
సాక్షి, కామారెడ్డి రూరల్/రామారెడ్డి: దేశంలో అత్యధికంగా మద్యం తాగే రాష్ట్రం తెలంగాణ అని.. గ్రామగ్రామాన బెల్టు షాపులు ఏర్పాటు చేసి తాగుబోతుల తెలంగాణగా మార్చారని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శాసనసభలో ప్రజా సమస్యలను చర్చిద్దామంటే ప్రభుత్వం మైకును కట్ చేసి తమ గొంతు నొక్కుతోందన్నారు. తెలంగాణ వస్తే విదేశాలకు వలసలు ఆగుతాయని ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పారని, అయితే అధికారంలోకి వచ్చాక గల్ఫ్ వలసలను అపలేకపోయారన్నారు.