కేయూ క్యాంపస్: పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వరంగల్‌కు అన్యాయం జరిగిందని, గోదావరి నీళ్లు వరంగల్ వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం రాత్రి హన్మకొండలో జరిగిన టీజేఎస్ ధూంధాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చంపల్లి, ఎల్లంపల్లి, తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీలు కడితే బాగుండేదని, దీంతో రూ.40 వేల కోట్లు మిగిలేవని అన్నారు. అలా కాకుండా పాలకులు తమ ఇష్టానుసారంగా నిర్మిస్తుండటంతో వరంగల్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాని పరిస్థితి ఉందన్నారు. దేవాదుల ప్రాజెక్టు ఉన్నా ఆ నీరు కూడా వరంగల్‌కు రావడం లేదన్నారు. ఎంతోమంది బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఏమిచేశారని ప్రశ్నించారు.
టీఆర్‌ఆస్ పాలనకు చరమగీతం పాడాలి ..
ఆలేరు: నిరంకుశ పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత వలసబాట పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలేరు నియోజకవర్గం నుంచి టీజేఎస్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.
ప్రాజెక్టుల్లో వరంగల్‌కు అన్యాయం
Published Mon, Nov 5 2018 1:57 AM | Last Updated on Mon, Nov 5 2018 1:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment