుగు మహాసభలు అందించాయి. ఆహుతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లు, వివిధ రకాల స్టాళ్లు, వేర్వేరు ఫుడ్ సెంటర్లు కనువిందు చేశాయి. ఒకే వేదికపై అభివృద్ధి, సంస్కృతి, కళలు, ప్రజా సంబంధాలు, సెమినార్లు, మాటా ముచ్చట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో- మరెన్నో కార్యక్రమాలతో.. మూడు రోజుల పాటు సియాటెల్‌లో తెలుగు పండగ వాతావరణం నెలకొంది. తెలుగు మహా సభలు అంటే ఇలా ఉండాలి అనేలా ఈ వేడుకలు నిలిచాయి. భవిష్యత్ లో జరిగే మహాసభలకు సరి కొత్త మార్గాన్ని చూపించాయి.(చదవండి: -
అట్లాంటాలో అట్టహాసంగా ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్!
జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటాలో అత్యంత భారీగా, మిన్నంటేలా జరగనున్న ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్ ఏర్పాట్లు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. సాంస్కృతిక, సాహిత్య, సంగీత, నృత్య, ఆధ్యాత్మిక, వ్యాపారం, వ్యవస్థాపకత, అవార్డులు, అంగళ్ళు, ఆరోగ్యం, నాయకత్వం, కళలు, మ్యాట్రిమోనీ, పేజంట్ వంటి ఎన్నెన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఆ మూడు రోజులలో జరగనున్నాయి. ఆటా వారు యువత తమకు ఎంత ముఖ్యమో చాలాసార్లు తెలియజేసారు, చేతల్లో చూపిస్తున్నారు కూడా. యువతకు ఉపయోగకరంగా సరదాగా సాగే చాలా ఈవెంట్స్ ఉన్నాయి. వారికి ఒక ప్రత్యేక కమిటీ కూడా ఉంది. వినోద, వివేక, విజ్ఞానాల కలబోతగా ఉండనున్న కన్వెన్షన్ గురించి ఎంత సేపైనా మాట్లాడుకోవచ్చు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక విందు సరే సరి, తెలుగు వారి వంటకాలు నోరూరేలా, ఘుమ ఘుమ లాడుతూ చాలానే ఉండనున్నాయి. వివిధ రంగాలలో ప్రముఖులకు ఆటా అవార్డులు అందజేయటం ఆనవాయితీగా వస్తోంది. పొద్దు పోయాక జరిగే మ్యూజికల్ కాన్సర్ట్ లు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణే. మహిళా సాధికారికత కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశిష్ట అతిథుల విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు శ్రీ. రేవంత్ రెడ్డి, శ్రీ. జగన్ మోహన్ రెడ్డిని, ఎంతో మంది ప్రముఖ నటులను, దర్శకులను, సాహితీ వేత్తలను, శాస్త్రఘ్నులను, వ్యాపారవేత్తలను, న్యాయ కోవిదులను, వివిధ రంగాలలో నిష్ణాతులను ఆటా నాయకత్వం ఆహ్వానించడం జరిగింది. భారతదేశం నుంచి ఇప్పటికే విజయ్ దేవరకొండ, జాహ్నవి కపూర్, మెహ్రీన్, శ్రీకాంత్, థమన్, అనూప్ రూబెన్స్, సందీప్ రెడ్డి వంగా, తనికెళ్ళ భరణి వంటి వారు వస్తున్నామని నిర్ధారించారు, ఇంకా తెలంగాణా క్యాబినెట్ మంత్రులు, ఎందరో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు విచ్చేస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు ఒకే చోట జరగడం చిరస్మరణీయం. ఆలస్యం దేనికీ, రండీ కదలి రండి, ఈ అత్యద్భుతాన్ని ఆస్వాదించండి. మరిన్ని వివరములకు https://ataconference.org, ఎర్లీ బర్డ్ టికెట్లకు https://ataconference.org/Registration/Attendee-Registration ని సందర్శించండి.జార్జియా కాంగ్రెస్ సెంటర్ ప్రాంగణం చాలా పెద్దది. కన్వెన్షన్ కి 15 నుండి 20 వేల మంది వస్తారని అంచనా, వీళ్ళందరికీ ఈ సెంటర్ చాలా వసతిగా ఉంటుంది. ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, కన్వీనర్ కిరణ్ పాశం ఆధ్వర్యంలో చాలా టీములు వెళ్లి సదుపాయాలు చూసి వచ్చారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మధు గారు మాట్లాడుతూ.. వేల మంది వందల రోజులు ఈ కన్వెన్షన్ కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇది అభినందనీయం. అందరూరండి, కన్వెన్షన్‌లో పాలు పంచుకోండని అన్నారు. అమెరికా విషయానికి వస్తే, జా2ర్జియా గవర్నర్ బ్రయాన్ కెంపిని ఆహ్వానించారు. ఆయన వీలుంటే తప్పకుండా వస్తాను అన్నారు. అట్లాంటాలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణను సాదరంగా ఆహ్వానించారు. కన్వీనర్ కిరణ్ గారు మాట్లాడుతూ.. కాన్సులేట్ జనరల్ రావడం కార్యక్రమానికి ఎంతో వన్నె తెస్తుందని శ్లాఘించారు. అలానే, లోకల్ లీడర్స్ ఎందరినో పిలిచామనీ, వారందరూ విచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ మెన్ రిచ్ మెకార్మిక్, సెనేటర్ జాన్ ఆసాఫ్, స్టేట్ రెప్రెసెంటేటివ్ టాడ్ జోన్స్, కమీషనర్లు లారా సేమాన్సన్, ఆల్ఫ్రెడ్ జాన్, సిటీ కౌన్సిల్ దిలీప్ తున్కి, బాబ్ ఎర్రమిల్లి, నరేందర్ రెడ్డి, ఇంకా సిటీ మేయర్లు, ఇతర నాయకులను ఆహ్వానించడం జరిగింది. కోర్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ్ పలు కమిటీలను, నాయకులను, వాలంటీర్లను తదితరులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.ఇండియా నుంచి తేవలసిన వస్తువులు. ఇక్కడ కావలసినవి ఇప్పటికే సమకూరుస్తున్నారు. ఎక్సిబిట్స్ విషయానికి వస్తే, దాదాపు 200 లకు పైగా స్టాల్ల్స్ ఉండనున్నాయి. ఇంకా చాలా మంది పెడదామనుకున్నా, ఇంకే అవకాశం లేదని నిర్వాహకులు చెప్పారు. ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, పాస్ట్ ప్రెసిడెంట్ భువనేశ్ బూజాల, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆల, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు తోపాటు ఎంతో మంది కృషి చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా విశేషాలు ఉన్నాయి. త్వరలో కలుద్దాం. ఈ మధ్యలో మీకు మరిన్ని వివరాలు కావాలంటే, ఆటా సోషల్ మీడియా, వెబ్ సైట్, టీవీ ఇంటర్వ్యూ లు, పత్రికలు చూస్తూ ఉండండి.(చదవండి: తానా ప్రపంచసాహిత్యవేదిక నాల్గవ వార్షికోత్సవ వేడుకలు !) -
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఆటా ప్రతినిధుల ఆహ్వానం!
ఆటా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆటా కన్వెన్షన్ ఆహ్వానం అందించారు. ఈ ఏడాది జూన్ 7, 8, 9 తేదీలలో అమెరికాలోని అట్లాంటాలో ఆటా తెలుగు కన్వెన్షన్ భారీ ఎత్తున జరగనుంది. ఈ వేడుకలను అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆటా ప్రతినిధులు ఆటా తెలుగు కన్వెన్షన్ అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. అందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అమెరికాలో వున్న తెలుగు వాళ్ళను కలవడానికి తప్పకుండా వస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన వారిలో కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ రెడ్డి పాశం, మాజీ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, కో ఆర్డినేటర్ వశిష్ఠ్ రెడ్డి తదితరులు వున్నారు. కాగా, ఆటా సంస్థ సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుంది. ఆటా నేతృత్వంలో చాలా మందికి సాయం అందించారు. ఇలాగే గతేడాది ఆటా కన్వెన్షన్ డిసెంబర్ నెలలో 20 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవ కార్యక్రమాలు చేసిన విషయం విదితమే. (చదవండి: సింగపూర్‌లో తమిళ వైభవం..ప్రోత్సహిస్తున్న ఆ దేశ మంత్రి!) -
సీటెల్‌లో ఘనంగా టీటీఏ బోర్డు సమావేశం!
తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ బోర్డ్ సమావేశం సీటెల్‌లో ఘనంగా జరిగింది. వ్యవస్థాపకులు, బోర్డ్ నాయకులు, సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల సీటెల్ పోలీసు అధికారి కారు ఢీకొని మరణించిన జాహ్నవి కందుల మృతికి బోర్డ్ సభ్యులు సంతాపం తెలియజేశారు. ఆమె మృతికి కారణమైన పోలీసు అధికారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రెసిడెంట్ వంశీ రెడ్డి అధ్యక్షతన 2024 మే 24 నుంచి 26 వరకు సియాటిల్ నగరంలో జరిగే టీటీఏ మెగా కన్వెన్షన్ 2024 గురించి చర్చించారు. ఈ బోర్డు సమావేశంలో టీటీఏ కన్వెన్షన్ వెబ్సైట్, సరికొత్త లోగోను ప్రారంభించింది. ఈ సమావేశానికి టీటీఏ వ్యవస్థాపకుడు డాక్టర్ పైళ్ళ మల్లా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ సలహా మండలి విజయపాల్ రెడ్డి, మోహన్ పటోళ్ల, భరత్ మాదాడి, అధ్యక్షుడు వంశీ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్, ప్రధాన కార్యదర్శి కవిత, EC, BoD, జాతీయ బృందం అంతా కలిసి వివిధ అంశాలఫై చర్చించారు. టిటిఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి బోర్డ్ ప్రారంభ సందేశం వివరించారు. సీటెల్ లో వచ్చే ఏడాది జరగనున్న 2024 మెగా కన్వెన్షన్ సక్సెస్ చేయాలని, అవసరమైన నిధుల సమీకరణకు బోర్డ్ సభ్యులు కృషి చేయాలని కోరారు. టిటిఏ 2024 మెగా కన్వెన్షన్ విజయవంతానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అడ్వైజరీ చైర్ డా. విజయపాల్ రెడ్డి తెలియజేశారు. అడ్వైజరీ కో-చైర్ మోహన్ పాటల్లోల, సభ్యుడు భరత్ మాదాడి 2023 డిసెంబర్లో తెలుగు రాష్ట్రాల్లో జరిగే సేవా దినోత్సవాలు, అలాగే కన్వెన్షన్ గురించి వివరాలను తెలియజేశారు. టిటిఏ 2024 మెగా కన్వెన్షన్ గురించి ప్రెసిడెంట్ వంశీ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. కన్వెన్షన్‌ను విజయవంతం చేయాలని బోర్డు సభ్యులందరినీ కోరారు. ఈ బోర్డ్ మీటింగ్‌లో దాదాపు 1 మిలియన్ డాలర్లు నిధుల సేకరణకు హామీలు వచ్చాయి. అలాగే టీటీఏ మెగా కన్వెన్షన్ కు వేదికైన సియాటిల్ కన్వెన్షన్ సెంటర్ ని బోర్డు సభ్యులు పరిశీలించారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మల్లిపెద్ది, సెక్రటరీ కవితా రెడ్డితో పాటు టీమ్ సభ్యులు, పులువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని.. కన్వెన్షన్ విజయవంతానికి అందరూ కృషి చేయాలని కోరారు. ప్రాంతీయ సభ్యులందరితో సాయంత్రం టీటీఏ కార్య నిర్వాహక వర్గం కలిసి సాంస్కృతిక కార్యక్రమములో పాల్గొన్నారు. విజ్ఞేశ్వర స్తుతితో మొదలైన ఈ కార్యక్రమము ఆద్యంతం ప్రేక్షకులకు స్వచ్చమైన తెలంగాణ సంప్రదాయముల మధ్య అంగ రంగ వైభవముగా జరిగింది. కార్యక్రమాన్ని ప్రారంభించిన వంశీ రెడ్డి గారు సియాటెల్ వచ్చిన టీటీఏ ప్రతినిధులకి సాదరంగా స్వాగతం పలికి ఆహ్వానిత అతిధులందరిని పేరు పేరునా వేదిక మీదకి ఆహ్వానించి శాలువాలతో సత్కరించినారు. అనంతరం టీటీఏ మెగా కన్వెన్షన్ కి సంబంధించి అద్భుతమైన నిధుల సేకరణ విందు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. టీటీఏ విరాళాల రూపంలో ఒకే రోజులో 2 మిలియన్ డాలర్లను విజయవంతంగా సేకరించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు, సియాటిల్ నగరంలో ఇంత పెద్ద కన్వెన్షన్ జరుగుతున్నందుకు హర్షం వ్యక్తం చేసి, తమ మద్దతు ప్రకటించారు. ప్రముఖ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ , APNRTS Regional Co ordinator దుష్యంత్ రెడ్డి, శ్రీనివాస్ అబ్బూరి , రామ్ పాలూరి, భాస్కర్ గంగిపాముల, తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ బోర్డ్ కృతజ్ఞతలు తెలిపింది. (చదవండి: భార్య సిజేరియన్ వల్లే..అనారోగ్యానికి గురయ్యానంటూ ఓ భర్త..) -
Allu Arjun In Nalgonda Latest Photos: నాగార్జునసాగర్‌లో ఐకాన్ స్టార్ సందడి (ఫొటోలు)
-
మామయ్య కోసం పొలిటికల్ కార్యక్రమానికి వెళ్తున్న అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నల్లగొండ జిల్లాలోని భట్టుగూడెం గ్రామానికి నేడు వెళ్లారు. తన మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి స్వగ్రామం వద్ద నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను ఆయన ప్రారంభించారు. పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి భట్టుగూడెం వద్ద 'కంచర్ల కన్వెన్షన్' పేరుతో ఈ ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. (ఇదీ చదవండి: చిరంజీవిని అలా అంటుంటే చాలా బాధగా ఉంది: ప్రముఖ హీరో) ఇప్పటికే ఆయన పెద్దవూర మండలం కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ఆధునిక వసతులతో కూడిన 1000 మందికి సరిపడే ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవానికి తన అల్లుడైన అల్లు అర్జున్‌తోపాటు మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆయన ఆహ్వానించారు. అంతేకాకుండా నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుమారు 10 వేల మందికి భోజనాలతో పాటు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేశారు. (ఇదీ చదవండి: అక్షయ్ కుమార్ పారితోషికంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత) 2014 ఎన్నికల్లోనే చంద్రశేఖర్‌రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 24 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఇప్పుడు తాజాగా వచ్చే ఎన్నికల్లో తన స్వస్థలమైన నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయాలని ఆయన ఉన్నారు. అందులో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా చంద్రశేఖర్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఇలా తన మామయ్య కోసం పాలిటిక్స్ వేడుకలో అల్లు అర్జున్ పాల్గొంటున్నారు. చంద్రశేఖర్‌రెడ్డికి పార్టీ నుంచి సీట్ వస్తే బన్నీ తప్పకుండా మామ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం నడుస్తోంది. -
NATA : డాలస్ నాటా కన్వెన్షన్‌లో ట్రాన్స్పోర్ట్ కీ రోల్
అటు తమన్ నుండి తమన్నా వరకు, ఇటు దేవిశ్రీ నుండి దిల్ రాజు వరకు, మరెందరో పెద్దలు మరియు ప్రముఖులతో డాలస్ మహానగరం దద్దరిల్లిన వేళావిశేషాలను అంగరంగ వైభవంగా నిర్వహించడంలో నాటా ట్రాన్స్పోర్ట్ పాత్ర కీలకమని అసొసియేషన్ తెలిపింది. ఈ మేరకు ట్రాన్స్పోర్ట్ బృందాన్ని ప్రశంసించింది. ఘనంగా నాటా వేడుకలు భారీ జన పరివారం, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సంగీతం.. ఇలా చెప్పుకుంటూ పోతో నాటా వేడుకల్లో ఎన్నో విశేషాలు. ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరగడానికి తెర వెనక ఎందరో అసామాన్యుల కష్టం ఉంది. వారిలో ఒకటి ట్రాన్స్పోర్ట్ బృందం. డాక్టర్ రాజేంద్ర కుమార్ రెడ్డి పోలు చైర్ పర్సన్‌గా ఏర్పాటయిన నాటా రవాణా బృందం తక్కువ వ్యవధిలో అద్బుతమైన సేవలందించింది. నాటా రవాణా బృందంలో కీలకం ప్రణాళికా బృందం. దీన్ని కార్తిక్ రెడ్డి మేడపాటి, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, మరియు ప్రసాద్ రెడ్డి నాగారపు పక్కగా నిర్వహించారు. అందరికి అనుసంధానం వీరే నాలుగు వేల మందికి విమాన టిక్కెట్లు, ఐటినరీలు, ఎయిర్‌పోర్టులకు వచ్చిన అతిధులకు ఆహ్వానం, ఇలా ఎన్నో పనులను ఒక ప్లాన్‌తో ట్రాన్స్పోర్ట్ బృందం నిర్వహించింది. అతిధులను దగ్గరుండి వ్యాన్లలో, కార్లలో తీసుకొని హోటళ్ళకి, కన్వెన్షన్ హాలుకి తరలించి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేశారు. ఒక్క బస్సు రోడ్డుపై వెళ్తే మామూలే కానీ 16 పెద్ద పెద్ద బస్సులు, మెర్సిడీస్ స్ప్రింటర్ వ్యాన్లు, సబ్-అర్బన్ కార్లు, లగ్జరీ లిమోసిన్లు ఇలా డాలస్ హైవే రోడ్లపై సందడి చేశాయి. "డాలస్ ఫోర్ట్వర్థ్ ఎయిర్పోర్ట్" వద్ద ఐదు టెర్మినళ్లకి మరియు లవ్-ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న ఒక్క టెర్మినల్ కి వెళ్లి అందరిని నాటా కన్వెన్షన్ హాలుకి తీసుకొచ్చారు. పేరుపేరునా ధన్యవాదాలు ఈ మొత్తం యజ్ఞంలో సహకరించిన ప్రతీ సభ్యులకు నాటా ధన్యవాదాలు తెలిపింది. కార్తిక్ రెడ్డి మేడపాటి, నాగరాజ్ గోపిరెడ్డి, సురేష్ రెడ్డి మోపూరు, సుధాకర్ రెడ్డి మేనకూరు, వరదరాజులు రెడ్డి కంచం, అనిల్ కుమార్ రెడ్డి కుండా, హరినాథ్ రెడ్డి పొగాకు, ప్రసాద్ రెడ్డి నాగారపు, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, పవన్ రెడ్డి మిట్ట, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎద్దుల, పురుషోత్తం రెడ్డి బోరెడ్డి, శ్రీనివాస రెడ్డి ముక్క, శ్రీనివాసుల రెడ్డి కొత్త, ఎల్లారెడ్డి చలమల, మరియు గౌతమ్ రెడ్డి కత్తెరగండ్ల ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బృందానికి ప్రత్యేక సౌకర్యాలతో ఎల్లారెడ్డి చలమల జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన నాటా అధ్యక్షులు డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, కో-ఆర్డినేటర్ డాక్టర్ బూచిపూడి రామిరెడ్డి, నేషనల్ కన్వెన్షన్ అడ్వైజర్ శ్రీనివాసుల రెడ్డి కొట్లూరు, కన్వీనర్ ఎన్.యమ్.ఎస్ రెడ్డి , మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవ రెడ్డి గోసాల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ హరినాధ రెడ్డి వెల్కూరు , ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆళ్ల రామి రెడ్డి , సెక్రటరీ గండ్ర నారాయణ రెడ్డి , ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ దర్గా నాగి రెడ్డిలకు ట్రాన్స్పోర్ట్ టీం ప్రత్యేక ధన్యవాదములు తెలిపింది. -
US : ఇదెక్కడి ప్రకోపం, అమెరికాలో ఎందుకీ తెలుగు ప్రతాపం?
ఒకప్పుడు అమెరికాకు వచ్చే ప్రవాసాంధ్రులంటే ఎంతో గౌరవం. అక్కడి సమాజం హర్షించేలా హుందాగా ఉండేవారు. తెలివితేటల్లో మిన్నగా ఉంటూ ప్రతిభను చాటేవారు. అమెరికాలోని ఏ నగరానికి వెళ్లినా .. తెలుగు వాళ్లంటే ఓ బ్రాండ్ ఉండేది. ఇప్పుడు పరిస్థితి తరచుగా దిగజారుతోంది. చదువు, ఉద్యోగాల కోసం అమెరికాకు వెల్లువెత్తుతోన్న ప్రవాసాంధ్రుల్లో.. చాలా మంది కొన్నాళ్ల పాటు బాగానే ఉంటున్నారు. ఆ తర్వాతే అసలు రంగు బయటపెట్టుకుంటున్నారు. ఎందుకీ జాడ్యం తొలుత వృత్తి నైపుణ్యాలు, ఉద్యోగాలకు పరిమితమయిన ప్రవాసాంధ్రులు.. ఇప్పుడు కంపెనీలు నెలకొల్పారు, విజయవంతంగా నడిపిస్తున్నారు. అదే సమయంలో పేరాశ వీపరీతంగా పెరిగింది. డబ్బు సంపాదనతో ఆగిపోకుండా.. దాన్ని ఎగ్జిబిట్.. అంటే ప్రదర్శనకు తహతహలాడుతున్నారు. అమెరికన్ల తరహాలో హుందాగా వీక్ డేస్ లో కనిపించే ప్రవాసాంధ్రులు.. వీకెండ్ లో పార్టీ కల్చర్ వీపరీతంగా పెంచుకుని.. అక్కడ తమ స్థాయి, దర్పాన్ని ప్రదర్శించేందుకు ఉవ్విళ్లుతున్నారు. కనీసం కేజీ బంగారం శరీరంపై వేసుకుంటే తప్ప కన్వెన్షన్ కు హాజరు కాలేని పరిస్థితి చాలా మంది తెలుగు కుటుంబాల్లో ఉంది. ఆరంభంలో తమ కెరియర్ పై దృష్టి పెట్టిన చాలా మంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వైపు తొంగి చూస్తున్నారు. టిడిపి ఎంట్రీతో మారిన సీన్ అక్కడ బాగా సంపాదించిన వారు హఠాత్తుగా ఇక్కడికి వచ్చి అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేయడం పరిపాటి అయింది. దీన్నే అక్కడ హెలికాప్టర్ క్యాండిడేట్స్ అని సరదాగా చెప్పుకుంటారు. ఇలాంటి అభ్యర్థులంటే తెలుగుదేశం పార్టీకి పండగే. టికెట్ల కోసం ఎంతయినా ఖర్చు పెట్టడం, ఓటుకు కోట్లు గుప్పించడం ఇలాంటి వారి వల్ల చాలా సులభమని చంద్రబాబు నమ్ముతారు. చాలా మంది ప్రవాసాంధ్రులు వ్యాపారాల వైపు మళ్లారు. అయితే వీరేమి గొప్ప వ్యాపారాలు చేయడం లేదు. పేరాశ బాగా పెరిగి రియల్ ఎస్టేట్ బిజినెస్, హోటల్ బిజినెస్ చేస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ తో పాటు టెక్సాస్ లాంటి చాలా రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ అంతా మన వాళ్ల చేతిలోనే ఉంది. తనకు అనుకూలమైన కొందరిని విదేశాల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంచడం చంద్రబాబుకు బాగా అబ్బిన కళ. అక్కడి నుంచి రకరకాల ఫేక్ స్టోరీలను వండి తెలుగు రాజకీయాలపై వదలడం బాబు కోటరీకి వెన్నతో పెట్టిన విద్య. పేరులో కులాలను మార్చి.. ప్రత్యర్థులపై దాడి చేయడం బాగా అలవాటుగా మారింది. ఇందులో కొందరు ఎన్నారైలు పావులైపోతున్నారు. డబ్బు కోసం విలువలు మరిచి.. ఇదే సమయంలో మరికొందరు ఓ అడుగు ముందుకేసి ఈవెంట్ మేనేజ్ మెంట్ పేరుతో ఇండియా నుంచి ప్రముఖ అమ్మాయిలను తెప్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 'గంటకు ఇంత అంటూ' అనైతిక కార్యక్రమాలకు దిగి అక్కడి పోలీసులకు దొరికిపోయి మొత్తం తెలుగు ప్రజలకే చెడ్డ పేరు తెస్తున్నారు. షికాగో వేదికగా ఐదారేళ్ల కింద కొందరు పట్టుబడడం వల్ల చాలా మంది తెలుగు వాళ్లు ఇబ్బంది పడ్డారు. అసలు మాది తెలుగు అని చెప్పుకోవడానికి సిగ్గు పడ్డారు. వీసా ఇంటర్వ్యూలకు సినీ తారలు వెళ్తే అనుమానించే పరిస్థితి ఎదురయిందని కొందరు ప్రవాసాంధ్రులు తెలిపారు గ్రూపులు.. వర్గాలు ఇక ఏ ఈవెంట్ జరిగినా.. రెండుగా చీలడం పరిపాటయింది. ఇటీవల టెక్సాస్ లో బాలకృష్ణ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు బాహటంగానే తన్నుకున్న విషయం ప్రవాసాంధ్రుల మదిలోంచి ఇంకా పోలేదు. ఒక్క తెలుగుదేశంలోనే చాలా వర్గాలున్నాయి. అమెరికాకు 40, 50 ఏళ్ల కిందనే రావడంతో టిడిపి ఎన్నారైలలో ప్రాంతీయ అభిమానం బాగా పెరిగిపోయింది కులాల పేరుతో సంఘాలు, సినీ నటుల పేర్లతో అభిమాన సంఘాలు బాగా పెరిగిపోయాయి. ఇక ప్రాంతాల వారీగా ఇది మరింత ముదిరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాస్తా.. జిల్లాల పేరుతో మీటింగ్ లు, భేటీలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఘన చరిత్ర ఉన్న ప్రవాసాంధ్రులు కాస్తా.. ఇలాంటి పరిస్థితి కొని తెచ్చుకోవడం కాస్తా ఇబ్బందికరమేనని వాపోతున్నారు. చదవండి: తానా సభల్లో తన్నుకున్న 'తెలుగు' తమ్ముళ్లు మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ.. బండ్ల గణేష్ ఫుల్ ఫైర్ అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్.. -
ఏయ్ బిడ్డా.. ఇది మా అడ్డా.. నాటా వేడుకలకు డాలస్ రెడీ
(అమెరికా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) టెక్సాస్ : అమెరికాలోని డాలస్ నగరంలో జూన్ 30 నుంచి జులై 2వ తేదీ వరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ తెలిపింది. ప్రవాసాంధ్రులు అత్యధికంగా ఉండే డాలస్‌లో ఈ వేడుకలు జరగనుండడం.. మరింత ఊపు తెచ్చింది. (NATA నాటా కార్యవర్గ బృందం) కనివినీ ఎరుగని రీతిలో సభలు అమెరికా చరిత్రలోనే అత్యంత ఘనంగా ఈ తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది కమిటీ. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు, నాయకులు, కళాకారులు హాజరు కానున్నారు. ఈ మహాసభల్లో తెలుగు సంప్రదాయాలను, కళలను అద్భుతమైన రీతిలో ప్రదర్శించడానికి అత్యున్నతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నాటా అధ్యక్షుడు కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. కాబోయే అధ్యక్షుడు హరి వేల్కూర్, పూర్వాధ్యక్షుడు గోసాల రాఘవరెడ్డి, కార్యదర్శి గండ్ర నారాయణరెడ్డి, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ అధ్యక్షుడు నాగిరెడ్డి దర్గారెడ్డి తమవంతుగా వేడుకల కోసం కృషి చేస్తున్నారు. (ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను కలిసిన NATA బృందం) నాయకులకు వెల్కం అంగరంగ వైభవంగా జరిపేందుకు తలపెట్టిన ఈ మహా వేడుకలకు సంబంధించి ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కలిసింది నాటా బృందం. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను సన్మానించిన నాటా సభ్యులు.. మహాసభలకు సంబంధించిన విశేషాలను పంచుకుని ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఇక ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు, రెండు రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులు హాజరు కానున్నారు. సినిమా సందడే సందడి నాటా తెలుగు మహాసభల్లో టాలీవుడ్ సందడి కనిపించనుంది. స్పెషల్ అట్రాక్షన్‌గా రాంగోపాల్ వర్మ, బెస్ట్ మ్యూజిక్ ట్రయో దేవీ శ్రీ ప్రసాద్, థమన్, అనూప్ రూబెన్స్, అలాగే గేయ రచయిత అనంత శ్రీరాం, సింగర్ ఎస్పీ శైలజ, మధు ప్రియ తదితరులు హాజరు కానున్నారు. సినీ ప్రముఖులు శ్రీనివాసరెడ్డి, అలీ, లయ గోర్తి, పూజ ఝువాల్కర్, స్పందన పల్లి, అనసూయ, ఉదయభాను, రవి, రోషన్, రవళి తదితర ప్రముఖులతో ఈ వేడుకల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రముఖ దుస్తుల డిజైనర్ శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఫ్యాషన్‌షో, సినీ నృత్య దర్శకురాలు అనీ మాస్టర్ పర్యవేక్షణలో పిల్లల జానపద, సినీ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు టీన్ నాటా, మిస్ నాటా, మిసెస్ నాటా పోటీలు కూడా జరగనున్నాయి. ధ్యాన సందేశం ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు రవిశంకర్‌ను ఆహ్వానించింది నాటా కార్యవర్గం. గురు రవిశంకర్‌తో ప్రత్యేకంగా ముచ్చటించే అవకాశాన్ని ప్రవాసాంధ్రులకు కల్పించింది. సూపర్ వెన్యూ డాలస్ డాలస్ అనగానే గుర్తొచ్చేది అమెరికాలో తెలుగు కాపిటల్ అని. అలాంటి చోట.. అది కూడా డౌన్టౌన్లో అందరికీ అనుకూలమైన K బెయిలీ హచిసన్ కన్వెన్షన్ సెంటర్ (#KBHCCD)లో నాటా సభలు జరగనున్నాయి. పది లక్షల స్క్వేర్ ఫీట్ ఎగ్జిబిట్ స్పేస్, మూడు భారీ బాల్రూంలు, 88 మీటింగ్ రూంలు, ఒక భారీ థియేటర్ డాలస్ కన్వెన్షన్ సెంటర్ ప్రత్యేకతలు. 1957లో నిర్మించిన ఈ కన్వెన్షన్‌ను అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వచ్చారు. 2013లో అమెరికా మాజీ సెనెటర్ K.బెయిలీ పేరును ఈ కన్వెన్షన్ సెంటర్‌కు పెట్టారు. అన్నింటికీ అనుకూలం డాలస్ కన్వెన్షన్ సెంటర్ డౌన్ టౌన్లో ఉండడం వల్ల సులువుగా చేరుకోవచ్చు. ఈ కన్వెన్షన్‌లో భారీ పార్కింగ్ సెంటర్లున్నాయి. అన్నీ రకాల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో అనుసంధానం అయి ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అనుగుణంగా ఆమ్ట్రాక్, ట్రినిటీ రైల్వేలకు సమీపంలో ఉంది ఈ కన్వెన్షన్ సెంటర్. అలాగే కన్వెన్షన్‌తో నేరుగా స్కైవే బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ అయ్యేలా రెండు హోటళ్లు హయత్ రీజెన్సీ, షెరటాన్ హోటల్ ఉన్నాయి. (NATA వేడుకలు జరగనున్న డాలస్ కన్వెన్షన్) మూడు రోజులు డాలస్‌కు పండగ కళ జూన్ 30 శుక్రవారం ప్రారంభమయ్యే వేడుకలు.. జూలై 2 ఆదివారం వరకు జరుగుతాయి. శుక్రవారం సాయంత్రం అంగరంగ వైభవంగా బాంకెట్ డిన్నర్ ఏర్పాటు చేశారు, ఇక్కడ వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని నాటా ఎక్సలెన్స్ అవార్డులతో గుర్తించి సన్మానిస్తారు. ఇదే కార్యక్రమంలో అనూప్ రూబెన్స్ టీం సంగీత విభావరితో ఊర్రూతలూగించనున్నారు. జూలై 1, జులై2 రోజంతా సందడే సందడి. ఆట, పాట, మాట, మంతి.. ఒకటేంటి.. పండుగ వాతావరణంలో ప్రవాసాంధ్రులంతా ఒక్క చోట చేరి తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను అద్దం పట్టేలా వేడుకలు నిర్వహించనున్నారు. జులై 2న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరుడి కళ్యాణ వేడుక పద్మావతి అమ్మవారితో అంగరంగవైభవంగా జరగనుంది. మహాసభల ఏర్పాట్లను నాటా కార్యవర్గ సభ్యులు ఆర్య బొమ్మినేని, జయ తెలక్, మాధవి లోకిరెడ్డి, నంద కొర్వి, రేఖ కరణం, సుప్రియ టంగుటూరి, బ్రహ్మ బీరివెరా, హరి సూరిశెట్టి, సతీష్ సీరం, సలహాదారులు హరి వేల్కూర్, రామిరెడ్డి ఆళ్ల, ఉషారాణి చింత, సుజాత వెంపరాల ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే వారు నాటా వెబ్సైట్ https://nataconventions.org/conference-registration.php లో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు నాటా PR&మీడియా డీవీ కోటి రెడ్డి (9848011818)ని సంప్రదించాలని తెలిపారు. -
వాషింగ్టన్ డీసీ వేదికగా ఆటా వేడుకలు
వాషింగ్టన్ డీసీ: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ని 2022 జులై 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఆటా కార్యవర్గం ప్రకటించింది. వాషింగ్టన్ డీసీలో ఉన్న హెర్న్‌డాన్ వరల్డ్ గేట్ సెంటర్ ఏరియాలో క్రౌన్ ప్లాజా హోటల్లో జరిగిన ఆటా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు ఎనిమిది వందల మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. మొదటిసారి ఇప్పటి వరకు 16 సార్లు ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్‌లు జరిగాయి. అయితే ఇవన్నీ అమెరికాలోని వేర్వేరు నగరాల్లో జరిగాయి. అయితే 17వ కాన్ఫరెన్స్‌కి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మొదటిసారి వేదికగా నిలవనుంది. ఈ వేడుకలు నిర్వహించేందుకు వాల్టేర్ ఈ కన్వెన్షన్ సెంటర్‌ని ఎంపిక చేశారు. ఈ కాన్ఫరెన్స్‌కి క్యాపిటల్ ఏరియా తెలుగు సంఘం, కాట్స్ కో హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఏర్పాట్ల పరిశీలన ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కాట్స్ ఆధ్వర్యంలో 70 మందికి పైగా ఆటా కార్యవర్గ, అడ్హాక్, అడ్విసోరీ, లోకల్ కన్వెన్షన్ కమిటీలు కాన్ఫరెన్స్ ఏర్పాట్లను పరిశీలించారు. వాల్టేర్ ఈ కన్వెన్షన్ సెంటర్లో ఉన్న సౌకర్యాలను పర్యవేక్షించారు. 12 వేల మంది ఆటా కాన్ఫరెన్స్ యూత్ కన్వెన్షన్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం లో 12,000 మందికి పైగా తెలుగు వారు పాల్గొనే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా అన్ని సౌకర్యాలు కల్పించటానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. -
అట్లాంటాలో ఘనంగా ఆపి 37వ వార్షిక సదస్సు
అట్లాంటా : అమెరికాలోని అట్లాంటా మహానగరంలో ఆషియన్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫీజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఆపి) 37వ వార్షిక సదస్సు ఘనంగా జరిగింది. ఈ సదస్సుకు సుమారు మూడువేల మందికిపైగా హాజరయ్యారు. అమెరికాలోని వివిధ నగరాల నుంచి వైద్యులు వారి కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నారు. ఆపి అమెరికాలో అత్యంత శక్తివంతమైన, ప్రభావశీలమైన భారతీయ వైద్యుల సంఘం. అమెరికాలోని ఈ వైద్యుల సంఘం భారత దేశంలోనూ, అమెరికాలోను అనేకమైన వైద్య సేవలను అందిస్తోంది. ఆపి సంస్థ భారత ప్రభుత్వంతోను, అనేక రాష్ట్రాలతోనూ అనేక స్వచ్చంద సంస్థలతోను ఒప్పందాలు చేసుకుని విరివిగా భారత దేశంలో వైద్య సేవలను అందిస్తోంది. ఆపి 37వ వార్షిక సదస్సు జులై 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్లో.. మహబూబ్‌నగర్ మూలాలు కలిగిన అట్లాంటా ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ గంగసాని శ్రీనివాసులు రెడ్డి (శ్రీని గంగసాని) ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా జరిగాయి. జులై 3వ తేదీ సాయంత్రం విశ్వయోగి విశ్వంజీ హిందూ సాంప్రదాయ బద్దంగా జ్యోతిని వెలిగించి ఐదు రోజుల ఆపి మహా సభలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమెరికా ప్రభుత్వ అధికారులు, అమెరికా మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులతోపాటు అట్లాంటాలోని భారత ప్రభుత్వ దౌత్య అధికారిని డాక్టర్ స్వాతి కులకర్ణి కూడా పాల్గొని ఐదు రోజుల డాక్టర్ల సదస్సుకు హాజరైన డాక్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. జులై 4వ తేదీ ఉదయం ప్రముఖ వైద్యులు, ఆరోగ్య నిపుణులు, విద్యావేత్తలు మరియు భారతీయ సంతతి శాస్త్రవేత్తలు పాల్గొన్న ఆపి సదస్సులో ఇషా యోగ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ ముఖ్య ఉపన్యాసం చేస్తూ.. విద్య, వైద్యం, ఆధ్యాత్మికం వ్యాపారం కాకూడదని అన్నారు. ఎప్పుడైతే విద్య, వైద్యం, ఆధ్యాత్మికం వ్యాపారం అవుతాయో అప్పుడే ఆ జాతి పతనం ప్రారంభం అవుతుందని అన్నారు. ఆరోగ్యానికి చిహ్నాలైన వైద్యులు, ప్రజల ఆరోగ్యాన్ని కోరే వైద్యులు మరింత ఆరోగ్యంగా ఉండాలని, లేనిచో ఆ వైద్యుడు రోగుల బాగోగులను ఏం చూడగలడని ప్రశ్నించారు. వైద్యుల, వైద్య విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయని, ఈ పరిస్థితిని యుద్ధ ప్రాతిపదికన సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. 37వ వార్షిక ఆపి కన్వెన్షన్, సైన్టిఫిక్ అసెంబ్లీ.. వైద్యులకు వైద్య పరిజ్ఞానం, తమ వృత్తి నైపుణ్యం మెరుగు పరచుకోవడానికి దోహదపడుతోంది. అంతేగాకుండా వైద్యుల కుటుంబ సభ్యులకు తమ పాత మిత్రులను కలుసుకోవటానికి ఆపి సదస్సులు ఒక వేదికగా ఉపయోగపడుతున్నాయని అన్నారు. అదే ఆపి సదస్సుల దిగ్విజయానికి కారణం. అంతేగాకుండా భారత దేశంలోని వివిధ వైద్య కళాశాలల పాత విద్యార్థుల సమావేశాలు కూడ అత్యంత ఆదరణ పొందుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలోని గాంధీ, ఉస్మానియా, వరంగల్, వెంకటేశ్వర, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం వైద్య కళాశాలల పాత వైద్య విద్యార్థుల సమావేశాలు ఒక పండుగలా జరిగాయి. ఆపి కన్వెన్షన్, సైంటిఫిక్ అసెంబ్లీలో CME ( కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్) తరగతులు, ప్రొఫెషనల్, బిజినెస్, ఉమెన్స్ ఫోరమ్ వంటి అనేక సదస్సులతో పాటు వైద్య పరికరాలు, వివిధ విక్రయశాలలు, శంకర్ మహదేవన్ సంగీత విభావరి, వైద్యులు ప్రదర్శించిన నృత్య నాటక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారతదేశాన్ని టీబీ నుంచి తప్పించాలనే ఉద్దేశంతో USAID నుంచి తొమ్మిది మిలియన్ల నిధులతో భారత దేశంలో టీబీ నిర్మూలనకు ఆపి సంస్థ చేపట్టిన కృషి.. ఏంతో ప్రశంసనీయమైనిది. భారత ప్రభుత్వం మరియు స్థానిక సంస్థలతో ఆపి యొక్క భాగస్వామ్యం అనేక నగరాలు టీబీ ఫ్రీగా మారటానికి ఏంతో దోహదపడుతోంది. -
ఫంక్షన్..పన్ను టెన్షన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫంక్షన్ హాళ్లు జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి. విందు, వినోదం.. కార్యం ఏదైనా ఫంక్షన్ హాల్లో జరిగితే ఇకపై పన్ను కట్టాల్సిందే. ఫంక్షన్హాల్లో ఏ కార్యం చేసినా బిల్లులో 18% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వాణిజ్య పన్నుల శాఖ కొత్తగా ఫంక్షన్ హాల్ యాప్ రూపొందించింది. జీఎస్టీ వర్తించక ముందు ఫంక్షన్ హల్ బిల్లును సర్వీస్ ట్యాక్స్ ద్వారా చెల్లించేవారు. అయితే తాజాగా ఫంక్షన్ హాల్ సేవలతో పాటు వస్తువుల కేటగిరీలోకి రావడంతో జీఎస్టీ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రవ్యాప్తగా వార్షిక అద్దె రూ.20 లక్షల కన్నా ఎక్కువ ఉన్న అన్ని ఫంక్షన్ హాళ్లను జీఎస్టీ పరిధిలోకి తెస్తున్నారు. ఇప్పటివరకు ఫంక్షన్‌హాల్స్ సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చినా కూడా పన్నులు చెల్లించ ట్లేదని గ్రహించిన వాణిజ్య పన్నుల శాఖ.. ఈ నిర్ణ యం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో ఫంక్షన్ హాల్స్ అద్దెలు కూడా పెరగనున్నాయి. కేటరింగ్, డెకరేషన్, వినోదంతో పాటు అన్ని రకాల సేవలకు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఆధునిక పరిజ్ఞానంతో.. పన్ను వసూళ్ల కోసం వాణిజ్య పన్నుల శాఖ ఇప్పటికే ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తోంది. ఇప్పటికే ఐఓసీ, ఆర్డీ యాప్‌లతో సిబ్బందికి టార్గెట్లు కేటాయించి పన్నుల బకాయిలు వసూలు చేస్తోంది. ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫంక్షన్ హాల్‌లను జీఎస్టీ పరిధిలో తీసుకురావడానికి జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే జీఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫంక్షన్ హాల్లు పూర్తి సమాచారాన్ని కొత్త యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇంకా జీఎస్టీలో నమోదు చేసుకొని ఫంక్షన్ హాళ్లను యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఫంక్షన్ హాళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం యాప్‌లో పొందుపరచడంతో అధికారులు, సిబ్బందికి రిజిస్ట్రేషన్ సులభమైందని అధికారులు చెబుతు న్నారు. ఈ యాప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫంక్షన్ హాల్స్, సొంతం ఎన్ని.. కంపెనీలు, పార్ట్నర్షిప్లో ఎన్ని ఉన్నాయనే వాటిపై వివరాలు సేకరిస్తున్నారు. ఫంక్షన్ హాల్ వైశాల్యం తదితరాలతో పాటు పాటు ఉద్యోగుల సంఖ్యపై ఆరా తీస్తున్నారు. ఫంక్షన్ హాల్లో సామగ్రిపై కూడా నజర్ వేస్తున్నారు. ఒకవేళ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారు డీఆర్సీ ఫామ్–3 ద్వారా పన్ను బకాయిలు చెల్లిస్తే వడ్డీ మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. అలా కాకుండా రిజిస్ట్రేషన్ చేయించు కోకుండా పన్నులు ఎగ్గొడితే వడ్డీతోపాటు జరిమా నాతో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఫంక్షన్ హాల్ యాప్‌తో ఫంక్షన్ హాళ్లకు సంబంధించి పన్నుల వసూళ్లు సులభమవు తున్నాయని అధికారులు చెబు తున్నారు. -
పాక్ జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందా?
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్థాన్ సైనికులకు బందీగా చిక్కిని భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్‌ను చిత్రహింసలకు గురిచేయవద్దని, జెనీవా ఒప్పందానికి కట్టుబడి వ్యవహరించాలని పాక్ సైన్యానికి భారత్‌తోపాటు అంతర్జాతీయ సమాజం విజ్ఞప్తి చేసింది. ఇంతకు జెనీవా ఒప్పందం అంటే ఏమిటీ ? అందులోని అంశాలేమిటీ? అవి ఎప్పుడు అమల్లోకి వచ్చాయి ? జేనీవా ఒప్పందానికి ఏయే దేశాలు కట్టుబడి ఉండాలి ? ఉల్లంఘిస్తే శిక్షేమిటీ ? జేనీవా ఒప్పందంలో నాలుగు అంతర్జాతీయ ఒప్పందాలు అంతర్భాగం. ఈ ఒప్పందంపై సంతకం చేసిన ప్రతి దేశం అంతర్జాతీయ మానవతా విలువలకు కట్టుబడి వ్యవహరించాలి. 1929లో మొదటిసారి ఈ ఒప్పందం అమల్లోకి రాగా, రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక రెండో సారి 1949లో ఆధునీకరించారు. జెనీవా ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఓ సైనికుడు పట్టుబడినా, ఓ పౌరుడు పట్టుబడినా వారిని ఎలా చూసుకోవాలో స్పష్టమైన నిబంధనలను రచించారు. ఒక్క యుద్ధం జరిగినప్పుడు మాత్రమే కాకుండా శాంతియుత పరిస్థితుల్లో కూడా దేశాల మధ్య ఈ నిబంధనలు వర్తిస్తాయి. (పైలట్ అభినందన్ తండ్రి భావోద్వేగం) 13వ అధికరణం ఏం చెబుతోంది? పట్టుబడిన సైనికుడికి అవసరమైన వైద్య చికిత్సలు అందించడంతోపాటు ఆయన్ని ఎలా చూసుకోవాలో కూడా జెనీవా ఒప్పందంలోకి 13వ అధికరణం తెలియజేస్తోంది. ‘నిర్బంధంలో ఉన్న సైనికుడిని శారీరకంగా ఎలాంటి హింసకు గురి చేయరాదు. హింస కారణంగా బందీ గాయపడినా, ప్రాణం పోయినా, ప్రాణాపాయానికి గురైన ఒప్పందం ప్రకారం తీవ్రమైన నేరం. ప్రజల నుంచి పొంచి ఉన్న ముప్పు నుంచి, ప్రజా హింస నుంచి పూర్తి రక్షణ కల్పించాలి. బందీపై ఎలాంటి వైద్య, శాస్త్ర ప్రయోగాలు నిర్వహించరాదు’ అని చెబుతోంది. భారత పైలట్ అభినందన స్థానిక ప్రజలకు చిక్కగానే వారు ఆయనపై దాడి చేసిన విషయం తెల్సిందే. (ట్రెండింగ్: వెలకమ్ బ్యాక్ అభినందన్) ఇదే సెక్షన్‌కు రెడ్‌క్రాస్ సొసైటీ అంతర్జాతీయ కమిటీ ఇచ్చిన నిర్వచనం ప్రకారం పట్టుబడిన బందీ ఫొటోలనుగానీ, వీడియోలనుగానీ విడుదల చేయరాదు. విడుదల చేసినట్లయితే ఆయన ప్రాణాలకు ప్రజల నుంచి లేదా ఇతర శక్తుల నుంచిగా ముప్పు ఉంటుందన్నది రెడ్‌క్రాస్ కమిటీ అభిప్రాయం. ఈ లెక్కన పాక్ సైనికులకు చిక్కిన అభినందన ఫొటోలను, వీడియోలను పాక్ సైనికులు విడుదల చేశారు కనుక వారిపై జెనీవా ఒప్పందం ఉల్లంఘించారని భారత్ అభియోగాలు మోపవచ్చు! (తలొగ్గిన పాక్.. రేపు అభినందన్ విడుదల) జెనీవా ఒప్పందంలో 140 అధికరణలు ఉన్నాయి. ఓ బందీ పట్ల జైలు లోపల, జైలు బయట, కోర్టులో కేసు విచారణ సందర్భంగా ఎలా ప్రవర్తించాలో, వారికి ఎలాంటి భోజనం పెట్టాలో, వారు ఉండేందుకు ఎలాంటి వసతి కల్పించాలో, పట్టుబడిన వెంటనే ఎలాంటి ప్రొటోకాల్స్ పాటించాలో ఈ అధికరణలు స్పష్టం చేస్తున్నాయి. బందీ మత విశ్వాసాల ప్రకారం ప్రార్థనలు చేసుకునే అవకాశం కూడా ఇవ్వాలి. ఈ ఒప్పందంపై అనేక దేశాలతోపాటు భారత్, పాకిస్థాన్ దేశాలు కూడా సంతకాలు చేశాయి. ఇందులోని నిబంధనలను, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయవచ్చు. అయితే అక్కడ అంత త్వరగా కేసులు పరిష్కారం కావు. రాజీలే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో అంతర్జాతీయ ఒత్తిడులే ఎక్కువగా పనిచేస్తాయి. (ఎవరీ అభినందన్?) గతంలో జరిగిన సంఘటనలు 1999లో కార్గిల్ యుద్ధం సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన పైలట్, గ్రూప్ క్యాప్టెన్ కే. నాచికేత విమానం చెడిపోవడంతో పారాషూట్ సాయంతో కిందకు దూకేశాడు. ఆయన్ని పాక్ సైనికులు బంధించారు. భారత్ ఈ విషయమై ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడంతోపాటు అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి తీసుకరావడంతో ఎనిమిది రోజుల అనంతరం ఆయన్ని విడిచిపెట్టారు. అయితే తన నుంచి గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడం కోసం తనను చిత్ర హింసలకు గురిచేశారని అప్పుడు ఆయన ఆరోపించారు. 1965లో జరిగిన భారత్, పాక్ యుద్ధం సందర్భంగా అనేక మంది భారత సైనికులు పాక్‌కు బంధీలుగా చిక్కారు. 2015, ఆగస్టు నెలలో ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప కుమారుడు కేసీ కరియప్ప పాక్ సైనికులకు చిక్కారు. ఆయన నాలుగు నెలల అనంతరం విడుదలయ్యారు. పాక్ జైళ్లలో తన నాలుగు నెలల అనుభవాలను ఆయన ‘అవుట్ లుక్’ పత్రికలో సవివరంగా రాశారు. -
రేపటి నుంచి బ్యాంకింగ్ సదస్సు!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ సదస్సు గురువారం ఇక్కడ ప్రారంభమవుతుంది. రెండు రోజులు జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, పీయూష్ గోయెల్, సురేశ్ ప్రభులు హాజరవుతారని అతున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మొండిబకాయిలు, తాజా మూలధన కల్పన, బ్యాంకింగ్ విలీనాలు వంటి అంశాలపై ఈ సదస్సు చర్చించనున్నట్లు సమాచారం. నీతి ఆయోగ్, సెంటర్ ఫర్ ఎకనమిక్ పాలసీ రీసెర్చ్ నిర్వహిస్తున్న ఈ సదస్సులో కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారులుసహా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ఉన్నత స్థాయి అధికారులు దాదాపు అందరూ పాల్గొంటారు. -
చైనాలో ప్రపంచ మార్క్సిజం సదస్సు
బీజింగ్: రెండో ప్రపంచ మార్క్సిజం సదస్సును 2018, మే 5–6 తేదీల్లో చైనాలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా 300కు పైగా మార్క్సిజం పరిశోధకులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహక బోర్డ్ చీఫ్ గు హైలియాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కారల్‌మార్క్స్ 200వ జయంతి ఉత్సవాలతో పాటు చైనాలో ఆర్థిక సంస్కరణలు చేపట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశంలో 21 శతాబ్దంలో మార్క్సిజం, చైనాలో దాని అభివృద్ధిపై చర్చిస్తాం’ అని తెలిపారు. ఇందులో భాగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆధునీకరణకు చైనా తరహా పరిష్కారంతో పాటు పలు అంశాలను చర్చిస్తామన్నారు. చైనా యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు ఆ దేశ అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ను అత్యున్నత నేతగా నిలబెట్టేందుకు కమ్యూనిస్ట్ పార్టీ చైనా కాంగ్రెస్ సమావేశాల్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కాగా, జిన్‌పింగ్ రాజకీయ విధానాల్ని స్కూళ్లలో పాఠ్యాంశాలుగా చేర్చనున్నారు. -
గుంటూరులో రైతు హక్కుల కోసం సదస్సు
-
నేడు కలెక్టర్ ఢిల్లీకి పయనం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సోమవారం సాయంత్రం డిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 24న( మంగళవారం) డిల్లీలో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సదస్సులో ఆయన పాల్గొంటారు. సదస్సుకు విధిగా హాజరు కావాలని కమిషన్ సభ్యురాలు కమలమ్మ ఆదేశాల మేరకు ఆయన బయలుదేరి వెళ్తున్నారు. 24న సదస్సును ముగించుకొని ఆదేరోజు రాత్రికే కర్నూలు చేరుకుంటారు. కలెక్టర్‌తో పాటు ఎస్పీ ఆకె రవికృష్ణ కూడా వెళ్తున్నారు. -
27న విజయవాడలో రాష్ట్రస్థాయి విద్యా సదస్సు
కర్నూలు సిటీ: కేంద్రం రూపొందించిన నూతన విద్యా విధానం ముసాయిదాకు వ్యతిరేకంగా ఈనెల 27న విజయవాడలో డీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణ తెలిపారు. సోమవారం స్థానిక డీటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ విడుదల చేసిన జాతీయ విద్యా విధాన రూప కల్పనకు దత్తాంశాలు–2016 అనేది భారత రాజ్యాంగ విలువలకు విరుద్ధమన్నారు. రాష్ట్ర స్థాయి సదస్సుకు ముఖ్య అతిథిగా అఖిల భారత విద్యా హక్కు వేదిక అధ్యక్షులు ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్, ప్రధాన వక్తలుగా ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, విరసం నాయకులు సీఎస్ఆర్ ప్రసాద్, ఎమ్మెల్సీ సుబ్రమణ్యం హాజరువుతారని తెలిపారు. సమావేశంలో డీటీఎఫ్ నాయకులు గట్టు తిమ్మప్ప, అల్లాబకాష్, బజారప్ప, ముద్ద రంగప్ప, జిల్లా మాజీ అధ్యక్షుడు కాంతారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శనీయుడు అబ్దుల్ కలాం
గన్ ఫౌండ్రీ: నేటితరం విద్యార్థులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను రోల్ మోడల్‌గా తీసుకోవాలని రామకృష్ణమఠం వివేకానంద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స డైరెక్టర్ పూజ్యశ్రీ స్వామి బోదమయానంద అన్నారు. శుక్రవారం కింగ్‌కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో హైదరాబాద్ కేంద్ర భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో డాక్టర్ అబ్దుల్ కలాంపై స్మారకోపన్యాస సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీ బోదమయానంద మాట్లాడుతూ... విద్యార్థులు పట్టుదల, కృషి వ్యక్తిత్వ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. యువత రాణించడంతోనే భారతదేశం అభివృద్ధి చెందుతుందన్నారు. భవన్స సైనిక్ పురి కేంద్ర సభ్యులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.గోపాలకృష్ణ, హైదరాబాద్ కేంద్ర చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంగ్లీష్శాఖ ప్రొఫెసర్ సుమితారాయ్, సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్‌లతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. -
నేడు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సదస్సు
విద్యారణ్యపురి : జన విజ్ఞాన వేదిక(జేవీవీ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 6న ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలోని శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్లో సదస్సును నిర్వహిస్తున్న ట్లు వేదిక జిల్లా అధ్యక్షుడు డి.ప్రభాకరచారి, ప్రధాన కార్యదర్శి వేల్పుల రా జు ఒక ప్రకటనలో తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరం ను అంతర్జాతీయ అపరాల సంవత్సరం–2016 గా ప్రకటించిందని, దీనిని పురస్కరిం చుకొని ఈ సదస్సున నిర్వహించబోతున్నామన్నారు.ఈ సదస్సులో ప్రధా న వక్తగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నిట్ ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి, విద్యావిభాగం కన్వీనర్ కే బీ ధర్మప్రకాష్ పాల్గొని ప్రసంగిస్తారన్నారు. -
ఇది విరామం మాత్రమే!
సమ్మెకు సిద్ధంగా ఉండాలిl ఎన్ఏడీ జంక్షన్: ఏడో వేతన సంఘం నిర్ణయాలపై అసంతృప్తితో సమ్మె చేసేందుకు రక్షణ శాఖ ఉద్యోగులు సిద్ధమయ్యారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సమయం కోరడంతో సమ్మె వాయిదా వేశామని 7వ పే కమిషన్( వేతన సంఘం) అఖిల భారత కమిటీ సెక్రటరీ జనరల్, జేసీఎం నేషనల్ కౌన్సిల్ సభ్యుడు ఎం. కృష్ణన్ అన్నారు. అయితే ఇది విరామం మాత్రమే అని స్పష్టం చేశారు. ఎన్ఎస్టీఎల్ మానసి ఆడిటోరియంలో డిఫెన్స్ కో ఆర్డినేషన్ కమిటీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వర్క్స్ కో ఆర్డినేషన్ కమిటీ సంయుక్తంగా ‘7వ వేతన సంఘం సిఫారసులపై ఐక్యపోరాటం– దాని ప్రభావం– ప్రభుత్వ వైఖరి’ అన్న అంశంపై ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పే కమిషన్ ఏర్పాటును పోరాటాల ద్వారానే సాధించుకున్నామన్నారు. 7వ పే కమిషన్ సిఫారసుతో ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర స్థాయిలో అన్యాయం జరుగుతుందన్నారు. జస్టిస్ మాథూర్ సిఫారసులు సమర్పించడానికి ఒక నెల గడువు కోరగా.. ప్రభుత్వం నాలుగు నెలల సమయం ఇచ్చిందని, ఇది ప్రభుత్వ కుట్రలో భాగమే అని ఆరోపించారు. ఉద్యోగులకు రావాల్సిన 52 అలవెన్సు లు రద్దు చేశారని మండిపడ్డారు. హక్కుల సాధనకు సెప్టెం బర్ 2న చేపట్టబోయే సమ్మెకు ఉద్యోగులు, కార్మికులు, అసంఘటిత కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏఐడీఈఎఫ్ సంయుక్త కార్యదర్శి జీటీ గోపాలరావు మాట్లాడుతూ బీజేపీ కార్మిక వ్యతిరేకSప్రభుత్వమన్నారు. రక్షణ శాఖ ఉద్యోగులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, అందుకు ఉదాహరణే ఇటీవల ఎయిర్‌ఫోర్స్ విమానం గల్లంతు ఘటన అని గుర్తు చేశారు. సైనికులు ప్రాణాలకు తెగించి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, వారికి కనీసం రిస్క్ అలవెన్స్‌లు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాల ద్వారానే ప్రభుత్వం దిగి వచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు. గ్రేడ్ పే రూ.18వేలు నిర్ణయించడం దారుణమని, దీన్ని రూ.26 వేలు చేయాలని డిమాండ్ చేశారు. -
'పార్టీ ఫిరాయింపులు- స్పీకర్ పాత్ర' అంశంపై సదస్సు
హైదరాబాద్: 'పార్టీ ఫిరాయింపులు- స్పీకర్ పాత్ర' అనే అంశంపై బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టీస్ బీపీ జీవన్ రెడ్డి, జస్టీస్ బీ సుదర్శన్ రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టీస్ పి. లక్ష్మణరెడ్డి, జస్టీస్ బి, శేషశయనారెడ్డి, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే. రామచంద్రమూర్తి, లోక్‌సత్తా జేపీ, వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. -
ఘనంగా రెండో రోజు నాటా వేడుకలు
డల్లాస్: అమెరికాలోని డల్లాస్‌లో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) కన్వెన్షన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలలో నటి హంసానందిని సందడి చేసింది. రెండో రోజు వేడుకల్లో పాల్గొనేందుకు రాజకీయ, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో డల్లాస్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు. కాగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో జరిగే సంగీత కార్యక్రమంలో గాయకులు హేమచంద్ర, సాయిచరణ్, సాయి శిల్ప, శృతి, శివ దినకర్, నూతన మోహన్, నరేంద్ర తదితరులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. తాము ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన వచ్చిందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాటా అధ్యక్షుడు డాక్టర్ మోహన్ మల్లం, భవిష్య అద్యక్షుడు రాజేశ్వర్ గంగసాని, మహా సభల కన్వీనర్ డాక్టర్ రమణారెడ్డి గూడూరు, సమన్వయకర్త రామసుర్యా రెడ్డి, కో కన్వీనర్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగిరెడ్డి దర్గా రెడ్డి అడ్వైజరీ కౌన్సిల్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిపై 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' అనే పుస్తకాన్ని విడుదల చేశారు. అలాగే వైఎస్ఆర్ సీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు. -
నేటి నుంచి ఢిల్లీలో ఐసీఎస్ఐ కన్వెన్షన్
హైదరాబాద్: కంపెనీ సెక్రటరీలకు సంబంధించిన అత్యున్నత సంస్థ ఐసీఎస్ఐ 43వ జాతీయ కన్వెన్షన్ నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. మేక్ ఇన్ ఇండియా థీమ్‌తో 3 రోజుల పాటు ఈ కన్వెన్షన్‌ను ఢిల్లీలో నిర్వహిస్తామని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ఒక ప్రకటనలో తెలి పింది. వ్యాపారాలు సులభంగా నిర్వహించడం, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, డిజిటల్ ఇండియా తదితర అంశాలపై సమావేశాల్ని నిర్వహిస్తామని ఐసీఎస్ఐ ప్రెసిడెంట్ అతుల్ హెచ్ మోహతా పేర్కొన్నారు. -
సాక్షి భవిత అవగాహన సదస్సుకు విశేష స్పందన
-
రేషన్ డీలర్ల సమావేశం రసాభాస
రెండు గ్రూపులుగా విడిపోయి వాదులాట గొడవ కారణంగా సమావేశానికి రాని మంత్రి ఈటల మధ్యలోనే వెళ్లిపోయిన అధికారులు హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. డీలర్ల సంఘం నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పర దూషణలు, వాదులాటకు దిగడంతో సమావేశం అర్ధాంతరంగా రద్దైంది. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖను పునర్వ్యవస్థీకరించేందుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం సరకుల సరఫరా, పంపిణీ తదితర అంశాల్లో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తోంది. ప్రక్షాళనలో కీలక భాగస్వాములైన డీలర్లతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ ఆశయాలను వారికి వివరించడంతో పాటు, అపరిషృ్కతంగా ఉన్న డీలర్ల సమస్యలను పరిష్కరించాలని భావించింది. దీనిలో భాగంగానే బుధవారం లక్డీకాపూల్‌లోని ఫ్యాఫ్సీ భవన్లో వారితో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి జిల్లాల నుంచి 500 మంది వరకు హాజరయ్యారు. సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్ రాకముందే సభా వేదికపైకి నేతలను పిలిచే క్రమంలో గొడవ రేగింది. అసలు డీలరే కానీ వ్యక్తి సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా ఎలా ఉంటాడని ప్రస్తుత అధ్యక్షుడు నాయకోటి రాజును ఉద్దేశించి ఓ వర్గం డీలర్లు గొడవకు దిగారు. ఏరోజూ డీలర్ల సంక్షేమం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో రాష్ట్ర అధ్యక్షుడి వర్గం ప్రతిదాడికి దిగింది. ఏడు జిల్లాల డీలర్లంతా కలిసి రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకున్నారంటూ ఎదురుదాడికి దిగింది. కొందరు విషపురుగులు వచ్చి సమావేశాన్ని చెడగొట్టే యత్నాలు చేస్తున్నారని, గతంలోనూ ఇదేమాదిరి వ్యవహరించారని ఆరోపణలు చేసింది. దీంతో సమావేశంలో ఘర్షణ వాతావరణ చోటుచేసుకుంది. రెండు వర్గాలు పరస్పర దూషణలు, వాదులాటకు దిగడంతో సమావేశానికి వచ్చిన అధికారులు బయటకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మంత్రి ఈటల సమావేశానికి రాలేనని సమాచారం పంపారు. చాలాసేపు వేచి చూసిన అధికారులు గొడవ సద్దుమణగకపోవడంతోఅక్కడినుంచి వెళ్లిపోయారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి అందరినీ శాంతపరిచే యత్నం చేశారు. మంత్రిని కలసి వివరణ.. కాగా సమావేశం రద్దైన అనంతరం డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు, మంత్రి ఈటలను మినిస్టర్స్ క్వార్టర్స్‌లో కలసి గొడవపై వివరణ ఇచ్చారు. కావాలనే ఒకరిద్దరు డీలర్లు ఇదంతా చేశారని మంత్రి దృష్టికి తెచ్చారు. గొడవను పట్టించుకోకుండా డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని, కమీషన్ పెంచే విషయమై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
రెవెన్యూ సదస్సులకు సిద్ధం కావాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గ్రామ రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ ఆదేశించారు. ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు సదస్సులు నిర్వహించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం తహసీల్దార్లు, వీఆర్ఓలు, ఆర్డీఓలు ఇతర రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మాట్లాడారు. పహణీల కంప్యూటరైజేషన్ పూర్తి చేయాలని కోరారు. తహసీల్దార్ల అధ్యక్షతన మాత్రమే గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించి సర్పంచ్‌లను భాగస్వాములను చేయాలని కోరారు. ఈ నెల 31లోగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి రెవెన్యూ సదస్సులపై వివరించి వారి అభిప్రాయాలు స్వీకరించాలని ఆదేశించారు. గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో పరిష్కరించిన భూ సమస్యలపై సభలో చదివి వినిపించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఇతర బలహీన వర్గాలకు ఇచ్చిన భూములను గుర్తించి సాగుకు యోగ్యంగా తయారు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామాల్లో శ్మశానవాటికలకు ప్రభుత్వం భూమిని కేటాయించాలని, లేనిచో కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించాలని తహసీల్దార్లకు సూచించారు. ఈసారి రెవెన్యూ సదస్సుల్లో నూతనంగా నివేశన స్థలాల అంశం కేటాయించినందున అందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో రెవెన్యూ సదస్సులపై జాయింట్ కలెక్టర్లతో జరిగే సమావేశానికి సమగ్ర సమచారం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ కలెక్టర్ ప్రసాదరావు, డీఆర్ఓ అంజయ్య, చంద్రవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నేడు తెలంగాణ బ్రాహ్మణ ఐక్యతా సదస్సు
హన్మకొండకల్చరల్, న్యూస్‌లైన్ : కాజీపేటలోని రైల్వే స్టేడియంలో ఆదివారం తెలంగాణ బ్రాహ్మణ ఐక్యతా సదస్సు నిర్వహిస్తున్నారు. పోరాటాల పురిటిగడ్డగా పేరొందిన ఓరుగల్లులో మొదటిసారిగా బ్రాహ్మణులంతా ఐక్య ఫ్రంట్‌గా ఏర్ప డి భారీస్థాయిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. కాగా, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే సదస్సుకు రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే సముద్రాల వేణుగోపాలచారి, పాలకుర్తి, సిద్ధిపేట, హన్మకొండ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, హరీష్‌రావు, దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, మ హాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేవీ.రమణాచారి, బీజేపీ జాతీయ నాయకుడు వి.ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్సీ తిరువరంగం సంతోష్‌కుమార్, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సౌందరరాజన్, కార్యనిర్వహణ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తదితరులు పాల్గొననున్నారు. సదస్సు విజయవంతం కావాలని ర్యాలీ.. కాజీపేట రైల్వే స్టేడియంలో తెలంగాణ బ్రాహ్మణ అర్చక శ్రీవైష్ణవ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న తెలంగాణ బ్రాహ్మణ ఐక్యతా సదస్సు విజయవంతం కావాలని కోరుతూ శనివారం సాయంత్రం సంఘం నాయకులు భారీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు అయినవోలు వెంకటసత్యమోహన్ జెం డా ఊపి ప్రారంభించారు. కాగా, వరంగల్ ఎంజీఎం సమీపంలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పోచమ్మమైదాన్, వరంగల్ రైల్వేస్టేషన్, వరంగల్ చౌరస్తా, బట్టల బజార్, భద్రకాళీ రోడ్, ములుగురోడ్, హన్మకొండచౌరస్తా, బ్రాహ్మణవాడ, లష్కర్‌బజార్, అదాలత్ మీదుగా కాజీపేట రైల్వేస్టేడియం చేరుకుంది. ఈ సందర్భంగా నక్కలగుట్టలోని కాళోజీ నారాయణరావు కాంస్య విగ్రహానికి బ్రాహ్మణ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, తెలంగాణ బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ వి.విశ్వనాథరావు, బ్రాహ్మణ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు తిరవరంగం ప్రభా కర్రావు, పొలిటికల్ జేఏసీ కన్వీనర్ జీవీఎస్.శ్రీనివాసచారి, గుదిమెల్ల విజయకుమారాచార్య, తెలంగాణ బ్రాహ్మణ సమాఖ్య కన్వీనర్ వెన్నెంపల్లి జగన్మోహన్శర్మ, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి గంగు ఉపేంద్రశర్మ, సమాఖ్య అర్చక అధ్యక్షులు వల్లూరి పవన్‌కుమార్, శివపురం రామలింగారాధ్య, శ్వేతా ర్క గణపతి దేవాలయం ప్రధానర్చకులు ఐనవోలు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్టేడియంలో గణపతి హోమం.. కాజీపేట : కాజీపేట రైల్వే స్టేడియంలో ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ బ్రాహ్మణ ఐక్యత సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘం అర్బన్ అధ్యక్షుడు వల్లాది పవన్‌కుమార్, పొలిటికల్ జేఏసీ కన్వీనర్ జీవీఎస్ శ్రీనివాసచారిలు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం వారు రైల్వే స్టేడియంలో సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ బ్రాహ్మణులు గణపతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవన్‌కుమార్, జీవీఎస్ శ్రీనివాసచారిలు మాట్లాడారు. ‘తెలంగాణ ఐక్యత ముద్దురా.. సమైక్యాంధ్ర వద్దురా’ అనే నినాదంతో బ్రాహ్మణ, అర్చక, శ్రీవైష్ణవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణులకు చట్టసభల్లో, పార్టీల్లో రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం కల్పించాలనే అంశంపై చర్చ జరుగుతుందన్నారు. జిల్లాలోని బ్రాహ్మణులందరూ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ వి.విశ్వనాథరావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, వెన్నంపెల్లి జగన్మోహన్శర్మ, తిరువగం ప్రభాకర్‌రావు, రాధాకృష్ణశర్మ, శివపురం రామలింగంచార్యులు పాల్గొన్నారు. -
భీమవరంలో ‘బాపు గారి బొమ్మ’
భీమవరం కల్చరల్, న్యూస్‌లైన్ : అత్తారింటికి దారేది ఫేం ప్రణీత బుధవారం భీమవరంలో సందడి చేశారు. జువ్వలపాలెం రోడ్డులోని ఆనంద కన్వెన్షన్‌లో వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఆమె ఎగ్జిబిషన్ అంతా కలియ తిరిగి శారీస్, డ్రస్ మెటీరియల్స్‌ను పరిశీలించారు. ఎగ్జిబిషన్‌కు వచ్చిన మహిళలు ప్రణీతతో కరచాలనం చేసేందుకు, మాట్లాడేందుకు పోటీ పడ్డారు. ఆమెతో ఫొటోలు దిగారు. కన్వెన్షన్ బయట ఉన్న యువకులు తమ అభిమాన నటిని చూసేందుకు ఎగబడ్డారు. ఎగ్జిబిషన్ మేనేజర్లు లీలాకుమార్, రాజు కృష్ణ మాట్లాడుతూ వచ్చే నెల 10 వరకు ఎగ్జిబిషన్, సేల్స్ ఉంటాయని చెప్పారు. మహిళలకు కావాల్సిన అన్నిరకాల చీరలు, చిన్న పిల్లల దుస్తులు అందుబాటులో ఉంటాయని, చీరలపై 60 శాతం వరకు రిబేట్ ఇస్తున్నామన్నారు. అనంతరం ప్రణీత విలేకరులతో మాట్లాడుతూ భీమవరం రావడం ఇదే మొదటిసారని, ఈ ప్రాంతమంతా పచ్చదనంతో ఆహ్లాదంగా ఉందన్నారు. ఇక్కడకు వచ్చి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అత్తారింటికి దారేది సినిమాలో నటించిన తనను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని, ప్రస్తుతం రభస సినిమాలో నటిస్తున్నానని చెప్పారు. మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలన్నదే తన అభీష్టమని, తనను ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఇలాగే ఆదరించాలని కోరుకున్నారు. -
హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు