సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఇప్పటికే పలు మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో విషయంలో హైకోర్టు కూడా ట్విస్ట్ ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
కాగా, ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించాయి. వాదన సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది దవే.. లిఖితపూర్వక వాదనలకు అనుమతివ్వాలని కోర్టును కోరారు. దీంతో, ఈనెల 30వ తేదీ లోపు లిఖితపూర్వకంగా వాదనలు ఇవ్వాలని కోర్టు సూచించింది. ఇక, ఎమ్మెల్యేల కేసును సీబీఐకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ ఎపిసోడ్‌కు సంబంధించి అంతకు ముందు కోర్టు సింగిల్ బెంచ్ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పును ఇచ్చింది. కాగా, సింగ్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment