సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరు చెప్పాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తీవ్రంగా వేధిస్తోందని న్యాయవాది భూసారపు శ్రీనివాస్ ఆరోపించారు. సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్టవిరుద్ధమన్నారు. ఆ జీవోను రద్దు చేయాలని కోరారు. సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరయ్యానని, మూడు రోజులపాటు కేవలం సంజయ్ పేరు చెప్పాలని ఒత్తిడి చేశారన్నారు.
సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగడం లేదని వెల్లడించారు. ఈ మేరకు సిట్ దర్యాప్తు ఆపి, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ అధికారులు, సీబీఐ, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, రామచంద్రభారతి, సింహయాజీ, నందుకుమార్, సీవీ ఆనంద్‌తోపాటు ఇద్దరు సిట్ సభ్యులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో సిట్ ఎదుట హాజరయ్యానని.. రాజేంద్రనగర్ ఏసీపీ, అధికారులు రమా రాజేశ్వరి, కమళేశ్వర్‌లు బండి సంజయ్, కొందరు బీజేపీ ముఖ్య నేతల పేర్లు చెప్పాలని రోజంతా తీవ్ర ఒత్తిడి తెచ్చారన్నారు.
వారు కోరిన విధంగా చెప్పేందుకు నిరాకరిస్తే.. తనను నిందితుడిగా(ఏ7)గా పేర్కొంటూ మెమో జారీ చేస్తామని బెదిరించారన్నారు. ఈ విషయాన్ని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సీవీ ఆనంద్‌కు చెప్పినా పట్టించుకోలేదని నివేదించారు. విచారణవీడియోను హైకోర్టుకు సమరి్పంచాలని కోరినా.. 23నాటి∙విచారణలో అధికారులు కోర్టుకు అందజేయలేదని చెప్పారు. వీటిని పరిగణనలోకి తీసుకుని సిట్ దర్యాప్తు ఆపాలని విజ్ఞప్తి చేశారు.
చదవండి: హైదరాబాద్‌లో నీరా కేఫ్ రెడీ
Comments
Please login to add a commentAdd a comment