సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై విచారణ జరుగనుంది. కాగా, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది.
ఇక, ఈ కేసు విషయమై పిటిషన్‌లో భాగంగా హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ప్రభుత్వం కోరింది. మరోవైపు.. సీఎం కేసీఆర్ ఈ కేసుకు సంబంధించి వీడియో ఫుటేజ్‌ను పెన్ డ్రైవ్‌లో అన్ని రాష్ట్రాలకు, జడ్జీలకు పంపించారు. కాగా, ప్రాథమిక సాక్ష్యాధారాలు లీక్ కావడంతో హైకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.
అయితే, ప్రభుత్వం మాత్రం.. బీజేపీ నేతలే నిందితులుగా ఉన్న కేసును కేంద్ర సంస్థ సీబీఐకి అప్పగించడం వల్ల అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదని చెబుతోంది. ఈ కేసుపై మంత్రి కేటీఆర్ కూడా స్పందిస్తూ.. కెమెరాల సాక్షిగా బీజేపీ కుట్ర బయటపడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment