Poaching case
-
ఢిల్లీ మంత్రి అతిషిపై పరువు నష్టం కేసు..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేత, ఢిల్లీ మంత్రి అతిషిపై శనివారం పరువు నష్టం కేసు నమోదైంది. రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ బీజేపీ మీడియా చీఫ్ ప్రవీణ్ శంకర్ కపూర్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిని రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. కేసు విచారణను జూలై 23వ తేదీకి లిస్ట్ చేసింది. చిరునామా తప్పుగా ఉన్నందున సమన్లు అందజేయలేదని కోర్టు పేర్కొంది. కోర్టులో ఉన్న ఆమె న్యాయవాదికి ఫిర్యాదు కాపీని అందించారు.ఈ కేసులో మంత్రి అతిషి తరఫున లాయర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. బీజేపీ నేత తరఫున న్యాయవాది శౌమేందు ముఖర్జీ మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలకు డబ్బులు ఆశ చూపినట్లుగా తప్పుడు ఆరోపణలు చేసి పార్టీ ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించారు. ఆప్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ప్రవీణ్ శంకర్ కపూర్ పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అనంతరం.. ఓ సమావేశంలో మంత్రి అతిషి మాట్లాడుతూ.. బీజేపీ ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.25కోట్ల ఆఫర్ చేస్తూ.. నేతలను కొనేందుకు ప్రంయత్నిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నం చేస్తుందని.. ఏడుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఆప్ చేసిన ఆరోపణలను బీజేపీ కొట్టిపడేసింది.ఆ తర్వాత కూడా అతిషి మళ్లీ ఆరోపణలు చేశారు. తన సన్నిహితుల ద్వారా బీజేపీ తనను సంప్రదించిందని.. తనను బీజేపీలో చేరాలని కోరారని చెప్పారు. పార్టీ మారితేనే తన రాజకీయ జీవితం నిలబడుతుందని అన్నారని.. పార్టీ మారకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను ఒక నెలలోగా అరెస్టు చేస్తుందని బెదించారని ఆరోపించారు. ఈ కేసులో బీజేపీ పరువు నష్టం కింద నోటీసులు పంపింది. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. ఎమ్మెల్యేల కొనుగోలులో హ్యాండ్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్‌లో భాగంగానే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం బయటకు వచ్చినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో కూడా ప్రణీత్ రావు అండ్ కో టీమ్ కీలకంగా వ్యవహరించినట్టు వెల్లడయింది. వివరాల ప్రకారం.. 2022 అక్టోబర్ నెలలో తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఎపిసోడ్‌కు కర్త, కర్మ, క్రియగా ఇద్దరు పోలీసు అధికారులు వ్యవహరించినట్టు తాజా విచారణలో భాగంగా పోలీసులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇందులో కీలకంగా వ్యవహరించినట్టు తెలిసింది. నాడు ఎమ్మెల్యేలుగా ఉన్న గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లను అనధికారికంగా ప్రణీత్‌రావు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ఎమ్మెల్యేల సంభాషణలను రికార్డు చేసిన ప్రణీత్‌రావు.. వాటిని ప్రభుత్వం అందజేయగా.. అలర్ట్ అయినట్లు విచారణలో తేలిసింది. ఈ ఆపరేషన్‌ను పకడ్బందీగా చేపట్టే బాధ్యతను రాధాకిషన్ అండ్ కోకు అప్పగించినట్టు సమాచారం. దీంతో రాధాకిషన్ తన బృందంతో ఒక రోజు ముందు వెళ్లి సీసీ కెమెరాలను పక్కాగా అమర్చినట్టు వెల్లడైంది. గెస్ట్ హౌజ్‌లో ఏ రకమైన వ్యవహారమైనా పక్కాగా రికార్డు అయ్యేలా సీసీ కెమెరాలను, మైక్‌లను అమర్చినట్టు తాజా విచారణలో బయటపడింది. ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ తరపున వచ్చిన బీఎల్ సంతోష్‌లను పక్కాగా ట్రాప్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. ఈ టీమ్‌లో ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. త్వరలోనే మరికొందరిని కూడా పోలీసులు విచారించనున్నట్టు తెలిసింది. నోటీసులిచ్చేందుకు ప్రత్యేక విమానామా? ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో స్పెషల్ విమానంలో ఆనాటి సిట్ బృందం తిరిగినట్లు విచారణలో తేలింది. అయితే, కేసు విచారణ సందర్భంగా అధికారులు విమానాల్లో ప్రయాణించడం సాధారణమే అయినా కేవలం నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ వినియోగించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆ ప్రత్యేక విమానం బీఆర్ఎస్కు సంబంధించిన ఓ కీలక నేతకు చెందినదిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక విమానంలో అధికారులు ఢిల్లీ, కేరళకు వెళ్లారు. బీఎల్ సంతోష్, తుషార్‌కు నోటీసులు ఇవ్వడానికి పోలీసు అధికారులు ఈ స్పెషల్ ఫ్లైట్ ను వినియోగించారు. ఓ కేసు విషయంలో నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ ఎవరి ఆదేశాల మేరకు వినియోగించారు అనే కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. -
మళ్లీ తెరపైకి ఎమ్మెల్యేల కొనుగోలు టాపిక్.. రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే పొలిటికల్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేస్తూ రేవంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, రేవంత్ ట్విట్టర్ వేదికగా.. ‘కేసీఆర్!.. మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా?. అదే తెలంగాణలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా?. ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ సందర్భంలో.. మీ సర్కారును కూలదోస్తామన్న కుట్రదారు బీఎల్ సంతోష్.. హైదరాబాద్ వచ్చిండటగా.. ఇన్నాళ్లు అడ్రస్ దొరకలేదని తప్పించుకుంటిరి.. మరి ఇప్పుడైనా ఆయన్ని అరెస్టు చేసే దమ్ముందా? ఆ కట్టుకథను ప్రజలు మర్చిపోతారులే అని అతిథ్యమిస్తారా? లేక సిట్ ను నిద్రలేపి అరెస్టేమైనా చేస్తారా? తెలంగాణ చూస్తోంది.. మీ సమాధానం కోసం..!!’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. కేసీఆర్! @TelanganaCMO మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా? అదే తెలంగాణలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా? ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ… — Revanth Reddy (@revanth_anumula) October 5, 2023 ఇది కూడా చదవండి: బీజేపీ ఎన్నికల కమిటీల ప్రకటన.. 14 కమిటీలు.. రాజగోపాల్‌రెడ్డి, వివేక్, విజయశాంతిలకు చోటు -
బీఆర్ఎస్ అసంతృప్తులకు ఆఫర్లు!
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితిలో అధికారిక పదవుల్లో ఉన్న వారితో పాటు పలు వురు ముఖ్య నేతలకు తమ పార్టీలోకి రావాలంటూ విపక్ష నేతల నుంచి ఆఫర్లు వస్తున్నట్లు ముమ్మర ప్రచారం జరుగుతోంది. నిర్ణీత గడువు లోపు తమ పార్టీలో చేరితే ప్రాధాన్యత ఉంటుందనే సంకేతాలు పంపుతున్నట్లు సమాచారం. తమకు విపక్షాల నుంచి ఆఫర్లు వస్తున్నట్లు చెబుతున్న అసమ్మతి నేతలు బీఆర్ఎస్ను వీడ టంపై తమ వైఖరిని వెల్లడించేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయ దుమా రాన్ని లేపడంతో కొంతకాలం ఇతర పార్టీల్లోకి వలసల అంశం సద్దుమణిగినట్లు కనిపించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ రాజకీయ భవిష్యత్తును తేల్చుకోవాలని భావిస్తున్న అధికార పార్టీ నేతలు.. ఇతర పార్టీల నుంచి అందుతున్న ఆహ్వానాలపై తర్జనభర్జన పడుతున్నారు. అధికార పార్టీలోనే కొనసాగితే, చివరి నిమిషంలో టికెట్ దక్కకపోతే పరిస్థితి ఏంటనే ఆందోళన కొందరిలో కనిపిస్తోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో తమకు టికెట్ కేటాయింపుపై హామీ ఇస్తేనే చేరతామంటూ కొందరు మెలిక పెడుతున్నారు. ఎన్నికల వ్యయాన్ని భరించాలని కూడా ఓ ప్రధాన జాతీయ పార్టీకి బీఆర్ఎస్ అసంతృప్త నేతలు షరతు విధిస్తున్నట్లు సమాచారం. మరికొందరు టికెట్ కోసం సొంత పార్టీపైనే ఒత్తిడి పెంచి హామీ పొందేలా తమ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలోకి విస్తృతంగా వెళ్లడం ద్వారా తమను పక్కన పెట్టలేని పరిస్థితిని సృష్టించాలనే యోచనలో కొందరు ఆశావహులు ఉన్నారు. సగానికి పైగా స్థానాల్లో టికెట్ల పోటీ... ఈ ఏడాది చివరలో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు లక్ష్యంగా సంస్థాగత కార్యకలాపాలను ముమ్మరం చేయడంపై బీఆర్ఎస్ దృష్టి కేంద్రీకరించింది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత శాసనసభ్యులకే టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు చెబుతున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తుండటం సమస్యగా మారింది. మరోవైపు పలువురు సీనియర్ నేతలు తమ వారసులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. అలాగే ఉద్యమ సమయం నుంచి పార్టీలో పనిచేస్తున్న నేతలు, వివిధ సందర్భాల్లో ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన సీనియర్ నేతలతో పాటు ఇతరులు కూడా అసెంబ్లీపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సుమారు 50 స్థానాల్లో బీఆర్ఎస్ టికెట్ల కోసం బహుముఖ పోటీ నెలకొంది. ఈ క్రమంలో పార్టీ టికెట్ దక్కే అవకాశం లేదని భావిస్తున్న వారు, నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరును ఎదుర్కొంటున్నవారు, తమను అధిష్టానం గుర్తించడం లేదనే అసంతృప్తితో ఉన్నవారు.. తమ రాజకీయ భవిష్యత్తుపై లెక్కలు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్లో ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రధాన విపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఆ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేతలపై కేసీఆర్ నజర్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్సీ మధుసూధనాచారి నేతృత్వంలోని కమిటీ వీటిపై ఇస్తున్న నివేదికలను విశ్లేషిస్తూ నియోజకవర్గాల వారీగా నేతలపై ఓ అంచనాకు వస్తున్నారు. సమ్మేళనాలను దూరంగా ఉంటున్న నేతలు, వారు దూరంగా ఉండడానికి కారణాలు, వారు భవిష్యత్తులో అనుసరించే వ్యూహాలు తదితరాలపై దృష్టి సారించారు. ♦ ఖమ్మం జిల్లా నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆయనతో పాటు బయటకు వెళ్లే నేతలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మరోవైపు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు అసంతృప్త నేతలు పార్టీని వీడకుండా మంతనాలు జరుపుతున్నారు. ♦ మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకర్గంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ మాలోత్ కవిత నడుమ ఆధిపత్య పోరు కొలిక్కిరావడం లేదు. మంత్రి సత్యవతి రాథోడ్ ములుగుకు బదులుగా డోర్నకల్ నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రులు టి.రాజయ్య, కడియం శ్రీహరి వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ♦ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. తన కుమారుడు రోహిత్ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి నడుమ టికెట్ పోరు సాగుతుండగా రోహిత్ ఎంట్రీ కొత్త చిక్కులు సృష్టిస్తోంది. ♦ ఆలంపూర్, బెల్లంపల్లి, నర్సాపూర్, మహేశ్వరం, చేవెళ్ల, తాండూరు, జహీరాబాద్, కుత్బుల్లాపూర్, పాలేరు, ఆసిఫాబాద్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ తదితర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్లో బహుముఖ పోటీ నెలకొంది. నాగర్‌కర్నూల్‌లో తన కుమారుడి టికెట్ కోసం ఓ కీలక ప్రజా ప్రతినిధి ఇతర పార్టీలతో మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బోథ్, పినపాక, కరీంనగర్, వేములవాడ, మానకొండూరు, మేడ్చల్, రామగుండం తదితర నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నా ఇతరులు కూడా టికెట్లు ఆశిస్తున్నారు. -
బీజేపీ నేత బీఎల్ సంతోష్ కనబడుట లేదు.. హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వెలిసిన వాల్‌పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. బీజేపీ నాయకుడు బీఎల్ సంతోష్ కనబడుట లేదంటూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. ‘ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు’ కనపడుట లేదు.. బీఎల్ సంతోష్‌ను పట్టిచ్చిన వారికి రూ.15 లక్షల బహుమానం.. అని పోస్టర్లు ఏర్పడ్డాయి. వీటిని నగరవాసులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా ఎమ్మెల్యేల కొనుగోలులో బీఎల్ సంతోష్ కీలక వ్యక్తి అని అందరూ చర్చించుకోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ అండతో విచారణ నుంచి తప్పించుకున్న వ్యక్తి ఇతడేనని పోస్టర్లను చూసుకుంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు సంతోష్‌పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలే ఈ పని చేసి ఉంటారని కాషాయ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అంటించిన పోస్టర్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సూత్రధారి బీజేపీ సీనియర్ నేత సంతోష్యేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆయనపై తెలంగాణలో కేసు నమోదయింది. తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ విచారణకు కూడా ఆయన హాజరుకాలేదు. అయితే ఈ కేసు దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీంతో సీబీఐ దర్యాప్తు జరపాలన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తాము చెప్పేంత వరకు ఈ కేసును సీబీఐ విచారించవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణను జులై 31కి వాయిదా వేసింది. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. జులై 31 వరకు స్టేటస్ కో..
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీం కోర్టు జులై 31కి వాయిదా వేసింది. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దర్యాప్తు కొనసాగించవద్దని నిబంధన ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అప్పటి వరకు దర్యాప్తు రికార్డులు సీబీఐకి అందించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దర్యాప్తుపై స్టేటస్ కో కొనసాగించాలని ఈమేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సోమవారం ఆదేశాలు ఇచ్చింది. కాగా.. ఎమ్మెల్యేల ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సిట్ దర్యాప్తు రద్దుచేస్తూ.. కేసుకు సంబంధించిన రికార్డులన్నీ సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన తెలిసిందే. దీంతో సీబీఐ దర్యాప్తు జరపాలన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దర్యాప్తు సంస్థలన్నీ కేంద్రం గుప్పిట్లోనే ఉన్నాయని, కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తే నీరు గారిపోతుందని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టులో వాదించిన విషయం తెలిసిందే. చదవండి: నాటు నాటు గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది.. -
ఇది సమంజసమేనా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉండి న్యాయమూర్తులకు కేసుకు సంబంధించిన వీడియో క్లిప్పింగులు పంపిస్తారా? బాధ్యతాయుతమైన హోదాలో ఉండి అలా చేయడం సబబేనా?’’ అని ‘ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారంలో సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ తీరు అసౌకర్యంగా ఉందని, ఇది న్యాయమూర్తుల ఆలోచనను మార్చడమేనని అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అరవిందకుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. మొదట ఆయన వాదన ప్రారంభిస్తుండగానే ధర్మాసనం కల్పించుకుని.. ‘కోర్టు సమయం ముగిసే లోపు వాదనలు పూర్తవుతాయా?’అని ప్రశ్నించింది. ప్రజాస్వామ్య మనుగడనే ప్రశ్నించేలా ఉన్న ఈ కేసు చాలా తీవ్రమైందని, వాదనలు వినాలని దవే కోరారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా సీబీఐకి కేసు విచారణను ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ‘‘సిట్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ఉండదా?’’అని ప్రశ్నించగా.. స్థానిక హైకోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేస్తుందని దవే వివరించారు. అసలు ఈ కేసు దర్యాప్తులో సీఎం జోక్యం చేసుకున్నారన్న ప్రసక్తే సరికాదని, విలేకరుల సమావేశం నిర్వహిస్తే జోక్యం అనడం సరికాదని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులు నిత్యం టీవీల్లో ప్రసారం అవుతున్నాయని, ఆదివారం ఢిల్లీ డిప్యూటీ సీఎం విచారణపైనా ప్రసారాలు వచ్చాయని గుర్తు చేశారు. ఇది అసౌకర్యంగా ఉంది దవే వాదనల మధ్యలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘సీఎం న్యాయమూర్తులకు ఆడియో, వీడియో క్లిప్పింగులు పంపించడం సమంజసమేనా?’అని ప్రశ్నించింది. సీఎం వ్యవహరించిన తీరు న్యాయమూర్తుల ఆలోచనను మార్చడమేనని అభిప్రాయపడింది. అయితే దీనిపై సీఎంను సంప్రదించకుండానే తాను క్షమాపణలు చెప్తున్నానని, ఈ అంశాన్ని మరో కోణంలో చూడాల్సి ఉందని న్యాయవాది దవే ధర్మాసనాన్ని కోరారు. ఈ విధంగా కేసుకు సంబంధించిన క్లిప్పింగులు పంపడం అసౌకర్యంగా ఉందని జస్టిస్ బీఆర్ గవాయి పేర్కొనగా.. విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేయొచ్చని దవే సూచించారు. హోలీ సెలవుల తర్వాత విచారణ హోలీ సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ధర్మాసనం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం విచారిస్తున్న ఇద్దరు న్యాయమూర్తులం వేర్వేరు కాంబినేషన్ల ధర్మాసనాల్లో ఉంటున్నామని.. చీఫ్ జస్టిస్ నుంచి తగిన ఆదేశాలు తీసుకొని, తగిన బెంచ్ ముందు ఈ పిటిషన్‌ను లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. సిట్ దర్యాప్తునకు అనుమతించండి ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ఐదు గంటల వీడియో, ఆడియో కాల్స్, వాట్సాప్ చాట్లతో కూడిన ఆధారాలు ఉన్నాయని ధర్మాసనానికి దవే వివరించారు. సిట్ వద్ద కీలక ఆధారాలు ఉన్నాయని, ఇప్పుడు సీబీఐ దర్యాప్తు అంటే ఎలాగని.. హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తునకు అనుమతించాలని కోరారు. ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేస్తున్న దర్యాప్తు సంస్థలు.. అధికార బీజేపీ నేతలపై ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రాంతీయ ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ చూస్తోందని, ఎమ్మెల్యేలను పార్టీ చేర్చుకునేందుకు డబ్బులతో ప్రలోభపెడుతోందని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు అనే సరికి ఈ కేసు ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. దవే వాదనలు కొనసాగిస్తుండగా జస్టిస్ బీఆర్ గవాయి జోక్యం చేసుకొంటూ.. కేసుకు సంబంధించిన ఆధారాలను ముఖ్యమంత్రికి ఇచ్చారా? అని ప్రశ్నించారు. అక్టోబర్ 27న తాము కోర్టుకు ఆధారాలను సమర్పించామని, నవంబరు 3న పూర్తి సమాచారంతో కూడిన పెన్‌డ్రైవ్‌ను అందజేశామని దవే తెలిపారు. ‘‘సీఎం కొత్తగా ప్రెస్మీట్లో ఏమీ చెప్పలేదు. చట్టబద్ధమైన పాలనలో ఉన్నాం. కోర్టులు పూర్తిస్థాయి ఆధారాల కోసం చూడాలి. వాస్తవం కళ్లు మూసుకోరాదు. ఇది బీజేపీ లేదా బీఆర్ఎస్ గురించి కాదు. ప్రజాస్వామ్యం గురించి, వారిని అధికారంలోకి తెచ్చిన సామాన్యుల గురించి.. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ అవసరం’’ అని ధర్మాసనానికి దవే విన్నవించారు. కాగా.. ఈ కేసులో బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ హాజరయ్యారు. -
అసంపూర్తిగా ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ..సుప్రీం న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టు సోమవారం చేపట్టిన విచారణ అసంపూర్తిగా ముగిసింది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం కేసును సీజేఐ ధర్మాసనానికి రిఫర్ చేసింది. తదుపరి విచారణపై ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. కోర్టు సమయం ముగియడంతో వాదనలను నిలిపివేసింది. శనివారం నుంచి సుప్రీంకోర్టుకు హోలీ సెలవులు కావడంతో శుక్రవారమే విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే కోర్టును కోరారు. అయితే శుక్రవారం విచారించటం సాధ్యం కాదని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్ల ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో కేసు తదుపరి విచారణపై సందిగ్ధత నెలకొంది. సోవారం వాదనల సందర్భంగా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలను ఆలకించింది. అనంతరం జస్టిస్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసుకు సంబంధించి పెన్ డ్రైవ్‌లు జడ్జీలకు పంపడం సరైన విషయం కాదన్నారు. ముఖ్యమంత్రి నేరుగా తమకు పంపడం బాగాలేదన్నారు. ఒక సామాన్యుడు చేస్తే ఏమైనా అనుకోవచ్చు.. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇలా ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే సీబీఐ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే సిట్ కూడా మీ ప్రభుత్వం అధీనంలో ఉంది కదా? అని అడిగారు. పెన్డ్రైవ్లపై క్షమాపణలు.. జడ్జీలకు సీఎం కేసీఆర్ కేసు వీడియోల పెన్‌డ్రైవ్‌లు పంపడంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. ప్రభుత్వాన్ని కూలగొట్టలని చూస్తే ఆ పార్టీ అధినేత చూస్తూ ఊరుకుంటారా, జరిగిన కుట్రను చెప్పకూడదా అని కోర్టుకు తెలిపారు. 'బీజేపీ నేతలు కేసులో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉంది, సీబీఐ పారదర్శకంగా విచారణ జరపదు. దేశంలో ఉన్న ప్రతిపక్షంపై దాడులు జరుగుతున్నాయి. 8 ప్రభుత్వాలను కూల్చారు. మనీష్ సిసోడియా వ్యవహారం అంతా సీబీఐ బయటకు చెబుతోంది. కేవలం ప్రతిపక్ష నేతల వెంట పడుతున్నారు. బీజేపీ నేతలను మాత్రం పట్టుకోవడం లేదు. కేసు దర్యాప్తును ఎట్టి పరిస్థితుల్లో సీబీఐకి అప్పగించవద్దు. సీబీఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో పంజరంలో చిలకలాగా మారింది. ఈ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచి ఒకసారి సమర్థించి మరొకసారి వ్యతిరేకించింది. ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా బీజీపీ నేతలు దురుద్దేశపూర్వకంగానే మరో పిటిషన్ దాఖలు చేసి సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఇప్పుడు సీబీఐ చేతుల్లోకి వెళితే అన్ని ఆధారాలు ధ్వంసం అయిపోతాయి. కేసు పూర్తిగా నీరు గారి పోతుంది' అని దవే కోర్టుకు తెలియజేశారు. 'బీజేపీలో జాయిన్ అయితే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తామని, పదవులు ఇస్తామని డీల్ పెట్టారు. బీజేపీలో జాయిన్ కాకపోతే సీబీఐ, ఈడీతో దాడులు చేయిస్తామని బెదిరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టలని చూశారు. అందుకే ట్రాప్ వేసి పట్టుకున్నాం. అన్ని వీడియో రికార్డులు మా వద్ద ఉన్నాయి బీఎల్ సంతోష్ , రామచంద్ర భారతి సమావేశం జరిగింది. వాట్సాప్ చాట్ కూడా ఉంది ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అప్డేట్స్ ఎప్పటికప్పుడు బీఎల్ సంతోష్‌కు ఇచ్చారు. బీఎల్ సంతోష్, తుషార్, రామచంద్ర భారతి సమావేశం ఢిల్లీ నివాసంలో జరిగింది. ఫోన్ లోకేషన్స్ అన్నీ దొరికాయి. సిట్ స్వతంత్రంగా దర్యాప్తు చేసింది.' అని దవే కోర్టుకు తెలిపారు. -
ఎమ్మెల్యేల కేసు: నేడు సుప్రీంకోర్టులో విచారణ
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై విచారణ జరుగనుంది. కాగా, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది. ఇక, ఈ కేసు విషయమై పిటిషన్లో భాగంగా హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ప్రభుత్వం కోరింది. మరోవైపు.. సీఎం కేసీఆర్ ఈ కేసుకు సంబంధించి వీడియో ఫుటేజ్‌ను పెన్ డ్రైవ్‌లో అన్ని రాష్ట్రాలకు, జడ్జీలకు పంపించారు. కాగా, ప్రాథమిక సాక్ష్యాధారాలు లీక్ కావడంతో హైకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. అయితే, ప్రభుత్వం మాత్రం.. బీజేపీ నేతలే నిందితులుగా ఉన్న కేసును కేంద్ర సంస్థ సీబీఐకి అప్పగించడం వల్ల అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదని చెబుతోంది. ఈ కేసుపై మంత్రి కేటీఆర్ కూడా స్పందిస్తూ.. కెమెరాల సాక్షిగా బీజేపీ కుట్ర బయటపడిందన్నారు. -
సీబీఐ ఎలా దర్యాప్తు చేస్తుంది?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు ఎలా చేస్తుందని రాష్ట్ర పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ప్రశ్నించారు. సీబీఐకి కేసు బదిలీ చేయడం వల్ల న్యాయం లభించదని పేర్కొన్నారు. సీబీఐను కేంద్రం నియంత్రిస్తోందని దవే ఆరోపించారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎర కేసులో రాష్ట్ర పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. తొలుత దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. గురువారం రాత్రి 9 గంటల సమయంలో జాబితాలో కేసు చేర్చారని, న్యాయమూర్తులు చదివారో లేదోనని గుర్తుచేశారు. పిటిషన్ చదవలేకపోయామని ధర్మాసనం పేర్కొనగా... విచారణ శుక్రవారానికి వాయిదా వేయాలని కోరిన దవే పది రోజుల క్రితమే జాబితాలో చేర్చాలని సీజేఐ చెప్పినప్పటికీ రిజిస్ట్రీ రాత్రి వరకూ జాబితాలో చేర్చకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుని గతంలో నమోదు చేసిన పిటిషన్లపై ప్రశ్నించింది. ‘‘తెలంగాణలో ఎమ్మెల్యేల ఎర కేసు చాలా తీవ్రమైనది. వరసగా స్టే ఉత్తర్వులు, బెయిలు ఉత్తర్వులు వల్ల విచారణ కొంచెం కూడా ముందుకు సాగడం లేదు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే ఈ కేసులో తెలంగాణ హైకోర్టులోనూ వాదనలు వినిపించా. బీజేపీ పిటిషన్‌ను సింగిల్ బెంచ్ తొలుత విచారించగా.. విచారణార్హత లేదని డివిజన్ బెంచ్ పేర్కొంది’’అని దవే తెలిపారు. ఈ కేసు దర్యాప్తు చేయడానికి సిట్ వేశారు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను సింగిల్ బెంచ్ రద్దు చేసిందని దవే తెలిపారు. సిట్ ఏర్పాటు చేసింది సింగిల్ బెంచ్ కాదా అని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని, సింగిల్ బెంచ్ పర్యవేక్షిస్తుందని డివిజన్ బెంచ్ పేర్కొందని ఇరుపక్షాల న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. సీఎంను తొలుత నిందించాలి.. మహేశ్ జెఠ్మలానీ బీజేపీ తరఫు సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపిస్తూ.. సిట్ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉందన్నారు. కేసు దర్యాప్తు రికార్డులు మీడియాకు విడుదల చేసినందుకు తెలంగాణ సీఎంను తొలుత నిందించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసుల స్వతంత్రత పై అనుమానం వస్తోందని తెలిపారు. మీడియాకే కాదు న్యాయమూర్తులకు పంపారని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా సీబీఐ, ఈడీ దర్యాప్తు వివరాలన్నీ మీడియాకు లీక్ అవుతున్నాయని దవే ఆరోపించారు. ఇలా చేయడం ఎవరికీ తగదని జెఠ్మలానీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని, ప్రజాస్వామ్యాన్ని కోర్టులు మాత్రమే కాపాడగలవని దవే పేర్కొన్నారు. ‘‘బీజేపీకి వ్యతిరేకంగా ఆరోపణలుండగా సీబీఐ చేతికి దర్యాప్తు ఎలా ఇస్తారు?. ఇది ట్రాప్ కేసు. పలు సాక్ష్యాలున్నాయి. అవినీతి నిరోధక కేసుల్లో ట్రాప్ పద్ధతి సరైందని సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చింది. ఎమ్మెల్యేలతో ఏం చర్చించారో ఐదు గంటల రికార్డింగు ఉంది. ఫోన్, వాట్సాప్ సంభాషణలూ ఉన్నాయి. సీబీఐకి దర్యాప్తు అప్పగించాల్సిన అవసరం లేదు. కేసులో వాదనలకు ఎక్కువ సమయం కావాలి’’అని దుష్యంత్ దవే వాదన ముగించారు. ధర్మాసనం సమాలోచనల్లో ఉండగా.. ‘‘వేధించొద్దని సీబీఐకి సూచించండి’’అని జెఠ్మలానీని ఉద్దేశించి దవే చమత్కరించారు. సీబీఐని బీజేపీ ఏమీ నియంత్రించడం లేదని జెఠ్మలానీ స్పష్టం చేశారు. అనంతరం, ఈ నెల 27కు విచారణ వాయిదా వేస్తున్నామని, ఆరోజు అన్ని కేసుల విచారణ తర్వాత చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సమయంలో సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు మాట్లాడుతుండగా... ఎవరి తరఫున హాజరయ్యారని ధర్మాసనం ప్రశ్నించింది. ఫిర్యాదు చేసి ఇరుపక్షాల మధ్య చిక్కుకున్న ఎమ్మెల్యే తరఫు అని సమాధానమిచ్చారు. ఏమైందని ధర్మాసనం ప్రశ్నించగా.. తన క్లయింటును ఈడీ వేధిస్తోందని శేషాద్రి నాయుడు తెలిపారు. -
సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఈనెల 27కు విచారణ వాయిదా
న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడా ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరుపున సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే పలు కీలక అంశాలను ధర్మాసనం ముందు వినిపించారు. సీబీఐ, ఈడీ మీడియాకు లీకులు ఇస్తున్నాయిని తెలిపారు. ఈ కేసులో సీబీఐ ఒత్తిడి చేయకుండా ఆర్డర్ ఇవ్వాలని కోరారు. సిట్ దర్యాప్తులోని ఆధారాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని.. ఈ క్రమంలో కేసు విచారణను సీబీఐకి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. కేసుపై వాదనల కోసం తనకు ఎక్కువ సమయం కావాలని కోరారు. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. రాగా ఎమ్మెల్యేల ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీచేస్తూ ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిట్ దర్యాప్తు రద్దుచేస్తూ.. కేసుకు సంబంధించిన రికార్డులన్నీ సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సీబీఐ దర్యాప్తు జరపాలన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చదవండి: హైదరాబాద్ సీ‘రియల్’ స్నాచర్ల కేసులో కీలక మలుపు -
ఎమ్మెల్యేల ఎర కేసు.. కీలకంగా సుప్రీం విచారణ!
సాక్షి, హైదరాబాద్: ఉన్నతన్యాయస్థానం దర్యాప్తు చేపట్టమని ఆదేశించింది. దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగేందుకు రెడీ కూడా అయ్యింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందనా, సహకరం రెండూ లేవు. పైగా కోర్టును ఆశ్రయించుకుంటూ పోతోంది. ఈ తరుణంలో.. సుప్రీం కోర్టు విచారణపైనే సీబీఐ దర్యాప్తు ఆధారపడనుంది. ఎమ్మెల్యేల ఎర కేసులో రేపు(శుక్రవారం) సుప్రీం కోర్టు విచారణ కీలకం కానుంది. సుప్రీం విచారణ తర్వాత కేసు నమోదుపై సీబీఐ ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే సీబీఐ దర్యాప్తునకు తెలంగాణ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే.. కేసు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఐదుసార్లు లేఖ కూడా రాసింది దర్యాప్తు సంస్థ. అయినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఎమ్మెల్యేలకు ఎర కేసులో సుప్రీం విచారణ, ఆదేశాలపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ఎమ్మెల్యేల కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ.. సర్కార్ ప్లాన్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకున్నాయి. చివరకు ఈ కేసును హైకోర్టు.. సీబీఐ విచారణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో, ఈ కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. ఈ కేసులో ప్రభుత్వం తమకు సహకరించకపోతే ఏం చేయాలో ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం కేసు వివరాలు ఇవ్వకపోతే సీబీఐ ఇలా చేసే అవకాశం ఉంది. 91 సీఆర్పీసీ కింద ప్రభుత్వానికి సీబీఐ నోటీసులు ఇవ్వనుంది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 93 ప్రకారం.. కోర్టు వారెంట్ ద్వారా సీబీఐ డాక్యుమెంట్లను సీజ్ చేయనుంది. లేదంటే హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. మరోవైపు.. కేసు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సీబీఐ మరోసారి లేఖ రాయనుంది. కాగా, ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు ఆరుసార్లు ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసింది. అయితే, ఈ లేఖల్లో మొయినాబాద్ ఎఫ్ఐఆర్కు సంబంధించిన పూర్తి వివరాలు, సంబంధిత పత్రాలు తమకు సమర్పించాలని సీబీఐ కోరింది. కాగా, ఈ లేఖపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇదిలా ఉండగా.. ఈ కేసు విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఫిబ్రవరి 17వ తేదీన విచారణ చేపట్టనుంది. ఇక, తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. -
ఎమ్మెల్యేలకు ఎర కేసు: లంచ్ మోషన్ పిటిషన్ విత్ డ్రా చేసుకున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సింగిల్ బెంచ్ వద్ద దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం విత్‌డ్రా చేసుకుంది. మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ వేగం పెంచింది. కేసు వివరాలు ఇవ్వాలని సీఎస్‌కు సీబీఐ మరో లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, ప్రాథమిక సాక్ష్యాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు తెలంగాణ సర్కార్‌కు సీబీఐ 5 లేఖలు రాసింది. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసే వరకు ఆ తీర్పు అమలును నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ దర్యాప్తు చేయాలంటూ ఇచ్చిన తీర్పును మూడువారాలపాటు నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి.. ద్విసభ్య ధర్మాసనం తీర్పు తర్వాత స్టే కోసం సింగిల్ జడ్జిని ఆశ్రయించవచ్చో లేదో చీఫ్ జస్టిస్ నుంచి స్పష్టత తీసుకుని చెప్పాలని ఏజీని ఆదేశించారు. సింగిల్ బెంచ్‌లో జరిగిన వాదనలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
మిగతా రాష్ట్రాల్లో మనం కొనుగోలు చేసినవి కూడా సీబీఐకి ఇవ్వరుగా!
హ్యాపీనే కానీ! మిగతా రాష్ట్రాల్లో మనం కొనుగోలు చేసినవి కూడా సీబీఐకి ఇవ్వరుగా! -
తెలంగాణ సర్కార్‌కు అక్కడా చేదు అనుభవం!
సాక్షి, ఢిల్లీ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం కోర్టులోనూ తెలంగాణ సర్కార్‌కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం. అయితే.. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టేటస్కో విధించేందుకు మాత్రం నిరాకరించింది. మెరిట్స్ ఉంటేనే హైకోర్టు తీర్పును రివర్స్ చేస్తామని ప్రభుత్వానికి స్పష్టం చేసింది ధర్మాసనం. అలాగే.. త్వరగతిన కేసు విచారించాలని ప్రభుత్వం తరపున న్యాయవాది కోరగా.. అందుకు అంతతొందరెందుకు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషన్‌పై ఈ నెల 17వ తేదీన విచారణ చేపడతామని తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించగా.. తెలంగాణ సర్కార్ అందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సీబీఐ దర్యాప్తుపై స్టే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసే వరకు ఆ తీర్పు అమలును నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ దర్యాప్తు చేయాలంటూ ఇచ్చిన తీర్పును మూడువారాలపాటు నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని రాజేంద్రనగర్ ఏసీపీ బి.గంగాధర్ మంగళవారం ఈ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, సీబీఐ దర్యాప్తు తీర్పును వారం రోజులైనా నిలిపివేయాలని కోరారు. సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు (పిటిషన్‌ను విచారణకు స్వీకరించే వరకు) స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సింగిల్ జడ్జి తీర్పుపై ద్విసభ్య ధర్మాసనం మెరిట్స్‌లోకి వెళ్లలేదు కాబట్టి తమ లంచ్‌మోషన్ పిటిషన్లో సింగిల్ జడ్జి జోక్యం చేసుకోవచ్చని జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ప్రశ్నకు ఏజీ సమాధానమిచ్చారు. సీబీఐ దర్యాప్తును నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వొచ్చని చెప్పారు. ప్రస్తుతం సిట్ విచారణ నిలిచిపోయిందని, ఈ పరిస్థితుల్లో సీబీఐ దర్యాప్తు చేసేందుకు అత్యుత్సాహం చూపడం సరికాదన్నారు. ఇప్పటికే సీబీఐ జేడీ ఫైళ్లు అప్పగించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారని, సీబీఐ అత్యుత్సాహాన్ని పరిగణనలోకి తీసుకుని స్టే ఇవ్వాలని కోరారు. ఈ కేసులో డివిజన్ బెంచ్ స్టే ఇచ్చిందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, సింగిల్ జడ్జి తీర్పు తర్వాత దర్యాప్తు కోసం సీబీఐ ప్రభుత్వంపై ఒత్తిడి చేయొద్దని ఉత్తర్వుల్లో స్పష్టంచేసిందని ఏజీ బదులిచ్చారు. ద్విసభ్య ధర్మాసనం అప్పీల్లోని మెరిట్స్ ఆధారంగా తుది ఉత్తర్వులు ఇవ్వలేదని, అప్పీల్‌కు విచారణార్హత లేదని తేల్చినందున సింగిల్ జడ్జి జోక్యం చేసుకోవచ్చన్నారు. నిందితుల తరఫు సీనియర్ న్యాయవాదులు రవిచందర్, ప్రభాకర్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పాక స్టే కోసం సింగిల్ జడ్జి వద్దకు ప్రభుత్వం రావడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు వెళ్లడం తప్ప మరోమార్గం లేదని, సింగిల్ జడ్జి స్టే ఇవ్వడానికి ఆస్కారం లేదని వాదించారు. సింగిల్ జడ్జి తీర్పుపై సీజే బెంచ్ వద్ద అప్పీల్ దాఖలు చేస్తే తీర్పు వచ్చిందని, ఇప్పుడు మళ్లీ అదే సింగిల్ జడ్జి వద్దకు స్టే కోసం ఎలా వస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు వెళ్లేవరకు ఆదేశాలను నిలుపుదల చేయడానికి ద్విసభ్య ధర్మాసనం నిరాకరించిందని గుర్తుచేశారు. సిట్ దర్యాప్తు చేయాలని భావించడమూ అత్యుత్సాహం కిందకే వస్తుందని చెప్పారు. వాదనలు విన్న తర్వాత జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి.. ద్విసభ్య ధర్మాసనం తీర్పు తర్వాత స్టే కోసం సింగిల్ జడ్జిని ఆశ్రయించవచ్చో లేదో చీఫ్ జస్టిస్ నుంచి స్పష్టత తీసుకుని చెప్పాలని ఏజీని ఆదేశించారు. బుధవారం సీజే బెంచ్ వద్ద స్పష్టత తీసుకుని చెబుతామని ఏజీ చెప్పడంతో విచారణను బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి చెప్పారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కార్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి తెలంగాణ హైకోర్టు అప్పగించగా.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలని న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. కేసును సీబీఐకు ఇస్తే సాక్ష్యాలు ధ్వంసం అవుతాయని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. రేపు(బుధవారం) మెన్షన్ చేయకపోయినా వచ్చే వారం విచారణకు వస్తుందన్నారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు సింగిల్ బెంచ్‌లో మంగళవారం విచారణ జరిగింది. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదైందా అని కోర్టు ప్రశ్నించగా..ఇంకా నమోదు కాలేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కేసు బదిలీకి మూడు సార్లు లేఖ రాసినా ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. సీబీఐ కేసు నమోదు చేయాలని, కేసు ఫైళ్లు అప్పగించాలని సీబీఐ ఒత్తిడి చేస్తోందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు పిటిషన్ విచారణకు చీఫ్ జస్టిస్ బెంచ్ నుంచి అనుమతి తీసుకొని రావాలని జస్టిస్ విజయసేన్‌రెడ్డి అడ్వకేట్ జనరల్‌కు సూచించారు. దీంతో రేపు ఉదయం సీజే బెంచ్‌లో మెన్షన్ చేస్తామని ఏజీ తెలిపారు. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఎన్నిరోజులు పడుతుందని సింగిల్ బెంచ్ ప్రశ్నించగా.. వారం పడుతుందని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. కాగా ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ సీబీఐ విచారణకు అప్పగించాలని ఇచ్చిన తీర్పుపై.. తెలంగాణ ప్రభుత్వం. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిన్న(సోమవారం) డివిజన్ బెంచ్ తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేసింది. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉన్నత న్యాయస్థానంలో తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురైంది. సీబీఐ విచారణకే మొగ్గు చూపిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సమయం కోరగా.. అందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ సర్కార్‌ను.. సింగిల్ బెంచ్ తీర్పు అమలు చేయాలనీ దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించింది హైకోర్టు డివిజన్ బెంచ్. మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం జరిగినట్లు అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేసి.. ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసింది. ఆపై సిట్ ద్వారా ఈ కేసు దర్యాప్తును కొనసాగించింది ప్రభుత్వం. అయితే.. కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా.. సీబీఐకి ఇవ్వొద్దంటూ తెలంగాణ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. అయినప్పటికీ సర్కార్ అభ్యర్థనను డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది దాంతో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ సర్కార్. -
TS: హైకోర్టు తీర్పుపై స్పందించిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో హైకోర్టులో తెలంగాణ సర్కార్‌కు మళ్లీ చుక్కెదురైంది. సీబీఐ విచారణకే మొగ్గు చూపిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సమయం కోరగా.. అందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. దీనిపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పందిస్తూ.. ఎమ్మెల్యేల ఎర కేసులో సీబీఐ విచారణకు సహకరిస్తామని, కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడం అన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను, ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారని గువ్వల ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన అన్నారు. చదవండి: దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. బీఆర్ఎస్కు పొంగులేటి సవాల్.. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సర్కార్‌కు మళ్లీ ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉన్నత న్యాయస్థానంలో తెలంగాణ సర్కార్‌కు మళ్లీ చుక్కెదురైంది. సీబీఐ విచారణకే మొగ్గు చూపిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సమయం కోరగా.. అందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. గతంలో సీబీఐ విచారణకు హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వగా.. దానిని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు సింగిల్ బెంచ్ తీర్పును సమర్థిస్తూ.. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ‘సర్కార్ అభ్యర్థన’ను కొట్టేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మళ్లీ చుక్కెదురైనట్లయ్యింది. ఆర్డర్ పై సుప్రీం కోర్టు వెళ్లేందుకు కొంత సమయం కావాలని.. అప్పటి వరకు ఆర్డర్ సస్పెండ్ లో ఉంచాలని కోరారు అడ్వకేట్ జనరల్. అయితే.. ఆర్డర్ సస్పెన్షన్ కు నిరాకరించింది హైకోర్టు. ఇక.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ సర్కార్‌ను.. సింగిల్ బెంచ్ తీర్పు అమలు చేయాలనీ దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించింది హైకోర్టు డివిజన్ బెంచ్. ఇదిలా ఉంటే.. మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం జరిగినట్లు అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేసి.. ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసింది. ఆపై సిట్ ద్వారా ఈ కేసు దర్యాప్తును కొనసాగించింది ప్రభుత్వం. అయితే.. కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా.. సీబీఐకి ఇవ్వొద్దంటూ తెలంగాణ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. అయినప్పటికీ సర్కార్ అభ్యర్థనను డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. -
ఎమ్మెల్యేల కేసు: హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో నేడు హైకోర్టు తీర్పును వెల్లడించనుంది. అయితే, ఈ కేసును సీబీఐకి ఇస్తుందా? లేక తీర్పును వెల్లడిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ ప్రభుత్వం రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. అయితే, ఇప్పటికే ఈ కేసును సీబీఐతో విచారించాలని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కేసు తీర్పుపై సస్పెన్స్ నెలకొంది. ఇక, సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. ఈ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు వినిపించనున్నారు. మరోవైపు.. ఈ కేసులో జనవరి 18న చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వ్ చేశారు. -
సీబీఐకి ఇవ్వాలా? వద్దా?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో అప్పీళ్లపై తీర్పును హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సోమవా రం వెల్లడించనుంది. జన వరి 4న అప్పీళ్లు దాఖలు కాగా, అదే నెల 18 వరకు వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. సిట్ దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సిట్ అప్పీల్ పిటిషన్లు దాఖలు చేసింది. బీజేపీతోపాటు నిందితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లో సీఎం కేసీఆర్ వాది, ప్రతివాదిగా లేనప్పుడు ఆయన గురించి తీర్పులో ప్రస్తావించడాన్ని అప్పీల్లో తప్పుపట్టాయి. ఎమ్మెల్యేల కొనుగోలు చేసి ప్రభుత్వా న్ని కూల్చాలని కుట్ర జరిగిందని, అందువల్ల నిందితులకు అనుకూలంగా వచ్చిన సింగిల్‌జడ్జి తీర్పు రద్దు చేయా లని కోరింది. అప్పీళ్లపై ప్రభు త్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, నిందితుల తరఫున సీనియర్ న్యాయవాదులు డీవీ సీతారాంమూర్తి, రవిచందర్ వాదనలు వినిపించారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: తీర్పు రిజర్వ్ చేసి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఇప్పటికే పలు మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో విషయంలో హైకోర్టు కూడా ట్విస్ట్ ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించాయి. వాదన సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది దవే.. లిఖితపూర్వక వాదనలకు అనుమతివ్వాలని కోర్టును కోరారు. దీంతో, ఈనెల 30వ తేదీ లోపు లిఖితపూర్వకంగా వాదనలు ఇవ్వాలని కోర్టు సూచించింది. ఇక, ఎమ్మెల్యేల కేసును సీబీఐకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి అంతకు ముందు కోర్టు సింగిల్ బెంచ్ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పును ఇచ్చింది. కాగా, సింగ్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్‌కు బెయిల్
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్‌కు బెయిల్ లభించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న నందకుమార్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది కోర్టు. హైదరాబాద్ విడిచి వెళ్లరాదంటూ కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే పదివేల పూచీకత్తుతో పాటు రెండు షూరిటీలు సమర్పించారు నందకుమార్. బెయిల్ లభించిన తర్వాత నందకుమార్ చంచల్‌గూడ జైల్ నుండి విడుదలయ్యారు. -
Poachgate: ఇంకెన్నాళ్లీ కేసు?
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజోపయోగ కేసులు వేరేవి కూడా ఉన్నాయి. ఇంకా ఎన్నాళ్లు ఈ కేసునే కొన సాగిస్తాం. సీనియర్ న్యాయవాదులు.. చెప్పిన వివరాలనే మళ్లీ మళ్లీ చెప్పడం సరికాదు. ఒకే తీర్పును పలువురు.. పలుమార్లు ధర్మాసనం దృష్టికి తేవడం ద్వారా సమయం వృథా తప్ప ప్రయోజనం ఉండదు. ‘ఈ కేసును సీబీఐకి ఇవ్వొ ద్దు.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టి వేయాలి..’ అని ప్రభుత్వం దాఖలు చేసిన ప్రధాన పిటిషన్లో మాత్రమే వాదనలు వినిపించాలి. ఇందుకు సంబంధించిన ఇతర పిటిషన్లపై ప్రస్తుతం వాదనలు వద్దు..’ అని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సోమ వారం.. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియ ర్ న్యాయవాది దుష్యంత్ దవే, ప్రతివాదుల తర ఫు సీనియర్ న్యాయవాదులు ఉదయ హోల్లా, సంజయ్ వర్చువల్‌గా వాదనలు వినిపించారు. పబ్లిక్ డొమైన్‌లోకి ఎలా వచ్చాయి.. ‘ఈ కేసులో పోలీసులే సాక్షులు. వాళ్లే విచారణ అధికారులు. వాళ్లే ఫిర్యాదుదారులు. భూసారపు శ్రీనివాస్.. 20 ఏళ్లుగా కరీంనగర్లో న్యాయ వాదిగా పనిచేస్తున్నారు. ఆయన ఇంటిపైకి 30 మంది పోలీసులు దండయాత్రలాగా వచ్చారు. 41ఏ నోటీసులను ఇంటికి అతికించారు. ఈ తతంగం అంతా మీడియాలో విస్తృతంగా ప్రసా రం అయింది. అసలు ఈ కేసులో శ్రీనివాస్ నిందితుడు కాదు.. సాక్షి కాదు. ఎఫ్ఐఆర్లో అతని పేరు కూడా లేదు. కానీ సిట్ విచారణకు హాజర య్యారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, ఆ పార్టీ ఇతర ముఖ్య నేతల పేర్లు చెప్పాలని తీవ్ర వేధింపులకు గురిచేశారు. చెప్పినట్లు వినకుంటే నిందితుల జాబితాలో పేరు చేరుస్తామని బెదిరించారు. దర్యాప్తు అంతా రాజకీయ కక్షపూరితంగా సాగుతోంది. ‘ఎర’కు సంబంధించి పబ్లిక్ డొమైన్లో ఉన్న వివరాలనే సీఎం చెప్పారని ప్రభుత్వ న్యాయవాది పేర్కొంటున్నారు. పోలీ సులు రికార్డు చేసిన సీడీల్లో ఉన్న వివరాలు పబ్లిక్ డొమైన్‌లోకి ఎలా వచ్చాయి? ఎవరి వల్ల వచ్చాయి? అన్నది పోలీసులు స్పష్టం చేయాల్సి ఉంది. అత్యంత ప్రముఖులు ఈ కేసులో అంతర్భాగమై ఉన్నారు. కనుక సీబీఐకి అప్పగించడమే సరైన నిర్ణయం..’ అని ప్రతివాదుల (నిందితులు) తరఫు న్యాయవాదులు అన్నారు. సీబీఐకి బదిలీ చేసే అధికారం లేదు.. ‘హైకోర్టులకు సంబంధించిన చట్ట ప్రకారం ఈ కేసులో అప్పీల్‌ను ద్వి సభ్య ధర్మాసనం ముందు వేయవచ్చు. సింగిల్ జడ్జి వద్ద నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలిస్తే ఇది సివిల్ నేచర్ ఉన్న కేసే అన్నది తెలుస్తుంది. ఆర్టికల్ 227 ప్రకారం.. ట్రిబ్యునళ్లు, హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ద్విసభ్య ధర్మాసనం వాద నలు వినవచ్చు. హైకోర్టుకు ఆ అధికారం ఉంది. క్రిమినల్ విచారణ సాగినందున అప్పీల్‌పై విచా రణ జరిపే అధికారం ద్వి సభ్య ధర్మాసనా నికి లేదనడం సరికాదు. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి సీడీలు, వివరాలను మీడియాకు ఇవ్వ డం అనేది బాధిత ఎమ్మెల్యేల పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు ఉన్న హక్కు. దాన్ని సిట్ దర్యాప్తునకు లింక్ పెట్టి చూడటం తోసిపుచ్చాల్సిన విషయం. ఈ కేసులో ఎఫ్ఐఆర్ను గానీ, ట్రాప్‌నుగానీ నిందితులు సహా ఎవరూ ప్రశ్నించలేదు. అందువల్ల సీబీఐకి కేసు బదిలీ చేసే అధికారం హైకోర్టుకు లేదు..’ అని దవే వాదించారు. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. మొయినాబాద్ కేసు వివరాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. సిట్ తమకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. డాక్యుమెంట్లు ఇస్తే విచారణ ప్రారంభిస్తామని హైకోర్టుకు తెలిపింది. అయితే హైకోర్టులో కేసు విచారణ పూర్తయ్యే దాకా ఆగాలని ధర్మాసనం సీబీఐకి సూచించింది. ఆ తర్వాత సీబీఐ వాదన కూడా వింటామని పేర్కొంది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ రిట్ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. అదేవిధంగా నిందితుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2014 నుంచి 2018 వరకు బీఆర్ఎస్లో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేల జాబితాను కోర్టుకు సమర్పించారు. 2014 నుంచి 2018 వరకు 37 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేసి తమ పార్టీలోకి చేర్చుకుందని ఆరోపించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణనకు జనవరి 9వ తేదీ (సోమవారం)కి వాయిదా వేసింది. చదవండి: మంత్రి పదవి వదులుకుంటా.. కిషన్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ -
ఎమ్మెల్యేల కేసు: గురువారానికి విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ ముగిసింది. ప్రభుత్వం వేసిన అప్పీల్ పిటీషన్‌కు విచారణ అర్హత లేదని ప్రతివాదుల లాయర్ అన్నారు. సుప్రీంకోర్టు మాత్రమే విచారించగలదని పేర్కొన్నారు. ఇతదుపరి విచారణను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.. కాగా, ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూశారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారు. అలాంటి సమయంలో పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌కు బాధ్యత ఉంటుంది. కేసీఆర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడంతో తప్పులేదు. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అది పబ్లిక్ డొమైన్‌లోకి వస్తుంది. ప్రజాక్షేత్రంలోకి ఎవిడెన్స్ వచ్చిన తరువాతే సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్ ఆధారంగా ఈ కేసును సీబీఐకి ఇవ్వడం సరికాదు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే సీఎం స్పందించకూడదా?. సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రధాని, హెచ్ఎం పేర్లు ప్రస్తావించినందుకే కేసును సీబీఐకి అప్పగిస్తారా?. సిట్‌ను క్వాష్ చేస్తే అసలు కేసు ఎక్కడిది అంటూ బలంగా తమ వాదనలు కోర్టుకు వినిపించారు. -
సీబీఐకి బదిలీ చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీలు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని నిందితులు కుట్రపన్నారని అందులో వివరించింది. సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసే నాటికే కేసుకు సంబంధించిన పలు వివరాలు బహిర్గతం అయ్యాయని, ఆయన కొత్తగా వివరించింది ఏమీ లేదని పేర్కొంది. సీఎం వివరాలు వెల్లడించే సమయానికి సిట్ ఏర్పాటుకాలేదని, కేసు మెటీరియల్ చేరవేసే అవకాశమే లేదని, సింగిల్ జడ్జి ఈ విషయంలో పొరపడ్డారని తెలిపింది. ఒక రాజకీయ నేతగా తన ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర జరిగిందని తెలిసినప్పుడు మీడియాకు వివరాలు వెల్లడించడం తప్పు ఎలా అవుతుందని సింగిల్ జడ్జి ఒప్పుకున్నారని వివరించింది. అందువల్ల సిట్ దర్యాప్తును కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దీనిపై గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది. కీలక అంశాలను పరిశీలించలేదు.. ప్రభుత్వం తన అప్పీలులో మరిన్ని అంశాలను వివరించింది. ‘‘హైకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేసే నాటికి సీఎం ప్రెస్‌మీట్ నిర్వహించలేదు. సిట్ ఏర్పాటు కాలేదు. మొయినాబాద్ పోలీసులు కేసునమోదు చేసిన కొన్ని గంటల్లోనే దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదంటూ బీజేపీ పిటిషన్ దాఖలు చేయడం ఆమోద యోగ్యం కాదు. నిజానికి ఈ కేసులో నిందితులపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడాన్ని సింగిల్ జడ్జి ప్రశంసించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా పోలీసుల చర్య స్వాగతించదగినదని వ్యాఖ్యానించారు. అయితే గతంలో పీవీ నరసింహారావు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర జరిగిందనడానికి, ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఎర వేసేందుకు ప్రయత్నించారనడానికి అన్ని వీడియో, ఆడియో ఆధారాలు ఉన్నాయి. రిట్ పిటిషన్ పరిధిలో లేని అంశంలోకి సింగిల్ జడ్జి వెళ్లారు. సిట్ దర్యాప్తును అడ్డుకోవడానికి బలమైన కారణాలేమీ లేకపోయినా.. నిందితుల హక్కుల పరిరక్షణ కోసమంటూ సిట్‌ను రద్దు చేసి, కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయడం సరికాదు’’ అని పేర్కొంది. అడుగడుగునా అడ్డుకునే యత్నం.. తొలుత సిట్ దర్యాప్తుపై సింగిల్ జడ్జి స్టే విధించగా.. ద్విసభ్య ధర్మాసనం దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించిందని, సుప్రీంకోర్టుకు కూడా సిట్ దర్యాప్తును అడ్డుకోలేదని ప్రభుత్వం అప్పీలులో వివరించింది. దర్యాప్తును హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షించాలన్న ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టు రద్దు చేసిందని.. సిట్ స్వతంత్రంగా దర్యాప్తు చేయవచ్చని సూచించిందని గుర్తు చేసింది. ఇలా సిట్ దర్యాప్తును అడుగడుగునా అడ్డుకునేందుకు నిందితులు ప్రయత్నించిన విషయాన్ని సింగిల్ జడ్జి గమనంలోకి తీసుకోలేదని పేర్కొంది. అంతేగాకుండా తమపై నమోదైన కేసును ఏ సంస్థ దర్యాప్తు చేయాలో నిందితులే కోరుకోవడం చట్ట విరుద్ధమని.. ఈ విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను సింగిల్ జడ్జి పరిశీలించలేని వివరించింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్లో సీఎంను ప్రతివాదిగా చేయలేదన్న అంశాన్ని సింగిల్ జడ్జి విస్మరించారని.. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా ఇలాంటి ఉత్తర్వులివ్వడం ద్వారా సాక్షులు ప్రభావితం అవుతారని, పోలీసుల నిబద్ధతను తప్పుబట్టినట్టు అవుతుందని పేర్కొంది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని.. సిట్ దర్యాప్తు కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. -
‘ఎమ్మెల్యేల కొనుగోలు’ కేసులో కీలక పరిణామం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వ అప్పీలుపై హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు (ఎఫ్ఐఆర్ నంబర్ 455/2022) సీబీఐకి బదిలీ చేయడాన్ని ఆపాలని తెలంగాణ సర్కార్ పిటిషన్లో కోరింది. జీవో 63 రద్దుపై హైకోర్టులో అప్పీల్ చేసింది. సిట్ దర్యాప్తు కొనసాగించాలని డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం.. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేయాలని కోరింది. అయితే ఎమ్మెల్యేల కేసును విచారిస్తున్న సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ సీబీఐకి బదిలీ చేయాలని ఇటీవల సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 63 రద్దు చేసింది. కేసు (ఎఫ్ఐఆర్ నంబర్ 455/2022) పూర్తి వివరాలను, స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌ను సీబీఐకి అందజేయాలని సిట్, దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసింది. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారీ ట్విస్ట్ -
బెయిల్‌పై రామచంద్రభారతి విడుదల
చంచల్‌గూడ (హైదరాబాద్): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు రామచంద్రభారతి శుక్రవారం చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న అతను కొద్దిరోజుల కిందట బెయిలుపై విడుదల కాగానే నకిలీ పాస్‌పోర్టు కేసులో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. దీంతో అతను తిరిగి ఈ నెల 22వ తేదీన జైలుకు వచ్చాడు. ఎట్టకేలకు మరలా అతనికి బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. -
దర్యాప్తు సమాచారం సీఎంకు చేరడం ఏంటి?: హైకోర్టు అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో రాష్ట్ర ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు, ఆధారాలు బయటికి రావడం, ముఖ్యమంత్రే నేరుగా ప్రెస్‌మీట్ పెట్టి నిందితులే కుట్రదారులని చెప్పడం సరికాదని న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి తన తీర్పులో స్పష్టం చేశారు. ఇలాంటివి కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని.. అందువల్ల నిందితుల విజ్ఞప్తి మేరకు కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన 26 కేసుల తీర్పులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఈ మేరకు బుధవారం విడుదలైన తీర్పు ప్రతిలో కీలక కామెంట్లు చేశారు. హైకోర్టు తీర్పు కాపీలోని ప్రధాన అంశాలివీ.. ఈ తీరుతో కేసు దర్యాప్తుపై ప్రభావం ‘‘ముఖ్యమంత్రే నేరుగా మీడియా సమావేశం నిర్వహించి.. ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులతోపాటు పలువురిని కుట్రదారులని ముద్రవేశారు. వారే వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్టు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు ఒక్కోసారి కేసు దర్యాప్తును తీవ్రంగా ప్రభావితం చేయడంతోపాటు మలుపు తిప్పే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులను కాదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించినా ప్రయోజనం ఉండకపోవచ్చు. అంతేగాకుండా నిందితులు ఈ కేసు విచారణను మరో ఏజెన్సీకి బదిలీ చేయాలని మాత్రమే కోరారు. కేసును కొట్టివేయాలని ఏమీ విజ్ఞప్తి చేయలేదు. ఇక జీవో నంబర్ 268 ప్రకారం.. ఇలాంటి కేసులో ఏసీబీ విభాగంలోని పోలీసు అధికారే దర్యాప్తు చేయాలి తప్ప సాధారణ పోలీసులు కాదు. సాధారణ పోలీసులు కేసు నమోదు చేసినా ఏసీబీ విభాగానికి బదిలీ చేయాల్సి ఉంది. ఈ కేసులో అలా జరగలేదు. అసలు సీఎంకు మెటీరియల్ ఎలా వెళ్లింది? ముఖ్యమంత్రికి రాజేంద్రనగర్ ఏసీపీయే వీడియోలు, పెన్‌డ్రైవ్‌లు ఇచ్చారని పిటిషనర్లు (వారి న్యాయవాదులు) ఆరోపించారు. మరి ఏసీపీ ఇవ్వలేదని సిట్‌గానీ, పోలీసులుగానీ ఖండించలేదు. కౌంటర్లో ఎక్కడా పేర్కొనలేదు. కేసు మెటీరియల్‌ను ఇతరులకు ఇవ్వడం తీవ్ర ఆక్షేపణీయం. అసలు సీఎంకు మెటీరియల్ ఎలా వెళ్లిందనే విషయంలో పోలీసులు, సిట్ అధికారులు మౌనం వహించారు. ప్రెస్‌మీట్ పెట్టడం, మీడియాకు వీడియోలు ఇవ్వడం, తెలంగాణ సీజేతోపాటు ఇతర రాష్ట్రాల సీజేలకు ముఖ్యమంత్రి మెటీరియల్ పంపడంపై ప్రభుత్వ (సిట్) తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే కూడా హైకోర్టుకు క్షమాపణ చెప్పారు. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుని రిట్ పిటిషన్లను అనుమతిస్తున్నాం. సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 63ను కొట్టివేస్తున్నాం. ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసు నంబర్ 455/2022ను సీబీఐకి బదిలీ చేస్తున్నాం. నిందితులు వేసిన పిటిషన్లను అనుమతిస్తున్నాం. ఇదే సమయంలో బీజేపీ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’’ అని తీర్పు ప్రతిలో న్యాయమూర్తి పేర్కొన్నారు. తీర్పు పూర్తి కాపీలో.. ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సిట్ విచారణపై నమ్మకం లేదని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారమే (ఈ నెల 26న) తీర్పు వెలువరించారు. ‘ఎర’ కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని.. సిట్ వెంటనే దర్యాప్తు ఆపేసి, పూర్తి వివరాలు, మెటీరియల్‌ను సీబీఐకి అప్పగించాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన పూర్తి కాపీని కోర్టు బుధవారం విడుదల చేసింది. నేడు రాష్ట్ర సర్కారు అప్పీల్! ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసును సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు సిద్ధమైంది. గురువారమే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించేందుకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. ఈ కేసులో తీర్పు ప్రతి విడుదలయ్యే వరకు అమలును ఆపాలంటూ ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ 26న విజ్ఞప్తి చేయడం, దానికి న్యాయమూర్తి అంగీకరించడం తెలిసిందే. తీర్పు ప్రతి అధికారికంగా విడుదలకావడంతో సీబీఐ ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దర్యాప్తును తమ పరిధిలోకి తీసుకునే అవకాశం ఉంది. అందువల్ల వీలైనంత త్వరగా అప్పీల్‌కు వెళ్లాలని సర్కారు నిర్ణయించినట్టు తెలిసింది. జీవో 63 ద్వారా ఏర్పాటు చేసిన సిట్ రద్దు చేస్తూ.. ఎఫ్ ఐ ఆర్ 455/2022ను సీబీఐకి బదిలీ చేయడంతో పాటు సిట్ చేసిన దర్యాప్తును సైతం రద్దు చేస్తున్నట్లు ఆ ఆర్డర్ కాపీలో న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో 26 కేసుల జడ్జిమెంట్లను అందులో ప్రస్తావించారు. -
ఆడియో, వీడియోలు అబద్ధమా?: బీజేపీ నేతలపై తలసాని ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి తలసాని బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫామ్‌హౌస్ కేసుతో సంబంధంలేదని ఇప్పుడు ఎందుకు సంబురపడిపోతున్నారు?. మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడిన తీరు అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆడియో, వీడియోలు అబద్ధమా?. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అమావాస్య, పౌర్ణమి ఒకసారి హైదరాబాద్‌కు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధిపైన ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. కేంద్రం నుండి హైదరాబాద్‌కు ఏం తెచ్చారో చెప్పాలి. హైదరాబాద్ విషయం పక్కన పెట్టు.. ఆయన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో చేసిన అభివృద్ధి పని ఏంటో చెప్పాలి?. ఏది పడితే అది మాట్లాడొద్దు. నా జీవితంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎక్కడా చూడలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతోంది. కేంద్రం కొంత సహాయం చేస్తోంది అని చెప్పాలి. కానీ, ఎంతసేపు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఫామ్‌హౌస్ కేసులో ముందుగా కోర్టుకు వెళ్లింది మేరే కదా. మీ తప్పు లేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లారు. కేసు సిట్ నుండి సీబీఐకి మాత్రమే కోర్టు బదిలీ చేసింది. అంతేగానీ.. క్లీన్ చీట్ ఏమీ ఇవ్వలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కేసీఆర్ ఫాంహౌస్ సినిమా అట్టర్‌ఫ్లాప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడం కోసం బీజేపీపై బురద జల్లేందుకు కల్వకుంట్ల కుటుంబం కుటిల యత్నాలు చేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. మునుగోడు ఉపఎన్నికకు ముందు కథ, స్క్రీన్–ప్లే, దర్శకత్వం, నిర్మాతగా అన్నీ తానై సీఎం కేసీఆర్ తీసిన ‘ఫాంహౌస్ ఫైల్స్’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ పసలేని విమర్శలు చేస్తోందని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తమ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ డబ్బు ఎర వేస్తూ పోలీసులకు పట్టుబడిందంటూ సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి వీడియోలు ప్రదర్శించారని... కేసు ప్రాథమిక దర్యాప్తు దశలో ఉండగానే ఆ వివరాలు సీఎంకు ఎలా చేరాయని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఫోన్లు రికవరీ చేయలేదేం? రాష్ట్ర ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత ఏర్పడేలా కేసీఆర్ ‘సిట్’ ఏర్పాటు చేశారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను, వాటిలోని డేటాను కేసీఆర్ ఎందుకు బయటపెట్టట్లేదని ప్రశ్నించారు. ‘ఈ కేసు విచారణ సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు ఆయా ఎమ్మెల్యేలకు, కేసీఆర్ కొత్త సినిమా దర్శకత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. తాను భద్రాచలం, రామప్ప అభివృద్ధికి నిధులు తెచ్చానని కిషన్‌రెడ్డి చెప్పారు. ‘తెలంగాణకు త్వరలోనే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వస్తుంది. ప్రస్తుతం ట్రాక్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు నడపాలని నిర్ణయించాం’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. -
దొంగల ముసుగులు తొలిగి పోయాయి
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులైన స్వామీజీలతో సంబంధం లేదని చెప్పిన వారు కేసును సీబీఐకి అప్పగించడంతో ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారు? గతంలో సీబీఐ విచారణకు నిందితులు భయపడే పరిస్థితి నుంచి బీజేపీ హయాంలో సంబురాలు చేసుకునే స్థితికి చేరారు. – కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే లకు ఎర కేసును సీబీఐకి బదిలీ చేయాలనే హైకోర్టు తీర్పుతో బీజేపీ ముసుగు తొలగిందని, దొంగలు తమ రంగులు బయటపెట్టుకుంటున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైకోర్టు తీర్పును ‘బీజేపీ విజయం’ అంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ సంబు రాలు చేసుకోవడంపై మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులైన స్వామీజీలతో సంబంధం లేదని చెప్పిన వారు సీబీఐకి అప్పగించడంతో ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారని మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. నిందితులను భుజాలపై మోస్తూ కేసు దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం చేసిన బీజేపీ.. తమ జేబు సంస్థకు కేసు చిక్కడంతో పట్టలేనంత సంతోషంతో ఉందన్నారు. గతంలో సీబీఐ విచారణకు నిందితులు భయపడే పరిస్థితి నుంచి బీజేపీ హయాంలో సంబురాలు చేసుకునే స్థితికి చేరిందని చెప్పారు. కెమెరాల సాక్షిగా దొరికిన దొంగలు తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయ త్నిస్తూ కెమెరాల సాక్షిగా అడ్డంగా దొరికిన దొంగలుగా బీజేపీని కేటీఆర్ అభివర్ణించారు. గతంలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని పేరొందిన సీబీఐని ప్రస్తుతం సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్‌గా ప్రజలు భావిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ దర్యాప్తుతోపాటు ఈ కేసులో దొరికిన దొంగలపై నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ పరీక్షలకు బీజేపీ నేతలు సిద్ధమా అని సవాలు చేశారు. నిందితులకు లై డిటెక్టర్ పరీక్షలు చేస్తే బీజేపీ నేతలతో ఉన్న సంబంధం తేటతెల్లం అవుతుందన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను అంగడి సరుకులా కొనుగోలు చేసి విపక్ష పార్టీల ప్రభుత్వాలను బీజేపీ కూల్చి వేస్తోందన్నారు. ఆపరేషన్ లోటస్ బెడిసి కొట్టడంతో బీజేపీ నేతలు దొంగల్లా అడ్డంగా దొరికిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. -
ఎరలు.. దాడులు.. ‘విచారణ’ల రాజకీయం!
రాష్ట్రంలో పోటాపోటీ దాడులు, తనిఖీలు.. వ్యూహాలు, ప్రతివ్యూహాలు.. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల జోరుతో ఈ ఏడాది హాట్‌హాట్‌గా మారింది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు లక్ష్యంగా కేసులు, విచార ణలు, నోటీసులు కలకలం రేపాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరుకునపెట్టేలా ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసు తెరపైకి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక వ్యక్తులు టార్గెట్‌గా లిక్కర్ స్కాం, ఐటీ, ఈడీ దాడులు రాజకీయ వేడిని రగిలించాయి. మొత్తంగా రాష్ట్రంలో శాంతిభద్రతలపరంగా పెద్ద సమస్యలేవీ ఎదురుకాలేదు. తెలంగాణ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో దేశంలో పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) ఉగ్ర లింకులు బయటికి రావడం గమనార్హం. 2022లో రాష్ట్రంలో పోలీసు, దర్యాప్తు విభాగాల పరిధిలో జరిగిన ప్రధాన ఘటనలు, అంశాలను ఓసారి గుర్తు చేసుకుందాం.. – సాక్షి, హైదరాబాద్ మంటలు రేపుతున్న లిక్కర్ స్కాం ఢిల్లీ లిక్కర్ స్కాం మూలాలు తెలంగాణలో బయటపడటం ఈ ఏడాది సంచలన కేసులలో ఒకటిగా నిలిచింది. ఈ కేసులో కీలక నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారు. డిసెంబర్ తొలివారంలో కవితకు సీబీఐ అధికారులు నోటీసులివ్వడం, తర్వాత హైదరాబాద్‌లోని ఆమె ఇంటికి వచ్చి విచారించడం చర్చనీయాంశంగా మారింది. కవితకు దగ్గరి వ్యక్తిగా ప్రచారమున్న అభిషేక్‌రావును సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ఇంకా ఏం జరుగుతుందో అన్నది ఉత్కంఠ రేపుతోంది. ‘ఎమ్మెల్యేలకు ఎర’తో గరంగరం నలుగురు బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డిలను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ శివార్లలో మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫాంహౌస్‌లో బేరసారాలు జరుగుతున్న సమాచారంతో సైబరాబాద్ పోలీసులు దాడి చేశారు. బీజేపీ తరఫున డీల్ చేసేందుకు వచ్చినట్టుగా చెప్తున్న ఢిల్లీ ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతి అలియాస్ సతీశ్‌శర్మ, తిరుపతికి చెందిన సింహయాజీ, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందుకుమార్‌లను అరెస్టు చేశారు. ఈ కేసుతో బీజేపీకి సంబంధం లేదంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్టలో తడిబట్టలతో ప్రమాణం చేయడం, బీఆర్ఎస్ నేతల ప్రతి సవాళ్లు, ఆరోపణలు, కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ నేతలు కోర్టుల్లో పిటిషన్లు వేయడం జరిగాయి. ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయగా.. అధికారులు కేరళ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసు నిందితులతో సంబంధాలున్న జగ్గు స్వామి, తుషార్, మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. వరుస విచారణలు, మలుపులతో ఈ కేసు ఇప్పటికీ ఉత్కంఠ రేపుతోంది. చీమ చిటుక్కుమన్నా గుర్తించేలా.. సీసీసీ తెలంగాణ పోలీసుల రోజువారీ ఆపరేషన్స్‌లో సాంకేతికంగా కీలకంగా మారనున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఈ ఏడాది ఆగస్టు 5న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. డిసెంబర్ 3న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ‘తెలంగాణ పోలీస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ’ని మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్ ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటైన ఈ సైబర్ సేఫ్టీ విభాగంతో రాష్ట్ర పోలీసులు సైబర్ నేర పరిశోధనలో కీలక అడుగు వేసినట్టయింది. పెరిగిన ‘మత్తు’.. కట్టడికి పోలీసుల పైఎత్తు.. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం పెరిగిన విషయం ఈ ఏడాది పలు ఘటనల్లో బయటపడింది. ఏప్రిల్ 2న రాడిసన్ బ్లూ హోటల్లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేసిన దాడిలో పలువురు ప్రముఖుల పిల్లలున్నట్టు గుర్తించడం సంచలనం సృష్టించింది. పెరిగిన డ్రగ్స్, గంజాయి వంటివాటి వినియోగానికి అడ్డుకట్ట వేసి యువతను కాపాడాలన్న లక్ష్యంలో తొలిసారిగా సీఎం కేసీఆర్ పోలీసు, ఎౖMð్సజ్‌శాఖ ఉన్నతాధికారులతో జనవరి 27న సమావేశం నిర్వహించారు. మత్తు పదార్థాల కట్టడికి నార్కోటిక్స్ వింగ్‌ల ఏర్పాటుతోపాటు ఇటీవల ఆ విభాగాల బలోపేతానికి సిబ్బందిని కేటాయించారు. మరోవైపు రాష్ట్రంలో పోలీసు శాఖ బలోపేతం కోసం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేశారు. నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఐటీ సోదాలు.. ఈడీ దాడులు గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో పలువురు రాజకీయ నాయకులపై ఈ ఏడాది ఈడీ, ఐటీ దాడులు జరిగాయి. గ్రానైట్ తవ్వకాల్లో ఫెమా నిబంధనల ఉల్లంఘనపై నమోదైన కేసులో ఈడీ అధికారులు నవంబర్ 9న కరీంనగర్‌లోని మంత్రి గంగుల కమలాకర్, ఆయన బంధువుల నివాసాలు, పలు గ్రానైట్ కంపెనీల ఆఫీసులలో సోదాలు చేయడం సంచలనం సృష్టించింది. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో ఈడీ సోదాలు, తనిఖీల దూకుడు పెరగడంపై రాజకీయ వర్గాల్లో తీవ్రచర్చ జరిగింది. నవంబర్ 22, 23 తేదీల్లో మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను (ఐటీ) అధికారుల సోదాలు, ఆ సమయంలో జరిగిన పరిణామాలు రాజకీయ వేడిని పెంచాయి. 65 ఐటీ బృందాల సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం ఓవైపు.. సోదాల సందర్భంగా ఐటీ అధికారులు అనుచితంగా ప్రవర్తించారంటూ మంత్రి మల్లారెడ్డి ఆరోపణలు, పోలీస్ స్టేషన్లలో పరస్పర కేసులు మరోవైపు హాట్‌హాట్‌గా కొనసాగాయి. అగ్నికి ప్రాణాలు ఆహుతి.. ఈ ఏడాది సెప్టెంబర్ 12న సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్లో అగ్నిప్రమాదం జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 16న మంచిర్యాల జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. లొంగుబాటలో మావోయిస్టులు మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణలో ఈ ఏడాది సైతం పోలీసులు తమ పట్టు నిలుపుకొన్నారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న భార్య, దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యురాలు మాధవి హడ్మే అలియాస్ సావిత్రి సెప్టెంబర్ 21న డీజీపీ మహేందర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఆలూరి ఉషారాణి అలియాస్ విజయక్కతోపాటు మరికొందరు కూడా లొంగిపోనున్నారు. కలకలం రేపిన పీఎఫ్ఐ లింకులు ఈ ఏడాదిలో చెప్పుకోదగ్గ మరోకేసు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి సంబంధించినది. మత ఘర్షణలను ప్రేరేపించేలా ఓ వర్గం యువతకు శిక్షణ ఇస్తున్నట్టు ఈ ఏడాది జూలైలో గుర్తించిన నిజామాబాద్ పోలీసులు.. పీఎఫ్ఐకి చెందిన కీలక వ్యక్తులు ఖదీర్, షాదుల్లా సహా మరికొందరిని అరెస్టు చేశారు. ఈ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ఆగస్టు 26న మరోకేసు నమోదు చేసింది. తర్వాత ఎన్ఐఏ దేశవ్యాప్తంగా వరుస సోదాలు, అరెస్టులు చేపట్టడం కలకలం సృష్టించింది. -
కావాలనే ఈడీ కేసు.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేస్తూ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పది రోజుల క్రితం ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ (పీఎంఎల్ఏ) చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసిందన్నారు. ఇప్పటికే ఈడీ విచారణకు రెండుసార్లు హాజరయ్యానని చెప్పారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో తాను ఫిర్యాదుదారుడినని, అందుకే ఈడీ కావాలనే కేసు నమోదు చేసిందన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో మనీల్యాండరింగ్ జరగలేదని, అయినా ఆ కేసును నీరుగార్చే క్రమంలోనే ఈడీ మనీ ల్యాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిందన్నారు. గుట్కా వ్యాపారి అభిషేక్, ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందుకుమార్‌ను కూడా ఈడీ ప్రశ్నించిందని వెల్లడించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులను సిట్ విచారణ జరుపుతున్న క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగిందన్నారు. మనీ ల్యాండరింగ్ జరిగింది అనేందుకు ఎలాంటి ఆధారాలు లేకున్నా... తమ వద్ద ఉన్నాయని ఈడీ చెబుతోందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్న బీజేపీ–బీఆర్ఎస్ల మధ్య తీవ్ర రాజకీయ వైరం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేల ఎర కేసు నుంచి బయటపడేందుకే ఈడీతో తప్పుడు కేసును తనపై బనాయించారని ఆరోపించారు. ఈడీ పరిధి దాటి కేసు నమోదు చేసిందన్నారు. వెంటనే ఈడీ కేసు దర్యాప్తును నిలిపివేయాలని, దర్యాప్తుపై స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. ఇందులో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఈడీ జాయింట్ డైరెక్టర్, ఈడీ డిప్యూటీ డైరెక్టర్(హైదరాబాద్), ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్(హైదరాబాద్)ను ప్రతివాదులుగా చేర్చారు. కాగా, ఈ పిటిషన్ న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టనున్నారు. -
తెలంగాణకు బీఎల్ సంతోష్
బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ రాష్ట్రానికి వస్తున్నారు. మొయినాబాద్ ఫార్మ్ హౌస్ ఎపిసోడ్ తర్వాత మొదటిసారి ఆయన హైదరాబాద్‌లో అడుగుపెడుతున్నారు. ఓ పక్క పోలీస్ కేసులు, మరో పక్క కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం బిఎల్ సంతోష్‌కు నోటీసులు, నిందితుడిగా చేర్చే అంశం హైకోర్టులో విచారణ జరుగుతుంది. కోర్టు ఏం చెప్పింది? మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం పై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలకు ఎర వేశారని వచ్చిన అభియోగాల కేసులో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ సెంటర్ గా సిట్ విచారణ సాగుతుంది. ఆయనను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని... 41 సి ఆర్ పి సి నోటీసులు పై స్టే ను ఎత్తివేయాలని సిట్ కోర్టుని అడుగుతోంది. ఆ కేసు ఈ నెల 30 కి వాయిదా పడ్డది. మరో వైపు ఆయనను అరెస్ట్ చేయొద్దని కూడా ఉత్తర్వులు ఇచ్చింది. కేసుపై చర్చ, రాజకీయ రచ్చ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ మొదలైనప్పటి నుండి బిఎల్ సంతోష్ రాష్ట్ర పర్యటనకు రాలేదు. గత నెలలో జరిగిన బీజేపీ రాష్ట్ర శిక్షణ తరగతులు, కార్యవర్గ సమావేశాలకి ఆయన వస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగిన గుజరాత్ ఎన్నికలతో బిజీగా ఉండడం తో రాలేదు. కేసు కొనసాగుతున్న నేపథ్యంలోని ఆయన రాష్ట్రానికి రాలేదని గుసగుసలు కూడా వినిపించాయి. ఇప్పుడు బిఎల్ సంతోష్ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. ఈనెల 28 29 తేదీల్లో హైదరాబాదులో జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్ ల శిక్షణ తరగతులు హైదరాబాద్ శివారులోని ఒక రిసార్ట్‌లో జరగనున్నాయి. ఇవి ఈ నెల 28 న ప్రారంభం అయ్యి 29న ఉదయం తో ముగుస్తాయి. 29 మధ్యాహ్నం తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఇన్చార్జులు, కన్వీనర్లు, విస్తారక్ లు పాలక్ ల సమావేశం అక్కడే జరగనుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొని అయన మార్గ నిర్దేశనం చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో ను అయన భేటీ కానున్నారు. యాక్షన్ వర్సెస్ రియాక్షన్ బి ఎల్ సంతోష్ రాష్ట్రానికి వస్తుండడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అయన పైన వచ్చిన ఆరోపణలు, జరుగుతున్న పరిణామాల పై పార్టీ నేతలకు ఏమైనా చెబుతారా ? అనే డిస్కషన్ జరుగుతుంది. బిఎల్ సంతోష్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికార పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది ? పోలీస్ లు ఎలా రియాక్టు అవుతారు అనే దాని పై ఉత్కంఠ నెలకొంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పైలెట్ రోహిత్‌రెడ్డి వ్యవహారం.. ఈడీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తాండూరు(వికారాబాద్ జిల్లా) ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిపై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గరం గరంగా ఉంది. విచారణకు గైర్హాజరు అవుతుండడంతో ఆయనపై చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. ఈడీ దర్యాప్తు సైతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే నోటీసులు అందుకుని విచారణకు సహకరిస్తా అంటూనే పైలెట్ రోహిత్‌రెడ్డి గైర్హాజరు అవుతూ వస్తున్నారు. ఇవాళ సైతం ఆయన గైర్హాజరు కావడంతో ఈడీ సీరియస్‌గా ఉంది. ఇప్పటికే రెండు రోజులు రోహిత్ రెడ్డి ని విచారించిన ఈడీ, నందకుమార్ నుంచి సేకరించిన సమాచారంతో.. మరోమారు రోహిత్ రెడ్డి నీ విచారించేందుకు సిద్దమైంది. కానీ, ఆయన రాలేదు. ఈడీ విచారణ హాజరుపై రోహిత్ రెడ్డి మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఈడీ భావిస్తోంది. మరోవైపు.. ఆయన హైకోర్టుకు వెళ్లడంపైనా ఈడీ రగిలిపోతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణను బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనను ఈడీ ఇబ్బంది పెడుతోందని పిటిషన్లో ఆరోపించారు. ఈడీ ఈసీఐఆర్ కింద కేసు నమోదు చేసిందని, ఈ కేసును కొట్టేయాలని అభ్యర్థించారు. మనీలాండరింగ్ కింద నోటీసులిచ్చి తనను వేధిస్తున్నారని రోహిత్‌రెడ్డి అందులో పేర్కొన్నారు. అంతకు ముందు ఈడీ విచారణకు హాజరయ్యే అంశంపై స్పందిస్తూ.. ఈడీ విచారణపై హైకోర్టులో పిటిషన్ వేశానని స్పష్టం చేశారు. తన పిటిషన్ పై హైకోర్టు విచారించనుందని తెలిపారు. ఈడీ విచారణకు వెళ్లాలా వద్దా అనే విషయంపై తన లాయర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. -
ఈడీ విచారణకు రోహిత్ రెడ్డి గైర్హాజరు.. వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: ఈడీ విచారణకు గైర్హాజరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం తన పిటిషన్ విచారణకు రానున్నట్లు తెలిపారు. ఈడీకి సంబంధంలేని కేసులో విచారణ సరికాదని తెలిపారు. అసలు ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఈడీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. తనను ఇబ్బంది పెట్టడానికే ఈడీ సీబీఐ విచారణ పేరుతో వేధిస్తున్నట్లు ఆరోపించారు. న్యాయ నిపుణుల సలహాతో ముందుకు వెళ్తానని తెలిపారు. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిరి రెండు సార్లు విచారించిన ఈడీ.. మరోసారి విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే నోటీసులు ఇచ్చింది. నందకుమార్ నుంచి సేకరించిన సమాచారంతో మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరుకావాలని రోహిత్‌ను ఆదేశించింది. అయితే ఈడీ ఎదుట హాజరు కాకుడదని రోహిత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఈడీ అధికారులకు మెయిల్ చేశారు. హై కోర్టులో రిట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో.. తాను విచారణకు హాజరు కాలేనని రోహిత్ పేర్కొన్నారు. మరోవైపు బుధవారం హైకోర్టులో రోహిత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉండగా.. హై కోర్టు తీర్పు ఒచ్చాకే తదుపరి విచారణపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. మరోవైపు రోహిత్ రెడ్డి మెయిల్‌కు ఈడీ అనుమతి ఇస్తుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ఎమ్మెల్యే గైర్హాజరుతో ఈడీ తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ.. ఈడీ జేడీగా రోహిత్ ఆనంద్ -
సీబీఐ విచారణతో వాస్తవాలు తెలుస్తాయి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణల కేసు విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొ న్నారు. ఈ కేసులో వాస్తవాలు బయ టకు రావాలని బీజేపీ కోరుకుంటోందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలి పా రు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాస్తవాలను దాచి పెట్టి, అసత్య ప్రచారంతో బీజేపీని బద్నామ్ చేసే కుట్రకు తెరతీసిందని మండిపడ్డారు. ‘ఫాంహౌస్ కేసులో కర్త, కర్మ, క్రియ.. ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆరే. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌కు ‘ప్రగతి భవన్’అడ్డాగా మారింది. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించేందుకు కేసీఆర్ ప్రభు త్వం ఆడుతున్న డ్రామాపై ప్రజల్లో చర్చ జరుగు తోంది’అని అన్నారు. నేరస్తు లను కాపాడ టానికే ‘సిట్’ విచారణ సాగుతున్నట్లుగా కనిపిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం అనేక కేసుల్లో ‘సిట్’ విచారణ జరిపినా కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేక పోవడమే ఇందుకు నిదర్శనమని ఎద్దేవాచేశారు. లిక్కర్, డ్రగ్స్, అవినీతి కేసుల్లో నిండా కూరు కుపోయిన తన కుటుంబాన్ని కాపా డుకు నేందుకు, ప్రజల దృష్టిని మ ళ్లించడానికి కేసీఆర్ అల్లిన కట్టుకథనే ఫాంహౌస్ కేసు అని వ్యాఖ్యానించారు. ఫాంహౌస్కేసులో దోషులెవరో గుర్తించడానికే సీబీఐ విచారణ అవసరమని ప్రజలు కోరుతున్నారన్నా రు. సీబీఐ విచారణతో వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని బీజేపీ భావిస్తోందన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసిందని మొదటి నుంచీ తా ము చెబుతున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అందువల్లే హైకోర్టును ఆశ్రయించామని మీడియా తో అన్నారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని, ఈ దర్యాప్తులో ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. -
సిట్‌ను కాదని సీబీఐకి ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కాదని సీబీఐకి కేసు విచారణ అప్పగించడం ఎంత వరకు సమంజస మని ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలనే హైకోర్టు నిర్ణయంపై స్పందిస్తూ.. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి కార్యాచరణ, డివిజన్ బెంచ్‌కు వెళ్లాలా? లేక సుప్రీం కోర్టును ఆశ్రయించాలా? అనేది నిర్ణయించుకుంటామని చెప్పారు. కేసును సీబీఐకి బదిలీ చేయడంపై న్యాయనిపుణుల సలహా తీసుకున్నట్లు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలూ దొరకలేదు..అందుకే.. ఈడీ విచారణ పరిధిలో లేకున్నా, తనను పిలిచి ఇబ్బంది పెట్టాలని చూసినా ఏ ఆధారాలు దొరకలేదని రోహిత్‌రెడ్డి చెప్పారు. అందుకనే సీబీఐ రంగంలోకి దిగిందనే అనుమానం తనకు కలుగుతోందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు సరిగానే జరుగుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్ న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని, అయి తే తాను తప్పు చేయనందున ఎవరికీ భయపడా ల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. న్యాయస్థానం, చట్టాలను గౌరవిస్తూనే తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. దొంగ స్వాములు చెప్పినట్టు జరుగుతోంది.. బీజేపీకి సంబంధం లేకపోతే ఆరోపణలు ఎదు ర్కొంటున్న వారు ఎందుకు విచారణకు రావడం లేదని ప్రశ్నించారు. దొంగస్వాములు చెప్పినట్లుగా కేసు ముందుకు వెళ్తున్న తీరు విస్మయానికి గురిచే స్తోందన్నారు. ఈ కేసులో నిందితులు విచారణను సీబీఐ అప్పగించాలని కోరిన విషయాన్ని రోహిత్ రెడ్డి గుర్తు చేశారు. స్వామీజీలతో బీజేపీకి సంబంధం లేదని ప్రకటించిన వారే నిష్ణాతులైన న్యాయ వాదులను రప్పించుకుంటున్నారన్నారు. తన సోద రుడికి గుట్కా వ్యవహారంతో సంబంధం లేదని రోహిత్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్‌కు వీడియో, ఆడియో కాపీలు తానే ఇచ్చానని తెలిపారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, తెలంగాణను చేజిక్కించుకోవాలనే కుట్రను భగ్నం చేసిన తాను, తప్పు చేయలేదని అన్నారు. -
సీబీఐకి ఎమ్మెల్యేల ఎర కేసు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు కీలక మలుపు తీసుకుంది. దీని దర్యాప్తు బాధ్యతను సీబీఐకి బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దీనిని విచారిస్తున్న సిట్‌గానీ, దర్యాప్తు అధికారిగానీ ఇక ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 63 రద్దు చేసింది. కేసు (ఎఫ్ఐఆర్ నంబర్ 455/2022) పూర్తి వివరాలను, స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌ను సీబీఐకి అందజేయాలని సిట్, దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీ దాఖలు చేసిన పిటిషన్ల మేరకు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయమై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి కూడా పిటిషన్ వేసినా.. ఈ కేసులో బాధితులు, నిందితుల్లో ఎవరూ కూడా కానందున ఆ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. వీడియోలు బయటపెట్టడం ఏమిటి? ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసుకు సంబంధించి నిందితుల పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఇప్పటికే ఇరువర్గాల వాదనలను విన్నారు. సోమవారం దీనిపై తీర్పు వెలువరించారు. ఈ వ్యవహారానికి సంబంధించి సీఎంకు ఎవరు వీడియో రికార్డింగ్‌లు, ఇతర మెటీరియల్ ఇచ్చారన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లలో ఎక్కడా స్పష్టత ఇవ్వలేదని.. దర్యాప్తు వివరాలను మీడియాకు వెల్లడించవద్దని ఆదేశించినా రోజువారీ విచారణ వివరాలు ఎలా బయటికి వచ్చాయని పిటిషనర్లు చేసిన వాదనను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమే అయినా దర్యాప్తు ప్రారంభం సమయంలోనే వివరాలన్నీ బహిర్గతం కావడం ఏమిటని న్యాయమూర్తి తప్పుబట్టారు. ‘‘కేసు వివరాలు బహిర్గతం కావడం పోలీసు దర్యాప్తుపై నిందితులకు అనుమానం కలిగేలా చేసింది. పోలీసులు స్వేచ్ఛగా, పారదర్శకంగా విచారణ చేయలేరన్న భావనను పురిగొల్పింది. నిజానికి ఒకరికి అనుకూలంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారనేది ఏదీ నిరూపితం కాలేదు. అయినా నిందితుల అనుమానాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్టికల్ 20, 21 ప్రకారం విచారణ (ట్రయల్) మాత్రమే కాదు.. దర్యాప్తు (ఇన్వెస్టిగేషన్) కూడా పారదర్శకంగా కొనసాగాల్సి ఉంటుంది. అందువల్ల నిందితుల విజ్ఞప్తికి అనుకూలంగా ఆదేశాలు ఇస్తున్నాం..’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే ఈ ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళతామని.. ఆర్డర్ కాపీ విడుదలయ్యే వరకు అమలును నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ విజ్ఞప్తి చేయగా.. న్యాయమూర్తి దానికి అంగీకరించారు. ఫాంహౌజ్ కలకలం నుంచి.. కోర్టు తీర్పుదాకా.. టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)కు చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక)తో పాటు తనను బీజేపీలో చేరాలంటూ ప్రలోభపెడుతున్నారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు) అక్టోబర్ 26న సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము పార్టీ మారితే ఒక్కొక్కరికి రూ.50 కోట్లు, కాంట్రాక్టులు, కేంద్ర అధీనంలోని పదవులు ఇస్తామంటూ ఎర వేశారని పేర్కొన్నారు. ►దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు.. ముందస్తు వ్యూహం ప్రకారం రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ పరిధిలోని అజీజ్‌నగర్‌లో ఉన్న పీవీఆర్ ఫామ్‌హౌజ్‌పై దాడి చేసి ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీలను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌కు, నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ►అక్టోబర్ 27న బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఎమ్మెల్యేలకు ఎర పేరిట దాఖలైన కేసులో సీబీఐ లేదా సిట్‌తో దర్యాప్తు జరిపించేలా ఆదేశించాలంటూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదంతా తమను అప్రతిష్టపాలు చేసేందుకు బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పన్నిన కుట్రగా అభివర్ణించింది. ►మరోవైపు కేసులో సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ నిందితులు రామచంద్ర భారతి, నందుకుమార్, సింహయాజీలు నవంబర్ 4న హైకోర్టులో పిటిషన్లు వేశారు. నాటి నుంచి పిటిషన్లపై వాదనలు జరిగాయి. తొలుత సిట్ దర్యాప్తుపై సింగిల్ జడ్జి స్టే విధించారు. సిట్ దీనిని ద్విసభ్య ధర్మాసనం ముందు సవాల్ చేసింది. స్పందించిన ధర్మాసనం సిట్ విచారణ హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షణలోనే సాగాలని స్పష్టం చేసింది. అదే సమయంలో సిట్ దర్యాప్తులో ముందుకెళ్లవచ్చని సూచించింది. మరోవైపు నిందితులు తమ అరెస్టుపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు విచారణను హైకోర్టుకే బదిలీ చేసింది. బెయిల్‌పై ట్రయల్ కోర్టు నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. ►ఈ కేసులో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కూడా హాజరవడంతో వాడివేడిగా వాదనలు జరిగాయి. బీజేపీ తరఫున వైద్యనాథన్ చిదంబరేశ్.. నిందితుల తరఫున మహేశ్ జెఠ్మలానీ.. ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) రామచంద్రరావు వాదనలు వినిపించారు. ► ‘‘ఏ కేసులోనైనా దర్యాప్తు పారదర్శకంగా, నిజాయతీ జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారు. సీఎం కేసీఆర్ సిట్ విచారణకు ముందే మీడియాకు వివరాలు వెల్లడించారు. పోలీసులే ఆయనకు మెటీరియల్ అందజేశారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే సిట్ పనిచేస్తోంది. ఫామ్‌హౌస్ ఘటన జరిగిన రోజే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. తెలంగాణ హైకోర్టుతోపాటు ఇతర హైకోర్టుల సీజేలకు ఘటన సీడీలు, ఇతర వివరాలను సీఎం కేసీఆర్ పంపారు. వాస్తవానికి దర్యాప్తునకు సంబంధించిన ఏ అంశమైనా బయటికి రాకూడదు. కానీ కీలక సమాచారం ఎప్పటికప్పుడు మీడియాకు లీక్ చేస్తున్నారు. ఈ కేసులో సీబీఐ లేదా ఇతర స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలి’’ అని నిందితులు, బీజేపీ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు విన్నవించారు. ఈ సందర్భంగా పలు సుప్రీంకోర్టు, హైకోర్టుల ఉత్తర్వులను కూడా వివరించారు. ► మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ‘‘ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే వీగిపోవడం ఖాయం. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం తీవ్ర నేరం. ఈ కేసును ఎంతో వేగంగా చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో సిట్ దర్యాప్తు కొనసాగుతుందనడానికి ఆధారాలు లేవు. ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న నిందితుల వీడియోలు, వాయిస్ రికార్డింగ్‌లు ప్రధాన న్యాయమూర్తి, ఇతరులకు పంపడం తప్పే. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే ఈ కుట్ర జరిగింది. బీజేపీకి సంబంధం లేదంటూనే ఆ పార్టీ నేతలు నిందితుల తరఫున పిటిషన్లు వేస్తున్నారు. తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలి’’ అని వాదించారు. ►ఇరు వర్గాలు చెప్పిన అంశాలను విన్న న్యాయమూర్తి గత వారమే తుది వాదనలను పూర్తిచేసి.. తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం తీర్పును వెలువరించారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐ చేతికి ఆ తర్వాతే..!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐ చేతికి వెళ్లాలన్న ఆదేశాలు వెలువడిన కాసేపటికే మరో పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల తుది కాపీ వచ్చేదాకా.. ఇచ్చిన ఆదేశాలను సస్పెన్షన్‌లో ఉంచాలని, తీర్పును ఇంప్లిమెంట్ చేయొద్దని సిట్ తరపున రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కోరారు. దీనికి హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు.. ఆర్డర్ కాపీ అందిన తర్వాతే అప్పీల్‌కు వెళ్తామని ధర్మాసనానికి స్పష్టం చేశారు ఏజీ. దీంతో అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఇస్తామని న్యాయమూర్తి ఏజీకి స్పష్టం చేశారు. అంతకు ముందు.. కేసును సిట్ దర్యాప్తు నుంచి సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అయితే.. తక్షణమే సీబీఐకి అప్పగించాలని తెలిపినప్పటికీ.. ఏజీ అభ్యర్థనను హైకోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో హైకోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాతే సిట్ అప్పీల్‌కు వెళ్లనుంది. ఈ పరిణామంతో.. డివిజన్ బెంచ్‌లో తీర్పు తర్వాతే సీబీఐ దర్యాప్తు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతే తన కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి మీడియాకు తెలిపారు. -
డ్యామిట్.. కేసీఆర్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. ఇప్పుడేం చేస్తారో?
సాక్షి, హైదరాబాద్: ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ సర్కార్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి.. ఆ దర్యాప్తు ద్వారా ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టాలని తీవ్రంగా యత్నించింది బీఆర్ఎస్ అండ్ కో. కానీ, కేసును సీబీఐకి అప్పగించాలన్న ఇవాళ్టి తెలంగాణ హైకోర్టు తీర్పుతో కథ ఒక్కసారిగా అడ్డం తిరిగింది. కేంద్ర ఏజెన్సీకి అప్పగిస్తే.. కేసు నిర్వీర్యం అయిపోతుందని, ప్రత్యర్థులపై విరుచుకుపడే అవకాశం కోల్పోతామేమో అనే ఆందోళన చెందుతోంది బీఆర్ఎస్. కోర్టు తీర్పు వెలువరిన వెంటనే.. ఆ తీర్పును స్వాగతిస్తున్నాం అంటూ బీజేపీ నేత, అడ్వొకేట్ రామచంద్ర రావ్ ప్రకటన చేయడం గమనార్హం. సిట్ దర్యాప్తు పారదర్శకంగా లేదని ఆయన వాదించారు. అంతకు ముందు.. ఈ కేసులో కుట్రకోణం దాగుందని, సంబందం లేని వారిని కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నారని పిటిషనర్లు కోర్టుకు వెల్లడించారు. తెలంగాణ రంగారెడ్డి పరిధిలోని మొయనాబాద్లోని ఓ ఫామ్ హౌజ్‌లో అక్టోబర్ 26వ తేదీ సాయంత్రం ఆకస్మిక సోదాలు నిర్వహించిన సైబరాబాద్ పోలీసులు.. బీఆర్ఎస్(పాత టీఆర్ఎస్) ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగంగా వంద కోట్ల రూపాయలతో నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే యత్నం జరిగిందని ప్రకటించి సంచలనానికి తెర తీసింది. ఈ కేసులో దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రామచంద్ర భారతి, సింహయాజులు, నంద కుమార్ల పేర్లను నిందితులుగా చేర్చింది ఆ బృందం. ఎమ్యెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యవహారం నడిచిందన్నది తెలిసిందే. ఈ క్రమంలో.. అధికార ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ వ్యవహారం వెనుక బీజేపీ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ వచ్చారు. మరోవైపు సాక్షాత్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం సాక్ష్యాలంటూ వీడియో ఫుటేజీలతో.. మీడియా ముందుకు వచ్చి బీజేపీ బడా నేతలను సైతం ఇందులో భాగం చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీని విమర్శిస్తూనే.. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సిట్ విచారణలో భాగంగా నిందితుల అరెస్ట్.. ఆపై బెయిల్.. ఆ వెంటనే వేర్వేరే కేసుల్లో నిందితులను మళ్లీ అదుపులోకి తీసుకోవడం.. ఇలా హైడ్రామా నడిచింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై ఉన్నత న్యాయస్థానం.. సుదీర్ఘ వాదనల తర్వాత టెక్నికల్ గ్రౌండ్స్‌ను పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో నగదు లేనప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ ఎలా వర్తిస్తుందని, పైగా సీఎం కేసీఆర్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారని, అసలు దర్యాప్తు ఆధారాలు ఆయన చేతికి ఎలా వెళ్లాలని, అసలు ఏసీబీ చేయాల్సిన దర్యాప్తును సిట్ ఎలా చేస్తుందని?, సీబీఐకి అప్పగిస్తే అసలు వ్యవహారం బయటపడుతుందని.. ఇలా పిటిషనర్ తరపు వాదనలన్నీ తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అందుకే.. సిట్ ఏర్పాటును రద్దు చేస్తూ సీబీఐకి కేసు అప్పగించాలని ఆదేశించింది. ఒకవేళ రాష్ట్రంలో సీబీఐని నిషేధించినా.. హైకోర్టు ఆదేశాలతో విచారణ జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు వెళ్లవచ్చు. ఈ నేపథ్యంలో.. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని సిట్ అనుకుంటోంది. దీంతో.. సిట్ అభ్యర్థనపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. కేసులో కీలక పరిణామాలు October 26 - తెరపైకి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు November 25 - హైకోర్టు జడ్జీలు బదిలీ December 1 - నిందితులకు బెయిల్ మంజూరు December 26 - కేసు సీబీఐకి అప్పగింత -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలనం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలన తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు. సీబీఐ విచారణకు అనుమతిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. బీజేపీ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.. మిగిలిన పిటిషన్లకు మాత్రం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో.. సిట్ విచారణ సరిగా జరగట్లేదన్న వాదనతో ఏకీభవించింది హైకోర్టు. సిట్ ఏర్పాటును కొట్టేస్తూనే సిట్ విచారణ నిలిపివేతకు ఆదేశించింది. అలాగే.. కేసును సిట్ నుంచి సీబీఐకు బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు వివరాలు సీబీఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది హైకోర్టు బెంచ్. అయితే హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని సిట్ యోచిస్తోంది. గత అక్టోబర్‌లో తెరపైకి వచ్చింది ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. అధికార పార్టీ బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్) కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కుట్ర జరిగిందని, అందుకు రంగారెడ్డి మొయినాబాద్‌లోకి ఓ ఫామ్‌హౌజ్ వేదిక కావడం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. -
2022 Roundup-Hyderabad: సంచలనాల సమాహారం!
మహా నగరానికి సంబంధించి 2022 ఆద్యంతం సంచలనాత్మక ఉదంతాలు, ఘటనలు, నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ ఏడాది జనవరి నెలలో గుజరాత్‌కు చెందిన సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ వరుస పెట్టి పంజా విసిరాడు. అక్టోబర్‌లో మొదలైన ‘ఫామ్‌హౌస్’ ఎపిసోడ్... ఈడీ కేసులు, నోటీసులతో డిసెంబర్ వరకు కొనసాగింది... కొనసాగుతోంది. సికింద్రాబాద్ స్టేషన్ కేంద్రంగా చోటు చేసుకున్న ‘అగ్నిపథ్’ అల్లర్లు, అమ్నేషియా–పుడింగ్ అండ్ మింక్ పబ్స్ వ్యవహారాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయి. ఆయా ఉదంతాలను ఒక్కసారి పరిశీలిస్తే... – సాక్షి, సిటీబ్యూరో రికార్డులకు ఎక్కిన తొలి డ్రగ్ మరణం డ్రగ్ పెడ్లర్ ప్రేమ్ ఉపాధ్యాయ ఎల్ఎస్డీ బోల్ట్స, ఎక్స్టసీ పిల్స్ వంటి సింథటిక్ డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఇతడి నుంచి నగరానికి చెందిన ఓ యువకుడు డ్రగ్స్ ఖరీదు చేశాడు. బీటెక్ పూర్తి చేసి, ఉద్యోగాన్వేషణలో ఉన్న ఆ యువకుడు మాదకద్రవ్యాల ప్రభావంతో క్లరోసిస్ స్ట్రోక్‌తో బాధపడి చనిపోయాడు. గోవాలో జరిగిన పార్టీలో ఒకేసారి ఎల్ఎస్డీ, కొకైన్, ఎండీఎంఏ, ఎక్స్టసీ పిల్స్‌తో పాటు హష్ ఆయిల్ తీసుకోవడంతో నగరానికి వచ్చాక ఇలా జరిగింది. మూడు కమిషనరేట్లలో పంజా సీరియల్ స్నాచర్ జనవరిలో ఉమేష్ గులాబ్ భాయ్ ఖతిక్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల అధికారులకు సవాల్ విసిరాడు. మెహదీపట్నంలో యాక్టివా వాహనం చోరీ చేశాడు. మరుసటి రోజు ఆ ల్వాల్ నుంచి మేడిపల్లి వరకు నేరాలు చేశాడు. వీటిలో స్నాచింగ్స్తో పాటు యత్నాలు ఉన్నాయి. గుజరాత్ పోలీసులకు పట్టుబడిన ఇతడిని సిటీకి తీసుకురావడం, రికవరీల్లోనూ అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. బ్యాంకు నుంచి రూ.కోట్లు కొట్టేసి.. ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.12.93 కోట్లు కొల్లగొట్టారు. ఈ వ్యవహారంలో నైజీరియన్లు కీలకంగా వ్యవహరించగా... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు చెన్నై వాసులు పాత్రధారులుగా ఉన్నాయి. ఈ కేసును కొన్ని రోజుల్లోనే ఛేదించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అనేక మందిని అరెస్టు చేశారు. అయితే ఇప్పటికీ సూత్రధారులు పరారీలోనే ఉన్నారు. ► జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలోని అమ్నేషియా పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. బాధితురాలిపై ఇన్నోవా కారులో అత్యాచారం జరగడానికి ముందు బెంజ్ కారులో అభ్యంతరకరంగా ప్రవర్తించారు. నిందితులుగా ఉన్న వారిలో ఎమ్మెల్యే కుమారుడితో పాటు అనేక మంది ప్రముఖుల సంతానం ఉన్నారు. వీరిలో అత్యధికులు మైనర్లు కావడం గమనార్హం. ఫామ్‌హౌస్ టు ఈడీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఖరీదు చేయడానికి ప్రయత్నించిన ఆరోపణలపై నందకుమార్, సింహయాజి, రామచంద్రభారతి అరెస్టయ్యారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ కీలక నేత బీఎల్ సంతోష్‌తో పాటు అనేకమంది ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. రంగంలోకి దిగిన ఈడీ అధికారులు నందు భాగస్వామిగా ఉన్న అభిషేక్‌తో పాటు ఆ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తదితరులను విచారిస్తున్నారు. ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్.. బంజారాహిల్స్‌లోని రాడిస్సన్ బ్లూ ఆధీనంలోని ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో జరిగిన డ్రగ్ పార్టీ గుట్టురట్టైంది. కొణిదెల నాగబాబు కుమార్తె నిహారికతో పాటు అనేక మంది ప్రముఖుల వారసులు దీనికి హాజరయ్యారు. ఈ కేసు దర్యాప్తు ఇటీవలే పూర్తి చేసిన పోలీసులు, ఆరుగురిని నిందితులుగా ఖరారు చేస్తూ అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఉగ్రవాదికి 16 ఏళ్ల జైలు పాక్ నిఘా సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో భారీ విధ్వంసాలకు కుట్రపన్నిన కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ దోషిగా తేలాడు. ఇతడికి 16 ఏళ్ల జైలు శిక్ష, రూ.26 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న మహ్మద్ నిస్సార్‌కు న్యాయస్థానం 2011లోనే 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బోరుమన్న బోయగూడ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సమీపంలో ఉన్న న్యూ బోయగూడ ప్రాంతంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం బీహార్ నుంచి వలసవచ్చిన 11 మంది కార్మికులను పొట్టన పెట్టుకుంది. సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన రేకుల షెడ్డు గోదాములో మొత్తం నలుగురు వ్యాపారాలు చేస్తున్నారు. దీని మధ్య భాగంలో దిల్సుఖ్నగర్ ప్రాంతానికి చెందిన సంపత్ అనే వ్యాపారి శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో స్క్రాప్ గోదాం నిర్వహిస్తున్నారు. ఇందులోనే అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిపథ్‌తో అట్టుడికింది కేంద్ర ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి సంబంధించిన సెగ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు తాకింది. నిరుద్యోగులు ఒక్కసారిగా ఈ స్టేషన్‌ను ముట్టడించారు. రైలు పట్టాలపై ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) లాఠీచార్జ్ చేసింది. దీంతో ఆందోళన ఉధృతం చేసిన నిరుద్యోగులు విధ్వంసానికి దిగారు. ఆరు ప్లాట్‌ఫామ్స్‌లోని దుకాణాలతో సహా ప్రతీది ధ్వంసం చేయడంతో పాటు రైళ్ల పైనా రాళ్లు రువ్వారు. కొన్ని బోగీలకు నిప్పుపెట్టారు. ఆర్పీఎఫ్ అధికారులు కాల్పుల్లో ఓ యువకుడు చనిపోగా... 12 మందికి గాయాలయ్యాయి. -
నందుకుమార్‌ను ప్రశ్నించనున్న ఈడీ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర’కేసులో కీలక నిందితుడు నందుకుమార్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం చంచల్‌గూడ జైల్లో ప్రశ్నించనుంది. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఆశచూపారని, ఇందులో మనీలాండరింగ్‌కు అవకాశం ఉందన్న అనుమానాలతో ఈడీ రంగంలోకి దిగింది. ఇదే ప్రధానాంశంగా నందుకుమార్‌ను ప్రశ్నించేందుకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ గోయల్ నేతృత్వంలోని ఇద్దరు అధికారుల బృందం సన్నద్ధమైంది. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఆఫర్ చేసినట్టు ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో ఈ డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చాలనుకున్నారు? ఆర్థిక లావాదేవీల వెనుక ఎవరెవరు ఉన్నారన్న అంశాలపై ప్రధా నంగా ప్రశ్నించే అవకాశం ఉంది. నందుకుమార్ చెప్పే అంశాలే ఇప్పుడు ఈడీ అధికారుల దర్యా ప్తులో కీలకంగా మారనున్నాయి. ఇప్పటివరకు ఈ కేసులో ప్రధాన నిందితులైన రామచంద్రభారతి, సింహయాజీ, నందుకుమార్‌లతో సత్సంబంధాలు న్న వారు... ఈ డీల్ సందర్భంగా రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీ ప్రస్తావించిన పేర్లు, ఆ సమయంలో వారు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు.. ఎవరితో టచ్‌లో ఉన్నారు.. అన్న అంశాల ఆధారంగానే ‘సిట్’బృందం దర్యాప్తు చేసింది. సిట్ బృందాలు కేరళ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లోనూ కేవలం ఈ కేసుతో లింకులున్న వ్యక్తుల గురించి ఆరా తీయడంపైనే దృష్టి పెట్టింది. సిట్ ఇప్పటివరకు చేసిన దర్యాప్తులో నందుకుమార్ భార్యతోపాటు ఇద్దరు న్యాయవాదులను ప్రశ్నించింది. కానీ, ఎక్కడా డబ్బు ప్రస్తావన రాలేదు. నిందితుల అరెస్టు సమయంలో పెద్దమొ త్తంలో డబ్బులు ఇవ్వజూపారని మాత్రమే సైబరా బాద్ పోలీసులు వెల్లడించారు. కానీ, ఘటనా స్థలంలో మాత్రం నగదు పట్టుబడిన ఆధారాలు వెల్లడించలేదు. రూ. వందల కోట్లు ఆశజూపి బేరసారాలు జరిపినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణలో డబ్బు అంశంతో మరేమైన కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోమ, మంగళవారాల్లో నందుకుమార్ ఇచ్చే వాంగ్మూలం కొత్త మలుపులకు దారితీసే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. మరోసారి పైలెట్ రోహిత్‌రెడ్డి ఎమ్మెల్యేల ఎర కేసు ఫిర్యాదుదారుడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి మంగళవారం మరోసారి ఈడీ అధికారుల విచారణకు హాజరుకానున్నా రు. గత వారంలో రెండు రోజులపాటు రోహిత్‌రెడ్డిని ప్రశ్నించిన ఈడీ ఈనెల 27న మరోమారు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. -
ఎమ్మెల్యేల కేసులో భారీ ట్విస్ట్.. నందకుమార్‌పై రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక, ఈ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. కాగా, విచారణ అనంతరం.. రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ విచారణకు సంపూర్ణంగా సహకరించాను. నన్ను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. బీజేపీ నేతల బండారాన్ని బయటపెట్టినందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు. నందకుమార్ ద్వారా నన్ను ఈ కేసులో ఇరికించాలని చూశారు. ఇప్పుడు నందకుమార్‌ను విచారిస్తామని అంటున్నారు. కేవలం నన్ను లొంగదీసుకునేందుకే ఈడీ విచారణ జరిపింది. కేంద్రం చేతిలో ఉన్న ఈడీ ద్వారా నాకు నోటీసులు పంపించి విచారణ జరిపారు. దీంతో, బీజేపీ జాతీయ నేతల బండారం బయటపడింది. మొదటి రోజు నన్ను ఆరు గంటల పాటు విచారించినా ఈ కేసు గురించి ప్రశ్నిస్తున్నారో కూడా చెప్పలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు గురించి రెండో రోజు ప్రశ్నించారు. అది కూడా నేను అడిగితే చెప్పారు. కంప్లైంట్ చేసిన నన్ను విచారించారు తప్ప.. నిందితులను ఎందుకు ప్రశ్నించడంలేదు?. నంద కుమార్ ద్వారా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. నందకుమార్ ద్వారా స్టేట్మెంట్ తారుమారు చేయబోతున్నారు. కేంద్రం ఈడీ, సీబీఐ, ఐటీలతో ప్రజాస్వామ్యాన్ని కొల్లగొడుతోంది. ప్రజలు తన్నుకు చావాలన్నదే బీజేపీ విధానం. బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకువెళ్తాను. నేను గులాబీ సైనికుడిగా బీజేపీ కుట్రలను తిప్పికొడతాను. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు. నన్ను, నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఈ కొత్త కుట్రలను మేము భగ్నం చేస్తాము. ఈడీ నోటీసుల మీద రేపు హైకోర్టులో రిట్ వేయబోతున్నాను. బీజేపీ అగ్ర నేతలు ఎందుకు విచారణకు రావడంలేదు. నాకు, నందకుమార్‌కు మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందుపై మరో చీటింగ్ కేసు
బంజారాహిల్స్: ఇంటీరియర్ వర్క్ చేయించుకొని తనకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడంటూ ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు కోరె నందుకుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన డాగా శ్రీనివాస్ కుమార్.. ఇంటీరియర్, ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నారు. ఫిలింనగర్లో ఫిల్మీ జంక్షన్‌లోని డక్కన్ కిచెన్‌లో ఇంటీరియర్ వర్క్ కోసం శ్రీనివాస్‌తో నందు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గతేడాది మేలో ఫ్యాబ్రికేషన్, సివిల్ వర్క్ పూర్తి చేసి రూ.27 లక్షల బిల్లు అందజేశారు. ఇందులో రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చిన నందు మిగతా మొత్తాన్ని త్వరలో ఇస్తానని చెప్పాడు. తర్వాత మిగతా రూ.17 లక్షలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపడమే కాకుండా ఫోన్ చేస్తే స్పందించడం లేదని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్’ కేసులో తీర్పు రిజర్వు -
‘ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్’ కేసులో తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లలో వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్ మీడియా ముందు ఫుటేజ్ పెట్టడంపై అభ్యంతరం తెలుపుతూ కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్ సహా పలువురు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ డివైజెస్ అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. పిటిషనర్లు 65బీ సర్టిఫికెట్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపింది. సీఎం మీడియో సమావేశానికి సంబంధించి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎక్కడి నుంచి తీసుకున్నారని పిటిషనర్లను న్యాయమూర్తి ప్రశ్నించారు. 65బీ ఇచ్చేందు కు సమయం కావాలని కోరడంతో.. సాయంత్రం 4.30 గం. వరకు న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను సాయంత్రం వరకు వాయిదా వేశారు. పిటిషనర్లు ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకోలేం.. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలని చట్టంలో లేదని హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది జోగినపల్లి సాయికృష్ణ వాదించారు. యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసి తీసుకొని వచ్చిన వీడియోను ఎవిడెన్స్‌గా పరిగణించలేమని చెప్పారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 65బీ ప్రకారం సర్టిఫికెట్ లేకుండా ఎవిడెన్స్‌ను రికార్డుల్లోకి తీసుకోవడానికి వీలులేదని చెప్పారు. అసలు సీబీఐకి ఈ కేసును బదిలీ చేయాలి అనడానికి.. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌కు సంబంధం లేదన్నారు. ఇలాంటి ఎవిడెన్స్‌ను ట్రయల్ కోర్టులో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని నివేదించారు. రోహిత్‌రెడ్డి ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ట్రాప్ చేసి.. నిందితులను అరెస్టు చేశారని చెప్పారు. అక్టోబర్ 26న ముఖ్యమంత్రి మీడియా భేటీ నిర్వహించగా, నవంబర్ 9న సిట్ ఏర్పాటు జరిగిందని కోర్టుకు దృష్టికి తేచ్చారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ మెటీరియల్ ఎలా ఇచ్చిందో చెప్పాలని పిటిషనర్లను ప్రశ్నించారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీని కోసం సాయంత్రం 4.30 గంటల వరకు న్యాయమూర్తి సమయం ఇచ్చారు. సాయంత్రం వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును రిజర్వు చేశారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు -
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు నందకుమార్‌పై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై మరో కేసు నమోదైంది. వ్యాపారం పేరుతో తమను నందకుమార్ మోసం చేసినట్లు ఆరోపిస్తూ మానిక్ చంద్ పాన్ మసాలా నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే 50 శాతం వాటా ఇస్తానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నందకుమార్ వల్ల తాము రూ.2 కోట్లు నష్టపోయామని ఫిర్యాదులో పేర్కొన్నారు మానిక్ చంద్ పాన్ మసాలా నిర్వాహకులు. మానిక్ చంద్ నిర్వాహకుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇదీ చదవండి: నందకుమార్‌కు బెయిల్ మంజూరు.. లాస్ట్‌లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు! -
ఫాంహౌజ్ కేసు: కీలకంగా మారనున్న హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో ఇవాళ(శుక్రవారం) తెలంగాణ హైకోర్టులో జరిగే విచారణ కీలకం కానుంది. సిట్ రివిజన్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఈ వ్యవహారంలో.. ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు తీర్పును రద్దు చేయాలంటూ సిట్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఏసీబీ కోర్టు తీర్పును సమర్థిస్తూ.. కేసు విచారించే అర్హత లా అండ్ ఆర్డర్ పోలీసులకు లేదంటూ ప్రతివాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టులో పలు పిటిషన్ లు దాఖలు అయ్యాయి. ఈ అన్ని పిటిషన్లపై మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది హైకోర్టు. రామచంద్ర భారతి విడుదల ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో చంచల్ గూడ జైలు నుండి రామచంద్ర భారతి బెయిల్ పై విడుదల అయ్యాడు. ఫాంహౌజ్ కేసులో A1 నిందితుడు రామచంద్ర భారతి. సుమారు 45రోజుల తర్వాత జైల్ నుండి విడుదల. వాస్తవానికి.. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో గురువారమే జైలు నుంచి విడుదల అయ్యాడు. అయితే.. ఆ వెంటనే మరో కేసులో అరెస్ట్ చేశారు. దీంతో గురువారం రాత్రి నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు రామచంద్ర భారతి. ఆ వెంటనే బెయిల్ మంజూరు అయ్యింది. రామచంద్ర భారతిపై ఎమ్మెల్యే ల కొనుగోలు కేసుతో పాటు మరో రెండు కేసులు. ఇదే కేసులో A3 సింహయాజులు ఇప్పటికే బెయిల్ పై విడుదల అయ్యాడు. మరోవైపు A2 నందకుమార్‌ను మరో కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఇక A4బిఎల్ సంతోష్, A5తుషార్,A6 జగ్గు స్వామి,A7 శ్రీనివాస్ నిందితుల పై మెమో కొట్టివేసింది ఏసీబీ కోర్టు. -
ఫాంహౌజ్ కేసు: బెయిల్‌పై విడుదల, వెంటనే మళ్లీ అదుపులోకి..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్ చంచల్ గూడ జైల్ నుండి విడుదల అయ్యారు. అయితే జైలు నుంచి బయటకి రాగానే ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నందకుమార్ పై బంజారాహిల్స్ పీఎస్ లో నమోదైన చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర భారతిని ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్, ఫేక్ ఆధార్ కార్డ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రభారతి, నందకుమార్ లను పోలీసులు బంజారాహిల్స్ పీఎస్ కి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే సింహయాజీ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో రామచంద్ర భారతి, సోమయాజీ, నందకుమార్ లకు డిసెంబర్ 1న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పాస్ పోర్టులను సిట్ అధికారులకు అప్పగించడంతో పాటు సాక్ష్యులను ప్రభావితం చేసేలా వ్యవహరించవద్దని షరతు విధించింది. -
ఎమ్మెల్యేల కేసు: ఏసీబీ కోర్టు తీర్పు సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఇప్పటికే పలు మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్ విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి సిట్.. హైకోర్టును ఆశ్రయించింది. ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేసింది. అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యహహారంలో బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్‌లపై సిట్ మెమో పిటిషన్ దాఖలు చేసింది. కాగా, మెమో పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు తీర్పుపై సిట్.. రివిజన్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో సిట్ పిటిషన్ విచారణకు హైకోర్టు అనుమితిచ్చింది. సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం 2:30 విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్ నాగార్జున్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న సింహయాజి బుధవారం జైలు నుంచి విడదలయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన వారం తర్వాత బుధవారం సింహయాజి విడుదలయ్యారు. ఇక ఈ కేసులో.. మరో ఇద్దరు నిందితులు జైల్లోనే ఉన్నారు. ముగ్గురు నిందితులకు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజులుకు వారం క్రితమే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. కేసులు పెండింగ్‌లో ఉండటంతో రామచంద్ర భారతి, నంద కుమార్‌లు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సింహయాజి విడుదల
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసుకు సంబంధించి.. నిందితుడు సింహయాజి స్వామి ఇవాళ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యాడు. ఈ కేసులో A3నిందితుడిగా ఉన్న సింహయాజికి బెయిల్ దొరికిన విషయం తెలిసిందే. అయితే.. హైకోర్టు బెయిల్ మంజూరు చేసి వారం తర్వాత బుధవారం సింహయాజి విడుదల అయ్యాడు. షూరిటీలు చెల్లింపులో ఆలస్యం కావడంతో.. విడుదలకు ఆటకం ఏర్పడింది. ఇక ఈ కేసులో.. మరో ఇద్దరు నిందితులు జైల్లోనే ఉన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. ముగ్గురు నిందితులకు రామచంద్రళబారతి, నందకుమార్, సింహయాజులు కు వారం క్రితం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. కేసులు పెండింగ్‌లో ఉండటంతో రామచంద్ర భారతి, నంద కుమార్‌లు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. -
ఎమ్మెల్యేల కేసు: హైకోర్టులో హీటెక్కిన వాదనలు.. ఎవరిది పైచేయి?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. నిందితుల తరపు న్యాయవాది రేపు మరోసారి వాదనలు వినిపించనున్నారు. కాగా తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, సిట్ కాకుండా ఈ కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ.. హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టులో సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా.. బీజేపీ తరఫున మహేష్ జఠ్మలాని, సిట్ తరఫున దుశాంత్ దవే వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా.. బీజేపీ జఠ్మలాని.. - సిట్‌పై నమ్మకంలేదు.. సీబీఐ విచారణకు ఆదేశించాలి. - రాజకీయ లబ్ధి కోసం తప్పుడు కేసులు పెట్టారు. - కేసుతో సంబంధంలేని వారిని ఎఫ్ఐఆర్లో చేర్చారు అని అన్నారు. సిట్ దుశాంత్ దవే.. - డివిజన్ బెంచ్ ఆదేశాలు స్పష్టంగా ఉన్నా సీబీఐతో విచారణ జరిపించాలనడం సరికాదు. - ముగ్గురు నిందితులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో భాగంగా పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. కాగా, ఈ మెమోలో పోలీసులు.. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌ను నిందితులుగా చేర్చుతూ పిటిషన్ వేశారు. దీన్ని ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అయితే, ఈ కేసులో పీసీ యాక్ట్ ప్రకారం అక్కడ డబ్బు దొరకలేదు, ఘటన జరుగుతున్న సమయంలో నిందితులు అక్కడ లేరు. కానీ, పోలీసులు మాత్రం వారిని నిందితులుగా భావిస్తూ మెమో దాఖలు చేయడం పట్ల ఏసీబీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ మెమోను కొట్టివేసింది. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసుల మెమో కొట్టివేత
-
ఎమ్మెల్యేల కేసులో హైలైట్ ట్విస్ట్.. పోలీసులకు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాజకీయంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎన్నో ట్విస్టులు చోటుచేసుకోగా తాజాగా మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో భాగంగా పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. కాగా, ఈ మెమోలో పోలీసులు.. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌ను నిందితులుగా చేర్చుతూ పిటిషన్ వేశారు. దీన్ని ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అయితే, ఈ కేసులో పీసీ యాక్ట్ ప్రకారం అక్కడ డబ్బు దొరకలేదు, ఘటన జరుగుతున్న సమయంలో నిందితులు అక్కడ లేరు. కానీ, పోలీసులు మాత్రం వారిని నిందితులుగా భావిస్తూ మెమో దాఖలు చేయడం పట్ల ఏసీబీ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మెమోను కొట్టివేసింది. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వీరు ముగ్గురు బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్.. మొదటి నుంచి సిట్ విచారణను హాజరుకాలేదు. అంతేకాకుండా, తమపై పెట్టిన కేసులు కూడా తప్పుడు కేసులు అంటూ హైకోర్టులో పిటషన్లు దాఖలుచేయడంతో వారి మద్దతుగానే కోర్టు సైతం వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి తరుణంలో ఏసీబీ కోర్టు మెమోను కొట్టివేయడం ఆసక్తికరంగా మారింది. -
నందకుమార్‌కు బెయిల్ మంజూరు.. లాస్ట్‌లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే పలు సంచలన ట్విస్ట్‌లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ మరోసారి హైలైట్ అయ్యారు. మరోవైపు, తెలంగాణ పాలిటిక్స్‌లో నందకుమార్.. అన్ని పార్టీల నేతలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. నాంపల్లి కోర్టు నందకుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో నమోదైన ఫోర్జరీ కేసులో బెయిల్ మంజూరైంది. ఇదిలా ఉండగా, మరో కేసులో నందకుమార్‌పై పీటీ వారెంట్ ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో, నందకుమార్‌పై ఎన్ని కేసులు నమోదు అయ్యాయో వివరాలు ఇవ్వాలని పోలీసులను కోర్టు కోరింది. ఇక, ఎమ్మెల్యేలకు ఎర కేసు కేవలం టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే నడుస్తుందని భావించిన కాంగ్రెస్ పెద్దలను నందకుమార్ చాటింగ్ జాబితా టెన్షన్‌కు గురిచేస్తోంది. ఈ జాబితాలో తమ పార్టీ నేతల పేర్లు ఉండటంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. ఎమ్మెల్యేలతో సహా! నందు చాటింగ్ జాబితాలో తమ పార్టీ కీలక నేతలుండటం టీపీసీసీ వర్గాలను ఉలికిపాటుకు గురిచేస్తోంది. పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంథని, భద్రాచలం, సంగారెడ్డి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లాంటి నేతల పేర్లున్న నేపథ్యంలో పార్టీలో ఎంత మందిని టార్గెట్ చేశారనేది ఆసక్తికరంగా మారింది. వీరిలో ఒకరిద్దరు మినహా అందరూ పార్టీ విధేయులేనని, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడే ఆలోచన ఉన్న వారు కాదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అలాంటి నేతల పేర్లు కూడా నందు లిస్ట్‌లో ఉండటం చూస్తే పార్టీ కుంభస్థలాన్ని కొట్టేందుకే కొందరు కుట్రలు చేస్తున్నారనే అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. మొత్తంమీద నందు చిట్టా ఏ పరిణామాలకు దారితీస్తుందో, పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ముందస్తు నష్ట నివారణ చర్యలకు టీపీసీసీ పూనుకుంటుందో లేదో అన్న సందేహాలు కాంగ్రెస్ కేడర్‌లో తలెత్తుతున్నాయి. -
హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్ పిటిషన్
-
అప్పుడు సింహయాజీని కలిసిన కోదండరాం.. భేటీపై ఏమన్నారంటే?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు బీజేపీ నేతలకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కోర్టులో ఈ కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సింహయాజీతో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌కు సంబంధాలు ఉన్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వార్తలపై ప్రొఫెసర్ కోదండరామ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ.. నేను ఆరు నెలల క్రితం సింహయాజీని కలిసిన మాట వాస్తవమే. ఆయనను కేవలం ఆధ్యాత్మిక గురువుగానే కలిశాను. తిరుపతి నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువుగానే సింహయాజీని కలిశానని, సింహయాజీ రాజకీయ వ్యవహారాలు నడుపుతున్న విషయం అప్పట్లో తెలియదని కోదండరాం స్పష్టం చేశారు. ఇక, వీరి భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కోదండరామ్ వెల్లడించారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం సిట్ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. రూ. 3 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురి పాస్‌పోర్టులు పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయాలని తెలిపింది. -
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. 5 గంటల పాటు వాడీవేడిగా వాదనలు
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో హైకోర్టులో వాదనలు వాడీవేడిగా సాగాయి. కిక్కిరిసిన కోర్టు హాల్లో ఉదయం దాదాపు 11 గంటలకు ప్రారంభమైన వాదనలు.. భోజనం విరామం తరువాత.. సాయంత్రం 5 గంటల వరకు (5 గంటలు) కొనసాగాయి. న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి సుదీర్ఘ వాదనలను విన్నారు. తదుపరి విచార ణను ఈ నెల 6కు వాయిదా వేశారు. సిట్ దర్యాప్తునకు సహకరించాలని భారత్ ధర్మ జన సేన (బీడీజేఎస్) అధ్యక్షుడు తుషార్ వెల్లప్పల్లిను ఆదేశించారు. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఆయన్ను అరెస్టు చేయొ ద్దని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బీజేపీతో పాటు నిందితులు, 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు అందుకున్న వారు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. తొలుత వాదనలు ప్రారంభం కాగానే.. అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) రాంచంద్రరావు కౌంటర్ దాఖలు చేశారు. నిందితులకు బీజేపీ నేతలకు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణల ప్రతిని, ఆ పార్టీ పెద్దలతో నిందితులు దిగిన ఫొటోలను కోర్టుకు అందజేశారు. అలాగే కేసు కీలక ఆధారాల ను సిట్ సమరి్పంచింది. తర్వాత.. భారత్ ధర్మ జన సేన (బీడీజేఎస్) అధ్యక్షుడు తుషార్ వెల్లప్పల్లికి నోటీసులు ఇవ్వడంపై ఆయన తరఫు న్యాయవాది హెగ్డే అభ్యంతరం తెలిపారు. అనారోగ్యం కారణంగా హాజరుకాలేనని, తర్వాత వస్తానని చెప్పినా పట్టించుకోకుండా ఆయనపై లుక్ఔట్ నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. సిట్ నోటీసులను నిలుపుదల చేయాలని కోరారు. సిట్.. మీడియాకు లీకులిస్తోంది.. ముగ్గురు నిందితుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ వాదిస్తూ.. ‘ఏ కేసులోనైనా దర్యాప్తు పారదర్శకంగా, నిజాయతీగా జరగాల్సిన అవసరం ఉంది. కానీ, ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ, దర్యాప్తు అలా సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే సిట్ పనిచేస్తోంది. ఫామ్‌హౌస్ ఘటన జరిగిన రోజే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. తెలంగాణ హైకోర్టుతో పాటు ఇతర హైకోర్టులకు దర్యాప్తు సీడీలు, ఇతర వివరాలు సీఎం పంపారు. దర్యాప్తు.. ఏ అంశమైనా బయటకు పొక్కనీయకుండా విచారణ సాగించాలి. కానీ, కీలక సమాచారం మీడియాకు లీక్ చేస్తున్నారు. దర్యాప్తు ఎలా జరగాలనే విషయంపై పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. ఈ కేసులో పలు ఉల్లంఘనలు జరిగాయి. సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించాలి’ అని న్యాయమూర్తిని కోరారు. సీబీఐ విచారణ అవసరం లేదు... ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని, సీబీఐకి అప్పగిస్తే వీగిపోవడం ఖాయమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు చేసిన కొన్ని కేసులు వీగిపోయిన ఉదంతాలను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. ‘ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం తీవ్ర నేరం. ఈ కేసును ఎంతో వేగంగా చేయాల్సిన అవసరం ఉంది. ఐపీఎస్‌లు కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తారు. వారు రాజకీయ ఒత్తిడులకు తలొగ్గే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది అనడానికి ఆధారాలు లేవు. ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న వీడియోలు, వాయిస్ రికార్డులు సీజే, ఇతరులకు పంపడం తప్పే. ఈ విషయంలో క్షమాపణలు చెప్పాం. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే కుట్ర జరిగింది. బీజేపీకి సంబంధం లేదంటూనే నిందితుల తరఫున పిటిషన్లు వేస్తున్నారు. ఈ వ్యవహారంలో కేసు నమోదైన మరుక్షణం నుంచి బలహీనం చేసే ప్రయత్నం జరుగుతోంది. గడిచిన కొన్నేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవాలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. పారీ్టగానీ, ప్రభుత్వంగానీ ప్రమాదంలో పడినప్పుడు పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా స్పందించే హక్కు ఆయనకు ఉంటుంది. అందులో భాగంగానే మీడియా భేటీలో ప్రజలకు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదు’అని నివేదించారు. తమ వద్ద ఆధారాలున్నాయంటూ సిట్ అందరికీ నోటీసులు ఇస్తూ పోతోందని, అవేంటో కోర్టుకు కూడా చెప్పడం లేదని బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది ప్రభాకర్ పేర్కొన్నారు. సైబరాబాద్ సీపీ మీడియాకు వివ రాలు వెల్లడించారని, పోలీసుల విచారణ వద్దన్నందుకు.. అదే పోలీస్ ఉన్నతాధికారులతో సిట్ ఏర్పా టుచేయడం సమంజసమా.. అని ప్రశ్నించారు. ఇక, న్యాయవాది శ్రీనివాస్ తరఫున సీనియర్ న్యాయ వాది ఉదయ హోల్లా వాదనలు వినిపించారు. చదవండి: మంత్రి గుంగుల ఇంటికి సీబీఐ బృందం.. ఢిల్లీకి రావాలని సమన్లు -
ఎమ్మెల్యే కొనుగోలు కేసులో వాడీ వేడీగా సాగిన వాదనలు
-
ఎమ్మెల్యేల కేసు: హైకోర్టులో హీటెక్కిన విచారణ.. ఏం జరిగిందంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం.. పోలీసు శాఖతో సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, కేసు దర్యాప్తులో భాగంగా సిట్ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఇక, ఈ నోటీసులపై బీజేపీ నేతలు హైకోర్టు ఆశ్రయించి ఊరట పొందారు. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే, కోర్టులో ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్న బీజేపీ పిటిషన్‌పై వాడివేడి వాదనలు జరిగాయి. విచారణ సందర్భంగా.. బీజేపీ తరఫున మహేష్ జఠ్మలానీ.. - సిట్‌పై మాకు నమ్మకం లేదు. - సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. సిట్ తరఫున దుష్యంత్ దవే.. - ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీవ్రమైన నేరం. - బీజేపీకి సంబంధం లేదంటారు.. నిందుతల తరఫున కేసులు వేస్తారు. - బీజేపీ అనేక చోట్ల ప్రభుత్వాలను పడగొట్టింది. - తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడమే ధ్యేయంగా కుట్ర జరిగింది. - ఎమ్మెల్యేల కొనుగోలుపై పక్కా ఆధారాలున్నాయన్నారు. ఇక, అంతుకుముందు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని కామెంట్స్ చేశారు. దీంతో, కోర్టు విచారణనున రేపటి(గురువారాని)కి వాయిదా వేసింది. -
ఎమ్మెల్యేల కేసులో సిట్‌కు ఎదురుదెబ్బ.. తుషార్‌కు భారీ ఊరట!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు ఊరట లభించగా.. తాజాగా తుషార్‌కు సైతం ఉపశమనం కలిగింది. తుషార్ వ్యవహారంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తుషార్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే సిట్ విచారణకు తుషార్ సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక, విచారణ సందర్భంగా సిట్ అధికారులు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి నిందితుల జాబితాలో తుషార్ పేరు చేర్చారని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 41ఏ సీఆర్పీసీపై రిప్లై ఇవ్వకుండా లుక్ ఔట్ నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కోర్టు.. తుషార్‌ను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఈ కేసులో తుషార్‌కు ఊరట లభించింది. మరోవైపు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ దర్యాప్తు జరపాలన్న బీజేపీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ తరఫున మహేష్ జఠ్మలానీ, ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్, సిట్ తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తున్నారు. -
ఎమ్మెల్యేలకు ఎర కేసు.. విచారణలో నందు పొంతనలేని సమాధానాలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు కొర్రె నందుకుమార్ పోలీస్ విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో పోలీసులు అతడిని మంగళవారం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్, నిర్మాత దగ్గుబాటి సురేష్‌లకు చెందిన ప్లాట్లను లీజు పేరుతో తీసుకొని దుర్వినియోగం చేసిన కేసులో నందుకుమార్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు బంజారాహిల్స్ పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఇందులోభాగంగా పోలీసులు మంగళవారం నందుకు 22 ప్రశ్నలు సంధించారు. తొలుత మీ సొంతూరు ఏది అని ప్రశ్నించగా పరిగి, ఎల్బీనగర్, చైతన్యపురి అని నిర్లక్ష్యంగా చెప్పినట్లుగా తెలిసింది. నీ వృత్తి ఏంటన్న ప్రశ్నకు.. హోటల్ బిజినెస్ అని చెప్పినట్లు సమాచారం. మొదటగా అంబర్‌పేట్‌లో సీజన్ పేరుతో హోటల్ నడిపినట్లు చెప్పారు. ఫిలింనగర్లో డెక్కన్ కిచెన్ హోటల్ ఎలా వచ్చిందని ప్రశ్నించగా 2016 డిసెంబర్లో డబ్లూ3 పేరుతో హోటల్ లీజుకు తీసుకున్నానని, అనంతరం దక్కన్ కిచెన్‌గా మార్చానని బదులిచ్చారు. డెక్కన్ హోటల్‌కు ఎవరెవరు వచ్చే వారు? సదరు ఎమ్మెల్యేలు ఎలా తెలుసు? రామచంద్ర మూర్తితో పరిచయం ఎలా జరిగింది అని ఆరా తీసినట్లు సమాచారం. డబ్లూ 3 హాస్పిటాలిటీకి ప్రమోద్ కుమార్ రాజీనామా చేయగానే తాను ఎండీగా కొనసాగినట్లు చెప్పారని తెలిసింది. అభిషేక్‌కూడా 2017లోనే డైరెక్టర్‌గా తప్పుకున్నారన్నారు. దక్కన్ కిచెన్ పేరుతో 6 లక్షలు వసూలు చేసినప్పుడు ఏదైనా డాక్యుమెంటేషన్ ఉందా అని ప్రశ్నించగా అలాంటిదేమి లేదని తెలిపారు. ఈ ప్రాపర్టీని ఎందుకు తీసుకున్నావన్న ప్రశ్నకు.. వ్యాపారనిమిత్తం తీసుకున్నట్లు చెప్పారు. ఏ వ్యాపారం కోసం తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఐస్‌క్రీం షాపులు, మిల్క్‌షేక్ కౌంటర్లు ఏర్పాటు చేశానన్నారు. దక్కన్ కిచెన్ ప్రొప్రైటర్లు ఎలా పరిచయం అని ప్రశ్నించగా వారే తనను సంప్రదించారని చెప్పినట్లు తెలిసింది. కామన్ ఫ్రెండ్ సురేష్‌రెడ్డి ద్వారా ప్రమోద్ కుమార్ పరిచయమైనట్లు చెప్పారు. ఈ హోటల్ ద్వారా పది శాతం రెవెన్యూ వాటా పొందుతున్నానని, ప్రస్తుతం డైరెక్టర్లుగా కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్నారావు, ఆవుల అభిషేక్ ఉన్నారని తెలిపినట్లు సమాచారం. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో కీలక పరిణామం -
ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో వెలుగులోకి వస్తున్న అనుమానితులను 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి, విచారిస్తున్న సంగతి తెలిసిందే. ముందస్తు అనుమతి, సహేతుక కారణం లేకుండా విచారణకు గైర్హాజరైతే అరెస్టు చేసేందుకు సిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ మెయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఉన్న సమయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ప్రధాన నిందితుడు రామచంద్రభారతితో కేరళ వైద్యుడు కొట్టిలిల్ నారాయణ జగ్గు అలియాస్ జగ్గు స్వామి ఫోన్ సంభాషణలు రికార్డయ్యాయి. రామచంద్రభారతి తన ఫోన్లో జగ్గు స్వామికి ‘విటమిన్ సీ’ సిద్ధం చేయాలని సందేశం పంపినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. కస్టడీలో నిందితులు వెల్లడించిన వివరాల మేరకు.. జగ్గు స్వామిని విచారించేందుకు సిట్ సభ్యురాలు, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ బృందం కేరళకు వెళ్లగా.. ఆయన అమృత ఆసుపత్రి నుంచి పరారయ్యారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాడు. దీంతో సిట్ అధికారులు సాక్ష్యులైన జగ్గు స్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్ లకు 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. నోటీసులు ప్రకారం వీరంతా సిట్ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉండగా... వైద్య కారణాల నేపథ్యంలో హాజరుకాలేకపోతున్నానని మణిలాల్ సిట్ అనుమతి కోరగా.. మిగిలిన ముగ్గురు అనుమానితులు సిట్ ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరయ్యారు. దీంతో తీవ్రంగా పరిగణించిన సిట్ బృందం వారిని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతుందని భావించిన జగ్గు పీఏలు శరత్, ప్రశాంత్, విమల్ కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు సమాచారాన్ని అక్కడి న్యాయాధికారి సిట్ విచార ణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్‌కు సమాచారం అందించారు. దీంతో తదుపరి కార్యాచరణపై సిట్ ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్లు తెలిసింది. చదవండి: Malla Reddy: రూ.వందకోట్ల డొనేషన్లు ఎక్కడ దాచారు? -
ఎమ్మెల్యేలకు ఎర కేసు: ‘బండి సంజయ్ పేరు చెప్పాలని వేధిస్తున్నారు ’
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరు చెప్పాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తీవ్రంగా వేధిస్తోందని న్యాయవాది భూసారపు శ్రీనివాస్ ఆరోపించారు. సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్టవిరుద్ధమన్నారు. ఆ జీవోను రద్దు చేయాలని కోరారు. సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరయ్యానని, మూడు రోజులపాటు కేవలం సంజయ్ పేరు చెప్పాలని ఒత్తిడి చేశారన్నారు. సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగడం లేదని వెల్లడించారు. ఈ మేరకు సిట్ దర్యాప్తు ఆపి, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ అధికారులు, సీబీఐ, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, రామచంద్రభారతి, సింహయాజీ, నందుకుమార్, సీవీ ఆనంద్‌తోపాటు ఇద్దరు సిట్ సభ్యులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో సిట్ ఎదుట హాజరయ్యానని.. రాజేంద్రనగర్ ఏసీపీ, అధికారులు రమా రాజేశ్వరి, కమళేశ్వర్‌లు బండి సంజయ్, కొందరు బీజేపీ ముఖ్య నేతల పేర్లు చెప్పాలని రోజంతా తీవ్ర ఒత్తిడి తెచ్చారన్నారు. వారు కోరిన విధంగా చెప్పేందుకు నిరాకరిస్తే.. తనను నిందితుడిగా(ఏ7)గా పేర్కొంటూ మెమో జారీ చేస్తామని బెదిరించారన్నారు. ఈ విషయాన్ని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సీవీ ఆనంద్‌కు చెప్పినా పట్టించుకోలేదని నివేదించారు. విచారణవీడియోను హైకోర్టుకు సమరి్పంచాలని కోరినా.. 23నాటి∙విచారణలో అధికారులు కోర్టుకు అందజేయలేదని చెప్పారు. వీటిని పరిగణనలోకి తీసుకుని సిట్ దర్యాప్తు ఆపాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: హైదరాబాద్‌లో నీరా కేఫ్ రెడీ -
ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐకి అప్పగించాలని తుషార్ పిటిషన్
హైదరాబాద్: సిట్ దర్యాప్తు చేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలని కేరళ బీడీజెస్ అధ్యక్షుడు తుషార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తుపై స్టే ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్లో సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా తుషార్ పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయ అజెండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తోందని పిటిషన్లో పేర్కొన్న తుషార్.. ఈనెల 21న విచారణకు రావాలని 16వ తేదీన తనకు 41ఏ నోటీసులు ఇచ్చారని పిటిషన్లో తెలిపారు. అనారోగ్యం కారణంగా వైద్యుల సూచనల మేరకు రెండు వారాలు గడువు కోరినట్లు పేర్కొన్న తుషార్.. తన మెయిల్‌కు రిప్లై ఇవ్వకుండా లుక్ అవుట్ నోటీసులు ఇవ్వడంలో రాజకీయ దురద్దేశం కనబడుతుందన్నారు. -
అదంతా కేసీఆర్ డ్రామా.. నడ్డాకు చెప్పిన రాష్ట్ర బీజేపీ నేతలు..
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారు. శుక్రవారం పారీ్టలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి చేరిక అనంతరం ఆయనతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నడ్డాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల ఎర అంశం చర్చకు వచ్చింది. దీనిపై వివరణ ఇచ్చిన రాష్ట్ర నేతలు, ఇదంతా సీఎం కేసీఆర్ డ్రామా అని స్పష్టం చేశారు. ప్రజాబలంలేని పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి, వారితో డ్రామా ఆడించారని, నాటకం బయట పడకుండా ఎమ్మెల్యేలని ప్రగతిభవన్ బయటకు కూడా రానివ్వడం లేదని విశదీకరించారు. సీఎం ఫాంహౌస్‌లో ఉంటే ఎమ్మెల్యేలను అక్కడే ఉంచుతున్నారని, వారిని మీడియా ముందు మాట్లాడనివ్వడంలేదని చెప్పుకొచ్చారు. సరిగ్గా ఇదే సందర్భంలో నడ్డా ‘ఫాంహౌస్ ముఖ్యమంత్రిని ఇకపై అక్కడే కూర్చోనిద్దాం’అని అన్నట్లుగా బీజేపీ నేతలు చెబుతున్నారు. డిసెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయమై కేంద్రాన్ని నిలదీసే అవకాశముందని కొందరు నేతలు నడ్డా దృష్టికి తెచ్చారు. అసెంబ్లీలో బీజేపీకి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, మాట్లాడితే సస్పెండ్ చేస్తున్నారని వివరించారు. ఇందుకు నడ్డా స్పందిస్తూ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే అసెంబ్లీ బయట సీఎం తీరును ఎండగట్టాలని, ఆయన చేసిన ప్రతి ఆరోపణలకు గట్టిగా జవాబివ్వాలని నేతలను ఆదేశించారు. చదవండి: ‘ముందస్తు’ ప్రచారం.. కమలం అప్రమత్తం -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. బీఎల్ సంతోష్‌కు ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో బీజేపీ కీలక నేత, కర్ణాటకకు చెందిన సీనియర్ పొలిటీషియన్ బీఎల్ సంతోష్‌కు ఊరట లభించింది. సిట్ నోటీసులపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. అంతేకాదు.. విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. సిట్ నోటీసులను సవాల్ చేస్తూ బీఎల్ సంతోష్ ఇవాళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన క్వాష్ పిటిషన్లో.. సిట్ నోటీసులను రద్దు చేయాలని కోరారు. రోహిత్‌రెడ్డి చేసిన ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆయన తరపు న్యాయవాది. అంతేకాదు ఎఫ్ఐఆర్లో పేరు లేనప్పుడు.. ఆయన్ని నిందితుల జాబితాలో ఎలా చేరుస్తారని బీఎల్ సంతోష్ తరపు న్యాయవాది అభ్యంతరం లేవనెత్తారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. సిట్ నోటీసులపై స్టే విధించింది. అంతకు ముందు.. ఫాంహౌజ్ కేసులో మరో దఫా బీఎల్ సంతోష్‌కు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో.. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసింది. -
Telangana: ఫాంహౌజ్ కేసు.. హైకోర్టుకు నిందితులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో ఇవాళ(శుక్రవారం) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫాంహౌజ్ కేసులో నిందితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలు బెయిల్ కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే నిందితుల బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అయితే.. ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును నిందితులు ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్‌పై రేపు(శనివారం) విచారణ సాగనుంది. -
నిందితులను కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: నిందితుల జాబితాలో ‘ఆ నలుగురు’
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటివరకూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక సూత్రధారుల్ని నిందితుల జాబితాలో చేర్చింది సిట్. ఏ-4గా బీఎల్ సంతోష్, ఏ-5గా తుషార్, ఏ-6గా జగ్గుస్వామి, ఏ-7గా న్యాయవాది శ్రీనివాస్‌లను నిందితుల జాబితాలో చేర్చింది. అదే సమయంలో సిట్ స్వర నమూల నివేదిక సిట్ చేతికి అందింది. మరొకవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. వారం రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో సిట్ నోటీసులు సవాల్ చేస్తూ నందు భార్య చిత్రలేఖ, న్యాయవాది ప్రతాప్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిలో భాగంగా చిత్రలేఖ, ప్రతాప్‌లను అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు.. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. కస్టడీ పిటిషన్ వాదనలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి నిందితుల కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు బుధవారంతో ముగిశాయి. ఈ కేసులో నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇవాళ్టితో వాదనలు పూర్తి కావడంతో.. కస్టడీ పిటిషన్‌పై రేపు(గురువారం) ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ నవంబర్ 30వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు ‘ఎర’ కేసు.. సంతోష్‌కు మళ్లీ నోటీసులు! -
ఎమ్మెల్యేలకు ‘ఎర’ కేసు.. హైకోర్టులో బీజేపీకి ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టులో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు మరోసారి నోటీసులివ్వాలని సిట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపాలని తెలిపింది. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. అంతకముందు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు విచారణ తిరిగి ప్రారంభించింది. హైకోర్టు బెంచ్ ముందుకు సుప్రీంకోర్టు తీర్పు కాపీ చేరింది. బీజేపీ తరపున మహేష్ జెఠ్మలానీ వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. సుప్రీంకోర్టు ఎక్కడా దర్యాప్తుపై స్టే ఇవ్వలేదని ఈ సందర్భంగా ఏజీ కోర్టుకు తెలిపారు. కేసుతో సంబంధం ఉన్నవాళ్లు ఎవరైనా నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు బీఎల్ సంతోష్ సహకరించడం లేదని, 41ఏ సీఆర్పీసీ ప్రకారం విచారణకు సహకరించాలని కోరినట్లు తెలిపారు. బీఎ సంతోష్ గుజరాత్ ఎన్నికల్లో బిజీగా ఉన్నాడని మహేష్ జెఠ్మలానీ కోర్టుకు తెలిపారు. ఎప్పటి వరకు సమయం కావాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 29న నివేదిక సమర్పించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్డర్ ఉందని ఏజీ పేర్కొన్నారు. బీఎల్ సంతోష్ విచారణకు హాజరు కానీ నేపథ్యంలో విచారణ ఆలస్యం అవుతుందన్నారు. తదుపరి చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. చదవండి: మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు: రఘునందన్ రావు