న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. సోమవారం కేజ్రీవాల్, సీబీఐ తరఫు లాయర్లు తమ వాదనలు వినిపించారు. ‘ఎక్సైజ్ కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్. ఆయన్ను విడుదల చేస్తే సాకు‡్ష్యలను ప్రభావితం చేస్తారు. ఆయన అరెస్టయితేనే ఈ కేసు విచారణ ముగింపునకు వస్తుంది.
నెలలోగా చార్జిషిటు వేస్తాం’అని సీబీఐ లాయర్ డీపీ సింగ్ తెలిపారు. కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు రాకుండా చేసేందుకే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని ఆయన తరఫు సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఊహాకల్పనలతోనే కేజ్రీవాల్‌కు అరెస్ట్ చేశారే తప్ప, ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఎటువంటి ఆధారాలు లేవన్నారు. వాదనలు విన్న అనంతరం జస్టిస్ నీనా బన్సన్ కృష్ణ తీర్పును రిజర్వులో ఉంచుతూ ఆదేశాలిచ్చారు.
ఆఖరి చార్జిషీటు
అంతకుముందు, సీబీఐ అధికారులు మద్యం కుంభకోణం కేసులో ఆఖరి చార్జిషిటును రౌజ్ అవెన్యూ కోర్టులో దాఖలు చేశారు. ఇందులో సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌తోపాటు అరబిందో ఫార్మా డైరెక్టర్ పి.శరత్ చంద్రారెడ్డి, బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అమిత్ అరోరా, హవాలా ఆపరేటర్ వినోద్ చౌహాన్, వ్యాపారవేత్త ఆశిష్ మాథుర్
పేర్లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment