granted bail
-
మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్
సాక్షి, గుంటూరు: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరైంది. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యథేచ్ఛగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ.. ఇష్టానుసారం కేసులను బనాయిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను కూడా అరెస్టు చేశారు. దాదాపు ఐదు నెలలుగా నందిగం సురేష్ జైలులో ఉన్నారు. ఆధారాలు లేకుండా సురేష్‌పై కేసులు పెట్టారంటూ కూటమి సర్కార్‌పై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. -
లగచర్ల ఘటనలో నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్
-
కూటమి సర్కార్ అక్రమ కేసులు.. ముగ్గురు సోషల్ మీడియా కార్యకర్తలకు బెయిల్
సాక్షి, గుంటూరు: చిలకలూరిపేట నియోజకవర్గ సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి దంపతులకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో సుధారాణి దంపతులు పోస్ట్ పెట్టారంటూ నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నరసరావుపేట సబ్ జైల్లో ఉన్న సుధారాణి దంపతులను పిటి వారెంట్ ద్వారా గుంటూరు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టగా, సుధారాణి దంపతులకు బెయిల్ మంజూరైంది.వైజాగ్ సోషల్ మీడియా యాక్టివిస్టు బోడి వెంకటేశ్వర్లుకు కూడా గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఒంగోలు జైలు నుంచి పిటి వారెంట్ ద్వారా గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టగా, ఆయనుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.కాగా, సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణి పట్ల మహిళ అని కూడా చూడకుండా పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారని, రోజులతరబడి ఆమెపైన, ఆమె భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా, మానసికంగా వేధించారనే ఆరోపణలున్నాయి.తెలంగాణలో గుడికి వెళ్లిన సుధారాణిని ఆమె భర్త, పిల్లలతో సహా పోలీసులు అదుపులోకి తీసుకొని చిలకలూరిపేటకు తీసుకొచ్చారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలి పెట్టాల్సింది పోయి వారి నిర్బంధంలోనే ఉంచుకొని, చిత్ర హింసలకు గురి చేశారు. ఆమెపై 6 అక్రమ కేసులు బనాయించారు. పోలీసులు శారీరకంగా వేధించి, గాయపర్చినట్లు ఆమె కోర్టుకు తెలిపారు. తనను, భర్త వెంకటరెడ్డిని, పిల్లలను చిలకలూరిపేటకు తీసుకెళ్లారని, పిల్లలను వేరు చేసి భర్తతో పాటు తనను ఒంగోలు వన్‌టౌన్ పీఎస్‌కు తరలించినట్టు ఆమె కోర్టుకు చెప్పారు. -
నందకుమార్ కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
-
దాణా కేసులో లాలూకు బెయిల్
రాంచీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు(73) జార్ఖండ్ హైకోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన ఇప్పటికే సగం జైలు శిక్షను పూర్తి చేసుకోవడంతో న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ బెయిల్ మంజూరు చేశారు. పాస్‌పోర్టును ప్రభుత్వానికి సమర్పించాలని, అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని లాలూను ఆదేశించారు. బెయిల్‌పై బయట ఉన్నంత కాలం చిరునామా, ఫోన్ నంబర్ మార్చొద్దని స్పష్టం చేశారు. ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన ఒక కేసుల్లో, అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన మరో కేసులో రూ.5 లక్షల చొప్పున జరిమానాలను డిపాజిట్ చేయాలని, రూ.లక్ష చొప్పున విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని పేర్కొన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ లాలూ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు. లాలూ తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సగం శిక్షా కాలం పూర్తిచేసుకోవడంతో బెయిల్‌కు అర్హుడేనని పేర్కొన్నారు. లాలూకు బెయిల్ ఇవ్వాలన్న వాదనను సీబీఐ తరపు న్యాయవాది రాజీవ్ సిన్హా వ్యతిరేకించారు. అయినప్పటికీ బెయిల్ ఇవ్వడానికే న్యాయస్థానం మొగ్గుచూపింది. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో లాలూ విడుదలకు రంగం సిద్ధమయ్యింది. లాంఛనాలన్నీ పూర్తయ్యాక సోమవారం విడుదలయ్యే అవకాశాలున్నాయని లాలూ తరఫు న్యాయవాది దేవర్షి మండల్ చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లో జ్యుడీషియల్ కస్టడీలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అధికారికంగా ఢిల్లీలోని తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటిదాకా 39 నెలల 25 రోజులపాటు జైలు శిక్ష అనుభవించారు. మరో మూడు కేసుల్లో గతంలోనే బెయిల్ దాణా కుంభకోణంలో(దుమ్కా ట్రెజరీ కేసు) లాలూ ప్రసాద్ యాదవ్‌కు 2018 మార్చి 24న రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు 14 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ఒక కేసులో రూ.60 లక్షలు, మరో కేసులో రూ.30 లక్షల జరిమానా విధించింది. 1990వ దశకంలో దాణా కొనుగోలు, పంపిణీకి సంబంధించి దుమ్కా ట్రెజరీ నుంచి రూ.3.13 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేశారంటూ లాలూతోపాటు ఇతరులపై కేసు నమోదయ్యింది. ఇదే దాణా కుంభకోణానికి సంబంధించిన దేవ్‌గఢ్, చైబాసా, డోరందా ట్రెజరీ కేసుల్లో ఆయనకు గతంలోనే బెయిల్ లభించింది. దుమ్కా ట్రెజరీ కేసులో కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది. తమ పార్టీ అధినేత జైలు నుంచి విడుదల కానుండడంతో ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. -
లాలూకు బెయిల్ ఇచ్చారు కానీ..
-
లాలూకు బెయిల్.. అయినా జైలే
రాంచీ: దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. చైబాసా ఖజానాకు సంబంధించిన కేసులో ఆయనకు ఊరట లభించింది. అయిదేళ్ల జైలు శిక్షలో సగం శిక్ష అనుభవించడంతో రూ.2 లక్ష ల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. అవిభాజ్య బిహార్ సీఎంగా లాలూ ఉన్నప్పుడు చైబాసా ట్రెజరీ నుంచి తప్పుడు మార్గాల్లో రూ.33.67 కోట్లు విత్‌డ్రా చేసినందుకుగాను ఆయనకు జైలుశిక్ష పడింది. ఇప్పుడు బెయిల్ వచ్చినా లాలూ విడుదలయ్యే అవకాశాల్లేవు. ఎందుకంటే దాణా కుంభకోణంలోనే దుమ్కా ఖజానాకి సంబంధించిన మరో కేసులోనూ ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఆ కేసులో రూ.3.13 కోట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయి. అనారోగ్య కారణాలతో రాంచీ లోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న లాలూ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. దాణా కుంభకోణం 1992లో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో రూ.950 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయి. ఎన్నికల ప్రచారానికి తొలిసారిగా దూరం లాలూప్రసాద్ యాదవ్ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈసారి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూకు 2018లో శిక్ష పడింది. దీంతో ఆయన తన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు ఆర్జేడీ వ్యవహారాలను అప్పగించారు. జైలు నుంచే పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న లాలూ మరికొన్ని కేసుల్లో శిక్ష అనుభవిస్తూ ఉండడంతో ఈసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదు. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రచారం చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రచా రానికి దూరంగా ఉండడం ఇదే తొలిసారి. -
భర్త మృతి; ఎమ్మార్వో సుజాతకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ భూ వివాదం కేసులో ఇటీవల ఏసీబీకి పట్టుబడ్డ షేక్‌పేట ఎమ్మార్వో సుజాతకు రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. భర్త అజయ్ అంతక్రియల్లో పాల్గొనేందుకు అనుమతినిచ్చింది. కాగా, ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ బుధవారం గాంధీనగర్‌లో భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సోదరి నివాసానికి వచ్చిన అజయ్ అయిదంతస్తుల భవనం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా భూ వివాదం కేసులో అజయ్‌ను కూడా గతంలో ఏసీబీ విచారణ చేసింది. భార్య ఏసీబీకి పట్టుబడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అజయ్ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. (చదవండి: షేక్‌పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య) -
కోర్టుకు శేఖర్
సాక్షి, చెన్నై : మహిళా జర్నలిస్టుల్ని కించపరిచిన కేసులో గట్టి భద్రత నడుమ సినీ నటుడు, బీజేపీ నాయకుడు ఎస్వీ శేఖర్ బుధవారం ఎగ్మూర్ కోర్టుకు హాజరు అయ్యారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన్ను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. మహిళా జర్నలిస్టులను కించపరిచే విధంగా వ్యవహరించిన ఎస్వీశేఖర్ మీద నాలుగు రకాల సెక్షన్లతో కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. కేసులు పెట్టి రెండు నెలలు అయినా, ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు నిరాకరించడంతో డైలమాలో పడ్డారు. శేఖర్ అరెస్టుకు సర్వత్రా డిమాండ్ చేస్తూ వచ్చినా, ఆందోళనలు సాగినా పోలీసులు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ బంధువు కావడంతోనే అరెస్టు చేయడం లేదన్న ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. ఎస్వీ శేఖర్ అజ్ఞాతంలో ఉన్నట్టుగా పోలీసులు పేర్కొంటూ వస్తున్నా, రెండురోజుల క్రితం కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్‌తో ఆయన భేటీ కావడం, మంత్రులు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ, అధికార అండదండలతో దర్జాగా తిరుగుతున్నా, పోలీసులు పట్టించుకోకపోవడంపై కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. 20వ తేదీలోపు హాజరు కావాల్సిందేనని ఎగ్మూర్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. కోర్టు కన్నెర్ర చేయడంతో మెట్లు ఎక్కేందుకు బుధవారం ఉదయాన్నే ఎస్వీ శేఖర్ సిద్ధం అయ్యారు. బెయిల్ మంజూరు పది గంటల సమయంలో మైలాపూర్‌లోని ఇంటి నుంచి పోలీసు భద్రత నడుమ శేఖర్ ఎగ్మూర్ కోర్టుకు వచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా ఏదేని ఆందోళనలు సాగవచ్చన్న సమాచారంతో పోలీసులు మరీ హడావుడి సృష్టించారు. కోర్టు పరిసరాల్లో గట్టి భద్రత కల్పించారు. పోలీసుల హడావుడి అక్కడి న్యాయవాదుల్లో సైతం ఆగ్రహాన్ని తెప్పించాయి. శేఖర్ అక్కడికి వచ్చిన సమయంలో ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ పలువురు న్యాయవాదులు నినాదాల్ని హోరెత్తించడం గమనార్హం. దీంతో శేఖర్ ముందు గేటు నుంచి కాకుండా వెనుక ఉన్న మరో గేటు ద్వారా భద్రత వలయం నడుమ కోర్టులోకి వెళ్లారు. పదిన్నర గంటలకు న్యాయమూర్తి సమక్షంలో హాజరయ్యారు. విచారణ తదుపరి ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో అదే భద్రత నడుమ ఇంటి బాట పట్టారు. -
మాల్యా,వాట్ నెక్స్ట్ ?
-
కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: పరువు నష్టం దావా కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తమ పరువుకు భంగం కలిగించారని ఢిల్లీ డిస్ట్రిక్ట్ అండ్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ), మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్లు కేజ్రీవాల్, కీర్తీఆజాద్ పై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. వారి వ్యాఖ్యలు డీడీసీఏ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయంటూ, తమ ముందు హాజరు కావాలని కోర్టు జనవరి 30న ఆదేశించింది. దీంతో మంగళవారం కోర్టు ముందు హాజరైన కేజ్రీవాల్ రూ.10,000 సొంత పూచీకత్తు, అంతే మొత్తంలో ష్యూరిటీ సమర్పించాలని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది. -
‘మనీల్యాండరింగ్’ కిందకు రాదు!
మారన్ సోదరుల కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్–మాక్సిస్ ఒప్పందం కేసులో మారన్ సోదరులకు ప్రత్యేక న్యాయస్థానం విముక్తి కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఈడీ, సీబీఐ తరఫున ఈ కేసును వాదించడానికి నియమితులైన ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది(ఎస్పీపీ) ఆనంద్ గ్రోవర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దయానిధి మారన్ , కళానిధి మారన్ లకు బెయిల్ మంజూరు చేయడం, ఈ కేసుకు సంబంధించి జప్తు చేసిన రూ. 742 కోట్లను విడుదల చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. అయితే ఈ కేసులో మనీల్యాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలు ఏమీలేవని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూద్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘‘ఈ కేసులో జప్తు చేసిన రూ. 742 కోట్లు నేర సంబంధిత ఆదాయం కిందకు రాదు. అందువల్ల మనీల్యాండరింగ్ ఏ మాత్రం కాదు’’ అని స్పష్టం చేసింది. దీనిపై ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ లో అనేక లోపాలున్నాయని తెలిపింది. లోపాలను సరిచేసుకొని సరైన పిటిషన్ తో రావడానికి ఆనంద్ గ్రోవర్‌కు బుధవారం(8వ తేదీ) వరకు సమయమిచ్చింది. కేసు తీవ్రత దృష్ట్యా మారన్ సోదరులకు బెయిల్ మంజూరు చేయకూడదని, జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయకూడదనే ఉద్దేశంతో ఈడీ, సీబీఐ కోసం ఎదురు చూడకుండా తాను ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు గ్రోవర్ కోర్టుకు తెలిపారు. -
‘తప్పుడు అఫిడవిట్’ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్
న్యూఢిల్లీ: 2013 అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ సందర్భం గా తప్పుడు సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేశారంటూ దాఖలైన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 10 వేల బాండ్‌తో సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆశిష్ గుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేసు విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేశారు. ఈ కేసుకు సంబంధించి ఆగస్టు 31న జరిగిన విచారణ నుంచి కేజ్రీవాల్‌కు వ్యక్తిగత మినహాయింపు ఇచ్చిన కోర్టు ప్రస్తుతం బెయిల్ ప్రొసీడింగ్స్ ఉన్నందున వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించడంతో ఆయన విచారణకు వచ్చారు. -
తుంటరి బకరాకు బెయిల్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఓ కలెక్టర్ గారి తోటలో ప్రవేశించి గలాటా చేసిన మేకకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. కలెక్టర్ హేమంత్ రాత్రే తోటలోకి చొరబడిన కేసులో సోమవారం అరెస్టయిన ఈ బకరాకు.. స్థానిక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం నాడు ఆ తుంటరి మేకపిల్లను కోర్టు ముందు హాజరు పరిచారు. మేకతో పాటు స్టేషన్లో ఊచలు లెక్కపెడుతున్న యజమాని అబ్దుల్ కూడా కోర్టు తుది నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాడు. తాము నమోదుచేసిన సెక్షన్ల ప్రకారం రెండు నుంచి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని ఎస్సై ఆర్.పి.శ్రీవాస్తవ తెలిపారు. రాజధాని రాయ్‌పూర్ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో నివసించే అబ్దుల్ హసన్‌కు చెందిన మేక జిల్లా కలెక్టర్ హేమంత్ రాత్రే తోటలో పూలను, కూరగాయలను నాశనం చేసింది. దీనిపై తోటమాలి పలుమార్లు అబ్దుల్ని హెచ్చరించాడు. అయినా గత సోమవారం తోటలోకి చొరబడిన మేక నానా బీభత్సం సృష్టించడంతో తోటమాలి ఫిర్యాదు చేయడం, పోలీసులు సదరు మేకను అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. -
కాల్‌మనీ కేసులో ముగ్గురికి బెయిల్
విజయవాడ లీగల్: కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసులో ముగ్గురు నిందితులకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేస్తూ మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి.అనుపమచక్రవర్తి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. కేసులో నిందితులుగా ఉన్న యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రాము, పోలురౌతుల భవానీ శంకర్‌వరప్రసాదు అలియాస్ భవానీ శంకర్, దూడల రాజేష్‌లు తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత నెలలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై వాదోపవాదాలు అనంతరం న్యాయమూర్తి నిందితులకు బెయిల్ నిరాకరించారు. నిందితులు మళ్లీ తమ న్యాయవాదుల ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా వాదనల అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. మల్లాది విష్ణు కస్టడీ పిటిషన్ తిరస్కరణ విజయవాడ లీగల్: కల్తీ మద్యం కేసులో నిందితుడిగా వున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును మూడు రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ డి.లక్ష్మి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. నాలుగు రోజులు కస్టడీలో విష్ణు సరైన సమాచారం ఇవ్వకపోగా, విచారణకు సహకరించలేదని, అందువల్ల మళ్లీ కస్టడీ కోరుతూ కృష్ణలంక పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వాదనల అనంతరం ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులిచ్చారు. కాగా, మల్లాది విష్ణు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నగర మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఇక ‘ఖాకీ’ పప్పులుడకవ్.!
- స్టేషన్ బెయిల్ విధానాన్ని రద్దు చేసిన కేంద్రం - కేసు నమెదు చేసి కోర్టులో హాజరుపరచాల్సిందే - అక్రమ ఆదాయానికి గండి - పోలీసు అధికారులకు గుబులు సాక్షి, విశాఖపట్నం: హత్య, అత్యాచారం వంటి తీవ్ర నేరాలు మినహా ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే ఎలాంటి కేసులోనైనా పోలీస్ స్టేషన్లోనే నిందితులకు బెయిల్ మంజూరు చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రద్దు చేసింది. దీంతో ఇక మీదట స్టేషన్‌కు వచ్చే ప్రతి కేసును కచ్చితంగా న్యాయ స్థానానికి పంపించాల్సిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జిల్లా, నగర పోలీసులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లూ ఈ అవకాశాన్ని అడ్డుపెట్టుకుని హాయిగా దోచుకుతిన్న వారు తమ అక్రమాదాయానికి గండి పడిందని తెగ బాధపడిపోతున్నారు. నేరం రుజువైతే ఏడేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాల్లో నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చే అధికారాన్ని సిఆర్పీసీ సెక్షన్ 41-ఎ, దాని సబ్ క్లాజ్‌ల ప్రకారం స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఐదేళ్ల క్రితం కట్టబెట్టారు. నేరం ఆరోపించిన వ్యక్తికి రాజ్యాంగ పరంగా ఉండే ప్రాధమిక హక్కులకు భంగం వాటిల్లకూడదనే ఉద్దేశంతో కల్పించిన ఈ సదుపాయం తర్వాత పోలీసు అధికారులకు కల్ప తరువుగా మారింది. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు నిందితుల నుంచి సొమ్ములు వసూలు చేయడం ప్రారంభించారు. సొమ్ము కోసం బాధితులను బెదిరించడం కూడా ప్రారంభించారు. నిందితులకు అండగా నిలబడి సెటిల్మెంట్లు చేయడం మొదలుపెట్టారనే విమర్ళలున్నాయి. విశాఖలో ఇలాంటి అక్రమాలకు పాల్పడి ఇద్దరు పోలీసు అధికారులు కొన్ని నెలల క్రితం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. శివారు ప్రాంతాల్లోని స్టేషన్లలో ఇప్పటికీ స్టేషన్ బెయిల్ పేరుతో బాధితులకు అన్యాయం చేసి నిందితుల తరపున పోలీసులు వకాల్తా పుచ్చుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా కేవలం ఒక్క రోజులోనే స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తుండటంతో నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా మాయం చేస్త్నున్నారు. అయితే ఇలాంటి సమస్యలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 41-ఎ లో సవరణలు చేసింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఇక మీదట బెయిల్ ఇవ్వవద్దని చెప్పడంతో ఇప్పుడు కేసు నమోదు చేయకుండానే సెటిల్మెంట్లు చేసేస్తారోమో..! సుప్రీం తీర్పుపై హర్షం విశాఖ లీగల్: సుప్రీం కోర్టు పోలీసు అధికారులకు బెయిల్ మంజూరు చేసే అధికారాన్ని రద్దు చేయ డం పట్ల విశాఖ న్యాయవాదుల సంఘం హర్షం ప్రకటించింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సు ప్రీం కోర్టు తీర్పు పట్ల ఆనందం వ్యక్తం చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 41 ఎ, బిపై మంగళవారం సుప్రీంకోర్టు ప్రకటించిన నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా వేలాదిమంది జూనియర్ న్యాయవాదులకు మంచి అవకాశం లభించిందన్నారు. దీనివల్ల ప్రతి కక్షిదారుడు పోలీసులను ఆశ్రయించకుండా నేరుగా న్యాయస్థానంలో బెయిల్ పొందడం సులభమవుతుందన్నారు. -
ప్రొఫెసర్ సాయిబాబాకు తాత్కాలిక బెయిల్
ముంబై: నిషిద్ధ మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాకు బాంబే హైకోర్టు బుధవారం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని.. వైద్య చికిత్స కోసం తాత్కాలిక బెయిల్‌పై విడుదల చేయకపోతే ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తాము భావిస్తున్నామని.. అదే జరిగితే సాయిబాబా ప్రాధమిక హక్కును పరిరక్షించటంలో కోర్టు విఫలమైనట్లవుతుందని.. ప్రధాన న్యాయమూర్తి మోహిత్‌షా సారథ్యంలోని డివిజన్ బెంచ్ పేర్కొంది. అనారోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మూడు నెలల కాలానికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం చక్రాల కుర్చీకే పరిమితమైన సాయిబాబాను.. రూ. 50,000 పూచీకత్తుపై విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. గత ఏడాది ఢిల్లీలో సాయిబాబాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ ఆయన నాగ్‌పూర్ జైలులో ఉన్నారు. కేసు నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని వెలువడిన వార్తా కథనంతో పాటు.. సామాజిక కార్యకర్త పూర్ణిమా ఉపాధ్యాయ్ రాసిన లేఖను సుమోటో విచారణకు స్వీకరించిన బాంబే హైకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.