న్యూఢిల్లీ: పరువు నష్టం దావా కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తమ పరువుకు భంగం కలిగించారని ఢిల్లీ డిస్ట్రిక్ట్ అండ్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ), మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్‌లు కేజ్రీవాల్, కీర్తీఆజాద్ పై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. వారి వ్యాఖ్యలు డీడీసీఏ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయంటూ, తమ ముందు హాజరు కావాలని కోర్టు జనవరి 30న ఆదేశించింది. దీంతో మంగళవారం కోర్టు ముందు హాజరైన కేజ్రీవాల్ రూ.10,000 సొంత పూచీకత్తు, అంతే మొత్తంలో ష్యూరిటీ సమర్పించాలని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది.