reserved
-
కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. సోమవారం కేజ్రీవాల్, సీబీఐ తరఫు లాయర్లు తమ వాదనలు వినిపించారు. ‘ఎక్సైజ్ కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్. ఆయన్ను విడుదల చేస్తే సాకు‡్ష్యలను ప్రభావితం చేస్తారు. ఆయన అరెస్టయితేనే ఈ కేసు విచారణ ముగింపునకు వస్తుంది. నెలలోగా చార్జిషిటు వేస్తాం’అని సీబీఐ లాయర్ డీపీ సింగ్ తెలిపారు. కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు రాకుండా చేసేందుకే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని ఆయన తరఫు సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఊహాకల్పనలతోనే కేజ్రీవాల్‌కు అరెస్ట్ చేశారే తప్ప, ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఎటువంటి ఆధారాలు లేవన్నారు. వాదనలు విన్న అనంతరం జస్టిస్ నీనా బన్సన్ కృష్ణ తీర్పును రిజర్వులో ఉంచుతూ ఆదేశాలిచ్చారు. ఆఖరి చార్జిషీటు అంతకుముందు, సీబీఐ అధికారులు మద్యం కుంభకోణం కేసులో ఆఖరి చార్జిషిటును రౌజ్ అవెన్యూ కోర్టులో దాఖలు చేశారు. ఇందులో సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌తోపాటు అరబిందో ఫార్మా డైరెక్టర్ పి.శరత్ చంద్రారెడ్డి, బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అమిత్ అరోరా, హవాలా ఆపరేటర్ వినోద్ చౌహాన్, వ్యాపారవేత్త ఆశిష్ మాథుర్పేర్లున్నాయి. -
రేపు మళ్లీ జైలుకు కేజ్రీవాల్..కోర్టులో నో రిలీఫ్
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పొడిగింపుపై ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ఎవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. జూన్ 5న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. దీంతో కేజ్రీవాల్ రేపు(జూన్2) తీహార్ జైలులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం అత్యున్నత కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న కేజ్రీవాల్ తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ రౌస్ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం(జూన్1) విచారణ జరిగింది. విచారణ సమయంలో కేజ్రీవాల్ మధ్యంత బెయిల్ పొడిగింపును ఈడీ వ్యతిరేకించింది. -
48 ఉచిత బస్ సీట్లు రిజర్వు చేస్తారా !
కర్ణాటక: నగరంలోని బ్యాడరహళ్లికి చెందిన సునంద అనే వృద్ధురాలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా 48 సీట్లు రిజర్వు చేస్తారా? అని ప్రశ్నించగా సిబ్బంది ఆశ్చర్యపోయారు. వివరాలు.. ఆమె మెజస్టిక్ కేఎస్ ఆర్టీసీ బస్టాండుకు వచ్చి, ఒక బస్సులో 48 సీట్లను రిజర్వు చేసుకోవచ్చా అని అధికారులను విచారించారు. ఉచిత ప్రయాణ వసతి ఉన్నందున 4–5 రోజుల పాటు దైవక్షేత్రాలను చూడాలని తలచింది. కుటుంబసభ్యులు, మహిళా సంఘానికి చెందిన 20 మందిని కలుపుకొని మొత్తం 48 మంది మహిళలు ప్రయాణిస్తామని, సీట్లు రిజర్వు చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఉచిత బస్సుల్లో రూ.20 చెల్లించి ముందస్తుగా సీట్లు రిజర్వు చేసుకోవచ్చు. ఇదే మాదిరిగా రిజర్వు చేసుకోవచ్చా అని ఆమె అడిగారు. అధికారులు పలు కారణాలు చెప్పి అన్ని సీట్లు లేవని సమాధానమిచ్చారు. దీంతో ఆమె నిరాశగా వెనుదిరిగారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: తీర్పు రిజర్వ్ చేసి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఇప్పటికే పలు మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో విషయంలో హైకోర్టు కూడా ట్విస్ట్ ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించాయి. వాదన సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది దవే.. లిఖితపూర్వక వాదనలకు అనుమతివ్వాలని కోర్టును కోరారు. దీంతో, ఈనెల 30వ తేదీ లోపు లిఖితపూర్వకంగా వాదనలు ఇవ్వాలని కోర్టు సూచించింది. ఇక, ఎమ్మెల్యేల కేసును సీబీఐకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి అంతకు ముందు కోర్టు సింగిల్ బెంచ్ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పును ఇచ్చింది. కాగా, సింగ్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. -
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలని దాఖలైన కేసులో హైకోర్టు తీర్పు రిజర్వులో పెట్టింది. ఈ కేసులో వాద, ప్రతివాదనలు ముగియడంతో త్వరలో తీర్పును వెలువరిస్తామని పేర్కొంది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితో పాటు నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజి, న్యాయవాది బి.శ్రీనివాస్, తుషార్ వెల్లపల్లి ఇతరులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. ఈ కేసును ఏసీబీ అధికారులు మాత్రమే విచారణ చేయాలని.. లా అండ్ ఆర్డర్ పోలీసులకు, సిట్‌కు ఆ అధికారం లేదని బుధవారం బీజేపీ తరఫున హాజరైన జె.ప్రభాకర్ వాదనలు వినిపించారు. గురువారం మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ సూచన మేరకు లేదా వ్యక్తులు ఫిర్యాదు చేసినప్పుడు పబ్లిక్ సర్వెంట్‌పై విచారణ చేసే అధికారం లా అండ్ ఆర్డర్ పోలీసులకు కూడా ఉంటుందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ కేసును తప్పనిసరిగా ఏసీబీనే దర్యాప్తు చేయాల్సి ఉందా అని ప్రశ్నించారు. దీనికి ఏజీ బదులిస్తూ.. అలాంటిదేమీ లేదని అన్నారు. మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత దాన్ని సిట్‌కు బదలాయించారని చెప్పారు. ‘ప్రభుత్వం పూర్తి అధికారాలిస్తూ సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏసీబీ, లా అండ్ ఆర్డర్ కేసులను ఏదైనా సిట్ దర్యాప్తు చేయవచ్చు. ఆ మేరకు సిట్‌కు అన్ని అధికారాలు ఉన్నాయి. సిట్ దర్యాప్తు నిబంధనలకు అనుగుణంగా జరుగుతోంది. నిందితులు విచారణకు సహకరించడం లేదు. కేసులు వేస్తూ తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారు. ఈ కేసులో పలువురు మధ్యంత పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని పట్టించుకోకుండా ప్రధాన పిటిషన్‌పై విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పాలి’అని కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, మధ్యంతర పిటిషన్లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే శుక్రవారం తమ దృష్టికి తేవాలన్నారు. ప్రధాన పిటిషన్లపై తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, అక్టోబర్ 27న ప్రధాన పిటిషన్ దాఖలైంది మొదలు ఇప్పటివరకు వాదప్రతివాదనలు వాడీవేడిగా సాగాయి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సైతం హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. కేసును సీబీఐకి అప్పగించాలని, సిట్ స్వేచ్ఛగా, పారదర్శకంగా దర్యాప్తు చేయడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు.. సిట్ దర్యాప్తును అడ్డుకోవద్దని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు న్యాయమూర్తిని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు -
హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక లేదా?.. హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనం ఆంక్షలపై ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. వినాయక నిమజ్జనంపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. నిమజ్జనం సమస్యలపై తెలంగాణ ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుంది అంటూ వ్యాఖ్యానించింది. విచారణకు 10 నిమిషాల ముందు నివేదిక ఇస్తే ఎలా అని జీహెచ్ఎంసీపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక లేదా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీబీ మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవడంలేదని హైకోర్టు ప్రశ్నించింది. జనం గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీలో 48 చెరువులు, కొలనుల్లో నిమజ్జనం ఏర్పాట్లు చేశామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నామని, లక్ష విగ్రహాలు ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. సలహాలు కాదు.. చర్యలు, స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని హైకోర్టు సూచించింది. నిమజ్జనం ఆంక్షలు, నియంత్రణపై తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. ఇవీ చదవండి: వీడని మిస్టరీ: జయశీల్‌రెడ్డి ఏమయ్యారు? తెలంగాణలో 65 వేల ఖాళీలు భర్తీ చేసేలా.. -
చూపురేఖలు
కొత్త భావనలకు పాతవి ఎప్పుడూ సహాయ నిరాకరణగానే ఉంటాయి. ఆ మాత్రం ఒరిపిడి లేకుంటే మార్పు పరిపూర్ణం కాదు కూడా. కాలానికి తగ్గట్టు చూపూ ఉంటే బొట్టుందా, భుజాలపైకి కత్తిరించిన జుట్టుందా అని కళ్లు వెతుక్కోవు. మాధవ్ శింగరాజు మన దగ్గర సిటీ బస్సుల్లో స్త్రీలకు కేటాయించిన సీట్లకు పసుపు రంగు ఉంటుంది. సీట్ల రాడ్లకు, సీటు వెనుక భాగానికీ పూసి ఉండే ఆ పసుపు రంగును బట్టి అవి స్త్రీల సీట్లని తేలిగ్గా గుర్తించవచ్చు. అదొక్క గుర్తే కాదు. కిటికీ పైన ‘స్త్రీలు’ అని రాసి ఉంటుంది. అది మాత్రమే కాదు. స్త్రీ బొమ్మ కూడా గీసి ఉంటుంది. ఇన్ని ఉన్నా ఆ స్త్రీల సీట్లలో కూర్చునే ‘స్త్రీలు కాని వాళ్లు’ ఉండనే ఉంటారు. స్త్రీల సీట్లను పసుపురంగుతో సూచించడం, స్త్రీల చిత్రాన్ని గియ్యడం, ‘స్త్రీలకు మాత్రమే’ అని రాయడం ఏళ్లుగా ఒక పద్ధతిలా వస్తోంది. బస్సులు, రైళ్లలోనే కాదు.. స్త్రీలకు ప్రత్యేకం అని సూచించవలసిన ప్రతి చోటా ఏదో ఒక రంగు ‘అటువైపు వెళ్లకండి’ అని మగవాళ్లకు చెబుతూనే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పసుపు, ఇంకొన్ని ప్రాంతాల్లో పింక్. రంగైతే చదువులేని వాళ్లకు కూడా సూచనను వెంటనే అర్థం చేయిస్తుంది. (అదీ అర్థం కానివాళ్లకు స్త్రీ చిత్రం ఎలాగూ ఉంటుంది). అయితే ఈ రంగుల ఇండికేషన్ కూడా కొంతమందికి నచ్చడం లేదు. స్త్రీలకు పింక్ ఏమిటి? అసలు రంగేమిటి? అనే మాట వినిపిస్తోంది కొన్నాళ్లుగా. మన దగ్గరికింకా ఆ వాదన రాలేదు. వస్తే, పసుపు రంగేమిటి? స్త్రీలంటే పసుపూ కుంకుమలేనా ఏమిటి అనే అవకాశమైతే ఉంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో జెండర్ సైనేజ్‌లను తొలగించడం మొదలైంది. సైనేజ్లంటే.. ఇది ఆడవాళ్లకు, ఇది మగవాళ్లకు అని సూచించే స్త్రీ, పురుషుల సంకేత చిత్రాలు. మనం మరీ అంతగా.. లైంగికస్పృహ లేనంతగా.. మనుషులంతా ఒక్కటే అన్నంతగా ‘మానవీకరణ’ చెందలేదు. స్త్రీని మనం చూసే దృష్టి ఒకటి ఉంటుంది కదా, అలా చూడ్డానికే అలవాటు పడి ఉన్నాం. దృష్టి అంటే నేత్రదృష్టి కాదు. మనోదృష్టి. అమ్మ బొమ్మ గియ్యమంటే పిల్లలు గుండ్రంగా ఒక సర్కిల్ గీసి, రెండు కళ్లు, రెండు చెవులు, ముక్కు వేసి, చక్కగా పాపిట తీసి, నుదుటి మధ్యలో బొట్టు పెట్టేస్తారు. చెవులకు రింగులు పెడతారు. నార్త్ పిల్లలైతే అమ్మ తల చుట్టూ చీర కొంగు కప్పుతారు. పెద్దవాళ్లమంతా కూడా పిల్లలుగా ఉండి ఎదిగినవాళ్లమే కాబట్టి భారతీయ స్త్రీమూర్తి అనగానే మన ఊహల్లోకి మొదట వచ్చే స్త్రీ రూపురేఖలు అమ్మవే. బొట్టు, తలచుట్టూ కొంగు. అందుకే స్త్రీలకు విడిగా కేటాయించిన సీట్ల దగ్గర, కౌంటర్ల దగ్గర, కంపార్ట్మెంట్ల మీద ఇప్పటికీ మాతృమూర్తిని తలపించే చిత్రం మాత్రమే కనిపిస్తుంది. ఉద్యోగరీత్యా గానీ, ఒంటికి అనువుగా ఉండడం కోసం కానీ చీర కట్టు, బొట్టు మస్ట్ కాదనుకునే ఆధునిక మహిళాయుగంలోకి మనం వచ్చినప్పటికీ మనమింకా ‘భారతీయ స్త్రీమూర్తి’ దగ్గరే ఆగిపోయాం. అవును ఎందుకు ఆగిపోయాం?! రెండు నెలల క్రితం పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ ఎ.కె.గుప్తా ముంబై లోకల్ ట్రైన్ల çపనితీరు పర్యవేక్షణల విధుల్లో ఉన్నప్పుడు ఆయనకీ ఇలాగే ఆగిపోయిన ఆలోచన ఏదో కలిగింది. ట్రైన్లతో పోటీ పడి మరీ మహిళలు ఉద్యోగాలకు పరుగులు పెడుతూ, విశ్వాంతరాళాలకు సైతం రాకెట్లా దూసుకెళుతున్న ఈ కాలంలో ఇంకా ఆ సేమ్ ఓల్డ్ ట్రెడిషనల్ స్త్రీ మూర్తి చిత్రాన్నే బోగీలపై గీయించడం ఏమిటి అనుకున్నారు. వెంటనే ఆ చిత్రాన్ని ఆధునిక మూర్తిగా రీడిజైన్ చేయించారు. ఒక యువతి ఫార్మల్ సూట్లో ఉంటుంది. ఆమె జుట్టు చక్కగా భుజాల మీదికి వదిలేసి ఉంటుంది. నుదుటిపై బొట్టు ఉండదు. మనిషి నాజూకుగా ఉంటుంది. నాగరికంగా చేతులు కట్టుకుని ఉంటుంది. పెదవులపై కనిపించీ కనిపించని నవ్వు ఉంటుంది. ఈ చిత్రాన్ని గుప్తా దగ్గర ఉండి మరీ చేయించారు. ఇప్పటివరకు పన్నెండు కోచ్‌లు ఉండే రెండు రైళ్లకు వాటిని వేయించారు. ఇంకో రెండు వారాల్లో మిగతా 108 లోకల్ ట్రైన్లలోనూ మహిళా కంపార్ట్మెంట్ల మీద, లోపల మహిళలు కూర్చునే చోట ఈ ఆధునిక యువతి చిత్రాన్ని పెయింట్ చేయడం పూర్తవుతుంది. ఈ ‘లోగో’ మార్పు గురించి పశ్చిమ రైల్వే మే 27 ఉదయాన్నే ఒక సర్ప్రైజింగ్ ట్వీట్ పెట్టింది. ‘కాలానుగుణంగా మారే ప్రయత్నంలో భాగంగా పశ్చిమ రైల్వే మహిళల కోచ్ మీద ఉండే మహిళా చిహ్నాన్ని ఆధునీకరిస్తోంది.’ అని ఆ ట్వీట్లో ఉంది. వెంటనే రియాక్షన్ మొదలైంది. ‘అమ్మలో ఆధునికం లేదనుకున్నార్రా మీరు..’ అని ఒకరెవరో.. ‘అమ్మ, నాన్న, ఒక తమిళమ్మాయి’ సినిమాలో బండ్ల గణేశ్‌లా ఊగిపోయారు. (‘ఆడపిల్లలంటే ఆటబొమ్మల్లా కనబడుతున్నార్రా మీకు..’ అనేది బండ్ల గణేశ్ డైలాగ్ ఆ సినిమాలో). గుడ్ థాట్ అని ఒకరు అన్నారు. అలాగే ఒక సూచన కూడా చేశారు. బొత్తిగా ఒక ఉమన్నే కాకుండా, ఎత్నిక్ వేర్, ఆఫీస్ వేర్ ఇలా రకరకాల దుస్తులలో ఉన్న గ్రూప్ ఆఫ్ మహిళల్ని సింబల్‌గా పెడితే బాగుంటుందన్నారు. సునాల్ బాత్రా అనే అమ్మాయి.. ‘వావ్! నిద్రలేవగానే ఒక అమేజింగ్ న్యూస్’ అని ఎగ్జయిట్ అయింది. ‘మోడర్నైజింగా! సిగ్గులేకపోతే సరి. భారతీయ సంప్రదాయాన్ని బ్యాక్‌వర్డ్‌నెస్ అంటున్నారా మీరు!’ అని ఇంకొకరు. ‘దిస్ ఈజ్ మియర్ టోకెనిజం’ అని ఇంకో కామెంట్. ‘టోకెనిజం’ అంటే ఏమీ చెయ్యకుండానే చేసినట్లు కనిపించే ప్రయత్నం చెయ్యడం. మొత్తం మీద ఈ బొమ్మమార్పు ఆలోచనను దాదాపుగా ఆడవాళ్లంతా ‘ఎక్స్లెంట్’ అన్నారు. మగవాళ్లంతా ‘టైమ్‌కి బండ్లు నడపడం మీద దృష్టి పెట్టండి’ అన్నారు. ‘మీ డ్యూటీ ఏదో అది సక్రమంగా చెయ్యండి. సామాజిక మార్పు గురించి మీకెందుకు అనడం’ ఇది. ఇంట్లో కూడా చూడండి. పిల్లలు ఉత్సాహంగా ఒక కొత్త సామాజికపరమైన ఆలోచనతో ఏదైనా బొమ్మను గీసుకొస్తే.. ‘ఈ తెలివితేటలు ఎంసెట్‌లో చూపించు’ అనేస్తాం. ఎంసెట్‌లో ర్యాంక్ సాధించడం ఒక్కటే మన ఇంట్లోంచి జరగవలసిన గొప్ప సామాజిక మార్పు అన్నట్లు! కొత్త భావనలకు పాతవి ఎప్పుడూ సహాయ నిరాకరణగానే ఉంటాయి. ఆ మాత్రం ఒరిపిడి లేకుంటే మార్పు పరిపూర్ణం కాదు కూడా. పెరిగి పెద్దవుతున్నా కూడా సీసా పాలకు ముఖాన్ని తిప్పేసుకుంటూ తల్లిపాలకు మాత్రమే చేతులు చాచడానికి అలవాటు పడ్డ మారాల బిడ్డలా.. స్త్రీ తలకొంగులో మాత్రమే సంప్రదాయాన్ని చూడ్డానికి అలవాటు పడిన జీవనాడులు.. స్త్రీ తలదించుకుని నడవడంలో, తలకొంగు కప్పుకుని మాట్లాడటంలో సంప్రదాయం లేదనీ, స్త్రీని గౌరవించి ఆమెకు ఇవ్వవలసిన స్పేస్‌ని ఆమెకు ఇవ్వడంలో మాత్రమే సంప్రదాయం ఉందనీ గ్రహింపునకు వచ్చేవరకు ఈ ఇనిషియల్ ఘర్షణ ఉండేదే. కాలానికి తగ్గట్టు చూపూ ఉంటే బొట్టుందా, భుజాలపైకి కత్తిరించిన జుట్టుందా అని కళ్లు వెతుక్కోవు. -
జస్టిస్ జోసెఫ్ పదోన్నతిపై నిర్ణయం వాయిదా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అంశాన్ని పునఃసమీక్షించే విషయంపై సుప్రీం కోర్టు కొలీజియం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ కేఎం జోసెఫ్‌కు పదోన్నతి కల్పిస్తూ కొలీజియం చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం గత వారం వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కోర్టు కార్యకలాపాలు ముగిసిన అనంతరం సమావేశమైంది. అయితే ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జస్టిస్ జోసెఫ్ అంశం కాకుండా కొలీజియంఎజెండాలో కలకత్తా, రాజస్తాన్, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లోని కొందరు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించే అంశంపైనా చర్చ జరిగింది. అయితే నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు సమావేశం తీర్మానం కాపీని సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరిచారు. బుధవారం కోర్టుకు హాజరుకాని జస్టిస్ చలమేశ్వర్ కొలీజియం సమావేశానికి మాత్రం హాజరయ్యారు. అయితే కొలీజియం తిరిగి ఎప్పుడు సమావేశం అవుతుందనే విషయంపై ఎటుంటి అధికారికా ప్రకటనా వెలువడలేదు. -
జడ్జీలకు లంచం కేసులో నేడు తీర్పు
న్యూఢిల్లీ: జడ్జీలకు లంచం ఆరోపణలపై దాఖలైన పిటిషన్ విచారణార్హతపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ అంశంపై మంగళవారం తీర్పు వెలువరించే అవకాశముందని జస్టిస్ ఆర్కె అగర్వాల్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ తెలిపింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని, అది న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. ఈ పిటిషన్‌ను నవంబర్ 9న జస్టిస్ జే.చలమేశ్వర్, ఎస్.అబ్దుల్ నజీర్‌ల ధర్మాసనం విచారణకు స్వీకరిస్తూ ఐదుగురు అత్యంత సీనియర్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించాలని ఆదేశించింది. సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అత్యవసరంగా సమావేశమై. ‘ధర్మాసనాల ఏర్పాటు, కేసుల అప్పగింత అధికారం పూర్తిగా ప్రధాన న్యాయమూర్తికే ఉంటుంది’ అని తేల్చింది. ఫలానా సభ్యులతో ధర్మాసనం ఏర్పాటు, కేసు అప్పగింతకు ఇతర ధర్మాసనాలు ఆదేశాలు జారీ చేయలేవని తేల్చి చెప్పింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సుప్రీంలో ఒక స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. -
విమానాల్లో... మహిళలకు మాత్రమే!!
వినూత్న సేవలకు ఎయిర్ ఇండియా శ్రీకారం న్యూఢిల్లీ: ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం’.. ఇలాంటి వాక్యాలు బస్సుల్లో చూస్తుంటాం. ఇపుడీ ట్రెండ్ విమానాల్లోనూ ఆరంభమైంది. ఎయిర్ ఇండియా తాజాగా తన దేశీ విమానాల్లో ఈ నెల 18 నుంచి మహిళల కోసం ఆరు సీట్లను ప్రత్యేకంగా రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘మహిళలు విమానాల్లో ఒంటరిగా ప్రయాణించేటపుడు వారికి కిటికీ పక్కనో, మధ్యలోనో సీటు దొరకవచ్చు. అలాంటప్పుడు వారు వాష్‌రూమ్‌కు వెళ్లాలంటే కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే స్త్రీలకు ప్రత్యేకంగా కొన్ని సీట్లను రిజర్వు చేస్తున్నాం’ అని ఎయిర్ ఇండియా అధికారి చెప్పారు. కుటుంబంతో కలిసి ప్రయాణించే మహిళలకు ఈ సౌకర్యం వర్తించదు. ఏవియేషన్ పరిశ్రమలో ఇలాంటి సేవలు ఇదే ప్రథమం. -
హుందాగా ఉండండి
కుమారకు జేడీఎస్ఎల్పీ హితవు తీరు మార్చుకోవాలని సభ్యుల విన్నపాలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : జేడీఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి ఉన్నారనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో బెంగళూరులోని ఓ హోటల్లో బుధవారం ఆ పార్టీ శాసన సభా పక్ష సమావేశాన్ని నిర్వహించారు. హెచ్డీ. కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ మనసులోని అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పారు. జేడీఎల్పీ నాయకుని హోదాలో కుమార స్వామి హుందాగా వ్యవహరించాలని పలువురు ఎమ్మెల్యేలు హితవు పలికారు. ‘మా నియోజక వర్గాల్లో పార్టీ కార్యకర్తలు మీ గురించి అడుగుతున్నారు, మీరేమో బెంగళూరు వదిలి వచ్చేట్లు లేరు’ అంటూ కుమారస్వామిని కొందరు ఎమ్మెల్యేలు నిష్టూరమాడినట్లు తెలిసింది. పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర పర్యటన చేపట్టాలని సూచించారు. ఈ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. కుమారస్వామికి అత్యంత సన్నిహితుడైన బెంగళూరులోని చామరాజపేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ గైర్హాజరవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు ఈ సమావేశం గురించి ఆహ్వానం అందలేదని, కనుక హాజరయ్యేది లేదని జమీర్ మంగళవారమే తేల్చి చెప్పారు. అయితే ముందే నిర్ణయమైన కార్యక్రమాల వల్ల హఠాత్తుగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరుకాలేక పోతున్నామని పలువురు ఎమ్మెల్యేలు రాత పూర్వకంగా తెలియజేశారని మాజీ మంత్రి, కుమారస్వామి సోదరుడు రేవణ్ణ విలేకరులకు తెలిపారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా కుమారస్వామిని, లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా తనను నియమిస్తారని వెలువడుతున్న వార్తలు ఊహాజనితాలని కొట్టి పారేశారు. తాను లెజిస్లేచర్ పార్టీ నాయకత్వాన్ని కోరుకోవడం లేదన్నారు. కోర్ కమిటీ ఏర్పాటు పార్టీకి దిశా నిర్దేశం చేయడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కోర్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కుమారస్వామి తెలిపారు. లెజిస్లేచర్ పార్టీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అతివృష్టి పీడిత ప్రాంతాల్లో పర్యటనకు నాలుగు బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పర్యటన అనంతరం ఈ బృందాలు సమర్పించే నివేదిక ఆధారంగా సహాయక చర్యల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. తమ పార్టీ పనై పోయిందని కొందరు చేస్తున్న ప్రచారాన్ని కొట్టి పారేస్తూ, కర్ణాటక రాజకీయాల్లో జేడీఎస్ అవిభాజ్య అవయవమని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలకు అవకాశం ఇచ్చినందున, వచ్చే శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీని ప్రజలు ఆశీర్వదించినా ఆశ్చర్యం లేదని అన్నారు. అతివృష్టి పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు దండిగా నిధులిస్తున్నామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేస్తున్న ప్రకటన వట్టి బూటకమని విమర్శించారు. అరకొర నిధులు విదిలిస్తున్నారని ఆరోపించారు. -
రైలు టిక్కెట్ల జారీకి ప్రైవేట్ ఆపరేటర్లు
-
పొత్తు వెనుక ఎత్తు
దేవరకొండ, న్యూస్‌లైన్ పీఏపల్లి జెడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో కాంగ్రెస్ తరఫున జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తేర గోవర్దన్‌రెడ్డి కూతురు తేర స్పందనరెడ్డి , వైఎస్సార్సీపీ నుంచి సపావత్ సాలి, బీజేపీ నుంచి పల్లా మంజుల, సీపీఎం నుంచి కంబాలపల్లి కవిత, స్వతంత్ర అభ్యర్థిగా సాహితి పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో మొదటి నుంచి బలమైన నాయకుడైన గోవర్దన్రెడ్డిని ఎదుర్కొనేందుకు ఇక్కడ టీడీపీ, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి. అయితే ఈపొత్తు రాష్ట్ర స్థాయిలో చర్చకు వచ్చే అవకాశమున్నందున టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి అలుగుబెల్లి వెంకటేశ్వర్‌రెడ్డి తన సతీమణి శోభారాణిని పార్టీ తరఫున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించారు. టీడీపీ తన అభ్యర్థిని బరిలో నిలపకుండా టీఆర్ఎస్తో జతకలిసి గోవర్దన్రెడ్డిని ఎదుర్కొనేందుకు ఇక్కడ సరికొత్త ట్రెండుకు తెరలేపింది. వీరు టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ జెండాలతోనే బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం మరికొందరు అభ్యర్థులు కూడా రంగంలో ఉండి ఉడతాభక్తిగా ఇటు గోవర్దన్‌రెడ్డి వర్గం, అటు వెంకటేశ్వర్ రెడ్డి వర్గాలకు సహకరిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా విభిన్నమైన కలయికతో ఇక్కడ చేస్తున్న ఈ ప్రయత్నం ఏ మేరకు సఫలమవుతుందో చూడాలి.