Santhosh
-
టాస్క్ ఫోర్స్ పోలీసులు నన్ను చిత్ర హింసలకు గురి చేశారు
-
ప్రముఖ నటుడు అరెస్ట్.. అదే కారణం!
ప్రముఖ మలయాళ నటుడు బైజు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ తన కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన తిరువనంతపురంలోని మ్యూజియం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నటుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.కాగా.. కారులో బైజూ కుమార్తె కూడా అతనితో ఉన్నట్లు తెలుస్తోంది. బైజు సంతోష్ దాదాపు 40 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన మొదట అధవ మణియన్ పిల్ల (1981) చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత పుతన్ పనం (2017), మేరా నామ్ షాజీ (2019) చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్నారు. కాగా.. ప్రస్తుతం సంతోశ్ పృథ్వీరాజ్ సుకుమారన్ చిత్రం ఎల్2 ఎంపురన్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
Oscars 2025: యూకే ఓకే చెప్పిన ఈక్వాలిటీ కథ..
మన దేశంలో అందరికీ సమాన న్యాయం జరగడం సులభమేనా?న్యాయానికి కులం, మతం,ప్రాంతం ఉంటాయా?కంటికి కనిపించేది, చెవికి వినిపించేదంతా న్యాయమేనా?సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్’ సంధించే ప్రశ్నలివి. యు.కె. ప్రభుత్వ నిర్మాణ భాగస్వామ్యంతో నిర్మితమైన ఈ సినిమాను ఇప్పుడు ఆ దేశం తన అఫిషియల్ ఎంట్రీగా ఆస్కార్‌కు పంపింది. ‘లాపతా లేడీస్’తో పాటు ఆస్కార్‌లో ‘సంతోష్’ కూడా భారతీయ మహిళల కథను పోటీకి నిలపనుంది.ఈ వ్యవస్థ ఎలా నడుస్తోందో వ్యవస్థతో తలపడినప్పుడే సగటు మనిషికి తెలుస్తుంది. సామాజిక వ్యవస్థలో తన కంటే పై వర్గం ఎలా వ్యవహరిస్తుందో తెలిసొస్తే పాలనా వ్యవస్థలో తన కంటే పై అధికారి ఆ పై అధికారి ఎలా వ్యవహరిస్తారో తెలిసొస్తుంది. ప్రతి వ్యవస్థకు వర్షించే కళ్లు, కాటేసే కోరలు ఉంటాయి.ఎవరి మీద వర్షించాలో, ఎప్పుడు కాటేయాలో దానికి తెలుసు. అది మారాలని అందరికీ ఉంటుంది. వ్యవస్థ కూడా తాను మారాలని అనుకోవచ్చు. కాని మారదు. మారాలనుకున్నా మనుషులు మారనివ్వరు. ఏదో కొద్ది వెసులుబాటులో కాసింతో కూసింతో గాలి ఆడి పనులు అవుతుంటాయి అంతే.డాక్యుమెంటరీ మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ సినిమా మన భారతీయ వ్యవస్థ– అది కుల వ్యవస్థ కాని పాలనా వ్యవస్థ గాని ఎలా వ్యవహరిస్తుందో ఒక బాలిక చావు ఆధారంగా చర్చిస్తుంది. ఒక మహిళా కానిస్టేబుల్ కళ్లతో సామాజిక వ్యవస్థను, న్యాయ వ్యవస్థను చూసి ప్రేక్షకుల మనసుల్లో ప్రశ్నలు నాటుతుంది.కథ ఏమిటి?‘సంతోష్’ సినిమాలో ప్రధాన పాత్రధారి సంతోష్ సైని అనే మహిళా పోలీస్ కానిస్టేబుల్. ఈ పాత్రను చాలా ప్రతిభావంతమైన నటిగా పేరు పొందిన షహానా గోస్వామి పోషించింది. ఉత్తరప్రదేశ్‌లాంటి ఒక కల్పిత రాష్ట్రంలో సంతోష్‌కు ఒక కానిస్టేబుల్‌కు పెళ్లవుతుంది. కానీ డ్యూటీలో ఉండగా భర్త హఠాత్తుగా మరణిస్తాడు. ‘నా కొడుకును మింగింది’ అని అత్తగారు సూటి పోటి మాటలంటే అమ్మ గారింట్లోని వారు తిరిగొచ్చిన కూతురిని రకరకాలుగా బాధలు పెడతారు. దాంతో గత్యంతరం లేక భర్త మరణం వల్ల వచ్చే కారుణ్య నియామకంలో ఆమె కానిస్టేబుల్ అవుతుంది. కాని పోలీసులంటే బయట ఉండే మనుషుల్లాంటి వారేనని అక్కడ దారుణమైన పురుషస్వామ్యం, కుల పెత్తనం, అవినీతి, మత ద్వేషం ఉంటాయని తెలుసుకుంటుంది. ఆ సమయంలోనే ఒక అట్టడుగు వర్గం బాలిక శవం ఊరి బావిలో దొరుకుతుంది. అగ్ర కులాల వారే ఆమెను చంపి బావిలో వేశారని గ్రామస్తులు విచారణకు వెళ్లిన సంతోష్‌కు చెబుతారు. అక్కడి నుంచి ఆమె ఎలాంటి ప్రయాణం చేసిందనేదే కథ.మహిళలపై హింసకు వ్యతిరేకంగాలండన్లో పుట్టి పెరిగిన బ్రిటిష్ ఇండియన్ సంధ్యా సూరి గతంలో ‘ఐ ఫర్ ఇండియా’ డాక్యుమెంటరీలో ‘ఫీల్డ్’ అనే షార్ట్‌ఫిల్మ్‌తో చాలా అవార్డులు పొందింది. భారతదేశంలో స్త్రీలపై సాగే హింస మీద ఒక డాక్యుమెంటరీ తీయాలని ఇండియాలోని ఎన్జిఓలతో పని చేస్తున్నప్పుడు ‘నిర్భయ’ ఘటన ఆమెను హతాశురాలిని చేసింది. ఆ సమయంలో నిరసనలు చేస్తున్న స్త్రీలను అదుపు చేసే మహిళా కానిస్టేబుళ్ల కళ్లలోని బాధ, ఆవేదన చూసినప్పుడు ఆమెకు ‘సంతోష్’ సినిమా తీయాలని అనిపించింది. అయితే దీని నిర్మాణం కోసం ఆమె యు.కె/జర్మన్/ఫ్రెంచ్ దేశాల ఫిల్మ్ ఫండింగ్ ఏజెన్సీల భాగస్వామ్యం కోరింది. సునీతా రాజ్వర్ (పంచాయత్ ఫేమ్), సంజయ్ బిష్ణోయ్ తదితరులు ఇందులో నటించారు.ఆస్కార్ ఎంట్రీమేలో జరిగిన 77వ కాన్స్‌లో బహు ప్రశంసలు పొందిన ‘సంతోష్’ను 97వ ఆస్కార్ అవార్డుల పోటీలో తన దేశ అఫిషియల్ ఎంట్రీగా పంపాలని యూకే భావించడం ఈ కథకు, దర్శకురాలికి దక్కిన గౌరవంగా భావించాలి. ఇప్పటికే మన దేశం నుంచి వెళుతున్న లాపతా లేడీస్ స్త్రీల కథకాగా ‘సంతోష్’ కూడా స్త్రీల కథే కావడం విశేషం.ఇవి చదవండి: మునుపటి కాలం కాదు ఇది, కానీ.. -
ఆమె ఎవరంటే...!?
ఆమె ఎవరని అడుగుతారేమో ఏమని చెప్పాలి!?ఆమె అక్షరం అని చెప్పనా..కష్ట జీవుల కన్నీటి వ్యథ అనాలా..ఆమె ఓ ధిక్కార స్వరం అని చెప్పనా!?ఏమని చెప్పాలి?అణిచివేతల సాచివేతల రాజ్యంలో ఆమె ఓ పోరాట జ్వాల..చీకటి కొనల మీద చిక్కటి వెలుగు తాను..ఆమె ఎవరని అడుగుతారేమో!ఆమె అన్నార్తులఆకలి కేకల పోరు నాదమని..గొంతు లేని ప్రజల గొంతుకని..ఆమె అక్షరం తెలియని వాళ్లఅడుగు జాడల్లో అక్షర దివిటని..ఆమె ప్రజా పోరు దారుల్లోఓ అడుగు జాడని చెప్పగలను..ఆమె గొంతు ఎందుకునొక్కుతున్నారని అడిగితే మాత్రం ఆమె శోషితుల పక్షమై నిల్చినందుకు..ఆమె పౌర హక్కులు అడిగినందుకు..ఆమె స్త్రీ సమానత్వం కోరినందుకు..ఆమె జాతి విముక్తి నినదించినందుకు..ఆమె స్వేచ్ఛను కోరినందుకే కదా!రాజ్య ద్రోహం అనే రాజ్య బహుమానం!! – వంగల సంతోష్ (అరుంధతీ రాయ్‌పై పెట్టిన కేసును ఖండిస్తూ)ఇవి చదవండి: సింగరేణి వివాదం.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు -
ప్రముఖ నటుడి ఇంట పెళ్లి.. డాక్టర్ వెడ్స్ ఇంజనీర్!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తాజాగా ప్రముఖ మలయాళ నటుడు బైజు సంతోష్ కూతురు, డాక్టర్ ఐశ్వర్వ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. చెన్నైలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న రోహిత్‌ను పెళ్లాడింది. తిరువనంతపురంలోని ప్రముఖ క్లబ్లో ఐశ్వర్య, రోహిత్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు మలయాళ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే తన భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది ఐశ్వర్య. తమది ప్రేమ వివాహం కాదని.. రోహిత్‌ను మ్యాట్రిమోనీ సైట్లో చూసి పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. అతని తల్లిదండ్రులు కేరళలోని పాతానంతిట్టకు చెందినవారు కాగా.. రోహిత్ పంజాబ్‌లో పుట్టి పెరిగారని తెలిపింది. నేను అతనితో ఒక్కసారి మాట్లాడాక.. నన్ను అర్థం చేసుకోగలడని అనిపించిందని ఐశ్వర్య పేర్కొంది. మరోవైపు పెళ్లి ప్రపోజల్ వచ్చినప్పుడు ఆమె మలయాళంలో పేరున్న నటుడి కూతురన్న విషయం తనకు తెలియదని రోహిత్ చెబుతున్నాడు. ఐశ్వర్య- రోహిత్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. బైజు సంతోష్‌కు ఐశ్వర్య పెద్దకూతురు. ఆమె ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆమె పెళ్లికి ప్రియదర్శన్, షాజీ కైలాస్, అన్నీ, మేనక, సోనా నాయర్, కలడి ఓమన, డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి హాజరయ్యారు. కాగా.. బైజు సంతోష్ మలయాళంలో మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌లో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్‌గా రీమేక్ చేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటించారు. View this post on Instagram A post shared by Binzu Gopalan - Makeupartist (@binzugopalan) View this post on Instagram A post shared by MoonWedlock Wedding Company (@moonwedlock) -
బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ పై కేసు నమోదు
-
భారత బాస్కెట్‌బాల్ జట్టు కోచ్‌గా సంతోష్
ఆసియా కప్ సీనియర్ పురుషుల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టుకు కోచ్‌గా తెలంగాణకు చెందిన పి.ఎస్.సంతోష్ ఎంపికయ్యాడు. ఈ టోర్నీ కజకిస్తాన్‌లో ఈనెల 23 నుంచి 26 వరకు జరుగుతుంది. గ్రూప్ ‘ఇ’లో భారత్‌తోపాటు ఖతర్, కజకిస్తాన్, ఇరాన్ జట్లున్నాయి. భారత జట్టులో విశేష్, అరవింద్, ముయిన్ బెక్, ప్రణవ్ ప్రిన్స్, అమృత్‌పాల్, గుర్బాజ్, పల్‌ప్రీత్, అమరేంద్ర, వైశాఖ్, ప్రిన్స్‌పాల్ సింగ్, సహజ్‌ప్రతాప్ సింగ్, బాలదానేశ్వర్ సభ్యులుగా ఉన్నారు. -
ఐర్లాండ్: వాసవి మాత అగ్నిప్రవేశ దినోత్సవ వేడుకలు..
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో త్రిశక్తి స్వరూపిణి, సకల వేద స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాఘశుద్ధ విదియ రోజు వందమందికి పైగా వాసవి మాత భక్తులు, కమిటీ సభ్యులందరు కలిసి ఉదయాన్నే అనుకున్నట్టుగా కింగ్స్‌వుడ్ ప్రాంతమునందున్న స్థానిక వినాయగర్ ఆలయానికి చేరుకొని అక్కడ మొదటగా అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. మొదటగా పిల్లలు తరువాత మహిళలంతా కలిసి చక్కగా అమ్మవారికి భక్తిశ్రద్దలతో అభిషేక కార్యక్రమాన్ని పూర్తిచేశారు. తరువాత అమ్మవారికి వివిధరకాల పుష్పాలతో అలంకరించిన పిమ్మట లలిత సహస్రనామ పఠనము, మణిదీపవర్ణన, సామూహిక కుంకుమార్చన నిర్వహించగా.. విశాలి రమేష్, శృతి, అనూష చేసిన అమ్మవారి గీతాలాపనలో భక్తులందరూ తన్మయత్వం చెందారు. అటుపిమ్మట అమ్మవారికి మహిళలందరూ వడిబియ్యం సమర్పించి మన సంస్కృతీ సంప్రదాయాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అంకిత ఈ కార్యక్రమం మొత్తాన్ని చక్కగా సమన్వయము చేసారు. చిరంజీవి-లక్ష్మి హాసిని వాసవి పురాణం నుండి సేకరించిన ధర్మసూత్రాలను ఆంగ్లంలోకి అనువదించిన వాసవి దివ్యకథను భక్తులందరికీ చదివి వినిపించారు. అమ్మవారి నామస్మరణతో భక్తులందరూ పులకించిపోయారు. సంప్రదాయ వస్త్రధారణలో పిల్లలు పెద్దలు ఆనందంగా వారి ఒకరోజు సమయాన్ని ఇలా అమ్మవారి సేవలో గడపటం చాలాా ఆనందంగా ఉందని కోర్-కమిటీ సభ్యుల్లో ఒకరైన అనీల్ అన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన ఆలయ సెక్రటరీ, డైరెక్టర్ బాలకృష్ణన్ దంపతులకు కార్యవర్గ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ముత్తుస్వామిని ఘనంగా సత్కరించారు. బాలకృష్ణన్ మాట్లాడుతూ అమ్మవారి కార్యక్రమాలు వినయాగర్ ఆలయం నందు నిర్వహించడం అందులో భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందమైన విషయమని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలనీ అభిలాషించారు. సరసమైన ధరలకే భోజన ప్రసాదాలు అందించిన బిర్యానీవాలా రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్‌కి, దీనికి సహకరించిన ప్రశాంత్‌కి కమిటీ కార్యవర్గ సభ్యులు శివ కుమార్, నవీన్ సంతోష్ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. హాజరైన సభ్యులందరు ముక్తకంఠంతో ఐర్లాండ్ నందు ఇలాంటి కార్యక్రమాలు జరగడం ఎంతో శుభపరిణామమని ఆనందించారు. కార్యక్రమానికి ముఖ్య ఉభయదారులుగా దాతలు రేణుక దినేష్, రజిత సంతోష్, నితేశ్ గుప్తాలకు కమిటీ సభ్యులు సత్కరించి కృతఙ్ఞతలు తెలియజేసారు. అమ్మవారి అలంకరణ, పుష్పాలంకరణ సేవకు కృషిచేసిన సభ్యుల్లో మాధవి, దివ్య మంజుల, శృతి, మాధురి, రేణుక, అంకిత, మణి, లావణ్య తదితరులకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. తదుపరి కార్యక్రమంలో అధ్యక్షులు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. అమ్మవారి జీవిత విశేషాలను ప్రస్తుత సమాజం ఎలా స్వీకరించాలో ఉదాహారణలతో వివరించి సభ్యులందరికి అమ్మవారు చెప్పిన ధర్మ సంబంధమైన విషయాలను లోతుగా వివరించి చెప్పారు, హాజరైన సభ్యులకు భక్తులకు పేరుపేరునా కృతఙ్ఞతలు తెలియజేసారు. చివరిగా.. అందరూ భోజన ప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమం మొత్తం ముందుకు సాగడంలో కీలకంగా కోర్-కమిటీ సభ్యులతో పాటుగా సేవాదళ్ సభ్యుల్లో ముఖ్యంగా గంగా ప్రసాద్, లావణ్య, సంతోష్ పారేపల్లి, శ్రీనివాస్, సతీష్, మాణిక్, శ్రవణ్ తదితరులు పాల్గొని విజయవంతంగా ముగించారు. -
మహిళా రేషన్ డీలర్ హత్య! వివాహేతర సంబంధమే కారణమా?
కరీంనగర్: మంథనిలోని హనుమాన్‌నగర్‌లో మహిళా రేషన్ డీలర్ హత్య కలకలం రేపింది. మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బందెల రాజమణి(37) ఈ నెల 9న రాత్రి హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. బుధవారం ఆటో డ్రైవర్ పైడాకుల సంతోష్ ఇంట్లో మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. ముత్తారం మండలానికి చెందిన రాజమణికి లక్ష్మీపూర్‌కు చెందిన బందెల రమేశ్‌కు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. రమేశ్ నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. రాజమణి గ్రామంలో రేషన్ డీలర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. రేషన్ సరుకులు తెచ్చే సందర్భంలో ఆటో డైవర్ సంతోష్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సంతోష్ తరచూ ఇంటికి వచ్చివెళ్లేవాడు. కొంతకాలంగా అతడితో విభేదాలు రావడంతో ఇంటికి రావడం లేదు. ఈక్రమంలో సోమవారం సాయంత్రం సరుకుల కోసం వెళ్తున్నానని రాజమణి ఇంట్లో పిల్లలకు చెప్పి బయలుదేరింది. ఆ రోజు తన చిన్న కూతురుతో ఫోన్లో మాట్లాడింది. కానీ ఇంటికి తిరిగి రాలేదు. తర్వాత పిల్లలు ఫోన్ చేయగా స్పందించలేదు. ఆమె ఆచూకీ కోసం వెతుకుతుండగా మంగళవారం రాత్రి మంథనిలోని ఎరుకల గూడెంలో పైడాకుల సంతోష్ అద్దెకు ఉంటున్న ఇంట్లో మృతిచెంది ఉంది. ఆమె నుదుటిపై, గొంతుపై బలమైన గాయాలున్నాయి. రాజమణిని సంతోష్ వేధించడంతో అతడ్ని తిరస్కరించినందుకు కోపంతో పదునైన ఆయుధంతో హత్య చేసినట్లు మృతురాలి బంధువులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతురాలి సోదరుడు కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్లాంట్ మాన్ ప్రయోగం
‘కాలింగ్ బెల్, రాక్షసి’ వంటి హారర్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు పన్నా రాయల్ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ప్లాంట్ మాన్’. డీఎం యూనివర్సల్ స్టూడియోస్ స్థాపించి కె. సంతోష్బాబుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు . పన్నా రాయల్. ‘‘సైంటిఫిక్ కామెడీ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఒక కొత్త తరహా ప్రయోగంతో పూర్తి వినోద ప్రధానంగా రూ΄పొందించాం’’ అన్నారు పన్నా రాయల్. ఇక ప్రస్తుతం పన్నా రాయల్ దర్శకత్వంలో రూ΄పొందిన ‘ఇంటి నెం.13’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్లాంట్ మాన్ పొస్టర్ -
'ఆడియన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది': మిక్కీ జే మేయర్
‘‘నా మ్యూజిక్ కంపోజర్స్ టీమ్ అందరూ అమెరికా, లండన్‌లో ఉంటారు. సో.. నేను అమెరికాలో ఉన్నప్పటికీ నిర్మాతలు ఇబ్బందిపడటంలేదు. ఓ సినిమా హిట్ అయితే హీరో, డైరెక్టర్స్‌తో పాటు సంగీత దర్శకుడికి మంచి పేరు వస్తుంది. అందుకే స్క్రిప్ట్ ముఖ్యమని నమ్ముతాను. ఇక ఇటు శేఖర్ కమ్ములగారి నుంచి హరీష్ శంకర్, అటు నాగ్ అశ్విన్ నుంచి నందినీ రెడ్డిగార్ల సినిమాలు.. ఇలా డిఫరెంట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన అతి కొద్దిమంది మ్యూజిక్ డైరెక్టర్స్‌లో నేనూ ఒకణ్ణి’’ అన్నారు సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్రవిందా మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీతదర్శకుడు మిక్కీ జే మేయర్ మాట్లాడుతూ– ‘‘మహానటి’ తర్వాత వైజయంతీ మూవీస్‌లో నేను చేసిన సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ఇందులో ఆరు పాటలు ఉన్నాయి. నందినీ రెడ్డిగారు కథ చెప్పినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. అలాగే కథలో ఆమె క్రియేట్ చేసిన విక్టోరియాపురం ఆడియన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న రెండు సినిమాలకు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలగారితో ఓ ప్రాజెక్ట్, ‘చాంపియన్’ అనే మరో ప్రాజెక్ట్, ‘సెల్ఫిష్’, అమెరికాలో ఉన్న మరో దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
ప్రపంచ చెస్ చాంపియన్ కార్ల్‌సన్‌పై విదిత్ విజయం
చెన్నై: ప్రొ చెస్ లీగ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరా తి గొప్ప ఫలితం సాధించాడు. ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)పై విదిత్ గెలుపొందాడు. ఆన్లైన్లో జరుగుతున్న ఈ టోర్నీలో ఇండియన్ యోగిస్ జట్టు తరఫున పోటీపడుతున్న విదిత్ బ్లిట్జ్ గేమ్‌లో 58 ఎత్తుల్లో కెనడా చెస్బ్రాస్ జట్టు తరఫున ఆడుతున్న కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు. 16 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీని లక్షా 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో కార్ల్‌సన్‌ను ఓడించిన నాలుగో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ కావడం విశేషం. ప్రజ్ఞానంద, గుకేశ్, ఇరిగేశి అర్జున్ కూడా ఈ నార్వే దిగ్గజంపై వివిధ టోరీ్నలలో గెలుపొందారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: నిందితుల జాబితాలో ‘ఆ నలుగురు’
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటివరకూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక సూత్రధారుల్ని నిందితుల జాబితాలో చేర్చింది సిట్. ఏ-4గా బీఎల్ సంతోష్, ఏ-5గా తుషార్, ఏ-6గా జగ్గుస్వామి, ఏ-7గా న్యాయవాది శ్రీనివాస్‌లను నిందితుల జాబితాలో చేర్చింది. అదే సమయంలో సిట్ స్వర నమూల నివేదిక సిట్ చేతికి అందింది. మరొకవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. వారం రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో సిట్ నోటీసులు సవాల్ చేస్తూ నందు భార్య చిత్రలేఖ, న్యాయవాది ప్రతాప్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిలో భాగంగా చిత్రలేఖ, ప్రతాప్‌లను అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు.. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు -
ఆయనేం తప్పు చేశారు? భావోద్వేగానికి లోనైన బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్‌కు నోటీసులు పంపారని, ప్రచారక్‌ల జోలికి వస్తే ఊరుకునేది లేదని కేసీఆర్‌ను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హెచ్చరించారు. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలను ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు బండి సంజయ్. మంగళవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బీఎల్ సంతోష్ ఏం తప్పు చేశారు? ఆయన ఎమ్మెల్యే కాలేదు.. ఎంపీ కావాలనుకోలేదు.. ఆస్తిపాస్తులు సంపాదించుకోలేదు. కుటుంబ సభ్యులకు పదవులూ ఇప్పించుకోలేదు కూడా. కేవలం దేశం కోసం పని చేసే గొప్ప వ్యక్తి ఆయన. నోటీసుల పేరుతో ఒక ప్రచారక్‌ను అవమానపరిస్తే.. దేశ ప్రజలు సహించబోరని బండి సంజయ్ పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రచారక్‌ల జోలికి వస్తే ఊరుకునేది లేదన్న బండి సంజయ్.. బీఎల్ సంతోష్‌కు ఫామ్ హౌజ్‌లు, బ్యాంకు ఖాతాలు లేవని పేర్కొన్నారు. కుటుంబాన్ని కాపాడుకునేందుకే కేసీఆర్.. సంతోష్‌కు నోటీసులు ఇప్పించరాని బండి సంజయ్ ఆరోపించారు. అయినా ధైర్యంగా పోరాడేతత్వం బీజేపీదని స్పష్టం చేశారు బండి సంజయ్. ఇదీ చదవండి: కనీస విలువ లేని పదవి నాకెందుకంటూ ‘బొక్కా’ అలక -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణహైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు విచారణకు హాజరు కాలేదని హైకోర్టుకు సిట్ స్పష్టం చేసింది. వారికి నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదని, ఏదైనా ఆర్డర్ ఇవ్వాలని హైకోర్టును సిట్ కోరింది. బీఎల్ సంతోష్‌కు నోటీసులు అందాయని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, సిట్ విచారణ అంశాలపై రేపు మరోసారి విచారిస్తామన్న హైకోర్టు తన విచారణను వాయిదా వేసింది. కాగా, ఈ కేసు విచారణలో భాగంగా విచారణకు హాజరు కావాల్సి ఉన్న ముగ్గురికి లుకౌట్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ బీడీజేఎస్ అధినేత తుషార్, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలు సోమవారం విచారణకు హాజరు కాలేదు. బీఎల్ సంతోష్ ఆఫీస్‌లో సైతం పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో బీఎల్ సంతోష్ తాను వేరే రాష్ట్రంలో పర్యటిస్తున్నాని, అందువల్ల సిట్ ముందుకు వచ్చేందుకు సమయం కావాలని కోరాడు. ఐతే కేరళ వైద్యుడు జగ్గుస్వామీ మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు. దీంతో అతను విదేశాలకు పారిపోకుండా తెలంగాణ పోలీసులు అన్ని ఎయిర్‌పోర్ట్‌లను అలర్ట్ చేయడమే కాకుండా విదేశాలకు చెక్కేయకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది సిట్. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు...ఎయిర్‌పోర్ట్‌ల్లో నిఘా!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురికి లుకౌట్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ బీడీజేఎస్ అధినేత తుషార్, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలు సోమవారం విచారణకు హాజరు కాకపోవడంతో సిట్ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే బీఎల్ సంతోష్ ఆఫీస్‌లో సైతం పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో బీఎల్ సంతోష్ తాను వేరే రాష్ట్రంలో పర్యటిస్తున్నాని, అందువల్ల సిట్ ముందుకు వచ్చేందుకు సమయం కావాలని కోరాడు. ఐతే కేరళ వైద్యుడు జగ్గుస్వామీ మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు. దీంతో అతను విదేశాలకు పారిపోకుండా తెలంగాణ పోలీసులు అన్ని ఎయిర్‌పోర్ట్‌లను అలర్ట్ చేయడమే కాకుండా విదేశాలకు చెక్కేయకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది సిట్. ఇక ఈ కేసులో బండి సంజయ్ అనుచరుడు న్యాయవాది శ్రీనివాస్‌ని ఇప్పటికే ప్రశ్నించిన సిట్ మంగళవారం మరోసారి విచారణకు హాజరు కావాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో రెండో రోజు విచారణకు హాజరైన అడ్వకేట్ శ్రీనివాస్ కాల్‌డేటా, బ్యాంక్స్టేట్మెంట్లను సిట్ బృందం పరిశీలిస్తోంది. (చదవండి: ఎమ్మెల్యేలకు ‘ఎర’ కేసులో కొత్త ట్విస్ట్.. ఆ ముగ్గురికి లుకౌట్ నోటీసులు!) -
ఎమ్మెల్యేలకు ‘ఎర’ కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. నోటీసులు జారీ చేసిన ముగ్గురిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ బీడీజేఎస్ అధినేత తుషార్, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వీరంతా సోమవారం నాడు విచారణకు హాజరు కాకపోవడంతో లుకౌట్ నోటీసులు ఇచ్చింది. ఇక ఈ కేసులో బండి సంజయ్ అనుచరుడు, అడ్వకేట్ శ్రీనివాస్‌ను ఇప్పటికే ప్రశ్నించిన సిట్ మంగళవారం మరోసారి విచారణకు హాజరు కావాలని తెలిపింది. కాగా సోమవారం ఉదయం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరు కావాల్సిందిగా బీఎల్ సంతోష్‌కు తొలిసారి జారీ చేసిన నోటీసులో సిట్ పేర్కొంది. కానీ సంతోష్ గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. సంతోష్‌తో పాటు కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్, తుషార్ వెల్లాపల్లి, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలకూ సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే శ్రీనివాస్ మినహా మిగిలిన ముగ్గురూ విచారణకు హాజరుకాలేదు. నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని విచారణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ బి.గంగాధర్ తొలి నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సంతోష్‌ను అరెస్టు చేయవద్దని సిట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. చదవండి: కానిస్టేబుల్ ఈశ్వర్.. ఇతని రూటే సపరేటు.. దొంగలతో చేతులు కలిపి -
బీఎల్ సంతోష్‌కు మరోసారి నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్‌కు 41–ఏ సీఆర్పీసీ కింద ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రెండోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. సోమవారం ఉదయం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరు కావాల్సిందిగా తొలిసారి జారీ చేసిన నోటీసులో సిట్ పేర్కొంది. కానీ సంతోష్ గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని విచారణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ బి.గంగాధర్ తొలి నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సంతోష్‌ను అరెస్టు చేయవద్దని సిట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సిట్ ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. అయితే సంతోష్‌కు నోటీసులు అందించేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించక పోవడంతో, ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు నోటీసులు అందించాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో.. సిట్ ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. తుషార్, జగ్గుస్వామిలను అరెస్టు చేస్తారా? సంతోష్‌తో పాటు కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్, కేరళ బీడీజేఎస్ అధినేత తుషార్ వెల్లాపల్లి, ప్రధాన నిందితుడు రామచంద్రభారతి.. తుషార్‌కు మధ్యవర్తిత్వం వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్న కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలకూ సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే శ్రీనివాస్ మినహా మిగిలిన ముగ్గురూ విచారణకు హాజరుకాలేదు. దీంతో నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం తుషార్, జగ్గుస్వామిలను అరెస్టు చేయాలా? బీఎల్ సంతోష్‌కు మాదిరిగానే వారికి కూడా మరోసారి నోటీసులు జారీ చేయాలా? అనే అంశంపై న్యాయ నిపుణులతో సిట్ అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. మరోసారి కస్టడీపై నేడు విచారణ ఈ కేసుకు సంబంధించి రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత రెండురోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయితే నిందితుల నుంచి సంతృప్తికర సమాధానాలు రాలేదని, మరోసారి వారం రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ప్రస్తుతం ముగ్గురు నిందితులు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సిట్‌కు స్వేచ్ఛ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం స్పష్టీకరణ -
ఎమ్మెల్యేలకు ఎర కేసు.... ఇప్పట్లో సిట్ ఎదుట సంతోష్ హాజరు లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ ఇప్పట్లో హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. సిట్ గతంలో ఇచ్చిన నోటీసు మేరకు బీఎల్ సంతోష్ సోమవారం విచారణకు కావాల్సి ఉంది. మరోవైపు సోమ, మంగళవారాల్లో రాష్ట్ర బీజేపీ నాయకులకు నిర్వహిస్తున్న ప్రశిక్షణ్ శిబిరంలో సంస్థాగత అంశాలపై ఆయన శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కానీ బీఎల్ సంతోష్ ప్రశిక్షణ్ శిబిరానికి హాజరుకావడం లేదని, ఆయన తీసుకునే సెషన్‌ను తొలగించారని తెలిసింది. అయితే సాంకేతికంగా సంతోష్‌కు ఇంకా నోటీసులు అందలేదని, లేదా ఆయన స్వయంగా స్వీకరించలేదని.. అందువల్ల ఆయన దీనిపై స్పందించడంగానీ, విచారణకు హాజరుకావడంగానీ జరగకపోవచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కోర్టు ఢిల్లీ పోలీసుల ద్వారా సంతోష్‌కు నోటీసులు అందజేయాలని సూచించిందని.. మరి ఢిల్లీ పోలీసులు వెంటనే స్పందించి నోటీసులిస్తారా, సమయం తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది. ఒకవేళ నోటీసులు అందినా సంతోష్ తరఫు న్యాయవాది హాజరై కొంత సమయం కోరే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం బీఎల్ సంతోష్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని, ఇప్పట్లో సిట్ విచారణకు హాజరయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. చదవండి: గవర్నర్ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు
-
‘అనంత’లో విద్యుత్ ప్రమాదాలకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి/తిరుపతి రూరల్: విద్యుత్ ప్రమాదాలకు అవకాశమున్న ప్రాంతాలను, బలహీనంగా ఉన్న లైన్లను గుర్తించి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీ ఎస్పీడీసీఎల్) రంగంలోకి దిగింది. ముఖ్యంగా అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహెూన్నూరు సమీపంలో విద్యుత్ ప్రమాదం నేపథ్యంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సంస్థ సీఎండీ కె.సంతోషరావు మంగళవారం తెలిపారు. అనంతపురం సర్కిల్ పరిధిలోని సబ్స్టేషన్లు, లైన్లను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రమాదం జరిగేందుకు వీలున్న లైన్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ పనులు చేపట్టేందుకు వీలుగా సంస్థ కార్పొరేట్ కార్యాలయం నుంచి సర్కిల్ ఇన్చార్జ్, నోడల్ ఆఫీసర్ కె.గురవయ్య(చీఫ్ జనరల్ మేనేజర్/ఓఎం) నేతృత్వంలో అనంతపురం టౌన్, అనంతపురం రూరల్, గుత్తి, కళ్యాణదుర్గం, కదిరి, హిందూపురం డివిజన్లకు బాధ్యులుగా జి.బాలకృష్ణారెడ్డి (జనరల్ మేనేజర్/ఎనర్జీ ఆడిట్), కె.ఆదిశేషయ్య(సూపరింటెండింగ్ ఇంజనీర్/అసెస్మెంట్, ఎంక్వైరీస్), సీహెచ్.రామచంద్రారావు (జనరల్ మేనేజర్/కమర్షియల్), జి.సత్యనారాయణ(జనరల్ మేనేజర్/ప్రాజెక్ట్స్), జె.రమణాదేవి (సూపరింటెండింగ్ ఇంజనీర్/డీపీఈ), పి.మురళి (జనరల్ మేనేజర్/ప్లానింగ్)లను నియమిస్తూ ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. వీరికి సహాయకులుగా నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు డీపీఈ డివిజన్ల అధికారులు విధులు నిర్వహిస్తారని, సర్కిల్ పరిధిలోని 33/11 కేవీ సబ్స్టేషన్లలో లోపాలను గుర్తించి, సరిదిద్దేందుకు వీలుగా అనంతపురం టౌన్, అనంతపురం రూరల్, గుత్తి, కళ్యాణ దుర్గం, కదిరి, హిందూపురం డివిజన్లకు మీటర్స్, ప్రొటెక్షన్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను కేటాయించినట్లు వివరించారు. అధికారులంతా వారికి కేటాయించిన విధులకు తక్షణమే హాజరు కావాలని, ఈ పనులు పూర్తయ్యేవరకు వారంతా తమకు కేటాయించిన ప్రాంతంలోనే బస చేయాలని ఆదేశాలిచ్చామన్నారు. -
'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన ప్రభాస్
సంతోష్ శోభన్, జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా హీరో,హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ (LikeShareSubscribe).మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మించారు. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను వదిలారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డిజిటల్ వేదికగా ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం కామెడీగా, ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా సాగింది. ఈనెల 29న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. -
టీఎన్పీఎస్సీ కోచింగ్.. ఒంటరిగా ఉన్న సంతోష్ ప్రియపై లైంగికదాడి చేసి..
వేలూరు (తమిళనాడు): బావిలో శవమై తేలిన సంతోష్ ప్రియ(22) కేసును పోలీసులు చేధించారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా కొరటి గ్రామానికి చెందిన సంతోష్ ప్రియ తాతయ్యతో కలిసి నివసిస్తోంది. ప్రస్తుతం టీఎన్పీఎస్సీ పరీక్షలు రాసేందుకు ప్రైవేటు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గత నెల 23వ తేదీన సమీపంలోని బావిలో శవమై కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (భవిష్యత్తుపై ఎన్నో కలలు.. భర్తతో అమెరికా జీవితం గురించి ఆశలు..) పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులిమి హత్య చేసినట్లు తెలియడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. కొద్ది రోజులుగా స్విచ్ఛాఫ్‌లో ఉన్న మృతురాలి సెల్‌ఫోన్ సోమవారం తిరుపత్తూరు కోట సమీపంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. అక్కడికి చేరుకుని ఫోన్ ఉపయోగిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో యువకుడు కొరియర్ కంపెనీలో పనిచేసే మహేంద్రన్‌గా తెలిసింది. ఒంటరిగా ఉన్న సంతోష్ ప్రియపై లైంగికదాడి చేసి అనంతరం బయటకు తెలియకుండా ఉండేందుకు గొంతు నులిమి మృతదేహాన్ని బావిలో వేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. చదవండి: (ఆమె కోసం ఎంతకైనా.. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు భార్య..) -
నిత్యామీనన్‌ను చచ్చినా పెళ్లి చేసుకోను : సంతోష్ వర్కీ
ప్రేమిస్తున్నానంటూ సంతోష్ వర్కీ అనే వ్యక్తి తనను ఆరేళ్ల నుంచి వేధిస్తున్నాడని హీరోయిన్ నిత్యామీనన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన పెళ్లిపై జరిగిన ప్రచారంపై ఆమె స్పందించింది. సంతోష్ వర్కీ తనకు 30కి పైగా నంబర్స్ నుంచి కాల్ చేస్తూ విసిగించేవాడని పేర్కొంది. తాజాగా తనపై నిత్యామీనన్ చేస్తున్న ఆరోపణలపై సంతోష్ వర్కీ స్పందించాడు. ఇందులో వాస్తవం లేదని, ఒకే వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్‌కార్డులు కొనగలడో జనాలకే వదిలేస్తున్నాడని చెప్పాడు. నిత్యామీనన్‌కు వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని వాళ్ల తల్లి చెబితే, జరగలేదని తండ్రి చెప్పారు. అంతేకాకుండా వాళ్లు నాపై లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టాలని చూస్తున్నారు. 'గతంలో నిత్యామీనన్ అంటే తనకు ఇష్టం ఉండేది. తనను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా. కానీ ఇప్పుడు చచ్చినా ఆమెను పెళ్లిచేసుకోను. అసలు నిత్యామీనన్ గురించి ఇవన్నీ ముందే తెలిస్తే ప్రేమించి ఉండే వాడినే కాదు'. అంటూ కామెంట్స్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అసలు నువ్వు నిత్యామీనన్‌ను రిజెక్ట్ చేయడమేంటి?నీకంత సీన్ ఉందా? అంటూ హీరోయిన్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఎవరీ సంతోష్ వర్కీ? నిత్యామీనన్ పెళ్లి వార్తలతో ఒక్కసారిగా పాపులర్ అయిన సంతోష్ వర్కీ ఓ యూట్యూబర్. సినిమాల రివ్యూస్ చెప్పడంలో మలయాళంలో గుర్తింపు పొందాడు. చదవండి: ఆ వ్యక్తి ఆరేళ్లుగా వేధించాడు.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్ -
ఆ వ్యక్తి ఆరేళ్లుగా వేధించాడు.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్
ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సెలబ్రిటీస్ ఇందుకు అతీతం కాదు. నిత్యామీనన్ కూడా అలాంటి వేధింపులు ఎదుర్కొన్నారట. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఈ మలయాళ కుట్టి చాలా డేరింగ్ అండ్ డాషింగ్ నటి అని చెప్పొచ్చు. ఏ విషయాన్ని అయినా కుండ బద్ధలు కొట్టినట్టు చెబుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. విజయ్ సేతుపతితో కలిసి నటించిన మలయాళ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా నిత్యామీనన్ తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంది. తనను ఒక వ్యక్తి గత ఆరేళ్లుగా వేధింపులకు గురి చేశారని చెప్పింది. నటుడు మోహన్‌లాల్ ఆరాట్టు సినిమా పేరుపై విశ్లేషణ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చిన సంతోష్ వర్గీ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేసి ఇబ్బందులకు గురి చేశాడని వాపోయింది. చాలా మంది అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారని, అయితే తాను మాత్రం అతన్ని క్షమించి వదిలేశానని తెలిపింది. సంతోష్ తనను చాలా రకాలుగా అన్ పాపులర్ చేశాడని, చివరకు తన తల్లిదండ్రులు కూడా ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసి అతన్ని గట్టిగా హెచ్చరించారని పేర్కొంది. తన గురించి సంతోష్ చెప్పేవన్నీ అసత్యాలని వాటిని ఎవరూ నమ్మవద్దని కోరింది. కాగా ప్రస్తుతం ఈమె తమిళంలో ధనుష్‌కు జంటగా నటిస్తున్న తిరు చిట్రంబలమ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
Rudra Simha: యాక్షన్.. రివెంజ్.. ఎమోషన్
సంతోష్, స్నేహ, మైత్రి హీరో హీరోయిన్లుగా మనోహర్ కాటేపోగు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రసింహా’. ధరగయ్య బింగి, ఆంజనేయులు నందవరం, కోటేశ్వర్ రావు జింకల, మనోహర్ కాటేపోగు నిర్మించిన చిత్రం ఇది. ఈ నెల 8న ‘రుద్రసింహా’ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న సీనియర్ నటులు సుమన్, భానుచందర్ ఆడియోను విడుదల చేశారు. ‘‘యాక్షన్ అండ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులందరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడమే కాకుండా ఎంతో థ్రిల్ అవుతారు’’ అన్నారు మనోహర్. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు నిర్మాతలు. -
లవ్ యూ బేబీ’ కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది
తమిళసినిమా: లవ్ యూ బేబీ వీడియో ఆల్బమ్ కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని దర్శకుడు ప్రసాద్ రామన్ ధీమా వ్యక్తం చేశారు. నటుడు సంతోష్ ప్రతాప్, నటి ఐరా జంటగా నటించిన ఈ ఆల్బమ్‌ను అనుగ్రహ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్.కామాక్షి కనిమొళి రూపొందించారు. ముత్తమిళం, ప్రసాద్ రామన్ కలిసి రాసిన ఈ పాట కు రాకేష్ అంబికాపతి సంగీతాన్ని అందించారు. (చదవండి: ఓటీటీలోకి సిద్ధార్థ్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..) నటుడు సంగీత దర్శకుడు ప్రేమ్‌జీ అమరన్ పాడిన ఈ పాటకు సంతోష్ పాండే ఛాయాగ్రహణంను, రిచర్డ్ క్రిస్టఫర్ నృత్య దర్శకాన్ని సమకూర్చారు. ఈ తరం యువత నాడిని గ్రహించి వారిని అలరించే విధంగా ఈ వీడియో ఆల్బమ్‌ను రూపొందించినట్లు దర్శకుడు ప్రసాద్ రామన్ తెలిపారు. దీనిని 20వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. -
Green India Challenge: బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటిన అమీర్ ఖాన్
-
బండరాళ్లతో మోది.. ఆపై నిప్పంటించి..
ఇల్లందకుంట (హుజూరాబాద్): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని బండలతో దారుణం గా కొట్టి చంపి, ఆపై కిరాతకంగా మర్మావయవాలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు కారణం వివాహేతర సంబం ధమా, లేక రాజకీయ కక్షలా? అన్న అంశం చర్చనీయాం శంగా మారింది. విలాసాగర్ గ్రామానికి చెందిన సిరిశెట్టి సంతోష్ (40) అనే వ్యక్తిని ఆదివారం అర్ధరాత్రి తరువాత వెంకటేశ్వరపల్లి శివారులోని కెనాల్ వద్ద దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. మృతుడి భార్య కోమల కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లో మాట్లాడి బయటకు రమ్మని చెప్పారు. దీంతో బయటకు వెళ్లిన సంతోష్ తిరిగి రాలేదు. సోమవారం ఉదయం పంట పొలాల మ«ధ్య శవమై కనిపించాడు. హత్యపై అనుమానాలు..: సంతోష్ హత్యపై స్థానికులు వివిధ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యకు వివాహే తర సంబంధమే కారణమా..? లేక పాత కక్షలతో ఎవరైనా ఈ ఘాతుకానికి ఒడిగట్టారా అనే కోణంలో పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు. మరో పక్క మూడు రోజుల క్రితమే సంతోష్ రాజకీయంగా వేరే పార్టీలోకి మారడంతో దానికి సంబంధిం చిన కారణాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘ టన స్థలాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అను మానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీపీ చెప్పారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య కోమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామచంద్రరావు తెలిపారు. -
వెండితెరపై మరోసారి ‘శ్రీదేవి... శోభన్‌బాబు’ల ప్రేమ కథ
తండ్రి చిరంజీవి బర్త్ డే సందర్భంగా కుమార్తె సుస్మితా కొణిదెల నిర్మాతగా ‘శ్రీదేవి... శోభన్‌బాబు’ సినిమాను శనివారం ప్రకటించారు. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో సుస్మితకు నిర్మాతగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు సుస్మిత భర్త విష్ణుప్రసాద్ మరో నిర్మాత. గోల్డ్‌బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రశాంత్ కుమార్ దిమ్మల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎవరిచ్చారో తెలుసా?) ఈ కలర్‌ఫుల్ లవ్‌స్టోరీలో సంతోష్ శోభన్, గౌరి జి. కిషన్ (‘జాను’ సినిమాలో చిన్ననాటి సమంత పాత్ర చేసిన అమ్మాయి) హీరో, హీరోయిన్లుగా నటిస్తారు. ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం తెలియజేసింది. -
పాలమూరు.. పచ్చదనానికి విశ్వవేదిక
సాక్షి, హైదరాబాద్: సమైక్యపాలనలో వలసలకు, ఆకలిచావులకు నిలయమైన పాలమూరు జిల్లా స్వయంపాలనలో పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. హరితహారం స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సీడ్‌బాల్స్‌ను రికార్డుస్థాయిలో తయారు చేసి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా వెదజల్లడం, సీడ్‌బాల్స్‌తో అత్యంత పొడవైన వాక్యాన్ని నిర్మించడం ద్వారా సాధించిన గిన్నీస్‌బుక్ వరల్డ్ రికార్డు జ్ఞాపికను శుక్రవారం ప్రగతిభన్‌లో సీఎం చేతుల మీదుగా ఎంపీ జోగినపెల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అందుకున్నారు. ఈ సందర్భంగా వారి కృషిని సీఎం అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా అందిస్తున్న జలాలతో జిల్లావ్యాప్తంగా పచ్చనిపంటలు కనువిందు చేస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. బీడుభూములు, రాళ్లు, గుట్టలకే ఇన్నాళ్లూ పరిమితమైన పాలమూరు పచ్చదనంతో రూపురేఖలను మార్చుకుని, వినూత్నరీతిలో అభివృద్ధిపథంలో ముందుకు దూసుకుపోతుండటం గర్వకారణమన్నారు. తక్కువఖర్చుతో ఎక్కువ పచ్చదనాన్ని సాధించేదిశగా రికార్డుస్థాయిలో 2 కోట్ల పది లక్షల సీడ్‌బాల్స్‌ను నెలరోజుల వ్యవధిలో తయారు చేసి 10 రోజుల్లో కొండలు, గుట్టల ప్రాంతాల్లో వెదజల్లిన జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాల కృషిని అభినందించారు. -
తెలంగాణ బీజేపీ నేతల పనితీరుపై అధిష్టానం సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతల పనితీరుపై అధిష్టానం సీరియస్ అయ్యింది. ప్రజా సమస్యలపై సరైన రీతిలో పనిచేయడం లేదని జాతీయ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అనుబంధ సంఘాల పనితీరుపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. హుజురాబాద్ మాదిరిగా అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు ఎందుకు పనిచేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మైనార్టీ, క్రిష్టియన్ వర్గాలను ఎందుకు దూరం పెడుతున్నారంటూ మండిపడ్డారు. హైదరాబాద్ నాయకులు గ్రామాలకు, కార్యకర్తల వద్దకు వెళ్లాలన్నారు. పోరాటం చేయకుంటే పార్టీతో పాటు నేతలకు గుర్తింపు రాదని సంతోష్‌జీ అన్నారు. -
జోగినిపల్లి సంతోష్ కుమార్ తో స్ట్రెయిట్ టాక్
-
భర్తతో వీడియో కాల్.. ఇంట్లోకి దూసుకొచ్చిన రాకెట్
గాజా సిటీ : ఇజ్రాయిల్ - పాలస్తీనా మధ్య వైషమ్యాలు అక్కడ రక్తపుటేరులు పారిస్తున్నాయి. ఇరు ప్రాంతాల మధ్య జరిగిన దాడుల్లో 28 పాలస్తీనియన్లు మరణించారు. వారిలో 16 మంది ఉగ్రవాదులేనని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయితే మరణించిన వారిలో కేరళకు చెందిన మహిళ సౌమ్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కేరళలోని ఇడుక్కి జిల్లా కీరితోడుకు చెందిన ఎంఎస్ సౌమ్య ఏడేళ్లుగా ఇజ్రాయెల్ అష్కెలోన్ నగరంలో పని మనిషిగా చేస్తోంది. తాజాగా పాలస్తీనా జరిపిన రాకెట్ దాడిలో ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అష్కెలోన్ నగరంలో తన నివాసంలో ఉన్న సౌమ్య మంగళవారం సాయంత్రం భర్త సంతోశ్‌తో వీడియో కాల్ మాట్లాడుతుండగా పాలస్తీనా వదిలిన రాకెట్ ఆమె ఇంట్లో పడి పేలింది. ఒక్కసారిగా పేలడంతో ఆ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. "వీడియో కాల్ సమయంలో నా తమ్ముడు భారీ శబ్ధం విన్నాడు. అకస్మాత్తుగా సౌమ్య ఫోన్ డిస్ కనెక్ట్ అయ్యింది. దీంతో భయాందోళనకు గురైన మేం సౌమ్య స్నేహితులకు ఫోన్ చేశాం. ఈ ఘటనలో ఆమె మృతి చెందింది అని వారు చెప్పారు’ అని సౌమ్య బావ సాజీ స్థానిక మీడియాతో తెలిపారు. -
కోహ్లి వీరాభిమాని కూతురు పేరు తెలుసా?
సాక్షి, వరంగల్ : టీమిండిమా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడో వీరాభిమాని. ఎనిమిది నెలలు ఆగి కోహ్లి కూతురికి పెట్టిన పేరునే తన కూతురికి పెట్టాడు. వివరాలు.. రాయపర్తి మండలం, మైలారం శివారు తండాకి చెందిన బానోత్ సంతోష్.. విరాట్ కోహ్లికి వీరాభిమాని. సంతోష్ దంపతులకు గత సంవత్సరం జూన్ 15న అమ్మాయి పుట్టింది. అయితే విరాట్ కోహ్లి- అనుష్క దంపతులకు పుట్టబోయే బిడ్డకు పెట్టే పేరునే తన కూతురికి కూడా పెట్టుకోవాలని అతడు నిశ్చయించుకున్నాడు. అప్పటినుంచి ఎనిమిది నెలలు వేచి చూశాడు. ఈ రోజు(సోమవారం) కోహ్లి దంపతులు తమ బిడ్డకు ‘'వామికా’గా నామకరణం చేయటంతో.. సంతోష్ తన కూతురుకి కూడా ‘వామిక’ అనిపేరు పెట్టాడు. చదవండి : తొలిసారి కూతురి ఫొటో షేర్ చేసిన ‘విరుష్క’ -
పది రోజుల్లో పెళ్లి.. అంతలోనే..!
సాక్షి, కోరుట్ల : అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు వైద్యుడిగా స్థిరపడితే ఆ తల్లిదండ్రులు సంబరపడ్డారు.. పెళ్లి చేసి, మురిసి పోవాలని ఆశపడితే రోడ్డు ప్రమాదంలో అతని మృతి వారికి తీరని శోకాన్ని మిగిల్చింది. పది రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన కుమారుడి మృతదేహాన్ని చూసి, ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించిన సంఘటన కోరుట్లలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సిరిసిల్ల జిల్లాలోని ముష్టిపల్లికి చెందిన గన్నమనేని చంద్రశేఖర్‌రావు ఆర్టీసీ డ్రైవర్ పని చేసి, రిటైర్ అయ్యారు. ఉద్యోగంలో ఉండగానే కోరుట్లలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య స్వరూప, ఇద్దరు కుమారులు సంతోష్‌రావు, సవ్యసాత్వి ఉన్నారు. కుమారులను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమారుడు వైద్యుడిగా కర్ణాటకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు సవ్యసాత్వి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. సంతోష్‌రావు(29)కు కరీంనగర్‌లోని ఓ వైద్యురాలితో రెండు నెలల కిందట నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 26ను పెళ్లి పెట్టుకున్నారు. చదవండి: ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా అతని తమ్ముడు సవ్యసాత్వి అన్న పెళ్లి కోసం అమెరికా నుంచి వారం రోజుల కిందటే కోరుట్లకు చేరుకున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి పెళ్లి పనులు చూస్తున్నాడు. పెళ్లి చేసుకునేందుకు సంతోష్‌రావు తన స్నేహితుడితో కలిసి సొంత కారులో శనివారం కోరుట్లకు బయలుదేరాడు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా కేంద్రంలో ఆగి ఉన్న లారీని వీరి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సంతోష్‌రావుకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఎదిగిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. సంతోష్‌రావు మృతదేహాన్ని చూసేందుకు బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అతని మృతదేహానికి, జిల్లెడు చెట్టుకు పెళ్లిచేసి, అంత్యక్రియల కార్యక్రమం పూర్తి చేశారు. -
పార్లమెంట్‌కు చేరిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’
సాక్షి, న్యూఢిల్లీ: గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా పార్లమెంట్ ఆవరణలో లోక్‌సభ సభాపతి ఓంబిర్లా రుద్రా క్ష మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త, రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లడం కోసం పార్లమెం టు వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషితో స్పెషల్ ఇంటర్వూ
-
అండగా ఉంటా: సీఎం కేసీఆర్
సాక్షి, సూర్యాపేట: ‘కల్నల్ సంతోష్‌బాబు మరణం నన్ను ఎం తగానో కలచివేసింది. దేశ రక్షణ కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు. ఇంతటి త్యాగం చేసిన కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉం టుంది’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కల్నల్ కుటుంబానికి భరోసా ఇచ్చారు. సరిహద్దులో చైనా దాడిలో వీరమరణం పొందిన సూర్యాపేటవాసి కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 3:40 గంటలకు సూర్యాపేటలోని సంతోష్‌బాబు నివాసానికి చేరుకున్నారు. ముం దుగా కల్నల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆ తర్వాత మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్‌లతో కలసి కల్నల్ సతీమణి సంతోషి, పిల్లలు అభిజ్ఞ, అనిరుధ్, తల్లి దండ్రులు ఉపేందర్, మంజుల, చెల్లెలు శృతితో కేసీఆర్ మాట్లాడి వారిని ఓదార్చారు. దేశం కోసం సంతోష్‌బాబు చేసిన త్యాగం చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. ప్రభుత్వం సంతోష్ కుటుంబా నికి ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని చెప్పారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డికి కేసీఆర్ సూచించారు. సీఎం ఓదార్పుతో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. సూర్యాపేటలో సోమవారం కల్నల్ సంతోష్‌బాబు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రూ.5 కోట్ల చెక్కులు అందించిన సీఎం.. కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషికి గ్రూప్–1 ఉద్యోగం కల్పిస్తూ జారీ చేసిన నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆమెకు అందజేశారు. అలాగే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సమీపాన ఉన్న 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాలను కూడా ఆమెకు అందించారు. వాటితోపాటు సంతోషికి రూ. 4 కోట్ల చెక్కును, కల్నల్ తల్లిదండ్రులకు రూ. కోటి చెక్కును అందజేశారు. ఇంటి స్థలాన్ని ముఖ్యమంత్రే స్వయంగా ఎంపిక చేశారని మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు సీఎస్ సోమేశ్ కుమార్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సూర్యాపేటలో సోమవారం కల్నల్ సంతోష్‌బాబు సతీమణి సంతోషి, పిల్లలు అభిజ్ఞ, అనిరుధ్‌లను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లోకి సీఎంతోపాటు ముగ్గురే.. కరోనా విజృంభణ నేపథ్యంలో జిల్లాలో అధికార యంత్రాంగం సీఎం కేసీఆర్ రాక సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సీఎం కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలెవరూ రావొద్దని ముందుగానే ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిబంధనలను అనుసరిస్తూ సీఎంతోపాటు కేవలం మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్‌లు మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సీఎం వెంట వచ్చిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రవణ్రెడ్డిలు సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావులు సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంతోష్ బాబు చిత్రపటంపై జైహింద్ అని రాస్తున్న సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన పర్యటన.. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి తుర్కపల్లి, భువనగిరి, వలిగొండ, చిట్యాల మీదుగా సూర్యాపేటకు చేరుకున్నారు. కల్నల్ కుటుంబాన్ని పరామర్శించాక తిరుగు ప్రయాణంలోనూ అదే మార్గంలో ఫాంహౌస్‌కు వెళ్లారు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా సంతోషి: ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, సూర్యాపేట: కల్నల్ సంతోష్‌బాబు సతీమణి సంతోషిని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (గ్రూప్–1 కేడర్)గా నియమిస్తూ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమ వారం రాత్రి జీవో నంబర్ 80 జారీ చేశారు. ఆమె నియామకాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించినట్లు పేర్కొన్నారు. ఆమె 30 రోజుల్లోగా సం బంధిత శాఖ కమిషనర్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ జీవో ప్రకారం సంతోషి వేత నం రూ. 40,270–93,780 వరకు ఉండనుంది. దీనికి అలవెన్స్‌లు అదనం. అయితే సంతోషి ఒకవేళ వేరే పోస్టును కోరుకుంటే ఆ విషయాన్ని రెండు రోజుల్లోగా తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. స్థలం కేటాయిస్తూ మరో జీవో.. సంతోషికి 711 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ జీవో నంబర్ 59ను సీఎస్ విడుదల చేశారు. హైదరాబాద్ జిల్లాలోని షేక్‌పేట రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 6/1, వార్డు నంబర్ 10, రోడ్డు నంబర్ 14 బంజారాహిల్స్‌లో కల్నల్ సంతోష్‌బాబు సతీమణి సంతోషి పేరు మీద 711 గజాల స్థలం ఇస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు మా కుటుంబాన్ని పరామర్శించి వెళ్లారు. సంతోష్‌బాబును తీసుకురాలేం కానీ ఆయన లేని లోటు పూడుస్తామని భరోసా ఇచ్చారు. గ్రూప్–1 స్ధాయి ఉద్యోగాన్ని ఇస్తామన్నారు. ఈ అవకాశం నాకే ఇచ్చారు. ఏ శాఖలో చేరితే ఆ శాఖను కేటాయిస్తామన్నారు. రూ. 4 కోట్లను పిల్లల పేరున, రూ. కోటిని మా అత్తగారి పేరున చెక్కులు అందించారు. బంజారాహిల్స్‌లో నివాస స్ధలాన్ని కేటాయించారు. ఈ సంఘటనలో వీరమరణం పొందిన ఇతర సైనికులకు త్వరలోనే ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. మాకు అండగా నిలిచిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు, సహకరించిన మంత్రి జగదీశ్‌రెడ్డికి ధన్యవాదాలు. ప్రభుత్వానికి, మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాం. ఇంట్లో కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తన ఇంటికి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. – బిక్కుమళ్ల సంతోషి, కల్నల్ సంతోష్‌బాబు సతీమణి కొండంత ధైర్యం వచ్చింది సీఎం కేసీఆర్ ఎప్పటికీ అందుబాటులో ఉంటామన్నారు. ఏ సాయం వచ్చినా అండగా నిలుస్తానన్నారు. కేసీఆర్ రావడంతో మాకు కొండంత ధైర్యం వచ్చింది. కేసీఆర్ గొప్పతనం మాటల్లోనే కాదు.. చేతుల్లోనూ చూపిస్తారని మా ఇంటికి స్వయంగా రావడంతో తెలిసొచ్చింది. మా బాబు లేకున్నా మా కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. మా బాబు చనిపోయిన నాటి నుంచి అన్ని విషయాల్లోనూ సహకరించిన మంత్రి జగదీశ్‌రెడ్డికి ధన్యవాదాలు. – మంజుల, కల్నల్ సంతోష్‌బాబు తల్లి సూర్యాపేటలో కల్నల్ కాంస్య విగ్రహం: మంత్రి జగదీశ్‌రెడ్డి వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు కాంస్య విగ్రహాన్ని సూర్యాపేటలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించి వెళ్లిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. సూర్యాపేట పాత బస్టాండ్–కోర్టు జంక్షన్ రహదారికి కల్నల్ పేరు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. కల్నల్ సంతోష్‌బాబుతోపాటు వీరమరణం పొందిన మరో 19 మంది సైనికుల కుటుంబాలకు సైతం ఆర్థిక సాయం ప్రకటించి సీఎం కేసీఆర్ ఔదార్యం చాటుకున్నారన్నారు. -
సీఎం కేసీఆర్ ఇంటికి ఆహ్వానించారు : సంతోషి
సాక్షి, సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తమను పరామర్శించడానికి ఇంటికి రావడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషి అన్నారు. తమ పిల్లలకు రూ.4 కోట్లు, సంతోష్‌బాబు తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కును అందజేయడంతో పాటు, తనకు గ్రూప్-1 ఉద్యోగం, బంజారాహిల్స్‌లో 711 గజాల ఇంటిస్థలం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని సీఎం కేసీఆర్ భరోపా ఇచ్చారని చెప్పారు. తన పిల్లలతో కూడా సీఎం కేసీఆర్ మాట్లాడారని, తమను ఇంటికి కూడా ఆహ్వానించారని ఆమె చెప్పారు. ఏ అవసరం ఉన్న ఫోన్ చేయమని సీఎం కేసీఆర్ చెప్పారని ఆమె తెలిపారు. తనకు మాదిరిగానే ఇతర జవాన్లకు ఆర్థిక సహాయం ప్రకటించడం సంతోషకరమన్నారు. (చదవండి : సంతోష్ కుటుంబానికి అండగా ఉంటాం : కేసీఆర్) సీఎం కేసీఆర్ మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించారని సంతోష్‌బాబు తల్లి మంజుల కొనియాడారు. తమకు అండగా నిలిచిన మంత్రి జగదీశ్‌రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. కాగా,సంతోష్‌బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పరామర్శించిన విషయం తెలిసిందే. రోడ్డు మార్గంలో సూర్యాపేట, విద్యానగర్‌లో ఉన్న సంతోష్‌బాబు నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంతోష్‌బాబు తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, భార్య సంతోషిని పరామర్శించారు. సీఎంతో పాటు మంత్రి జగదీశ్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు సూర్యాపేటకు వెళ్లారు. -
సంతోష్ కుటుంబానికి అండగా ఉంటా: కేసీఆర్
సాక్షి, సూర్యాపేట : భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం సుర్యాపేటలో పరామర్శించారు. మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమర్ లతో కలిసి సోమవారం మధ్యాహ్నం సూర్యాపేటకు చేరుకున్న కేసిఆర్, ముందుగా సంతోష్ చిత్రపటానికి పూలు చల్లి అంజలి ఘటించారు. అనంతరం సంతోష్ భార్య సంతోషి, తల్లితండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శృతిలను ఓదార్చారు. సంతోష్ పిల్లలు, అభిగ్న, అనిరుధ్ తేజలతో మాట్లాడారు. దేశరక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంతోష్ మరణం తనను ఎంతగానో కలచివేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వం సంతోష్ కుటుంబానికి ఎల్లవేళ్లలా అండగా వుంటుందని హామి ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని చెప్పారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు. (చదవండి : రాళ్ల దెబ్బలు.. నిలువెల్లా గాయాలతో..) సంతోష్ భార్య సంతోషీకి గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చే నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. హైదరాబాద్ లోని బంజార్ హిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని సంతోష్ భార్యకు ముఖ్యమంత్రి అందించారు. సంతోష్ భార్యకు రూ. 4 కోట్ల చెక్కును, తల్లితండ్రులకు రూ.1 కోటి చెక్కును ముఖ్యమంత్రి అందించారు.(చదవండి : పిల్లలు ఆర్మీకి వెళ్తానంటే సంతోషంగా పంపిస్తా) ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జె. సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంఎల్ఎలు గ్యాదరి కిషోర్, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి, సైదిరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ దీపికా యుగంధర్, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణమ్మ, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్
సాక్షి, సూర్యాపేట: చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూర్యాపేటకు రానున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్ సోమవారం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ విద్యానగర్‌లో ఉన్న సంతోష్‌బాబు నివాసానికి వెళ్లి ఆయన తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, భార్య సంతోషిని పరామర్శిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5 కోట్ల నగదు, సంతోషికి గ్రూప్–1 స్థాయి ఉద్యోగానికి సంబం ధించిన ఉత్తర్వులను సీఎం వారికి అందజేయనున్నారు. అలాగే హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఇంటిస్థలం పత్రాలను కూడా సీఎం, సంతోష్‌బాబు కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నట్లు సమాచారం. సీఎం వెంట విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్ సంతోష్‌బాబు నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. -
కల్నల్ సంతోష్‌కు నివాళులర్పించిన యువ హీరో
సాక్షి, సూర్యాపేట : సరిహద్దులో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సూర్యాపేట జిల్లావాసి కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ‘హిట్’ సినిమా హీరో విశ్వక్సేన్ పరామర్శించారు. శనివారం సూర్యాపేట వెళ్లి, సంతోష్‌బాబుకు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంతోష్‌బాబు లాంటి వీరుపుత్రుడిని దేశానికి అందించిన ఆయన తల్లికి ధన్యవాదాలు తెలిపారు. (పిల్లలు ఆర్మీకి వెళ్తానంటే సంతోషంగా పంపిస్తా) ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ.. ‘ఈ కుటుంబం చేసిన త్యాగం కేవలం మన ఒక్కరి కోసం కాదు, మన రాష్ట్రం కోసం కాదు, మన భారత దేశం కోసం చేసిన త్యాగం. ఆర్మీకి మనం రుణపడి ఉండాలి. అందుకే సంతోష్‌బాబు తల్లిని ఒకసారి కలుసుకోవాలని అనిపించింది. కనీసం నేను ఆ తల్లిని సందర్శించి, మన సంతోష్‌బాబును దేశం కోసం త్యాగం చేసిన ఆమెకు కృతజ్ఞతలతో పాటు సంతాపాన్నీ తెలపగలిగాను. పూడ్చలేని లోటు నుంచి కోలుకొని మన వీర సైనికుల కుటుంబాలకు ఆత్మ స్థైర్యం లభించాలని ప్రార్థిద్దాం. జైహింద్’అన్నారు. (చదవండి : కల్నల్ సంతోష్ కుటుంబానికి రూ. 5 కోట్లు ) -
నేను ‘సంతోషం’గా ఒప్పుకుంటా..
ఇటీవల చైనా సరిహద్దుల్లో జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన భారతమాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్‌బాబు. ఆయన సతీమణి సంతోషి తన భర్త జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు. ఆమె మనోగతం ఆమె మాటల్లోనే... చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచడం, తానూ సంతోషంగా ఉండడమే ఆయన బలం. ఎదుటివారికి చేతనైన సహాయం చేయాలని తపన పడేవారు. కుమారుడిగా తండ్రి కోరిక మేరకు ఆర్మీలో చేరారు. అయినా కుటుంబానికి ఏమీ లోటు చేయలేదు. భర్తగా నన్ను బాగా చూసుకున్నారు. తండ్రిగా నా పిల్లలకు రోల్ మోడల్ అయ్యారు. రేపు నా పిల్లలు పెరిగి పెద్దయ్యాక వారు ఆర్మీలో చేరతానన్నా నేను సంతోషంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే బాధ్యతాయుతమైన యువత ఆర్మీలో చేరి దేశభక్తిని చాటుకోవాలి’ అని సంతోషి ఆకాంక్షించారు. నేనే కావాలని.. సైనికుడిగా తన జీవన సరళి అంతా వేరేలా ఉంటుందని, సగటు ఆడపిల్లలు కోరుకునే మామూలు జీవితాన్ని తాను ఇవ్వలేకపోవచ్చని, కనుక తనను అర్థం చేసుకునే అమ్మాయి కావాలని, అలాంటి సంబంధమే చూడమని సంతోష్ తన అమ్మా, నాన్నతో అన్నాడట. అలా చుట్టాలమ్మాయని నన్ను అతనికి చూపించారు. ‘నిన్ను చూసిన తర్వాత సంతోష్ రెండు, మూడు మ్యాచ్‌లు చూశాడమ్మా.. కానీ నువ్వే కావాలని అన్నాడు’ అని అత్తయ్య ఎప్పుడూ నాతో అనేది. (కల్నల్ సంతోష్ కుటుంబానికి రూ. 5 కోట్లు) సమన్యాయం చేశారు డ్యూటీలో ఉన్నప్పుడు పనికి ప్రాధాన్యత ఇచ్చాడు. కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు కుటుంబానికి అంతే స్థాయిలో ప్రాధాన్యత నిచ్చారు. మా దగ్గరకు మార్చి 21న ఢిల్లీ వచ్చి ఏప్రిల్ 15కు వెళ్లారు. సెలవులకు వచ్చినప్పుడు విహార యాత్రలకు పిల్లలతో కలిసి వెళ్లాలనుకున్నాం. కానీ లాక్డౌన్ వల్ల వెళ్లలేకపోయాం. అదే సమయంలో మా నాన్నకు హాస్పిటల్లో చెకప్ ఉంటే సూర్యాపేటకు రమ్మని అడిగారు. అయితే ఇక్కడకు వస్తే తానే దగ్గరుండి చూపిస్తానని, వాళ్లనే ఇక్కడికి రమ్మని చెప్పారు. మా అమ్మానాన్నని కూడా వాళ్ల అమ్మానాన్నల్లాగే చూసుకునేవాడు. అక్కడ సగం.. ఇక్కడ సగం.. మా పెళ్లయి పదిన్నరేళ్లు అయింది. పెళ్లి తర్వాత మేము రెండేళ్లు కలిసి ఉన్నాం. తర్వాత నాలుగేళ్లు సర్వీస్‌లో ఉన్నారు. మళ్లీ మూడేళ్లు కలిసి ఉన్నాం. గత ఏడాది జూన్ నుంచి ఫీల్డ్‌లో ఉన్నారు. నాకు, పిల్లలకు ఏది ఇష్టమైతే అది కొనిచ్చేవారు. తన గురించి తర్వాత ఆలోచించే వారు. పిల్లల గురించి కలలు కన్నారు.. పిల్లలకు మంచి విద్యనందించాలని, వారిని మంచి స్థాయికి తీసుకురావాలని కలలు కన్నారు. కానీ ఇంతట్లోనే ఇలా అవుతుందని అనుకోలేదు...(దుఃఖంతో గొంతు పూడుకుపోయింది) మా పాపకు 9 ఏళ్లు, బాబుకు మూడేళ్లు. ఎప్పుడు ఫోన్ చేసినా ముందు వాళ్లతో మాట్లాడిన తర్వాతనే నాతో మాట్లాడేవారు. అదే చివరి మాట.. చివరిసారిగా ఈ నెల 14న ఆయన నాతో మాట్లాడారు. పిల్లల యోగ క్షేమాలు అడిగారు. అంతలోనే బిజీగా ఉన్నానని, ఆ తర్వాత తీరిగ్గా కాల్ చేస్తానని చెప్పారు. ఇదే నాకు అతని నుంచి వచ్చిన చివరి ఫోన్. తర్వాత రెండు రోజులకే.. తాను ఇక లేడన్న విషాద వార్త నాకు చేరింది. యుద్ధంలో కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారని టీవీలో స్క్రోలింగ్ చూశాను. పిల్లలు ఆర్మీకి వెళ్తా అంటే పంపిస్తా.. పిల్లలు భవిష్యత్‌లో ఏది చేయాలనుకుంటే ఆ స్వేచ్ఛ ఇవ్వాలనే వారు. ఆయన పోయారని నేను వెనుకాడేది లేదు. పిల్లలకు భవిష్యత్‌లో ఏది ఇష్టమైతే అదే చేయిస్తా. ఒకవేళ వాళ్లు ఆర్మీలోకి వాళ్లు వెళ్లాలనుకుంటే అక్కడికైనా పంపిస్తానని‘సాక్షి’అడిగిన ప్రశ్నకు ఆమె సగర్వంగా సమాధానమిచ్చారు. ఆయనపై దేశభక్తిని చాటారు.. ఆయన ఒక గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆయన ఆలోచనలు ఎంతో ఉదాత్తంగా ఉండేవి. మాటలు ఎదుటివారికి ఎంతో ధైర్యాన్నిచ్చేవి. వృత్తిధర్మంగా శత్రువులను చీల్చి చెండాడేవారు. ఆయన ఎంత గొప్పవ్యక్తో ఆయన అంత్యక్రియల సందర్భంగా అందరూ మాట్లాడుకునే మాటలు వింటుంటే బాధతోపాటు గర్వంగా కూడా అనిపించింది. సరిహద్దుల్లో మన కోసం ఎందరో ప్రాణ త్యాగం చేస్తున్నారు. డిఫెన్స్‌లోకి రావాలంటే ప్రాణాలు పోతాయన్న భయం ఉండొద్దు. దేశరక్షణకు ఎంతమంది ఉంటే.. మనకు అంత బలం. తండ్రి ఆదర్శాలకు అనుగుణంగా... మా మామగారికి ఒక ఆలోచన ఉండేది. పుట్టిన ప్రతి వాళ్లు బతుకుతారు, చస్తారు.. కానీ ఆ చావుకు ఒక అర్థం ఉండాలన్నది ఆయన భావన. ఆ ఆలోచనలకు అనుగుణంగానే తండ్రి తనను, చెల్లిని పెంచేవారని నాకు చెబుతుండేవారు. ఆయన తన తండ్రి ఆదర్శాలకు అనుగుణంగా పెరిగినట్లే నేను రేపు నా పిల్లలను వాళ్ల తండ్రి ఆలోచనలకు తగ్గట్టే తీర్చిదిద్దుతాను. – బొల్లం శ్రీనివాస్, సూర్యాపేట -
కల్నల్ సంతోష్ కుటుంబానికి రూ. 5 కోట్లు
సాక్షి, హైదరాబాద్: సరిహద్దులో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సూర్యాపేట జిల్లావాసి కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోష్ బాబు కుటుంబానికి రూ. 5 కోట్ల నగదుతోపాటు నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్–1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తానే స్వయంగా కల్నల్ సంతోష్ ఇంటికి వెళ్లి సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది అమర జవాన్ల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి ద్వారా అందిస్తామన్నారు. ఆ కుటుంబాలను ఇతర రాష్ట్రాలూ ఆదుకోవాలి ‘సరిహద్దులో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలి. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలి. తద్వారా సైనికుల్లో ఆత్మవిశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలి. కేంద్రానికి అండగా రాష్ట్రాలు కూడా సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే సైనికులకు, వారి కుటుంబాలకు దేశం మా వెంట నిలుస్తుందనే నమ్మకం కుదురుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సూచించారు. సంతోష్ తల్లిదండ్రుల కృతజ్ఞతలు సూర్యాపేట అర్బన్: దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ రూ.5 కోట్లు, ఇంటి స్థలం, సంతోష్‌బాబు సతీమణికి గ్రూప్–1 స్థాయి ఉద్యోగం స్వయంగా వారి ఇంటికే వచ్చి ఇస్తానని ప్రకటించడం పట్ల ఆయన కుటుంబసభ్యులు శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. సూర్యాపేటలోని సంతోష్ ఇంటి వద్ద తండ్రి ఉపేందర్, తల్లి మంజుల చేతులెత్తి నమస్కరిస్తూ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పారు. -
సంతోష్ బాబు కుటుంబానికి భారీ సాయం: కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ : గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సంతోష్ బాబు కుటుంబానికి 5 కోట్ల రూపాయల నగదు, నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరుఫున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలని కేసీఆర్ అన్నారు. ‘వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవడం ద్వారా సైనికుల్లో ఆత్మ విశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలి. దేశమంతా మీ వెంట ఉందనే సందేశం అందించాలి. వీర మరణం పొందిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఎలాగూ సాయం చేస్తుంది. కానీ రాష్ట్రాలు కూడా సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే సైనికులకు, వారి కుటుంబాలకు దేశం మా వెంట నిలుస్తుందనే నమ్మకం కుదురుతుంది. సింబల్ ఆఫ్ యూనిటీ ప్రదర్శించాలి. కరోనాతో ఆర్థిక ఇబ్బుందులున్నప్పటికీ మిగతా ఖర్చులు తగ్గించుకుని అయినా సైనికుల సంక్షేమానికి పాటు పడాల’’ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా చెప్పారు. తెలంగాణ బిడ్డకు దక్కిన గౌరవం కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ భరోసాగా ముందుకొచ్చిన తీరు పట్ల సంతోష్ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డకు తగిన గౌరవం ఇచ్చారని వారు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి జగదీష్‌రెడ్డి మొదటినుంచి తమకు అన్ని విధాలా అండగా ఉంటున్నారని కల్నల్ సంతోష్ భార్య సంతోషి చెప్పారు. చదవండి: కల్నల్ సంతోష్‌కు కాంస్య విగ్రహం -
వీరుడా.. వీడ్కోలు
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: వీర మరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబుకు జనం అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. ‘జై జవాన్, వందేమాతరం, భారత్ మాతాకీ జై, చైనా ఖబడ్దార్’ అంటూ పెద్దపెట్టున నినదిస్తూ, జాతీయ పతాకాలు చేతబట్టి అంతిమయాత్రలో కదిలారు. ‘వీరుడా నీ త్యాగం ఎప్పటికీ మరువం’అంటూ సూర్యాపేట పట్టణమంతా గొంతెత్తి స్మరించుకుంది. గురువారం ఉదయం 9.40 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమై పట్టణ సమీపంలోని కేసారం గ్రామం వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రానికి 11.30 గంటలకు చేరుకుంది. 5.5 కిలోమీటర్ల మేర రెండు గంటల పాటు సాగిన అంతిమయాత్ర జనసంద్రమైంది. కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు, ప్రజలు, ప్రభుత్వ ప్రముఖుల అశ్రునయనాలు, బాధాతప్తహృదయాల మధ్య సంతోష్‌బాబు అంత్యక్రియల్ని సైనిక లాంఛనాలతో చేపట్టారు. బిహార్ రెజిమెంట్ 1వ బెటాలియన్ సైనికులు గౌరవ సూచకంగా గాల్లోకి మూడురౌండ్ల కాల్పులు జరిపిన అనంతరం దహన సంస్కారాలు ముగిశాయి. భర్త పార్థివదేహానికి కుమారుడు అనిరుద్‌తో కలిసి సెల్యూట్ చేస్తున్న సంతోషి కడచూపు వేళ జనమంతా కన్నీటిపర్యంతం బుధవారం రాత్రి 11.40కి కల్నల్ సంతోష్‌బాబు పార్థివదేహం సూర్యాపేట విద్యానగర్‌లోని ఆయన నివాసానికి చేరుకుంది. అప్పటికే అమర జవానుకు నివాళులర్పించేందుకు భారీగా జనం తరలివచ్చారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి కల్నల్‌ను కడసారి చూసేందుకు మరింత పెద్దసంఖ్యలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ.. నివాళులర్పించారు. సంతోష్‌బాబు పార్థివదేహాన్ని ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై ఉంచారు. సైనిక లాంఛనాలతో ఆర్మీ, నేవీ అధికారులు, సిబ్బందితో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి 10 నిమిషాల పాటు పార్థివదేహానికి గౌరవ వందనం సమర్పించారు. 9.40 గంటలకు బిహార్ రెజిమెంట్ ఫస్ట్ బెటాలియన్‌కు చెందిన పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో అంతిమయాత్ర ప్రారంభమైంది. విద్యానగర్ నుంచి కేసారంలోని కుటుంబ వ్యవసాయ క్షేత్రంలోని అంత్యక్రియల ప్రాంగణం వరకు ఉన్న 5.5 కిలోమీటర్ల దూరానికి చేరుకునేందుకు 2 గంటలు పట్టింది. 11.30 గంటలకు అంతిమయాత్ర వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంది. దారిపొడవునా ప్రజలు, ప్రభుత్వ సిబ్బంది కల్నల్ పార్థివదేహం ఉన్న వాహనంపై పూలవర్షం కురిపించారు. జాతీయ పతాకాలతో, జైహింద్ నినాదాలతో ముందు నడిచారు. కల్నల్ సంతోష్‌బాబు చితికి మధ్యాహ్నం 12.05 గంటలకు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్, కుమారుడు అనిరుధ్ కలిసి నిప్పంటించారు. భార్య సంతోషి, తల్లిదండ్రులు ఉపేందర్, మంజుల కడచూపు వేళ కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబసభ్యులంతా దుఃఖసాగరంలో మునిగిపోయారు. కూతురు అభిజ్ఞ తండ్రి చితిలో కట్టె వేయగానే.. ‘అయ్యో బిడ్డా’అంటూ కుటుంబసభ్యులు విలపించడం అక్కడున్న వారిని కలచివేసింది. సంతోష్‌బాబు భౌతికకాయం వద్ద గౌరవ వందనం చేస్తున్న ఆర్మీ అధికారులు, జవాన్లు బిహార్ రెజిమెంట్ ఆధ్వర్యంలో.. సంతోష్‌బాబు 2004లో బిహార్ 16వ రెజిమెంట్‌లో అధికారిగా చేరారు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన ఫస్ట్ బెటాలియన్ అంత్యక్రియల్ని చేపట్టింది. ఈ బెటాలియన్‌కు చెందిన 50 మంది జవాన్లు, పదిమంది మేజర్, కల్నల్, కెప్టెన్ ర్యాంకు అధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ముఖ్య అధికారులుగా 54 బెటాలియన్ బ్రిగే డియర్ అగర్వాల్, మేజర్ ఫరీద్, కల్నల్స్ విజయ్, అభినవ్, జాద వ్, లెఫ్ట్‌నెంట్ కల్నల్స్ శ్రీనివాసరావు, మథి, ప్రత్యేక అధికారి దినేష్‌కుమార్ హాజరయ్యారు. 12 గంటలకు మూడురౌండ్ల పాటు గాల్లోకి కాల్పులు జరిపిన అనంతరం దహన సంస్కారాలను పూర్తిచేశారు. అంతకుముందు సంతోష్‌బాబు ఆర్మీడ్రెస్, క్యాప్, జాతీయ పతాకాన్ని ఆయన సతీమణి సంతోషికి ఆర్మీ అధికారి అందించారు. గాలిలోకి కాల్పులు జరిపి సైనిక వందనం సమర్పిస్తున్న జవాన్లు ప్రముఖుల శ్రద్ధాంజలి.. వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలకు రాష్ట్ర ప్రముఖులు హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభుత్వ ప్రతినిధిగా విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి బుధవారం రాత్రి నుంచి అంత్యక్రియలు ముగిసే వరకు ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీలు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, వివేక్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్.భాస్కరన్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మావతి ఉత్తమ్‌కుమార్, సంకినేని వెంకటేశ్వర్రావు, జెడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మిలటరీ అధికారులు అందజేసిన భర్త ఆర్మీ దుస్తులను గుండెలకు హత్తుకొని కన్నీటిపర్యంతమవుతున్న సంతోష్‌బాబు భార్య సంతోషి నివాళులర్పిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి. చిత్రంలో బడుగుల, బూర నర్సయ్యగౌడ్ -
కల్నల్ సంతోష్‌కు కాంస్య విగ్రహం
సాక్షి, సూర్యాపేట : భారత్, చైనా సరిహద్దులో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలను సైనిక అధికార లాంఛనాలతో నిర్వహించారు. సూర్యాపేట కేసారంలోని సంతోష్ బాబు వ్యవసాయక్షేత్రం వరకు అంతిమయాత్ర కొనసాగింది. సంతోష్‌బాబు దహన సంస్కారాలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్య సభ ఎంపీ బడుగుల లింగయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసన సభ్యులు గాదరి కిషోర్ , సైది రెడ్డి , చిరుమర్తి లింగయ్య , మాజీ ఎంపీ బూర నర్సయ్య , మాజీ కేంద్ర రక్షణ శాఖా మంత్రి పల్లంరాజు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. (చదవండి : ముగిసిన కల్నల్ సంతోష్ అంత్యక్రియలు) సంతోష్‌ను కడసారి చూసేందుకు దారి పొడవునా భౌతికదూరం పాటిస్తూనే ప్రజలు సెల్యూట్ చేస్తూ ఘన నివాళి అర్పించారు. దహన సంస్కారాల ముగిసిన అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంతోష్ భార్యకు ఉద్యోగం ఇవ్వడానికి సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపినట్లు చెప్పారు. అంత్యక్రియలు జరిగిన చోట సంతోష్ స్మారక స్థూపం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సూర్యాపేట కూడలిలో కాంస్య విగ్రహం ఏర్పాటుతో పాటు, నగరంలోని ఓ సర్కిల్‌కు సంతోష్ పేరు పెడుతామని మంత్రి జగదీశ్ వెల్లడించారు. -
సూర్యాపేట: ముగిసిన కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు
-
లక్సెట్టిపేటలో సంతోష్ బాబు విద్యాభ్యాసం
లక్సెట్టిపేట(మంచిర్యాల): వీరమరణం పొందిన జవాన్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ సంతోష్‌బాబు విద్యాబ్యాసం జిల్లాలోని లక్సెట్టిపేటలోని శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ప్రారంభమైంది. ఆయ న తండ్రి ఉపేందర్ స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో బ్రాంచ్‌లో మేనేజర్‌గా 1988లో ఇక్కడకు బదిలీపై వచ్చారు. సంతోష్‌బాబును స్థానిక శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. నాలుగో తరగతి వరకు ఇక్కడే చదువుకుని ఐదవ తరగతిలో కోరుకొండ సైనిక్ పాఠశాల ప్రవేశపరీక్షలో అర్హత సాధించగా విజయనగరంలోని సైనిక్ పాఠశాలలో చేరారు. ఉపేందర్‌కు బదిలీ కావడంతో ఆయన కుటుంబసభ్యులు కూడా ఇక్కడినుంచి విజయనగరం వెళ్లిపోయారు. మరిపోలేని చిన్ననాటి స్నేహితులు సంతోష్‌బాబు మరణాన్ని అతడి స్నేహితులు తట్టుకోలేకపోతున్నారు. అప్పటి పాఠశాల ఆచార్యులు రామన్న సంతోష్‌బాబును గుర్తు చేసుకున్నారు. పాఠశాలలో చిన్నప్పుడు తీయించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఉన్నత హోదాలో ఉండి దేశరక్షణ కోసం ఆయన చేసిన త్యాగం మరువలేనిదన్నారు. స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకున్నారు. -
స్వస్థలాలకు చేరిన వీర జవాన్ల మృతదేహాలు
సాక్షి, న్యూఢిల్లీ: లద్దాఖ్‌లోని గాల్వన్ లోయా వద్ద చైనాతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు అర్పించిన సైనికుల మృతదేహాలు బుధవారం వారి స్వస్థలాలకు చేరుకున్నాయి. సోమవారం రాత్రి చైనా దాడిలో 20 మంది భారత సైనికులు వీరమరణం పోందినట్లు ఆర్మీ అధికారులు మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మరణించిన సైనికుల మృతదేహాలను ఉంచిన శవపేటికకు జాతీయా జెండాను కప్పి సైనిక లాంఛనాలతో వారి స్వస్థలాలకు తరలించారు. కాగా మరణించిన సైనికుల్లో బీహార్‌కు చెందివారు అయిదుగురు, పంజాబ్‌కు చెందిన నలుగురు, పశ్చిమ బెంగాల్, ఓడిశా, జార్ఖండ్‌కు రాష్ట్రాలకు చెందిన వారు ఇద్దరూ చొప్పున ఉన్నారు. చత్తీస్గడ్, మధ్యప్రదేశ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ చెందిన ఒక్కొక్కరూ ఉన్నారు. కాగా ఇవాళ సైనికుల మృతదేహాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నాయి. (సూర్యాపేటలో కల్నల్ సంతోష్ అంతిమయాత్ర) మరణించిన సైనికుల పేర్లు.. 1. కల్నల్ బి. సంతోష్‌బాబు (తెలంగాణ) 2. నాయిబ్ సుబేదార్ నుదురం సోరెన్ 3. నాయబ్ సుబేదార్ మన్దీప్ సింగ్ 4. నాయబ్ సుబేదార్ సత్నం సింగ్ 5. హవిల్దార్ కె పళని 6. హవిల్దార్ సునీల్ కుమా 7. హవిల్దార్ బిపుల్ రాయ్ 8. నాయక్ దీపక్ కుమార్ 9. సిపాయి రాజేష్ ఒరాంగ్ 10. సిపాయి కుందన్ కుమార్ ఓజా 11. సిపాయి గణేష్ రామ్ 12. సిపాయి చంద్రకాంత ప్రధాన్ 13. సిపాయి అంకుష్ 14. సిపాయి గుర్బిందర్ 15. సిపాయి గుర్తేజ్ సింగ్ 16. సిపాయి చందన్ కుమార్ 17. సిపాయి కుందన్ కుమార్ 18. సిపాయి అమన్ కుమార్ 19. సిపాయి జై కిషోర్ సింగ్ 20. సిపాయి గణేష్ హన్స్డా అడ్డుకున్న సంతోష్ నేతృత్వంలోని దళం సూర్యాపేటలో కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు.. కాగా తెలంగాణకు చెందిన కమాండర్ కల్నల్ సంతోష్‌బాబు మృతదేహాన్ని బుధవారం రాత్రి దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి హైదరాబాద్‌లోని హకీంపేటలోని వైమానిక దళానికి తరలించారు. ఆ తర్వాత విద్యానగర్‌లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. జాతియ జెండా కప్పిన సంతోస్ బాబు శవపేటికను సైనికులు అంబులెన్స్ నుంచి బయటకు తీస్తుండగా అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఉద్వేగానికి లోనవుతూ ‘సంతోష్ బాబు అమర్ హ’ అంటూ నినాదాలు చేశారు. గురువారం ఉదయం కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ఆయన స్వస్థలం సూర్యాపేటలో ముగిశాయి. సంతోష్ అంత్యక్రియలకు మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. -
సైనిక లాంఛనాలతో సంతోష్ అంత్యక్రియలు
సాక్షి, సూర్యాపేట : లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో మృతి చెందిన కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య సూర్యాపేట కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో ముగిశాయి. ప్రోటోకాల్ ప్రకారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు కార్యక్రమాలు నిర్వహించారు. సంతోష్ మిలటరీకి చేసిన సేవలకు గుర్తుగా అధికారులు సంతోష్ యునిఫామ్, అతని టోపీని భార్య సంతోషికి అందించారు. సంతోష్‌బాబు పార్థివ దేహానికి సైనికులు తుపాకి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సంప్రదాయం ప్రకారం సంతోష్ తండ్రి ఉపేందర్ అంతిమ సంస్కారాలు నిర్వహించగా, ఆయన వెంట సంతోష్ భార్య సంతోషితో పాటు కుమారుడు ఉన్నారు. అనంతరం తండ్రి ఉపేందర్ సంతోష్ పార్థివదేహాం ఉన్న చితికి నిప్పంటించారు. సంతోష్ అంత్యక్రియలకు హాజరైన వారిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసన సభ్యులు గాదరి కిషోర్ , సైది రెడ్డి , చిరుమర్తి లింగయ్య , మాజీ ఎంపీ బూర నర్సయ్య, కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి పల్లంరాజు, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయన సతీమణి పద్మావతి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పార్థివదేహం ముందు పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. (బలిదానం వృథా కాదు!) కాగా, కల్నల్ సంతోష్ ఇంటి నుంచి కేసారం గ్రామ సమీపం వరకు 5.5 కిలోమీటర్లు మేర మిలటరీ వాహనంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచి సైనిక సిబ్బంది ముందు వరుసలో కవాతు చేస్తూ అంతిమయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్‌ను కడసారి చూసేందుకు దారి పొడవునా భౌతికదూరం పాటిస్తూనే ప్రజలు సెల్యూట్ చేస్తూ ఘన నివాళి అర్పించారు. సంతోష్ అంతిమయాత్రలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులతో పాటు భారీగా ప్రజలు హాజరయ్యారు. (వీరుడా.. వందనం) కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహాన్ని కడచూపు చూసేందుకు బారులు తీరిన బంధువులు, ప్రజలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కన్నీటి పర్యంతమైన కల్నల్ సోదరి
సాక్షి, సూర్యాపేట : ‘అన్నయ్య కొద్ది రోజులు పాకిస్తాన్ బార్డర్లో పని చేశాడు. ఆ సమయంలో కొంతమంది చొరబాటుదారుల్ని ఆన్నయ్య హతమార్చాడు. అప్పుడు మేము ఎంతో గర్వంగా ఫీలయ్యాం. దేశం కోసం అన్నయ్య చేస్తున్న సేవను చూసి మురిసిపోయాం. ఎంతో రిస్క్ ఉన్న ఏరియాల్లోనే బాగా విధులు నిర్వర్తించారు. కానీ పెద్దగా రిస్క్‌లేని ఏరియాల్లో ఇలా జరగడం బాధగా ఉంది. అన్నయ్య మరణాన్ని తట్టుకోలేకపోతున్నాం’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు చైనాతో ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్‌బాబు సోదరి శృతి. తనతో ఎంతో ఆప్యాయంగా ఉండే అన్నయ్య.. ఇక లేడనే విషయాన్ని ఆ సోదరి తట్టుకోలేకపోతోంది. తనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.తనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. (చదవండి : తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన తనయుడు) ‘చిన్నప్పటి నుంచి అన్నయ చాలా యక్టివ్. చదువులో కానీ, ఇతర కాంపిటీషన్లలో కానీ అన్నింట్లో ముందుండేవాడు. సైనిక్ స్కూల్ గురించి డాడీ చిన్నప్పుడే ట్రై చేశాడు. కానీ కుదరలేదు. ఆయన కోరిక మేరకు అన్నయ్య సాధించాడు. అన్నయ్య గురించే డాడీ ఆదిలాబాద్ నుంచి విజయనగరం ట్రాన్స్ఫర్ పెట్టుకొని అక్కడికి వెళ్లాము. అన్నయ్య ఒక సంవత్సరం మొత్తం కష్టపడి సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో పాసయ్యారు. అక్కడ మాకు తెలిసిన వాళ్లు ఎవరూ లేరు. అమ్మ, డాడీ సపోర్ట్‌తో అన్నయ్య ఆల్ ఇండియా 3వ ర్యాంకు సాధించారు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత అన్నయ్య 6 నుంచి 12వ తరగతి వరకు అక్కడే చదివాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆర్మీలో చేరాడు. పాఠశాలలో మౌర్య, గుప్తాహౌస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. తర్వాత అన్నయ్య కమిషనర్ అయ్యారు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా అన్నయ్య కమిషనర్ అయ్యారు. తర్వాత పాకిస్తాన్ బార్డర్లో పనిచేశారు. అప్పడు కూడా కొంతమంది చొరబాటుదారుల్ని హతమార్చారు. అప్పుడు మేము గర్వంగా ఫీలయ్యాం. ఎంతో రిస్క్ ఉన్న ఏరియాల్లోనే బాగా విధులు నిర్వర్తించారు. కానీ పెద్దగా రిస్క్‌లేని ఏరియాలో ఇలా జరగడం బాధగా ఉంది. ( చదవండి : చైనాతో ఘర్షణ: 20 మంది భారత జవాన్లు మృతి!) అదే లాస్ట్ కాల్ రెండు రోజుల క్రితం జూన్ 14 రాత్రి 9 గంటల ప్రాంతంలో అన్నయ్య మాతో మాట్లాడారు. ఆ రోజు మా పెళ్లి రోజు. మాకు విషెష్ చెప్పడం కోసమే అన్నయ్య కాల్ చేశారు. కొన్ని సెకన్లు మాత్రమే మాట్లాడారు. ఎలా ఉన్నావ్ అన్నయ్యా అని అడగ్గా.. ఏం చెప్పలేను. నన్ను అడుగొద్దు అన్నాడు. తర్వాత అడిగే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పడు చాలా సంతోష పడ్డాం అన్నయ్య హైదరాబాద్‌కు ట్రాన్స్ఫర్ అయ్యారని తెలియగానే ఎంతో సంతోష పడ్డాం. అన్నయ్య చిన్నప్పటి నుంచి మాకు దూరంగా పెరిగాడు. ఇప్పుడు హైదరాబాద్‌కు వస్తే అందరం కలిసి హ్యాపీగా ఉంటాం అనుకున్నా.ఇంతలోనే ఇలా జరిగిపోయింది. ఇప్పుడు మా వదిన, పిల్లల్ని ఎలా సముదాయించాలో అర్థం కావడంలేదు. ఉద్యోగం రిత్యా అన్నయ్య పిల్లలతో (కూతురు అభిజ్ఞ(9), కుమారుడుఅనిరుధ్(4) ) ఎక్కువగా గడపలేదు. అనురిధ్ అచ్చం అన్నయ్యలా ఉంటాడు. వాడు ఎప్పుడూ పప్పా.. పప్పా అని ఏడుస్తూ ఉన్నాడు. అత్తా.. మే పప్పాకే పాస్ జాతా హూ అంటూ ఉండేవాడు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు’ అని సంతోష్‌బాబు సోదరి శృతి ‘సాక్షి’తో చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. -
చైనాకు తగిన బుద్ధి చెబుతాం..
15 ఏళ్ల సర్వీసు.. నాలుగు పదోన్నతులు.. ఎన్నో గోల్డ్‌మెడల్స్.. ఢిల్లీ, కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, లడక్, పాకిస్తాన్ సరిహద్దులో విధుల నిర్వహణ.. సూర్యాపేట జిల్లావాసి కల్నల్ సంతోష్‌బాబు పేరిట ఉన్న రికార్డ్ ఇది. ఉన్నతకుటుంబం నుంచి ఆర్మీలోకి అడుగుపెట్టిన సంతోష్‌బాబు దేశసేవలో తనముద్ర వేసుకున్నాడు. లడక్‌లోని గాల్వన్ లోయ వద్ద భారత్–చైనా బలగాల మధ్య జరిగిన బాహాబాహీలో సంతోష్‌బాబు వీరమరణం పొందాడు. సూర్యాపేట / సూర్యాపేట క్రైం : దేశం కోసం సేవ చేయాలనే తపన ఉంది. కాని చేయలేకపోయాడు. ఎలాగైనా తన కుటుంబం నుంచి ఆర్మీలో ఒకరు ఉండాలన్న ఆలోచనతో సూర్యాపేట జిల్లాకు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్ తన కుమారుడు సంతోష్‌బాబును ఆర్మీలోకి అడుగు పెట్టించాడు. తండ్రి ఆశయాన్ని కుమారుడు నెరవేర్చాడు. కానీ అర్ధంతరంగా దేశసేవలోనే ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం రాత్రి లడక్‌లోని గాల్వన్ లోయ వద్ద భారత్– చైనా బలగాలు బాహాబాహీకి దిగాయి. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేట జిల్లావాసి కల్నల్ సంతోష్‌బాబు మరణించారు. వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్ – మంజుల దంపతులకు ఇద్దరు సంతానం. భార్యపిల్లలతో సంతోష్‌బాబు(ఫైల్) కుమారుడు సంతోష్ బాబు, కుమార్తె శృతి ఉన్నారు. ఉపేందర్ ఎస్బీఐలో వివిధ హోదాల్లో పనిచేస్తూ చీఫ్ మేనేజర్‌గా రిటైర్డ్ అయ్యారు. ఉపేందర్ సంతోష్‌బాబును చిన్ననాటి నుంచే ఆర్మీలోకి అడుగుపెట్టే విధంగా తయారుచేశాడు. సంతోష్‌బాబు 1 నుంచి 5 వ తరగతి వరకు సంధ్య హైస్కూల్లో, 1993లో 6వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు కోరుకొండ సైనిక్‌స్కూల్ విజయనగరంలో విద్యనభ్యసించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆర్మీలో చేరాడు. పాఠశాలలో మౌర్య, గుప్తాహౌస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆయన 2018 బ్యాచ్‌లో కోరుకొండ సైనిక్ స్కూల్ టాపర్‌గా నిలిచాడు. సంతోష్ అన్ని పరీక్షల్లో 95 శాతం మార్కులు సాధించాడు. డిగ్రీ నేషనల్ డిఫెన్స్ పూణెలో, ట్రైనింగ్ ఇండియన్ ఆర్మీ డెహ్రాడూన్‌లో పూర్తి చేసుకున్నాడు. 2004, డిసెంబర్లో లెఫ్ట్‌నెంట్‌గా ఢిల్లీలో బీహార్ –16 బెటాలియన్‌లో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం సంతోష్‌బాబు సతీమణి సంతు, కుమారుడు అనిరు«ధ్, కుమార్తె అభిజ్ఞలు ఢిల్లీలోనే ఉన్నారు. కుమార్తె అభిజ్ఞ మూడో తరగతి విద్యనభ్యసిస్తోంది. సంతోష్‌బాబు మరణవార్తతో సూర్యాపేట జిల్లాలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జిల్లాలో రెండో మరణం జిల్లాలో ఇది రెండో మరణం. కార్గిల్ యుద్ధంలో 20 ఏళ్ల క్రితం పెన్‌పహాడ్ మండలం చీదెళ్ల గ్రామానికి చెందిన పోలోజు గోపయ్యచారి వీరమరణం పొందాడు. పదిహేనేళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు.. సంతోష్‌బాబు తన 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు పొంది ప్రస్తుతం లడక్‌లో ( కల్నల్) కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. చిన్న వయసులోనే కల్నల్‌గా ఎదిగి ఎన్నో గోల్డ్‌మెడల్స్‌ను సొంతం చేసుకున్నాడు. అదే విధంగా 2007లో ముగ్గురు చొరబాటు దారులను సైతం అంతమొందించాడు. 15 ఏళ్ల పదవీ కాలంలో ఢిల్లీ, కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, లడక్, పాకిస్థాన్ సరిహద్దులో పనిచేశాడు. కొంతకాలం ఖంగో దేశంలో కూడా విధులు నిర్వహించాడు. సంతోష్ బాబు మరణ వార్తను టీవీలో చూస్తున్న తల్లిదండ్రులు మధ్యాహ్నం 2 గంటలకు సంతోష్‌బాబు మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు.. సంతోష్‌బాబు మరణవార్త తెలిసినప్పటికీ తల్లిదండ్రులు నమ్మలేకపోయారు. తిరిగి తల్లిదండ్రులకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్మీ అధికారులు ఫోన్ ద్వారా చేరవేశారు. బు«ధవారం తెల్లవారేసరికి సంతోష్‌బాబు పార్థి వదేహాన్ని ఢిల్లీలో కుటుంబ సభ్యులకు అందించనున్నట్లు ఆర్మీ అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సంతోష్‌బాబు పార్థివదేహం బుధవారం మధ్యాహ్నానికి సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా కోవిడ్ నేపథ్యంలో హైదరాబాద్‌లోనే నిర్వహించాలని ఆర్మీ అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. సంతోష్‌బాబు నివాసాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు సంతోష్‌బాబు మరణ వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్, సూర్యాపేట డీఎస్పీ ఎస్.మోహన్‌కుమార్, సీఐలు ఆంజనేయులు, విఠల్‌రెడ్డి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంతోష్‌బాబు మృతికి పలువురు సంతాపం.. బిక్కుమళ్ల సంతోష్‌బాబు మృతిపై సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ వైవి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్‌కుమార్, ఉ ప్పల ఆనంద్, కక్కిరేణి శ్రీనివాస్, రాజు, రమేష్ ఆయన నివాసానికి చేరుకుని తల్లిదండ్రులను ఓదార్చి పరామర్శించారు. పలువురు పరామర్శ సంతోష్ కుటుంబ సభ్యులను పలువురు ప్రముఖులు పరామర్శించారు. తల్లిదండ్రులు ఉపేందర్, మంజులను సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ ఓదార్చారు. దేశసేవలో సంతోష్ సేవలను కొనియాడారు. అదే విధంగా టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి కూడా పరామర్శించారు. సంతోష్‌బాబుకు ఆత్మకూర్(ఎస్) మండలంతో అనుబంధం ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : చైనా దుశ్చర్యతో మృతిచెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు పూర్వీకులది మండల పరిధిలోని బొప్పారం గ్రామం. సంతోష్‌బాబు తాత చక్రయ్య గ్రామంలో ఉంటూ వ్యాపారం చేసేవాడు. చక్రయ్య ముగ్గురు సంతానం వ్యాపారరీత్యా సూర్యాపేటలో స్థిరపడ్డారు. ఈ ముగ్గురిలో ఉపేందర్ కుమారుడు సంతోష్‌బాబు ఉన్నత విద్యను అభ్యసించి దేశ సేవలో భాగంగా ఆర్మీలో చేరాడు. మంగళవారం భారత్, చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో సంతోష్‌బాబు మృతిచెందడం పట్ల మండలవాసులు, బంధువులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖుల సంతాపం సూర్యాపేట అర్బన్ : భారత్, చైనా సరిహద్దులో వీరమరణం పొందిన సూర్యాపేట నివాసి బిక్కుమళ్ల సంతోష్ బాబు మృతిపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తన సంతాపాన్ని ప్రకటించి వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంగళవారం ఫోన్లో సంతోష్‌బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దేశం కోసం వీర మరణం పొందిన సంతోష్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. సంతోష్‌బాబు దేశం కోసం తన ప్రాణాలను అర్పించి వీర మరణం పొందారని ఆయన వారితో పేర్కొన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ కల్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు కుటుంబ సభ్యులను రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ పరామర్శించారు. నేటి యువతకు ఆదర్శం : మండలి చైర్మన్ నల్లగొండ : దేశం కోసం కల్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు వీరమరణం పట్ల శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన సంతోష్ బాబు దేశ రక్షణ కోసం ఆర్మీ ఉద్యోగంలో చేరి కల్నల్ స్థాయికి ఎదిగిన ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారత్ సరిహద్దులో కల్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు వీరమరణం పొందడం పట్ల నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సంతాపం తెలిపారు. చైనాకు తగిన బుద్ధి చెబుతాం : డాక్టర్ చెరుకు సుధాకర్ సూర్యాపేట : కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ మరణానికి కారణమైన చైనా దేశానికి తగిన బుద్ధి చెబుతామని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ హెచ్చరించారు. శాంతిమంత్రం జపిస్తూ దందుడుకుగా యుద్ధోన్మాదాన్ని ప్రేరేపిస్తున్న చైనా వైఖరిని దేశ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. కల్నల్ సంతోష్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చిరస్థాయిగా నిలిచిపోతాడు : సంకినేని దేశం కోసం సరిహద్దులో వీర మరణం పొందిన సంతోష్‌బాబు మృతి పట్ల బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్లు సంతాపం ప్రకటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సంతోష్ పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఫోన్లో కల్నల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
అమిత్ షా సమక్షంలోనే వివాదం?
సాక్షి, బెంగళూరు : జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేపట్టిన ఆపరేషన్ కమల విఫలమైన తరువాత బీజేపీ నాయకుల మధ్య లోలోపల నెలకొన్న వివాదం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో భగ్గుమంది. శుక్రవారం జరిగిన కేంద్ర నాయకుల సమావేశంలో పాల్గొన్న అమిత్ షా సమక్షంలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, జాతీయ సహ సంఘటనా కార్యదర్శి సంతోష్ పరస్పరం వాగ్వివాదానికి దిగారు. సమయం లభించనప్పుడు పదే పదే యడ్యూరప్పకు వ్యతిరేకగా హైకమాండ్ నాయకులకు ఫిర్యాదు చేస్తున్న సంతోష్, ఆపరేషన్ కమల విఫలమై పార్టీకి తీవ్ర స్థాయిలో ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ కమల నాయకులను నియంత్రించాలని నేరుగానే యడ్యూరప్పపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆపరేషన్ కమలకు పూనుకొన్న కొందరు నాయకులపై కూడా సంతోష్... అమిత్ షాకు ఫిర్యాదు చేయగా, ఈ రాజకీయ కార్యకలాపాల నుంచి పార్టీకి భంగపాటు కలగటమే కాకుండా ప్రజల ముందు తలదించుకొనే పరిస్థితి నెలకొంది. బీజేపీకి ఇటువంటి రాజకీయ కార్యకలాపాలు సరికాదని చెప్పినట్లు తెలిసింది. పార్టీ అధ్యక్షుడికి తనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన సంతోష్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసిన యడ్యూరప్ప, సంతోష్ జాతీయ సహ సంఘటనా కార్యదర్శిగా ఉన్నా కూడా రాష్ట్రంలో బీజేపీ వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటున్నారు. ద్వేషం పెట్టుకొని పని చేస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పాలని యడ్యూరప్ప కూడా అమిత్ షాకు ఫిర్యాదు చేశారని తెలిసింది. ఒక ప్రయత్నం చేశాం శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలల అసంతృప్తిని ఉపయోగించుకొని ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నం చేశాం. ఇందులో తప్పేముంది. రాజకీయాలలో ఇలాంటి సహజం. తమ ప్రయత్నం కొన్ని కారణాలతో సఫలం కాలేదని, ముందు తాము విజయం సాధిస్తాం. అందులో అనుమానమే అవసరం లేదు. అయితే ప్రస్తుతం జరిగిన వైఫల్యాలను పెద్దదిగా చేస్తూ ఏదో అయిపోయిందన్న విధంగా కొందరు నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఇది సరికాదని యడ్యూరప్ప.. షాకు తెలియజేశారని సమాచారం. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో అతి సమీపంలో ఉండగా, పార్టీ అభ్యర్థుల గెలుపుకు కలసికట్టుగా పనిచేయాల్సి ఉంది. అనవసరంగా ఇంతకు ముందు జరిగినదాన్నే మాట్లాడటం సరికాదు. ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. తాము ఆపరేషన్ కమల చేపట్టినందుకు ప్రజలు విసుగుచెందలేదు. ప్రజల భావాలు తమకు తెలుసునని యడ్యూరప్ప అమిత్ షాకు వాస్తవ స్థితిని తెలియజేసే ప్రయత్నం చేశారని తెలిసింది. -
ప్రేమ పరీక్ష
‘‘ఈ రోజుల్లో ఓ 3 నిమిషాలు తెలుగులో మాట్లాడాలంటేనే చాలా కష్టమవుతోంది. మరి ఈ చిత్రంలో కథానాయకుడు, నాయికల మధ్య తెలుగులో మాట్లాడాలనే ప్రేమపరీక్ష ఎలా ఉంటుందో చూడాలి. ఈ పాటలో తెలుగులోని పద్యం, సామెత, ఛందస్సు, అలంకారాల గురించి రచయిత చాలా చక్కగా వివరించారు’’ అని రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. మహేంద్ర, లావణ్య, సమ్మెట గాంధీ, భవానీ శంకర్, సాకేత్ మాధవి, బేబి కీర్తన నటించిన చిత్రం ‘ఒక తెలుగు ప్రేమకథ’. సంతోష్ కృష్ణ దర్శకత్వంలో కిషోరి బసిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో తెలుగుదనంపై వచ్చే పాటని హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘తెలుగు భాష అమరం.. అజరామరం.. ఇప్పుడున్న రోజుల్లో పూర్తి స్థాయి తెలుగులో మాట్లాడటమంటే చాలా కష్టం. అదే ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందించడం అభినందనీయం’’ అన్నారు. ‘‘అందరూ తెలుగులోనే మాట్లాడాలి.. లేదంటే మన తెలుగు భాష మరుగున పడిపోతుంది’ అని దర్శకుడు చెప్పిన సందేశం నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించా’’ అన్నారు కిషోరి బసిరెడ్డి. ‘‘ఉడుకు మనసు గల ఇద్దరి మధ్య గిల్లిగజ్జాలాటే ఈ సినిమా’’ అన్నారు సంతోష్ కృష్ణ. ఈ చిత్రానికి సంగీతం: మహత్ నారాయణ్, కెమెరా: దేవేందర్ రెడ్డి. -
ధనుర్విద్య నేపథ్యంలో...
సందీప్‌కిషన్ హీరోగా ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రంతో అభిరుచి గల నిర్మాతగా పేరు పొందిన బీరం సుధాకర్ రెడ్డి, ‘కార్తికేయ’ సినిమాతో నిర్మాతగా అందరి ప్రశంసలు అందుకున్న వెంకట శ్రీనివాస్ బొగ్గరమ్ సంయుక్తంగా సుధాకర్ ఇంప్లెక్స్ ఐపీఎల్ అండ్ టారస్ సినీకార్స్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్రీడా నేపథ్యంలో కొనసాగే కథ ఇది. అత్యంత కష్టమైన ధనుర్విద్య ద్వారా కథానాయకుడు తన లక్ష్యాన్ని ఎలా చేధించాడు? అనేది చిత్రకథ. వైవిధ్యమైన కథాంశంతో రూపొందించబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు. -
సంతోష్... సూడో సీబీఐ!
సాక్షి, సిటీబ్యూరో: మెడికల్ పీజీ సీట్ల పేరుతో దేశ వ్యాప్తంగా రూ.కోట్లలో మోసాలకు పాల్పడిన సంతోష్ రాయ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇతడితో పాటు మరో నిందితుడు మనోజ్‌ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం నుంచి అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం విదితమే. లండన్‌లో ఎంబీబీఎస్ చదివానంటూ ప్రచారం చేసుకుని ఢిల్లీలో ఓ ఆస్పత్రి సైతం ఏర్పాటు చేసిన ఈ సూడో డాక్టర్ కొన్ని సందర్భాల్లో సీబీఐ అధికారి పాత్రను పోషించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న బడా బాబులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల్లో సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న వారి వివరాలను సేకరించిన సంతోష్ వారికి వివిధ నెంబర్ల నుంచి ఫోన్లు చేసి సీబీఐ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకునే వాడు. వారిపై ఉన్న కేసులను రాజీ చేయిస్తానని డబ్బు డిమాండ్ చేసేవాడు. ఇందుకు అంగీకరించకపోతే అరెస్టులు చేయిస్తానని, ఆస్తులు సీజ్ చేయిస్తానంటూ బెదిరించి భారీ మొత్తం అడిగేవాడు. ఈ పంథాలో అనేక మంది నుంచి రూ.కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ తరహాకు చెందిన బాధితుల్లో నగరంలోని బషీర్‌బాగ్ ప్రాంతానికి చెందిన ఓ బడా జ్యువెలరీ వ్యాపారీ ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అయితే ఫిర్యాదు చేయడానికి సదరు వ్యాపారి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క సంతోష్ అరెస్టుపై సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోని అన్ని ప్రధాన నగరాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వి«విధ చోట్ల నమోదై ఉన్న, నమోదు కాని ఫిర్యాదులు వీరి దృష్టికి వస్తున్నాయి. ఇప్పటికే ముంబై, విశాఖపట్నం, గుజరాత్‌లలో కేసులు, బెంగళూరులో నాన్–బెయిలబుల్ వారెంట్, ఢిల్లీలో కేసు నమోదుకాని ఫిర్యాదు ఉన్నట్లు వర్తమానం అందింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీ ముగిసిన తర్వాత పీటీ వారెంట్లు దాఖలు చేసి ఆయా కేసుల్లో అరెస్టు చేసి తీసుకువెళ్లాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మెడికల్ పీజీ సీట్ల స్కామ్‌లో మరికొందరు నిందితులు ఉన్నారు. వీరి వివరాలతో పాటు బాధితుల నుంచి సేకరించిన రూ.కోట్లు ఏమయ్యాయి? ఇంకా ఈ గ్యాంగ్ చేసిన నేరాలేమిటి? తదితర వివరాలు విచారించాలని భావిస్తున్న పోలీసులకు సంతోష్ నుంచి సరైన సహకారం లభించట్లేదు. తనకు ఆరోగ్యం బాగోలేదని చెబుతున్న ఇతను గట్టిగా ప్రశ్నించేసరికి కళ్లుతిరిగి పడిపోతున్నట్లు నటిస్తూ ముప్పతిప్పలు పెడుతున్నాడు. కస్టడీ గడువు ఇంకా ఉండటంతో లోతుగా విచారించి ఆరా తీయాలని సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తాజాగా ఇంటర్నెట్లో ఉన్న సంతోష్ ఫొటో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అందులో సంతోష్ ఓ తుపాకీ పట్టుకుని ఫోజు ఇచ్చాడు. దీంతో ఆ ఆయుధం వెనుక ఉన్న కథేంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. అది నిజమైన తుపాకీయేనా? లైసెన్స్ ఉందా? తదితర వివరాలు అతడి నుంచి రాబట్టాలని నిర్ణయించారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ బాల్క సుమన్,సంతోష్
-
నకిలీ వేలిముద్రల స్కాంలో దర్యాప్తు వేగవంతం
-
మన ఊరి సంతోష్.. ఇంతపెద్ద నేరం చేశాడా?
ధర్మారం (పెద్దపల్లి) : నకిలీ వేలిముద్రల తయారీ పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది. జిల్లాలోని ధర్మారం మండల కేంద్రానికి చెందిన పాత సంతోష్ కుమార్ (38) చిన్న వయస్సులోనే వ్యాపారం చేస్తూ లాభాలు ఆర్జించేందుకు వక్రమార్గం ఎంచుకున్నాడు. తాను చేస్తున్న పని దేశద్రోహానికి పాల్పడుతున్నట్లు గుర్తించలేని ఆయన.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అక్రమ సంపాదన కోసం ఆధార్‌కార్డులో వేలిముద్రను సైతం మార్చి సిమ్‌కార్డులను విక్రయించడం సంచలనం రేకెత్తించింది. అతి సామాన్యుడిగా కనిపించే సంతోష్.. ఇంతపెద్ద నేరం చేశాడా అని స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ధర్మారం గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ ఏడవ తరగతి వరకు ధర్మారంలోనే చదువుకున్నాడు. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు కరీంనగర్లో చదివాడు. అనంతరం ఇంజనీరింగ్ చదవాలని ప్రవేశపరీక్ష రాశాడు. ఇతర రాష్ట్రాల్లో సీటు రావడంతో మధ్యలోనే చదువు మానేసి వ్యాపారంలో దిగాడు. అప్పటికే తండ్రి గౌరయ్య చేస్తున్న అడ్తి వ్యాపారానికి సహకరించే సంతోష్ ధర్మారం శివారులో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని ఈముపక్షుల పెంపకం చేశాడు. ఇందులో దివాలా తీశాడు. చివరికి తన షెటర్‌లోనే ధనలక్ష్మి కమ్యూనికేషన్ పేరుతో వొడాఫోన్ ప్రీపెయిడ్ కనెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఎక్కువ కనెక్షన్స్ విక్రయిస్తే కమీషన్ ఎక్కువగా ఇస్తామని కంపెనీ టార్గెట్ పెట్టింది. దీంతో సంతోష్ ధర్మారం, వెల్గటూర్ కళాశాలలు, పాఠశాలల్లో సిమ్‌కార్డులు విక్రయించాడు. ఈ క్రమంలో బంధువులు, మిత్రుల ఆధార్ కార్డులను తీసుకునేవాడు. చివరికి ఆధార్‌కార్డులు లభించకపోవడంతో నకిలీ వేలిముద్రలకు పాల్పడినట్లు సమాచారం. చిన్నప్పటి నుంచే ప్రతి విషయంలో వివాదాస్పదంగా వ్యవహరించేవాడని మిత్రులు అంటుంటారు. కాగా.. సిమ్‌కార్డుల టార్గెట్ చేరేందుకు ఇతరుల వేలిముద్రలను తయారీ చేయటం పట్ల స్థానికులు నివ్వెరపోతున్నారు. -
అడల్ట్ చిత్రాలు మరిన్ని రావాలి
తమిళసినిమా: అడల్ట్ చిత్రాలు మరిన్ని వచ్చినా తప్పులేదు అని పేర్కొన్నారు వర్ధమాన దర్శకుడు సంతోష్ పి.జయకుమార్. ఈయన హరహర మహాదేవకీ అనే అడల్ట్ డార్క్ కామెడీ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. గౌతమ్ కార్తీక్ హీరోగా నటించిన ఈ చిత్రం కమర్శియల్‌గా మంచి వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని బ్లూఘోస్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన నిర్మాత కేఈ.జ్ఞానవేల్‌రాజానే తాజాగా ఇదే దర్శక, కథానాయకుడితో రూపొందించిన చిత్రం ఇరుట్టు అరయిల్ మురట్టు కుత్తు. ఇదీ అడల్ట్ కామెడీ కథా చిత్రమే. ఇందులో గౌతమ్ కార్తీక్‌కు జంటగా యాషీక ఆనంద్, వైభవి శాండిల్య, చంద్రిక రవి ముగ్గురు హీరోయిన్లు రొమాన్స్ చేశారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విలేకరులతో బుధవారం ముచ్చటించారు. చిత్రం గురించి దర్శకుడు సంతోష్ పి.జయకుమార్ మాట్లాడుతూ ఇంతకు ముందు చాలా మంది చాలా బ్యానర్లలో చిత్రాలు చేశారని, అడల్ట్ బ్యానర్లో ఎందుకు చిత్రం చేయకూడదన్న ఆలోచనతో తెరకెక్కించిన చిత్రమే ఇరుట్టు అరయిల్ మురట్టు కుత్తు అని చెప్పారు. ఇంతకు ముందు 30 శాతం అడల్ట్ సన్నివేశాలున్న చిత్రాలు వచ్చాయని, ఇది 100 శాతం అడల్ట్ కథా చిత్రం అని చెప్పారు. అందుకే కుటుంబ సమేతంగా తమ చిత్రాన్ని చూడడానికి రావద్దు అని చెబుతున్నామని పేర్కొన్నారు. ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు చిత్రాన్ని ముగ్గురు మహిళా సభ్యురాళ్లు, ఇద్దరు మగ సభ్యులు చూశారని చెప్పారు. చిత్రం చూసిన తరువాత ఎలాంటి సర్టిఫికెట్ కావాలని సెన్సార్ సభ్యులు అడిగారని, ఏ సర్టిఫికెట్ ఇచ్చినా పర్వాలేదని తాము అన్నామని చెప్పారు. చిత్రంలో పలాన సన్నివేశాలున్నాయిగా వాటిని తొలగిస్తామని అంటే తాము ఓకే చెప్పామన్నారు. ఇంతకు ముందు ఇలాంటి అడల్ట్ కథాంశంలో హరహర మహాదేవకీ చిత్రం చేశారు. మళ్లీ అదే బ్యానర్లో ఇరుట్టు అరైయిల్ మురట్టుకుత్తు తెరకెక్కించారు. మీపై ఈ తరహా ఇమేజ్ ముద్ర పడే అవకాశం ఉంటుందన్న భయం లేదా? అన్న ప్రశ్నకు అలాంటి భయం లేదన్నారు. ఎందుకంటే తన తదుపరి చిత్రం గజనీకాంత్ మంచి ఎంటర్టెయిన్మెంట్ అంశాలతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. తమిళ సినిమాలో అడల్ట్ చిత్రాలకు మీరు మార్గం చూపారని భావించవచ్చా? అన్న ప్రశ్నకు నిజం చెప్పాలంటే అలాంటి చిత్రాలు మరిన్ని వచ్చినా తప్పు లేదని అన్నారు. మనం కొన్ని విషయాలను గుట్టుగా ఉంచడం వల్లే సమాజంలో అత్యాచారాల్లాంటి సంఘటనలు జరగుతున్నాయని దర్శకుడు పేర్కొన్నారు. చిత్ర హీరో గౌతమ్‌కార్తీక్ మాట్లాడుతూ దర్శకుడు సంతోస్ పి.జయకుమార్ ఈ చిత్ర కథను జస్టిఫై చేస్తారన్న నమ్మకంతోనే తాను నటించడానికి సమ్మతించానన్నారు. హర హర మహాదేవకీ చిత్రాన్ని చూసిన తన తండ్రి కార్తీక్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది అని చాలా ఎంజాయ్ చేశారని తెలిపారు. ఈ చిత్రాన్ని చూడడానికి ఆసక్తిగా ఉన్నారని అన్నారు. అయితే ఇలాంటి చిత్రాలు తాను మళ్లీ ఇప్పుట్లో చేయనని చెప్పారు. తదుపరి మంచి ప్రేమ కథా చిత్రం, మంచి యాక్షన్ చిత్రం చేయాలనుకుంటున్నానని అన్నారు. -
ఆస్పత్రిలో తెలంగాణ జాగృతి కన్వీనర్ హల్చల్
-
తథాస్తు
అర్జున్ తేజ్, సంతోష్ హీరోలుగా, ప్రియ, వర్షిణి హీరోయిన్స్‌గా తోట నాగేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘తథాస్తు’. ఈ సినిమా పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తోట నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘దాదాపు 30 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో ఉన్నా. పెద్ద హీరోల సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశా. 16 మెగా సీరియల్స్‌కు దర్శకత్వం వహించా. నా మేనల్లుడు అర్జున్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ యూత్‌ఫుల్ కథాంశంతో ‘తథాస్తు’ తెరకెక్కిస్తున్నా. ఇద్దరు యువతీ యువకుల మధ్య ఉండే మానసిక బంధంతో పాటు కాలం వారి జీవితాలను ఎలాంటి మలుపులతో నడిపించింది? ఆ ప్రయాణంలో అన్ని మజిలీలను దాటుకొని చివరకు ఎలాంటి గమ్యాన్ని చేరుకున్నారన్నదే చిత్ర కథ’’ అన్నారు. ‘‘యువతరంతో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి చూడాల్సిన మంచి చిత్రంలో నేను నటిస్తున్నందుకు హ్యాపీ’’ అన్నారు నటి కవిత. అర్జున్ తేజ్, ప్రియ, సంతోష్, కెమెరామెన్ రాజా, మాటల రచయిత వి.వి. వరప్రసాద్, సంగీత దర్శకుడు సాకేత్ నాయిడు, ఫైట్ మాస్టర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. సుమన్, భానుచందర్, శివాజీ రాజా, అలీ, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. -
ఆర్గానిక్ అటెన్షన్
ఇప్పుడంతా నేచురల్ ట్రెండ్. తినే తిండే కాదు...ధరించే దుస్తులూ సహజసిద్ధంగా రూపొందించినవే కావాలనే శ్రద్ధఅందరిలోనూ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే కొన్ని బ్రాండెడ్ దుస్తులు మార్కెట్లోకి రాగా... ఇప్పుడిప్పుడే సిటీ డిజైనర్లు కూడా ఆర్గానిక్ దుస్తులకు అడ్రెస్‌గా మారుతున్నారు. సిటీ యువ డిజైనర్ సంతోష్ ఇటీవల జరిగిన పుణె ఫ్యాషన్ వీక్‌లో పూర్తిస్థాయి ఆర్గానిక్ దుస్తులను ప్రదర్శించి... అగ్రగామి ఫ్యాషన్ వేదికలపై ఇలాంటి కలెక్షన్‌ను ప్రదర్శించిన తొలి సిటీ డిజైనర్‌గా ఘనతసాధించాడు. ఈ సందర్భంగా సంతోష్ ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలివీ... సాక్షి, సిటీబ్యూరో : మనం ధరించే ప్రతిది రకరకాల రసాయనాలు వినియోగించి తయారు చేసిందే. తెల్లని కాటన్ దుస్తుల తయారీలోనూ ఆ రంగు కోసం కెమికల్స్ వాడతారు. రసాయనరహితంగా పూర్తి ఆర్గానిక్ దుస్తుల తయారీ అనేది కొంత సాహసంతో కూడిన ప్రయోగమేనని చెప్పాలి. ఇదే పుణె ఫ్యాషన్ వీక్ నిర్వాహకులను ఆకట్టుకుంది. పుణె భేష్ అనే.. దేశంలోని అగ్రగామి ఫ్యాషన్ ఫెస్టివల్స్‌లో ఒకటైన పుణె ఫ్యాషన్ వీక్‌లో నా డిజైన్స్‌కు మంచి ఆదరణ లభించింది. అక్కడికి వచ్చిన వారంతా నాకన్నా దాదాపు 10ఏళ్లు సీనియర్స్. ఆర్గానిక్ వర్క్ అనేది అంతర్జాతీయ స్థాయి డిజైనర్లు మాత్రమే సాహసించేది కావడంతో మంచి ప్రశంసలు వచ్చాయి. నా డిజైన్స్‌కు అక్కడి ఆంగ్ల పత్రికల్లో వచ్చినరివ్యూల ద్వారా జాతీయ స్థాయిలో నిర్వహించే మరో 4 ఫ్యాషన్ వీక్స్‌లో అవకాశాలు నా తలుపు తట్టాయి. అందరూ అనుకున్నట్టు ఇవేవీ అంత ఖరీదైనవి కూడా కాదు. ఉత్పత్తి వ్యయం కూడా మీటర్‌కి రూ.1,000లోపే అవుతుంది. అయితే వీటి వాడకంపై ప్రజకల్లో అవగాహన పెరగాల్సి ఉంది. అందుకే ఇకపై ప్రతి ఏటా ఆర్గానిక్ దుస్తుల తయారీని ప్లాన్ చేస్తున్నాను. నా షోలలో తప్పకుండా ఒక సీక్వెన్స్ దీనికి కేటాయించాలని నిర్ణయించుకున్నాను. షేడ్స్ తక్కువ.. సమయం ఎక్కువ దేశంలో ఇప్పటికే కొన్ని బ్రాండ్స్ నేచురల్ డైస్‌తో చేసిన దుస్తులు విక్రయిస్తున్నప్పటికీ, ఏవీ 100 శాతం ఆర్గానిక్ అని చెప్పలేం. ఎందుకంటే పూర్తిగా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్, డైతో తయారు చేసినవి తక్కువ షేడ్స్‌లో మాత్రమే లభ్యమవుతాయి. ఆర్గానిక్ దుస్తులకు కాటన్, లెనిన్, పట్టు... ఫ్యాబ్రిక్స్ మాత్రమే నప్పుతాయి. అలాగే ఈ దుస్తుల తయారీకి మిగిలిన వాటితో పోలిస్తే పట్టే సమయం కూడా బాగా ఎక్కువ. పుణె ఫ్యాషన్ వీక్ కోసం నేను రూపొందించినఆర్గానిక్ దుస్తుల తయారీలో ఫ్యాబ్రిక్ మొత్తం చేనేతలనేవినియోగించాను. సిద్ధిపేటలోని ఆదర్శ్ సొసైటీ ఆధ్వర్యంలోడాక్టర్ సునంద ఈ ఫ్యాబ్రిక్స్ తయారీ చేయించారు. అదే విధంగా ఉల్లిపాయ, పసుపు వంటి దినుసులతో పాటు చెట్ల ఆకులు, కాండం, వేర్లను ఉపయోగించి ఆకుపచ్చ, బ్లూ, ఎల్లో, బ్రిక్ షేడ్స్‌తో రంగులు సృష్టించాం. కొంచెం డల్ ఫినిష్ ఉండే ఫ్యాబ్రిక్‌కి అత్యాధునిక డిజైనింగ్ వర్క్ జత చేసి ఆకట్టుకునేలా డ్రెస్సులను తీర్చిదిద్దాం. మొత్తం 20 డ్రెస్సులను తయారు చేస్తే.. 16 రకాల డిజైన్లను ఈ షోలో ప్రదర్శించాను. -
రాజ్యసభకు సంతోష్
సాక్షి, హైదరాబాద్: మార్చిలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం టీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. ఇటీవల మరణించిన కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డితో పాటు రాపోలు ఆనంద భాస్కర్ (కాంగ్రెస్), సీఎం రమేశ్ (టీడీపీ) రాజ్యసభ పదవీ కాలం వచ్చే ఏప్రిల్‌తో ముగుస్తోంది. వీరి స్థానంలో కొత్తగా ముగ్గురు తెలంగాణ నుంచి ఎన్నికవాల్సి ఉంది. ఒక్క ఎంపీని గెలిపించుకునేంత సంఖ్యా బలం కూడా మిగతా ఏ పార్టీకీ లేనందున మూడు స్థానాలనూ టీఆర్ఎస్సే ఏకగ్రీవంగా గెలుచుకోనుంది. వీటిలో ఒకటి టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు దాదాపుగా ఖరారైనట్టేనని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దశాబ్దన్నర కాలంగా కేసీఆర్ వెన్నంటి ఉండటంతో పాటు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన సంతోష్‌కు బెర్తు ఖాయమని పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. కేసీఆర్ ఖమ్మంలో నిరాహార దీక్ష చేసిన సందర్భంలోనూ, నిజాం వైద్య విజ్ణాన సంస్థ (నిమ్స్)లో ఆమరణ దీక్ష చేసినప్పుడు సంతోష్ ఆయనతో పాటే ఉన్నారు. పార్టీలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు మధ్య సమన్వయం సాధించడంలో సంతోష్ సమర్థంగా వ్యవహరించారన్న పేరుంది. దీనికి తోడు ఆయన్ను రాజ్యసభకు పంపాలంటూ పలువురు టీఆర్ఎస్ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా కొంతకాలంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావుపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో సంతోష్ అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్ అధినేత ఆమోదం తెలిపే అవకాశముందని పార్టీ అత్యున్నత వర్గాలు వెల్లడించాయి. ఇక, మరో రాజ్యసభ సీటు ఇటీవల సీఎం ప్రకటించిన మేరకు యాదవ సామాజికవర్గానికి దక్కనుంది. ఈ కోటాలో మాజీ ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, జైపాల్ యాదవ్‌తో పాటు టీఆర్ఎస్ నేత రాజయ్య యాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నోములకే అవకాశాలు ఎక్కువని పార్టీ వర్గాలంటున్నాయి. మిగతా సీటును ఎస్సీ లేదా మైనారిటీ వర్గాలకు కేటాయించవచ్చని తెలుస్తోంది. కేసీఆర్ రాజకీయ సలహాదారు షేరి సుభాష్‌రెడ్డి పేరూ ప్రచారంలో ఉంది. ఆయనను రాజ్యసభకు గానీ, మండలికి గానీ పంపే ఆలోచన ఉందని చెబుతున్నారు. గత రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్థానాన్ని బీసీ కోటాలో డి.శ్రీనివాస్‌కు, మరోటి బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు టీఆర్ఎస్ కేటాయించడం తెలిసిందే. ఈసారి రెడ్డి సామాజికవర్గానికి అవకాశం కల్పించాల్సి వస్తే సుభాష్‌రెడ్డికి దక్కవచ్చని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
బీజేపీ కార్యకర్త హత్య
శివాజీనగర: నగరంలోని జేసీ నగర పోలీసు స్టేషన్ పరిధిలోని చిన్నప్పగార్డెన్ రెండో ప్రధాన రోడ్డు, 11వ క్రాస్ ఓ బేకరి వద్ద బుధవారం అర్ధరాత్రి బీజేపీ యువమోర్చా కార్యకర్త సంతోష్ (28)కు గురయ్యాడు. ఈ హత్యను ఖండిస్తూ గురువారం ఉదయం బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. సంతోష్ హత్య సమాచారం అందుకున్న తక్షణమే గురువారం ఉదయాన్నే బీజేపీ నాయకులు మాజీ మంత్రి కట్టాసుబ్రమణ్య నాయుడు నేతృత్వంలో నల్ల బ్యాడ్జీలు ధరించి చిన్నప్పగార్డెన్లో ధర్నా చేపట్టి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో చిన్నప్పగార్డెన్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సంతోష్ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటి వద్దకు తీసుకురాగా అంబులెన్స్ నుంచి కిందకు దించకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహంచారు. హోమ్‌శాఖ మంత్రి రామలింగారెడ్డి, నగర పోలీసు కమిషనర్ రావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్య నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయనికి ఈ సంఘటన మరో ఉదాహరణ అని అన్నారు. హిందువులకు రక్షణ కరువైందన్నారు. బీజేపీకి చెందిన 26 మంది హిందువులు హత్యకు గురయ్యారని, సంతోష్ హత్యతో 27కు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 4వ తేదీ పరివర్తనా సమావేశం నిమిత్తం ముందస్తుగా గురువారం ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించటంతో ఈ ప్రాంతంలో బీజేపీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్న సంతోష్‌ను కాంగ్రెస్ నాయకులు హత్య చేయించారని ఆరోపించారు. తక్షణమే హంతకులను అరెస్టు చేయాలని, కుటుంబానికి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సంతోష్ హత్యకు కాంగ్రెస్ నాయకులే కారణం: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత హిందూ సంఘాల కార్యకర్తలు అధికంగా హత్యకు గురయ్యారని, ఇందుకు కాంగ్రెస్ నాయకులే కారణమని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.అశోక్ ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు రవికుమార్ మాట్లాడుతూ... సంతోష్ హత్యతో శుక్రవారం రాష్ట్రస్థాయిలో ధర్నా చేపట్టేందుకు బీజేపీ నిర్ణయించినట్లు తెలిపారు. సంతోష్ కుటుంబానికి రూ.50 లక్షల నష్ట పరిహారం, భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించటంతో పాటు కుటుంబానికి పూర్తి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. చివరకు పోలీసు కమిషనర్ టీ.సునీల్‌కుమార్ అక్కడకు చేరుకొని బీజేపీ నాయకులతో మాట్లాడి తమ డిమాండ్లను రాష్ట్ర హోమ్‌శాఖ మంత్రి రామలింగారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, సీఎంతో చర్చించి సంతోష్ కుటుంబానికి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఆర్ఎస్ఎస్ నాయకుడు ప్రకాశ్, బీజేపీ ఎమ్మెల్యే ఏ.వై.నారాయణస్వామి, ఎమ్మెల్సీ అజీమ్, మాజీ ఎమ్మెల్యే నిర్మలా సురానా, నాయకులు సంపత్, గోపి, మాధవ, గణేశ్‌రావు మానె, సీ.ఎస్.సూర్యకాంతరావు,సునీల్, ఏ.జెయిరీమ్, కోదండ, ప్రకాష్ తదితరులు సంతోష్ కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నప్పగార్డెన్ ధర్నా నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని పర్యవేక్షించేందుకు బెంగళూరు ఉత్తర డీసీపీ చేతన్ సింగ్ రాథోర్ నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంటి సమీపంలో బేకరి వద్ద బుధవారం రాత్రి నలుగురు యువకులు సంతోష్‌ను హత్య చేశారని డీసీపీ చేతన్ సింగ్ రాథోర్ తెలిపారు. సమాచారం తెలిసిన తక్షణమే జేసీ నగర పోలీసులు హంతకుల్లో వాసీమ్, పిలిప్స్ను అరెస్టు చేశామని, మరో ఇద్దరు హంతకులైన ఉమ్మర్, ఇర్ఫాన్‌ల కోసం గాలిస్తున్నామని చెప్పారు. సంతోష్ అంత్యక్రియలు పూర్తి : సంతోష్ అంత్యక్రియలు నగరంలోని కాక్స్‌టౌన్ ప్రాంతంలోని కల్లపల్లిలో గురువారం సాయంత్రం జరిగాయి. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
జాతీయ బాస్కెట్‌బాల్ పోటీలకు వెల్ల విద్యార్థి
వెల్ల (రామచంద్రపురం రూరల్) : జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–14 బాస్కెట్‌బాల్ పోటీలకు తమ విద్యార్థి జి.సాయిచరణ్ సంతోష్ ఎంపికైనట్టు వెల్ల జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.రాంబాబు, పీఈటీ బి.కృష్ణమోహ¯ŒSలు మంగళవారం విలేకర్లకు తెలిపారు. ఈ నెల 22 నుంచి 24 వరకూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో తూర్పు గోదావరి జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించడంలో సంతోష్ ఉత్తమ ప్రతిభ కనబరిచాడన్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నందిగామలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్ర జట్టుకు అతడు ఎంపికయ్యాడని తెలిపారు. సంతోష్‌ను సర్పంచ్ గుండుబోగుల స్వామినాయుడు, ఎస్ఎంసీ చైర్మ¯ŒS అమరా వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పాముల సురేష్, ఉపాధ్యాయులు అభినందించారు. -
జాతీయ చెస్ పోటీల్లో సంతోష్ ప్రతిభ
పెద్దాపురం : ఒడిశాలో జరిగిన జాతీయ స్థాయి చదరంగం పోటీల్లో పెద్దాపురానికి చెందిన విద్యార్థి ముప్పన జ్ఞానసాయి సంతోష్ ప్రథమ స్థానం సాధించాడు. ఈ నెలలో నిర్వహించిన జాతీయ స్థాయి అండర్–8 చదరంగం పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చి ప్రథమ స్థానం సాధించాడు. సంతోష్‌ను మన పెద్దాపురం ఫేస్బుక్ టీమ్ సోమవారం ప్రత్యేకంగా అభినందించింది. -
బాలుడి అదృశ్యం.. విషాదాంతం
హైదరాబాద్: నగరంలోని రహమత్‌నగర్ సమీపంలోని సంతోషిగిరిలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతమైంది. సంతోషిగిరికి చెందిన రాంప్రసాద్ కుమారుడు సంతోష్(7) ఈనెల 12వ తేదీన స్నేహితుడు నరేష్(10)తో కలిసి పీర్ల పండుగను చూసేందుకు అల్లాపూర్ వెళ్లాలనుకున్నాడు. ఇద్దరూ కలిసి ఇంటికి సమీపంలోని రైలు పట్టాలు దాటుతుండగా సంతోష్‌ను రైలు ఢీకొట్టింది. దీంతో నరేష్ భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పట్టాల పక్కన తీవ్రగాయాలతో పడి ఉన్న సంతోష్‌ను రైల్వే పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నాడు. కాగా, దీనిపై అతడి తండ్రి రాంప్రసాద్ ఈనెల 14వ తేదీన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతలోనే బాలుడి అదృశ్యం వార్త ‘సాక్షి’ దినపత్రికలో చూసిన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారి ద్వారా తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని, తమ కుమారుడిని చూసుకున్నారు. అయితే పరిస్థితి విషమించటంతో సంతోష్ శనివారం ఉదయం కన్నుమూశాడు. -
మైలార్‌దేవిపల్లిలో బాలిక కిడ్నాప్
రాజేంద్రనగర్: పాఠశాలకు వెళ్లిన బాలిక కిడ్నాప్ అయిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్‌దేవిపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక సాయిబాబ నగర్‌కు చెందిన కీర్తీ(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పాఠశాలకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. అదే కాలనీకి చెందిన సంతోష్(19) బాలికను కిడ్నాప్ చేశాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరి పరిస్థితి విషమం
సదాశివనగర్: ట్రాన్స్ ఫార్మర్ దగ్గర బుష్ వైర్లు వేస్తూ.. ప్రమాదవశాత్తు ఇద్దరు రైతులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ సంఘటన మంగళవారం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం గిద్ద గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామంలోని ఒక ట్రాన్స్ ఫార్మర్ దగ్గర బుష్‌లు వేసేందుకు సంతోష్, శ్రీనివాస్ వెళ్లారు. వీరితో పాటు సబ్‌స్టేషన్‌కు చెందిన లైన్‌మన్ కూడా ఉన్నాడు. లైన్‌మన్ సబ్ స్టేషన్‌కు ఫోన్ చేసి ఎల్సీ ఇవ్వాలని కోరడంతో సబ్‌స్టేషన్‌లో విధుల్లో ఉన్న వ్యక్తి సరేనన్నాడు. దీంతో రైతులు ట్రాన్స్ ఫార్మర్కు బుష్ వైర్లు వేసేందుకు ప్రయత్నించారు. కాగా, అదే సమయంలో విద్యుత్ రావడంతో ఇద్దరు రైతులు విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో ఇద్దరిని వెంటనే నిజామాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగానే ఉందనీ, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. -
అల్లుణ్ని కాపాడబోయి అనంతలోకాలకు..
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. వాగులోకి స్నానానికి దిగిన బాలుడు, బాలుణ్ని కాపాడబోయిన మేనమామ ప్రమాదవశాత్తూ చనిపోయారు. వివరాలు.. గొల్లగూడెం గ్రామ సమీపంలోని వాగు వద్ద నున్న ముత్యాలమ్మ గుడికి రాపాల వెంకన్న కుటుంబం ఇంటిల్లిపాది వెళ్లి ఫంక్షన్ చేసుకుంటున్నారు. సంతోష్ (12) అనే బాలుడు స్నానానికి దిగిన సమయంలో వాగులో సుడిగుండం ఏర్పడింది. సుడిగుండంలో చిక్కుకున్న సంతోష్‌ను కాపాడబోయిన మేనమామ రాపాల వెంకన్న (45) కూడా ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాడు. స్థానికులు శవాలను బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
వ్యక్తి దారుణహత్య
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్‌లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆ గ్రామానికి చెందిన సంతోష్ (32) అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున తీవ్ర గాయాలతో మృతిచెందాడు. ఈ హత్య వెనక మంత్రాల నెపంతో అతణ్ని కొట్టి చంపి ఉంటారనే వాదన బలంగా వినిపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
ముడసర్లోవ రిజర్వాయర్‌లో మునిగి యువకుడి మృతి మృతదేహాన్ని వెలికితీసిన గజ ఈతగాళ్లు విశాఖపట్నం : ముడసర్లోవ రిజర్వాయర్‌లో స్నేహితులతో ఈతకు దిగిన ఓ యువకుడు బురదలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. నగరంలో కొబ్బరితోటకు చెందిన దానల సంతోష్(21), ఆరిలోవకు చెందిన శంకర్, శివ, వెంకటేశ్వరరావు స్నేహితులు. వీరిలో శివ ఇటీవల బైక్ కొన్నాడు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం మిగిలిన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. దీనిలో భాగంగా ముడసర్లోవ రిజర్వాయర్ వెనుక భాగంలో పూటుగా కల్లు తాగిన నలుగురు రిజర్వాయర్ ఒడ్డున కొంత సేపు కూర్చొన్నారు. తనకు జెట్టీలో ఈత అనుభవం ఉందని, ఈ రిజర్వాయర్‌లో ఈదడం పెద్ద కష్టం కాదని తోటి స్నేహితులతో సంతోష్ చెప్పాడు. శివకు కూడా కొంతవరకు ఈత వచ్చు. దీంతో శివ, సంతోష్ రిజర్వాయర్‌లో ఈతకు దిగారు. ఒడ్డు నుంచి కొంత దూరం వెళ్లిన శివ తిరిగి వెనుదిరిగాడు. సంతోష్ మాత్రం మరికొంత దూరం వెళ్లి ఊపిరాడక నీటిలో మునిగిపోయాడు. గాబరాపడిన మిగిలిన స్నేహితులు రాత్రి 10 గంటల తర్వాత ఆరిలోవ పోలీసులకు, సంతోష్ తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే రిజర్వాయర్ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహం కోసం గాలించారు. ఆచూకీ లభ్యం కానందున సోమవారం ఉదయం జోడుగుళ్లుపాలెం ప్రాంతానికి చెందిన గజ ఈతగాళ్లను తీసుకువచ్చి రిజర్వాయర్‌లో గాలింపు చేపట్టారు. బురదలో కూరుకుపోయిన సంతోష్ మృతదేహాన్ని సాయంత్రం బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు కేజీహెచ్‌కు తరలించారు. సంతోష్‌కు ఏడాది క్రితం వివాహమైందని, అతని భార్య గర్భవతి అని తండ్రి వెంకటరమణ కన్నీటి పర్యంతమయ్యారు. -
పెళ్లి ముహూర్తం పెట్టాల్సిన సమయంలో...
పెళ్లి మంత్రాలు వినిపించాల్సిన ఇంటిలో చావు బాజాలు వినిపించాయి. ముహూర్తం పెట్టుకుని అ యిన వారందన్నీ ఆహ్వానించాల్సిన ఆ యువకుడు విగతజీవిగా మారి అందరి కళ్లల్లో కన్నీరు మిగిల్చాడు. గీత కార్మిక వృత్తిపైనే ఆధార పడి బతుకుతున్న ఆ కుటుంబాన్ని శోక సముద్రంలో వదిలేసి వెళ్లిపోయా డు. మండలంలోని వెదుళ్లవలస పంచాయతీలో గొడిపాలెం గ్రామానికి చెందిన బుత్తల సంతోష్(20) అనే గీత కార్మికుడు శుక్రవారం సాయంత్రం చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మరణించా డు. రోజూ లాగే కల్లు గీసేందుకు సంతోష్ గ్రామం పొలిమేరల్లో ఉన్న తాటిపెండిలోకి వెళ్లాడు. తాడిచెట్టు పైకిఎక్కే సమయంలో ఎక్కేందుకు ఉపయోగించే పరికరం తప్పిపోవటంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. సంతోష్ కింద పడిపోవడం చూసిన చుట్టుపక్కల వారు 108కు సమాచారం అందించారు. వారు వచ్చి సంతోష్ చనిపోయినట్లు ధ్రువీకరించారు. శనివారమే ముహూర్తాలు... బుత్తల సంతోష్‌కు ఇటీవలే పెళ్లి సంబంధం కుదిరిం ది. శనివారం ముహూర్తాలు పెట్టేందుకు సిద్ధమయ్యా రు. బంధువులందరికీ కూడా చెప్పుకున్నారు. ఇంతలోనే సంతోష్‌ను మృత్యువు మింగేయటంతో వారి కుటుంబ సభ్యుల శోకాన్ని ఎవరూ ఆపలేకపోతున్నా రు. సంతోష్‌కు తల్లిదండ్రులు పైడమ్మ, సీతయ్యలతో పాటు అన్నయ్య రాములప్పడు ఉన్నారు. డెంకాడ ఎస్ఐ కళాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తమిళంలో రెండు చిత్రాలు...
చమక్ చల్లో, ఇద్దరమ్మాయిలతో చిత్రాల్లో నటించిన మలయాళ భామ కేథరిన్ యాక్ట్ చేసిన ‘పైసా’ విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగులో సినిమాలు కమిట్ కాలేదు. అయితే తమిళంలో మాత్రం రెండు చిత్రాలు అంగీకరించిందని సమాచారం. కార్తీ సరసన ‘కాళీ’ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించిన కేథరిన్ తాజాగా అథర్వ సరసన ఓ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మురుగదాస్ దగ్గర సహాయ దర్శకునిగా చేసిన సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ రెండు చిత్రాల్లోనూ కేథరిన్వి మంచి పాత్రలే అని, తప్పకుండా ఆమె కెరీర్‌కి ఉపయోగపడే చిత్రాలు అవుతాయని కోలీవుడ్ టాక్. -
ప్రేమించాలి.. ప్రేమను పంచాలి
ప్రేమను పంచే తల్లిదండ్రులే... ప్రేమను పొందడానికి ప్రథమార్హులు అని తెలిపే కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్’. సంతోష్, మనీషా జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళనాట విజయఢంకా మోగించింది. ఈ చిత్రాన్ని ‘ప్రేమించాలి’ పేరుతో సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అనువాద కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి సురేష్ మాట్లాడుతూ- ‘‘పరిణతిలేని ప్రేమ ఓ జంట జీవితంతో ఎలా ఆడుకుంది? అనే అర్థవంతమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. మా సంస్థలో వచ్చిన గత చిత్రాలకు మించే విజయాన్ని ఈ సినిమా దక్కించుకుంటుంది. తమిళనాట విజయ్ ‘తలైవా’ చిత్రంతో పాటు విడుదలై 16 కోట్లు వసూలు చేసిన సినిమా ఇది. యువతరాన్ని విశేషంగా అలరించే విధంగా సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘సురేష్ కొండేటితో కలిసి నేను విడుదల చేసిన పిజ్జా, క్రేజీ, మహేష్ చిత్రాలు మంచి విజయాలుగా నిలిచాయి. మా కాంబినేషన్లో విడుదలవుతున్న ఈ నాల్గవ చిత్రం కూడా తప్పకుండా విజయాన్ని అందుకుంటుంది’’ అని సహనిర్మాత సమన్యరెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఛాయాగ్రహణం: సూర్య వి.ఆర్, కూర్పు: ఆంటో