chervugattu
-
చెర్వుగట్టు అభివృద్ధికి కృషి
నార్కట్‌పల్లి : చెర్వుగట్టు దేవాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను త్వరలో తీసుకువచ్చి అన్ని వి«ధాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. గురువారం అమావాస్య సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విజయలక్ష్మి దంపతులు చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామి దేవాలయంలో నిద్ర చేశారు. శుక్రవారం ఉదయం దేవాలయంలో అభిషేక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ ఆశీర్వచనం చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం గట్టు కింద ఉన్న అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నార్కట్‌పల్లి– అద్దంకి రోడ్డులో ఉన్న యల్లారెడ్డిగూడెం నుంచి చెర్వుగట్టు వరకు డబుల్ రోడ్డు, దేవాలయ గట్టుపైకి డబుల్ ఘాట్ రోడ్డు, గట్టుపైన 10 రేకుల షెడ్లను, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మరుగుదొడ్ల ఏర్పాటులను విడతలుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులను దేవాలయానికి వాస్తు ప్రకారం చేపట్టనున్నట్లు తెలిపారు. దేవాలయంలో భక్తుల సౌకర్యం కోసం చేయాల్సిన అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఈఓ మనోహర్‌రెడ్డి మంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఉదయం మంత్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, కట్టంగూరు జెడ్పీటీసీ మాద యాదగిరి, దేవాలయ ఈఓ గుత్తా మనోహర్‌రెడ్డి, సర్పంచ్ మల్గ రమణ బాలకృష్ణ, యల్లారెడ్డిగూడెం ఎంపీటీసీ నల్ల అనిత వెంకన్న, సాగర్ల సైదులు, మేక వెంకట్‌రెడ్డి, ఈర్ల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. -
నేడు చేర్వుగట్టుకు దేవాదాయ శాఖ మంత్రి రాక
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలోని శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంలు గురువారం అమావ్యాస సందర్భంగా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు దేవాలయ ఈఓ గుంత మనోహర్‌రెడి ్డ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
చెర్వుగట్టు హుండీ లెక్కింపు
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాన హుండీలను బుధవారం లెక్కించారు. 20 రోజులకు గానూ ఆలయంలోని వివిధ హుండీల ద్వారా రూ. 14,60,653, అన్నదానం హుండీ ద్వారా రూ. 96,891ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆధికారి గుత్తా మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ లెక్కింపులో ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ , సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రామారావు, శేఖర్, కొండల్‌రెడ్డి, వి.శంకర్, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజయ్య పాల్గొన్నారు. -
చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో అగ్నిగుండాలు
చెరువుగట్టు : నల్లగొండ జిల్లాలోని చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం అగ్ని గుండాలు నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లు మంటపానికి విచ్చేశారు. అగ్నిగుండాల్లో నిప్పులపై నడిచేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ నిప్పులతో నడుస్తూ స్పృహ తప్పి పడిపోవడంతో తీవ్ర గాయలయ్యాయి. కాగా భక్తులతో చెరువుగట్టు పుణ్యక్షేత్రం జనసంద్రమైంది.