
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ భూ వివాదం కేసులో ఇటీవల ఏసీబీకి పట్టుబడ్డ షేక్‌పేట ఎమ్మార్వో సుజాతకు రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. భర్త అజయ్ అంతక్రియల్లో పాల్గొనేందుకు అనుమతినిచ్చింది. కాగా, ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ బుధవారం గాంధీనగర్‌లో భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.
సోదరి నివాసానికి వచ్చిన అజయ్ అయిదంతస్తుల భవనం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా భూ వివాదం కేసులో అజయ్‌ను కూడా గతంలో ఏసీబీ విచారణ చేసింది. భార్య ఏసీబీకి పట్టుబడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అజయ్ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.
(చదవండి: షేక్‌పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment