చెర్వుగట్టు అభివృద్ధికి కృషి | effort to the chervugattu development | Sakshi
Sakshi News home page

చెర్వుగట్టు అభివృద్ధికి కృషి

Published Fri, Sep 2 2016 11:13 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

చెర్వుగట్టు అభివృద్ధికి కృషి - Sakshi

చెర్వుగట్టు అభివృద్ధికి కృషి

నార్కట్‌పల్లి :    
చెర్వుగట్టు దేవాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను త్వరలో తీసుకువచ్చి అన్ని వి«ధాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. గురువారం అమావాస్య సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విజయలక్ష్మి దంపతులు చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామి దేవాలయంలో నిద్ర చేశారు. శుక్రవారం ఉదయం దేవాలయంలో అభిషేక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ ఆశీర్వచనం చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం గట్టు కింద ఉన్న అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నార్కట్‌పల్లి– అద్దంకి రోడ్డులో ఉన్న యల్లారెడ్డిగూడెం నుంచి చెర్వుగట్టు వరకు డబుల్‌ రోడ్డు, దేవాలయ గట్టుపైకి డబుల్‌ ఘాట్‌ రోడ్డు, గట్టుపైన 10 రేకుల షెడ్‌లను, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మరుగుదొడ్ల ఏర్పాటులను విడతలుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులను దేవాలయానికి వాస్తు ప్రకారం చేపట్టనున్నట్లు తెలిపారు. దేవాలయంలో భక్తుల సౌకర్యం కోసం చేయాల్సిన అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఈఓ మనోహర్‌రెడ్డి మంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఉదయం మంత్రి పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, కట్టంగూరు జెడ్పీటీసీ మాద యాదగిరి, దేవాలయ ఈఓ గుత్తా మనోహర్‌రెడ్డి, సర్పంచ్‌ మల్గ రమణ బాలకృష్ణ, యల్లారెడ్డిగూడెం ఎంపీటీసీ నల్ల అనిత వెంకన్న, సాగర్ల సైదులు, మేక వెంకట్‌రెడ్డి, ఈర్ల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement