సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు ఊరట లభించగా.. తాజాగా తుషార్‌కు సైతం ఉపశమనం కలిగింది. తుషార్ వ్యవహారంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తుషార్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే సిట్ విచారణకు తుషార్ సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక, విచారణ సందర్భంగా సిట్ అధికారులు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి నిందితుల జాబితాలో తుషార్ పేరు చేర్చారని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 41ఏ సీఆర్‌పీసీపై రిప్లై ఇవ్వకుండా లుక్ ఔట్ నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కోర్టు.. తుషార్‌ను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఈ కేసులో తుషార్‌కు ఊరట లభించింది.
మరోవైపు.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ దర్యాప్తు జరపాలన్న బీజేపీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ తరఫున మహేష్ జఠ్మలానీ, ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్, సిట్ తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment