నగరంలో కనుల పండుగగా శ్రీనివాస కళ్యాణ వేడుకలు ‘తారా’ (తెలుగు అసోషియేషన్ ఆఫ్ రీడింగ్ అండ్ అరౌండ్) జనరల్ సెక్రటరీ 'సంతోష్ కుమార్ బచ్చు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ... శ్రీ వేంకటేశ్వర స్వామివారు, శ్రీదేవి, భూదేవి, అమ్మవార్ల విగ్రహాలకు తిరుపతిలో కళ్యాణం జరిగేంత ఘనంగా వేద పండితులు, అర్చకుల చేత కళ్యాణ వేడుకలు జరిపించినట్లు పేర్కొన్నారు. నాదస్వర వాయిద్యాల మధ్య కోలాటం ఆడుతూ... స్వామి వారిని పల్లకిలో స్వాగతిస్తూ.. సుప్రభాత సేవతో స్వామివారిని, అమ్మవార్లను ఊరేగించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తి విన్యాసాలతో, గోవింద నామాలతో , విష్ణు సహస్ర , అన్నమాచార్య కీర్తనలతో భక్త బృందం పాల్గొని తన్మయత్వంలో మునిగితేలారు.