huzarabad
-
బీఆర్ఎస్ కార్యకర్త పాడె మోసిన బండి సంజయ్
హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత నందగిరి మహేందర్‌రెడ్డి గురువారం గుండెపోటుతో మృతి చెందగా శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. మహేందర్‌రెడ్డి అంతిమయాత్రలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయనతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కూడా పాడె మోయడం గమనార్హం. మహేందర్‌రెడ్డి మృతదేహానికి రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ నివాళి అర్పించారు. -
బీజేపీకి కర్రుకాల్చి వాతపెట్టాలి
హుజూరాబాద్: ప్రభుత్వరంగ సంస్థలను అడ్డగోలుగా అమ్మేస్తోన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ఆ పార్టీ పాలనను గమనిస్తోన్న హుజూరాబాద్ ఓటర్లు ఈ ఉపఎన్నికలో కర్రుకాల్చి వాతపెట్టాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన 150మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ధరలు పెంచి ప్రజలకు వాతలు పెడుతుంటే రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛను వంటి పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. హుజూరాబాద్ అభివృద్ధి తమ బాధ్యతేనని, ఇక్కడి సమస్యలన్నింటినీ టీఆర్ఎస్ ప్రభుత్వమే పరిష్కరిస్తుందని హామీనిచ్చారు. ఏడేళ్లు మంత్రిగా ఉన్న ఈటల హుజూరాబాద్‌ను పట్టించుకోలేదని విమర్శించారు. హుజూరాబాద్‌కు నాలుగు వేలఇళ్లు మంజూరు చేస్తే..ఈటల ఒక్కటికూడా కట్టించలేకపోయారని మండిపడ్డారు. -
కేసీఆర్ డిపాజిట్ పోవడం ఖాయం: ఈటల
హుజూరాబాద్: ‘హుజూరాబాద్ గడ్డ మీద న్యాయం గా, ధర్మంగా ఎన్నికలు జరిగితే కేసీఆర్ డిపాజిట్ పోవడం ఖాయమ’ని హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం జ మ్మికుంటలో నిర్వహించిన ఆరె క్షత్రీయుల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల మాట్లాడారు. ‘నేను ధర్మం తప్పను. న్యాయం వదలను. కన్నీళ్లు, కష్టం ఉన్నవాళ్ల దగ్గర ఉంటా’అని తెలిపారు. తాను మంచివాడిని కాకపోతే 18 ఏళ్లు ఎలా భరించారో కేసీఆర్ సమాధానం చెప్పాలి’అని అన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, మహిళా సంఘాల పావలా వడ్డీ రుణాలు, గొర్రెలు, దళితబంధు.. ఇలా అన్నింటిని ఈటలను ఓడించేందుకు అమలు చేస్తున్నారని, ప్రగతి భవన్ లో కుట్రలకు ప్రణాళిక చేస్తే, హరీశ్‌రావు వాటిని అమలు చేస్తున్నారని, హరీశ్‌రావుపై ప్రజలకు గౌర వం పోయిందని అన్నారు. ‘ఒకడు పొట్టిగా ఉన్నానని.. ఇంకొకడు రెండు వేల ఎకరాలు ఉన్నాయని.. ఇంకోడు రెండు వందల ఎకరాలు ఉ న్నాయని.. మరొకరు నాకు నేనుగా నామీద దాడి చేసుకొని.. కాళ్ల కు, చేతులకు కట్లు కట్టుకొని ఓట్లు అడుక్కుంటానని విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం’అని ప్రశ్నించారు. ‘మీకు కూడా భార్య, తల్లి ఉంటుంది. 13, 14 తారీఖుల్లో దాడి చేయించుకుంటానని అంటున్నారు,, ఇప్పుడు టీఆర్ఎస్ నేతలపైనే తనకు అనుమానం వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.4,700 కోట్ల మేరకు జీవోలు కేవలం హుజూరాబాద్ ఎన్నిక కోసమే జారీ చేశారని తెలిపారు. అనంతరం జమ్మికుంటలో నిర్వహించిన కిసాన్‌మోర్చా సమావేశంలో ఈటల మాట్లాడారు. ‘ఒకడికి రూ.50 లక్షలు ఇచ్చి కరపత్రాలు కొట్టించి నాకు వ్యతిరేకంగా దళితవాడల్లో పంచిస్తున్నాడు. డబ్బులు తీసుకుని ప్రెస్మీట్లు పెట్టేవాళ్లు, కరపత్రాలు పంచేవాళ్లు హుజూరాబాద్‌కు కోకొల్లలుగా వచ్చారు’ అని ఆరోపించారు. -
టీఆర్ఎస్ ఓడిపోతే రాజీనామా చేస్తావా?
హుజూరాబాద్: ‘హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకవేళ ఆ పార్టీ ఓడిపోతే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా? కేసీఆర్‌కు దమ్ముంటే సమాధానమివ్వాలి’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. హుజూరాబాద్‌లో సైలెంట్ ఓటింగ్ జరగబోతోందని, బీజేపీ గెలుపును అడ్డుకోవడం ఇక ఎవరితరమూ కాదన్నారు. అసెంబ్లీలో ఇప్పటికే బీజేపీ తరఫున డబుల్ ‘ఆర్’(రాజాసింగ్, రఘునందన్‌రావు) ఉన్నారని, త్వరలో మరో ‘ఆర్’(రాజేందర్) అడుగు పెట్టబోతున్నారని జోస్యం చెప్పారు. ఇక నుంచి సీఎంకు అసెంబ్లీలో బీజేపీ ట్రిపుల్ ‘ఆర్’సినిమా చూపించబోతోందని వ్యాఖ్యానించారు. ఆదివారం హుజూరాబాద్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు. సంజయ్ మాట్లాడుతూ..కరెన్సీ నోట్లతో ఓట్లను కొనాలని టీఆర్ఎస్ పార్టీ చూస్తోందని, అయినా ఆపార్టీకి డిపాజిట్ కూడా దక్కదని పేర్కొన్నారు. బీజేపీకి ఓటేయాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. దళితబంధుకు షరతుల్లేకుండా రూ.10 లక్షలు ఇస్తున్నామని ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడేమో ఏవేవో షరతులు పెడుతున్నారని ఆరోపించారు. స్వీయమానసిక ధోరణి రుద్దుతున్నారు: ఈటల హుజూరాబాద్‌లో రాజ్యాంగాన్ని పక్కన పెట్టిన కేసీఆర్.. స్వీయ మానసిక ధోరణిని ప్రజలపై రుద్దుతున్నారని మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. 13, 14 తేదీల్లో తనపై తానే దాడి చేయించుకుంటానని ఓ మంత్రి, ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నారని, ఈటల బరిగీసి కొట్లాడుతడు తప్ప చిల్లర పనులు చేయడని స్పష్టం చేశారు. కంకణం కట్టుకుందాం.. కమలాన్ని గెలిపిద్దాం ప్రజా సంగ్రామయాత్ర తొలిదశ పూర్తయిన నేపథ్యంలో ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సతీసమేతంగా పూజలు నిర్వహించారు. తొలిదశ యాత్ర విజయవంతమైందన్నారు. కమలాన్ని గెలుపొందించాలని కంకణం కట్టుకుందాం అని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థిగా ‘ఈటల’ సాక్షి, న్యూఢిల్లీ: హుజూరాబాద్ ఉప ఎన్నికలో అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ను బీజేపీ అధి ష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి: హరీశ్
హుజూరాబాద్/కమలాపూర్: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పలువురు ఆ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘చేనేత కార్మికులు బీజేపీకి ఎందుకు ఓటేయాలో చెప్పాలి. ఏడేళ్లలో నేత కార్మికులకు బీజేపీ ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలి’అని హరీశ్ డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల కోసం ఏ ఒక్క పథకమైనా ఆ పార్టీ తెచ్చిందా.. అని ప్రశ్నించారు. ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డును బీజేపీ రద్దు చేయగా, నేతన్నకు టీఆర్ఎస్ చేయూతనందించిందని పేర్కొన్నారు. చేనేత కార్మికుల నోట్లో మట్టికొట్టిన పార్టీకి ఓటేయ్యొద్దని సూచించారు. మూణ్ణెళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన ఈటల రాజేందర్ ఇప్పుడు ఆ పార్టీకి ఎలా కొమ్ముగాస్తున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ ఉందని, గెల్లు శ్రీనివాస్ బ్రహ్మండంగా గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. బీజేపీ నాయకులు మోకాళ్ల మీద యాత్ర చేసినా ఈ విజయాన్ని ఆపలేరని ఎద్దేవా చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో ఆదివారం రాత్రి జరిగిన ధూంధాం కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ కమలాపూర్ గడ్డ.. టీఆర్ఎస్ అడ్డా అని, ఈటల రాజేందర్ టీఆర్ఎస్లోకి రాకముందే ఇక్కడ గులాబీ జెండా ఎగిరిందని, ఆయన పార్టీని వీడిపోయిన తర్వాత కూడా ఇక్కడ గులాబీ జెండానే ఎగురుతుందని అన్నారు. ఈటల తాను రాసుకున్న బురదను మనందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నాడని, తన బాధను మన బాధగా మార్చుకుని ఆగం కావద్దని, మనందరి బాధలు తీర్చే కేసీఆర్‌కు అండగా ఉండాలని హరీశ్‌రావు కోరారు. కాగా, ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చారు. గులాబీ గూటికి దాసరి భూమయ్య తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్, రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య మంత్రి హరీశ్‌రావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. రెండేళ్ల క్రితం పోలీసుశాఖలో ఉద్యోగ విరమణ పొందిన ఆయన మొదటగా కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం తీన్మార్ మల్లన్న టీమ్‌లో సభ్యుడిగా పనిచేశారు. తాజాగా తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భూమయ్య గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. -
రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు
హుజూరాబాద్/వీణవంక: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. గురువారం ఆయన హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేసిన తనమీదే అబద్ధపు ప్రచారం చేస్తున్నారని.. దొంగ లేఖలు సృష్టించారని అన్నారు. దళితబంధు అందరికీ ఇవ్వాలని తాను మరోసారి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇతర కులాలు, మతాల్లో ఉన్న పేదలందరికీ రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘దూప అయినప్పుడే బాయి తవ్వుకునే వాడివి నువ్వు కేసీఆర్.. ఎన్నికలప్పుడే నీకు ప్రజలు, అంబేడ్కర్ గుర్తుకు వస్తారు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 నెలలుగా హుజూరాబాద్ తప్ప ఇంకేమీ పట్టించుకోవడం లేదని.. వరదల గురించి అసలు మాట్లాడడం లేదని దుయ్యబట్టారు. ప్రగతి భవన్లో కూర్చొని ప్రజల కోసం పనిచేయకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్, ఆయన బిడ్డ, కొడుకు కూలి పనిచేసి, వ్యాపారం చేసి డబ్బులు సంపాదించలేదని, వారి అక్రమ సంపాదన తీసుకొని తనకే ఓటు వే యాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, బొడిగె శోభ పాల్గొన్నారు. అబద్ధపు లేఖ సృష్టించిన వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, దానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈటల ప్రశ్నించారు. -
ఈటల మాటలతో ప్రజల మనోభావాలకు దెబ్బ
హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాటలు హుజూరాబాద్ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘రాజేందర్‌కు టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అన్యాయం చేయలేదు. అన్ని విషయాల్లో అండగా నిలబడింది. సీఎం కేసీఆర్, రాజేందర్‌కు అనేక అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి తెచ్చారు’అని అన్నారు. ‘సీఎం శాలపల్లిని ఎన్నుకొని.. ఎన్నికలు లేకుండానే అక్కడ రైతుబంధు పథకం ప్రారంభించారు. ఆ సభలో సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్ నాకు తమ్ముడు, నా కుడి భుజం అని గొప్పగా చెప్పారు’అని గుర్తు చేశారు. ‘అలాంటి రాజేందర్.. సీఎంపై ఏం మాట్లాడుతున్నారు. కేసీఆర్ నీకు గోరి కడతా అన్నారు. నిన్ను ఈ స్థాయికి తెచ్చిన వ్యక్తిపై అంతటి మాట మాట్లాడితే ఇంక నీపై విశ్వాసం ఎలా ఉంటుంది’అని ప్రశ్నించారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు సీఎం కేసీఆర్, తాను తోడుగా ఉంటామని.. అభివృద్ధి చేసి చూపుతామని అన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి ఎక్కడైనా కోటి రూపాయల పని చేశారా అని ప్రశ్నించారు. గెల్లును గెలిపించి తనకూ హుజూరాబాద్ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నరేందర్, టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె.దామోదర్ పాల్గొన్నారు. -
కేసీఆర్ రైతుబాంధవుడు: హరీశ్
హుజూరాబాద్/గజ్వేల్: ‘రాష్ట్రానికి సీఎంగా ఉన్నా కేసీఆర్ వ్యవసాయం చేస్తున్నారు. అప్పట్లో కరువు మంత్రిగా, రవాణా మంత్రిగా, కేంద్రమంత్రిగా ఉన్నా వ్యవసాయాన్ని విడవని రైతు మన సీఎం కేసీఆర్. ఆయన రైతు గనుకనే రైతుల కష్టాలు తెలుసు. నీటితీరువా, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు, రైతుబీమా, రైతువేదికలు వంటివి ప్రవేశపెట్టిన రైతు బాంధవుడు కేసీఆర్. బీజేపీ మాత్రం రైతుల ఉసురు పోసుకుంటోంది’ అని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగిన విత్తనోత్పత్తి రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ కింద వారంలోపే రూ.50 వేల రుణాలను మిత్తి సహా చెల్లిస్తామని చెప్పారు. ఇక్కడ విత్తనోత్పత్తి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. చేనేతబీమా అమలు చేస్తాం రైతుబీమా తరహాలో చేనేత కార్మికులకు సైతం రూ. 5 లక్షల బీమాను అమలు చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహావిష్కరణ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నేతన్నల రుణమాఫీతోపాటు సబ్సిడీ ద్వారా ముడి సరుకులు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. -
కొడుకును సీఎం చేయడానికే నన్ను పక్కకు తోశారు: ఈటల
ఇల్లందకుంట / వీణవంక (హుజూరాబాద్): కొడుకు(కేటీఆర్)ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ కుట్ర పన్ని తనను పక్కకు తోశారని మాజీమంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలను వదిలిపోతానని, కేసీఆర్, హరీశ్‌రావు తమ పదవులకు రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లిలో ఈటల సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బీజేపీలో ఉన్నవారికి దళితబంధు ఇవ్వబోమని అంటున్నారంటా.. మిస్టర్ సీఎం.. తెలంగాణ నీ అబ్బ జాగీరు కాదు. చదవండి: బాబుగారు.. మీకో దండం! దూరమవుతున్న లీడర్లు తెలంగాణ డబ్బులకు ఓనర్లు ప్రజలే.. అడ్డగోలుగా మాట్లాడితే ప్రళయం సృష్టిస్తం.. జాగ్రత్త’అని హెచ్చరించారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు హుజూరాబాద్‌లో ఖర్చు చేసిన డబ్బులు కేసీఆర్ కుటుంబం కూలీకి పోయి సంపాందించినవా అని నిలదీశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వీణవంక మండలంలోని మల్లన్నపల్లిలో ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గొర్ల మందల మీద పిచ్చి కుక్కలు, తోడేళ్లు దాడి చేసినట్లు.. తాను ఏ పాపం చేశానని తనపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. చదవండి: జనసేనకు ‘గాజు గ్లాసు’ ఇక లేనట్టే. -
ఆరుసార్లు గెలిపిస్తే.. అవమానిస్తావా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆరుసార్లు గెలిపించిన హుజూరాబాద్ ప్రజలను ఈటల రాజేందర్ తన మాటలతో అవమానించాడని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం జమ్మికుంటలోని కొత్త వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనం సభలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, సతీశ్‌బాబు, రాసరి మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్‌లో రూ.కోటి వ్యయంతో చేపట్టిన రెడ్డి కమ్యూనిటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జమ్మికుంటలో ఈ సభ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన దాదాపు 20 వేల మంది సభకు హాజరయ్యారు. సభలో మంత్రి హరీశ్‌రావు ఈటల రాజేందర్‌పై నిప్పులు చెరిగారు. ఇంతకాలం టీఆర్ఎస్లో ఉండి ఇటీవల పార్టీ మారిన ఈటల రాజేందర్, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను విమర్శించడం ఏంటని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ హుజూరాబాద్ ప్రజలను అవమానించడమేనని స్పష్టంచేశారు. బీజేపీ పంచన చేరిన ఈటల, చేతనైతే తెలంగాణకు విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీలను తీసుకురావాలని సవాలు విసిరారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటును సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హరీశ్ హామీ ఇచ్చారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించి, కేసీఆర్‌కు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. రెడ్డిలకు డబుల్ బెడ్రూం ఇళ్లు: గెల్లు చిన్నప్పటి నుంచి తమ కుటుంబానికి రెడ్డి సామాజికవర్గంతో అనుబంధం ఉందని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తమ గ్రామంలో రెడ్డి సామాజికవర్గం నాయకుల సహకారంతోనే తన తల్లి సర్పంచ్‌గా గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. తనను మంత్రి నిరంజన్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. తాను గెలిస్తే పేద ఓసీలకు డబుల్ బెడ్రూంలు ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. కేసీఆర్‌ది రైతుసంక్షేమ ప్రభుత్వం: పోచారం సభకు ముఖ్యఅతిథిగా వచ్చిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఈ సభకు స్పీకర్ హోదాలో రాలేదని అన్నారు. కొంతకాలంగా తమ సామాజికవర్గంలో పేరు చివరన రెడ్డి అని పెట్టుకోకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిత్యం సామాజికసేవలో ముందుండే రెడ్లు తప్పకుండా పేర్లు పెట్టుకోవాల్సిందేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు లాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఈ పథకాలు లేవు: నిరంజన్‌రెడ్డి 45 లక్షల ఎకరాలకు నీరిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేళ్లలో పూర్తి చేయడం రైతులపై కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు, రైతువేదికలు తదితర రైతు సంక్షేమ పథకాలు గుజరాత్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మహిళలకు పెద్దపీట: సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతుల కష్టాలు తాము స్వయంగా చూశామని మంత్రి సబితారెడ్డి గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇస్తున్నారని, బాలికల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో మహిళలు రాణించాలని 50 శాతం రిజర్వేషన్ తెచ్చారని, నామినేటెడ్ పోస్టుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. -
పేదల నడ్డి విరుస్తోన్న బీజేపీ
ఇల్లందకుంట (హుజూరాబాద్): ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఇస్తున్న పింఛన్‌కన్నా మూడు రెట్లు ఎక్కువగా తెలంగాణలో ఇస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో గురువారం స్వయం సహాయక సంఘా లకు 3.14 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బీజేపీ పాలిత రాష్ట్రాలలో 2 వేల పెన్షన్ అమలు చేస్తున్నా రా అని ప్రశ్నించారు. పేదోడికి టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు రూపొందించి డబ్బులు ఇస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ మాత్రం ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. పన్నులు విధించే బీజేపీ వైపు ఉంటారా? ప్రజల అవసరాలు తీర్చే టీఆర్ఎస్ వైపు ఉంటారా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. ఇల్లందకుంట మండలంలోని 682 సహాయక సంఘాలకు 3.14 కోట్ల రుణాలు, స్త్రీనిధి కింద రూ.1.30 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. మండలంలోని 18 పంచాయతీలకుగాను 18 మహిళా సంఘ భవనాలకు 2.36 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నా రు. మండల సమాఖ్యకు మరో 70 లక్షలు కేటా యించి, నాలుగు నెలలలోపే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. 17 ఏళ్ళు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఒక్క సంఘ భవనం కూడా కట్టించలేదని, అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే నిరుపయోగమని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు పాల్గొన్నారు. -
పాలన పక్కన పెట్టి కుట్రలు
హుజూరాబాద్: ‘నా ముఖం అసెంబ్లీలో కనిపించవద్దని.. రాష్ట్రంలో పరిపాలన పక్కన పెట్టి, హుజూరాబాద్‌లో ఎలాగైనా గెలవాలని సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలను మంత్రి హరీశ్‌రావు అమలు చేస్తున్నారు’అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. గురువారం ఆయన హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ‘అన్ని కులాల బంధువులారా మీకు జీవోల రూపంలో కేసీఆర్ కత్తి ఇస్తున్నారు. ఆ కత్తితో పేదల గొంతుక అయిన ఈటల రాజేందర్‌ను పొడిచి చంపమని చెపుతున్నారు. నేను రాజీనామా చేసి 4 నెలల 22 రోజులు అయింది. అప్ప టి నుంచి హుజూరాబాద్‌లో వందల సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు మోహరించి, ప్రజాస్వా మ్యం అపహాస్యం అయ్యేలా పని చేస్తున్నారు’అని విమర్శించారు. కేసీఆర్‌కు కలలో కూడా హుజూరాబాదే కనిపిస్తోందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానిక నాయకులకు దావత్‌లు ఇచ్చి.. స్వయంగా వారే వడ్డిస్తున్నారని, మందు పోస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే నాయకుల కొనుగోళ్లకి రూ.200 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. ఇతర పార్టీల వారిని వేధించి, బెదిరించి టీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని, ప్రజాస్వామ్య వాదులు దీనిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని సంఘాలకు భవనాలు, గుడులు కట్టిస్తాం అని జీవోలు ఇస్తున్నారని.. శంకుస్థాపనలు చేస్తున్నారని, ఇవన్నీ ప్రజల మీద ప్రేమతో ఇవ్వడం లేదని, ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ‘దళితుల మీద ప్రేమతో దళితబంధు రాలే.. మీ ఓట్ల మీద ప్రేమతో వచ్చింది. నిజంగా ప్రేమ ఉంటే మొత్తం రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదు’అని ప్రశ్నించారు. రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్‌లో ఉందని.. ఆర్థిక మంత్రి దీనిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని అన్నారు. నిరుద్యోగుల చావులకు కారణమై వాళ్ల ఉసురు పోసుకుంటున్నారని.. ఉద్యోగాల మీద దృష్టి పెట్టకుండా హుజూరాబాద్ ఎన్నిక మీదనే ఫోకస్ చేశారని విమర్శించారు. పరాభవం తప్పదని అర్థమై, సీఎం కేసీఆర్ ఎన్నిక వాయిదా కోరారని ఆరోపించారు. భూములు అమ్మితే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని, ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ధ్వజమెత్తారు. హరీశ్ ఇక్కడ కుట్రలో భాగస్వామిగా మారి, ఆర్థిక శాఖ ఎటు పోయిందో పట్టించుకోవడం లేదన్నారు. ‘2 గుంటలున్న వ్యక్తికి.. 200 ఎకరాలు ఉన్న ఆసామికి జరుగుతున్న ఎన్నిక ఇది.. అంటున్నారు. మరి 2 గుంటలు ఉన్న వ్యక్తి ఇంత ఖర్చు ఎలా పెడుతున్నారో హరీశ్ సమాధానం చెప్పాలి’అని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. -
బండరాళ్లతో మోది.. ఆపై నిప్పంటించి..
ఇల్లందకుంట (హుజూరాబాద్): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని బండలతో దారుణం గా కొట్టి చంపి, ఆపై కిరాతకంగా మర్మావయవాలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు కారణం వివాహేతర సంబం ధమా, లేక రాజకీయ కక్షలా? అన్న అంశం చర్చనీయాం శంగా మారింది. విలాసాగర్ గ్రామానికి చెందిన సిరిశెట్టి సంతోష్ (40) అనే వ్యక్తిని ఆదివారం అర్ధరాత్రి తరువాత వెంకటేశ్వరపల్లి శివారులోని కెనాల్ వద్ద దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. మృతుడి భార్య కోమల కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లో మాట్లాడి బయటకు రమ్మని చెప్పారు. దీంతో బయటకు వెళ్లిన సంతోష్ తిరిగి రాలేదు. సోమవారం ఉదయం పంట పొలాల మ«ధ్య శవమై కనిపించాడు. హత్యపై అనుమానాలు..: సంతోష్ హత్యపై స్థానికులు వివిధ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యకు వివాహే తర సంబంధమే కారణమా..? లేక పాత కక్షలతో ఎవరైనా ఈ ఘాతుకానికి ఒడిగట్టారా అనే కోణంలో పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు. మరో పక్క మూడు రోజుల క్రితమే సంతోష్ రాజకీయంగా వేరే పార్టీలోకి మారడంతో దానికి సంబంధిం చిన కారణాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘ టన స్థలాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అను మానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీపీ చెప్పారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య కోమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామచంద్రరావు తెలిపారు. -
ప్రజల దృష్టిలో చిల్లర కావద్దు
హుజూరాబాద్: ‘మిస్టర్ హరీశ్‌రావు! నీతోపాటు 18 ఏళ్లు పనిచేశాను. నీలాగే నేను కూడా ఉద్యమకారుడినే. నేను ఏనాడైనా ముఖ్య మంత్రి కావాలనుకున్నానా? కేవ లం మనుషులుగా గుర్తించమని అడిగింది మనిద్దరమే కదా? నన్ను మంత్రి పదవి నుంచి తీసేసినప్పు డు దళితుల భూములు ఆక్రమించుకున్నారని చెప్పారు. ఇప్పుడేమో ఈటల రాజేందర్, ముఖ్యమంత్రి కుర్చీకే ఎసరు పెట్టారని ఇక్కడి మహిళలతో చెబుతున్నావు. హరీశ్‌రావు.. నాపై చేసిన ఆరోపణలు నిజమేనని గుండెలపై చేయి వేసుకుని చెప్పగలవా? ఇంత నీచమైన స్థాయికి ఎందుకు దిగజారిపోయావు మిత్రమా? ఇలాంటి నీచమైన పనులు చేసి తెలంగాణ ప్రజల దృష్టిలో చిల్లర కాకు’అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ హితవు పలికారు. సోమవారం హుజూరాబాద్‌లో వివిధ పార్టీలకు చెందిన పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈటల మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్‌లో డిపాజిట్ కోల్పో బోతోందని జోస్యం చెప్పారు. 2023కు హుజూరాబాద్ ఎన్నికలు రిహార్సల్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మారావు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ అహంకారాన్ని బొందపెడతారు: ఈటల
ముషీరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అహంకారానికి తన ధర్మానికి మధ్య నడుస్తున్న పోటీ అని హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కా లగర్భంలో కలసిపోతారని జోస్యం చెప్పారు. విద్యానగర్‌లోని బీసీభవన్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అ«ధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను శనివారం కలసిన అనంతరం ఈటల విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి, అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలవాలని అనుకుంటున్నారని, అయితే అక్కడి ప్రజలు చైతన్యవంతులని, కేసీఆర్ అహంకారాన్ని బొం దపెడతారని చెప్పారు. అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షే మ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, సూర్యారావు, ఉదయ్‌నేత పాల్గొన్నారు. -
సెంటిమెంట్ డైలాగులు కడుపు నింపవు
హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెబుతున్న సెంటిమెంట్ డైలాగులు కడుపు నింపవని, హుజూరాబాద్ ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్నే ఆశీర్వదించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం హుజూరాబాద్‌లోని రంగనాయకులగుట్ట వద్ద పాటిమీది ఆంజనేయస్వామి, జ్ఞాన సరస్వతీ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి పెద్దమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పెద్దమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషమని, దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని, వచ్చే ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేసుకుని బోనాలు సమర్పించుకుందామన్నారు. రూ.60 లక్షల నిధులతో బీటీ రోడ్డు వేయిస్తామని, చిలుకవాగు బ్రిడ్జి కోసం రూ.కోటి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, హుజూరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు వేల ఇండ్లు ఇచ్చినా గతంలో ఇక్కడ ఉన్న మంత్రి ఒక్క డబుల్ బెడ్రూం కూడా కట్టలేదని తెలిపారు. ఒక్క ఇల్లు కట్టని ఈటలకు ఓటు వేస్తే ఎలా అభివృద్ధి చేస్తాడని ప్రశ్నించారు. నిత్యావసర ధరలు పెంచి పేద ప్రజల మీద బీజేపీ భారం వేస్తోందని, ధర లు పెంచే బీజేపీ కావాలో.. పేదలను ఆదుకునే టీఆర్ఎస్ కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. ముదిరాజ్‌లపై సీఎం కేసీఆర్‌కు అపారమైన ప్రేమ ఉందని, అడిగిందే తడవుగా రూ.2 కోట్ల నిధులను పెద్దమ్మ తల్లి గుడితోపాటు బ్రిడ్జి, రోడ్డు పనుల కోసం కేటాయించారని తెలిపారు. -
హుజురాబాద్‌లో పోటీకి కేసీఆర్ సై అంటే.. బరిలోకి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోటీచేస్తే ఆయనకు పోటీగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి బరిలోకి దిగుతారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొరెడ్డి అయోధ్యరెడ్డి స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో దళితబంధు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్..ఆయన దత్తత గ్రామం వాసాలమర్రిలో సైతం ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కేసీఆర్ కలవగానే హుజూరాబాద్ ఉపఎన్నికలు వాయిదా పడ్డాయని, దీంతో ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి పోస్టు కూడా వాయిదా పడిపోయిందని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్లు కలసి లోపాయికారీగా పనిచేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మోదీని కలసి కేసీఆర్ అక్రమాలపై విచారణకు ఆదేశించేలా పట్టుబట్టాలని డిమాండ్ చేశారు. -
వరదలతో ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోరా!
జోగిపేట (అందోల్): రాష్ట్రవ్యాప్తంగా భారీ వరదల కారణంగా ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. బుధవారం ప్రజా సంగ్రామ యాత్ర సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని శివ్వంపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వరదలతో పంటలు నష్టపోతే రాష్ట్రంలో ఏడేళ్లలో ఏఒక్క రైతును ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. రైతులకిచ్చిన హామీలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, సీఎం కేసీఆర్ మీద అన్ని వర్గాల ప్రజలు కోపంతో ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో పంటలు పండించి కోట్లు సంపాదిస్తుంటే 50 ఎకరాలున్న రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. రైతులను సన్నరకం వడ్లు పండించాలని చెబుతూ కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్‌లో దొడ్డు రకం పండిస్తున్నారని ధ్వజమెత్తారు. వరదల్లో నష్టపోయిన రైతలకు పరిహారం చెల్లించాలన్నారు. యువతకు ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేశారని, జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తానని చెప్పి ఎక్కడా ఇవ్వలేదని అన్నారు. పండుగలకు పర్మిషన్ కావాలా? హిందువులు పండుగ చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి కావాలా? అని బండి సంజయ్ ప్రశ్నిం చారు. హిందువులు పండుగలు చేసుకోవాలంటే పోలీసుల అనుమతి కావాలనడం దుర్మార్గమని మండిపడ్డారు. వినాయక చవితి పండుగకు ఆంక్ష లు పెట్టొద్దని డీజీపీని హెచ్చరించారు. డ్రగ్స్ వాడుతున్న టీఆర్ఎస్ లీడర్లు టీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నాయకులు చాలా మంది మాదక ద్రవ్యాలు వాడుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి రక్త పరీక్షలు చేయిస్తామని బండి సంజయ్ అన్నారు. హుజురాబాద్ ప్రచారానికి అమిత్‌షా... శుక్రవారం వినాయక చవితి పండుగ సందర్భంగా, 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగసభ సందర్భంగా రెండురోజుల పాటు పాదయాత్రకు బండి సంజయ్ విరామం పాటించనున్నారు. అక్టోబర్ 2న బాసరలో తొలివిడత పాదయాత్రను ముగించాలని తొలుత భావించినా, ఈ నెల 17న అమిత్‌షా సభ నేపథ్యంలో హుజురాబాద్ వైపు దానిని మార్చాలని భావిస్తున్నారు. -
16,800 మందికి దళితబంధు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళితబంధు అమలులో తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. గతనెల 16న హుజూరాబాద్ మండలం శాలపల్లిలో నిర్వహించిన దళితబంధు సభ మొదలు ప్రభుత్వం ఈ పథకం అమలుకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తోంది. గత నెల 15 మందికి రూ.10 లక్షల చొప్పున అందజేసిన ప్రభుత్వం తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 16,800 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేసింది. అంటే.. మొత్తంగా రూ.1,680 కోట్ల నగదు వారి ఖాతాల్లోకి బదిలీ అయింది. ఈ మేరకు శనివారం ఉదయానికి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమయ్యాయి. ఇప్పటికే ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.2,000 కోట్లను కరీంనగర్ కలెక్టరుకు బదిలీ చేసింది. వాటినుంచి తొలి 15 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.10 లక్షల చొప్పున జమ చేశారు. వారిలో మోటారు వాహనాలపై ఆసక్తి చూపిన నాలుగు కుటుంబాలకు ఇప్పటికే వాహనాలను అందజేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. నియోజకవర్గంలో మొత్తం 20,900 దళిత కుటుంబాలు ఉన్నాయి. తాజాగా పూర్తయిన దళితబంధు సర్వేతో అదనంగా మరో మూడువేల కుటుంబాలు చేరడంతో ఈ సంఖ్య 23,183 చేరింది. వీరందరికీ ప్రాధాన్యతాక్రమంలో దళితబంధు పథకం వర్తింపజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. వాట్సాప్ గ్రూపు దళితుల జీవన స్థితిగతులను మార్చే ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకం 100 శాతం విజయవంతం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. అందుకే ఈ పథకం అమలు కోసం ప్రత్యేకంగా మండలానికి ఒక రిసోర్స్‌పర్సన్ (ఆర్పీ)ను నియమించింది. ఈ పథకం ద్వారా అందజేసే రూ.10 లక్షల నగదును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా వారికి మార్గనిర్దేశనం చేసే వ్యూహంలో భాగంగా దళిత విశ్రాంత ఉద్యోగులను రంగంలోకి దించుతున్నారు. దళితబంధు అమలుకు నియోజకవర్గాన్ని ఏడు యూనిట్లు (హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లందకుంట మండలాలు, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ)గా విభజించారు. ఈ ఏడు యూనిట్లలో ప్రతి యూనిట్‌కు ఐదుగురు విశ్రాంత ఉద్యోగులు పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా వారికి దిశానిర్దేశం చేస్తారు. ఇదే సమయంలో హుజూరాబాద్ గ్రామాల్లో ఆదర్శభావాలు కలిగి, సామాజిక చైతన్యం ఉన్న యువకులను ఏడు యూనిట్ల నుంచి ప్రతి గ్రామానికి 10 మంది చొప్పున ఎంపిక చేస్తారు. వీరికి వివిధ రంగాల్లో నిపుణులైన వారితో హైదరాబాద్‌లో ప్రత్యేక తరగతులు ఇప్పిస్తారు. ప్రతి మండలానికి బాధ్యులుగా ఉన్న ఐదుగురు విశ్రాంత దళిత ఉద్యోగులు, ప్రతీ గ్రామానికి 10 మంది యువకులతో ఓ వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేస్తారు. ఈ గ్రూపునకు ఆయా మండలాల రిసోర్స్ పర్సన్లు అడ్మిన్లుగా ఉంటారు. ప్రభుత్వ అధికారులు చేస్తున్న ప్రచారానికి అదనంగా వీరు కూడా పథకం ప్రయోజనాలను వివరించనున్నారు. -
ఎవరివైపు ఉంటారో ఆలోచించుకోండి: మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్న బీజేపీ వైపు ఉంటారో లేక ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్న సీఎం కేసీఆర్ వైపు ఉంటారో ఆలోచించుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆర్టీసీకి ఏటా రూ. 2 వేల కోట్లు ఇచ్చి సీఎం కేసీఆర్ కాపాడుతుంటే కేంద్రం మాత్రం రైల్వే, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను అమ్ముతోందని విమర్శించారు. శుక్రవారం హుజూరాబాద్‌లో రిటైర్డ్ ఉద్యోగుల కృతజ్ఞత సభలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ సీఎం మంచి వేతన సవరణ చేసినందుకు రిటైర్డ్ ఉద్యోగులు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారన్నారు. ‘మేము అమ్ముతున్నాం.. మీరు కూడా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మితే బహుమానాలు ఇస్తాం’అని కేంద్రం రాష్ట్రానికి లేఖ రాసిందని హరీశ్ చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యాదాద్రి, భద్రాద్రి లాంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలను నెలకొల్పి ఆస్తులు పెంచుతోందని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ రంగానికి మేలు చేసిందో చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. ఈటల గెలిస్తే ఆయనకే మేలు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ ప్రజలకు మేలు జరగాలని ఏమైనా రాజీనామా చేశారా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఉప ఎన్నికలో ఒకవేళ ఈటల గెలిస్తే వ్యక్తిగా ఆయనకు మేలు జరుగుతుందని, కానీ ఇది ప్రజలకు నష్టమేనన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు శక్తివంతులని, ఒక్కొక్కరూ వంద మందిని ప్రభావితం చేయగలరన్నా రు. సమావేశంలో మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, నాయకులు రాజయ్య, వి. హన్మంత్‌గౌడ్, విష్ణుదాస్ గోపాల్‌రావు, మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు. -
రూ. 5 వేల కోట్లు తెచ్చి ఓట్లు అడగండి
హుజూరాబాద్: బీజేపీ నాయకులు ఢిల్లీ వెళ్లి హుజూరాబాద్ అభివృద్ధికి రూ.5 వేల కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని, అప్పుడే ఓట్లు అడగాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తోంది టీఆర్ఎస్ సర్కారేనని తెలిపారు. అందుకే తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్, వీణవంక మండలం నర్సింగాపూర్‌కు చెందిన పలువురు యువకులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలనుంచి టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి హరీశ్‌రావు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ ఎంపీగా గెలిచి రెండున్నరేళ్లు అయిందని, వీణవంకలో రూ.10 లక్షల పనైనా చేశారా..? అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలో బీజేపీని గెలిపిస్తే లాభం ఏంటో చెప్పాలని, ఈటల గెలిస్తే వ్యక్తిగా ఆయనకు, బీజేపీకి లాభమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయం సాధిస్తే హుజూరాబాద్ ప్రజలకు లాభమని అన్నారు. ఇదిలా ఉండగా జమ్మికుంటలో కూడా మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలనుంచి దాదాపు 500 మంది నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరకముందే హుజూరాబాద్ ప్రాంతం గులాబీ అడ్డాగా ఉండేదని అన్నారు. టీఆర్ఎస్లోకి ఆయన ఒక్కరే వచ్చారని, ఇప్పుడు కూడా ఒక్కరే బయటకు వెళ్లిపోయారని పేర్కొన్నారు. -
రాష్ట్రంలో అంగన్వాడీలకు పెద్దపీట
హుజూరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవేతనం రూ.2,700 అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వేతనం రూ.10,950 అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చినా.. కేంద్రమే ఇస్తోందంటూ బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో పీఆర్సీ పెంపుపై కృతజ్ఞతసభ నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇచ్చేది టీఆర్ఎస్ సర్కారు అయితే.. చెప్పుకునేది బీజేపీ అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్లో అంగన్వాడీ టీచర్ జీతం, మన రాష్ట్రంలో ఆయాలకు ఇచ్చే మొత్తంతో సమానమని తెలిపారు. వారికి దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. ఒకప్పుడు జీతాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని ప్రగతిభవన్‌కు పిలిచి మరీ జీతాలు పెంచారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వారికి తగిన ప్రాధాన్యం ఇస్తోందని, అంగన్వాడీలకు ఏడేళ్లలో మూడుసార్లు వేతనం పెంచామని పేర్కొన్నారు. త్వరలోనే అంగన్వాడీలకు సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పించేలా ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే అంగన్వాడీల జీతాలు కూడా ప్రతినెలా మొదటివారంలో వచ్చేలా కృషి చేస్తామన్నారు. అంగన్వాడీలలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్నారు. ప్రజలకోసం పనిచేసే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు చేసేది ఉద్యోగం కాదని, సమాజ సేవ అని అన్నారు. వారికి ఎంత జీతం ఇచ్చినా తక్కువే అని గ్రహించిన సీఎం కేసీఆర్ తగిన వేతనాలు పెంచారని తెలిపారు. టీఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, టీఆర్ఎస్ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, కౌశిక్‌రెడ్డి, అంగన్వాడీ యూనియన్ నాయకురాళ్లు ఉషారాణి, జయ తదితరులు సభలో పాల్గొన్నారు. -
చిల్లర పనులు మానండి
హుజూరాబాద్: అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే వారిని అడ్డుకోలేరని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, మల్లన్నకు మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రశ్నించే గొంతును నొక్కివేయడం కేసీఆర్ ప్రభుత్వానికి అలవాటైందన్నారు. ఇలాంటి చిల్లర పనులు మానుకోవడం మంచిదని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. కాగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ లక్ష్యాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాల అమలు తీరుపై క్షేత్రస్థాయిలోని పరిస్థితులను అధ్యయనం చేయడమే లక్ష్యంగా సాగుతున్న బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ విజయవంతం కావాలని ఈటల ఆకాంక్షించారు. -
మీ రక్తం మాకొద్దు.. సీఎం కుర్చీ కావాలి
సాక్షి, హైదరాబాద్: దళితులకు సీఎం కేసీఆర్ రక్తం అవసరం లేదని, ఆయన కూర్చున్న సీఎం కుర్చీ కావాలని, ఆ కుర్చీ ఇస్తే తమను తామే అభివృద్ధి చేసుకుంటామని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యానిం చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు వారు రాసిన బహిరంగలేఖను శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. రాహుల్‌గాంధీకి టీఆర్ఎస్ నేతలు లేఖ రాయడం ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే అన్నట్టే ఉందని ఆ లేఖలో తెలిపారు. ఏడేళ్లుగా దళితులకు టీఆర్ఎస్ చేసిన మోసంపై, ఆ పార్టీ నేతలు వాడిన భాషపై రాహుల్ గాంధీ సమక్షంలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద ఈ ఏడేళ్లలో రూ.65 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా, వాటిని ఖర్చు పెట్టకుండా దళితులకు ద్రోహం చేశారని, కేసీఆర్‌కు నిజంగా దళితులపై ప్రేమ ఉంటే ఏకకాలంలో వారి అభివృద్ధి కోసం రూ.65 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం రూ.10 వేల కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడంతో పాటు అన్ని రకాల ప్రభుత్వ పదవులను అక్కడి వ్యక్తులకే కట్టబెట్టి మిగిలిన నియోజకవర్గాల నాయకులను మోసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి రుణాల కోసం 9 లక్షల మంది దళితులు దరఖాస్తు చేసుకుంటే కేవలం లక్ష మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని, మిగిలిన వారికి రక్తం ధారబోయాల్సిన పనిలేదని, లోన్లు ఇస్తే చాలని ఎద్దేవా చేశారు. -
అశ్విత్‌కు తగిన సాయం చేయండి
ఇల్లందకుంట (హుజూరాబాద్): జన్యుపరమైన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడు ఆకుల అశ్విత్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆరాతీశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని బిజిగిరిషరీఫ్‌కు చెందిన అశ్విత్ మృత్యువుతో పోరాడుతున్న విషయంపై ‘అప్పుడు అన్న.. ఇప్పుడు తండ్రిని కోల్పోయి’శీర్షికతో ఈ నెల 25న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. బాలుడి చికిత్సకు తగిన సాయం చేయాలని తన కార్యాలయ సిబ్బందికి సూచించారు. దీంతో పూర్తి వివరాలు తెలుసునేందుకు హైదరాబాద్ నుంచి మంత్రి సిబ్బంది అశ్విత్ కుటుంబ సభ్యులకు శుక్రవారం ఫోన్ చేశారు. కాగా, ‘సాక్షి’ కథనాన్ని కొందరు ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేయడంతో సాయం చేసేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. రెండ్రోజుల్లో రూ.1.85 లక్షలు విరాళంగా వచ్చాయి. అశ్విత్ పరిస్థితిని తెలుసుకున్న హైదరాబాద్ రెయిన్బో ఆస్పత్రి వైద్యులు బాలుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. అశ్విత్‌ను తమ ఆస్పత్రికి తీసుకురావాలని సూచించారు. శుక్రవారం బాలుడిని అక్కడికి తీసుకెళ్లడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. -
ఈటల అంటే ఏంటోకేసీఆర్కు అర్థమైంది: రాజేందర్
రూరల్: హుజూరాబాద్ నియోజకవర్గం లోని ప్రజలకు కేసీఆర్ ఎన్ని ఇస్తున్నా.. వారు ఈటల వెంట ఉన్నా రని దీంతో సీఎంకు ఈటల అంటే ఏంటో అర్థమైందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్ మండలం రాంపూర్‌లోని వడ్డెర కాలనీ వాసులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో పేదిరకం, కన్నీళ్లు ఇంకా పోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 18ఏళ్లు కేసీఆర్ అడుగు జాడల్లో నడిచినప్పుడు తమ్ముడు అని చెప్పి.. ఇప్పుడు దెయ్యం ఎలా అయ్యాడని ప్రశ్నించారు. అనంతరం పలువురు యువకులు బీజేపీలో చేరగా పార్టీ కండువా కప్పి ఈటల ఆహ్వానించారు. -
ఈటలకు ఓటమి భయం పట్టుకుంది
వీణవంక(హుజూరాబాద్): ‘‘ఈటల రాజేందర్‌కు ఓటమి భయం పట్టుకుంది, నేను నియోజకవర్గానికి వస్తే ఆయనకు అంత భయం ఎందుకు? పార్టీ ఆదేశిస్తే ఎక్కడికైనా వెళ్లి పనిచేస్తాను. ఈటల టీఆర్ఎస్ పార్టీలోకి మధ్యలోనే వచ్చిండు..మధ్యలోనే పోయిండు’’అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం దేశాయిపల్లి క్రాస్‌లో గురువారం టీఆర్ఎస్ కార్యకర్తలు, సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. నాడు కేసీఆర్ ప్రజలకోసం రాజీనామా చేశారని, మరి ఈటల ఎవరికోసం ఎందుకోసం రాజీనామా చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. రైల్వేలు, రోడ్లను అమ్మి వ్యవస్థను, ప్రభుత్వ ఆస్తులను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. హుజురాబాద్ టీఆర్ఎస్ అడ్డా.. 2001లోనే అప్పటి కమలాపూర్ నియోజకవర్గంలో పార్టీ ఎంపీపీలు..జెడ్పీటీసీలు గెలిచిన చరిత్ర ఉందని, అప్పటికి ఈటల టీఆర్ఎస్ పార్టీలో చేరలేదని హరీశ్‌రావు గుర్తుచేశారు. హుజూరాబాద్ గులాబీ జెండా అడ్డా అని, పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమ కారుడు, పేదింటి బిడ్డ అయిన శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ విజయ, పాడి కౌశిక్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు. -
హుజూరాబాద్.. నాలుగు ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో రాష్ట్రస్థాయిలో పలు అభిప్రాయాలు వచ్చినందున అభ్యర్థి ఎంపిక వ్యవహారాన్ని అధిష్టానం కోర్టులోకి నెట్టింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ నాలుగురోజుల పాటు రాష్ట్రంలో ఉన్నా అభ్యర్థి ఖరారు కాకపోవడంతో దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ నాలుగు పేర్లను అధిష్టానం పరిశీలనకు పంపినట్టు తెలుస్తోంది. ఇందులో మాజీ మంత్రి కొండాసురేఖ పేరు మొదటి వరుసలో ఉండగా, ఆ తర్వాత కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, స్థానిక నేతలు పత్తి కృష్ణారెడ్డి, తిప్పారపు సంపత్ పేర్లు ఉన్నాయి. సురేఖ పేరు ఖరారైనా... వాస్తవానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ పేరు దాదాపు ఖరారైంది. ఈనెల 18న రావిర్యాలలో జరిగిన సభలో ఆమె పేరును ప్రకటిస్తారని, మరుసటి రోజున సురేఖ పుట్టినరోజు వేడుకలను హుజూరాబాద్ కేంద్రంగా జరుపుకుంటారనే చర్చ జరిగింది. కానీ, అలా జరగలేదు. ఇందుకు స్థానిక అభ్యర్థిని పోటీలో ఉంచాలనే డిమాండ్ గట్టిగా వినిపించడమే కారణమని తెలుస్తోంది. మహిళతోపాటు నియోజకవర్గంలో పెద్దసంఖ్యలోనే ఉన్న మున్నూరుకాపు, పద్మశాలీ ఓట్లు పడతాయనే కోణంలో సురేఖ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పటికీ ఆ తర్వాత పార్టీలో పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ అభ్యర్థి అయితే మహిళాస్త్రం ఉపయోగపడుతుందని, కానీ, బీజేపీ తమ అభ్యర్థిగా రాజేందర్ సతీమణి జమునను ఖరారు చేస్తే సురేఖ ఎంపిక టీఆర్ఎస్కు మేలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతోపాటు ముగ్గురూ బీసీ అభ్యర్థులే అయితే ఇతర వర్గాల ఓట్లను టీఆర్ఎస్ సులువుగా మేనేజ్ చేయగలుగుతుందనే వాదన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీలు బీసీ అభ్యర్థిని దింపుతున్నందున కాంగ్రెస్ పక్షాన ఎస్సీ అభ్యర్థిని నిలపాలని, అప్పుడు దళితబంధు ఓట్లను కూడా గంపగుత్తగా టీఆర్ఎస్కు పడకుండా అడ్డుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పేరు పరిశీలనకు వచ్చింది. ఈయనకు తోడు స్థానిక నేతలు పత్తి కృష్ణారెడ్డి, తిప్పారపు సంపత్‌లతో పాటు పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు కొమురయ్య అభ్యర్థిత్వాలపై కూడా దామోదర రాజనర్సింహతో మాణిక్యం ఠాగూర్ చర్చించినట్టు తెలిసింది. వీరిలో సురేఖ, సత్యనారాయణలలో ఒకరిని హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం రెండు, మూడు రోజుల్లోపు ప్రకటిస్తుందని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. -
ప్రభుత్వ డబ్బులతో కేసీఆర్ పార్టీ ప్రచారం: ఈటల
ఇల్లందకుంట(హుజూరాబాద్): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ డబ్బులతో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్నారని..దీనిని ప్రజలు హర్షించరని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. వేలమంది అరెస్ట్‌లతో హుజూరాబాద్ భయం గుప్పిట్లో ఉందని ఆరోపించారు. వాసాల మర్రిలో ఇప్పటికే ప్రారంభించిన దళిత బంధు పథకానికి ఇంత ఆర్భాటాలు ఎందుకని సోమవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే షరతులు లే కుండా ప్రతీ దళిత కుటుం బానికి రూ.10 లక్షలు ఇ వ్వాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని ప్రజ లు స్పందించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు పెట్టి తరలించారని ఆరోపించారు. మీటిం గ్‌కు తరలించే బాధ్యత టీచర్లు, అంగన్వాడీలు, ఆశ వర్కర్స్, రెవెన్యూ సిబ్బందికి అప్పగించారని, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈటల హెచ్చరించారు. -
అపోహలొద్దు.. అందరికీ దళితబంధు
హుజూరాబాద్ /సాక్షి, కరీంనగర్: అర్హులైన వారందరికీ దళితబంధు అందజేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఈ పథకంపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని కోరారు. శనివారం హుజూరాబాద్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఈనెల 16న హుజూరాబాద్ మండలంలోని శాలపల్లిలో సీఎం ప్రారంభించనున్నట్లు చెప్పారు. హుజూరాబాద్‌లోని ప్రతి దళిత కుటుంబానికీ ఈ పథకాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. దళిత బంధును ఇక్కడ అమలు చేయడానికి రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నిధులతో 20 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతు బంధు ఇక్కడినుంచి ప్రారంభించినప్పుడు కూడా.. కొందరికే వస్తుందని, ఎన్నికల కోసమే ఇస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. రైతు బంధు ఇదే నియోజకవర్గంలో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన కొందరు నాయకులు, ఇవాళ దళిత బంధు ప్రారంభిస్తుంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారని అన్నారు. ఎన్నికల కోసం ఈ పథకం తెచ్చారంటున్నారని, కానీ బడ్జెట్ సమావేశాల సందర్భంగానే ఈ పథకం గురించి చెప్పామని హరీశ్ గుర్తుచేశారు. మార్చిలోనే ఈ కొత్త పథకాన్ని సీఎం ప్రకటించారని చెప్పారు. కేంద్రం రూ.40 లక్షలు ఇస్తే సంతోషిస్తాం ‘ఎంపీ బండి సంజయ్ రూ.50 లక్షలు ఇవ్వాలంటున్నారు. మాకు చేతనైనంత మట్టుకు రూ.10 లక్షలు ఇస్తున్నాం. మరో రూ.40 లక్షలు అదనంగా కేంద్రం నుండి తెచ్చిస్తే మీకు, మోదీకి ప్రజలు పాలాభిషేకం చేస్తారు. మొత్తంగా ప్రజలకు రూ.50 లక్షలు అందితే మేమెంతో సంతోషిస్తాం..’అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సీఎం చేతుల మీదుగా 15 కుటుంబాలకు చెక్కులు 16న జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి 15 కుటుంబాలకు చెక్కులు అందజేస్తారని మంత్రి తెలిపారు. 16న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం శాలపల్లికి వస్తారని, 4 గంటల వరకు సభ ఉంటుందని చెప్పారు. గ్రామసభలు నిర్వహించి.. సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల సమక్షంలో ప్రజల మధ్యే అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మేయర్ సునీల్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అత్యంత బీదలు తొలి లబ్ధిదారులు: సీఎస్ దళితబంధు అమలుపై శనివారం కలెక్టరేట్లో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సీఎస్ సోమేశ్‌కుమార్, ఎస్సీ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, కలెక్టర్ కర్ణన్ తదితరులు సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎస్ విలేకరులతో మాట్లాడారు. అత్యంత బీదలైన దళితులను దళిత బంధు తొలి లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని చెప్పారు. అత్యంత పేదరికంలో ఉన్నవారితో మొదలుపెట్టి, అర్హులైన అందరికీ అందేలా చర్యలు చేపడతామన్నారు. సీఎం సభకు ఏర్పాట్ల పరిశీలన శాలపల్లిలో సీఎం సభ ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ శనివారం పరిశీలించారు. ఐజీ నాగిరెడ్డి, సీపీ సత్యనారాయణకు పలు సూచనలు చేశారు. ఈ సభకు లక్షా 20 వేల మంది హాజరుకానున్నారు. సభకు దళితులను తీసుకురావడానికి 825 బస్సులను ఏర్పాటు చేశారు. -
దళితబంధు అందరికీ ఇవ్వాలి
హుజూరాబాద్/ సాక్షి ప్రతినిధి, వరంగల్: దళితబంధు పథకానికి అనర్హులను ఎంపిక చేస్తున్నారని.. ఒకేసారి అందరికీ వర్తించేలా పథకాన్ని అమలు చేయాలని హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులు ఆందోళనలకు దిగారు. శనివారం పలుచోట్ల రహదారులపై బైఠాయించి రాస్తారోకోలు చేశారు. అధికార పార్టీకి చెందినవారికే పథకం వచ్చేలా చేస్తున్నారని ఆరోపించారు. దీంతో హుజూరాబాద్ సహా పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనలు విరమింపజేశారు. హుజూరాబాద్ పట్టణంలో.. దళితులందరికీ ‘దళితబంధు’ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోతిరెడ్డిపేట, ఇప్పల్‌నర్సింగాపూర్ గ్రామాలకు చెందిన దళితులు హుజూరాబాద్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందినవారు పరకాల క్రాస్‌రోడ్డు వద్ద.. కందుగుల గ్రామ ఎస్సీ కాలనీకి చెందినవారు పరకాల–హుజూరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనలు చేశారు. అనర్హులను ‘దళితబంధు’ పథకానికి ఎంపిక చేశారని మండిపడ్డారు. వారిని ఏ అర్హత ప్రకారం ఎంపిక చేశారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, జెడ్పీటీసీ బక్కారెడ్డి వచ్చి ఆందోళన చేస్తున్నవారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ దళితులు వెనక్కి తగ్గలేదు. అర్హులను వదిలేసి అనర్హులను ఏ విధంగా ఎంపిక చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఆందోళనతో హుజూరాబాద్ పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చివరికి పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. జమ్మికుంట, ఇల్లందకుంటల్లోనూ.. ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళితులు నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన వారికే పథ కం వచ్చేలా చేస్తున్నారంటూ తహసీల్దార్ సురేఖతో వాదన కు దిగారు. జెడ్పీ చైర్పర్సన్ ఫోన్లో వారితో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదు. ఇక కనగర్తి గ్రామంలో దళితులు రోడ్డుపై బైఠాయించారు, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లిలోనూ దళితులు ఆందోళన చేశారు. కలెక్టర్లకు మంత్రి హరీశ్‌రావు ఫోన్.. దళితుల ఆందోళనల నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితిపై మంత్రి హరీశ్‌రావు ఆరా తీశారు. కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు కర్ణన్, రాజీవ్‌గాంధీ హనుమంతులతో ఫోన్లో మాట్లాడారు. పథకం కోసం ఎంపిక చేస్తున్న దళితుల వివరా లు, ప్రాధాన్యతలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా అవకతవకలకు తావు లేకుండా, అపోహలకు అవకాశం లేకుండా ఎంపిక ప్రక్రియ జరగాలని ఆదేశించారు. -
మామ మెప్పు కోసం హరీశ్ ఆరాటం
ఇల్లందకుంట(హుజూరాబాద్): ‘నాతో 18 సంవత్సరాల అనుబంధాన్ని మరిచిపోయి.. మంత్రి హరీశ్‌రావు తన మామ కేసీఆర్ మెప్పు పొందడానికి ఆరాటపడుతున్నారు’అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడడంలో హరీశ్‌రావు మామ కేసీఆర్‌ను మించిపోయారని ఎద్దేవా చేశారు. గురువారం ఈటల కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హరీశ్‌రావు ఎంత ఆరాటపడ్డా కేసీఆర్ నమ్మరని పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో తనతోపాటు మరో 11 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓడించడానికి కేసీఆర్ డబ్బులు పంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆర్థిక శాఖకు మంత్రిగా ఉన్న తాను.. తన శాఖ నుంచే ముఖ్యమంత్రికి జీతం ఇచ్చానని.. అలాంటి తాను నియోజకవర్గ అభివృద్ధిని ఎలా విస్మరిస్తానని ఆవేదన వ్యక్తం చేశారు. మూడుసార్లు మంత్రులతో కలసి ప్రగతి భవన్‌కు వెళ్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానపరిచారని పేర్కొన్నారు. 2003లో తనకున్న ఆస్తులెన్ని.. ఇప్పుడున్న ఆస్తులెన్నో తేల్చేందుకు సీబీఐతో విచారణకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. అదే సమయంలో ‘మీ ఆస్తులపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేందుకు సిద్ధమా’అని నిలదీశారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కాకుండా మిగతా ఎక్కడా 2 వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇళ్లు లేవని, అవి కూడా ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు తీసుకున్న వారు పూర్తి చేశారని తెలిపారు. అబద్ధాలు మాట్లాడితే దుబ్బాకలో ప్రజలు ఏ విధంగా కర్రు కాల్చి వాతపెట్టారో.. హుజూరాబాద్‌లో కూడా అలాగే చేస్తారని హెచ్చరించారు. సంక్షేమ పథకాలకు తాను వ్యతిరేకం కాదని, ఆ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే చేరాలని చెప్పానని వెల్లడించారు. హుజూరాబాద్, జమ్మికుంటలను అద్దంలా మార్చాలని రూ.25 కోట్ల చొప్పున జీవో తెస్తే, కేటీఆర్ నిధులు ఆపారని పేర్కొన్నారు. అది ప్రగతి భవన్ కాదు.. బానిసలకు నిలయమని రాసుకోమని ఎంపీ సంతోష్‌కుమార్‌కు చెప్పానని, రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈటల అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈటల మొసలికన్నీళ్లకు ఆగం కావద్దు
హుజూరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తుంటే వాటిని మాజీ మంత్రి ఈటల రాజేందర్ దండగ అంటున్నారని.. ఆత్మగౌరవం అంటూ తన పదవికి రాజీనామా చేసిన రాజేందర్ మొసలికన్నీళ్లకు, తియ్యటి మాటలకు హుజూరాబాద్ ప్రజలు ఆగం కావద్దని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గడియారాలకు, కుంకుమ భరిణెలకు లొంగవద్దని, న్యాయాన్ని, ధర్మాన్ని చూసి టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. గురువారం హుజూరాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. దేశంలోనే వడ్డీలేని రుణాలు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, మహిళలను మరింత బలోపేతం చేసేందుకే ఈ రుణాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇలా మహిళలకు ఎక్కడైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని పదహారు గ్రామాల్లో రూ.3.10 కోట్లతో అన్ని వసతులతో మహిళా భవననాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అభయ హస్తం కింద మహిళలు కట్టిన డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసి, ఆ మహిళలకు రూ.2,016 పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిందని, త్వరలోనే పెన్షన్ అందజేస్తామని చెప్పారు. 4 వేల డబుల్ ఇళ్లు పూర్తి చేస్తా.. హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్ 4 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేశారని, అయితే ఈటల రాజేందర్ పట్టించుకోలేదని అన్నారు. ఇక్కడ ఇళ్లు కట్టించే బాధ్యత తనదని, ఇళ్లు వెంటనే పూర్తి చేయిస్తామని అన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన ఈ నెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శాలపల్లి గ్రామంలో సభ ఏర్పాట్లను మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం సభలో 10 బ్లాకులు ఏర్పాటు చేయాలని.. 5 బ్లాకులు మహిళలకు, 5 బ్లాకులను ప్రజాప్రతినిధులకు, ప్రజలకు కేటాయించాలన్నారు. వీఐపీలకు, ప్రెస్‌కు వేరువేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. -
ఈటల గెలిస్తే లాభమేంటి?
సిద్దిపేటజోన్: హుజూరాబాద్‌లో బీజేపీ ఏం చెప్పి ఓట్లు అడుగుతుందని, పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను పెంచామని చెప్పి ఓట్లు అడుగుతారా అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలిస్తే ప్రజలకు వచ్చే లాభం ఏమిటని, ఆయన గెలిచినా నియోజకవర్గ అభివృద్ధి ఏమీ ఉండదన్నారు. వ్యక్తి ప్రయోజనమా.. హుజూరాబాద్ ప్రజల ప్రయోజనమా అనే అంశంపై చర్చ పెట్టాలని సోషల్ మీడియా వారియర్స్‌కు ఆయన సూచించారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్‌తో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. నాడు హుజూరాబాద్‌లో రైతుబంధును ప్రారంభిస్తే చప్పట్లు కొట్టిన ఈటల, నేడు అక్కడే దళితబంధు ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటిస్తే గుండెలు బాదుకొని గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. దళిత బంధును ఆపేందుకు బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని, అందుకే తొందరగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి ఒత్తిడి తెస్తున్నారన్నారు. దళితబంధు హుజూరాబాద్ ప్రజలకు ఇవ్వద్దంటారా? దీనిపై బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళితబంధు పథకం ఎన్నికల కోసం అంటున్నారని, మార్చి నెలలోనే బడ్జెట్లో దళితుల అభ్యున్నతికి రూ.1,200 కోట్లతో దళిత ఎంపవర్మెంట్ స్కీంను అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి, వివిధ జిల్లాల టీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
దమ్ముంటే కేసీఆర్,హరీశ్‌రావు నాపై పోటీచేయాలి:ఈటల
హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో దమ్ముంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు తనపై పోటీచేయాలని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ఉరుములు వచ్చినా.. పిడుగులు పడినా తన గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్లో బీజేపీలో చేరిన దాదాపు 500 మంది ముదిరాజ్ కులస్తులకు ఈటల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ, ‘నన్ను బక్కపల్చటి పిలగాడు.. దిక్కులేని వాడని అనుకోవద్దు.. హుజూరాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను నేను’ అన్నారు. దళితబంధుతో రూ.10 లక్షలు ఇచ్చినా.. గొర్రెలిచ్చినా, కులాల వారీగా తాయిలాలిచ్చినా ప్రజల గుండెల్లో ఉంది తానేనని పేర్కొన్నారు. తాను పనిచేస్తేనే ఇక్కడి ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలుగా గెలిచారన్నారు. సీఎం కేసీఆర్‌కు దళితుల ఓట్ల మీద తప్ప, హుజూరాబాద్ దళితులపై ప్రేమ లేదని, ఆసరా పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వాలని కోరినందుకే తనపై కేసీఆర్ కోపం పెంచుకున్నారని తెలిపారు. కమ్యూనిటీ హాళ్లకు, ఆలయాలకు నిధులిస్తే తప్పులేదని, ఆ సొమ్మంతా ప్రజలదే అన్నారు. ఏమిచ్చినా తీసుకుని ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేయాలని ఈటల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వచ్చే ఏడాది ఒకేసారి రుణమాఫీ: ఈటల
జమ్మికుంట(హుజూరాబాద్): వచ్చే ఏడాది రాష్ట్రంలోని రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేస్తామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా జమ్మి కుంటలో మున్నూరుకాపు కులస్తులు ఈటలకు మద్దతుగా ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. సభలో మంత్రి మాట్లాడుతూ, ఈసారి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వమే రుణం చెల్లిస్తుందని, బ్యాంకర్లు ఎవరూ ఇబ్బంది పెట్టకుండా చూస్తామని వివరించారు. రైతులు ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రూ.5 లక్షలు అందించేలా బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, ఈ పథకాన్ని అన్ని కుటుంబాలకు వర్తింపజేస్తామని వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తోందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఇంట్లోకి వస్తున్న 24 గంటల కరెంటే సాక్ష్యమన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శారద, ఈటల సతీమణి జమున, మున్నూరు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు -
‘కాళేశ్వరం’ అడ్డుకునే వాళ్లే మళ్లీ వస్తున్నారు!
జమ్మికుంట (హుజూరాబాద్): కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునే వాళ్లే మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని, వారితో అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కాళేశ్వరం చేపడితే తమ ప్రాంతానికి నీళ్లు రావని ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఫిర్యాదు చేశారని, అలాంటి వ్యక్తితో జత కట్టిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో గొల్ల, కురుమల ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఒకప్పుడు నీరు లేక బోర్లు ఎండిపోయాయని, వచ్చిరాని కరెంట్‌తో పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారని, రాష్ట్రం ఏర్పడ్డాక రైతులకు 24 గంటల కరెంట్‌ను ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. నాడు కరెంట్ కోసం రైతులు హైదరాబాద్‌లో ఆందోళన చేస్తే కాల్పులు జరిపించి.. వారి రక్తాన్ని కళ్ల చూసిన చరిత్ర ఆంధ్ర పాలకులదన్నారు. అలాంటివాళ్లే ఇప్పుడు ఏకమై మళ్లీ వస్తున్నారని, వాళ్లకు ఓటు వేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. పదేళ్ల క్రితం ఎన్సీడీసీ నిధులు రూ.400 కోట్లు వస్తే.. నాటి పాలకులు వాటిని ఖర్చు చేసేందుకు గ్యారంటీ సంతకం పెట్టలేదని గుర్తుచేశారు. ఆర్థిక మంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ ఫైల్‌పై సంతకం పెట్టి నిధులను గొల్ల, కురుమలకు రుణాల రూపంలో ఇప్పించానన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి భారీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు. -
హుజూరాబాద్‌లో కార్డన్ సెర్చ్
హుజూరాబాద్: కరీంనగర్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్‌లోని మామిండ్ల వాగులో మంగళవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించి అనుమానితులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ సరైన పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ తనిఖీల్లో హుజూరాబాద్ ఏసీపీ మూల రవీందర్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు, సుమారు 150మంది సిబ్బంది పాల్గొన్నారు. -
నీళ్లున్నా.. నిరుపయోగమేనా..?
అస్తవ్యస్తంగా తుమ్మనపల్లి ఫిల్టర్‌బెడ్ నిర్వహణ 8 నెలల నుంచి నిలిచిన నీటి సరఫరా హుజూరాబాద్: తలాపునే సమద్రమున్నా చేప దూపకేడ్చినట్లు ఉంది తుమ్మనపల్లి ఫిల్టర్‌బెడ్ కింద ఎంపిక చేసిన గ్రామాల ప్రజల పరిస్థితి. నీటి వనరుల్లో సమృద్ధిగా నీళ్లున్నా.. ఫిల్టర్‌బెడ్ నుంచి నీటి సరఫరా జరగక నిరుపయోగంగా మారింది. ప్రజలకు రక్షిత తాగునీటినందించేందుకు ఏర్పాటు చేసిన ఈ ఫిల్టర్‌బెడ్ 8 నెలలుగా పనిచేయడం లేదు. నిర్వహణలోపంతో నీటి సరఫరా నిలిచియింది. సంబంధిత గ్రామాల ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. రూ.7.50 కోట్ల నాబార్డు నిధులతో హుజూరాబాద్ మండలంలోని తుమ్మనపల్లిలో ఫిల్టర్‌బెడ్ నిర్మించారు. దీనిద్వారా హుజూరాబాద్, భీమదేవరపల్లి, శంకరపట్నం, ఎల్కతుర్తి మండలాల్లోని 28 గ్రామాలకు ఫ్లోరైడ్హ్రిత నీటినందించేందుకు ప్రణాళికలు రూపొందిం చారు. 64లక్షల80వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మించారు. కానీ ఫిల్టర్‌బెడ్ ప్రారంభం నుంచి ఈ స్థాయిలో నీటిని శుద్ధి చేసి పంపిణీ చేసిన దాఖలాల్లేవు. కొరవడిన పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణ లేక ఫిల్టర్‌బెడ్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఫిల్టర్‌బెడ్ నుంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 8 నెలలుగా పూర్తిస్థాయిలో నీటి సరఫరా నిలిచిపోయింది. అయితే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో జలవనరులకు పుష్కలంగా నీరు వచ్చింది. 45 రోజులుగా తుమ్మనపల్లి ఫిల్టర్‌బెడ్‌కు సమృద్ధిగా నీళ్లు వచ్చాయి. అయినా నిధులలేమి కారణంగా నీటిశుద్ధి పనులు చేయక ఫిల్టర్‌బెడ్ నిరుపయోగంగా మారింది. రూ.40 లక్షల బకాయిలు ఫిల్టర్‌బెడ్ నిర్వహణను ఏటా కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. ఇండిపెండెంట్‌గా ఆర్డబ్ల్యూఎస్ ఏఈని, పంపు డ్రైవర్‌తోపాటు మరి కొందరిని కూలీలను ఏర్పాటు చేశారు. నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా రూ.40 లక్షల గ్రాంట్ విడుదల చేసేది. అయితే రెండేళ్లుగా ప్రభుత్వం ఈ గ్రాంట్ నిధులను 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా జెడ్పీకి విడుదల చేస్తోంది. దీంతో జెడ్పీ నుంచి ఆయా పంచాయతీలకు వెళ్తున్నాయి. వీటిని ఆయా పంచాయతీలు ఇతర అభివృద్ధి పనులకు వినియోగించుకుంటున్నాయి. ఈక్రమంలో ఫిల్టర్‌బెడ్ నిర్వహణ భారంగా మారి నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఒక్క హుజూరాబాద్ నగర పంచాయతీ నుంచే రూ.11లక్షల బకాయిలు రావాల్సి ఉండగా, నిర్దేశిత ఒక్కో పంచాయతీ నుంచి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉంది. ఏటా ఇబ్బందులు తుమ్మనపల్లి ఫిల్టర్‌బెడ్ నిర్వహణ ప్రారంభం నుంచి అస్తవ్యస్తంగానే కొనసాగుతోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫిల్టర్‌బెడ్ ద్వారా నీరందించేందుకు సింగాపూర్ చెరువును రిజర్వాయర్‌గా మార్చారు. అయితే రిజర్వాయర్‌కు ప్రత్యేకించి తూము ఏళ్లు గడుస్తున్నా ఏర్పాటు చేయకపోవడంతో ప్రతిఏటా నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫిల్టర్‌బెడ్ నుంచి నీటి సరఫరా జరగకపోవడంతో హుజూరాబాద్ పట్టణంతోపాటు నిర్దేశిత గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నోటీసులు జారీ చేశాం తుమ్మనపల్లి ఫిల్టర్‌బెడ్ ద్వారా 2015 ఏప్రిల్ నుంచి సరఫ రా చేసిన నీటికి చెల్ల్లించాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు ఆయా పంచాయతీ పద్దులో జమయ్యాయి. ఈ నిధులను పూర్తిగా నీటిసరఫరాకు వినియోగించాల్సి ఉంది. దాదాపు రూ.40 లక్షల బకాయిలు రావాల్సి ఉంది. హుజూరాబాద్ నగర పంచాయతీకి బకాయిలు చెల్లించాలని ఆయా పంచాయతీలకు నోటీసులు జారీ చేశాం. త్వరలోనే నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటాం. - రమాదేవి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ thummalapalli filterbed, water supply, huzarabad, తుమ్మనపల్లి ఫిల్టర్‌బెడ్, నీటి సరఫరా, హుజరాబాద్ -
స్వాతి హత్య ఫుట్‌బాల్ క్రీడాకారుల పనేనా?
- భద్రాచలం ఫుట్‌బాల్ జట్టుపై అనుమానాలు - గుట్టుగా విచారణ జరుపుతున్న పోలీసులు హుజూరాబాద్ : ఖమ్మం జిల్లా భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కళాశాలలోని తరగతి గదుల్లో చదువుకోవాల్సిన దారం స్వాతి అనే విద్యార్థిని హుజూరాబాద్‌లోని చెట్లపొదల్లో హత్యకు గురికావడంపై కొత్తకొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. పైగా హత్యకు ముందు లైంగికదాడికి గురికావడంతో ఈ ఉదంతం వెనుక ఒకరికంటే ఎక్కువ మందే ఉన్నట్లు పోలీసులు భావించి ఆ దిశలో విచారణ జరుపగా కీలక ఆధారాలు బయటపడ్డట్లు తెలిసింది. ఈ నెల 14న హుజూరాబాద్‌లోని సబ్‌రిజిస్టార్ కార్యాలయం సమీపంలో వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం బావురుకొండకు చెందిన దారం స్వాతి అనే నర్సింగ్ విద్యార్థిని మృతదేహం కనిపించిన విషయం విదితమే. ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించగా రెండు రోజుల్లో ఆమె పర్సులో లభించిన పాస్‌ఫొటోల ఆధారంగా పసిగట్టారు. అయితే భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి హుజూరాబాద్‌కు ఎందుకు వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? హుజూరాబాద్‌తో ఆమెకున్న సంబంధమేమిటి? అనే విషయాలపై పోలీసులు ఆరా తీయగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మరి ఎందుకు హుజూరాబాద్‌కు వచ్చిందనే కోణంలో క్షేత్రస్థాయిలో విచారణ జరపగా కీలకమైన కోణం బయటపడింది. హుజూరాబాద్‌లో భద్రాచలం క్రీడాకారులు ఈ నెల 12,13,14 తేదీల్లో హుజూరాబాద్‌లోని హైస్కూల్ మైదానంలో తెలంగాణ స్థాయి ఫుట్‌బాల్ పోటీలు జరిగాయి. 12న సాయంత్రం ఇక్కడకు భద్రాచలం ఫుట్‌బాల్ జట్టు క్రీడాకారులు వచ్చారు. 13న ఉదయం 11.30 గంటలకు స్వాతి కూడా హుజూరాబాద్‌కు వచ్చినట్లు ఆమె పర్సులో లభ్యమైన బస్‌టికెట్ ద్వారా తెలుస్తోంది. 13న ఉదయం భద్రాచలం జట్టు ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో తిరుగుపయనమయ్యారు. ఇదేరోజు సాయంత్రం స్వాతి హత్యకు గురికావడంతో ఈ హత్యోదంతానికి, ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఏమైనా సంబంధం ఉందా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. పైగా ఆమె హత్యకు గురైన స్థలం వైపు అదేరోజు ఒక కారు వెళ్లినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. భద్రాచలం జట్టు కు ఇక్కడి టోర్నమెంట్ నిర్వాహకులు సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. మరి వారు ఇంతదూరం రావడం వెనుక స్వాతి ఉదంతం కూడా కారణం కావచ్చునేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నారుు. స్వాతికి చెందిన బ్యాగ్ ఖమ్మం జిల్లా కొత్తగూడెం బస్టాండ్‌లో ఉండటం, ఇంట్లో నుంచి ఏ దుస్తుల మీద ఆమె బయటకు వచ్చిందో అదే డ్రెస్సులో హత్యకు గురికావడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఒకవేళ స్వాతిని భద్రాచలం నుంచి కిడ్నాప్ చేసుకొని ఇక్కడకు తీసుకొచ్చి లైంగికదాడి చేసి, హత్యచేయొచ్చని, అనుమానం రాకుండా కరీంనగర్ నుంచి హుజూరాబాద్‌కు వచ్చినట్లు బస్ టికెట్‌ను తన పర్సులో పెట్టొచ్చనే సందేహాలు కూడా లేకపోలేదు. ఇదే నిజమైతే మరో రెండ్రోజుల్లో పూర్తి విషయాలు బయటపడే అవకాశముంది.