ఆటా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆటా కన్వెన్షన్ ఆహ్వానం అందించారు. ఈ ఏడాది జూన్ 7, 8, 9 తేదీలలో అమెరికాలోని అట్లాంటాలో ఆటా తెలుగు కన్వెన్షన్ భారీ ఎత్తున జరగనుంది. ఈ వేడుకలను అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం ఆటా ప్రతినిధులు ఆటా తెలుగు కన్వెన్షన్ అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. అందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అమెరికాలో వున్న తెలుగు వాళ్ళను కలవడానికి తప్పకుండా వస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన వారిలో కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ రెడ్డి పాశం, మాజీ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, కో ఆర్డినేటర్ వశిష్ఠ్ రెడ్డి తదితరులు వున్నారు.
కాగా, ఆటా సంస్థ సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుంది. ఆటా నేతృత్వంలో చాలా మందికి సాయం అందించారు. ఇలాగే గతేడాది ఆటా కన్వెన్షన్ డిసెంబర్ నెలలో 20 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవ కార్యక్రమాలు చేసిన విషయం విదితమే.
(చదవండి: సింగపూర్‌లో తమిళ వైభవం..ప్రోత్సహిస్తున్న ఆ దేశ మంత్రి!)
Comments
Please login to add a commentAdd a comment