ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ జూన్ 7న బ్యాంకెట్‌తో మొదలయ్యి..మూడు రోజులు వివిధ కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగాయి. జార్జియా వరల్డ్ కాంగ్రె సెంటర్ ప్రాంగణం ఈ వేడుకుల కోసం అంత్యంత సుందరంగా ముస్తాబయ్యింది. అట్లాంటాలో ఈ వేడుకలు 2000, 2012లో జరగగా మళ్లీ ఇన్నేళ్లకు జరగడం విశేషం. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించిన అనంతరం కన్వెన్షన్ కోర్ టీం కన్వీనర్ కిరణ్ పాశం, అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని ఇంతలా దిగ్విజయంగా చేసుకునేందుకు సహకరించిన స్పాన్సర్లను కోర్ కమిటీ తోపాటు ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, బోర్డు అఫ్ ట్రస్టీలు ఘనంగా సత్కరించారు.
ఇక ఆటా అవార్డ్స్ కమిటీ వివిధ రంగాలలో ప్రతిభాపాటవాలు చూపించిన వారికి అవార్డులు ప్రదానం చేసింది. ఈ వేడుకలో జరిగిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు దుద్దిళ్ల, సినీ నటులు శ్రీకాంత్, మెహ్రీన్, నేహా షెట్టి, తమ్మారెడ్డి భరద్వాజ, సందీప్ రెడ్డి వంగా వంటి పలువురు విశిష్ట అతిథులు ఆటా వారి ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలియ జేసి, అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనూప్ రూబెన్స్ బృందం చేసిన మ్యూజికల్ కాన్సర్ట్ చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఉర్రూతలూగించింది. రుచికరమైన భోజనాలు అందరి జిహ్వ చాపల్యాన్ని తీర్చాయి.
ఇక ఈ వేడుకలో యూత్ కాన్ఫరెన్స్ హైటెట్‌గా నిలిచింది. ఎక్కడెక్కడ నుంచే పెద్ద ఎత్తున యువతీయువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ ఆటా నవత, యువత, భవితకు ఆటా పెద్ద పీట వేస్తుందంటూ దీని ప్రాముఖ్యత గురించి వివరించారు ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ఇంకా ఎన్నో ఆకట్టుకునే అలాగే అట్లాంటా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుండి పలు నాన్ ప్రాఫిట్ సంస్థల నుంచి ఎంతో మంది వచ్చారు. వారందరికీ కన్వీనర్ కిరణ్ పాశం అభినందనలు తెలిపి, ఈ కన్వెన్షన్ ఎలా మొదలయ్యిందీ, ఎంత మంది పాటుపడ్డారు, వాలంటీర్ల కృషి మున్నగు వివరాలు గురించి వివరించారు. ఆటా టీం గౌరవ అతిథులకు కృతజ్ఞతలు తెలియజేసి, సముచితంగా సత్కరించారు. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేసుకుని అందరం కలిసి పాల్గొని ఆనందిద్దాం అని అన్నారు కన్వీనర్ కిరణ్ పాశం.
(చదవండి: 18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం!)
Comments
Please login to add a commentAdd a comment