Etala Rajendar
-
సీఎం రేవంత్‌కు ఎంపీ ఈటల హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్:సర్వేజన సుఖీనోభవ అన్నది తమ సిద్ధాంతమని,తమ సంస్థల పట్ల సీఎం రేవంత్ ద్వేషబావంతో ఉన్నారని బీజేపీ సీనియర్‌నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. మంగళవారం(అక్టోబర్22) ఈటల మీడియాతో మాట్లాడారు.‘కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదం పేరుతో మతోన్మాదులకు షెల్టర్ ఇస్తున్నారు.కాంగ్రెస్ పార్టీది నీచమైన కల్చర్. సీఎంను దించడానికి మత కల్లోలాలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటు. మర్రి చెన్నారెడ్డిని దించడానికి,కోట్ల విజయభాస్కర్ రెడ్డిని దించడానికి మతకల్లోల్లాలు సృష్టించారు.శవాల మీద రాజకీయాలు చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మతకల్లోలాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. గుడిపై దాడిచేసిన వారిని పట్టుకునే దమ్ములేక ఓట్ల రాజకీయం కోసం శాంతియుత ర్యాలీ చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. స్లీపర్ సెల్స్ ఉన్నాయని,రోహింగ్యాలు ఉన్నారని కేంద్రం హెచ్చరికలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నివారించలేకపోతోంది.టెర్రరిస్టులు ఎవరు ? రెచ్చగొట్టేవారు ఎవరు ? సంఘ విద్రోహ శక్తులు ఎవరో తేల్చాలి.హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో రేవంత్ విఫలమయ్యారు.శాంతిభద్రతల పరిరక్షణ కోసమే బీజేపీ పనిచేస్తోంది. హిందూ కార్యకర్తల అరెస్టులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్న.చేతులు ముడుచుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేము’అని ఈటల హెచ్చరించారు.ఇదీ చదవండి: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ -
సుందరీకరణ కాదు.. పునరుజ్జీవం!: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్:‘అధికారం కోల్పోయి నిస్పృహ, అసహనంతో మూసీ నది పునరుజ్జీవానికి కొంతమంది అడ్డుపడుతున్నారు. మూసీ సుందరీకరణ అనే డైలాగ్‌ను ప్రచారంలోకి తెచ్చారు. మేము అందాల కోసం పని చేయడం లేదు. అందాల భామలతో కలిసి పనిచేయడం లేదు. అలాంటి కొంతమంది.. మంత్రులు, ప్రజాప్రతినిధుల ముసుగులో పదేళ్లు రాష్ట్రాన్ని పట్టిపీడించి బందిపోటు దొంగలకంటే దుర్మార్గంగా పట్టపగలు దోపిడీ చేసి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మూసీ పునరుజ్జీవన ప్రయత్నాలపై విష ప్రచారంతో ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. మూసీ మురికిని మించి మెదడులో విషం నింపుకుని తెలంగాణ సమాజంపై దాడి చేస్తున్నారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం సచివాలయంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక్కొక్కరిని ఒప్పించి తరలిస్తాం ‘ఇది సుందరీకరణ కాదు.. దుబాయ్‌కి వెళ్లి నెత్తిమీద జుట్టును నాటు వేయించుకున్న విధానం కాదు. పునరుజ్జీవంతో మూసీని, మురికిలో కాలం వెళ్లదీస్తున్న ప్రజలను కాపాడి మంచి జీవనాన్ని ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, ప్రత్యామ్నాయ ఇళ్లను ఇవ్వాలనే ఆలోచన మాకు ఉంది. కానీ పేదరికం, కట్టుబానిసలు ఉండాలనే దొరలు, భూస్వాములు, జమీందారుల భావజాలం ఉన్నవారు దీనికి అడ్డుపడుతున్నారు. అక్కడి ప్రజల భవిష్యత్తుపై అపోహలు సృష్టిస్తున్నారు. నిజానికి 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించగల కార్యాచరణ ఇది. గత 10 నెలల పాటు అధికారులు 33 బృందాలుగా ఏర్పడి మూసీ దుర్గంధంలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న ప్రతి ఇంటికీ వెళ్లి వారి కష్టాలు, వివరాలను తెలుసుకున్నారు. వారిని ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై మేం ఆలోచన చేస్తున్నాం. అక్కడి సమస్యలు పరిష్కరించి ఒక్కొక్కరిని ఒప్పించి తరలిస్తాం..’ అని సీఎం స్పష్టం చేశారు. సెక్యూరిటీ లేకుండా వస్తా..మీరూ రండి ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్నసాగర్ భూసేకరణ కోసం వేములఘాట్ ప్రజలపై అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించి గుర్రాలతో తొక్కించినట్టుగా మేం చేయం. ఇక్కడికి వస్తావా? అక్కడికి వస్తావా? అని నన్ను అడుగుతున్నారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, గజ్వేల్‌లోని ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మకు నేను సెక్యూరిటీ లేకుండా వస్తా. బీఆర్ఎస్ నేతలూ రావాలి. రచ్చబండ నిర్వహించి పదేళ్లలో ఎన్ని దుర్మార్గాలు చేశారో ప్రజలను అడుగుదాం..’ అని రేవంత్ సవాల్ చేశారు. బఫర్ జోన్లో మరో 10 వేల గృహాలు ‘మూసీ గర్భంలో 1,690 ఇళ్లు ఉండగా వారికి దసరా పండుగ వేళ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు రూ.25 వేలు చొప్పున తోవ ఖర్చులకు ఇచ్చాం. అయితే హైడ్రా వస్తుంది..బుల్డోజర్లు పెడ్తున్నరు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూసీలో ప్రభుత్వం ఒక్క ఇల్లు కూలగొట్టలేదు. ఖాళీ చేసిన లబ్ధిదారులే తమ ఇళ్ల తలుపులు, కిటికీల కోసం కూలగొట్టుకున్నారు. అడ్డగోలుగా కట్టిన 10, 20 అంతస్తుల ఆకాశహర్మ్యాలను కూల్చడానికే బుల్డోజర్లు, హైడ్రా అవసరం. అయినా హైడ్రా ఏమైనా ఫామ్‌హౌస్‌లో నిద్రపోయే భూతమా? మీద పడడానికి? మరో 10 వేల ఇళ్లు బఫర్‌జోన్‌లో ఉన్నాయి వారికి ప్రత్యామ్నాయం కల్పించి, మంచి జీవితాలు ఇచ్చి మనస్సు గెలవాలని భావిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. అద్భుతాలు సృష్టించిన కంపెనీలతో కన్సార్టియం ‘ప్రపంచంలో అద్భుతాలను సృష్టించిన ఐదు కంపెనీలతో ఒక కన్సార్టియం ఏర్పాటు చేయించి రూ.141 కోట్లతో మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు డీపీఆర్ తయారీ బాధ్యతలను టెండర్ల ద్వారా అప్పగించాం. డీపీఆర్ తయారీతో పాటు అంచనా వ్యయం, నిధులు, పెట్టుబడులు, రుణాల సమీకరణకు సంబంధించి కన్సార్టియం సహకారం అందిస్తుంది. 18 నెలల్లో డీపీఆర్ తయారు చేస్తారు. ఆ తర్వాత నాలుగైదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఆరున్నరేళ్ల పాటు కన్సార్టియం సేవలందిస్తుంది. ఈ కన్సార్టియంలో భాగమైన ‘మీన్‌హార్ట్’ కంపెనీకే ప్రధాని మోదీ గుజరాత్లో సర్దార్ పటేల్ విగ్రహం కట్టే బాధ్యత అప్పగించారు. అలాగే రాష్ట్రంలో కేసీఆర్, రామేశ్వర్రావు తమ కులగురువు చినజీయర్‌స్వామితో కలిసి సమతామూర్తి విగ్రహాన్ని కట్టే బాధ్యత అప్పగించారు. గత ప్రభుత్వం ఉప్పల్‌లో మూసీపై రూ.30 కోట్లతో పనులు ప్రారంభించి రూ.6 కోట్లు ఖర్చు చేసినట్టు రికార్డుల్లో ఉంది. కానీ వర్షం వచ్చి చేసిన పనికొట్టుకుపోయిందని అంటున్నారు. ఈ వ్యవహారంలో లోపల వేయవచ్చు. చర్లపల్లి జైల్లో వేస్తే తిండిదండగ అని మేం చూసీచూడనట్టుగా ఉంటే వారికి అలుసుగా ఉంది..’ అని రేవంత్ అన్నారు. ‘మూసీ’పై అసెంబ్లీలో చర్చకు సిద్ధం ‘మూసీ ఒడ్డున ఖాళీ చేసిన ఇళ్లల్లో హరీశ్, కేటీఆర్, ఈటల రాజేందర్ మూడు నెలలు ఉంటే ఈ ప్రాజెక్టును ఆపేస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. ప్రజలు అక్కడ ఉండడం అద్భుతం అనుకుంటే మీరూ ఉండండి. పునరుజ్జీవాన్ని అడ్డుకోవడం మాత్రం దేశద్రోహం. మంచి ప్రాజెక్టుగా భావిస్తే ప్రజలను తరలించడానికి ఏం చేయాలో సూచనలు చేయండి. దీనిపై అసెంబ్లీలో చర్చకు కూడా సిద్ధం. ఇళ్లు, ఉద్యోగం, ఉపాధి, ప్లాట్, నష్టపరిహారం ఇద్దామా? చెప్పండి. అనుమానాలుంటే నివృత్తి చేస్తాం ప్రత్యేక కేసుగా ఎంపీలను ఎంక్లోజర్లో పెట్టి శాసనసభలో మాట్లాడించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అసద్, కిషన్, కేసీఆర్ తమ అనుమానాలను శనివారంలోగా ప్రశ్నల రూపంలో తెలియజేస్తే రాతపూర్వకంగా సమాధానమిస్తాం. రాజకీయ సమ్మతి కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం..’ అని సీఎం తెలిపారు. దామగుండాన్ని వ్యతిరేకించేవాళ్లు కసబ్ లాంటోళ్లు ‘దేశ భద్రత కోసం ఏర్పాటు చేసే దామగుండం నేవీ రాడార్ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడేవాళ్లు కసబ్‌లాంటి వాళ్లు. కేటీఆర్ కసబ్‌లాగా మాట్లాడితే ఎవడో వచ్చి ఇవ్వాల్సిన సమాధానం ఇస్తాడు. ఏటా రూ.500 కోట్ల లంచం వచ్చే బతుకమ్మ చీరలను నిలుపుదల చేస్తే కడుపు మండి ఆరోపణలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో వరద బాధితులకు రూ.10 వేలు చొప్పున గత ప్రభుత్వం చేసిన రూ.600 కోట్ల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ విచారణకు ఆదేశించాలా?..’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడటానికి ముందు.. ప్రస్తుతం మూసీ నది ఎలా ఉంది? పునరుజ్జీవం తర్వాత ఎలా ఉండబోతోంది తెలియజేస్తూ సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు. -
తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకంపై సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీసీ నేతకే బీజేపీ పగ్గాలు అంటూ ప్రచారం జరుగుతోంది. బీసీ కోటాల్లో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్య పోటీ నెలకొంది. సామాజిక వర్గాల ప్రకారం మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌కి కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో అదే సామాజికవర్గానికి చెందిన అర్వింద్‌కు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం లేదంటున్నాయి పార్టీ వర్గాలు.మరోవైపు, ఈసారి సంఘ్ పరివార్ క్షేత్రాల ప్రతినిధికి ఇవ్వాలనే వాదన ఉంది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావుకు కేటాయించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. లోకల్‌బాడీ ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష నియామకంపై ఢిల్లీ జాతీయ నాయకత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.ఇప్పటికే కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్రఅధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. దీంతో టికెట్ ఆశిస్తున్న రెడ్డి సామాజికవర్గానికి చెందిన డీకే అరుణకు ఇస్తారా? లేదా? అన్నది కూడా ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉండగా ఇద్దరు సీఎంలను ఢీకొట్టి గెలిచిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి సైతం అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇవ్వడంతో పార్టీ పగ్గాలు బీసీ నేతలకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త అధ్యక్షుడి నియామకం శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నెలాఖరులోగా ఈ టెన్షన్‌కు తెరపడే చాన్స్ ఉంది. -
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి, ఈటల..
-
రైతు కంట నీరు మంచిది కాదు..
-
జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొత్తనేతను నియమించాకే, రాష్ట్ర నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలున్నాయి. జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జేపీ.నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డిలను కేంద్ర కేబినెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అటు నడ్డాను, ఇటు కిషన్‌రెడ్డిని తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగించిన విషయం తెలిసిందే. ఇద్దరూ కేబినెట్లో ఉండటంతో వీరిస్థానంలో అధ్యక్ష బాధ్యతలు వేరే వారికి అప్పగించనున్నారు. కర్ణాటకతోపాటు రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఏపీ, తమిళనాడు, కేరళలలో బలపడాలని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నేతకే అవకాశం ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ, ఎమ్మెల్యేల్లో ఒకరి అవకాశం ఉంటుందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఓసీ సామాజికవర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీజేఎల్పీనేతగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీ సామాజికవర్గానికే చెందిన ఇస్తారని అంటున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఎజెండాతో బీజేపీ ప్రజల్లోకి వెళ్లింది. అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని హామీ కూడా ఇచ్చింది. త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థలు, ఆ తర్వాత వచ్చే ఏడాది ప్రారంభంలో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల్లో సతా చాటడం అత్యవసరంగా పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపుగా ఖరారైనట్టుగా పార్టీవర్గాల విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితుడైన నేతగా, బీసీలతోపాటు అన్నివర్గాల్లో గుర్తింపు ఉన్న వ్యక్తిగా, ఇరవై ఏళ్ల పాటు బీఆర్ఎస్లో నంబర్ –2గా, మంత్రిగా ఈటలకున్న అనుభవం బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతుందని పార్టీ నాయకత్వం గట్టిగా విశ్వసిస్తోంది. రాజకీయంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసినందున, సంస్థాగతంగా బలపడేలా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వచ్చేలా పార్టీని అన్నివిధాలా సంసిద్ధం చేసుకునేందుకు ఉపయోగపడే నేతలకే అధ్యక్ష పదవి దక్కుతుందదని భావిస్తున్నారు. అయితే రాష్ట్రపార్టీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న వారిలో ఎంపీలు అర్వింద్, డీకే.అరుణ, రఘునందన్‌రావు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, పార్టీ సీనియర్ నేతలు యెండల లక్ష్మీనారాయణ, కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌తోపాటు మరికొందరు ఉన్నారు. -
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌తో సమానంగా 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ మరింత బలపడే చర్యల్లో భాగంగా కేంద్ర కేబినెట్ కూర్పులో రాష్ట్రానికి ప్రాధాన్యత కలి్పస్తుందని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఇందులో భాగంగా రెడ్డి లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి కేంద్ర కేబినెట్ పదవితోపాటు ఓ మహిళ, ఓ బీసీ నేతకు కేంద్ర సహాయ మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డికి మరోసారి కేబినెట్ హోదా లభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.అయితే ఆయన్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా నియమించే అవకాశాలున్నాయనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది. వెంటనే జాతీయ స్థాయిలో అధ్యక్ష మార్పు జరపకపోతే ముందుగా కిషన్‌రెడ్డిని కేబినెట్లోకి తీసుకొని 6 నెలలు లేదా సంవత్సరం తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం ఢిల్లీలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటానని పేర్కొనడం ఈ చర్చకు ఊతమిస్తోంది.ఓసీ, మహిళా కోటాలో డీకే అరుణకు, పారీ్టపట్ల విధేయుడిగా రెండోసారి ఎంపీగా సీనియారిటీ దృష్ట్యా బండి సంజయ్, రాష్ట్రంలో దాదాపు పాతికేళ్లుగా రాజకీయవేత్తగా, మంత్రిగా ఉన్న సుదీర్ఘ అనుభవం దృష్ట్యా ఈటల రాజేందర్‌కు మంత్రి పదవులు దక్కుతాయని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే, ఉమ్మడి ఏపీలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక క్షేత్రస్థాయిలో బీజేపీ అంతగా బలపడలేదు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో పార్టీపరంగా ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం కూడా అంతంతగానే ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సత్సంబంధాలు, స్థానిక పరిచయాలున్న ఈటల రాజేందర్‌ను కేంద్ర మంత్రిగా కంటే కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసి పార్టీ బలోపేతానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తారనే చర్చ సాగుతోంది. -
ఎమ్మెల్యేగా ఓడి ఎంపీగా గెలిచి..
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుడిగా పోటీచేసి ఓటమి చవిచూశాక, మళ్లీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగి ఎంపీలుగా గెలిచి సంచలనం సృష్టించిన వారి సంఖ్య ఈ సారి పెరిగింది. తాజాగా ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో.. బీజేపీ నుంచి ఏకంగా నలుగురు ఎంపీలుగా గెలుపొందారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ల నుంచి పోటీ చేసి ఓడి, పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఈటల రాజేందర్, అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్‌రావు శాసనసభ ఎన్నికల్లో ఓడి మళ్లీ జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ నుంచి విజయం సాధించారు. అదేవిధంగా అప్పటికే సిట్టింగ్ ఎంపీలుగా ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అరి్వంద్ ఓటమి చెందాక పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి సంజయ్, నిజామాబాద్ నుంచి అరి్వంద్ ఎంపీలుగా గెలుపొంది సత్తా చాటారు. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి ఓడిన బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి మొదట కేంద్రహోంశాఖ సహాయ మంత్రి, ఆ తర్వాత కేంద్రమంత్రిగా ఆయన ప్రమోషన్ పొందారు. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి విజయం సాధించారు. ఇదే ఒరవడిలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిన కాంగ్రెస్‌నేత, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, ఆ వెంటనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. అదేవిధంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడి ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం రేవంత్‌రెడ్డి కేబినెట్లో ఆయన మంత్రిగా కొనసాగుతున్న సంగతి విదితమే. -
ఆ సీటు యమ హాట్.. బీజేపీలో ‘మల్కాజ్గిరి’ మంటలు
లోక్ సభ ఎన్నికల్లో ఆ సీటు యమ హాట్. దేశంలోనే దానిదొక ప్రత్యేక స్థానం. అక్కడ గెలిస్తే రాజయోగమే. అలాంటి లక్కీ సీట్ కోసం లీడర్ల పాట్లు అన్ని ఇన్నీ కావు. కేంద్రంలో అధికారంలో బీజేపీలో ఆ సీటు పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఈటలకే కన్ఫర్మ్ అయిందన్న ప్రచారంతో మిగిలిన ఆశావహులు రగిలిపోతున్నారు. నాన్ లోకల్ వద్దు.. లాంగ్ అండ్ లోకల్ లీడర్‌కే ఇవ్వాలంటూ స్థానిక ఆశావహులంతా ఏకమై నిరసన గళం వినిపిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద లోక్ సభ స్థానం మల్కాజ్గిరి. అన్ని పార్టీల కన్ను అటువైపు. అక్కడ గెలిస్తే మంత్రి లేదా ముఖ్యమంత్రి అవ్వొచ్చన లక్కీ థాట్స్ కూడా నేతలకు స్టార్ట్ అయ్యాయి. అలాంటి సీటుకు ఫుల్ డిమాండ్ ఉంది. దేశంలో ఊపు మీదున్న బీజేపీ నుంచి ఆ సీటుకున్న పోటీ అంతా ఇంత కాదు. మాజీ మంత్రి ఈటల, బీజేపీ జాతీయ నేత మురళిధర్ రావు, స్థానిక నేతలు వీరంద్రగౌడ్, కూన శ్రీశైలం గౌడ్, పన్నాల హరీశ్ రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి, మల్క కొమురయ్య వంటి నేతల రేసులో ఉన్నారు. మల్కాజ్ గిరి సీటు తనకే కన్ఫర్మ్ అయిందని ఈటల రాజేందర్ ధీమాతో ఉన్నారు. ఈ మేరకు అధిష్టానం నుంచి సంకేతాలు ఉన్నాయని కేడర్‌తో ఆయన ఏర్పాటు చేసిన బ్రేక్ పాస్ట్ మీటింగ్ బిజెపి మల్కాజ్ గిరిలో మంటలు రేపింది. మల్కాజ్గిరి సీటు తనకే కన్ఫర్మ్ అయిందని ఈటల ప్రచారంపై మిగిలిన ఆశావహులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ అసంతృప్తిని బాహటంగానే ప్రదర్శిస్తున్న నేతలు.. ఈటల వ్యవహారంపై అధిష్టానంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో గురువారం రాత్రి జరిగిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో మల్కాజ్‌గిరిని పెండింగ్‌లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మల్కాజ్ గిరి సీటు విషయంలో స్థానిక ఆశావహులు అంతా ఒక్కతాటిపైకి వచ్చారు. నాన్ లోకల్‌కు సీటు కేటాయిస్తే సహకరించేది లేదని తెగెసి చెబుతున్నారు. అతిపెద్ద నియోజకవర్గంలో పోటీ చేసేందుకు నేతలే లేరా అంటూ అసంతృప్త నేతలు క్వశ్చన్ చేస్తున్నారు. వీరంద్ర గౌడ్, కూన్ శ్రీశైలం గౌడ్, హరీశ్ రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి నేతలు అనుచరులు, కార్యకర్తలతో మల్కాజ్ గిరి సీటు వ్యవహారంపై భేటీ అయ్యారు. లోకల్ క్యాండిడేట్ ఎవరికి ఇచ్చినా ఓకే కానీ బయట నుంచి తీసుకొస్తే మాత్రం సహకరించేది లేదని పార్టీకి చెప్పాలని డిసైడ్ అయ్యారు. పార్టీని నమ్ముకొని ఎన్నో ఎళ్లుగా ఉన్న స్థానికులైన వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పన్నాల హరీశ్ రెడ్డి, వీరేంద్ర గౌడ్, కూన శ్రీశైలం గౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ టికెట్‌ను త్యాగం చేశారు. పార్లమెంట్ సీటు తనకే వస్తుందని భావించారు. మధ్యప్రదేశ్ ఇన్ చార్జీ మురళీధర్ రావు మల్కాజ్ గిరిలో మూడేండ్లుగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. చాడ సురేశ్ రెడ్డి సైతం సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అంతేకాకుండా ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా పార్లమెంట్ పరిధిలో డబ్బులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి టికెట్ ఈటలకు కన్ఫర్మ్ అయిందని ప్రచారం జరుగుతున్న తరుణంలో వీరితో పాటు బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ నిర్ణయం ఆధారంగా ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరి అధిష్టానం మల్కాజ్ గిరి టికెట్ ఎవరికి కేటాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వీరికి కాకుండా ఇతరులకు ఇస్తే వీరు ఆ నేతకు సహకరిస్తారా? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. -
నేను పార్టీ మారే వ్యక్తిని కాదు: ఈటల రాజేందర్
-
TS: కాంగ్రెస్‌లో చేరిక.. ఈటల క్లారిటీ
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో చేరనున్నారన్న వార్తలపై బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో తాను ప్రత్యేకంగా భేటీ కాలేదని తెలిపారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ నర్సింహరెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమంలో వారిద్దరితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోలను కొందరు ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చారు. మైనంపల్లి, పట్నంను రాజకీయాల కోసం కలవలేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఉన్నానని,పార్టీ మారుతున్నట్లు తనపై జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌లో చేరిన వెంటనే ఆ జెడ్పీచైర్‌పర్సన్‌పై బీఆర్ఎస్ -
గజ్వేల్ ఓటమితో ఇంకా కసి పెరిగింది: ఈటల రాజేందర్
సాక్షి, గజ్వేల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో ఓటమి.. తనలో ఇంకా కసి పెంచిందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆయన గురువారం గజ్వేల్ నియోజకవర్గం బీజేపీ ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈటల రాజేందర్ తన ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌లో డబ్బు, మద్యం పంపిణీ చేసి మాజీ సీఎం కేసీఆర్ గెలిచారని ఆరోపించారు. గజ్వేల్‌లో తక్కువ సమయంలోనే ఎక్కువ ఓట్లు సాధించానని తెలిపారు. గజ్వేల్‌లో నైతికంగా బీజేపీ గెలిచిందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజలను నమ్ముకున్న నాయకుడు కాదని మండిపడ్డారు. స్థానిక నేతలను భారీ మొత్తానికి కొని కేసీఆర్.. గజ్వేల్‌లో గెలిచారని ఆరోపించారు. విద్యార్థి దశ నుంచి ఇప్పటివరకు తనకు ఓటమి తెలియదని అన్నారు. గజ్వేల్‌లో ఓటమి తనలో ఇంకా కసి పెంచిందని రాజేందర్ తెలిపారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల టిక్కెట్ దక్కించుకున్న ఈటల రాజేందర్.. ఆ రెండు చోట్ల ఓడిపోవడం గమనార్హం. గజ్వేల్‌లో మాజీ సీఎం కేసీర్ చేతిలో ఓడిపోగా.. తనకు కంచుకోట లాంటి హుజురాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. చదవండి: ఉన్న వనరుల్నే వాడుకుంటాం : సీఎం రేవంత్ -
రెండు చోట్ల ఓడిన ఈటల రాజేందర్
-
ఈటల భూముల కోసమే రూ. 27 కోట్లు ఇచ్చా
భీమారం: బీజేపీ నేత ఈటల రాజేందర్ భూముల కోసమే రూ. 27 కోట్లు చెక్కుల రూపంలో ఇచ్చానని, ఆ భూముల వ్యవహారంలో తనకు నోటీసులు ఇచ్చిన ఐటీ అధికారులు... ఆయనకు ఎందుకు ఇవ్వలేదని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ గడ్డం వివేక్ ప్రశ్నించారు. బీజేపీలో ఉన్నాడనే ఉద్దేశంతోనే ఈటలకు నోటీసులు కూడా ఇవ్వడం లేదా అని నిలదీశారు. గురువారం మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివేక్... బీఆర్ఎస్తోపాటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీలో ఉన్నప్పుడు తనను సీతలా చూసిన ఆ పార్టీ నేతలు... కాంగ్రెస్‌లో చేరాక రావణుడిలా చూస్తున్నారన్నారు. చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెప్పి తనపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో హుజూరాబాద్, మునుగోడులో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తాను అహర్నిశలు కృషి చేశానని చెప్పారు. బాల్క సుమన్ ఫిర్యాదుతో ఐటీ అధికారులు 8 చోట్ల సోదాలు నిర్వహించి దాదాపు 12 గంటలపాటు తాను ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకున్నారని వివేక్ ఆరోపించారు. ఆ కంపెనీ నా మిత్రుడిదే... తాను నిజాయతీతో వ్యాపారం చేస్తున్నానని, ఇప్పటివరకు రూ. 10 వేల కోట్ల మేర పన్నులు చెల్లించా నని వివేక్ వివరించారు. 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఆర్థిక సాయం చేశానని, అలాంటిది తనపై దాడులు చేయించారన్నారు. కేసీ ఆర్కు దమ్ముంటే ఈ ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. తప్పుడు ఆరోపణలతో బీజేపీ, బీఆర్ఎస్ కలసి తనను అరెస్టు చేయాలని కుట్ర చేస్తున్నా యని వివేక్ ఆరోపించారు. రూ. 20 లక్షల కంపెనీ రూ. 200 కోట్ల మేర లావాదేవీలు చేసిందని అంటున్నారని, కానీ ఆ కంపెనీ తన మిత్రుడికి చెందినదని వివేక్ తెలిపారు. చట్ట నిబంధనల ప్రకారమే తాను ఆ కంపెనీని చూసుకుంటున్నానని చెప్పారు. ఇటీవలే ఆ కంపెనీ షేర్లు అమ్మితే రూ. 50 కోట్ల లాభం వచ్చిందని, అందులో రూ. 9 కోట్లను పన్నుగా చెల్లించామని వివేక్ వివరించారు. -
గజ్వేల్ లో బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఈటల
-
హుజురాబాద్‌లో బీజేపీకి మూడో స్థానమే : హరీశ్‌రావు
సాక్షి, హుజురాబాద్ : హుజురాబాద్‌లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉందని, బీజేపీ అయితే మూడో స్థానానికి పడిపోయిందని చెప్పారు. హుజురాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్. కౌశిక్ రెడ్డి అంటే ముఖ్యమంత్రికి చాలా ఇష్టం. కౌశిక్ రెడ్డి గెలిచిన తర్వాత సీఎం వద్దకు వెళ్లి నియోజకవర్గ కోసం నిధులు తీసుకొస్తాడు. ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఈటల గెలిచిన నియోజకవర్గంలో తట్టెడు మన్ను కూడా పోయలేదు. ఇక్కడి ప్రజలను పూర్తిగా విస్మరించాడు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ గెలిచినా తెలంగాణ మరోసారి అంధకారంలోకి వెళ్లిపోతుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 3వేల రూపాయలు అందిస్తాం. ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతాం. గ్యాస్ సిలిండర్‌ను కేవలం రూ. 400కు అందిస్తాం. కేసీఆర్ ధీమా ఇంటింటికి బీమా కింద రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఎవరైనా మరణిస్తే 5 లక్షలు ఇస్తాం. ఇదీ చదవండి..సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?: రేవంత్ సవాల్ హుజురాబాద్‌లో పేదలకిచ్చిన అసైన్ భూములన్నిటికీ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత పట్టాలు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఏది కావాలన్నా ఢిల్లీ దగ్గర మోకరిల్లాల్సిందే. మొన్న కర్ణాటక నుంచి డీకే శివకుమార్ వచ్చి అక్కడ రోజుకు 5 గంటల కరెంటు ఇస్తున్నాం అని చెప్పాడు. డీకేకు తెలంగాణలో 24 గంటల కరెంటు ఉన్నది అనే విషయం కూడా తెలియదు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ వస్తే మోటర్లు జీపులో వేసుకొని పోతారు. దొంగ రాత్రి కరెంటు వస్తుంది. కాంగ్రెసోళ్లు కర్ణాటకలో ఆరు నెలలు గడవకముందే ఇచ్చిన హామీలను ఎగ్గొడుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అని మాట్లాడారు. రైతుకు రైతుబంధు ఇవ్వడం దుభారా అవుతుందా.. అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చే రైతు బంధును బిచ్చమేస్తున్నాం అన్నాడు. రైతుబంధు తీసుకునే రైతులను బిచ్చగాళ్ళ తో పోలుస్తూ మాట్లాడటం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ప్రజల పరిస్థితి అధోగతి పాలవుతుంది’ అని హరీశ్ రావు హెచ్చరించారు. ఇదీ చూడండి.. మిషన్ తెలంగాణ -
కమలాన్ని ఆ ఇద్దరే ముంచారా..?
సాక్షి, హైదరాబాద్ : నాయకుల వల్ల పార్టీకి మేలు జరుగుతోందా? పార్టీ వల్ల నాయకులు లబ్ది పొందుతున్నారా? పార్టీకి ఇమేజ్ పెరిగితే లాభ పడేది ఎవరు? నాయకులకు పేరొస్తే ఎవరికి లాభం చేకూరుతుంది? ఇప్పుడు తెలంగాణ కమలం పార్టీలో ఇదే చర్చ జరుగుతోంది. ఇద్దరు నాయకుల వ్యవహారంపై హాట్ హాట్‌గా అంతర్గత చర్చలు సాగుతున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు? వారే ఎందుకు చర్చనీయాంశాలుగా మారారు? కాషాయసేనకు తెలంగాణ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఒకే జిల్లాకు చెందినవారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు ముఖ్యమైన బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బండి సంజయ్ రాజకీయ జీవితం అంతా బీజేపీలోనే కొనసాగుతోంది. ఈటల రాజేందర్ కొంతకాలం క్రితం గులాబీ పార్టీ నుంచి కాషాయ పార్టీలోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ను ధిక్కరించి కమలం పార్టీ తరపున మళ్ళీ హుజూరాబాద్నుంచి అసెంబ్లికి ఎన్నికయ్యారు. అయితే ఇద్దరి మధ్యా ఏర్పడిన విభేదాల అగాధం తెలంగాణ బీజేపీని ఓ కుదుపు కుదుపుతోంది. ఈటల వచ్చాకే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి బండి సంజయ్‌కు దూరమైందనే చర్చలు సాగుతున్నాయి. బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత పార్టీ డీలా పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆ ఎఫెక్ట్ ఇంకా పార్టీని వీడకపోగా..కాంగ్రెస్ ను కాదని సెకండ్ ప్లేస్ కు వచ్చి కారు పార్టీని ఢీకొట్టే స్థాయికి చేరిన కమలం పార్టీ..ఇప్పుడు మూడోస్థానంతో డీలా పడిపోవడంతో.. పార్టీలో అంతర్గతంగా ఈ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని అనుకుని కమలం బాట పట్టిన ఈటల.. గులాబీ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీని పరుగులు తీయిస్తున్న బండి సంజయ్ పై బాగానే ఫోకస్ చేశారు. ఈ క్రమంలో బండి వర్సెస్ ఈటల అన్నట్లుగా పార్టీలో వ్యవహారాలు మారాయి. ఇద్దరు నేతలు బాహాటంగానే ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకోవడం..ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్రస్థాయిలో కీలకంగా ఉన్న ఓ నేత అడ్వాంటేజ్ గా తీసుకోవడం వంటి పరిణామాలు కొన్ని జరిగాయి. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండికి అప్పటికే నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ వంటివాళ్ళతో పొసగకపోవడం వంటి ఎన్నో కారణాలు, సంఘటనలు అన్నీ కలిసి..బండిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించేలా చేశాయి. కొందరు నేతల మాట విన్న ఢిల్లీ పెద్దలు బండిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో...బీజేపీ గ్రాఫ్ మొత్తం వేగంగా పడిపోయింది. అయితే, ఈ మొత్తం వ్యవహారానికి ఈటల రాజేందర్ పార్టీలో చేరికే ప్రధాన కారణమనేవారూ కొందరు తయారయ్యారు. దీంతో ఈటల చేరిక ఇప్పుడు బీజేపీకి ప్లస్సా..?మైనస్సా..అనే చర్చకు తెరలేపింది. బండి సంజయ్ విషయానికొస్తే.. మూడుసార్లు కరీంనగర్లో కార్పోరేటర్ గా పనిచేసి.. రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా.. తిరిగి పుంజుకుని కరీంనగర్ నుంచే ఎంపీగా గెల్చారు. ఆ తర్వాత అనూహ్యంగా బీజేపీ పెద్దల ఆశీస్సులతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడయ్యారు. బండి సంజయ్ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేతబట్టినప్పటినుంచీ పరుగులు తీయించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కేడర్‌లో ఒక కొత్త జోష్ నింపారు. బండి సంజయ్ కంటే ముందు.. బండి సంజయ్ హయాంలో.. బండి సంజయ్ తర్వాత.. బీజేపీ ఎలా ఉందనే స్పష్టమైన గ్రాఫ్ ను జనం ముందు బండి ఉంచారు. బండి హయాంలో పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగిందనే టాక్ కమలం శ్రేణుల్లో తీసుకురాగలిగారు. ఉమ్మడి రాష్ట్రంలో గాని..తెలంగాణలో గాని ఎవరికీ రానంత క్రేజ్‌తో ఓ సక్సెస్ ఫుల్ రథసారధిగా పేరు తెచ్చుకున్నారు బండి సంజయ్. ఇదే సమయంలో పార్టీలో వచ్చిన ఈ పేరును కాపాడుకోవడంలో మాత్రం సంజయ్ వైఫల్యం చెందాడనేవారూ ఉన్నారు. అందరినీ కలుపుకోలేకపోవడం.. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మొద్దో క్లారిటీ లేకపోవడం.. చేయకూడనివి చేయడం, చేయాల్సినవి చేయకపోవడం.. మీడియా ముందు ఆచితూచి మాట్లాడాల్సిన చోట తప్పటడుగులు వేయడం వంటివన్నీ.. పార్టీలోని ఆయన అంతర్గత ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారాయి. అప్పటికే పార్టీ అంతర్గత ప్రథమ ప్రత్యర్థిగా తయారైన ఈటల రాజేందర్‌తో పాటు..బండి అంటే పడనివారంతా ఏకమై ఆయనపైకి తమ వద్ద ఉన్న అస్త్రాలను ఎక్కుపెట్టడంతో.. బండి పదవి ఊడిందనే టాక్ నడుస్తోంది. బండి సంజయ్ సారథిగా ఉన్నంతకాలం ఒక బూమ్ తో కనిపించిన బీజేపి ఎదుగుదల పాలపొంగులా పడిపోవడంతో.. ఇప్పుడు ఆ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఒక రాజకీయ పార్టీని బలోపేతం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కసారిగా పుంజుకోవడం అంటే అంత సులభంగా జరిగేది కూడా కాదు. కానీ, బండి సారథ్యంలో బలంగా తయారైన పార్టీని, అధికార బీఆర్ఎస్ ను ఢీకొట్టే పార్టీగా తయారైన పార్టీని.. అందరూ కలిసి నిండా ముంచేశారన్నది ఇప్పుడు వినిపించే టాక్. దీంతో ఈటల చేరిక.. సంజయ్ అధ్యక్ష పదివి నుంచి దిగిపోవడం.. రెండూ పార్టీకి మేలు కంటే నష్టాన్నే చేకూర్చాయనే చర్చోపచర్చలకు తెరలేచింది. మరిప్పుడు మునిగిపోతున్న బీజేపీ నావను.. తిరిగి గట్టెక్కించే అవకాశం అసలుందా...? మరి ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందమేనా..? లేక కీలక నేతలైన బండి, ఈటల వైరమే.. పుట్టి ముంచిందా అనే భిన్నరకాల విశ్లేషణలు జనం మధ్య జరుగుతున్నాయి. -
ఈటల ఎవరినీ ఎదగనివ్వలేదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఈటల రాజేందర్ ముదిరాజుల్లో ఎవరిని ఎదగనివ్వలేదని అందుకే బండ ప్రకాష్‌ను తీసుకొచ్చి పదవులిచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం టీటీడీపీ మాజీ చీఫ్ కాసాని ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్‌లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇప్పుడు ఈటల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారన్నారు. రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయని తెలిపారు. ముదిరాజ్ ల నుంచి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తరువాత ముదిరాజ్ లతో సమావేశం అవుతానన్నారు.బీఆర్ఎస్ హయాంలో వృత్తి పరంగా ముదిరాజ్ లకు న్యాయం జరిగిందన్నారు. -
వివేక్ దారిలోనే కొండా? ఆయన వెంటే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ బీజేపీ నేతలు ఒక్కరొక్కరుగా కాంగ్రెస్‌తో చేయి కలుపుతున్నారు. మొన్న రేవూరి ప్రకాశ్ రెడ్డి, నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తాజాగా వివేక్ వెంకటస్వామి పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లారు. వీరి దారిలోనే బీజేపీ సీనియర్ నేత, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా పయనించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు లిస్టుల్లో 53 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మూడో లిస్టు పై ఢిల్లీలో కసరత్తు చేస్తోంది. ఇదే పని మీద స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. జనసేన తో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించే సీట్లపైనా బీజేపీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు టాక్. ఈ పొత్తులో భాగంగా సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి సీటును జనసేనకు కేటాయిస్తారన్న లీకులు బయటికి వస్తున్నాయి. శేరిలింగంపల్లి సీటు విషయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. తన పార్లమెంటు నియోనజకవర్గం పరిధిలోకి వచ్చే సీటును జనసేనకు ఎలా ఇస్తారని, ఎప్పటినుంచో నియోజకవర్గంలో పనిచేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ కొడుకు రవియాదవ్ కే సీటు కేటాయించాలని కొండా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సీటును రవియాదవ్ కు ఇవ్వకపోతే తానూ బీజేపీకి రిజైన్ చేస్తానని పార్టీకి అల్టిమేటం ఇచ్చినట్టు సమాచారం. ఈ వ్యవహారం ఇలా ఉంటే కొండా పార్టీని వీడితే ఆయన బాటలోనే స్టేట్ బీజేపీ మరో టాప్ లీడర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా వెళ్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఈటల భార్య జమునా రెడ్డి కొండాకు దగ్గరి బంధువవుతారు. రాజకీయంగా వీళ్లంతా కలిసి నడిచే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. తాజా పరిణామాలతో స్టేట్ బీజేపీ నుంచి నెక్ట్స్ ఎవరు అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ఇదీ చదవండి: బీజేపీకి గడ్డం వివేక్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక -
శాసనసభ ఎన్నికల్లో రికార్డులే రికార్డులు..
తెలంగాణ మంత్రి టి.హరీశ్ రావు సిద్దిపేటలో పలు రికార్డులు సృష్టించారు. ఆయన మూడు ఉప ఎన్నికలతో సహా ఆరుసార్లు ఇంతవరకు గెలిచారు. ఈ సారి గెలిస్తే ఏడోసారి గెలిచినట్లవుతుంది. 2004లో బీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేటతో పాటు కరీంనగర్ నుంచి పోటీ చేసి రెండు చోట్ల గెలిచారు. ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రి అయి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తదుపరి జరిగిన ఉప ఎన్నికలో హరీష్ రావు విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయనకు తిరుగులేదు. 2018 ఎన్నికలలో హరీశ్‌రావు తెలంగాణలోనే అత్యధిక మెజార్టీ సాధించారు. ఆయనకు తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాసరెడ్డిపై 118669 ఓట్ల మెజార్టీ వచ్చింది. 2014లో ఆయనకు 93328 ఓట్ల ఆధిక్యత లభించింది. 2010 ఉప ఎన్నికలో ఆయనకు 95853 ఓట్ల మెజార్టీ లభించింది. 2009లో హరీష్ రావుకు 64677 ఓట్ల ఆధిక్యత, 2008 ఉప ఎన్నికలో 58935 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆయన 2004 లో జరిగిన ఉప ఎన్నికలో మాత్రం 24827 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఆ తర్వాత నాలుగుసార్లు ఏభై వేల మించి మెజార్టీ సాధించడం, అందులోను ఒకసారి లక్ష ఓట్ల ఆధిక్యతను అధిగమించడం ఒక రికార్డే అని చెప్పాలి. హరీష్ పై ఐదుసార్లు పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్ధులకు డిపాజిట్లు రాకపోవడం కూడా మరో విశేషం ►ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా తెలంగాణ శాసనసభ ఎన్నికలలో తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్నారు. ఆయన ఇంతవరకు ఏడుసార్లు విజయం సాధించారు. 2004 నుంచి ఇంతవరకు ఓడిపోకుండా గెలుస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వచ్చిన విబేధాల కారణంగా ఈటెల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ పక్షాన పోటీచేసి గెలవడం ఒక సంచలనం. ప్రస్తుతం పోటీచేస్తున్న నేతలలో ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత అత్యధిక సార్లు గెలిచిన నేతగా ఈటల ఉన్నారు. ఆయన మూడు ఉప ఎన్నికలలో కూడా గెలిచారు. 2004, 2008 ఉప ఎన్నికలలో కమలాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తదుపరి ఆ నియోజకవర్గం రద్దు కావడంతో హుజూరాబాద్ నుంచి 2009, 2010 ఉ.ఎ., 2014, 2018, 2021 ఉప ఎన్నికలో విజయకేతనం ఎగురవేశారు. ►తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కె.తారక రామారావు 2009లో తన రాజకీయ జీవితం ఆరంభించినప్పుడు శాసనసభ ఎన్నికలలో తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నారు. ఆ ఎన్నికలలో తెలంగాణలో అప్పటి టీఆర్ఎస్ తీవ్ర సంక్షోభానికి గురైంది. తెలుగుదేశం, సీపీఐ, సీపీఎంలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసుకుని పోటీ చేసినా కేవలం పది సీట్లలోనే టీఆర్ఎస్ గెలిచింది. ఆ క్రమంలో కేటీఆర్ కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కె.కె.మహేందర్ రెడ్డి నుంచి గట్టి పోటీని తట్టుకుని కేవలం 171 ఓట్ల ఆధిక్యతతోనే గెలిచారు. కాని ఆ తర్వాత మాతరం భారీ ఆధిక్యతలతో ఆయన గెలుస్తూ వస్తున్నారు. 2010 ఉప ఎన్నికలో 68220 ఓట్ల మెజార్టీ, 2014లో 53004 ఓట్లు, 2018లో 89009 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రాజకీయాలలో రాణిస్తున్నారు. ఇంతవరకు నాలుగుసార్లు ఆయన పోటీచేయగా, మూడు సార్లు ఆయనకు ప్రత్యర్ధిగా మహేందర్ రెడ్డే ఉన్నారు. -
19 ఏళ్ల తరువాత రెండు స్థానాలకు కరీంనగర్ నేత పోటీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అసెంబ్లీ బరిలో నిలిచే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలు ఉండగా.. తొమ్మిది స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. తొలిజాబితా అభ్యర్థులకు శనివారం రాత్రే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫోన్ చేసి పోటీకి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినా అధికారికంగా ప్రకటించేవరకూ ఈ విషయాన్ని ఎవరూ వెల్లడించలేదు. 2018 ఎన్నికలతో పోల్చితే నాయకుల విషయంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు స్థానాల్లో ప్రాతినిధ్యం కరవవడం.. లేదా పొత్తులతో సాగే చరిత్ర ఉన్న బీజేపీ తాజాగా బలోపేతమైంది. ప్రస్తుతం ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు, ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే, అలాగే మున్సిపల్ మాజీ చైర్పర్సన్, జెడ్పీటీసీ, మాజీ ఎమ్మెల్యే బరిలో ఉండటం గమనార్హం. పార్టీ ప్రకటించింది వీరినే.. ► కోరుట్లకు ధర్మపురి అరవింద్, జగిత్యాలకు భోగ శ్రావణి, ధర్మపురికి ఎస్.కుమార్, చొప్పదండికి బొడిగె శోభ, రామగుండంకు కందుల సంధ్యారాణి, సిరిసిల్లకు రాణీ రుద్రమదేవి, కరీంనగర్‌కు బండి సంజయ్, మానకొండూరుకు ఆరెపల్లి మోహన్, హుజూరాబాద్‌కు ఈటల రాజేందర్ పేర్లను పార్టీ ప్రకటించింది. ఈటల తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌తోపాటు ప్రస్తుతం సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి కూడా బరిలోకి దిగనుండటం విశేషం. జిల్లా చరిత్రలో కేసీఆర్ తరువాత రెండుసార్లు బరిలోకి దిగుతున్న ఏకై క నాయకుడు ఈటల కావడం గమనార్హం. 2004లో కరీంనగర్ ఎంపీ, సిద్దిపేట అసెంబ్లీకి పోటీ చేసిన కేసీఆర్.. రెండుచోట్లా విజయం సాధించారు. తరువాత సిద్దిపేట స్థానానికి రాజీనామా చేశారు. దాదాపు 19 ఏళ్ల తరువాత కరీంనగర్ నుంచి రెండుచోట్ల అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుండటం విశేషం. ముగ్గురు సీఎం అభ్యర్థులు ► బీసీ సీఎం నినాదంతో బీజేపీ ఈసారి ఎన్నికల బరిలోకి దిగే యోచనలో ఉంది. పార్టీలో బీసీ సీఎం అభ్యర్థి ప్రతిపాదన రాగానే.. ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల మధ్య పోటీ మొదలైంది. మరోవైపు తాను ఏమాత్రం తక్కువా..? అన్నట్లు కోరుట్ల అసెంబ్లీ నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రంగంలోకి దిగారు. ► బండి సంజయ్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గంగుల కమలాకర్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించారు. ఆ తరువాత రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టి బీజేపీకి ఊపు తెచ్చారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీని విజయతీరా లకు చేర్చారు. 8శాతం ఉన్న ఓటుబ్యాంకును అమాంతం పెంచారు. పార్టీ తరఫున బీసీ సీఎంగా తమ నాయకుడే ఉండాలని రాష్ట్రవ్యాప్తంగా సంజయ్ అనుచరులు కోరుకుంటున్నారు. ► తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ వేదికగా రాజకీయ ఆరంగేట్రం చేసిన ఈటల రాజేందర్ 2004, 2008, 2009, 2010, 2014, 2018, 2021లో వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, శాసనసభాపక్ష నేతగా పనిచేసిన అనుభవంతో రాజేందర్ సైతం పార్టీ సీఎం అభ్యర్థి అవుతారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ► ఎలాగైనా అసెంబ్లీ బరిలో ఉండాలన్న పట్టుదలతో కొంతకాలంగా ధర్మపురి అర్వింద్ కోరుట్లలో చాపకింద నీరులా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు కుమారుడు సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. సంజయ్ కొత్త అభ్యర్థి కావడం, తాను ఎంపీగా ఉన్న నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోనే కోరుట్ల ఉండటం, తన అమ్మమ్మ ఊరు కావడం, సొంత సామాజికవర్గం సహకారం తదితరాల లెక్కలతో అర్వింద్ ఈసారి కోరుట్లపై కన్నేశారు. బండి సంజయ్ జన్మదినం: 11–07–1971 విద్యార్హతలు: గ్రాడ్యుయేషన్ స్వగ్రామం: కరీంనగర్ అనుభవం: 2005, 2014లో కార్పొరేటర్, 2014, 2018 ఎమ్మెల్యే స్థానానికి పోటీ, 2019 ఎంపీగా విజయం. అదనపు సమాచారం: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి, ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శి సామాజిక వర్గం: మున్నూరుకాపు ఈటల రాజేందర్ జన్మదినం: 20–03–1964 విద్యార్హతలు: పీజీ (ఉస్మానియా) స్వగ్రామం: కమలాపూర్ (ప్రస్తుతం హన్మకొండ జిల్లా) అనుభవం: ఏడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రి, శాసనసభ పక్షనేత అదనపు సమాచారం: 2021లో బీజేపీలో చేరిక. చేరికల కమిటీ చైర్మన్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్. సామాజిక వర్గం: ముదిరాజ్ పోటీకి బండి, ఎస్.కుమార్ అనాసక్తి.. కేంద్రమంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతున్న క్రమంలో అసెంబ్లీకి పోటీ చేయాలని ఆదేశాలు రావడంపై బండి సంజయ్.. అసలు తనకు మాట మాత్రమైనా చెప్పకుండా ధర్మపురిలో పోటీ చేయాలని చెప్పడంపై ఎస్.కుమార్ అసంతృప్తితో ఉన్నారని సమాచారం. బొడిగె శోభ జన్మదినం: 1972 విద్యార్హతలు: పదవ తరగతి స్వగ్రామం: వెంకటేశ్వర్లపల్లె, సైదాపూర్ మండలం అనుభవం: 2001 శంకరపట్నం జెడ్పీటీసీ, 2014లో ఎమ్మెల్యే (బీఆర్ఎస్), 2018 ఎమ్మెల్యేగా ఓటమి. అదనపు సమాచారం: చొప్పదండి బీజేపీ ఇన్చార్జి సామాజికవర్గం: ఎస్సీ (మాదిగ) ధర్మపురి అర్వింద్ జన్మదినం: 25–08–1976 విద్యార్హతలు: ఎంఏ.పొలిటికల్ సైన్స్ స్వగ్రామం: నిజామాబాద్ అనుభవం: 2019 నిజామాబాద్ ఎంపీ, అదనపు సమాచారం: కేంద్ర వాణిజ్య స్టాండింగ్ కమిటీ సభ్యులు సామాజికవర్గం: మున్నూరుకాపు ఎస్.కుమార్ జన్మదినం: 10–10–1966 విద్యార్హతలు: ఎంసీజే, ఎల్ఎల్ఎం (ఉస్మానియా) స్వగ్రామం: గోదావరిఖని అనుభవం: రామగుండం మున్సిపాలిటీ చైర్మన్ 2004, 2009 ధర్మపురి ఎమ్మెల్యే స్థానానికి, 2019 పెద్దపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేసిన అనుభవం అదనపు సమాచారం: జర్నలిస్టుగా అనేక అవార్డులు, బీజేపీ జాతీయస్థాయిలో పలు పదవుల నిర్వహణ. సామాజికవర్గం: ఎస్సీ (మాల) ఆరెపల్లి మోహన్ జన్మదినం: 6–6–1955 విద్యార్హతలు:ఎంకామ్,ఎల్ఎల్బీ స్వగ్రామం: మానకొండూరు అనుభవం: సర్పంచి, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, విప్. 2009లో మానకొండూరు ఎమ్మె ల్యే, 2014, 2018లో అక్కడ నుంచే పరాజయం. అదనపు సమాచారం: 2019లో బీఆర్ఎస్లో చేరిక, టికెట్ ఆశించి భంగపడి కమలం గూటికి. సామాజికవర్గం: ఎస్సీ (మాదిగ) -
ముదిరాజ్‌ల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్: ముదిరాజ్‌ల ఆత్మగౌరవం దెబ్బతీసేవిధంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించలేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన ముదిరాజ్‌ల ఆత్మగౌరవసభలో ఈటల మాట్లాడుతూ జనాభానిష్పత్తి ప్రకారం ముదిరాజ్ లు 11 శాతం ఉన్నారని, పదకొండుమందికి ఎమ్మె ల్యేలుగా అవకాశం దక్కాలని, ఇరవై ఏళ్ల నుంచి ఇద్దరు లేక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. తెలంగాణలో బీసీలు 52 శాతం ఉంటే... 9 మంత్రి పదవులు రావాలని, కానీ మూడు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఒకశాతం జనాభా లేని జాతి నుంచి సీఎంతో పాటు నలుగురుæ మంత్రులు ఉన్నారన్నా రు. మేము ఈ రాష్ట్రానికి ఏటా రూ.20 వేల కోట్ల ఆదాయం ఇస్తున్నామని, కానీ మీరు చేపపిల్లల పేరిట రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నారని, చేపపిల్లలు కాదు నేరుగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓట్లు మావే సీట్లు మావే నినాదంతో బీసీలు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు ముదిరాజ్‌లకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్‌ల ఆత్మగౌరవ సభను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారని, మీటింగ్‌కు వెళితే ప్రభుత్వ పథకాలు రావని బెదిరించారని ఈటల ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అన్నింటిని ఎదుర్కొని ఆత్మగౌరవసభకు భారీగా తరలివచ్చారన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితం అందరికీ తెలుసని తాను ప్రజల మనిషినని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా, గుండాలు చంపుతామని బెదిరించినా వెనక్కి తగ్గలేదని, రాష్ట్రంలో అన్ని కులాల సమస్యలపై గొంతెత్తి పోరాడానని గుర్తు చేశారు. ముదిరాజ్‌లను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలని తాను ఎమ్మెల్యే అయిన మొదటిరోజు నుంచే కొట్లాడుతున్నానని, వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 జడ్చర్ల సభలో ముదిరాజ్‌లను బీసీడి నుంచి బీసీ ఏలోకి మారుస్తా అని చెప్పారని, అదే సభలో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ప్రకటించారన్నారు. అయితే బీసీ ఏ రిజర్వేషన్ ఒక్క సంవత్సరం మాత్రమే అమలైందని, మైనారిటీ వారు ఏడుగురు ఎమ్మెల్యేలుగా ఉన్నారని, సుప్రీంకోర్టుకు వెళ్లి వారు గెలిచారని, మనకు ఎవరు లేక పట్టించుకోవడం లేదని చెప్పారు. మేం వేరే రాష్ట్రం నుంచి వచ్చామా : నీలం మధు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏ పార్టీ అయినా మా ముదిరాజ్‌లను గుండెల్లో పెట్టుకొని ఎవరు ఎన్ని సీట్లు కేటాయిస్తారో, వారితోనే పొత్తు పెట్టుకొని వారితోనే ఉంటామని ముది రాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు నీలంమధు చెప్పారు. ఆరోజు తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఎలా పోరాడామో.. అదే ఆత్మగౌరవం ముదిరాజ్ జాతికి దక్కేలా పోరాడతామన్నా రు. బీసీల్లో 60 లక్షల మంది ఉన్న ముదిరా జ్లకు రాజకీయ గుర్తింపు లేదా..?మేము వేరే రాష్ట్రం నుంచి వచ్చామని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ముదిరాజ్‌లందరం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవ సభతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దద్దరిల్లింది. ఈటల రాజేందర్ ప్రసంగిస్తుండగా సభకు హాజరైన పలువురు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట శంకర్, పులుమేడ రాజు, చొప్పారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
TS Election 2023: కాంగ్రెస్, బీఆర్ఎస్.. మజ్లిస్ ఆత్మలే..! : మంత్రి కిషన్‌రెడ్డి
వరంగల్: భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే.. తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం 13 నెలల భీకర పోరాటం.. వేలాది మంది బలిదానాలతో వచ్చిందని, ఈ వాస్తవాలను నిజాం వారసుడు ఖాసీం రజ్వీకి చెందిన మజ్లిస్ పార్టీ కోసం నాడు కాంగ్రెస్.. నేడు బీఆర్ఎస్ సర్కార్ వక్రీకరిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఈరెండు పార్టీలు.. మజ్ల్లిస్ ఆత్మలేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ సమైక్యతా దినోత్సం పేరిట కేసీఆర్ సర్కారు తెలంగాణకు ఉన్న చరిత్ర కనుమరుగు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి బైక్ ర్యాలీగా పరకాల అమరధామం చేరుకున్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. పరకాల పశువుల సంతలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్యక్షత వహించగా.. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. భుక్తి కోసం.. స్వేచ్ఛా వాయువుల కోసం తుపాకులకు గుండెలను ఎదురుపెట్టి వేలాది మంది బలిదానాలతో 75 సంవత్సరాల తెలంగాణ విమోచన చరిత్రను దాచిపెట్టిన మొదటి ముద్దాయి కాంగ్రెస్ అన్నారు. అలాంటి పార్టీకి తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదన్నారు. కేసీఆర్ చదివిన 80 వేల పుస్తకాల్లో నాటి తెలంగాణ చరిత్ర గురించి లేదా అని ప్రశ్నించారు. చరిత్రకారులు విమోచన దినోత్సవం అంటారని.. తెలంగాణ సమైక్యత అనే వారంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే సోనియాగాంధీ కుటుంబం కోసమన్న ఆయన బీఆర్ఎస్కు ఓటు వేస్తే కేసీఆర్ కుటుంబం కోసమేనన్నారు. అదే బీజేపీకి ఓటు వేస్తే ప్రజల కోసం పార్టీ పని చేస్తుందన్నారు. ఆత్మగౌరవం ఉన్నోళ్లు.. బీఆర్ఎస్కు ఓటు వేయరు : ఈటల బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మగౌరవం ఉన్నవాళ్లు ఎవరూ బీఆర్ఎస్కు ఓటు వేయరని అన్నారు. కులమతాలకతీతంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని మహా భారతంలో ధర్మరాజు సిద్ధాంతంతో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎవరికి భయపడి అధికారికంగా నిర్వహించడం లేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. కేసీఆర్ సర్కార్ ఉద్దెర బేరం చేస్తుండగా.. బీజేపీ నగదు చెల్లించే పని చేస్తోందన్నారు. తనను ఓడించేందుకు ఉప ఎన్నికల్లో ఊరురా తిరిగిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఈసారి ఓడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమరధామం వద్ద స్వాతంత్య్ర సమరయోధులను, సాయుధ పోరాటంలో అసువులు బాసిన వారి వారసులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే గుండె విజయరామారావు, మార్తినేని ధర్మారావు, మొలుగూరి భిక్షపతి, జయపాల్, కొండేటి శ్రీధర్, చింతల రామచంద్రారెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్ పార్లమెంట్ ప్రబారీ మురళీధర్‌గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్ సిరంగి సంతోశ్‌కుమార్, రాష్ట్ర నాయకులు డాక్టర్ కాళీప్రసాద్‌రావు, దేవు సాంబయ్య, కాచం గురుప్రసాద్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, గుజ్జుల సత్యనారాయణరావు, కాచం గురుప్రసాద్, మార్త భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి నాయకులపై థర్డ్ డిగ్రీ అమానుషం.. పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని ప్రశ్నించి ఆందోళన చేసిన విద్యార్థులపై యూనివర్సిటీ అధికారులు కేసులు పెట్టి పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అమానుషం అని కిషన్‌రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో వీసీ, రిజిస్ట్రార్లను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల జేఏసీ చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని శుక్రవారం రాత్రి కిషన్‌రెడ్డి.. నాయకులతో కలిసి సందర్శించారు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించి సంఘీభావం తెలిపారు. టాస్క్‌ఫోర్స్ పోలీ సులతో కొట్టించిన ఘటనపై డీజీపీ దృష్టికి తీసుకెళ్తానని కిషన్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎంఎస్ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ తిరుపతి మాదిగ, బాధ్యులు కలిసి మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. -
గుడుంబా పోయి.. కేసీఆర్ బాటిల్ వచ్చింది: ఈటల
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో గుడుంబా సీసాలు పోయి.. కేసీఆర్ బాటిల్ వచ్చిందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట, కొల్లాపూర్ పట్టణాల్లో బుధవారం నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ స్థాయి బూత్ కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఏటా రూ.10,700 కోట్లున్న మద్యం ఆదాయం.. ఇప్పుడు రూ.45 వేల కోట్లకు చేరిందని ఆరోపించారు. మాజీ మంత్రి చిత్తరంజన్‌తో భేటీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత చిత్తరంజన్‌దాస్‌తో కల్వకుర్తిలోని ఆయన నివాసంలో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్తరంజన్ దాస్‌ను ఈటల బీజేపీలోకి ఆహ్వానించారు. కార్యక ర్తలు, అనుచరులతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని చిత్తరంజన్‌దాస్ ‘సాక్షి’కి తెలిపారు. ఇదీ చదవండి: నెలాఖరుకు బీజేపీ తొలి జాబితా? -
TS Election 2023: అధికారం ఎవరి సొత్తు కాదు! ఒక్క చాన్స్ ఇవ్వండి!
సంగారెడ్డి: జిల్లాతో బీజేపీకి అవినాభావ సంబంధం ఉందని, రెండు సార్లు మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇక్కడి ప్రజలు బీజేపీని గెలిపించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు సోమవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పార్టీ విజయ సంకల్ప సభలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని, ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ భూములను అమ్మిన డబ్బులతో జీతాలిచ్చే పరిస్థితికి చేరిందని విమర్శించారు. రానున్న 90 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని, కుటుంబం కోసం పనిచేసే పార్టీలను పక్కన బెట్టి, దేశం, రాష్ట్రం కోసం పనిచేసే బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్కు ఓటేస్తే కేసీఆర్ కుటుంబమే బాగుపడుతుందని, కాంగ్రెస్‌కు ఓటేస్తే సోనియా కుటుంబానికే మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ, ప్రధాని మోదీ దేశాన్ని విశ్వగురువుగా నిలుపుతున్నారన్నారు. సమర్థవంతమైన పాలనతో ప్రగతిపథంలో నడుతున్నారని కొనియాడారు. ఇంట్లో ఇద్దరికి పింఛన్: ఈటల రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుటుంబంలో ఇద్దరికి పింఛన్లు ఇస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. రైతుబంధు పథకం అర్హులైన రైతులు, కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామన్నారు. దళితబంధు వంటి పథకాన్ని కలెక్టర్లుకు కూడా ఇస్తామన్న కేసీఆర్ తీరును తప్పుబట్టారు. ఈ పథకాన్ని డబ్బులున్న వారికి ఇవ్వబోమని, నిరుపేద దళితులకే అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్కు ఓటమి తప్పలేదన్నారు. త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో బీసీల జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తామని తీర్మానం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ కేబినెట్లో బీసీలకు ప్రాధాన్యం లేదని, కేంద్ర మంత్రి వర్గంలో బీజేపీ వారికి పెద్దపీట వేసిందని వివరించారు. ఈ వర్గాలు పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నారు. పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్ పులిమామిడిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం.. ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారం ఎవరి సొత్తు కాదని, కొందరు నాయకులు గెలిచాక ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించుకుంటామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆ నాయకులు విజయ్‌పాల్‌రెడ్డి, నందీశ్వర్‌గౌడ్, రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, గోదావరి అంజిరెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.