
నార్కట్‌పల్లి: నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టుపై కొలువైన పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభంగా నిర్వహించారు

ప్రభుత్వం తరఫున బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారి బొల్లంపల్లి కృష్ణ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కల్యాణాన్ని తిలకించారు. కల్యాణం అనంతరం భక్తులు స్వామి, అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పించారు

కల్యాణోత్సవంలో శివసత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో సుమారు 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

























