కాలిఫోర్నియాలో నృసింహుని కల్యాణానికి రండి | come to us for lord nrasimha 's marriage invite to us telugu people | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో నృసింహుని కల్యాణానికి రండి

Published Wed, Feb 17 2016 4:04 AM | Last Updated on Wed, Jul 25 2018 2:52 PM

కాలిఫోర్నియాలో నృసింహుని కల్యాణానికి రండి - Sakshi

కాలిఫోర్నియాలో నృసింహుని కల్యాణానికి రండి

సీఎం కేసీఆర్‌కు నిర్వాహకుల ఆహ్వానం

 సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో నిర్వహించనున్న లక్ష్మీ నర్సింహస్వామి కల్యాణోత్సవానికి విచ్చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును అమెరికాలోని సిద్ధివినాయక కల్చరల్ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్. ఉమాశంకర్ దీక్షిత్, సిఫీ డాట్‌కామ్ సంస్థ డెరైక్టర్ ఆనందరాజు ఆహ్వానించారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, యాదాద్రి ఈవో జ్యోతితో కలసి ఈ మేరకు వారు మంగళవారం సీఎంను కలసి ఆహ్వాన పత్రికను అందించారు. మంత్రి ఇంద్రకరణ్‌ను నిర్వాహకులు సచివాలయంలో అంతకుముందే కలసి ఉత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఆగస్టు 20 నుంచి 28 వరకు నిర్వహించనున్న లక్ష్మీ నర్సింహస్వామి కల్యాణోత్సవాల కోసం యాదాద్రి నుంచి దేవుని విగ్రహాలతోపాటు పది మంది అర్చకులను పంపేందుకు దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కాగా, మంగళవారం పుట్టినరోజు జరుపుకున్న మంత్రి ఇంద్రకరణ్‌కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బుధవారం పుట్టినరోజు జరుపుకోనున్న సీఎంకు...ఇంద్రకరణ్ ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement