
‘తప్పుడు అఫిడవిట్’ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్
న్యూఢిల్లీ: 2013 అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ సందర్భం గా తప్పుడు సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేశారంటూ దాఖలైన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 10 వేల బాండ్‌తో సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆశిష్ గుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేసు విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేశారు. ఈ కేసుకు సంబంధించి ఆగస్టు 31న జరిగిన విచారణ నుంచి కేజ్రీవాల్‌కు వ్యక్తిగత మినహాయింపు ఇచ్చిన కోర్టు ప్రస్తుతం బెయిల్ ప్రొసీడింగ్స్ ఉన్నందున వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించడంతో ఆయన విచారణకు వచ్చారు.