కమలాపూర్: ’దమ్ముంటే హుజూరాబాద్‌లో కేసీఆరా, హరీశ్‌రావా? ఎవరు నిలబడతారో చెప్పండి. మీ పోలీసులను, అధికారులను, మంత్రులను, డబ్బులు, కొనుగోళ్లు ఆపి ప్రచారం చేయండి. మీరు గెలిస్తే రాజకీయాల నుంచి నేను శాశ్వతంగా తప్పుకుంటా. అదే నేను గెలిస్తే మీరు రాజీనామా చేస్తారా?’ అని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. కమలాపూర్‌లో సోమవారం జరిగిన చేరికల కార్యక్రమంలో ఈటల మాట్లాడారు.
తాను టీఆర్‌ఎస్ పార్టీలోకి రాకముందు తన ఆస్తి ఎంతో చెప్తానని, మీ ఆస్తి ఎంతో చెప్పగలవా కేసీఆర్? అని ఈటల ప్రశ్నిం చారు. ’నన్ను కుడి భుజం అన్నావు. తమ్ముడు అన్నావు. ఆనాడు గొప్పోన్ని. ఇప్పుడు దెయ్యాన్ని ఎట్లా అయ్యాను చెప్పగలవా కేసీఆర్’ అని ప్రశ్నిం చారు. తాను ఇక్కడ అభివృద్ధి చేయలేదని హరీశ్‌రావు అబద్ధాలు మాట్లాడుతున్నారని, హరీశ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు తన నియోజకవర్గంలో ఎన్ని నిధులు ఖర్చయ్యాయో బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఈటల సవాల్ విసిరారు. హరీశ్, తాను ఎన్నిసార్లు ఏడ్చినమో తేదీలతో సహా సమయం వచ్చినప్పుడు చెప్తానని, పదవుల కోసం పెదవులు మూసి సహచర ఉద్యమకారుని మీద పిచ్చికూతలు కూస్తే పలచబడి పోతావని హెచ్చ రించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment