CM Kejriwal
-
కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. సోమవారం కేజ్రీవాల్, సీబీఐ తరఫు లాయర్లు తమ వాదనలు వినిపించారు. ‘ఎక్సైజ్ కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్. ఆయన్ను విడుదల చేస్తే సాకు‡్ష్యలను ప్రభావితం చేస్తారు. ఆయన అరెస్టయితేనే ఈ కేసు విచారణ ముగింపునకు వస్తుంది. నెలలోగా చార్జిషిటు వేస్తాం’అని సీబీఐ లాయర్ డీపీ సింగ్ తెలిపారు. కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు రాకుండా చేసేందుకే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని ఆయన తరఫు సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఊహాకల్పనలతోనే కేజ్రీవాల్‌కు అరెస్ట్ చేశారే తప్ప, ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఎటువంటి ఆధారాలు లేవన్నారు. వాదనలు విన్న అనంతరం జస్టిస్ నీనా బన్సన్ కృష్ణ తీర్పును రిజర్వులో ఉంచుతూ ఆదేశాలిచ్చారు. ఆఖరి చార్జిషీటు అంతకుముందు, సీబీఐ అధికారులు మద్యం కుంభకోణం కేసులో ఆఖరి చార్జిషిటును రౌజ్ అవెన్యూ కోర్టులో దాఖలు చేశారు. ఇందులో సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌తోపాటు అరబిందో ఫార్మా డైరెక్టర్ పి.శరత్ చంద్రారెడ్డి, బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అమిత్ అరోరా, హవాలా ఆపరేటర్ వినోద్ చౌహాన్, వ్యాపారవేత్త ఆశిష్ మాథుర్పేర్లున్నాయి. -
కేజ్రీవాల్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు
ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ చేసిన ఆరోపణలకు గాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు శనివారం పోలీసులు నోటీసులిచ్చారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను మూడు రోజుల్లో అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఐదు గంటలు హైడ్రామా జరిగింది. కేజ్రీవాల్ నివాసంలో అధికారులు తాము నోటీసులు తీసుకుంటామని చెప్పగా పోలీసులు నిరాకరించారు. సీఎంకే ఇస్తామన్నారు. చివరికి కేజ్రీవాల్ బయటకు రాగా నోటీసులిచ్చారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తామిచ్చిన ఐదు నోటీసులకు కేజ్రీవాల్ స్పందించలేదంటూ ఈడీ అధికారులు శనివారం అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 7వ తేదీన విచారణ చేపడతామని మేజిస్ట్రేట్ చెప్పారు. -
చీఫ్ సెక్రటరీని తొలగించండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్(ఎల్జీ)ని సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. నరేశ్ కుమార్ తన కుమారుడికి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీకి, ఐఎల్బీ అనే సంస్థతో ఎంవోయూ కుదిరేందుకు అధికార దురి్వనియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ మంత్రి అతీషి ఆరోపించారు. ఈ మేరకు నివేదికను ఇటీవల సీఎం కేజ్రీవాల్‌కు అందజేశారు. ఆ నివే దికను కేజ్రీవాల్ శనివారం లెఫ్టినెంట్ జనరల్ వీకే శుక్లాకు పంపారు. అతీషి సిఫారసుల మేరకు ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. తనకుమారుడికి ఎటువంటి కంపెనీతోను, ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఐఎల్‌బీఎస్ సంస్థ కూడా అతీషి చేసిన ఆరోపణలు నిరాధారాలంటూ ఖండించింది. -
DelhiFloods: మూడు రోజుల్లో రూ.200కోట్లు నష్టం, ఇండస్ట్రీ కీలకహెచ్చరికలు
ఎడతెగని వర్షాలు, వరద పరిస్థితి దేశ రాజధాని నగరం ఢిల్లీని అతలాకుతలం చేసింది. యమునా నది నీటి మట్టం ఊహించిన దాని కంటే 18 గంటల ముందుగానే ప్రమాద స్థాయి 208.46 మీటర్లకు చేరింది. గతంలో ఎన్నడూ లేని చాలా ప్రాధాన్య ప్రాంతాలు కూడా నీట మునిగాయి. ముఖ్యంగా సుప్రీంకోర్టు, రాజ్ ఘాట్‌ని వరదనీరు ముంచెత్తింది. అంతేకాదు ఎర్రకోట చుట్టూ వరదనీరు చేరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం కూడా నీటి మునిగింది. అటు మంచినీటికోసం ప్రజల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఇక నిత్యావసరాల కోసం జనం అల్లాడి పోతున్నారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఢిల్లీని ముంచెత్తిన వరదలతొ వ్యాపార పరంగా అపార నష్టానికి దారి తీశాయి. యమునా నదిలో నీటిమట్టం పెరగడం ఢిల్లీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యమునా బాజార్ నుంచి ఎర్రకోట దాకా దుకాణాలు, ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. గత 3-4 రోజుల్లో దాదాపు 200 కోట్ల రూపాయల వ్యాపారం దెబ్బతిందని ఇండస్ట్రీ బాడీ తెలిపింది. అలాగే యమునా నది నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా రాబోయే కొద్ది రోజుల పాటు ఇతర నగరాల నుండి వస్తువుల తరలింపును నిలిపి వేయాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ ఢిల్లీలోని వ్యాపారులకు విజ్ఞప్తి చేయడం గమనార్హం. #WATCH | Delhi: Water level in Yamuna river rises after incessant rainfall & release of water from Hathnikund barrage. The water level of Yamuna River at Old Railway Bridge (ORB) has crossed the danger mark and is at 208.40 meters, recorded around 9 am. (Drone Visuals from… pic.twitter.com/yT1X0rXz5g — ANI (@ANI) July 14, 2023 పాత ఢిల్లీ, కాశ్మీరీ గేట్, మోరీ గేట్, మానెస్ట్రీ మార్కెట్, చాందినీ చౌక్, జామా మసీదు, భగీరథ్ ప్లేస్, లజ్‌పత్ రాయ్ మార్కెట్, కినారీ బజార్, ఫతేపురి, ఖరీ బావోలి, నయా బజార్ మార్కెట్లు వర్షం కారణంగా దెబ్బ తిన్నాయని ట్రేడర్స్ బాడీ తెలిపింది. అలాగే కాశ్మీరీ గేట్ మార్కెట్ ప్రెసిడెంట్ వినయ్ నారంగ్ మాట్లాడుతూ, 3-4 రోజుల వర్షం కారణంగా రూ. 50 కోట్లకు పైగా నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రతిరోజు రేవారీ, గుర్గావ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, మీరట్, సోనిపట్, పానిపట్, పాల్వాల్, బాగ్పట్, బరౌత్, ముజఫర్‌నగర్ వంటి ప్రాంతాల నుండి రోజువారీ 2 లక్షలకు పైగా కస్టమర్ల తాకిడి ఉంటుంది. ఇదే పరిస్థితి మరిన్ని రోజులు కొనసాగితో మరింత భారీ నష్టం తప్పదని వ్యాపారులు వణికి పోతున్నారు. సమీప నగరాల నుంచి వచ్చే కస్టమర్లు కూడా తమ ప్లాన్‌ను వాయిదా వేసుకున్నారు.అటు రైళ్ల రాకపోకలను రైల్వే నిలిపిసింది. రోడ్డు, ఇతర రవాణా మార్గాల మూతతో వ్యాపారం మరింత స్థంభించింది. దీంతో వ్యాపారులు కొనుగోలు దారులు ఢిల్లీకి రావడం లేదని గోయల్‌ని ఉటంకిస్తూ పిటిఐ పేర్కొంది. కాగా వరద పీడిత ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఢిల్లీ సర్కారు తగిన చర్యలు చేపడుతోంది. పాఠశాలలు, కళాశాలలకు ఆదివారం వరకు సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, అవసరమైన సేవలను అందించేవి తప్ప, మిగిలిన ఉద్యోగులు ఇంటి నుండి పనిచేయాలని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ సమయంలో అవసరమైన సేవలు అందించే వాహనాలు మినహా భారీ వాహనాల ప్రవేశంపై నిషేధం విధించినట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. -
కేజ్రీవాల్ బంగ్లా దర్యాప్తు అధికారికి ఉద్వాసన
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారం రాష్ట్ర సర్కార్కే ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిన నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేజ్రీవాల్ అధికార బంగ్లా ఆధునీకరణకు రూ.45 కోట్లు వెచ్చించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ అధికారి, సీనియర్ ఐఏఎస్ రాజశేఖర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తును విజిలెన్స్ విభాగంలోని ఇతర అసిస్టెంట్ డైరెక్టర్లు పంచుకోవాలని, నివేదికలను నేరుగా విజిలెన్స్ సెక్రటరీకి సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు మాటున రాజశేఖర్ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజిలెన్స్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. -
కేజ్రీవాల్ పై సీబీఐ ప్రశ్నల వర్షం
-
లిక్కర్ స్కామ్‌లో సీబీఐ విచారణకు హాజరైన కేజ్రీవాల్
-
మూడు నెలల్లో అందరికీ వ్యాక్సిన్ : ఢిల్లీ సీఎం
సాక్షి,న్యూఢిల్లీ: ఒక వైపు కరోనా వైరస్ అంతానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంటే, మరోవైపు ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక లాంటి రాష్ట్రాల్లో మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. ఈనేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేశారు. అందరికీ టీకాలు వేయడానికి కేంద్రం అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సంబంధించిన టీకాల సరఫరా తమకు లభిస్తే తమ ప్రభుత్వం మూడు నెలల్లోనే ఢిల్లీలో టీకాల కార్యక్రమం మొత్తాన్ని పూర్తి చేస్తామన్నారు. కోవిడ్ -19 టీకాల వేగాన్ని పెంచాలని ఢిల్లీ సర్కార్ పెంచాలని యోచిస్తోంది. రోజుకు 30-40వేల వ్యాక్సిన్లు ఇస్తున్నామనీ, దీన్ని త్వరలో 1.25 లక్షల మందికి పెంచుతామని కేజ్రీవాల్ తెలిపారు..అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ టీకాలు వేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని అర్హతగల లబ్ధిదారులందరికీ టీకా డ్రైవ్‌ను విస్తరించాలని అరవింద్ కేజ్రీవాల్ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యాక్సిన్ ఉత్పత్తి పెరిగింది, కాబట్టి టీకాలు అందించే కార్యక్రమాన్ని కూడా మరింతగా విస్తరించాలన్నారు. అంతేకాదు టీకా తీసుకునేందుకు అర్హుల జాబితా తయారుచేసే బదులు అందరికీ అవకాశం కల్పించాలన్నారు. అలాగే టీకా ధరలు, వ్యాక్సినేషన్ ప్రక్రియను వికేంద్రీకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా రాష్ట్రాలు తమదైన రీతిలో యుద్ధ ప్రాతిపదికన టీకాలు వేయడానికి అనుమతించాలని ఢిల్లీ సీఎం కోరారు. టీకా కేంద్రాలకు సంబంధించిన కేంద్రం అమలు చేస్తున్న ప్రస్తుత మార్గదర్శకాలు చాలా కఠినంగా ఉన్నాయని అభి ప్రాయపడిన ఆయన దీ న్ని సరళీకరించి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. టీకా విషయంలో 2 నెలల అనుభవం నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని, సాధ్యమైనన్ని ఎక్కువ కేంద్రాల్లో టీకాలు వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా భారతదేశంలో మళ్లీ కోవిడ్-19 విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 35,871 తాజా కేసులు నమోదయ్యాయి. ఇది 3 నెలల్లో అత్యధికమని అధికార గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం ఢిల్లీలో 500కి పైగా కేసులు కొత్తగా నమోదుతో మొత్తం సంఖ్య 644,489 కు చేరుకుంది. గత 24 గంటల్లో ఒక మరణంతో మరణించిన వారి సంఖ్య 10,945 గా ఉంది. -
సీఎస్‌పై దాడి చార్జిషీట్లో కేజ్రీవాల్ పేరు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియాలను నిందితులుగా చేరుస్తూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్‌కు సమర్పించిన చార్జిషీట్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో 11 మంది ఎమ్మెల్యేల పేర్లున్నాయి. ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ను అధికారిక విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేందుకు, గాయపరిచేందుకు కేజ్రీవాల్, సిసోడియా తదితరులు కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, చంపేస్తామని బెదిరించారని అందులో పేర్కొన్నారు. కాగా, చార్జిషీటుపై ఈనెల 25వ తేదీన విచారణ చేపడతామని మెజిస్ట్రేట్ ప్రకటించారు. -
ఢిల్లీ వివాదం యథాతథం
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కు మధ్య వివాదం యథాతథంగా కొనసాగుతోంది. నియామ కాలు, బదిలీలకు సంబంధించిన సిబ్బంది విభాగంపై అధికారం మాదంటే మాదని ఇటు సీఎం, అటు ఎల్జీ ప్రకటించుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అధికారుల బదిలీలకు సంబంధించి సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం పంపిన ఫైలును ఎల్జీ అనిల్ బైజాల్ తిప్పి పంపేశారు. మరోపక్క పాలనపై, అధికారులపై పట్టు సాధించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగానే ప్రజల ముంగిట్లోకే రేషన్ సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ అధికారులను ఆదేశించారు. ఎల్జీపై కేజ్రీవాల్ ధ్వజం సుప్రీం తీర్పు నేపథ్యంలో శుక్రవారం ఎల్జీ అనిల్ బైజాల్‌తో సీఎం కేజ్రీవాల్ సుమారు 25 నిమిషాల పాటు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఢిల్లీ సర్వీసెస్ విభాగం అసెంబ్లీ పరిధిలోకి రాదని, అధికారుల నియామకాలు, బదిలీలు చేసే అధికారం తమకే ఉందని 2015లో హోం శాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సుప్రీం రద్దు చేయలేదని ఎల్జీ కేజ్రీవాల్‌కు చెప్పారు. అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ఎల్జీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారు. సిబ్బంది విభాగాన్ని ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎల్జీ అంగీకరించడం లేదు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం బాహాటంగా తిరస్కరించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. సిబ్బంది విభాగాన్ని ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించరాదని కేంద్ర హోం శాఖ తనకు సూచించిందని బైజాల్ నాతో చెప్పారు’ అని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు అమలు చేయాలని కోరేందుకు కేజ్రీవాల్ హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్మెంట్ కోరారు. పాలనపై పట్టుకు ఆప్ యత్నాలు తీర్పు నేపథ్యంలో ఢిల్లీలో పాలనపై, అధికా రులపై పట్టు బిగించేందుకు ఆప్ చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే అభ్యంత రాలన్నీ పక్కనపెట్టి ప్రజల ముంగిట్లోనే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆహార విభాగాన్ని ఆదేశించినట్టు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నా రు. దీనిపై తీసుకున్న చర్యలపై రోజువారీ నివేదిక ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించానన్నారు. ఈ ప్రతిపాదన పట్ల ఎల్జీ గతంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానం అమలుకు ముందు కేంద్రాన్ని సంప్రదించాలని ఆప్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో ఎల్జీ అభ్యంతరాలను తోసిరాజని కేజ్రీవాల్ ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. అలాగే డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అధ్యక్షతన సమావేశమై వ్యయ, ఆర్థిక కమిటీ రెండు ప్రాజెక్టులను ఆమోదించింది. సిగ్నేచర్ బ్రిడ్జికి చివరి విడత నిధుల మంజూరుకు, ఢిల్లీ టెక్నికల్ వర్సిటీలో అకడమిక్ భవనం, హాస్టల్ గదుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇంకో తీర్పు వస్తే పూర్తి స్పష్టత: ఎల్జీ కేజ్రీవాల్ వ్యాఖ్యలను ఎల్జీ తోసిపుచ్చారు. సిబ్బంది విభాగానికి సంబందించి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో కూడా తీర్పు వస్తే ఈ అంశంపై పూర్తి స్పష్టత వస్తుందని ఎల్జీ పేర్కొన్నారు. ఢిల్లీలో సిబ్బంది విభాగం అసెంబ్లీ పరిధిలోకి రాదంటూ 2015లో కేంద్ర హోం శాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు ఇంకా రద్దు చేయలేదనీ, కాబట్టి ఉద్యోగుల బదిలీలపై అధికారం తమదేనంటూ కేజ్రీవాల్‌కు ఎల్జీ లేఖ రాశారు. హోం శాఖ స్పందిస్తూ.. సిబ్బం ది విభాగం అంశంపై సుప్రీంలో పెండిం గ్లో ఉన్నందున తాము తుది నిర్ణయం చెప్పడం చట్టవ్యతిరేకమవుతుందంది. -
సంతోషం కోసం ఓ పిరియడ్!
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థుల కోసం ‘హ్యాపీనెస్ కరిక్యులమ్’ (కొత్త తరహా సిలబస్)ను ఢిల్లీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. దీన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆధ్యాత్మిక గురువు దలైలామా సంయుక్తంగా సోమవారం ప్రారంభించారు. ఈ సిలబస్‌పై ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి వరకు ఈ ‘హ్యాపీనెస్’ పిరియడ్ 45 నిమిషాలపాటు ఉండనుంది. ‘ధ్యానంతో పాటు విలువైన విద్య, మానసిక వ్యాయామాలు ఉంటాయి. 40 మంది ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు, విద్యావేత్తలు అధ్యయనం చేసి దీన్ని రూపొందించారు. తీవ్రవాదం, అవినీతి, కాలుష్యంలాంటి అధునిక సమస్యలను ఇలాంటి మానవీయ విద్యను అందించడం ద్వారా పరిష్కరించవచ్చని ఆశిస్తున్నాం’ అని సిసోడియా చెప్పారు. ఆధునిక విద్య, ప్రాచీన జ్ఞానం ఏకం చేయడంతో ప్రతికూల భావాల్ని అధిగమించగల్గుతామని దలైలామా అన్నారు. -
ఐదోవ రోజుకు చేరిన కేజ్రీవాల్ నిరసన
-
నాలుగో రోజుకు చేరిన కేజ్రీవాల్ నిరసన
న్యూఢిల్లీ: ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ముగ్గురు మంత్రులు చేస్తున్న దీక్ష నాలుగో రోజుకు చేరింది. దీంతో ఎల్జీ ఇంటి నుంచే తన విధులు నిర్వహిస్తున్నారు. కాగా, దీక్ష చేస్తున్న కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఎవరినీ అనుమతించకపోవడంపై ఆప్ నేతలు మండిపడ్డారు. ‘కేజ్రీవాల్‌ను హౌజ్ అరెస్టు చేశారా?’ అని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు ఆందోళన విరమింపజేసే విషయంలో బైజాల్ చొరవతీసుకోవడం లేదంటూ కేజ్రీవాల్ నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. అటు, ప్రధానమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ల తీరును నిరసిస్తూ.. ఎమ్మెల్యేలు, ఆప్ కార్యకర్తలు రాజ్‌ఘాట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ‘మోదీజీ ఫర్గివ్ ఢిల్లీ’ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ప్రదర్శన కొనసాగింది. నాలుగు నెలలుగా ఆందోళన చేస్తున్న ఢిల్లీ ఐఏఎస్ అధికారుల ఆందోళన విరమించేలా ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. -
ఆప్ ఎమ్మెల్యేలకు ఊరటనిచ్చిన ఢిల్లీ హైకోర్టు
-
అనర్హతపై ‘ఆప్’ విజయం
న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యేల లాభదాయక పదవుల కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై విధించిన అనర్హతను రద్దుచేస్తూ కేసును మళ్లీ విచారించాలని ఎన్నికల సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం తీరును కోర్టు తప్పుబట్టింది. అనర్హతపై కేంద్రానికి ఈసీ చేసిన ప్రతిపాదనలను సహజ న్యాయాన్ని, ఎమ్మెల్యేల హక్కులను నీరుగార్చటంగా అభివర్ణించిన ధర్మాసనం.. వారిపై వేటువేసేముందు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం ఇవ్వకపోవటాన్ని తప్పుబట్టింది. తీర్పుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈసీపై కోర్టు మండిపాటు ‘ఎన్నికల కమిషన్ జనవరి 19న ఆప్ ఎమ్మెల్యేల అనర్హతపై రాష్ట్రపతికి సిఫారసు చేసిన ఉద్దేశం చట్టాలను నీరుగార్చటమే. సహజన్యాయ చట్టాలను అమలు చేయటంలో ఎన్నికలసంఘం విఫలమైంది’ అని 79 పేజీల తీర్పులో కోర్టు స్పష్టం చేసింది. ‘అనర్హతపై ఆప్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని భారత ఎన్నికల సంఘం విని, క్షుణ్ణంగా విచారించాలి. ఆ తర్వాత ప్రభుత్వంలో లాభదాయక పదవులు అంటే ఏమిటనే ముఖ్యమైన అంశాలపై నిర్ణయం తీసుకోవాలి. పార్లమెంటరీ సెక్రటరీలుగా పిటిషనర్లు (ఆప్ ఎమ్మెల్యేలు) అనుభవించిన లాభదాయక పదవులపై నిష్పాక్షికంగా పునఃసమీక్ష జరపాలి’ అని ఎన్నికల సంఘాన్ని ఈసీ ఆదేశించింది. మేం వదలబోం: కాంగ్రెస్ ఆప్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఎన్నికల సంఘం వద్ద తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ తెలిపింది. ‘లాభదాయక పదవులపై మా పోరాటం కొనసాగుతుంది. హైకోర్టు వీరు తప్పుచేయలేదని నిర్ధారించ లేదు. ఎమ్మెల్యేల వాదన వినలేదనే అంశంపై సామాజిక న్యాయం జరగలేదని మాత్రమే అభిప్రాయపడింది’ అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ పేర్కొన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ 20 మంది ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ అనుమతించారు. అసలు వివాదమేంటి? ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం 2015 మార్చిలో 20 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించింది. ఎమ్మెల్యేలుగా వేతనం తీసుకుంటూనే పార్లమెంటు సెక్రటరీలుగా లాభం పొందే పదవులను అనుభవించటంపై బీజేపీ, కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించాయి. 2016లో వీరి నియామకాలను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం సూచన మేరకు రాష్ట్రపతి ఆదేశాలతో ఈ 20 మందిని కేంద్రం అనర్హులుగా ప్రకటించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై స్టే విధించాలంటూ ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సున్నితంగా తిరస్కరించింది. అయితే.. ఈ స్థానాల్లో తక్షణమే ఎన్నికలు నిర్వహించటం వంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఈసీకి సూచించింది. -
అనర్హతపై ‘ఆప్’ విజయం
న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యేల లాభదాయక పదవుల కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై విధించిన అనర్హతను రద్దుచేస్తూ కేసును మళ్లీ విచారించాలని ఎన్నికల సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం తీరును కోర్టు తప్పుబట్టింది. అనర్హతపై కేంద్రానికి ఈసీ చేసిన ప్రతిపాదనలను సహజ న్యాయాన్ని, ఎమ్మెల్యేల హక్కులను నీరుగార్చటంగా అభివర్ణించిన ధర్మాసనం.. వారిపై వేటువేసేముందు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం ఇవ్వకపోవటాన్ని తప్పుబట్టింది. తీర్పుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈసీపై కోర్టు మండిపాటు ‘ఎన్నికల కమిషన్ జనవరి 19న ఆప్ ఎమ్మెల్యేల అనర్హతపై రాష్ట్రపతికి సిఫారసు చేసిన ఉద్దేశం చట్టాలను నీరుగార్చటమే. సహజన్యాయ చట్టాలను అమలు చేయటంలో ఎన్నికలసంఘం విఫలమైంది’ అని 79 పేజీల తీర్పులో కోర్టు స్పష్టం చేసింది. ‘అనర్హతపై ఆప్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని భారత ఎన్నికల సంఘం విని, క్షుణ్ణంగా విచారించాలి. ఆ తర్వాత ప్రభుత్వంలో లాభదాయక పదవులు అంటే ఏమిటనే ముఖ్యమైన అంశాలపై నిర్ణయం తీసుకోవాలి. పార్లమెంటరీ సెక్రటరీలుగా పిటిషనర్లు (ఆప్ ఎమ్మెల్యేలు) అనుభవించిన లాభదాయక పదవులపై నిష్పాక్షికంగా పునఃసమీక్ష జరపాలి’ అని ఎన్నికల సంఘాన్ని ఈసీ ఆదేశించింది. మేం వదలబోం: కాంగ్రెస్ ఆప్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఎన్నికల సంఘం వద్ద తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ తెలిపింది. ‘లాభదాయక పదవులపై మా పోరాటం కొనసాగుతుంది. హైకోర్టు వీరు తప్పుచేయలేదని నిర్ధారించ లేదు. ఎమ్మెల్యేల వాదన వినలేదనే అంశంపై సామాజిక న్యాయం జరగలేదని మాత్రమే అభిప్రాయపడింది’ అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ పేర్కొన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ 20 మంది ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ అనుమతించారు. అసలు వివాదమేంటి? ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం 2015 మార్చిలో 20 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించింది. ఎమ్మెల్యేలుగా వేతనం తీసుకుంటూనే పార్లమెంటు సెక్రటరీలుగా లాభం పొందే పదవులను అనుభవించటంపై బీజేపీ, కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించాయి. 2016లో వీరి నియామకాలను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం సూచన మేరకు రాష్ట్రపతి ఆదేశాలతో ఈ 20 మందిని కేంద్రం అనర్హులుగా ప్రకటించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై స్టే విధించాలంటూ ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సున్నితంగా తిరస్కరించింది. అయితే.. ఈ స్థానాల్లో తక్షణమే ఎన్నికలు నిర్వహించటం వంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఈసీకి సూచించింది. -
కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)పై ఆప్ ఎమ్మెల్యేల దాడి కేసులో ఆధారాలను సేకరించేందుకు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ నివాసంలో పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే సీఎం ఇంట్లో సీఎస్‌పై దాడి జరిగినట్లుగా చెబుతున్న గదిలో సీసీటీవీ కెమెరా లేదు. సోదాలకు వస్తున్నట్లు సీఎం ఇంట్లోని సంబంధిత వ్యక్తికి ముందుగానే సమాచారమిచ్చామన్నారు. కేజ్రీవాల్‌ను పోలీసులు ప్రశ్నించే అవకాశముందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అహిర్ కూడా సంకేతాలిచ్చారు. పోలీసులు రౌడీల్లా వ్యవహరించారు.. ఢిల్లీ పోలీసులు కేంద్రం చేతిలో కీలుబొమ్మల్లా మారారనీ, సీఎం నివాసంలోకి అక్రమంగా ప్రవేశించి రౌడీల్లా వ్యవహరించారని ఆప్ ఆరోపించింది. సీఎంను అవమానించడానికే పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారంది. ప్రధాని మోదీ ప్రభుత్వ ఆదేశం లేకుంటే పోలీసులు అలాంటి దాదాగిరి చేసి ఉండేవారు కాదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేస్తూ ‘పెద్ద పోలీసు బలగాన్ని మా ఇంటికి పంపారు. మరి న్యాయమూర్తి లోయా మృతి కేసులో అమిత్ షాను ఎప్పుడు ప్రశ్నిస్తారు?’ అని అన్నారు. ఆప్ ప్రభుత్వంతో కలసి పనిచేసేలా ఉద్యోగులను ఆదేశించాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను కేజ్రీవాల్ కోరారు. కాగా, అరెస్టైన ఎమ్మెల్యేల బెయిల్ అభ్యర్థనలను స్థానిక కోర్టు కొట్టివేసింది. కాగా, ప్రజోపయోగ పనులకు అడ్డొచ్చే అధికారులను కొట్టాల్సిందేనని ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే నరేశ్ బాల్యన్ వ్యాఖ్యానించారు. -
పాకిస్తాన్ కల తీర్చిన బీజేపీ: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఐఎస్ ఏజెంట్లు, ద్రోహులు జాతీయవాదుల ముసుగులో దేశాన్ని విడగొట్టేందుకు కుట్రపన్నుతున్నారని పరోక్షంగా బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుల, మత ప్రాతిపదికన భారత్‌లో చీలికలు సృష్టిస్తున్న కాషాయ పార్టీ...దేశాన్ని విభజించాలన్న పాకిస్తాన్ కలను తన మూడేళ్ల పాలనలోనే నిజం చేసిందని ఎద్దేవా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఐదో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘పాకిస్తాన్, ఐఎస్‌లు 70 ఏళ్లలో చేయలేని దాన్ని బీజేపీ మూడేళ్లలోనే చేసి చూపించింది. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి భారత్‌ను విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. విచ్ఛిన్న భారత్ కాక పాక్‌కు ఉన్న పెద్ద లక్ష్యం మరేంటి?’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. -
కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: పరువు నష్టం దావా కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తమ పరువుకు భంగం కలిగించారని ఢిల్లీ డిస్ట్రిక్ట్ అండ్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ), మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్లు కేజ్రీవాల్, కీర్తీఆజాద్ పై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. వారి వ్యాఖ్యలు డీడీసీఏ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయంటూ, తమ ముందు హాజరు కావాలని కోర్టు జనవరి 30న ఆదేశించింది. దీంతో మంగళవారం కోర్టు ముందు హాజరైన కేజ్రీవాల్ రూ.10,000 సొంత పూచీకత్తు, అంతే మొత్తంలో ష్యూరిటీ సమర్పించాలని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది. -
ఢిల్లీని వదిలి వెళ్తాను: గుర్మెహర్
న్యూఢిల్లీ: కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె, ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ తన ఆందోళనను విరమించాలని నిర్ణయించుకుంది. తనపై బీజేపీ, ఏబీవీపీతో సహా సెల్రబిటీలు కూడా తీవ్రమైన కామెంట్లు చేస్తుండటంతో తన నిరసనను ఇక్కడితే ఆపేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు మద్ధతు తెలిపిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఆందోళన విరమించకపోతే అత్యాచారం చేస్తామంటూ ఏబీవీపీ వారు తనపై బెదిరింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ నుంచి గుర్మెహర్ కౌర్ ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకున్నట్లు చెప్పింది. ఈ వివాదంలో గుర్మెహర్కు అరవింద్ కేజ్రీవాల్ మద్ధతు తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్మెహర్కు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గత వారం రాంజాస్ కాలేజీలో జరిగిన గొడవలపై చర్చించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ను కలిశారు. రాంజాస్ కాలేజీలో విధ్వసం సృష్టించిన ఏబీవీపీ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంగ్ గవర్నర్‌కు కేజ్రీవాల్ విజ్ఞప్తిచేశారు. గుర్మెహర్ను బెదిరించిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కేజ్రీవాల్ కోరారు. గుర్మెహర్ తండ్రి కెప్టెన్ మణ్‌దీప్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందారు. తన తండ్రిని పాకిస్తాన్ చంపలేదని, యుద్ధం ఆయనను చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మరోసారి ఆమె వివాదంలో చిక్కుకుంది. దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలిద్‌ను రాంజాస్ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించారు. దీనిపై గత బుధవారం ఏబీవీపీ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాటు విద్యార్థులు, మీడియాపై దాడికి పాల్పడగా ఈ ఘటనలో దాదాపు 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనపై గుర్మెహర్ కౌర్ గుర్మెహర్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ.. ఏబీవీపీకి భయపడేది లేదంటూ.. తనకు దేశ వ్యాప్తంగా విద్యార్థుల మద్దతు ఉందని రాసున్న ప్లకార్డుతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం మొదలైంది. రాంజాస్ కాలేజీ వివాదం.. సంబంధిత కథనాలు ట్విట్టర్ వార్‌కు తెరలేపిన సెహ్వాగ్ ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం! నన్ను రేప్ చేస్తామని బెదిరించారు -
రాంకిషన్ విషయంలో వెనక్కి తగ్గని కేజ్రీవాల్
న్యూఢిల్లీ: 'ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్'(ఓఆర్ఓపీ) పథకం అమలుతీరుతో ఆవేదన చెందిన మాజీ జవాను రాంకిషన్ గ్రెవాల్(70) ఆత్మహత్య చేసుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. జవాన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై నిన్న (బుధవారం) ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు తమ పార్టీల నేతలతో కలసి దేశ రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టగా వారికి చేదు అనుభవమే ఎదురైంది. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయంపై ఢిల్లీ సీఎం చాలా పట్టుదలతో కనిపిస్తున్నారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ మాజీ జవాను రాంకిషన్ కుటుంబాన్ని కలిసి తిరుతానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. నేడు జవాను రాంకిషన్ సొంతగ్రామానికి వెళ్లనున్నట్లు కేజ్రీవాల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న జవాను రాంకిషన్ స్వగ్రామం హరియాణాలోని భివానీ జిల్లా బామ్లా గ్రామం. జవాను కుటుంబసభ్యులను కలిసి వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపి, వారికి అండగా ఉండనున్నట్లు తెలిపారు. అయితే ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి నిన్న వెళ్లిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఓఆర్ఓపీ పథకం అమల్లో లోపాలను సరిచేయాలని రక్షణమంత్రిని కలిసి వివరించేందుకు మంగళవారం ముగ్గురు మాజీ సైనికులతో వచ్చిన రాంకిషన్ పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నారు. జవానుగా సేవలందించిన రాంకిషన్ రిటైరైన తర్వాత గ్రామంలో పారిశుధ్యంలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు 2008లో రాష్ట్రపతి చేతుల మీదుగా 'నిర్మల్ గ్రామ్ పురస్కార్' అందుకున్నారు. Will go to their village and meet Ram Kishan ji's family there today — Arvind Kejriwal (@ArvindKejriwal) 3 November 2016 -
మాజీ జవాన్ ఆత్మహత్యపై ఢిల్లీలో హైడ్రామా
-
'మా సీఎం సరే.. మీ పీఎం దేశంలోనే ఉండరేం?'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సభకు హాజరుకాకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన బీజేపీపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ముఖ్యమంత్రి సంగతి సరే ప్రధాని నరేంద్రమోదీ సంగతేమిటి.. ఆయన చాలా అరుదుగా దేశంలో కనిపిస్తున్నారు కదా అంటూ నిలదీశారు. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. అయితే, ఇందులో ముగ్గురే కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు. మిగితావారెవ్వరూ కూడా సభలో కనిపించలేదు. దీంతో బీజేపీ ప్రతిపక్ష నాయకుడు విజేంద్ర గుప్తా మాట్లాడుతూ 'ప్రత్యేక సమావేశం అంటూ పిలిచారు. కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి కనిపించడం లేదు. కేబినెట్ నుంచి ముగ్గురు మంత్రులు మాత్రమే హాజరయ్యారు. మిగితా వారెవ్వరూ లేరు' అని అంటుండగానే ఆయన మైకును కట్ చేశారు. పంజాబ్ భారత దేశంలో భాగం కాదని మీరు అనుకుంటున్నారా అంటూ స్పీకర్ ప్రశ్నించారు. వెంటనే సీట్లో కూర్చొండని ఆదేశించారు. అయితే మాట్లాడుతుంటే మైకు కట్ చేయడం ప్రజాస్వామ్యం అంటారా అని గుప్తా ప్రశ్నించారు. దీంతో ఆరోగ్యశాఖమంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి విషయం అట్లుంచితే.. ప్రధాని నరేంద్రమోదీ చాలా అరుదుగా దేశంలో కనిపిస్తున్నారుగా.. ఆయన సంగతేమిటి? ఆయన ఎందుకు దేశంలో కలియతిరగరు' అని ప్రశ్నించారు. -
లెఫ్టినెంట్ గవర్నర్, క్రేజీవాల్ మధ్య మరో వివాదం
ఢిల్లీ: క్రేజీవాల్ సర్కార్, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య మరో వివాదం రేగింది. గత వారం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మరో అడుగు ముందుకేశారు. ఢిల్లీ పాలనకు సంబంధించిన ఫైళ్ల వివరాలను తనకు పంపించాలని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై క్రేజీవాల్ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజా వివాదంతో ఢిల్లీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. లెఫ్టినెంట్ గవర్నరే ప్రభుత్వాధినేత అని హైకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుపై క్రేజీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్న విషయం తెలిసిందే. -
నేనేమీ ఆయన పరువు తీయలేదు
ప్రజలు అనుకుంటున్న విషయాలే చెప్పను న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) అవకతవకల కేసులో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువుకు భంగం కలిగించేలా తాను ఎలాంటి ఆరోపణలు చేయలేదని హస్తిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టుకు తెలిపారు. జైట్లీ గురించి బహిరంగంగా ప్రజలు చెప్పుకొంటున్న విషయాలనే తాను చెప్పానని, అంతేకానీ ఆయనకు వ్యతిరేకంగా తన సొంతమాటలు ఏవీ చెప్పలేదని ఆయన వివరణ ఇచ్చారు. జైట్లీ తనపై, ఆప్ నాయకులపై దాఖలుచేసిన పరువునష్టం దావాలో ఈ మేరకు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది మంగళవారం కోర్టుకు తెలియజేశారు. జైట్లీ పరువునష్టం కేసులో సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు అభియోగాలు ఖరారుచేసింది. ('లక్ష ఓట్లతో ఓడిపోయావు.. నీకేం పరువుంది?') డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నకాలంలో అక్రమాలు జరిగినట్టు వెలుగుచూడటంతో ఆ అవకతవకలతో జైట్లీకి సంబంధం ఉందంటూ కేజ్రీవాల్, ఆప్ నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో జైట్లీ కేంద్ర ఆర్థికమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో జైట్లీ కేజ్రీవాల్, ఆప్ నేతలు రాఘవ్ చద్దా, కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, దీపక్ వాజపేయి తదితరులపై వ్యక్తిగత హోదాలో రూ. 10 కోట్ల పరువునష్టం దావా వేశారు.