18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం! | 18th ATA Convention & Youth Conference Is Going To Start | Sakshi
Sakshi News home page

18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం!

Published Fri, Jun 7 2024 10:38 AM | Last Updated on Fri, Jun 7 2024 10:56 AM

18th ATA Convention & Youth Conference Is Going To Start

ఇక్కడ రెండు మూడు రోజులుగా వార్ రూమ్ అంటుంటే అర్థం కాలేదు. వెళ్లి చూస్తే, ఆటా నాయకులు కూర్చుని, రకరకాల కమిటీలతో, వెండర్లతో, వేరే టీంలతో మాట్లాడుతున్నారు, చర్చించుకుంటున్నారు, ఫోనుల్లో మాట్లాడుతున్నారు, వీడియో కాన్ఫరెన్సులు నడుస్తున్నాయి... అప్పుడు అర్థం అయ్యిందేమంటే.. జనతా గ్యారేజ్ సినిమాలాగా, 'ఇచ్చట అన్ని రకముల సమస్యలకు పరిష్కారం చూపబడును' అని. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఆటా వారు ఏ లెవెల్లో రెడీ అవుతున్నారో. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్యులు శ్రీధర్ బాబు దుద్దిళ్ల, భద్రాద్రి పండితులు, సినిమా వారు మెహ్రీన్, థమన్, అనూప్ రూబెన్స్, అంకిత, రోహిత్, సత్య మాస్టర్ వంటి ఎందరో విచ్చేశారు. మరి కొందరు బయలుదేరి, విహంగ వీక్షణ చేస్తున్నారు. 

వేరే ఊర్ల నుంచి ఆటా నాయకులు ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, పాస్ట్ ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, అజయ్, నర్సిరెడ్డి గడ్డికొప్పుల ఏతెంచారు. మిగతా వాళ్లు ఆన్ ది వే. అలానే, దూర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి, హోటళ్ళలోనో, బంధువుల ఇళ్లలోనో ఉంటున్నారు. కాన్సులేట్ జనరల్ అఫ్ ఇండియా, అట్లాంటా మేయర్, కాంగ్రెస్ మెన్, సెనేటర్స్, ఇక్కడి దేశీయ నాయకులు ఇలా చాలా మంది వేంచేయబోతున్నారు. వేరే వేరే నాన్ ప్రాఫిట్, సంస్థలు, మీడియా సంస్థల నుంచి చాలా మంది ప్రతినిధులు వస్తున్నారు. 

18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ అట్లాంటాలో ఈ శుక్రవారం, జూన్ 7 నుంచి 9 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఈ శుక్రవారం సాయంత్రం బ్యాంకెట్‌లో వివిధ రంగాలలో నిష్ణాతులకు ఆటా సాఫల్య అవార్డులు ప్రధానం చేస్తారు. ఇక శని, ఆదివారాలలో ఝుమ్మంది నాదం అంటూ పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ పోటీలు, ఆత్మ విశ్వాసం కోసం పెజంట్, ధ్యానం గురు దాజి ఉపన్యాసం, భద్రాద్రి కళ్యాణం, షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ పోటీలు, దడదడలాడించే అనూప్ రూబెన్స్, థమన్, త్రీఓరీ మ్యూజికల్ కాన్సర్ట్లు, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్, ఉమెన్స్ ఫోరమ్, అమెరికా, భారత దేశాల పొలిటికల్ ఫోరంలు, అల్యూమిని మీటింగులు, బిజినెస్ ఫోరంలు, సాహిత్య విభావరి, అష్టావధానం, లైఫ్ టైం అవార్డులు, ఆత్మీయ సత్కారాలు, వెండర్ స్టాల్ల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యువత గురించి సరే సరి.. వారికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి. 

ఇంకో విషయం ఏంటంటే..మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆటా వారు. మరి ఇన్ని వినోదాలు, విశేషాలు ఒకే చోట ఉంటే, ఆలస్యం ఎందుకూ..? టిక్కెట్ల గడువు కూడా ముగియనుంది. వివిధ కాన్ఫరెన్స్ వివరాల కోసం www.ataconference.orgని, టిక్కెట్లకు https://ataconference.org/Registration/Attendee-Registrationని సందర్శించండి. ఆటా కమ్యూనిటీ రీచ్ సందర్భంగా అట్లాంటాతో పాటు వేర్వేరు నగరాలలో సమావేశాలు నిర్వహించారు, ఎంతోమంది రావడానికి ఉత్సాహం చూపించారు. అలానే, టాలీవుడ్ తారలతో కమ్యూనిటీ వార్‌కు 300 మందికి పైగా విచ్చేయడం హర్షణీయం. విశిష్ట అతిథులతో ఆత్మీయ సమ్మేళనాలు ఇప్పటికే మొదలయ్యాయి. కన్వెన్షన్ కోర్ టీం కన్వీనర్ కిరణ్ పాశం, అధ్యక్షురాలు మధు బొమ్మకంటి, కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ ఆధ్వర్యంలో దాదాపు 70 కమిటీలలో 500 మందికి పైగా వాలంటీర్లు అవిశ్రాంత కృషికి తగ్గ అజరామర ఫలితాలు త్వరలో చూడనున్నాం. 

కన్వీనర్ కిరణ్ పాశం మాట్లాడుతూ.. ఇప్పటికే చాలా పనులు పూర్తి అయ్యాయి., ప్రపంచమంతా ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది ముఖ్యంగా యువత ఆటాకి ఎంతో ముఖ్యమనీ, వారికి చాలా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. కావున అందరూ ఈ కార్యక్రమానికిచ్చేసి జయప్రదం చేయాలని అన్నారు. అధ్యక్షురాలు మధు బొమ్మినేని జార్జియా గవర్నర్ సందేశం అందరికీ వినిపించి.. జరగబోయే స్పిరిట్యుయల్, కంటిన్యూయస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత వివరించారు. ఎంతో మంది ఈ కార్యన్ని జయప్రదం చేసేందుకు ఆహర్నిశలూ కష్టపడుతున్నారనిన్నారు. అలాగే చాలా వెండర్ స్టాల్ల్స్, ఎన్నో ఫోరమ్స్ వంటి ఉపయుక్త కార్యక్రమాలు ఉన్నాయనీ చెప్పారు. అందువల్ల ఈ మహా పండుగకు అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. 

(చదవండి: నాట్స్ నాయకుడి సేవలకు నీతి ఆయోగ్ గుర్తింపు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement