( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురికి లుకౌట్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ బీడీజేఎస్ అధినేత తుషార్, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలు సోమవారం విచారణకు హాజరు కాకపోవడంతో సిట్ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.
ఈ క్రమంలోనే బీఎల్ సంతోష్ ఆఫీస్‌లో సైతం పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో బీఎల్ సంతోష్ తాను వేరే రాష్ట్రంలో పర్యటిస్తున్నాని, అందువల్ల సిట్ ముందుకు వచ్చేందుకు సమయం కావాలని కోరాడు. ఐతే కేరళ వైద్యుడు జగ్గుస్వామీ మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు. దీంతో అతను విదేశాలకు పారిపోకుండా తెలంగాణ పోలీసులు అన్ని ఎయిర్‌పోర్ట్‌లను అలర్ట్ చేయడమే కాకుండా విదేశాలకు చెక్కేయకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది సిట్.
ఇక ఈ కేసులో బండి సంజయ్ అనుచరుడు న్యాయవాది శ్రీనివాస్‌ని ఇప్పటికే ప్రశ్నించిన సిట్ మంగళవారం మరోసారి విచారణకు హాజరు కావాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో రెండో రోజు విచారణకు హాజరైన అడ్వకేట్ శ్రీనివాస్ కాల్‌డేటా, బ్యాంక్‌స్టేట్‌మెంట్లను సిట్ బృందం పరిశీలిస్తోంది.
(చదవండి: ఎమ్మెల్యేలకు ‘ఎర’ కేసులో కొత్త ట్విస్ట్.. ఆ ముగ్గురికి లుకౌట్ నోటీసులు!)
Comments
Please login to add a commentAdd a comment