
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు బీజేపీ నేతలకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కోర్టులో ఈ కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది.
ఇదిలా ఉండగా.. ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సింహయాజీతో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌కు సంబంధాలు ఉన్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వార్తలపై ప్రొఫెసర్ కోదండరామ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ.. నేను ఆరు నెలల క్రితం సింహయాజీని కలిసిన మాట వాస్తవమే. ఆయనను కేవలం ఆధ్యాత్మిక గురువుగానే కలిశాను. తిరుపతి నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువుగానే సింహయాజీని కలిశానని, సింహయాజీ రాజకీయ వ్యవహారాలు నడుపుతున్న విషయం అప్పట్లో తెలియదని కోదండరాం స్పష్టం చేశారు. ఇక, వీరి భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కోదండరామ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment