
చంచల్‌గూడ (హైదరాబాద్): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు రామచంద్రభారతి శుక్రవారం చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న అతను కొద్దిరోజుల కిందట బెయిలుపై విడుదల కాగానే నకిలీ పాస్‌పోర్టు కేసులో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. దీంతో అతను తిరిగి ఈ నెల 22వ తేదీన జైలుకు వచ్చాడు. ఎట్టకేలకు మరలా అతనికి బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదలయ్యాడు.