ATA
-
ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-28 ఎన్నికల ఫలితాలు : సరికొత్త చరిత్ర
అమెరికన్ తెలుగు అసోసియేషన్ -బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-2028 పదవీ కాలానికి సంబంధించి ఎన్నికల ఫలితాలు రికార్డ్ సృష్టించాయి. ఆటా చరిత్రలోనే ఫస్ట్ టైం నాన్ స్లేట్ మెంబర్స్ ఆధిక్యం కనబరిచారు. లైఫ్ మెంబర్షిప్ కేటగిరీలో 9 బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పదవులకు గాను, ఆటా ఎలక్షన్ కమిటీ రికమెండ్ చేసిన నలుగురు స్లేట్ అభ్యర్థులు గెలుపొందారు. ఐదుగురు నాన్ స్లేట్ అభ్యర్థులు విజయ ఢంకా మోగించి.. ప్రత్యేకతను చాటారు. స్లేట్ నుంచి గెలిచిన వారిలో న్యూజెర్సీ వాసి సంతోష్ రెడ్డి కోరం , అట్లాంటా వాసి శ్రీధర్ తిరుపతి , హ్యూస్టన్ వాసి శ్రీధర్ కంచరకుంట్ల , వర్జీనియా వాసి సుధీర్ బండారు ఉన్నారు.నాన్ స్లేట్ నుంచి లాస్ ఏంజిల్స్ వాసి విజయ్ రెడ్డి తూపల్లి , చికాగో వాసి రామిరెడ్డి వెంకటేశ్వర RV రెడ్డి విజయం సాధించించారు. నాన్ స్లేట్ నుంచి గెలిచిన వారిలో విజయ్ కుందూర్ - న్యూజెర్సీ, విష్ణు మాధవరం- వర్జీనియా, శ్రీనివాస్ శ్రీరామ - అట్లాంటా ఉన్నారు.న్యూ జెర్సీ వాసి సంతోష్ రెడ్డి కోరం అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. సంతోష్ కోరం ఇటు స్లేట్ అటు నాన్ స్లేట్ నుంచి రెండు వైపులా ఓటర్లను ఆకర్షించి.. తన ప్రత్యేకతను చాటుకున్నారు.నాన్ స్లేట్ నుంచి లాస్ ఏంజిల్స్ వాసి విజయ్ రెడ్డి తూపల్లి, చికాగో వాసి రామిరెడ్డి వెంకటేశ్వర RV రెడ్డి విజయ ఢంకా మోగించారు. వీరి గెలుపుతోనే ఆటా చరిత్రలోనే మొట్టమొదటిసారి నాన్ స్లేట్ అభ్యర్థుల హవా కనబడింది. గ్రాండ్ ప్యాట్రన్ కేటగిరీలో ముగ్గురు కాశీ విశ్వనాథ రెడ్డి కొత్త, రామ్ మట్టపల్లి, శ్రీధర్ బాణాల.. స్లేట్ నుంచి గెలిచారు. ప్యాట్రన్ కేటగిరీలో ఒకరు స్లేట్ నుంచి, ఇద్దరు నాన్ స్లేట్ నుంచి గెలిచారు. శారద సింగిరెడ్డి, రవీందర్ కె. రెడ్డి, వెన్ రెడ్డి ప్యాట్రన్ కేటగిరీలో విజయం సాధించారు. న్యూ జెర్సీ , అట్లాంటా, వర్జీనియా నుండి ఇటు స్లేట్ అటు నాన్ స్లేట్ అభ్యర్థులు గెలపొందడం విశేషం. ఈ ఎన్నికల్లో గెలిచిన వారందిరికీ ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని అభినందనలు తెలిపారు. -
ఆటా ఉత్సవాల్లో విజయ్ దేవరకొండ
-
అట్లాంటాలో అట్టహాసంగా ముగిసిన 18 వ ఆటా కన్వెన్షన్
నవత, యువత, భవిత నినాదంతో తెలుగు వారి అతి పెద్ద పండుగ ఆటా 2024 వేడుక అమెరికాలో ఘనంగా జరిగింది. జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ లో జూన్ 7 నుండి 9 వరకు అట్లాంటా లో జరిగిన 18వ ఆటా కన్వెన్షన్ కు 18 వేల మంది పైగా హాజరయ్యారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కన్వీనర్ కిరణ్ పాశం నాయకత్వంలో తొలి రోజు బ్యాంకెట్ సమావేశం జరిగింది. తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు దుద్దిళ్ల, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్, ధ్యాన గురు దాజి, సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, హీరో శ్రీకాంత్, హీరోయిన్ మెహ్రీన్, నేహా షెట్టి, తమ్మారెడ్డి భరద్వాజ, తనికెళ్ళ భరణి హాజరయ్యారు.జార్జియా రాష్ట్ర అభివృద్ధికి తెలుగు వారి సేవలు అభినందనీయం- జార్జియా గవర్నర్ బ్రయాన్ కెంప్ జార్జియా రాష్ట్ర అభివృద్ధికి తెలుగు వారు తోడ్పడుతున్నందుకు కొనియాడారు జార్జియా గవర్నర్ బ్రయాన్ కెంప్ . ఇండియా తమకు కీలక భాగస్వామి అన్నారు. ముఖ్యంగా తెలుగు వారి సేవలను ఎప్పటికీ గుర్తుంచు కుంటామని అన్నారు. ఆటా వేడుకల లో జార్జియా గవర్నర్ పాల్గొన్నారు.యువత భవిష్యత్తుకు పెద్దపీటనవత, యువత, భవిత అనే లక్ష్యాలతో ఈ సారి కన్వెన్షన్ నిర్వహించామని ఆటా అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, అధ్యక్షురాలు మధు బొమ్మినేని వెల్లడించారు. చరిత్రను తిరగరాసిన ఈ కన్వెన్షన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆటా నవల పోటీ లు..త్రీఓరీ మ్యూజికల్ కాన్సర్ట్ చాలా విన్నూత్నంగా, యువతను ఆకర్షించే విధంగా సాగింది. ఈలల గోలల తో మారు మోగిపోయింది. భద్రాద్రి శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ కమిషనర్ హనమంతరావు హాజరయ్యారు. యూత్ కమిటీ సమావేశాలు ఈసారి హై లైట్ గా నిలిచాయి. ఏ ఐ సెమినార్, సెలబ్రిటీలతో క్యూ & ఏ, వివిధ విషయాలపై డిబేట్స్ వినోదాత్మకంగా సాగాయి. ఉమెన్స్ ఫోరమ్ లో మహిళా సాధికారత, గృహ హింస, వంటి అంశాలు చర్చించారు. మెహ్రీన్, దేవరకొండ బ్రదర్స్ తో ముఖాముఖీ కార్యక్రమాలు నిర్వహించారు. బిజినెస్ ఫోరంలో రాష్ట్ర మంత్రులు, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు, తెలంగాణ ఐటీ అడ్వైజర్ రవి తంగిరాల తదితరులు పాల్గొనగా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా మోడరేటర్ గా వ్యవహరించారు. ఎప్పుడూ లేని విధంగా బిజినెస్ పిచ్చింగ్ జరిగింది. టెక్నాలజీ, ట్రేడ్ ఫోరంలో ఏ ఐ వంటి అత్యాధునిక విషయాల ప చర్చ జరిగింది. యెన్ ఆర్ ఐ కమిటీ ఇమ్మిగ్రేషన్, టాక్స్, యెన్ ఆర్ ఐ ఇష్యూస్ సెమినార్లు, ఆంధ్రా, తెలంగాణా, అమెరికా పొలిటికల్ ఫోరంలలో వివిధ విషయాలపై చర్చ ఆసక్తిగా సాగింది. సాహిత్య ఫోరమ్ లో కథా సాహిత్యం, సమకాలీన నవల, పుస్తక ఆవిష్కరణలు జరిగాయి. అష్టావధానం రకరకాల చిక్కుముడులతో రసవత్తరంగా సాగింది. తనికెళ్ళ భరణి, గంగాధర శాస్త్రి ప్రవచనాలు అద్భుతంగా సాగాయి. బ్యూటీ పెజెంట్ వేరే లెవెల్లో ఘనంగా జరిగింది, గెలిచిన వారికి దేవరకొండ బ్రదర్స్ కిరీటాలను అందించారు.జీవిత భాగస్వాములను కోరుకునే పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆటా మ్యాట్రిమోనీకి అధిక సంఖ్యలో హాజరయ్యారు. మరోవైపు ప్రధాన కార్యక్రమంలో దాజీ శ్రీ కమలేష్ పటేల్ పాల్గొని ప్రేక్షకులకు సందేశo ఇచ్చారు. థమన్ మ్యూజికల్ కాన్సర్ట్ చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఉర్రూతలూగించింది. వివిధ రంగాలలో ప్రతిభాపాటవాలు చూపించిన 17 మందికి ఆటా అవార్డులు ప్రదానం చేశారు. మాజీ అధ్యక్షులు భువనేష్ బూజాల, హరి ప్రసాద్ రెడ్డి లింగాల, రామకృష్ణారెడ్డి ఆల, సాయినాథ్ బోయపల్లి, విజయ్ కుందూరు, రఘువీరారెడ్డిలకు అవార్డులు, ఆటా లైఫ్‌టైమ్ సర్వీస్ అవార్డును డాక్టర్ రాజేశ్వర్ రావు టేక్మాల్‌కు అందజేశారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ జర్నలిస్ట్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి సన్మానం చేశారు. ఆటా మహా సభలు అట్లాంటాలో జరగడం ఇది మూడోసారి. 2000, 2012లో అట్లాంటాలో ఆటా సమావేశాలు జరగగా ఇప్పుడు మళ్లీ పదేళ్ల తరవాత జరిగాయి. కన్వెన్షన్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. -
18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్: అదిరిపోయిన ఆరంభం!
ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ జూన్ 7న బ్యాంకెట్తో మొదలయ్యి..మూడు రోజులు వివిధ కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగాయి. జార్జియా వరల్డ్ కాంగ్రె సెంటర్ ప్రాంగణం ఈ వేడుకుల కోసం అంత్యంత సుందరంగా ముస్తాబయ్యింది. అట్లాంటాలో ఈ వేడుకలు 2000, 2012లో జరగగా మళ్లీ ఇన్నేళ్లకు జరగడం విశేషం. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించిన అనంతరం కన్వెన్షన్ కోర్ టీం కన్వీనర్ కిరణ్ పాశం, అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని ఇంతలా దిగ్విజయంగా చేసుకునేందుకు సహకరించిన స్పాన్సర్లను కోర్ కమిటీ తోపాటు ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, బోర్డు అఫ్ ట్రస్టీలు ఘనంగా సత్కరించారు. ఇక ఆటా అవార్డ్స్ కమిటీ వివిధ రంగాలలో ప్రతిభాపాటవాలు చూపించిన వారికి అవార్డులు ప్రదానం చేసింది. ఈ వేడుకలో జరిగిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు దుద్దిళ్ల, సినీ నటులు శ్రీకాంత్, మెహ్రీన్, నేహా షెట్టి, తమ్మారెడ్డి భరద్వాజ, సందీప్ రెడ్డి వంగా వంటి పలువురు విశిష్ట అతిథులు ఆటా వారి ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలియ జేసి, అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనూప్ రూబెన్స్ బృందం చేసిన మ్యూజికల్ కాన్సర్ట్ చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఉర్రూతలూగించింది. రుచికరమైన భోజనాలు అందరి జిహ్వ చాపల్యాన్ని తీర్చాయి. ఇక ఈ వేడుకలో యూత్ కాన్ఫరెన్స్ హైటెట్గా నిలిచింది. ఎక్కడెక్కడ నుంచే పెద్ద ఎత్తున యువతీయువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ ఆటా నవత, యువత, భవితకు ఆటా పెద్ద పీట వేస్తుందంటూ దీని ప్రాముఖ్యత గురించి వివరించారు ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ఇంకా ఎన్నో ఆకట్టుకునే అలాగే అట్లాంటా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుండి పలు నాన్ ప్రాఫిట్ సంస్థల నుంచి ఎంతో మంది వచ్చారు. వారందరికీ కన్వీనర్ కిరణ్ పాశం అభినందనలు తెలిపి, ఈ కన్వెన్షన్ ఎలా మొదలయ్యిందీ, ఎంత మంది పాటుపడ్డారు, వాలంటీర్ల కృషి మున్నగు వివరాలు గురించి వివరించారు. ఆటా టీం గౌరవ అతిథులకు కృతజ్ఞతలు తెలియజేసి, సముచితంగా సత్కరించారు. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేసుకుని అందరం కలిసి పాల్గొని ఆనందిద్దాం అని అన్నారు కన్వీనర్ కిరణ్ పాశం.(చదవండి: 18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం!) -
మహేష్ బాబు గురించి చెప్పిన శ్రీమంతుడు నటి
-
18వ ఆటా మహాసభల్లో మెహ్రీన్ సందడి
-
అట్లాంటాలో తెలుగువారిని చూసి శ్రీకాంత్ సంతోషం
-
బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్న జబర్దస్త్ ఐశ్వర్య
-
అట్లాంటాలో ఘనంగా ఆటా బాంక్వెట్ వేడుకలు
-
18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం!
ఇక్కడ రెండు మూడు రోజులుగా వార్ రూమ్ అంటుంటే అర్థం కాలేదు. వెళ్లి చూస్తే, ఆటా నాయకులు కూర్చుని, రకరకాల కమిటీలతో, వెండర్లతో, వేరే టీంలతో మాట్లాడుతున్నారు, చర్చించుకుంటున్నారు, ఫోనుల్లో మాట్లాడుతున్నారు, వీడియో కాన్ఫరెన్సులు నడుస్తున్నాయి... అప్పుడు అర్థం అయ్యిందేమంటే.. జనతా గ్యారేజ్ సినిమాలాగా, 'ఇచ్చట అన్ని రకముల సమస్యలకు పరిష్కారం చూపబడును' అని. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఆటా వారు ఏ లెవెల్లో రెడీ అవుతున్నారో. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్యులు శ్రీధర్ బాబు దుద్దిళ్ల, భద్రాద్రి పండితులు, సినిమా వారు మెహ్రీన్, థమన్, అనూప్ రూబెన్స్, అంకిత, రోహిత్, సత్య మాస్టర్ వంటి ఎందరో విచ్చేశారు. మరి కొందరు బయలుదేరి, విహంగ వీక్షణ చేస్తున్నారు. వేరే ఊర్ల నుంచి ఆటా నాయకులు ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, పాస్ట్ ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, అజయ్, నర్సిరెడ్డి గడ్డికొప్పుల ఏతెంచారు. మిగతా వాళ్లు ఆన్ ది వే. అలానే, దూర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి, హోటళ్ళలోనో, బంధువుల ఇళ్లలోనో ఉంటున్నారు. కాన్సులేట్ జనరల్ అఫ్ ఇండియా, అట్లాంటా మేయర్, కాంగ్రెస్ మెన్, సెనేటర్స్, ఇక్కడి దేశీయ నాయకులు ఇలా చాలా మంది వేంచేయబోతున్నారు. వేరే వేరే నాన్ ప్రాఫిట్, సంస్థలు, మీడియా సంస్థల నుంచి చాలా మంది ప్రతినిధులు వస్తున్నారు. 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ అట్లాంటాలో ఈ శుక్రవారం, జూన్ 7 నుంచి 9 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఈ శుక్రవారం సాయంత్రం బ్యాంకెట్‌లో వివిధ రంగాలలో నిష్ణాతులకు ఆటా సాఫల్య అవార్డులు ప్రధానం చేస్తారు. ఇక శని, ఆదివారాలలో ఝుమ్మంది నాదం అంటూ పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ పోటీలు, ఆత్మ విశ్వాసం కోసం పెజంట్, ధ్యానం గురు దాజి ఉపన్యాసం, భద్రాద్రి కళ్యాణం, షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ పోటీలు, దడదడలాడించే అనూప్ రూబెన్స్, థమన్, త్రీఓరీ మ్యూజికల్ కాన్సర్ట్‌లు, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్, ఉమెన్స్ ఫోరమ్, అమెరికా, భారత దేశాల పొలిటికల్ ఫోరంలు, అల్యూమిని మీటింగులు, బిజినెస్ ఫోరంలు, సాహిత్య విభావరి, అష్టావధానం, లైఫ్ టైం అవార్డులు, ఆత్మీయ సత్కారాలు, వెండర్ స్టాల్ల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యువత గురించి సరే సరి.. వారికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే..మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆటా వారు. మరి ఇన్ని వినోదాలు, విశేషాలు ఒకే చోట ఉంటే, ఆలస్యం ఎందుకూ..? టిక్కెట్ల గడువు కూడా ముగియనుంది. వివిధ కాన్ఫరెన్స్ వివరాల కోసం www.ataconference.orgని, టిక్కెట్లకు https://ataconference.org/Registration/Attendee-Registrationని సందర్శించండి. ఆటా కమ్యూనిటీ రీచ్ సందర్భంగా అట్లాంటాతో పాటు వేర్వేరు నగరాలలో సమావేశాలు నిర్వహించారు, ఎంతోమంది రావడానికి ఉత్సాహం చూపించారు. అలానే, టాలీవుడ్ తారలతో కమ్యూనిటీ వార్‌కు 300 మందికి పైగా విచ్చేయడం హర్షణీయం. విశిష్ట అతిథులతో ఆత్మీయ సమ్మేళనాలు ఇప్పటికే మొదలయ్యాయి. కన్వెన్షన్ కోర్ టీం కన్వీనర్ కిరణ్ పాశం, అధ్యక్షురాలు మధు బొమ్మకంటి, కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ ఆధ్వర్యంలో దాదాపు 70 కమిటీలలో 500 మందికి పైగా వాలంటీర్లు అవిశ్రాంత కృషికి తగ్గ అజరామర ఫలితాలు త్వరలో చూడనున్నాం. కన్వీనర్ కిరణ్ పాశం మాట్లాడుతూ.. ఇప్పటికే చాలా పనులు పూర్తి అయ్యాయి., ప్రపంచమంతా ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది ముఖ్యంగా యువత ఆటాకి ఎంతో ముఖ్యమనీ, వారికి చాలా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. కావున అందరూ ఈ కార్యక్రమానికిచ్చేసి జయప్రదం చేయాలని అన్నారు. అధ్యక్షురాలు మధు బొమ్మినేని జార్జియా గవర్నర్ సందేశం అందరికీ వినిపించి.. జరగబోయే స్పిరిట్యుయల్, కంటిన్యూయస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత వివరించారు. ఎంతో మంది ఈ కార్యన్ని జయప్రదం చేసేందుకు ఆహర్నిశలూ కష్టపడుతున్నారనిన్నారు. అలాగే చాలా వెండర్ స్టాల్ల్స్, ఎన్నో ఫోరమ్స్ వంటి ఉపయుక్త కార్యక్రమాలు ఉన్నాయనీ చెప్పారు. అందువల్ల ఈ మహా పండుగకు అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. (చదవండి: నాట్స్ నాయకుడి సేవలకు నీతి ఆయోగ్ గుర్తింపు!) -
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
ఈ మధ్య అమెరికాలో అయినా, ఇండియాలో అయినా ఎన్నికల తర్వాత అత్యధికంగా తెలుగు వారు మాట్లాడుకునేది అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి 18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ గురించే. దీన్ని ఈ ఏడాది జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటాలో అంగ రంగ వైభవంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా నిర్వాహకులు పలు నగరాల్లో నృత్య పోటీలు నిర్వహిస్తున్నారు. సిరిసిరిమువ్వ సినిమాలోని ‘ఝుమ్మంది నాదం సయ్యంది పాదం’ పాట స్ఫూర్తితో ఈ పోటీలకు ‘సయ్యంది పాదం’ అని ఆటా వారు నామకరణం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా అప్రతిహతంగా సాగుతున్న ఈ పోటీలలో గెలిచిన వారికి బహుమతులతో పాటు, తెలుగు గడ్డపై వివిధ వేదికలలో అవకాశాలు కల్పించడం ఆటా వారికే చెల్లింది. ఇలాంటి పోటీలతో పాటు గత 34 సంవత్సరాలుగా తెలుగు వారికి అన్ని విషయాలలో వెన్ను దున్నుగా ఉంటున్న ఆటా వారు శ్లాఘనీయులు. దాదాపు 15 నగరాలలో ఇప్పటికే 4500 మంది హాజరయ్యారు అంటే.. ఇంక కన్వెన్షన్‌కి ఎంత మంది వస్తారో ఊహించుకోవచ్చు. ప్రతి సిటీలో భోజనం, టీ, కాఫీ, మంచి నీళ్లు, స్నాక్స్, పండ్లు ఇవ్వడం జరిగింది. అధ్యక్షురాలు మధు బొమ్మకంటి, కన్వీనర్ కిరణ్ పాశం నాయకత్వంలో కోర్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ ఆధ్వర్యంలో అమెరికా నలుమూలలా వేలాదిమంది చరిత్రలో చూడని విధంగా ఈ కన్వెన్ని అట్టహాసంగా నిర్వహించాలని ప్రయాసపడుతున్నారు. అన్ని కార్యక్రమాల వివరములకు www.ataconference.org ని సందర్శించండి.ఇక, సయ్యంది పాదం విషయానికి వస్తే.. ‘కాలు కదుపుదాం, ప్రైజ్ గెలుద్దాం’ అన్న చందాన ఇప్పటికే ఈ నృత్య పోటీలు లాస్ ఏంజెల్స్, నాష్ విల్, రాలీ, అట్లాంటా, డల్లాస్, న్యూ జెర్సీ, ఆస్టిన్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డిసి, షార్లెట్, చికాగోలలో జరగగా, ఇంకా పలు నగరాలలో జరగాల్సి వుంది. ప్రతి ఊరిలో దాదాపు 80 నుంచి 120 మంది కళాకారులు పాల్గొనడం గమనార్హం. ఎలా చూసినా, వెయ్యి మందికి పైగా పాల్గొన్న సయ్యంది పాదంలో 7 నుంచి 13 సంవత్సరాల వారు జూనియర్ల విభాగంలో, 14 ఆపై వారు సీనియర్ల విభాగంలో క్లాసికల్, నాన్ క్లాసికల్, సోలో, గ్రూప్ వంటి విభిన్న పోటీలలో ఎందరో పాల్గొని, తమ సత్తా చాటారు. యాంకర్లు ఉత్సాహంగా నడిపించగా, జడ్జీలకు డాన్సర్లు తమ నృత్య కౌశల్యంతో సవాలు విసిరారు. అన్ని విభాగాలలో మొదటి, రెండో స్థానంలో నిలిచిన వారికి ఆటా కన్వెన్షన్ ఫైనల్స్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వడమే కాకుండా, టిక్కెట్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు ఇచ్చారు.సయ్యంటే సై అన్నట్టుగా సాగిన ఈ కార్యక్రమానికి ఛైర్ శృతి చిట్టూరి అంకిత భావంతో పని చేస్తూ, అందరికీ దిశానిర్దేశం చేశారు. అలానే, అడ్వైజర్ రాజు కాకర్ల, కో ఛైర్ వాణి గడ్డం, మెంబర్లు గౌరీ కారుమంచి, రజనీకాంత్ దాడి, చిట్టి అడబాల అఖండ కృషి అభినందనీయం. సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలనం, కమ్మని భోజనం ప్రతి ఊరిలో ఏర్పాటు చేశారు. అట్లాంటా నుంచి సందీప్ రెడ్డి, నీలిమ గడ్డమణుగు, కిషన్ దేవునూరి, ఉదయ ఈటూరి, శ్రావణి రాచకుళ్ల, మాధవి దాస్యం, జయచంద్రా రెడ్డి, నిరంజన్ పొద్దుటూరి, గణేష్ కాసం, రాలీ నుంచి శృతి ఛామల, రాధా కంచర్ల, కీర్తి ఎర్రబెల్లి, అజిత చీకటి, పవిత్ర రత్నావత్, షాలిని కల్వకుంట్ల, శ్రీదేవి కటిక, రజని త్రిపురారి, నాష్ విల్ నుంచి రామకృష్ణా రెడ్డి అల, కిశోర్ గూడూరు, నరేంద్ర నూకల, సుశీల్ చండ, క్రిష్ నూకల, సాయిరామ్ రాచకొండ, లావణ్య నూకల, బిందు మాధవి చండ, షార్లెట్ నుంచి వెంకట రంగారెడ్డి సబ్బసాని, క్రాంతి ఏళ్ళ, సునీత నూకల ఇలా ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి ఎంతో కృషి చేశారు.ఈ కార్యక్రమాలు పలు నగరాలలో విజయ దుందుభి మ్రోగించడానికి సహకరించిన స్పాన్సర్లకు, జడ్జీలకు, ఆటా టీం, వాలంటీర్లు, ఆహుతులు, ఫోటో మరియు వీడియో గ్రాఫర్లకు, డీ జె, వెన్యూ. రెస్టారెంట్లకు, డెకొరేషన్ వారికి ఇలా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగనున్నాయి. అంతేగాక చాలామంది సెలెబ్రిటీస్ ఇండియా నుంచి రానున్నారు. తామెల్లరూ ఈ కన్వెన్షన్‌కి విచ్చేసి విజ్ఞాన, వివేక, వినోదాలలో భాగం కండి. ప్రతి వారం మరిన్ని వివరములతో మీ ముందుకు వస్తుంటాము. అని ఆటా కన్వెన్షన్ నిర్వాహకులు చెబుతున్నారు. (చదవండి: అమెరికన్ల పేర్లు, ఇంటిపేర్ల కథ.. కమామీషు !) -
Ugadi 2024: ఆన్లైన్లో ఆటా సాహిత్య వేదిక ఉగాది వేడుకలు
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఉగాది సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న అంతర్జాలం వేదికగా శారద సింగిరెడ్డి సారథ్యంలో నిర్వహించిన శ్రీ క్రోధి నామ సంవత్సర "తెలుగు వసంతం" సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులను ఆకట్టుకుంది. త్రిభాషా మహాసహస్రావధాని , ప్రణవ పీఠాధిపతులు వద్దిపర్తి పద్మాకర్, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం జాతీయ సాహిత్య పరిషత్తు ప్రాంత అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి, శృంగేరి శారదా పీఠ ఆస్తాన పౌరాణికులు డా. గర్రెపల్లి మహేశ్వర శర్మ, అవుసుల భానుప్రకాష్ అవధాని , అధ్యక్షులు సాహితీ గౌతమి కరీంనగర్ శ్రీ నంది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. గణనాథుని కీర్తనతో రాలీ,నార్త్ కరోలీనా నుండి వైభవ్ గరిమెళ్ళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా , విశిష్ఠ అతిథుల వినోదభరిత విజ్ఞాన విశ్లేషణ, చతురత ఇమిడిన బోధన , సంస్కార సాంప్రదాయ సమ్మిళిత సుభాషిత సందేశాలతో రాశి ఫలాలు , పంచాంగ శ్రవణం, పద్య గద్య గాన ప్రసంగాదులతో ఆద్యంతం హృద్యంగా సాగిన ఈ సాహితీ కార్యక్రమం ప్రేక్షకుల ప్రత్యేక మన్ననలందుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మధు బొమ్మినేని పేరు పేరునా ప్రత్యేక అభినందనలను తెలిపారు. అలాగే 2024 సంవత్సరం అట్లాంటా లో జూన్ 7,8,9 తేదీలలో జరుగ నున్న18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్‌కు అందరికీ పేరుపేరున సాదర ఆహ్వానాన్ని పలికారు. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ కార్యక్రమానికి నంది శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా అతిథులందరూ ఉత్సాహంగా గడిపారు. చివరిగా ఆటా లిటరరీ సభ్యులు మాధవి దాస్యం విశిష్ఠ అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఆటా ప్రతినిధుల ఆహ్వానం!
ఆటా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆటా కన్వెన్షన్ ఆహ్వానం అందించారు. ఈ ఏడాది జూన్ 7, 8, 9 తేదీలలో అమెరికాలోని అట్లాంటాలో ఆటా తెలుగు కన్వెన్షన్ భారీ ఎత్తున జరగనుంది. ఈ వేడుకలను అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆటా ప్రతినిధులు ఆటా తెలుగు కన్వెన్షన్ అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. అందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అమెరికాలో వున్న తెలుగు వాళ్ళను కలవడానికి తప్పకుండా వస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన వారిలో కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ రెడ్డి పాశం, మాజీ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, కో ఆర్డినేటర్ వశిష్ఠ్ రెడ్డి తదితరులు వున్నారు. కాగా, ఆటా సంస్థ సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుంది. ఆటా నేతృత్వంలో చాలా మందికి సాయం అందించారు. ఇలాగే గతేడాది ఆటా కన్వెన్షన్ డిసెంబర్ నెలలో 20 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవ కార్యక్రమాలు చేసిన విషయం విదితమే. (చదవండి: సింగపూర్‌లో తమిళ వైభవం..ప్రోత్సహిస్తున్న ఆ దేశ మంత్రి!) -
న్యూ జెర్సీలో ఆటా బిజినెస్ సెమినార్, కిక్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్
న్యూ జెర్సీ లో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - ఆటా బిజినెస్ సెమినార్ మరియు కిక్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. న్యూ జెర్సీ న్యూయార్క్ టీం సాయంతో.. అట్లాంటాలో జరుగనున్న 18th ఆటా కాన్ఫరెన్స్ కోసం 800K పైగా స్పాన్సర్షిప్ ప్రతిజ్ఞలను సేకరించారు. ఆట అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ఎలెక్ట్ జయంత్ చర్ల , పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, ఫిలడెల్ఫియా ట్రస్టీ రాజ్ కక్కెర్ల తదితరులు పాల్గొని ప్రసంగించారు. ATA న్యూజెర్సీ , న్యూయార్క్ టీం - కార్ప్రేట్ చైర్ హరీష్ బథిని, కో చైర్ ప్రదీప్ కట్టా మరియు ఫైనాన్స్ కమిటీ చైర్ శ్రీకాంత్ గుడిపాటి , కో చైర్ శ్రీకాంత్ తుమ్మలతో పాటు రీజనల్ కోరినేటర్లు సంతోష్ కోరం , ధనరాజ్, రీజినల్ డైరెక్టర్ విలాస్ రెడ్డి జంబుల, మహిళల రీజినల్ కో-ఆర్డినేటర్ గీతా గంగుల, తదితరుల సహాయంతో బిజినెస్ సెమినార్ మరియు నిధుల సేకరణను విజయవంతంగా నిర్వహించారు. అట్లాంటాలో జరిగిన ఆటా (ATA) కాన్ఫరెన్స్ కోసం 636k పైగా 175 కార్పొరేట్ స్పాన్సర్షిప్ ప్రతిజ్ఞలను సేకరించినట్లు సభ్యులు తెలిపారు. అలాగే న్యూజెర్సీ & న్యూయార్క్ బృందం అట్లాంటా కాన్ఫరెన్స్ కోసం 800K పైగా దాతల ప్రతిజ్ఞలను సేకరించిందని పేర్కొన్నారు. అట్లాంటాలో జూన్ 7 నుండి 9 వరకు జరిగే ఆటా 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్‌లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వహకులు పిలుపునిచ్చారు. -
రవీంద్రభారతిలో ఘనంగా ఆటా గ్రాండ్ ఫినాలే వేడుకలు (ఫొటోలు)
-
ఆటా ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్
-
ఆటా ఆధ్వర్యంలో 20 రోజుల పాటు ఘనంగా సేవ కార్యక్రమాలు!
ఆటా ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో 20 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నామచేని, ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆటా వేడుకల చైర్, ఎలక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయంత్ చల్లా మాట్లాడుతూ...1991లో ఏర్పాటైన ఆటా సంస్థ గత 31 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డ 1మిలియన్‌కి పైగా తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తోందని అన్నారు. అలాగే ప్రతి రెండేళ్లకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్య, వైద్యం, వ్యాపారం రంగాల్లో 15 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 2024 జూన్ 7,8,9 తేదీలలో అమెరికాలో అట్లాంటా నగరంలో జరగనున్న ఆటా సదస్సును నిర్వహిస్తున్నామని, ఆ సదస్సుకి తెలుగు రాష్ట్రాల అన్ని రంగాల ప్రముఖులు హాజరు అవుతారని, ఆ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్ మాధవరం, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, రఘువీర్ మరిపెద్ది, రాజ్ కక్కెర్ల, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి, సినీ నటుడు, కల్చరల్ అడ్వైజరీ లోహిత్, కో ఆర్డినేటర్ శశికాంత్, మీడియా కో ఆర్డినేటర్ వెంకటేశ్వర రావు సిహెచ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) తెలంగాణ చైర్, C. శేఖర్ రెడ్డి, ఆటా బిజినెస్ చైర్ లక్ష్ చేపూరి తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్‌తో సమావేశమయ్యారు ఈ ఆటా వేడుకలకు ఆమెను ఆహ్వానించారు. అలాగే గవర్నర్ కూడా ఆటా ఆహ్వానాన్ని ఆమోదించారు. (చదవండి: అరబ్ దేశాల పర్యటనలో గురుదేవ్..కాప్ 28 సదస్సులో ప్రసంగించనున్న శ్రీ శ్రీ రవిశంకర్) -
అట్లాంటాలో 18వ ఆటా మహాసభల సన్నాహాలకు శ్రీకారం!
అమెరికా తెలుగు సంఘం ఆటా ద్వైవార్షికంగా నిర్వహించు 18వ మహాసభలను 2024న జూన్ 7,8, 9 తేదీలలో అట్లాంటాలో అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి. అందుకోసం ఈ నెల సెప్టెంబరు 8,9,10తేదీలలో అట్లాంటాలోని మారియట్ హోటల్లో ఆటా బోర్డు సమావేశం, ఫేస్ ఈవెంట్స్ నందు ఆటా18వ మహాసభల కిక్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబరు 8న, శుక్రవారం సాయంత్రం వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన వివిధ నగరాలలో సేవలు అందిస్తున్న ఆటా అధ్యక్షురాలు, ఉపాధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు, ట్రస్ట్ బోర్ద్ సభ్యులు,రీజనల్ అడ్వైజర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, వుమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వైజర్స్ పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు అయ్యారు. ఆటా అట్లాంటా సభ్యులు మర్యాదపూర్వక స్వాగత సమారోహంతో ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆతిథ్యం, అద్వితీయ విందు వినోదాలతో అలరించింది. ఇక సెప్టెంబర్ 9 శనివారం ఉదయం 9 గంటలకు బోర్డు సమావేశం గణనాథుని ప్రార్థనతో ఆరంభమయి, ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని సారథ్యంలో, ఉపాధ్యక్షులు జయంత్ చల్లా ,పూర్వ అధ్యక్షులు భువనేష్ బుజాల,హనుమంత్ రెడ్డి,కరుణాకర్ మాధవరం,సుధాకర్ పెరికారి మరియు పరమేష్ భీమ్‌రెడ్డి, కార్యదర్శి రామకృష్ణ రెడ్డి ఆల, కోశాధికారి సతీష్ రెడ్డి, సంయుక్త కోశాధికారి రవీందర్ గూడూర్, ట్రస్ట్ బోర్ద్ సభ్యుల,రీజనల్ అడ్వైజర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, వుమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వైజర్స్ మరియు అట్లాంటా ఆటా బృందం ఆధ్వర్యంలో నిర్విరామంగా సమావేశాన్ని జరిపారు. ఆటా సభ్యుల ప్రోత్సాహభరిత సందేశాలు , మౌలిక సదుపాయాల చర్చ, ఆవశ్యక సేవా కార్యక్రమాలు, భారత దేశంలో డిసెంబర్ నెలలో జరుగు ఆటా వేడుకల చర్చలు, ఆమెరికన్ తెలంగాణ సొసైటి (ఏటీఎస్) సంస్థ విలీనం , సమావేశ సభ్యుల పరిచయం, మహాసభల తాత్కాలిక అడ్హాక్ బృందం ప్రకటన, ఆర్థిక సేవా అభివృద్ధి సంబంధిత అజెండా, రానున్న బోర్డు సమావేశపు కీలక నిర్ణయాలు, వంటి పలు కీలక అంశాల అధ్యయనంతో ప్రభావాన్వితంగా సాగడం హర్షణీయం. ఆటా 18వ సభల కొరకు నియామికమైన కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం,కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ అనిల్ బోదిరెడ్డి నేషనల్ కోఆర్డినేటర్ సాయి సుదినిలు ప్రసంగిస్తూ అట్లాంటా తరుపున అందరికీ అభినందనలు తెలుపుకుంటూ ఆటా సభలకుగాను అందరి సహాయసహకారాలను సవినయంగా కోరుతూ, సభలను గూర్చి పలు అంశాల వివరణ అందించారు. ఆటా మ్యాట్రిమోని కమిటీ కో-చైర్ రమేష్ నల్లవోలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అట్లాంటాలో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసారు. వధూవరులు, తల్లితండ్రులు, మిత్రులు సుమారు 50 కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం కమ్మని విందుతో బోర్డు సమావేశం సంపూర్ణం అయ్యింది. మధ్యాహ్నం ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, ఆటా 18వ కాన్ఫరెన్స్ బృందం , ట్రస్ట్ బోర్ద్ సభ్యులు, అట్లాంటా ఆటా బృందం 18వ మహాసభలను నిర్వహించు జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్(జీడబ్ల్యూసీసీ)ని సందర్శించి అట్లాంటా నగర వీధుల్లో ప్రత్యేక సందడి చేసారు. సాయంత్రం 7 గంటలకు అట్లాంటాలోని ఫేస్ ఈవెంట్స్‌లో కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ సమావేశం అధ్యక్షురాలు మధు బొమ్మినేని అట్లాంటా కోర్ సభ్యుల చేత సాంప్రదాయబద్దంగా జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టుకోగా గణనాథుని ఆరాధనతో శుభారంభమయ్యింది. ఆ శుభవేళ కళారాధనతో మొదలైన నీలిమ గడ్డమనుగు నేపథ్యంలో వివిధ శాస్త్రీయ జానపద , చలన చిత్ర గీతికల నృత్య ప్రదర్శనలు, సంగీత విభావరి వంటి అద్భుత కార్యక్రమాలతో ఆద్యంతం సభాసదుల అలరించింది. ఆటా 18వ కాన్ఫరెన్స్ లోగో ను ఇటీవల ఎన్నికైన అమెరికా క్రికెట్ బోర్డ్ చైర్మన్ మరియు పూర్వ ట్రస్ట్ బోర్ద్ సభ్యులు వేణు పీసీకే ఆవిష్కరించగా, మధు బొమ్మినేని, జయంత్ చల్లా కిరణ్, పాశం వేణు పీసీకేను సన్మానించారు. మధు బొమ్మినేని కాన్ఫరెన్స్ సాంగ్ ఆవిష్కరించగా ప్రసిద్ధ గాయకులు, అద్భుత సంగీత సహకారాన్ని అందించిన దర్శకులు మల్లికార్జున సాహిత్య సహకారం అందించిన మాధవి దాస్యంలను అధ్యక్షురాలు మధు బొమ్మినేని అభినందించగా సభాసదులు ప్రతిధ్వనించు హర్షధ్వానాలతో ఆటా సభ అడ్హాక్ సభ్యులను, సలహాదారులను, పూర్వ అధ్యక్షులను, స్పాన్సర్సను హర్షధ్వానాలతో సత్కరించారు. ఈ సాయంకాలం సుమారు 600 గౌరవ అతిథులతో కార్యక్రమం ఆద్యంతం మధురానుభూతులతో ఉల్లాసభరితంగా కొనసాగింది. శ్రావణి రాచకుల్ల సారథ్యంలో సుందర నారీమణుల వస్త్రాలంకరణ ప్రదర్శన (ఫ్యాషన్ షో) వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేయగా నూతన మోహన, జనార్ధన్ పన్నేల గార్ల అద్భుత గానాలాపన మరియు స్థానిక గాయకుల గానాలాపానతో జనరంజకంగా సాగింది ఆ శుభ సాయంకాలం. కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం 18 వ కాన్ఫరెన్స్ కార్యక్రమాలు గురించి తెలుపుతు అందరికీ అభినందనలు తెలియచేశారు. అట్లాంటాలోని స్థానిక తెలుగు సంస్థల TANA, GATA,GATeS, GTA, NATA,NATS,TTA, TDF, TAMA ప్రతినిధులను 18వ ఆటా మహాసభలకు ఆహ్వానించారు. తెలుగు సంస్థల ప్రతినిధులు కూడా 18వ ఆటా మహాసభల విజయవంతంగా సాగడానికి సహాయ సహకారాలను అందిస్తామన్నారు. అధ్యక్షురాలు మధు బొమ్మినేని తమ స్పందన తెలియచేస్తూ కార్యక్రమం అద్భుతంగా, అద్వితీయంగా కొనసాగడానికి కారకులైన విశిష్ఠ అతిథులకు, గౌరవ అతిథులకు, వదాన్యులకు , యూత్ వాలంటీర్స్‌కు, అట్లాంటా కోర్ సభ్యులకు, అట్లాంటా కోర్ కాన్ఫరెన్స్ దాతలకు తదితర మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు. (చదవండి: ఐటీ అమెరికా నిర్వహించిన ఆత్మీయ సదస్సులో బండి సంజయ్!) -
ఏపీ ఫైబర్ నెట్ ద్వారా మరో సినిమా రిలీజ్.. ఈసారి రూ.39కే
కొత్త సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంట్లోనే కూర్చొని చూసే ఛాన్స్ 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్' రీసెంట్ గానే ప్రారంభించింది. ఈ విషయాన్ని ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనూరు గౌతంరెడ్డి ఇదివరకే చెప్పారు. విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ 3వ అంతస్తులోని ఫైబర్ నెట్ కార్యాలయంలో 'లవ్ యూ టూ' చిత్ర బృందంతో కలిసి గురువారం పత్రికా సమావేశం నిర్వహించారు. మరో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సినిమా నిర్మాతకు, ప్రేక్షకుడికి లాభం కలిగేలా అతి తక్కువ ధరకే తొలిరోజే సినిమాను రాష్ట్ర ప్రజలు ఇంట్లో వీక్షించే అవకాశం కల్పిస్తున్నాం. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా తొలి సినిమాగా ఇప్పటికే 'నిరీక్షణ' అనే చిత్రాన్ని రూ.99కి విడుదల చేశాం. రెండో సినిమాగా 'లవ్ యూ టూ' చిత్రాన్ని కేవలం రూ.39కే జూన్ 16 నుంచి ఏపీఎస్ఎఫ్ఎల్ వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో థియేటర్లలోకి వచ్చే ప్రతి సినిమాను ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా చూసే ఛాన్స్ కల్పిస్తాం. త్వరలో మూరుమూల ప్రాంతాలకు కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ సేవలు విస్తరిస్తాం. ఏపీఎస్ఎఫ్ఎల్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్, థియేటర్లకు పోటీ కాదు' అని గౌతంరెడ్డి చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 31 సినిమాలు.. లిస్ట్ ఇదే!) -
డల్లాస్‌లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ATA బోర్డు సమావేశం
-
అమెరికాలో తెలుగు అమ్మాయిల ఆట.. విజేత నాష్విల్లే రైజర్స్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం- 2023 వేడుకల్లో భాగంగా టేనస్సీ రాష్ట్రంలోని నాష్విల్లే నగరంలో జరిగిన అమెరికా తెలుగు సంఘం (ఆటా) తొలిసారి మహిళల షార్ట్ క్రికెట్ టోర్నీని ఏప్రిల్ 8, 9 తేదీల్లో విజయవంతంగా నిర్వహించింది. 9 జట్ల మధ్య పోరు ఈ కార్యక్రమంలో 9 మహిళా జట్లు పాల్గొనగా.. సుమారు 300 మంది ప్రేక్షకులు వారి ఆటను తిలకించారు. ఈ పోటీలను ఆటా రీజినల్ కో-ఆర్డినేటర్లు క్రిష్ నూకల, సాయిరామ్ రాచకొండతో సహా ఆటా నాష్విల్ టీమ్ సభ్యులు భరద్వాజ్ సామల, సాయి వర్ధన్ రెడ్డి బోడా, అనూష వంగాల, ఆనంద్ రామ్‌కుమార్, దిగ్విజయ్ వంగల, ప్రశాంతి రాచకొండ, వంశీ కొరిపెల్లి, రాకేష్ బెక్కం, వాలంటీర్లు నిర్వహించారు. రామకృష్ణారెడ్డి ఆల (ఆటా కార్యదర్శి) , కిషోర్‌రెడ్డి గూడూరు (బీఓటీ సభ్యుడు), సుశీల్ చందా (విద్యాకమిటీ చైర్) , నరేందర్‌రెడ్డి నూకల ( ప్రాంతీయ సలహాదారుడు) నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. విజేత ఎవరంటే ఆటా మహిళల షార్ట్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నాష్విల్లే రైజర్స్ నిలిచింది. పవర్ గర్ల్స్ రన్నరప్, TNMM రెండో రన్నరప్గాన నిలిచాయి. విజేతలకు ఆటా ట్రోఫీలను అందించింది. అదనంగా, మహిళల అభిరుచి, క్రీడ పట్ల నిబద్ధతను ప్రోత్సహించడానికి ప్రతి జట్టు సభ్యురాలికి పార్టిసిపెంట్ మెడల్స్ అందజేశారు. ఆటా నాష్విల్ బృందం ఆటా ఎగ్జిక్యూటివ్ టీమ్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు సమాజానికి సేవ చేయడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించిన ఇండియా బజార్, చాయ్ సమోసా రెస్టారెంట్‌కు ఆటా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. వాళ్ల వల్లే ఇదంతా: డుప్లెసిస్ -
నూతనంగా ఎర్పాటైన ఆటా బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నూతన అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని బాధ్యతలు స్వీకరించారు. లాస్ వేగాస్లోని ది మిరాగ్ లో శనివారిం జరిగిన ఆటా బోర్డు మీటింగ్ లో ప్రస్తుత అధ్యక్షులు భువనేశ్ భూజల చేతుల మీదుగా మధు బొమ్మినేని నూతన అధ్య క్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశానికి యూఎస్ లోని అన్ని ప్రాంతాల నిండి ఆటా డైరెక్టర్లు, సలహాదారులు, మాజీ అధ్యక్షులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. నార్తు కరోలినా ప్రాంతానికి చెందిన మధు బొమ్మినేని 2004 నిండి ’ఆటా’ లో చురుగ్గా ఉిండడంతో పాటు, ఆటా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంటి అనేక పదవుల్లో సేవలందించారు. 2023 జనవరిలో ఆటాలోని 16 బోర్తుఆఫ్ ట్రస్టీ స్థానాలకు ఎన్నికలు జరిగాయ. ఎన్నికైన సభ్యులు నాలుగేండ్లు పాటు పదవిలో కొనసాగుతున్నారు. అనిల్ బొదిరెడ్డి, సన్నిరెడ్డి, కిరణ్ పాశం, కిషోర్ గూడూరు, మహీదర్ ముస్కుల, నర్సిరెడ్డి గడి కొప్పుల, రామకృష్ణారెడ్డి అల, రాజు కక్కెర్ల, సాయి సుధిని, శ్రీకాంత్ గుడిపాటి, నర్సింహారెడ్డి ధ్యాసాని, రఘవీర్ మరిపెద్ది, సాయినాథ్ బోయపల్లి, సతీష్‌రెడ్డి, శ్రీనివాస్ దర్గుల, వినోద్ కోడూరు బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆటా బోర్డు ఏకగ్రీవంగా జయింత్ చల్లాను కాబోయే ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంది. ఆటా బోర్డు 2023, 2024 టర్మ్‌కి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రామకృష్ణారెడ్డి అల (కార్యదర్శి), సతీష్ రెడ్డి (కోశాధికారి), తిరుపతి రెడ్డి యర్రంరెడ్డి ( జాయింట్ సెక్రటరీ), రవీందర్ గూడూరు (జాయింట్ ట్రెజరర్), హరి ప్రసాద్ రెడ్డి లింగాల (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)గా ఎన్నికయ్యారు. -
ఆకాశవాణి... యూఎస్ కేంద్రం!
ఆకాశవాణి శ్రోతలకు ఆమె గొంతు సుపరిచితం. తొలితరం తెలుగు టీవీ ప్రేక్షకులకు ఆమె నటన చిరపరిచితం. ఇరవయ్యేళ్ల కిందట తెలుగు చిత్ర కథానాయికల గళం ఆమె. పేరు... ఉదయగిరి రాజేశ్వరి. ఇప్పుడు... యూఎస్‌లో తెలుగు వాణి ఆమె. యూఎస్ తెలుగు రంగస్థల నిర్మాత. ప్రాక్– పశ్చిమ తెలుగుకు సాంస్కృతిక వారధి. ‘‘నాకు స్టేజి ముందున్న జ్ఞాపకం లేదు. ఎప్పుడూ స్టేజి మీదనే ఉండేదాన్ని. అమ్మ రచయిత. ఆమె రాసిన నాటకాలు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యేవి. అలా నాకు చిన్నప్పుడే రేడియోతో పరిచయం ఏర్పడింది. స్కూల్ ప్రోగ్రామ్స్‌లో కూడా తప్పకుండా పాల్గొనేలా చూసేది అమ్మ’’ అంటూ తన ఎదుగుదలలో తల్లి అత్తలూరి విజయలక్ష్మి పాత్రను గుర్తు చేసుకున్నారు ఉదయగిరి రాజేశ్వరి. ‘‘రేడియోలో నా ఎంట్రీ కూడా అమ్మ నాటకంతోనే. ఆ నాటకం కోసం ఆడిషన్స్ జరిగినప్పుడు నేను ‘బి’ గ్రేడ్ ఆర్టిస్టుగా ఎంపికయ్యాను. ఆ తర్వాత ‘ఏ’ గ్రేడ్‌కి ప్రమోట్ అయ్యాను. అమ్మ ఎప్పుడూ ‘నాకు కొద్దిగా స్టేజ్ ఫియర్. అందుకే నిన్ను స్టేజ్ మీదనే పెంచాను’ అంటుండేది. బాల్యంలో సరైన ఎక్స్పోజర్ లేకపోతే ఆ భయం ఎప్పటికీ వదలదేమోనని ఆందోళన ఆమెకి. అందుకే నన్ను ఊహ తెలిసేటప్పటికే స్టేజి మీద నిలబెట్టింది. రేడియో తర్వాత టీవీకి కూడా పరిచయం చేసింది. జెమినీ టీవీలో ‘బిజినెస్ ట్రాక్స్, యువర్స్ లవింగ్లీ వంటి కార్యక్రమాలకు యాంకరింగ్ చేశాను. స్వచ్ఛమైన తెలుగు, మంచి డిక్షన్ ఉండడంతో ప్రముఖులతో పరిచయ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా రాణించగలిగాను. మొదట్లో నాకు ఆన్ స్క్రీన్ మీద పెద్దగా ఆసక్తి లేదు. కానీ అమ్మ సరదా కొద్దీ యాంకరింగ్ చేశాను. ప్రముఖుల పరిచయాల్లో భాగంగా యండమూరి వీరేంద్రనాథ్గారిని ఇంటర్వ్యూ చేశాను. అప్పుడాయన సీరియల్స్‌లో చేయమని అడగడంతో కొద్దిపాటి సందిగ్ధతతోనే ‘ప్రియురాలు పిలిచె’లో నటించాను. శాంతి నివాసం, ఎడారి కోయిలలో కూడా మంచి పాత్రలే వచ్చాయి. స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇస్తే అది ఎలా ఉందనేది ప్రేక్షకులు చెప్తారు. కెమెరా ముందు ప్రోగ్రామ్ చేసిన తర్వాత అది ప్రసారం అయ్యేటప్పుడు ఇంట్లో టీవీ ముందు కూర్చుని చూడడం చాలా థ్రిల్లింగ్‌గా ఉండేది. మా ఇంట్లో అందరిదీ ఒక్కటే ఫార్ములా. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎన్నింటిలో చురుగ్గా ఉన్నా సరే... చదువును నిర్లక్ష్యం చేయకూడదు. అందుకేనేమో నాకు చదువు మీద ఫోకస్ తగ్గకుండా అమ్మ చాలా జాగ్రత్త పడింది. అయితే నాకు ఆన్ స్క్రీన్ ఆసక్తి పెరిగే సమయంలో అమ్మ మాట మీద కొంతకాలం నటనకు దూరంగా ఉండి చదువుకే పరిమితమయ్యాను. ఎంసీఏ తర్వాత వెబ్స్మార్ట్లో ఉద్యోగంతో కొత్త జీవితం మొదలైంది. చదువుకుంటూ కూడా సినిమాల్లో డబ్బింగ్ చెప్పడం మాత్రం వదల్లేదు. ఇడియట్, శివమణి, ఏ ఫిల్మ్ బై అరవింద్ వంటి సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పాను. పెళ్లి, పాపకు తల్లి కావడం, సింగపూర్‌లో ఉద్యోగం, అక్కడి నుంచి 2005లో యూఎస్‌కి... అక్కడ బాబు పుట్టడం, ఉద్యోగం– కుటుంబాన్ని బాలెన్స్ చేసుకోవడం అనే ఒక రొటీన్ చక్రంలో కొంతకాలం గడిచిపోయింది. అయితే అంత బిజీలో కూడా నాకు కొంత వెలితిగా అనిపించేది. రేడియో నాటకాలు, టీవీ షోలు, సినిమా డబ్బింగ్‌ల మధ్య జీవించిన ప్రాణం కదా మరి’’ అన్నారామె నవ్వుతూ. అమ్మ చెప్పింది అమెరికాలో రాజేశ్వరి నివసిస్తున్న డాలస్‌లో కూడా తెలుగు రేడియో ఉందని, వీలయితే ప్రోగ్రామ్స్ చేయమని తల్లి సూచించడంతో ఆమెలోని కళాకారిణి ఉత్సాహంతో ఉరకలు వేసింది. ఆమె సాహిత్యకాంక్ష ఆకాశంలో రెక్కలు విచ్చుకుంది. అలా 2006లో అమెరికా ఆకాశవాణితో గళాన్ని సవరించుకున్నారు రాజేశ్వరి. వారాంతాల్లో ప్రోగ్రామ్‌లు చేయడంతో అమెరికాకు చక్కటి తెలుగు భాషను వినిపించారు. ఆటా, తానా వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా అక్కడ మన భాష, సంస్కృతులకు జీవం పోస్తున్నారు. ప్రస్తుతం ఆమె సొంతంగా ‘రేడియో సురభి’ అనే ఎఫ్ఎమ్ రేడియోను రోజుకు ఇరవై నాలుగ్గంటల కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారు. ‘సరసిజ’ పేరుతో నాటకసంస్థను కూడా ప్రారంభించారామె. ‘‘విజయా వారి మిస్సమ్మ సినిమాను నాటకంగా ప్రదర్శించిన నా ప్రయోగం విజయవంతమైంది. సినిమాను స్టేజ్ మీద నాటకంగా ప్రదర్శించడం ప్రపంచంలో అదే మొదలు. అలాగే అమ్మ రాసిన ద్రౌపది అంతః సంఘర్షణ నాటకంలో ద్రౌపది పాత్ర పోషించాను. ‘అనగనగా ఒక రాజకుమారి, పురూరవ నాటకాలు కూడా అంతే ప్రజాదరణ పొందాయి. యూఎస్‌లో భారతీయ నాటకరంగం అనగానే మన వాళ్లందరికీ హిందీ నాటకాలే గుర్తుకు వసాయి. తెలుగుకు పెద్ద ఆదరణ ఉండదనే అపోహ ఉండేది. మనం చక్కగా ప్రదర్శిస్తే ఆదరణ ఎందుకు ఉండదు... అని చాలెంజ్‌గా తీసుకుని చేశాను. ప్రతి సన్నివేశానికి ముందు ఆడియోలో ఇంగ్లిష్‌లో నెరేషన్ చెప్పి ప్రదర్శించడం ద్వారా ఇతర భాషల వాళ్లు కూడా మన నాటకాన్ని ఆదరించారు. అలా నేను న్యూయార్క్‌లో ‘ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్’లో తెలుగు నాటకాన్ని ప్రదర్శించాను’’ అని తన కళాప్రస్థానాన్ని వివరించారామె. హైదరాబాద్‌లోని సారస్వత పరిషత్‌లో బుధవారం (20–7–2022) నాడు ‘లేఖిని– వంశీ’ సంయుక్తాధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉదయగిరి రాజేశ్వరికి ‘సురభి జమునారాయలు– వంశీ రంగస్థల పురస్కారం, లేఖిని ఆత్మీయ పురస్కార ప్రదానం జరిగింది. ఆ సందర్భంగా సాక్షితో ముచ్చటించారామె. ‘‘మాడపాటి హనుమంతరావు గరల్స్ హైస్కూల్ నాకు మంచి తెలుగు భాషను నేర్పింది. చక్కటి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసింది’’ అంటూ తన ఎదుగుదలలో తాను చదువుకున్న స్కూల్ ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు రాజేశ్వరి. రెండు గంటలు ఎవరూ కదల్లేదు యూఎస్... అన్ని ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు కలిసి నివసిస్తున్న ప్రదేశం. అక్కడ అందరూ వాళ్ల వాళ్ల సంస్కృతిని పరిరక్షించుకుంటూ యూఎస్వాసులుగా కొనసాగుతుంటారు. మనవాళ్లు మాత్రమే త్వరగా మన సంస్కృతిని వదిలేస్తున్నారనిపించింది. నాకు చేతవచ్చినది ఏదో ఒకటి చేయాలని కూడా అనిపించింది. నాటకం మీద నాకున్న అభిలాషకు అది చక్కటి వేదిక అయింది. మొదట్లో స్టేజ్ షోకి ఎవరూ రారేమోననే భయంతో మిస్సమ్మ నాటకాన్ని ఫ్రీ షో వేశాం. ఏడువందల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆడిటోరియం నిండిపోయింది. రెండు గంటల సేపు కదలకుండా చూశారు. పురూరవ నాటకాన్ని పిక్టోరియల్గా చిత్రీకరించి అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయడం కూడా ఓ ప్రయోగమే. మన నాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. – ఉదయగిరి రాజేశ్వరి, రంగస్థల కళాకారిణి – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి. -
ఆటాలో కూచిపూడికి పట్టం
తెలుగు వారి సాంప్రదాయ భారతీయ నాట్యం కూచిపూడికి ఆటా వేదికపై పట్టం కట్టించారు న్యూజెర్సీలోని సెంటర్ ఫర్ కూచిపూడి. ఇటీవల వాషింగ్టన్ డీసీ వేదికగా జరిగిన అమెరికన్ తెలుగు అసొసియేషన్ ప్రపంచ మహాసభల్లో సెంటర్ ఫర్ కూచిపూడి కళాకారిణులు అద్భుత ప్రదర్శనతో అలరించారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి కూచిపూడి నృత్యం అభ్యసించి.. అమెరికాలో సెంటర్ ఫర్ కూచిపూడి ఏర్పాటు చేశారు ఇందిరా శ్రీరాం రెడ్డి దీక్షిత్. న్యూజెర్సీ కేంద్రంగా గత 20 ఏళ్లుగా ఎంతో మందికి కూచిపూడిని నేర్పిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు పలు చోట్ల కూచిపూడి ప్రదర్శనలు ఏర్పాటు చేసి దాని గొప్పదనాన్ని చాటి చెప్పుతున్నారు ఇందిరా శ్రీరాం దీక్షిత్. అమెరికన్ తెలుగు అసొసియేషన్ సభల్లో ఇందిరా టీంలోని సభ్యులు సాంప్రదాయ కూచిపూడితో పాటు కోలాట నృత్యాలు చేసి అలరించారు. -
చరిత్ర సృష్టించాలన్నా.. దాన్ని తిరగరాయాలన్నా మనమే: ఆటా
వాషింగ్టన్ డీసీ: అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆటా 17వ తెలుగు మహాసభల సంబరాలు అంబరాన్నంటాయి. వాషింగ్టన్ డీసీ నగరం తెలుగు వారితో పోటెత్తింది. ఇంత భారీ ఎత్తున అమెరికాలో మహా సభలు నిర్వహించటం తెలుగు కన్వెన్షన్స్ చరిత్రలో మొట్ట మొదటి సారి కావటం విశేషం. సద్గురు జగ్గీ వాసుదేవ్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో 15వేల మందికి పైగా హాజరైనారు. జులై 1 వ తారీఖున నిర్వహించిన బాంక్వేట్ డిన్నర్ లో 3000 మందికి పైగా పాల్గొన్నారు. వివిధ రంగాలలో అత్యద్భుతమైన ప్రతిభ పాఠవాలు కనబరచిన వారికీ ఆటా అవార్డ్స్ ప్రదానం చేసారు. క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్ తదితరులు ఈ బాంక్వేట్ డిన్నర్ లో పాల్గొన్నారు, వీరిని ఆటా ఘనంగా సత్కరించింది. 125 మందితో స్వాగతోత్సవ జానపద సంబరాలు "మన ఆటా జానపదాల కోట" నిర్వహించారు. 140 మందికి పైగా పాల్గొన్న “తెలుగు మన వెలుగు” కార్యక్రమంలో కూచిపూడి, గోండి, లంబాడి తదితర సంప్రదాయ నృత్య రూపకాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మన బడి బాలలు చేసిన శ్రీ కృష్ణ రాయభారం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. బతుకమ్మ పైన ఆటా ముద్రించిన పుస్తకాన్ని కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. వద్దిపర్తి పద్మాకర్ అవధానం విశేషంగా ఆకట్టుకున్నది. శివమణి, థమన్ మ్యూజికల్ నైట్ శ్రోతలను ఉర్రుతలు గించింది. ఉపాసన కామినేని సద్గురుకి వినూత్నమైన ప్రశ్నలు శ్రోతల తరపున అడిగారు. సద్గురు మాట్లాడుతూ పర్యావరణ ముప్పుని నివారించటానికి సారవంతమైన భూమిని ఎలా కాపాడుకోవాలో, ఆహార భద్రతకు దీని ఆవశ్యకత, ఎంత ప్రాముఖ్యం సంతరించుకుందో సోదాహరణంగా “సేవ్ ది సాయిల్” ప్రోగ్రాం గురించి వివరించారు. ఈ సభలకు మగ్దూం సయ్యద్, రవి రాక్లే, సింగర్ సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మహిళలు, పిన్నలు పెద్దలు సాంప్రదాయ దుస్తులతో సందడి చేసారు. ఆటా మొదటి రోజు సాహిత్య కార్యక్రమాల ప్రారంభ సమావేశంలో కే. శ్రీనివాస్, అఫ్సర్, కసిరెడ్డి వెంకట రెడ్డి, ప్రభావతి, స్వామి వెంకటయోగి సమకాలీన సాహిత్యం గురించి మాట్లాడారు. ఆ తర్వాత, జొన్నవిత్తుల తన పారడీ పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మానకాలపు నవల, కథ’ పేరుతో నిర్వహించిన చర్చలో అమెరికాలో ఉన్న కథా, నవలా రచయితలు పాల్గొని సమకాలీన కథా సాహిత్యం గురించి లోతైన చర్చ చేశారు. రెండవ రోజు సాహిత్య కార్యక్రమాలలో సినిమాకి, సాహిత్యంలో ఉన్న సంబంధం గురించి వివరించడానికి ‘సినిమా కథ... సాహిత్య నేపధ్యం’ పేరుతో నిర్వహించిన చర్చలో దర్శకులు సందీప్ రెడ్డి వంగ, తనికెళ్ళ భరణి, ధర్మ దోనేపూడి, సుకుమార్, శివ సోమయాజుల పాల్గొన్నారు. చర్చలో భాగంగా ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు దర్శకులు సమాధానాలు ఇచ్చారు. ఆ తర్వాత, ‘ఆటా, పాటా, మనం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమమంలో చంద్రబోసు, రామజోగయ్య శాస్త్రి వారి పాటల నేపధ్యాన్నీ వివరించారు. ఈ కార్యక్రమానికి ఆడియన్స్ నుండి విశేషమైన స్పందన లభించింది. జులై 3న ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు, తీర్ధ ప్రసాదాలందుకున్నారు. ఆటా బ్యూటీ పేజంట్ విజేతలకు హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్, నటుడు అడివి శేష్ బహుమతులందచేశారు. అమెరికాలో 12 నగరాల నుంచి ఔత్సాహికులు పాల్గొనటం విశేషం. ఝుమ్మంది నాదం పాటల పోటీలు, సయ్యంది పాదం నాట్య పోటీల విజేతలకు బహుమతులు అందచేశారు. బిజినెస్ కమిటీ నిర్వహించిన ఎంట్రప్రెనేయూర్షిప్ అండ్ లైఫ్ సైకిల్ కార్యక్రమంలో GMR సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున రావు పాల్గొన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సదస్సులో ఉపాసన కామినేని పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి పై నిర్వహించిన సదస్సులో తనికెళ్ళ భరణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మహాసభలలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్ల రెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ళ వేంకటేశ్వర రెడ్డి , గువ్వల బాలరాజు, కాలే యాదయ్య, బొళ్ళం మల్లయ్య యాదవ్ , గాదారి కిశోర్, వైజాగ్ పార్లమెంట్ సభ్యులు MVV సత్యనారాయణ, రాజమండ్రి శషన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌధరి ఇతర నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, భవానీ మారికంటి, మన్నవ సుబ్బ రావు తదితర నాయకులు పాల్గొన్నారు. రామచంద్ర మిషన్ ధ్యాన గురువు కమలేష్ పటేల్( దాజి) ప్రత్యేక సందేశం అందించారు . ఈ మహాసభల నిర్వహణకు విరాలలాను అందచేసిన ధాతలను ఆటా కార్యవర్గం ఘనంగా సత్కరించింది. ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అధినేత డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి ఆటా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు వారందరు అమెరికాలో ఎదగటానికి ఆకాశమే కొలమానమని మన జాడ్యాలను విడనాడి అవకాశాలను అందిపుచ్చుకొని ఎంతో అబివృద్దిలోకి రావాలి అని ఆయన ఆకాంక్షించారు. ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల తెలుగు శాస్త్రీయ పద్దతిలో ఘనంగా సత్కరించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీత విభావరి అంధరిని మైమరిపించింది. గురువందనతో సంగీత విభావరి ప్రారంభమై ఎన్నో అద్భుతమైన పాటలను మనో, కార్తీక్ లాంటి ప్రముఖ గాయనీగాయకులసంగీత ఝురిలో ప్రేక్షకులను ఉర్రూతలూగారు. =అమెరికాలో తెలుగు వారి చరిత్రలో నభూతో నభవిష్యతిగా ఈ మహాసభలు నిర్వహించడానికి తోడ్పాటునందించిన కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్డినేటర్ కిరణ్ పాశం తదితరులకు ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా కోర్ కమిటీ, ఆడ్ హాక్ కమిటీ, కాట్స్ టీం & వాలంటీర్స్ ఇలా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేశారు. ఆటా ఫౌండింగ్ మెంబర్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రెసిడెంట్ అండ్ టీం కార్యాదక్షత మూలంగానే ఇంత ఘనంగా ఈ మహాసభలు నిర్వహించగలిగామని కొనియాడారు. వెండర్ బూత్స్ ఒక మినీ షాపింగ్ మాల్ని పించాయి. ఆటా సంప్రదాయ దుస్తులలో రిజిస్ట్రేషన్ వాలంటీర్స్ ఎరుపు రంగు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మీడియా మిత్రులకు, ప్రకటనకర్తలు వాలంటీర్స్, సహకరించిన ప్రతి ఒక్కరికి అట కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్డినేటర్ కిరణ్ పాశం ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు. ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల, కోశాధికారి సాయినాథ్ రెడ్డి బోయపల్లి, జాయింట్ సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, జాయింట్ కోశాధికారి విజయ్ కుందూరు కాన్ఫరెన్స్ విజయానికి ఎంతో తోడ్పాటుని అందించిన కోహోస్టు కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ సబ్యులకు ధన్యవాదాలు తెలియచేసారు. ఈవెంట్ రిజిస్ట్రేషన్ పనులను కో-కన్వీనర్ సాయి సూదిని, కో-కోఆర్డినేటర్ రవి చల్ల. లోకల్ కోఆర్డినేటర్ శ్రావణ్ పాదురు పర్యవేక్షించారు.