బండరాళ్లతో మోది.. ఆపై నిప్పంటించి.. | Man Was Brutally Beaten To Assassination With Rocks In Karimnagar District | Sakshi
Sakshi News home page

బండరాళ్లతో మోది.. ఆపై నిప్పంటించి..

Published Tue, Sep 14 2021 3:41 AM | Last Updated on Tue, Sep 14 2021 9:12 AM

Man Was Brutally Beaten To Assassination With Rocks In Karimnagar District - Sakshi

సంతోష్‌ (ఫైల్‌) 

ఇల్లందకుంట (హుజూరాబాద్‌): కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్‌లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని బండలతో దారుణం గా కొట్టి చంపి, ఆపై కిరాతకంగా మర్మావయవాలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు కారణం వివాహేతర సంబం ధమా, లేక రాజకీయ కక్షలా? అన్న అంశం చర్చనీయాం శంగా మారింది.

విలాసాగర్‌ గ్రామానికి చెందిన సిరిశెట్టి సంతోష్‌ (40) అనే వ్యక్తిని ఆదివారం అర్ధరాత్రి తరువాత వెంకటేశ్వరపల్లి శివారులోని కెనాల్‌ వద్ద దారుణంగా హత్య చేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మృతుడి భార్య కోమల కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌లో మాట్లాడి బయటకు రమ్మని చెప్పారు. దీంతో బయటకు వెళ్లిన సంతోష్‌ తిరిగి రాలేదు. సోమవారం ఉదయం పంట పొలాల మ«ధ్య శవమై కనిపించాడు. 

హత్యపై అనుమానాలు..: సంతోష్‌ హత్యపై స్థానికులు వివిధ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యకు వివాహే తర సంబంధమే కారణమా..? లేక పాత కక్షలతో ఎవరైనా ఈ ఘాతుకానికి ఒడిగట్టారా అనే కోణంలో పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు. మరో పక్క మూడు రోజుల క్రితమే సంతోష్‌ రాజకీయంగా వేరే పార్టీలోకి మారడంతో దానికి సంబంధిం చిన కారణాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంఘ టన స్థలాన్ని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అను మానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీపీ చెప్పారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య కోమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామచంద్రరావు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement