kalyanotsavam
-
నార్కట్‌పల్లి : అంగరంగ వైభవంగా చెర్వుగట్టు రామలింగేశ్వరుడి కల్యాణోత్సవం (ఫొటోలు)
-
శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం ప్రారంభం
-
స్వయం సిద్ధ క్షేత్రం ‘తొలి తిరుపతి’
పెద్దాపురం: ఏలేరు నది ఒడ్డున అతి పురాతన కాలంలో స్వయం సిద్ధ క్షేత్రంగా వెలసిన స్వయంభూ శ్రీ భూసమేత శృంగార వల్లభ స్వామి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చదలాడ తొలి తిరుపతిలో వెలసిన స్వామి వారి కల్యాణం శుక్రవారం రాత్రి 8 గంటలకు నిర్వహిస్తారు. సామర్లకోట–ప్రత్తిపాడు రహదారిలో పెద్దాపురం మండలంలోని దివిలి గ్రామానికి ఒకటిన్నర కిలో మీటర్ల దూరంలో ఉంది చదలాడ తొలి తిరుపతి. విశిష్ట నిర్మాణ శైలితో ఉండే ఈ పుణ్యక్షేత్రం సింహాచలం, తిరుమల తిరుపతి కంటే పురాతనమైనదిగా పేర్కొంటారు. తొలి తిరుపతిగా పేరొందిన ఈ గ్రామంలోని ఆలయం తొమ్మిది వేల సంవత్సరాల క్రితం నాటిదని, ఈ విషయం ‘చాతావళి’ అనే సంస్కృత గ్రంథంలో కూడా ఉందని ఆలయ ప్రధాన పూజారులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు చెప్పారు. దేశవ్యాప్తంగా మొత్తం 108 తిరుపతిలు ఉండగా వాటిలో ‘తొలి తిరుపతి’దే తొలిస్థానమని పేర్కొంటున్నారు. ఈ ఆలయం మాదిరిగానే పెద్ద తిరుపతి (తిరుమల తిరుపతి)లో కూడా ఏడు ద్వారాలు ఉండడం విశేషం. ఇక ప్రతీ శనివారం ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయానికి పాదయాత్రగా వచ్చి ఏడు వారాలు మొక్కు తీర్చుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఎడమ చేతిలో చక్రం... కుడి చేతిలో శంఖం ఇక్కడ స్వామి ఇతర పుణ్యక్షేత్రాల్లో విగ్రహాలకు భిన్నంగా ఎడమ చేతిలో చక్రం, కుడి చేతిలో శంఖం ధరించి ఉండటం విశేషం. అలాగే ఇక్కడ స్వామి చేతుల్లో తామర పుష్పం ఉన్నట్లే తిరుమల, సింహాచలం ఆలయాల్లోని విగ్రహాల చేతిలోనూ ఉన్నట్లు చెబుతారు. ఇది మూడు క్షేత్రాల మహాక్షేత్రంగా గణుతికెక్కింది. ప్రధానంగా ఇది స్వయం సిద్ధక్షేత్రం. నారద మునీంద్రుడు ఇక్కడ లక్ష్మీదేవిని ప్రతిస్టించడంతో దివ్యక్షేత్రమవ్వగా శ్రీకృష్ణ దేవరాయలు గోదాదేవిని ప్రతిస్టించడంతో రాజక్షేత్రంగా మారి మహా క్షేత్రమైంది. భోజ మహారాజు ఈ ఆలయానికి సున్నం వేయించినట్టు, విక్రమాదిత్యుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్, విక్టోరియా మహారాణి ఈ ఆలయ దర్శనానికి వచ్చినట్లు శాసనాధారాల్లో ఉంది. బొడ్నబావి ప్రత్యేకత.. ఆలయానికి ఆగ్నేయ మూలలో చతురస్రాకారంలో ఉన్న బావిని బొడ్నబావిగా పిలుస్తుంటారు. నేలబావిగా ఉన్న ఈ బావి చుట్టూ రాళ్లు పేర్చి నిరి్మంచడాన్ని పురాతన నిర్మాణానికి ఆనవాలుగా చెబుతారు. కార్తికమాసంలో ఈ బావి నీటిని ఆలయ అర్చకులతో తోడించుకుని స్నానం చేస్తే సంతానం లేనివారికి సంతాన భాగ్యం కలుగుతుందని, కార్తిక పౌర్ణమి నాడు ఆ స్నానం మరింత ప్రాశస్థ్యమని భక్తుల నమ్ముతారు. ఈ బావి నీటిని చుట్టుపక్కల గ్రామాల వారు ఇంటికి తీసుకువెళ్లి మామూలు నీళ్లతో కలుపుకొని స్నానం చేస్తారు. టీటీడీ సహకారంతో ఆలయ అభివృద్ధి ఈ ఆలయానికి ఉండే వందలాది ఎకరాల ఆస్తి కాలక్రమంగా అన్యాక్రాంతమై నేటికి 18 ఎకరాలు మాత్రమే మిగిలింది. అయితే జీర్ణావస్థలో ఉన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు పురావస్తు శాఖ చర్యలు చేపట్టింది. టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఉన్న సమయంలో ఆలయ అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు చేశారు. ఇక దాతల సహకారంతో భక్తులకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి శృంగార వల్లభ స్వామి దివ్య కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. రాత్రి 8 గంటలకు ఉభయ దేవేరులైన క్షీర సాగరనందని లక్ష్మీదేవి, భూదేవిలతో స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవం ఉంటుంది. 20న గ్రామోత్సవం, 21న సదస్యం, 22న సుదర్శన హోమం, చోర సంవాదం, 23వ తేదీ ఉదయం 8 గంటలకు చక్ర స్నానం, బుక్కా పండగ, సామూహిక కుంకుమ పూజలు, 24వ తేదీన సాయంత్రం 6 గంటలకు స్వామి వారికి శ్రీ పుష్పయాగం ఉంటాయి. – వడ్డి శ్రీనివాస్, కార్యనిర్వహణాధికారి -
వైభవంగా అంతర్వేది తిరు కళ్యాణ మహోత్సవాలు
-
అత్యంత రమణీయంగా గోమాత కళ్యాణం.. స్వయంవరంతో ఒక్కటాయెనె..
కాకినాడ రూరల్: కల్యాణం... కమనీయమంటారు పెద్దలు. పచ్చని పందిళ్లు.. ముత్యాల తలంబ్రాలు, వేద మంత్రాలు, భాజా భజంత్రీలు, కన్యాదానం, మాంగళ్యధారణ ఇలా... వివాహం ప్రతిఒక్కరి జీవితంలో కలకాలం గుర్తుండిపోతుంది. అయితే అన్నింటి కంటే భిన్నంగా సనాతన ధర్మం ప్రకారం లక్ష్మీదేవి స్వరూపం గోమాత కల్యాణం జరిగితే అది మధురానుభూతే. గోమాత సారణ కల్యాణోత్సవం ఆదివారం ఉదయం కాకినాడ రూరల్ రమణయ్యపేట ఏపీఎస్పీ బెటాలియన్ కల్యాణ మండపంలో అత్యంత వైభవంగా జరిగింది. తిరుమల ఆసుపత్రి వైద్యుడు గౌరీశేఖర్, రమాదేవి దంపతులు తమ పెంపుడు గోవు సారణకు స్వయంవరం ప్రకటించారు. దీంతో ఏలేశ్వరం మండలం లింగంపర్తి వద్ద కొండ తిమ్మాపురంలోని నాడీపతి గోశాల ఆవరణలోని 89 నందీశ్వరులు (గిత్తలు)ను తొలుత ఎంపిక చేశారు. వాటి నుంచి 24కు కుదించారు. మళ్లీ ఇందులో 16ను ఎంపిక చేయగా స్వయంవరంలో 10 గిత్తలు పాల్గొన్నాయి. ఇందులో ప్రపంచంలోనే అత్యంత పొట్టివైన పుంగనూరు గిత్తలు ఉండడం విశేషం. తిరుపతి, కంచి, తిరువణ్ణామలై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు తొలుత డాక్టర్ గౌరీశేఖర్, రమాదేవి దంపతులతో విఘ్నేశ్వర, గౌరీ పూజలు జరిపించారు. అనంతరం స్వయంవరం ప్రకటించగా భైరవ, కృష్ణుడు, రాముడు, లక్ష్మణుడు, యువరాజు నిద్రవర్మ, యువరాజు మహేంద్ర కన్నయ్య, బుద్ధుడు, మంగరాజు, ధర్మరాజు, షణ్ముఖ కన్నయ్య తదితర పేర్లతో పిలిచే నందీశ్వరులను ప్రవేశపెట్టారు. డాక్టర్ గౌరీశేఖర్ వధువు సారణను తీసుకువచ్చి స్వయంవరంలో నందులు వద్ద ఉంచగా వాటిని పరీక్షించి మధ్యలో ఉన్న షణ్ముఖ కన్నయ్యను ఎంపిక చేసుకుంది. షణ్ముఖ కన్నయ్య తరఫున తల్లిదండ్రులుగా పాకలపాటి నారాయణరాజు, సీతాదేవి వివాహ వేడుకను జరిపించారు. వరుడు కాళ్లను డాక్టరు గౌరీశేఖర్ దంపతులు కడిగి వివాహం జరిపించారు. అత్యంత రమణీయంగా జరిగిన వేడుకను భారీగా తరలివచ్చిన ప్రజలు తిలకించారు. గోమాత లక్ష్మీ స్వరూపం గోమాత లక్ష్మీ స్వరూపమని, ఎక్కడ గోపూజలు జరుగుతాయో అక్కడ సుభిక్షంగా ఉంటుందని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యా«తి్మక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువు అన్నారు. ఈ వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గోమాత కల్యాణోత్సవం తలపెట్టిన డాక్టర్ గౌరీశేఖర్ దంపతులు అభినందనీయులన్నారు. నాడీపతి వైద్యుడు కృష్ణంరాజు మాట్లాడుతూ స్వయంవరం ద్వారా గోమాత కల్యాణోత్సవం అరుదు అన్నారు. డాక్టర్ గౌరీశేఖర్ మాట్లాడుతూ తాను సారణను దత్తత తీసుకుని కూతురుగా భావించి ఇప్పుడు కల్యాణోత్సవం జరిపించామన్నారు. ఏపీఎస్పీ అడిషనల్ కమాండెంట్ సీహెచ్ భద్రయ్య, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సామాన్య భక్తుడికే తొలి ప్రాధాన్యం
తిరుమల : శ్రీవారి దర్శనంలో టీటీడీ సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తోంది. మే, జూన్, జూలై మాసాల్లో కోనేటిరాయుడి దర్శనార్థం భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం వున్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు నిత్యం వేలాదిగా శ్రీవారి దర్శన టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది.టిక్కెట్లు పొందిన భక్తులు వారి కి కేటాయించిన సమయానికి క్యూలైన్ వద్దకు వస్తే రెండు, మూడు గంటల్లోనే స్వామివారి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ, సహస్రదీపాలంకార సేవా టిక్కెట్ల కోటాను గురువారం ఉదయం 11.30 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే సుప్రభాతం, అర్చన, తోమాల, వారపుసేవలైన అష్టధళపాదపద్మారాధన సేవా టిక్కెట్లకు సంబంధించి ఎల్రక్టానిక్ డిప్ కోసం గురువారం ఉదయం 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 10 వరకు భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో భక్తులకు టిక్కెట్లను కేటాయించనుంది. ఇక గురువారం మధ్యాహ్నం 3గంటలకు జూలై మాసం శ్రీవాణి ట్రస్టు టిక్కెట్ల ఆన్లైన్ కోటా విడుదల చేయనుంది. ఈ నెలæ 21వ తేదీన ఉదయం 10 గంటలకు జూలై మాసం అంగప్రదక్షిణ టోకెన్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెలకు సంబంధించిన ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈనెలæ 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. 24న మే మాసం వర్చువల్ ఆర్జిత సేవాటిక్కెట్ల కోటాని అందుబాటులో ఉంచనుంది. మే, జూన్ నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను ఈనెలæ 25న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. నిత్యం 10వేల నుంచి 12వేల టిక్కెట్ల లెక్కన దాదాపు 7లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లని భక్తులకు అందుబాటులో ఉంచనుంది. మే నెల గదుల కోటాను ఈనెలæ 26న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈక్రమంలోనే ఆన్లైన్లో టికెట్లు దొరకని వారు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల వద్ద, శ్రీవారి మెట్టు మార్గంలో 1,240వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. -
మలేసియాలో వైభవంగా శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణం
సాక్షి హైదరాబాద్: మలేసియా లోని బాగాన్ డత్తోలో శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నెల 23నుంచి 25వ తేదీ వరకు కన్నుల పండువగా సంప్రోక్షణ, స్వామి వారి కళ్యాణ ఉత్సవం జరిగాయి. మలేసియాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు 5000 మంది తెలుగు వారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మలేసియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే దత్తో ఖైరుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మలేసియా తెలుగు సంఘం గౌరవ సలహాదారు దత్తో డాక్టర్ అచ్చయ్యకుమార్ రావు, అధ్యక్షులు డాక్టర్ వెంకట ప్రతాప్, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ సత్యసుధాకర్, వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఫొటోలకు ఇక్కడ క్లిక్ చేయండి -
వైభవంగా కదిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
-
ఉత్తరాంధ్ర భక్తులకు కొంగు బంగారంగా ఉపమాక శ్రీ వెంకటేశ్వరస్వామి
-
యాదాద్రీశుడికి పట్టువస్త్రాలు
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణానికి సీఎం కేసీఆర్ సతీసమేతంగా శుక్రవారం హాజరుకానున్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 11 గంటలకు బాలాలయంలో నిర్వహించే తిరు కల్యాణోత్సవానికి స్వామివారికి ప్రభుత్వం తరఫున కేసీఆర్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం ఉదయం బేగంపేట నుంచి హెలికాప్టర్లో యాదాద్రికి చేరుకోనున్నారు. 2016లో బాలాలయంలో జరిగిన తిరు కల్యాణోత్సవానికి సీఎం దంపతులు తొలిసారి హాజరై ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. 28 నుంచి స్వయంభూల దర్శనం ప్రధానాలయం ఉద్ఘాటన ఉత్సవాలు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. 28న ప్రధానాలయం ప్రారంభించి భక్తులకు స్వయంభూల దర్శనం కల్పించనున్నారు. ప్రధానాలయం పనులు దాదాపు పూర్తయ్యాయి. దివ్యవిమానం బంగారు తాపడం పనులు ప్రారంభించాల్సి ఉంది. ఉద్ఘాటన ఉత్సవాలతోపాటు ఇంకా జరగాల్సిన పనులపై సీఎం అధికారులతో సమీక్షించనున్నారు. 21 నుంచి మహాకుంభసంప్రోక్షణ కార్యక్రమ నిర్వహణపై అధికారులతో చర్చించనున్నారు. అలాగే కొండపై ఆర్చీ, బస్బే, కమాండ్ కంట్రోల్ రూమ్, బాలాలయం చుట్టుపక్కలా చదును చేయడం, సుందరీకరణ పనులు, ఘాట్ రోడ్డు వెడల్పు పనులు పర్యవేక్షించనున్నారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కూడా రానున్నారు. కాగా, కొండ కింద భక్తులకు వసతులు కల్పించే పనులను వేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే సీఎంవో కార్య దర్శి భూపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచతల రాజగోపురానికి పసిడి కలశాలు యాదాద్రి ప్రధానాలయ రాజగోపురాలు పసిడి కలశాలతో ధగధగలాడనున్నాయి. ప్రధానాలయ ఉద్ఘాటన సమయానికి సప్త, పంచ, త్రితల రాజగోపురాలకు పసిడి కలశాలను బిగించే ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం పంచతల రాజగోపురంపై తొమ్మిది బంగారు కలశాలను ప్రత్యేక శిల్పులు బిగించారు. ఇప్పటికే ఆలయ అష్టభుజి శిఖర మండపాలపై రాగి కలశాలను బిగించారు. పంచతల రాజగోపురానికి బిగించిన పసిడి కలశాలు సిద్ధమవుతున్న స్వర్ణ రథం బాలాలయంలో స్వర్ణ రథం సిద్ధమవుతోంది. దాతల సహకారంతో చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్‌లో బంగారు తాపడం పూర్తి చేయించి, విడి భాగాలను ఇటీవల క్షేత్రానికి తెచ్చారు. వీటికి అధికారులు, ఆచార్యులు పూజలు నిర్వహించారు. రాత్రి నుంచి రథానికి బంగారు కవచాలు తొడిగే పనులను ప్రారంభించారు. -
కల్యాణం.. కమనీయం
శంషాబాద్ రూరల్: భక్త జన సందోహం, వేద మంత్రాల మధ్య శ్రీరామనగరం సమతామూర్తి ప్రాంగణంలో ఉన్న 108 దివ్య క్షేత్రాల్లోని పెరుమాళ్లకు శాంతి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శనివారం సాయంత్రం చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కల్యాణోత్సవం నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులతో 108 పెరుమాళ్ల నామస్మరణం చేయించారు. ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 60 కౌంటర్ల ద్వారా భక్తులకు అక్షింతలు, ప్రసాదా లు పంపిణీ చేశారు. మైహోం గ్రూపు సంస్థల అధినేతలు జూపల్లి రామేశ్వర్రావు, జూపల్లి జగపతిరావు కుటుంబసభ్యులు, ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీగా సందర్శకులు వారాంతం కావడంతో సమతామూర్తి దర్శనానికి సందర్శకులు భారీగా తరలివచ్చారు. అయితే సాయంత్రం శాంతి కల్యాణోత్సవం ఉండడంతో వారిని లోపలికి అనుమతించలేదు. ఇక స్ఫూర్తి కేంద్రం ప్రధాన ప్రాంగణంలోనికి అతి కొద్ది మందిని మాత్రమే అనుమతించారు. పశ్చిమ వైపు ఉన్న 9వ నంబరు గేటు నుంచి ప్రత్యేక ఆహ్వానితులను మాత్రమే లోపలికి వదిలారు. కాగా ప్రధాన ప్రాంగణం ఎదురుగా ఉన్న ఆవరణలో సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయడంతో అక్కడ సుమారు పది వేల మంది వరకు కూర్చుని స్క్రీన్లపై కల్యాణోత్సవాన్ని వీక్షించారు. కల్యాణోత్సవానికి సుమారు 15 వేల మంది హాజరైనట్లు అంచనా వేశారు. -
అమెరికాలో ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం
-
అమెరికాలో ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం
వాషింగ్టన్: నగరంలో కనుల పండుగగా శ్రీనివాస కళ్యాణ వేడుకలు ‘తారా’ (తెలుగు అసోషియేషన్ ఆఫ్ రీడింగ్ అండ్ అరౌండ్) జనరల్ సెక్రటరీ 'సంతోష్ కుమార్ బచ్చు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ... శ్రీ వేంకటేశ్వర స్వామివారు, శ్రీదేవి, భూదేవి, అమ్మవార్ల విగ్రహాలకు తిరుపతిలో కళ్యాణం జరిగేంత ఘనంగా వేద పండితులు, అర్చకుల చేత కళ్యాణ వేడుకలు జరిపించినట్లు పేర్కొన్నారు. నాదస్వర వాయిద్యాల మధ్య కోలాటం ఆడుతూ... స్వామి వారిని పల్లకిలో స్వాగతిస్తూ.. సుప్రభాత సేవతో స్వామివారిని, అమ్మవార్లను ఊరేగించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తి విన్యాసాలతో, గోవింద నామాలతో , విష్ణు సహస్ర , అన్నమాచార్య కీర్తనలతో భక్త బృందం పాల్గొని తన్మయత్వంలో మునిగితేలారు. అలాగే ఉదయం ఏర్పాటు చేసిన ఫలహారాన్ని, కళ్యాణం తర్వాత పంచిన మహాప్రసాదాన్ని భక్తులు ఆస్వాదించారని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా తిరుపతి నుంచి తెప్పించిన లడ్డు, వడ ప్రసాదం విరివిరిగా పంచామని, చివరగా పల్లకి సేవతో స్వామివారికి, అమ్మవార్లకి భక్తులంతా వీడ్కోలు పలికినట్లు ఆయన వివరించారు. స్వామివారి కళ్యాణం తర్వాత తిరుపతి నుంచి తెప్పించిన లడ్డూ ఉచితంగా పంచడంతో భక్తులంతా హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. అనంతరం స్వామివారి కళ్యాణానికి హజరై విజయవంతం చేసిన భక్తులందరికి తారా నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. -
భద్రాద్రిలో అంకురారోహణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణోత్సవానికి శనివారం అంకురారోహణ వేడుక అత్యంత వైభవోపేతంగా జరిగింది. స్వామి వారికి ఆలయం చుట్టు సేవ నిర్వహించిన అనంతరం బేడా మండపంలోకి తీసుకొచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాధాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, వేదపండితులు స్వామి వారికి వేదస్వస్తి, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. అనంతరం మూలవరుల వద్ద ఉత్సవాలకు అనుజ్ఞ తీసుకున్నారు. బేడా మండపంలో స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, స్నపన తిరుమంజనాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం రామాలయంలోని యాగశాలలో మృత్సంగ్రహణం, వాస్తు హోమం వంటివి నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా జరిపే బ్రహ్మోత్సవాలలో పూజా కార్యక్రమాలను నిర్వహించే అర్చక స్వాములకు ఆలయ ఈవో రమేష్‌బాబు దీక్షా వస్త్రాలను అందజేశారు. వేడుకలో భాగంగా ఆదివారం ఆలయంలో ధ్వజపట భద్రక మండల లేఖన పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీరామనవమి నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం దేవస్ధానం ఆధ్వర్యంలో స్ధానిక జీయర్ స్వామి మఠంలో ధ్వజపట భద్రక మండల లేఖన(గరుడ చిత్రం) పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం గరుడాదివాసం, రాత్రికి స్వామి వారికి తిరువీధి సేవ నిర్వహించిస్తారు. -
కాళహస్తిలో కన్నులవిందుగా కళ్యాణం
-
నేడు స్వామివారి గరుడోత్సవం
-
భక్తుల చెంతకే భగవంతుడు
- రేపటి నుంచి అహోబిలేశుడి పార్వేట మహోత్సవాలు - 33 గ్రామాల్లో 45 రోజుల పాటు స్వామివారి పర్యటన - పెళ్లి పిలుపునకు గ్రామాలకు తరలివస్తున్న భగవంతుడు ఆళ్లగడ్డ : తన కల్యాణోత్సవానికి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల వారిని ఆహ్వానించడంలో భాగంగా శ్రీ అహోబిలేశుడు చేపట్టే పార్వేట మహోత్సవం సోమవారం ప్రారంభం కానుంది. పార్వేట మహోత్సవ పూర్వపరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం మేల్కోటెలో జన్మించిన కిడాంబి చళ్లపిళ్లై శ్రీనివాసాచార్యులు కాంచీపురంలో వేదాంత కాలక్షేపం చేస్తున్న సమయంలో శ్రీలక్ష్మినరసింహస్వామి కలలో సాక్షాత్కరించి అహోబిలం చేరుకోవాలని చెప్పారు. స్వామి ఆజ్ఞానుసారం ఆయన క్షేత్రం చేరగానే వృద్ధ సన్యాసి రూపంలో దర్శనమిచ్చి శ్రీనివాసాచార్యులకు సన్యాసాన్ని అనుగ్రహించారు. సాక్షాత్తు దేవదేవుడి చేతుల మీదుగా సన్యాసాన్ని స్వీకరించిన శ్రీనివాసాచార్యులు ‘ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ ’ అనే సన్యాస ఆశ్రమ నామాన్ని స్వీకరించి ‘శ్రీ అహోబిల మఠం’ ను స్థాపించి మెట్టమెదటి పీఠాధిపతి అయ్యారు. అప్పుడు స్వామివారు పీఠాధిపతులవారితో ‘గ్రామే గ్రామే చగత్వాపద చరణ యో ... మాంగృహీత్వ (భక్తుల చెంతకే భగవండుడు అన్న విధంగా గ్రామ గ్రామాలకు నన్ను వేంచేయింపజేసి బక్తులకు మోక్ష మార్గాన్ని కల్పించండి) అని ఉపదేశించారు. స్వామి ఆజ్ఞ మేరకు ప్రథమ పీఠాధిపతి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఉత్సవ పల్లకిలో కొలువుంచి గ్రామాలకు చేరుకోవడంతో పాటు ఊరేగింపుగా అక్కడి వీధుల్లో సంచరిస్తూ ప్రత్యేకంగా నిర్మించిన తెలుపులపై కొలువుంటూ బక్తులకు ఆశ్వీర్వాదాలు అందజేసే ‘పార్వేట’ మహోత్సవాలకు శ్రీకారం చుట్టినట్లు చరిత్ర కథనం. వేటగాడిలా... నిత్యం పట్టువస్త్రాలు, వజ్రవైడూర్యాలతో దర్శనమిచ్చే శ్రీ లక్ష్మీనరసింహస్వాములు పార్వేట మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు లేకుండా ఒంటరిగా తలపాగా మాత్రమే చుట్టుకుని వేటగాడి ఆకారంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామి ఇలా వేటగాడి రూపంలో సంచరించడంతో గ్రామానికి ఎల్లప్పుడు ఆయన రక్షణ ఉంటుందని ప్రజలు నమ్ముతారు. పార్వేటలో భాగంగా స్వామివారు ఏ ఊరికి వెళ్తే ఆ రోజు అక్కడ తిరునాల జరుగుతుంది. ఇలా 45 రోజులపాటు ఈ పార్వేట సాగుతుంది. స్వామి తిరిగి కొండెక్కేవరకు పాదుకలే సర్వస్వం పార్వేట ఉత్సవాల్లో భాగంగా సుమారు మండలం రోజులకు పైగా స్వామివారి గ్రామాల్లో తిరుగుతూ భక్తులను ఆశీర్వదించెందుకు కొండ దిగుతారు. అయితే తిరిగి కొండెక్కేవరకు క్షేత్రంలో అహోబిలేశుడి పాదుకలున్న శఠగోపం ఆలయంలో ఉంచుతారు. ఈ శఠానికి నిత్యం ప్రాతఃకాలంలో అన్ని రకాల పూజలు నిర్వహించి కొలువుంచి పరమ పవిత్రంగా కొలుస్తుంటారు. స్వామి తిరిగి కొండెక్కేవరకు అహోబిలంలో మూలవిరాట్‌ను దర్శించుకునే బక్తులకు శఠారు పెట్టడం జరగదు. కేవలం తీర్థ ప్రసాదాలు మాత్రమే అందజేయడం ఆనవాయితీ. ఇప్పటికి కూడా స్వామికి అర్చకులు బావి నీరుతో కట్టెల పొయ్యిపై చేసిన నైవేద్యాన్ని మాత్రమే నివేదిస్తారు. ఇలా స్వామి ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి దాదాపు రాత్రి పొద్దుపోయిన తరువాతే వెళ్తారు. రుద్రవరం మండలం ఆలమూరు, లింగందిన్నె గ్రామాలకు చెందిన బోయిలు కాళ్లకు చెప్పులు లేకుండా చీకట్లో, ముళ్ల పొదల్లోనే స్వామి పల్లకీని మోసుకెళ్తారు. ఇలా స్వామివారి పార్వేట ఆళ్లగడ్డ, రుద్రవరం, ఉయ్యాలవాడ మండలాల్లోని 33 గ్రామాల్లో సాగుతుంది. కొండదిగిన రోజునుంచి తీరిక లేకుండా గ్రామ గ్రామాన తిరిగి బక్తులకు దర్శన భాగ్యము కల్పించి 45 రోజుల అనంతరం రుద్రవరం నుంచి స్వామి పల్లకి కొండ(అహోబిలం) ఎక్కుతుంది. ఉత్సవాలు సాగేది ఇలా.. ఎగువ అహోబిలంలో కొలువైన జ్వాల నరసింహస్వామిని సంక్రాంతి పర్వదినం రోజు దిగువ అహోబిలం తీసుకు వస్తారు. పదవ క్షేత్రం దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాదవరదస్వామితో కలిపి కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వాములకు ఎదురుగా అన్నం రాసిగా పోసి అన్నకూటోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 45 రోజులపాటు సాగే పార్వేట ఉత్సవాల్లో స్వాములకు సరిపడా ఆహారాన్ని ఇద్దరు ఉత్సవ మూర్తులకు అర్పిస్తారు. అనంతరం పార్వేట ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఈప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యం : కీడాంబి వేణుగోపాలన్, అహోబిలం దేవస్థాన ప్రధానార్చకులు ప్రపంచంలో ఎక్కడా ఏ స్వామి ఇవ్వని కానుకను శ్రీఅహోబిల లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవాల ద్వారా ప్రజలకు అందిస్తారు. స్వయంగా భక్తుని చెంతకే భగవంతుడు వెళ్లి దర్శన భాగ్యం కల్పించే కార్యక్రమానికి ఈ ఉత్సవాలు వేదికగా నిలుస్తాయి. -
సప్తగిరీశుడి సన్నిధి...సప్తపదికి పెన్నిధి!
శ్రీవేంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రం నిత్యకల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లుతోంది. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను అనునిత్యం పెళ్ళాడుతూ మలయప్ప నిత్య కల్యాణ చక్రవర్తిగా భక్తకోటిని కటాక్షిస్తూ పరవశింపచేస్తుంటాడు. నిత్యపెళ్లికొడుకైన ఆ స్వామి సన్నిధిలో వివాహ శుభకార్యాలు చేసుకుని తమ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని భక్తులు ఆసక్తి కనబరుస్తుంటారు. ఏడాది పొడవునా వివాహ బంధంతో కొత్తజంటలు ఒక్కటవుతుంటారు. ⇒ కోర్కెలు తీర్చే కొండలరాయుని ఆలయంలో నిత్య కల్యాణోత్సవం వైభవంగా సాగుతుంటుంది. ఆలయంలో ఐదు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ సంప్రదాయం నేటికీ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రోజుకు 800 నుండి 900 జంటల వరకు ఈ కల్యాణోత్సవంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. పచ్చటి తోరణాలతో ఆలయ శోభ నిత్య కల్యాణ చక్రవర్తికి వేకువజాము సుప్రభాతం మొదలు, రాత్రి ఏకాంత సేవ వరకు నిర్విరామంగా ఉత్సవాలు, సేవలు సాగుతూనే ఉంటాయి. అందుకు చిహ్నంగా ఆలయ మహాద్వారం, కల్యాణ మండపంలో ప్రతి రోజూ అరటిమాకులు, మామిడి ఆకుల తోరణాలతో అలంకరిస్తారు. అందుకే కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం నిత్యకల్యాణం పచ్చతోరణం ప్రసిద్ధి పొందింది. వెంకన్న సన్నిధిలో ఏడాది పొడవునా వివాహాలే దేవదేవుని సన్నిధి అయిన తిరుమల క్షేత్రంలో నిత్యం పెళ్లి మంత్రాలు వినిపిస్తాయి. భాజాభజంత్రీలు మోగుతూనే ఉంటాయి. నవ వధూవరులు సరికొత్త ఆశలతో ఒక్కటవుతుంటారు. ఇలా తిరుమలలో రోజూ వివాహాలు జరుగుతూనే ఉంటాయి. శుభలగ్నాలతో పనిలేకుండా కూడా పెళ్లి వేడుకలు సాగుతుండటం ఇక్కడి ప్రత్యేకత. ఏడాదిలో సుమారు పదివేలకు పైగా పెళ్ళిళ్లు జరుగుతుంటాయి. ‘కల్యాణం’ పథకం ద్వారా అన్నీ ఉచితం ⇒ భారతీయ ఆశ్రమ ధర్మాలకు ఊపిరైన వివాహ బంధం పటిష్టతకు కల్యాణమస్తు పథకంతో టీటీడీ గట్టి పునాదులు వేసింది. అదే తరహాలోనే టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తిరుమల కల్యాణవేదిక పౌరోహిత సంఘం కేంద్రంగా ఏప్రిల్ 25న ‘కల్యాణం’ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. దీనిమూలంగా భక్తులకు ఆర్థిక భారం తప్పటంతోపాటు అదనపు సౌకర్యాలూ అందుబాటులోకి రానున్నాయి. గతంలో పురోహితుడు, మంగళవాయిద్యాలు, పెళ్లివేడుక వీడియో విద్యుత్ చార్జీలకుగానూ రూ.860 నగదు వసూలు చేసే విధానాన్ని కూడా పూర్తిగా రద్దు చేశారు. ⇒ వివాహం సందర్భంగా పసుపు, కుంకుమ, అక్షింతలు, కంకణాలు అందజేస్తారు. ఇదే సందర్భంగా రూ.300 టికెట్ల క్యూలైను నుండి కొత్త జంటలతోపాటు వారి తలిదండ్రులతో సహా మొత్తం 6 మందిని ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కొత్త జంటకు శ్రీవారి ప్రసాద బహుమానంగా రూ.25 ధరతో కూడిన పది చిన్న లడ్డూలు ఉచితంగా అందజేస్తారు. ప్రైవేట్ సత్రాలు, మఠాల్లో కల్యాణ వైభోగం ⇒ ఇక ధనవంతులు తమ స్థోమతకు తగ్గట్టుగా పెళ్లిని ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇందుకోసం తిరుమలలో 23 మఠాలు, మరికొన్ని ప్రైవేట్ సత్రాలు ఉన్నాయి. ⇒ రెండుమూడు మినహాయిస్తే దాదాపుగా అన్నిటిలోనూ వివాహ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా కల్యాణ మండపాలు ఉన్నాయి. ఇక్కడ మండపం అలంకరణ, పురోహితుడు, బాజాభజంత్రీలు, అల్పాహారం నుండి విందు భోజనాలతో సహా, బస వరకు అన్నీ నిర్వాహకులే (కాంట్రాక్టర్) సమకూరుస్తారు. ⇒ కల్యాణ మండపం విస్తీర్ణం, వచ్చే బంధుగణం, వారికి సమకూర్చే సంబారాలు, అలంకరణ, వస్తుసేవలను బట్టి నిర్వాహకులు ధర నిర్ణయిస్తారు. కనీసం రూ. లక్ష లేనిదే వివాహ వేడుక సాగే పరిస్థితులు తక్కువ. టీటీడీ కాటేజీల్లో కల్యాణాలు చేసుకోవచ్చు ⇒ టీటీడీకి సంబంధించిన శంకుమిట్ట కాటేజీ (ఎస్ఎంసీ) 6, ట్రావెల్స్ బంగ్లా కాటేజీ (టీబీసీ) 2 కల్యాణ మండపాలు ఉన్నాయి. రోజుకు రూ.200 చొప్పున అద్దె కింద కల్యాణ మండపం కేటాయిస్తుంటారు. విద్యుత్ చార్జీలకు అదనంగా చెల్లించాలి. ఇతర కాటేజీల్లో అనుమతి లేకుండా వివాహాలు చేయకూడదు. ⇒ ఆర్థిక స్థోమతను బట్టి కొందరు సాధారణంగా నిర్వహించుకుంటే, మరికొందరు భారీ ఎత్తున, హంగు ఆర్భాటాలతో ఘనంగా వేడుక చేసుకుంటుంటారు. కల్యాణమండపం, కాటేజీలు పొందటం ఎలా? ⇒ 90 రోజుల ముందు కల్యాణ మండపాల బుకింగ్ ప్రారంభిస్తారు. మండపాలు ఖాళీ ఉంటే రోజులతో సంబంధం లేకుండా కేటాయిస్తారు. ⇒ కల్యాణ మండపం అద్దెకింద రూ.200 చెల్లించాలి. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తిరుపతి, పేరుతో డీడీ చెల్లించాలి. ⇒ మండపం దరఖాస్తు సమయంలో పెళ్లినిశ్చయ పత్రిక, వరుడు, వధువు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వ్యక్తిగతంగా దరఖాస్తు చేయాలి. వారి ఆధార్ కార్డులు కూడా చూపాలి. ⇒ కల్యాణ మండపం మధ్యాహ్నం 3 నుండి మరుసటిరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కేటాయిస్తారు. మండపం ఖాళీ చేసే సమయంలో వినియోగించిన విద్యుత్ చార్జీలకు గానూ మీటరు రీడింగ్ ప్రకారం నగదు చెల్లించాలి. ⇒కల్యాణ మండపం పెళ్లి రసీదుతో రూ.300 టికెట్ల క్యూలైను ద్వారా వధూవరులతోపాటు ఆరుమందిని శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ⇒ టీటీడీ కల్యాణ మండపం రశీదుతో తిరుమలలో రిజిస్రేషన్ కార్యాలయం వద్ద వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిక్లరేషన్ ఇస్తే... హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోదలచిన ఇతర మతాల వారు కూడా తిరుమలలో వివాహం చేసుకునే సౌకర్యం టీటీడీ కల్పించింది. అయితే వారు ముందుగా ‘హిందూమతంపై విశ్వాసం ఉంది’’ అన్న డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వెంకన్న సాక్షిగా ఆలయం వద్దే పెళ్లి తంతు ⇒ ఆర్థిక పరిస్థితి, కుటుంబ కారణాలతో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండానే శ్రీవారి ఆలయ మహద్వారం, గొల్ల మండపం, అఖిలాండం వద్దకు పసుపుబట్టలతో వచ్చిన వధూవరులు పూలదండలు మార్చుకుంటారు. తర్వాత వరుడు, వధువు మెడలో మంగళసూత్రాన్ని కట్టడంతో వారి పెళ్లి వేడుక పూర్తైతుంది. తర్వాత కొత్త దంపతులు ఆలయ అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. నాడు కల్యాణమస్తుతో ఒక్కటైన 45,954 జంటలు ⇒ సనాతన హైందవ ధర్మాన్ని విస్తృతం చేయటమే ధార్మిక సంస్థ లక్ష్యంగా కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా హిందూ వివాహ వ్యవస్థకు టీటీడీ గట్టి పునాదులు వేసింది. ఆర్థిక భారంతో సతమతమవుతూ, పెళ్లివేడుకల పేరుతో పేద కుటుంబాలు ఆర్థికంగా మరింత కుంగిపోకూడదని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. ⇒ రాష్ట్రంలోని పేదల్ని వివాహ బంధంతో ఒక్కటి చేయాలని ధార్మిక సంస్థకు సూచన చేశారు. పేద కుటుంబాలు ఆర్థికంగా మరింత చతికిల పడకుండా అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో కల్యాణమస్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ⇒ 2007 ఫిబ్రవరి 22న ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (తెలంగాణా, కోస్తా, రాయలసీమ)లో మొత్తం ఆరు విడతల్లో 45,954 మంది జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ⇒ ఈ కల్యాణమస్తు ద్వారా బంగారు తాళిబొట్టు, వెండి మట్టెలు, కంకణాలు, వధూవరులకు నూతన వస్త్రాలు, పెళ్లి నిర్వహణకు అవసరమైన పూజా సామగ్రి, ధార్మిక గ్రంథాలను ఉచితంగా పంపిణీ చేశారు. పెళ్లికి హాజరైన వధూవరుల బంధువులకు విందు భోజనాన్ని కూడా ఉచితంగా సమకూర్చారు. తర్వాత కొత్తజంటతోపాటు వారి తల్లిదండ్రులు ఆరు మందికి ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం కల్పించారు. నిబంధనలు ఇవి... చట్టప్రకారం వధూవరులు మేజరై ఉండాలి. వారి వయసును నిర్ధారించే 10వ తరగతి మార్కుల జాబితా, ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపాలి. పెళ్లికి పెద్దల అంగీకారం ఉండాలి. వ్యక్తిగతంగా వధువు, వరుడి తల్లిదండ్రులు కూడా ఉండాలి. లేనివారు తగిన ఆధారాలను చూపించడంతోపాటు వారి కుటుంబ పెద్దలను వెంటబెట్టుకెళ్లాలి ఫొటోమెట్రిక్ పద్ధతిలో అందరూ వేలి ముద్రలు వేసి రిజిస్టర్ చేసుకున్నాకే పెళ్లి వేడుక నిర్వహిస్తారు. పెళ్లి తర్వాత ఎస్‌ఎంసీలోని 232 కాటేజీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివాహ రిజిస్టేషన్ సర్టిఫికెట్ కూడా పొందవచ్చు పౌరోహిత సంఘంలో సామూహిక పెళ్లి వేడుక నిర్వహించుకునేందుకు టీటీడీ కొత్తగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌక ర్యం కల్పించింది. ww.ttdsevaonline.com ద్వారా భక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు. - సహదేవ కేతారి, సాక్షి తిరుమల -
వరాలిచ్చే స్వామి వరుడైనాడు..
► సత్యదేవుని కల్యాణోత్సవాలు ప్రారంభం ► నూతన వధూవరులుగా స్వామి, అమ్మవారు ► ఛలోక్తులతో అలరించిన ఎదుర్కోలు ఉత్సవం ►నేటి రాత్రి 9.30 గంటల నుంచి కల్యాణ క్రతువు అన్నవరం: రత్నగిరి పెళ్లికళతో తుళ్లిపడుతోంది. ఎటు చూసినా పచ్చని తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపమాలికలతో శోభాయమానంగా భాసిస్తోంది. భక్తవరదుడు సత్యదేవుడు, ఆయన దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవిల దివ్య కల్యాణోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యూరుు. తొలిఘట్టం గా స్వామి, అమ్మవార్లను వధూవరులను చేశారు. సాయంత్రం 4 గంటలకు పెళ్లిపెద్దలు, క్షేత్రపాలకులు శ్రీసీతారాములు వెంటరాగా స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా మండపానికి తోడ్కొని వచ్చారు. ప్రత్యేకాసనాలపై సీతారాములను, వెండి సింహాసనంపై స్వామి, అమ్మవార్లను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ నాగేశ్వరరావు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామి, అమ్మవార్లను వధూవరులను చేసిన అనంతరం ముత్తయిదువలు పసుపు దంచారు. కాగా స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవాన్ని రాత్రి 7.30 గంటలకు శ్రీరాజా రామరాయ కళావేదికపై నిర్వహించారు. ప్రముఖ పండితుడు చిర్రావూరి శ్రీరామశర్మ, ఈఓ నాగేశ్వరరావు తదితరులు స్వామి తరఫున, అర్చక స్వాములు కొండవీటి సత్యనారాయణ, ఏసీ ఈరంకి జగన్నాథరావు తదితరులు అమ్మవారి తరఫున ఛలోక్తులతో వాదులాడుకోవడం అలరించింది. ఇదీ నేటి కల్యాణోత్సవ క్రమం.. మంగళవారం రాత్రి 9.30 గంటలకు కల్యాణోత్సవం ప్రా రంభమవుతుంది. స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున మంత్రులు, దేవస్థానం తరఫున ఈఓ, టీటీడీ తరఫున ఆ దేవస్థానం ప్రతినిధులు పట్టువస్త్రాలు, ముత్యాలు సమర్పిస్తారు. విఘ్నేశ్వరపూజ తదితర ఘట్టాల అనంతరం రాత్రి 11 గంటలకు స్వామి తరపున అర్చకస్వామి అమ్మవారి మెడలో మంగళసూత్రధారణ చేయడంతో కల్యాణక్రతువు ముగుస్తుంది. నేటి వైదిక కార్యక్రమాలు తెల్లవారుజామున 3.00 గంటలకు: సుప్రభాత సేవ, ఉదయం 8.00 గంటలకు: చతుర్వేదపారాయణ, 9.00 గంటలకు: అంకురార్పణ, ధ్వజారోహణం, కంకణధారణ, దీక్షావస్త్రధారణ, సాయంత్రం 6.30 గంటలకు: కొండదిగువన శ్రీస్వామి, అమ్మవార్లకు వెండి గరుడ వాహనంపై, శ్రీసీతారాములకు వెండి పల్లకీ మీద ఊరేగింపు, రాత్రి.9.30 గంటల నుంచి కొండపై స్వామి, అమ్మవార్ల దివ్య కల్యాణ మహోత్సవం. నేటి సాంస్కృతిక కార్యక్రమాలు రత్నగిరిపై శ్రీరాజా వేంకట రామారాయ కళామందిరంలో ఉదయం 7 నుంచి 8 గంటల వరకు: పెండ్యాల నాగేశ్వరరావు బృందం భజన, 8 నుంచి 9 గంటల వరకు ఎస్.నాగలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు: పోల్నాటి గోవిందరావు భక్తి ప్రవచనాలు, 6 నుంచి 9 గంటల వరకు: ఆకెళ్ల లక్ష్మీపద్మావతి బృందం కూచిపూడి నృత్యం, అనంతరం శ్రీఅన్నమాచార్య వాగ్గేయ వరదాయిని బృందం కోలాటం. -
కాలిఫోర్నియాలో నృసింహుని కల్యాణానికి రండి
సీఎం కేసీఆర్‌కు నిర్వాహకుల ఆహ్వానం సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో నిర్వహించనున్న లక్ష్మీ నర్సింహస్వామి కల్యాణోత్సవానికి విచ్చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును అమెరికాలోని సిద్ధివినాయక కల్చరల్ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్. ఉమాశంకర్ దీక్షిత్, సిఫీ డాట్‌కామ్ సంస్థ డెరైక్టర్ ఆనందరాజు ఆహ్వానించారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, యాదాద్రి ఈవో జ్యోతితో కలసి ఈ మేరకు వారు మంగళవారం సీఎంను కలసి ఆహ్వాన పత్రికను అందించారు. మంత్రి ఇంద్రకరణ్‌ను నిర్వాహకులు సచివాలయంలో అంతకుముందే కలసి ఉత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఆగస్టు 20 నుంచి 28 వరకు నిర్వహించనున్న లక్ష్మీ నర్సింహస్వామి కల్యాణోత్సవాల కోసం యాదాద్రి నుంచి దేవుని విగ్రహాలతోపాటు పది మంది అర్చకులను పంపేందుకు దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కాగా, మంగళవారం పుట్టినరోజు జరుపుకున్న మంత్రి ఇంద్రకరణ్‌కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బుధవారం పుట్టినరోజు జరుపుకోనున్న సీఎంకు...ఇంద్రకరణ్ ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఇల ‘వైకుంఠం’
ఘనంగా ఒంటిమిట్ట రామయ్య కల్యాణం పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్, సీఎం అపర అయోధ్య ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం గురువారం రాత్రి సాక్షాత్తూ వైకుంఠాన్ని తలపించింది. ప్రత్యేక వేదికపై రామయ్య, సీతమ్మలకు కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, సీఎం చంద్రబాబు కల్యాణానికి అతిథులుగా హాజరై ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. కడప కల్చరల్: అపర అయోధ్య ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం గురువారం రాత్రి సాక్షాత్తూ వైకుంఠాన్ని తలపించింది. కనుల పండువగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య, సీతమ్మలను వధూవరులుగా అలంకరించి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయం పక్కనే గల మైదానంలో పందిళ్లు, కన్నుల పండువగా కళ్యాణ వేదిక ఏర్పాటు చేశారు. ఆలయంలో ఎదుర్కోలు వేడుకలు నిర్వహించిన అనంతరం కళ్యాణ వేదికపైకి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చారు. తిరుమల-తిరుపతి వేద పాఠశాల నుంచి వచ్చిన వేదపండితుల బృందం కళ్యాణోత్సవ ఘట్టాలను నిర్వహించింది. గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు కల్యాణోత్సవానికి అతిథులుగా హాజరై ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. టీటీడీ ఈఓ సాంబశివరావు కళ్యాణ మూర్తులకు పట్టువస్త్రాలను అందజేశారు. ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతా ఒంటిమిట్టను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పారు. ఒంటిమిట్టలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మా ట్లాడుతూ ఒంటిమిట్టను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తిరుపతి, కాణిపాకం, ఒంటిమిట్ట, శ్రీకాళహస్తి సర్క్యూట్‌గా ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
ఘనంగా శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు
దాదర్, న్యూస్‌లైన్: ఆంధ్ర కళా సమితి ఆధ్వర్యంలో తూర్పు డోంబివలి పట్టణంలో ఆదివారం ‘శ్రీ వేంకటేశ్వర కల్యాణోత్సవాలు’ ఘనంగా జరిగాయి. సర్వేష్ సభా గృహ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి సమితి సభ్యులే కాక డోంబివలి శివారు ప్రాంతాలకు చెందిన భక్తులంతా తరలిరావడం ఒక విశేషం. ఉదయం 8 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవతోఉత్సావాలు ప్రారంభించారు. వేదికపై వెలసిన స్వామి వారికి, అమ్మవార్లకు పట్టు వస్త్రములు, బంగారు నగలు అలంకరించి విశ్వక్సేన ఆరాధనతో కల్యాణానికి నాంది పలికారు. వివాహంలోని ముఖ్య ఘట్టాలైన పుణ్యవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, పాద ప్రక్షాళనము, మధుపర్కం, కన్యాదానం, జీలకర్ర-బెల్లం, ముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర తంతులు కన్నులారా చూసిన భక్తు లు తన్మయంలో మునిగిపోయారు. ప్రాంగణమం తా ‘గోవింద’ నామస్మరణతో మార్మోగింది. కల్యాణ అనంతరం స్వామివారి పేరిట సామూహిక తులసి అర్చనలో భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన అర్చకులు శ్రీకాంతాచార్యులు, నరసింహా చార్యులు, గోపాలాచార్యు లు, శ్రీనివాసాచార్యులు, స్థానిక అర్చకులు మద్దూరు మల్లికార్జున శర్మ కళ్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఘనంగా ‘రథ యాత్ర’ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం పురస్కరించుకొని శనివారం సాయంత్రం పశ్చిమ డోంబి వలి ఆనంద్‌నగర్‌లో ఆదిత్య కుటీర్ నుంచి కల్యాణ మండపం వరకు పురవీధులలో జరిగిన రథ యాత్ర లో తెలుగు ప్రజలతోబాటు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణ మండపం చెంతకు రథ యాత్ర చేరగానే స్వామి వారికి, అమ్మవార్లకు ఘనంగా స్వాగతం పలికి ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా మొగల్తూరు పట్టణం అనిరుద్ధ భజన మండలికి చెందిన అనంతరపల్లి నాగమణి ఆధ్వర్యంలో పాతికమంది మహిళా సభ్యులు ప్రదర్శించిన కోలాటం, భజన గీతాలు కల్యాణోత్సవాలకు శోభనిచ్చాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన భక్తులందరికీ ఆంధ్ర కళా సమితి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డోంబివలి ఆంధ్రా బ్యాంక్ శాఖ సిబ్బంది ఇక్కడ ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసి తమ సేవలను వివరించారు.