
సాక్షి,హైదరాబాద్:సర్వేజన సుఖీనోభవ అన్నది తమ సిద్ధాంతమని,తమ సంస్థల పట్ల సీఎం రేవంత్ ద్వేషబావంతో ఉన్నారని బీజేపీ సీనియర్‌నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. మంగళవారం(అక్టోబర్22) ఈటల మీడియాతో మాట్లాడారు.
‘కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదం పేరుతో మతోన్మాదులకు షెల్టర్ ఇస్తున్నారు.కాంగ్రెస్ పార్టీది నీచమైన కల్చర్. సీఎంను దించడానికి మత కల్లోలాలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటు. మర్రి చెన్నారెడ్డిని దించడానికి,కోట్ల విజయభాస్కర్ రెడ్డిని దించడానికి మతకల్లోల్లాలు సృష్టించారు.శవాల మీద రాజకీయాలు చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మతకల్లోలాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. గుడిపై దాడిచేసిన వారిని పట్టుకునే దమ్ములేక ఓట్ల రాజకీయం కోసం శాంతియుత ర్యాలీ చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. స్లీపర్ సెల్స్ ఉన్నాయని,రోహింగ్యాలు ఉన్నారని కేంద్రం హెచ్చరికలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నివారించలేకపోతోంది.
టెర్రరిస్టులు ఎవరు ? రెచ్చగొట్టేవారు ఎవరు ? సంఘ విద్రోహ శక్తులు ఎవరో తేల్చాలి.హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో రేవంత్ విఫలమయ్యారు.శాంతిభద్రతల పరిరక్షణ కోసమే బీజేపీ పనిచేస్తోంది. హిందూ కార్యకర్తల అరెస్టులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్న.చేతులు ముడుచుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేము’అని ఈటల హెచ్చరించారు.
ఇదీ చదవండి: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment