హుజూరాబాద్: ‘హుజూరాబాద్ గడ్డ మీద న్యాయం గా, ధర్మంగా ఎన్నికలు జరిగితే కేసీఆర్ డిపాజిట్ పోవడం ఖాయమ’ని హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం జ మ్మికుంటలో నిర్వహించిన ఆరె క్షత్రీయుల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల మాట్లాడారు. ‘నేను ధర్మం తప్పను. న్యాయం వదలను. కన్నీళ్లు, కష్టం ఉన్నవాళ్ల దగ్గర ఉంటా’అని తెలిపారు. తాను మంచివాడిని కాకపోతే 18 ఏళ్లు ఎలా భరించారో కేసీఆర్ సమాధానం చెప్పాలి’అని అన్నారు.
పెన్షన్లు, రేషన్ కార్డులు, మహిళా సంఘాల పావలా వడ్డీ రుణాలు, గొర్రెలు, దళితబంధు.. ఇలా అన్నింటిని ఈటలను ఓడించేందుకు అమలు చేస్తున్నారని, ప్రగతి భవన్ లో కుట్రలకు ప్రణాళిక చేస్తే, హరీశ్‌రావు వాటిని అమలు చేస్తున్నారని, హరీశ్‌రావుపై ప్రజలకు గౌర వం పోయిందని అన్నారు. ‘ఒకడు పొట్టిగా ఉన్నానని.. ఇంకొకడు రెండు వేల ఎకరాలు ఉన్నాయని.. ఇంకోడు రెండు వందల ఎకరాలు ఉ న్నాయని.. మరొకరు నాకు నేనుగా నామీద దాడి చేసుకొని.. కాళ్ల కు, చేతులకు కట్లు కట్టుకొని ఓట్లు అడుక్కుంటానని విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం’అని ప్రశ్నించారు.
‘మీకు కూడా భార్య, తల్లి ఉంటుంది. 13, 14 తారీఖుల్లో దాడి చేయించుకుంటానని అంటున్నారు,, ఇప్పుడు టీఆర్‌ఎస్ నేతలపైనే తనకు అనుమానం వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.4,700 కోట్ల మేరకు జీవోలు కేవలం హుజూరాబాద్ ఎన్నిక కోసమే జారీ చేశారని తెలిపారు. అనంతరం జమ్మికుంటలో నిర్వహించిన కిసాన్‌మోర్చా సమావేశంలో ఈటల మాట్లాడారు. ‘ఒకడికి రూ.50 లక్షలు ఇచ్చి కరపత్రాలు కొట్టించి నాకు వ్యతిరేకంగా దళితవాడల్లో పంచిస్తున్నాడు. డబ్బులు తీసుకుని ప్రెస్‌మీట్లు పెట్టేవాళ్లు, కరపత్రాలు పంచేవాళ్లు హుజూరాబాద్‌కు కోకొల్లలుగా వచ్చారు’ అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment