shaikpet
-
Hyderabad: షేక్‌పేట్‌లో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫుట్‌పాత్‌పై ఉన్న దుకాణాల్లో మంటలు చెలరేగాయి. మొదట వెల్డింగ్ షాప్‌లో మంటలు సంభవించాయి. దీంతో పక్కనున్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. చదవండి: కరీంనగర్: కిడ్నాపర్ చెర నుంచి తల్లి ఒడికి -
Coffee : షేక్‌పేటలో కాఫీ కొత్త రుచులు
బెంగెట్, బెర్గెండాల్, బెర్నార్డినా, బ్లూమౌంటెన్, బోర్బన్.. చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు కాఫీల్లో. కతుర్రా, ఛారియర్, హరార్, ఫ్రెంచ్ మిషన్ ఇలా ఒక్కో దేశంలో కాఫీది ఒక్కో రుచి. కోన, జావా అంటూ దీవుల్లో, మోచా, పాకాస్ అంటూ లాటిన్ అమెరికాల్లో, సగడ, శాంటోస్ పేరిట దక్షిణాది దేశాల్లో.. ఇలా కాఫీ అంటే ప్రాణం ఇచ్చేవారు లోకమంతా కనిపిస్తారు. కాఫీ రుచులు, ఐస్ క్రీం టేస్టులు అందించే లా రొసెట్టా, సౌత్ పోల్ షాపులను షేక్‌పేట, ఓయూ కాలనీలో ప్రారంభించిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. నాణ్యత, ప్రామాణికాలే వ్యాపారాభివృద్ధికి దోహదపడతాయన్నారు. నాణ్యత ప్రమాణాలు కలిగి రుచికరమైన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించగలిగితే వ్యాపారం అంచలంచెలుగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని సూచించారు. కల్తీలేని ఆహార పదార్థాలు, రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్న చోటుకు వినియోగదారులు వెతుక్కుంటూ రావడానికి ఇష్టపడతారన్నారు. పిల్లలకు యువతకు ఇష్టకరమైన అన్ని ఐటమ్స్ ఉంచగలిగితే వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ ఛైర్మన్ నరేందర్ ముదిరాజ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి. బి.ఆర్.ఎస్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, నేపథ్య గాయకుడు, సంభాషణల రచయిత రాకేందు మౌళి వెన్నెలకంటి, శ్యామ, శ్రీనివాసరావు, ప్రశాంతి, శ్యామ్ సుందర్, శిరీష, రవికాంత్ , శ్రీకాంత్ మరియు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
Hyderabad: షేక్‌పేట్ మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి
-
షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన సుజాత శనివారం ప్రాణాలు విడిచారు. సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో గతంలో సుజాత ఇంటిపై దాడి చేసిన ఏసీబీ అధికారులు.. ఆమెను అరెస్ట్ చేశారు. ఏసీబీ దాడుల అనంతరం ఏడాది క్రితమే సుజాత భర్త ఆత్మహత్య పాల్పడ్డాడు. అప్పటి నుంచి తీవ్రమైన మానసిక క్షోభతో బాధపడుతున్న సుజాతకు మళ్లీ విధుల్లోకి చేరేందుకు అవకాశం ఇచ్చినా ఆమె తిరస్కరించారు. క్రమంలోనే డిప్రెషన్లోకి వెళ్లిన సుజాత.. ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తొలుత ప్రచారం జరిగింది. అయితే తాజాగాకు ఆమె గుండెపోటుతో మృతిచెందినట్టుగా తెలుస్తోంది. సుజాత మృతిని ధృవీకరించిన వైద్యులు మాజీ ఎమ్మార్వో సుజాత మృతిని వైద్యులు ధృవీకరించారు. గత వారం క్రితం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్‌కు తీసుకు వచ్చినట్లు తెలిపారు. మరోవైపు సుజాతకు క్యాన్సర్ కూడా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అదే సమయంలో డెంగీ కూడా సోకడంతో వైద్యులు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. అయితే చికిత్స కొనసాగుతూ ఉండగానే ఈ ఉదయం గుండెపోటుతో సుజాత మృతి చెందినట్లు తెలిపారు. సుజాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులు చిక్కడ పల్లికి తరలించారు. చదవండి: వాట్సాప్ గ్రూపునకు అడ్మిన్ చేస్తే.. బయటకు తోసేశారు, న్యాయం చేయండి -
షేక్‌పేట ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన:మంత్రి కేటీఆర్
-
జీహెచ్ఎంసీ పరిధిలో ఇది అతి పెద్ద ఫ్లైఓవర్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు లేన్లతో అత్యంత పొడవైన (2.71 కి.మీ) షేక్‌పేట ఫ్లైఓవర్, ఒవైసీ– మిధాని ఫ్లైఓవర్ (1.3 కి.మీ) వారంలో ప్రారంభం కానున్నాయి. నగరంలో దాదాపు 11.5 కి.మీ. పొడవైన పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే నాలుగు లేన్లది కాగా, ఆరులేన్ల ఎలివేటెడ్ కారిడార్లలో షేక్‌పేటది అత్యంత పొడవైనదిగా రికార్డుకెక్కనుంది. నాలుగు ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ చిక్కుల్ని తొలగించే ఈ ఫ్లైఓవర్ ఔటర్ రింగ్‌రోడ్డు– ఇన్నర్ రింగ్‌రోడ్డును కలిపే వారధిగానూ మారనుంది. వివరాలిలా ఉన్నాయి. ట్రాఫిక్ ఇక్కట్లుండవ్.. ఇంధన వ్యయం తగ్గుతుంది.. రెండు ఫ్లై ఓవర్లు వినియోగంలోకి వస్తే ఆయా మార్గాల్లో ప్రయాణించేవారికి ట్రాఫిక్ చిక్కులు తగ్గడంతోపాటు తద్వారా ఇంధన వ్యయం, ప్రయాణ సమయం తగ్గుతాయి. జంక్షన్ల వద్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. ఎస్సార్డీపీ కింద ఈ రెండు ఫ్లై ఓవర్లతో సహా ఇప్పటి వరకు రూ. 2వేల కోట్ల విలువైన 22 పనులు పూర్తయినట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు. గురువారం రెండు ఫ్లై ఓవర్లను పరిశీలించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పురోగతిలో ఉన్న రూ.6 కోట్ల విలువైన 25 పనుల్ని వచ్చే సంవత్సరం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. పనులు పూర్తయిన రెండు ఫ్లై ఓవర్ల ప్రారంభోత్సవం దాదాపు వారం రోజుల్లో జరిగే అవకాశముందన్నారు. (చదవండి: తెలంగాణ: కీలక దశకు చేరుకున్న ఉద్యోగుల విభజన) షేక్‌పేట ఫ్లైఓవర్.. (గెలాక్సీ థియేటర్ నుంచి మల్కంచెరువు వరకు) సెవెన్‌టూంబ్స్, ఫిల్మ్‌నగర్ మెయిన్‌రోడ్డు, ఓయూకాలనీ, విస్పర్‌వ్యాలీ టీ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కుల్ని తొలగించే ఈ భారీ ఫ్లైఓవర్ వల్ల నానల్‌నగర్ నుంచి ఖాజాగూడ, అక్కడి నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు వరకు దాదాపు 11 కి.మీ మేర సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యం కానుంది. కోర్‌సిటీ నుంచి హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల వైపు రాకపోకలు సాగించేవారికి దీని వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇన్నర్ రింగ్‌రోడ్డు (రేతిబౌలి) నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు (గచ్చిబౌలి) వరకు లక్డికాపూల్, మెహిదీపట్నం, టోలిచౌకి, గచ్చిబౌలి మార్గాల్లో ప్రయాణించే దాదాపు 4 లక్షల వాహనాలకు భారీ ఊరట. బయోడైవర్సిటీ జంక్షన్– జేఎన్టీయూ జంక్షన్ మార్గానికి అనుసంధానంగానూ ఉన్న ఈ ఫ్లైఓవర్ వల్ల దాదాపు 17 కి.మీ మేర (లక్డీకాపూల్–జేఎన్టీయూ జంక్షన్) సాఫీ ప్రయాణం సాధ్యమని ఈ ప్రాజెక్ట్ పనులు పర్యవేక్షించిన ఎస్ఈ వెంకటరమణ పేర్కొన్నారు. ఒవైసీ– మిధాని జంక్షన్ ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వస్తే మిధాని జంక్షన్ వైపు నుంచి ఎల్బీనగర్ వైపు వెళ్లే వారికి ఎంతో సదుపాయం. మిధాని, ఒవైసీ జంక్షన్ల వద్ద ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు తప్పుతాయి. ముఖ్యంగా డీఆర్డీఓ, డీఆర్డీఏ, ఏఎస్ఎల్ తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. నగరం తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధిగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఆరాంఘర్ నుంచి ఎల్బీనగర్ మార్గంలో ఇబ్బందులుండవన్నారు. క్రాష్ బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్, శ్లాబ్ పానెల్స్ వంటి పనులకు ఆర్సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ వాడినట్లు, దీని వల్ల ఎంతో సమయం కలిసి రావడంతోపాటు మ్యాన్‌పవర్ తగ్గిందని, పని ప్రదేశంలో ప్రమాదాల రిస్క్ తగ్గిందని పనులు పర్యవేక్షించిన ఎస్ఈ దత్తుపంత్ తెలిపారు. దేశంలో ఇలాంటి టెక్నాలజీ హైదరాబాద్‌లోనే తొలిసారి వినియోగించగా, పాతబస్తీలో ఇదే ప్రథమమన్నారు. ఈ మార్గంలో రద్దీ సమయంలో ప్రస్తుత ట్రాఫిక్: గంటకు 11,241 పీసీయూ. (చదవండి: ఈ విషయంలో ముంబైని వెనక్కి నెట్టనున్న హైదరాబాద్) -
బంజారాహిల్స్‌లో ఒకే స్థలం ముగ్గురు, నలుగురికి విక్రయం
సాక్షి, హైదరాబాద్: నకిలీ డాక్యుమెంట్లు.. ఫోర్జరీ సంతకాలతో సర్కారు స్థలాలను స్వాహా చేసేందుకు ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. గతంలో ఓ రెవెన్యూ అధికారి సంతకం ఫోర్జరీ చేసి దొరికిపోయినా.. మరొకరు జైలు ఊచలు లెక్కపెట్టినా.. విలువైన స్థలాలను కబ్జా చేసేందుకు అదే తతంగాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఇదే తరహా ఘటన షేక్‌పేట మండలంలో జరిగింది. బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని ఎమ్మెల్యే కాలనీకి వెళ్లే రోడ్డులో చర్చి ఎదురుగా ఉన్న 25 ఎకరాల ప్రభుత్వ స్థలంపై రోజుకో కబ్జాదారుడు ఫోర్జరీ పత్రాలను సృష్టిస్తూ.. దర్జాగా కోట్లాది రూపాయలకు విక్రయిస్తున్నారు. గత మార్చిలో డాక్టర్ తిరుమల రాంచందర్‌రావు నకిలీ పత్రాలు సృష్టించి 9.17 ఎకరాలను ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు రూ.10 కోట్లు అడ్వాన్ప్‌గా తీసుకొని అంటగట్టారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత రికార్డులను పరిశీలించిన సదరు ప్రొఫెసర్ లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూమిని అమ్మిన రాంచందర్‌రావు సహా మరో ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన మరువకముందే ఇదే నిందితుడు మళ్లీ ఏకంగా షేక్‌పేట మండల తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి.. ఈ స్థలాన్ని అంటగట్టేందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. భూమి కొనుగోలు చేసిన వ్యక్తి పత్రాల పరిశీలన కోసం తహసీల్దార్ వద్దకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలు కథ ఇదీ! 1950లో భూమిలేని ముగ్గురికి జీవనోపాధి నిమిత్తం బంజారాహిల్స్ రోడ్డు నం.12లో 25 ఎకరాలను ప్రభుత్వం అసైన్డ్ చేసింది. అయితే, సదరు అసైన్డ్‌దారులు వ్యవసాయం చేయకపోవడం..భూమి కూడా సాగుకు అనువుగా లేకపోవడంతో అప్పటి కలెక్టర్ అసైన్మెంట్ను రద్దు చేశారు. విచిత్రమేమిటంటే.. అసైన్మెంట్ రద్దుకు మునుపే.. ఈ భూమి చేతులు మారింది. 25 ఎకరాల భూమిని మూడు సొసైటీలు కొనుగోలు చేశాయి. అసైన్మెంట్ను రద్దు చేయడంతో ఈ సొసైటీలు కోర్టుకెక్కాయి. దీంతో ఈ వివాద పరిష్కారానికి అప్పట్లో ప్రభుత్వం శాసనసభ కమిటీని వేయగా వీరికి 166 జీవో కింద స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు వెసులుబాటు కల్పించాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. ఈ నిర్ణయానికి ప్రభుత్వం అంగీకరించినా.. సొసైటీ సభ్యులకు ఈ స్థలాన్ని పంపిణీ చేయడం కష్టతరంగా ఉందని చెప్పడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇదే అదునుగా ఈ భూమిపై కన్నేసిన భూ మాఫియా.. రోజుకో ఫోర్జరీ పత్రాలతో స్థలాలను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ► దాదాపు రూ.2వేల కోట్ల విలువ చేసే ఈ భూమిలో 9 ఎకరాల 17 గుంటలు తనదేనంటూ రూ.10 కోట్లకు విక్రయించి పోలీసులకు దొరికిపోయారు. ► కేవలం ఒకరికేగాకుండా..ఈ కేసు నమోదుకు ముందు కూడా మరొకరికి ఇదే భూమిని అమ్మజూపుతూ కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా తీసుకోవడం గమనార్హం. ► విచిత్రమేమిటంటే.. విలువైన ఈ భూమిని కాజేసేందుకు తెరవెనుక పావులు కదుపుతున్న రియల్ మాఫియా.. అధికారుల సంతకాలు ఫోర్జరీ, నకిలీ పత్రాలను సృష్టిస్తునే ఉంది. ఈ పత్రాలతోనే బురిడీ కొట్టిస్తూ.. అడ్వాన్స్ రూపేణా రూ.కోట్లు కొట్టేయడం పరిపాటిగా మారింది. ► ఏకంగా 40 మంది కబ్జాదారులు తప్పుడు పత్రాలతో అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు స్థానికంగా ప్రచారమవుతుందంటే.. ఈ భూమిని మింగేయడానికి ఎలా పావులు కదుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కేసు నమోదు బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా సుమారు 25 ఎకరాల ప్రభుత్వ స్థలంలోని 9 ఎకరాలు తమవే అంటూ ఆ ప్రాంతానికే చెందిన డా.రాంచందర్‌రావు అనే వ్యక్తి వాదిస్తున్నారు. ఈ క్రమంలో స్థలాన్ని విక్రయిస్తామంటూ చెప్పడంతో పాటు కొన్ని పత్రాలను రాంచందర్‌రావు తమకు ఇచ్చారంటూ సోమవారం ఓ వ్యక్తి షేక్‌పేట మండల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఈ పత్రాలు నిజమైనవైతే సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలంటూ కోరాడు. అతడు ఇచ్చిన పత్రాలను పరిశీలించగా.. తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన షేక్‌పేట తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం సాయంత్రం నిందితుడు రాంచందర్‌రావు తదితరులపై ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉంది బంజారాహిల్స్ రోడ్ నెం.12లో చర్చి ఎదురుగా ఉన్న 25 ఎకరాల స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అయితే ఫోర్జరీ పత్రాలతో చాలా మంది కబ్జాదారులు విక్రయాలకు తెగబడుతున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. ఎప్పటికప్పుడు మేం క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. సీసీఎస్‌లో కూడా రాంచందర్‌రావు అనే వ్యక్తిపై కేసు నమోదైంది. మూడు రోజుల క్రితం కొందరు వ్యక్తులు ఈ స్థలానికి సంబంధించి పత్రాలు తీసుకొని రాగా అవి ఫోర్జరీవి అని తేలింది. గతంలోనే సీసీఎస్ పోలీసులు ఈ స్థలానికి సంబంధించి వివరాలు అడగగా వారికి ఇవ్వడం జరిగింది. తప్పుడు పత్రాలతో ప్రభుత్వ స్థలాలు విక్రయించేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా స్థలం అమ్మకానికి ఉందని పత్రాలు ఇస్తే నేరుగా మాకు ఫిర్యాదు చేయవచ్చు. – శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్, షేక్‌పేట మండలం -
అరకు ప్రమాదం: హుషారుగా వెళ్లి.. విషాదంగా..
సాక్షి, హైదరాబాద్: అరకు లోయలో బస్సు పడిన ప్రమాద ఘటన బాధితులు శనివారం రాత్రి నగరానికి బయలుదేరారు. నలుగురి మృతదేహాలను సైతం ప్రత్యేక వాహనంలో నగరానికి తరలించారు. షేక్‌పేట్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదం నుంచి బయట పడిన 16 మందిని భయాందోళన ఇంకా వెంటాడుతూనే ఉంది. శుక్రవారం అరకు లోయలో బస్సు పడిపోయిన దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. 23 మంది పెద్దలు, నలుగురు పిల్లలతో కలిసి మొత్తం 27 మంది హైదరాబాద్ నుంచి విహార యాత్రకు వెళ్లారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారికి విశాఖలో అత్యవసర వైద్యాన్ని అందిస్తున్నారు. విహార యాత్రకు వెళ్లే ముందు హైదరాబాద్‌లో.. ప్రమాదం తర్వాత విశాఖ నుంచి తిరిగి వస్తూ.. ప్రమాదం నుంచి త్రుటిలో బయటిపడి ఇళ్లకు చేరుకోవడంతో 16 మంది కుటుంబ సభ్యులకు కొంత ఊరట కలిగించింది. మృతుల కుటుంబాలు మాత్రం శోకసంద్రంలో మునిగిపోయాయి. కాగా.. శనివారం ఉదయం అరకు లోయ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించేందుకు సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత కుమారి, షేక్‌పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ విశాఖపట్నం వెళ్లారు. మృతులు, గాయపడిన కుటుంబాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు కూడా అక్కడికి బయలుదేరారు. వీరు విశాఖపట్నానికి వెళ్లేందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విమాన టికెట్లు అందించారు. చదవండి: కామారెడ్డిలో ఆర్టీసీ బస్ బోల్తా.. నలుగురి పరిస్థితి విషమం -
విహారంలో విషాదం.. ఉలిక్కిపడ్డ షేక్‌పేట
సాక్షి, హైదరాబాద్ : ‘అమ్మమ్మ వెళ్లొస్తాం.. తాతయ్య అరకు అందాలు చూసొస్తాం.. అమ్మా పదిలం.. నాన్న జాగ్రత్త’ అంటూ చిరునవ్వులతో బై బై చెబుతూ ఆనందంగా విహారయాత్రకు వెళ్లిన వారిలో కొందరు రోడ్డు ప్రమాదంలో విగత జీవులయ్యారని తెలియడంతో షేక్‌పేట ప్రాంతంలో విషాదం అలముకుంది. షేక్‌పేటలోని వినాయక్‌నగర్, సీతానగర్‌కు చెందిన మూడు కుటుంబాలకు చెందిన చిన్నారులు, పెద్దలు మొత్తం 25 మంది ఈ నెల 10న ఉదయం 5.30 గంటలకు షేక్‌పేట నుంచి దినేశ్ ట్రావెల్స్ మినీ బస్సులో ఆంధ్రప్రదేశ్‌కు విహార యాత్రకు బయలుదేరి వెళ్లారు. శుక్రవారం వీరి బస్సు అరకు సమీపంలో లోయలో పడిపోవడంతో నలుగురు చనిపోయినట్లు, చాలా మందికి తీవ్రగాయాలైనట్లు ఇక్కడికి సమాచారం అందింది. దీంతో స్థానికంగా ఉన్న వారి బంధువులు తీవ్ర ఆవేదన చెందారు. గాయపడిన వారి ఆరోగ్యపరిస్థితిపై వాకబు చేశారు. వీరిలో కొంతమంది ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ యాత్రలకు.. ఈ కుటుంబాల వారు గతంలోనూ అందరూ కలిసి ఏడుపాయల, వరంగల్‌లోని పర్యాటక ప్రాంతాలకు ఆనందంగా వెళ్లి వచ్చారని...ఈసారి కూడా అలానే వస్తారని అనుకున్నామని బాధిత కుటుంబసభ్యులు వాపోయారు. మా వయసు మీద పడడంతో మమ్మల్ని ఇంటివద్దనే ఉండమన్నారని, వాళ్లు ఇలా ప్రమాదానికి గురవుతారని ఊహించలేదని వృద్ధులు ఆవేదన చెందారు. వ్యక్తిగత పనుల మీద ఇదే కుటుంబాలకు చెందిన నలుగురు చివరి నిమిషంలో పర్యటనకు వెళ్లలేదని తెలిసింది. కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే కొంతమంది బంధువులు హుటాహుటిన అరకు బయలుదేరి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యంపై ఆరా తీశారు. ట్రావెల్ ఏజెంట్‌కు ఫోన్‌కాల్ చేస్తే స్పందించకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మృతుల వివరాలు తెలియక స్థానికులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం తిరిగి రావాల్సింది.. రిటైర్డ్ బ్యాంక్ అధికారి నర్సింహారావు ఆధ్వర్యంలో విహారయాత్రకు వెళ్లారు. ఈ నెల 10న నగరం నుంచి బయలు దేరిన వీరు మొదట విజయవాడకు వెళ్లారు. అక్కడి నుంచి అమరావతి, పాలకొల్లు నరసింహాస్వామి దేవాలయం, అన్నవరం నుంచి అరకు వెళ్లారు. అరకు లోయ అందాలను తిలకించి తిరిగి సింహాచలం వెళ్తుండగా డముకు వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదానికి కొద్దిసేపటికి ముందే తమకున ఫోన్ చేసి ఆదివారం ఇంటికి వస్తామని చెప్పారని, ఇంతలోనే విషాద వార్త వినాల్సి వచ్చిందని బంధువులు కంట తడిపెట్టారు. నిన్ననే చివరగా మాట్లాడింది... మా అక్క లత నిన్ననే చివరగా ఫోన్లో మాట్లాడింది. ‘టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నాం. మేమంతా సందడిగా..ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుగుతున్నాం. నీవు రాత్రిపూట మా ఇంటివైపు వెళ్లి చూడు. ఆదివారంలోపు ఇంటికి వచ్చేస్తాం’ అని చెప్పింది. ఇంతలోనే శుక్రవారం ఈ ఘటన జరగడం తీవ్రంగా కలచివేసింది. అక్క ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిందని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యాం. – విజయ్‌కుమార్ ఫికర్ పెట్టుకోవద్దని చెప్పి.. ‘టూర్‌ను ఆస్వాదిస్తున్నాం. మా మీద బెంగ పెట్టుకోకండి. పాటలు పాడుతూ.. వేళకు తింటూ పర్యటన సాగిస్తున్నాం. ఒకట్రెండు రోజుల్లో తిరిగి వస్తాం’అని తన భార్య శైలజ చెప్పిందని ఆమె భర్త జగదీశ్ రోధించారు. బస్సు ప్రమాదంలో శైలజ గాయపడ్డ సంఘటన తెలుసుకున్న ఆయన.. బస్సులో సీట్లు లేకపోవడంతో తాను ఈ పర్యటనకు వెళ్లలేపోయానని ‘సాక్షి’కి తెలిపారు. రోజూ ఫోన్ చేసేవారు రోజు తమతో మాట్లాడే తమ బంధువులు ప్రమాదానికి గురికావడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని దయానంద్ వాపోయారు. మూడు కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్న నర్సింగ్‌రావు శుక్రవారం కూడా మాట్లాడాడని, భద్రంగానే ఉన్నామని చెప్పారని ఆయన అన్నారు. చిన్నారి శ్రీనిత్య బాగానే ఉందని, పాప తండ్రి బెంగ పెట్టుకోకుండా చూడమని తనను కోరారని, ఇంతలోనే చేదు వార్త వినాల్సిరావడం కలిచివేసిందన్నారు. అంతా బాగుంది.. రేపు వస్తున్నామన్నారు.. ‘అంతా బాగుంది. పర్యటన సాఫీగా సాగుతుంది. అరకు చేరుకున్నాం. రేపటిలోగా తిరిగివస్తాం’ ప్రమాదంలో చనిపోయిన సరిత చివరిగా కుమారుడితో చెప్పిన మాటలివి. క్షేమంగా తిరిగివస్తానని చెప్పి తన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడం తమను శోకసంద్రంలో ముంచిందని ఆమె తనయుడు నవీన్ కన్నీరు మున్నీరయ్యారు. శుక్రవారం ఉదయం తనతో మాట్లాడిన తల్లి రాత్రికి విగత జీవిగా మారడంతో ఆయన తీవ్రంగా కలత చెందారు. తీర్థయాత్రలను బాగా ఎంజాయ్ చేస్తున్నాం.. రేపు రాత్రి ఇంటికి చేరుకుంటాం. మీరేలా ఉన్నారని యోగక్షేమాలు తెలుసుకుందని ఆయన బోరున విలపించారు. అరగంట ముందే మాట్లాడా.. ఘటనకు అరగంట ముందే మా బంధువు నందూతో ఫోన్లో మాట్లాడా. ఆ బస్సులో డ్రైవర్‌ను జర్నీ వద్దు..బస్సు ఆపేయమంటూ అందరూ వారిస్తూ లొల్లి చేస్తున్న సమయంలోనే నాతో మాట్లాడాడు. జర్నీ వద్దని ఎంత చెప్పినా డ్రైవర్ వినటం లేదని చెప్పాడు. ఇలా మాట్లాడినా అరగంటలోనే బస్సు లోయలో పడిపోయింది. నాతో ఫోన్లో మాట్లాడిన నందూ తీవ్రంగా గాయపడ్డాడు. – రామారావు ఐదుగురికి విమాన టికెట్లు విశాఖ జిల్లా అరకు ప్రమాదబారిన కుటుంబసభ్యులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పరామర్శించారు. తక్షణమే విశాఖకు వెళ్లేందుకు ఐదుగురి విమాన టికెట్లను ఆయన సమకూర్చారు. మృతదేహాలను తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
వివాదంలో కేకే కుమార్తె విజయలక్ష్మి
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేశవరావు (కేకే) కుమార్తె విజయలక్ష్మి వివాదంలో చిక్కుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమెపై షేక్‌పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయలక్ష్మి తనపై దాడి చేసిందంటూ బుధవారం నాటి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెతో పాటు అనుచరులు షేక్‌పేటలోని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తనను దుర్భాషలాడడమే కాకుండా తన ఉద్యోగ విధుల రీత్యా హైకోర్టుకు వెళ్తుతుండగా అడ్డుకుని నెట్టివేశారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాను ఎంపీ కేశవరావు కూతుర్ని అంటూ బెదిరింపులకు దిగారని ఆరోపించారు. ఈ మేరకు శ్రీనివాస్ రెడ్డి ఓ వీడియోను సైతం విడుదల చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా బంజారాహిల్స్ డివిజన్ నుంచి రెండుసార్లు కార్పొరేటర్‌గా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గ్రేటర్ పీఠం ఈసారి మహిళకు రిజర్వు కావడంతో ఆమె హైదరాబాద్ మేయర్ అయ్యే అవకాశం ఉందంటూ టీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. ఈ క్రమంలో ఆమె వివాదంలో చిక్కుకోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే దీనిపై విజయలక్ష్మీ ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. -
‘రెవెన్యూ’లో ఆత్మహత్య కలకలం
సాక్షి, హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్‌పేట తహసీల్దార్ సుజాత భర్త అజయ్‌కుమార్ ఆత్మహత్య రెవెన్యూ ఉద్యోగుల్లో కలకలం సృష్టించింది. ఏసీబీ అధికారుల దాడిలో ఇంట్లో దొరికిన నగదుకు లెక్క చూపినా.. విచారణ పేరిట కుటుంబసభ్యులను వేధించడంతోనే అజయ్‌కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న రెవెన్యూ ఉద్యోగసంఘాలు.. ఈ వ్యవహారంలో ఏసీబీ వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతున్నారు. వివాదాస్పద భూ వ్యవహారంలో ఆర్ఐ, ఎస్ఐలను అరెస్టు చేసిన పోలీసులు.. ఎలాంటి ప్రమేయంలేని తహసీల్దార్‌ను అరెస్టు చేయడమేగాకుండా తప్పులు ఒప్పుకోవాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూను అవినీతి శాఖగా చిత్రీకరించడంలో భాగంగానే పద్ధతి ప్రకారం ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసిన సంఘటనలోనూ ఆమెదే తప్పిదం అన్నట్లుగా ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యలు చేసిన తీరును గుర్తు చేస్తున్న ఉద్యోగ సంఘాలు.. తాజా ఘటన నేపథ్యంలో ఆందోళనబాట పట్టాలని యోచిస్తున్నారు. పార్ట్–బీ కేటగిరీలో చేర్చిన భూముల వ్యవహారంలో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో ఉద్యోగులపై దాడులు జరిగాయని, మాన్యువల్ పహాణీగాకుండా.. ఏకంగా ఆన్లైన్లోనే రికార్డులు నమోదు చేయడంతో ఆనేక తప్పు లు దొర్లాయని, వీటిని సవరించడానికి అనుమతినివ్వాలని కోరినా పట్టించుకోని అధికారు లు.. తప్పంతా రెవెన్యూ ఉద్యోగులదే అన్నట్లుగా ప్రవర్తించడం విడ్డూరంగా ఉందన్నారు. స్పష్టమైన మార్గదర్శకాలు లేకుండా.. అడ్డగోలు నిర్ణయాలతో రాత్రికి రాత్రే అమలు చేయాలనే ఉన్నతాధికారుల వ్యవహారశైలితో రెవెన్యూశాఖకు చెడ్డ పేరు వస్తోందని వాపోతున్నారు. ఈ క్రమం లోనే వీఆర్వోల వ్యవస్థ రద్దు, రెవెన్యూ శాఖ ప్రక్షాళన అంటూ సీఎం కేసీఆర్ ప్రకటనలు చేయడంతో మానసిక ఆందోళనకు గురవుతున్న ఉద్యోగులపై ఏసీబీ అధికారులు అవినీతి ముద్ర వేస్తుండటం మరింత కుంగదీస్తోందని అంటున్నారు. ఏసీబీ వేధింపులతోనే: ట్రెసా షేక్‌పేట్ తహసీల్దార్ సుజాత భర్త ప్రొఫెసర్ అజయ్‌కుమార్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్ మాట్లాడుతూ.. ఏసీబీ అధికారుల వేధింపుల వల్లే అజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి కేసులో ఆధారాలు లేకపోయిన అరెస్ట్ చేసిన తహసీల్దార్ సుజాతకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేస్తే బాగుండేదని, ఇప్పటికైనా ఆమెను విడుదల చేసి కేసును విచారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ట్రెసా అసోసియేట్ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షుడు కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
షేక్‌పేట తహసీల్దార్ భర్త బలవన్మరణం
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్‌పేట తహసీల్దార్ సుజాత భర్త ప్రొఫెసర్ అజయ్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిక్కడపల్లిలో లలిత మాన్షెన్లోని తన రెండో అక్క రేఖ ఇంట్లో తన కుమారుడితో అజయ్ ఉంటున్నారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు అజయ్‌కు ఓ ఫోన్ కాల్ రాగా మొదటి అంతస్తు నుంచి ఐదో అంతస్తుపైకి వెళ్లి మాట్లాడుతూ.. అపార్ట్మెంట్ పైనుంచి కిందకు దూకారు. తీవ్రంగా గాయపడిన అజయ్‌కుమార్‌ను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆరోపణలు భరించలేకే.. చిన్నప్పట్నుంచే సున్నిత మనస్కుడైన అజయ్ తన భార్యపై వచ్చిన అవినీతి ఆరోపణలను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఉన్నత కుటుంబం, భార్యాభర్తలిద్దరికీ మంచి ఉద్యోగాలు.. నల్లేరుపై నడకలా సాగుతున్న వారి జీవితం ఒక్కసారిగా చిన్నాభిన్నమైంది. అవి నీతి ఆరోపణలు ఎదుర్కొని ఒకరు జైలుపాలు కాగా.. మరొకరు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నారు. ఇక అజయ్కుమార్ది విద్యావంతుల కుటుంబం. గత 15 ఏళ్లుగా ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మొదట్లో సివిల్స్ కోసం శిక్షణ పొంది ఇంటర్వూ్య వరకు వెళ్లారు. తొలుత మహబూబ్‌నగర్ పీజీ కళాశాలలో, నిజాం కళాశాలలో, కోఠి ఉమెన్స్ కళాశాలలో పనిచేసి ప్రస్తుతం ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పీహెచ్డీ పూర్తిచేసిన అజయ్ తన థీసిస్ సబ్మిషన్ దశలో ఉన్నారు. అంతకుముందు ఓ జూనియర్ కళాశాలలో పనిచేస్తుండగా తన కొలీగ్స్ ద్వారా పరిచయమైన ఖమ్మం జిల్లా, మధిరకు చెందిన సుజాతను పెళ్లి చేసుకున్నారు. ఇక అజయ్ బాబాయ్‌లు, పెద్దనాన్నలు కూడా ఉన్నత విద్యావంతులే. పెదనాన్న గోకా రామలింగం ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే తన రెండో పెదనాన్న రామస్వామి అప్పటి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఇక తండ్రి ఆంజనేయులు డీఎస్పీగా పనిచేసి రిటైరయ్యారు. తన బాబాయ్‌లు మోహన్ కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా, మరో బాబాయ్ గోకా మురళీ డాక్టర్‌గా ఉన్నతస్థాయిల్లో పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో అజయ్ చురుగ్గా పాల్గొన్నారు. ఇక సుజాత కూడా గ్రూప్–2 ఆఫీసర్‌గా ఎంపికై మొదట మెదక్ జిల్లాలో, తర్వాత నగరంలోని ముషీరాబాద్, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో తహశీల్దార్‌గా పనిచేశారు. కావాలనే టార్గెట్ చేశారా? షేక్‌పేట తహసీల్దార్ సుజాతను ఆమె కుటుంబాన్ని కొందరు రెవెన్యూ అధికారులతో పాటు ఏసీబీ అధికారులు కావాలానే టార్గెట్ చేశారని ఫిర్యాదులు వస్తున్నాయి. సుజాతను ఇప్పటికే అరెస్ట్ చేయగా, ఆమె భర్త ప్రొఫెసర్ అజయ్‌ను సైతం అరెస్ట్ చేస్తామన్న సంకేతాల నేపథ్యంలోనే బుధవారం ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వాస్తవానికి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 సర్వే నెంబర్ 403/పీలో 4,865 గజాల భూవివాదంలో తనను ఎస్ఐ రవీందర్‌నాయక్ వేధిస్తున్నాడని అబ్దుల్కాలీద్ అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేయగా.. ఏసీబీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) నాగార్జునరెడ్డిని వలపన్ని పట్టుకుంది. ఆపై కాలీద్ను పోలీస్‌లు విచారించిన సమయంలో అతను తహశీల్దార్ సుజాత ప్రస్తావనే తీసుకురాలేదని సమాచారం. అయినా కేసును ముందుకు తీసుకెళ్లే దిశగా ఆమె నివాసంలో సోదాలు చేయటం రూ.30 లక్షల నగదుకు సరైన లెక్కలు చూపని కారణంగా ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అనంతరం భర్త అజయ్‌కు ఏసీబీ నుంచి తరచూ ఫోన్లు రావటం, తాము అడిగిన వివరాలు చెప్పకపోతే అరెస్ట్ తప్పదన్న సంకేతాలివ్వటం వల్లే అజయ్ ఆత్మహత్యకు ఒడిగట్టారని సమీప బంధువులతో పాటు రెవెన్యూ సంఘాలు ఆరోపించాయి. అయితే సుజాతను ఏసీబీ వివాదంలో ఇరికించేందుకు నగర రెవెన్యూశాఖలోని ఒకరిద్దరు అధికారులు సైతం ఏసీబీకి తప్పుడు సమాచారం ఇచ్చారన్న అంశం తెరమీదకు వచ్చింది. రెండు మార్లే ఫోన్ చేశాం..: ఏసీబీ డీఎస్పీ అజయ్ ఆత్మహత్య నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వర్రావును ‘సాక్షి’ప్రశ్నించగా.. కేసు విచారణలో భాగంగానే తహశీల్దార్ సుజాతను అరెస్ట్ చేసిన విషయాన్ని ఆమె భర్త అజయ్‌కు ఫోన్లో ధ్రువీకరించామని, ఆపై హన్మకొండ సమీపంలో తమకు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉందని సుజాత తమకు చెప్పగా, అదే విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు తాము అజయ్‌ను అడిగితే ఒకే ఎకరం ఉందని చెప్పారని ఈ రెండు సమయాల్లో తప్పితే తాము మరే కాల్ చేయలేదని చెప్పారు. తహసీల్దార్ సుజాత, ఆమె కుమారుడు భరత్‌ను ఓదారుస్తున్న బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరైన సుజాత.. సుందరయ్య విజ్ఞానకేంద్రం: భర్త అజయ్‌కుమార్ ఆత్మహత్య నేపథ్యంలో చర్లపల్లి జైలు నుంచి కండీషనల్ బెయిల్‌పై తహశీల్దార్ సుజాత విడుదలయ్యారు. సాయంత్రం చిక్కడపల్లిలోని తన ఆడపడుచు ఇంటికి చేరుకొని ఒక్కగానొక్క కొడుకు భరత్‌ను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఇటు ఏసీబీ అధికారుల వేధింపుల వల్లే తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నట్లు అజయ్ అక్కలు ఆరోపించారు. సుజాత అరెస్టైనప్పటి నుంచి అజయ్ డిప్రెషన్లోకి వెళ్లారని, చేయని తప్పుకు తన భార్య అరెస్టు కావడాన్ని జీర్ణించుకోలేకపోయాడన్నారు. ఏసీబీ అధికారి వేధింపులు తట్టుకోలేక తాను చనిపోతున్నట్లుగా తన తమ్ముడు ఆ అధికారికి మెసేజ్ కూడా పెట్టాడని అక్క మంగళ తెలిపారు. సుజాత కుటుంబానికి అండగా ఉంటాం.. ఈ నేపథ్యంలోనే సుజాతను పలువురు రెవెన్యూ అధికారులు పరామర్శించారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి, డిప్యూటీ కలెక్టర్లు సంగీత, అశోక్‌కుమార్, రాధిక రమణి, తహశీల్దార్ లలిత సుజాతను ఓదార్చారు. ‘తహశీల్దార్ సుజాత కుటుంబానికి అండగా ఉంటాం. షేక్‌పేట్ ఆర్ఐ నాగార్జునరెడ్డి డబ్బులు తీసుకున్న కేసుకు సుజాతకు ఎలాంటి సంబంధం లేదు. సుజాతకు రెవెన్యూశాఖలో ఎలాంటి చెడ్డపేరు లేదు. మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకుంది. ఒకవేళ సుజాత నేరస్తురాలైతే కోర్టులో తేలుతుంది. సుజాత విషయంలో ఏసీబీ అధికారులు ఆమె భర్తకు ఫోన్ చేసి వేధించడం సరైంది కాదు..’అని గౌతమ్‌కుమార్ అన్నారు. అజయ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రిలో ప్రొఫెసర్ అజయ్ మృతదేహానికి ఫొరెన్సిక్ నిపుణులు డాక్టర్ ఝాన్సీ నేతృత్వంలోని వైద్యుల బృందం పోస్టుమార్టం పూర్తి చేసింది. కాగా మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి కుటుంబ సభ్యులెవరూ రాకపోవడంతో మార్చురీలో భద్రపరిచారు. గురువారం అజయ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. -
భర్త మృతి; ఎమ్మార్వో సుజాతకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ భూ వివాదం కేసులో ఇటీవల ఏసీబీకి పట్టుబడ్డ షేక్‌పేట ఎమ్మార్వో సుజాతకు రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. భర్త అజయ్ అంతక్రియల్లో పాల్గొనేందుకు అనుమతినిచ్చింది. కాగా, ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ బుధవారం గాంధీనగర్‌లో భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సోదరి నివాసానికి వచ్చిన అజయ్ అయిదంతస్తుల భవనం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా భూ వివాదం కేసులో అజయ్‌ను కూడా గతంలో ఏసీబీ విచారణ చేసింది. భార్య ఏసీబీకి పట్టుబడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అజయ్ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. (చదవండి: షేక్‌పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య) -
షేక్‌పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ భూ వివాదం కేసులో ఇటీవలే ఏసీబీకి పట్టుబడ్డ షేక్‌పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ బుధవారం గాంధీనగర్‌లోని తన సోదరి నివాసానికి వచ్చారు. అనంతరం అయిదంతస్తుల భవనం పైనుంచి దూకి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ కేసులో అజయ్‌ను కూడా గతంలో ఏసీబీ విచారణ చేసింది. భార్య ఏసీబీకి పట్టుబడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అజయ్ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. (చదవండి : ఫిర్యాదుతోనే అసలు కథ మొదలైంది) రెవెన్యూ శాఖలో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ భూవివాదం కేసులో షేక్‌పేట తహసీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సుజాతను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. సుదీర్ఘంగా విచారించి భూ వివాదం కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఆమె నివాసంలో పట్టుబడ్డ రూ.30 లక్షల డబ్బు సహా పలు అంశాలపై ఆరా తీశారు. ఇదే కేసులో రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ షేక్‌పేట ఆర్ఐ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్ సెక్టార్ ఎస్ఐ రవీంద్ర నాయక్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో సుజాత విచారణ ఎదుర్కోంటుంన్నారు. -
షేక్‌పేట భూ వివాదంలో సరికొత్త వ్యూహం
-
ఫిర్యాదుతోనే అసలు కథ మొదలైంది
సాక్షి, సిటీబ్యూరో : ‘కుదిరితే కాసులు..లేకుంటే కోర్టు కేసులుగా..’ తయారైంది ప్రభుత్వ స్థలాల పర్యవేక్షణ పరిస్థితి. హైదరాబాద్ జిల్లాలో రెవెన్యూ శాఖ అంటేనే ప్రభుత్వ భూములు...వాటి పరిరక్షణే ప్రధాన బాధ్యత. ఇక అత్యంత విలువ గల స్థలాలు కావడంతో అటూ అక్రమార్కులకు... ఇటు అధికారులకు కాసుల పంట పండుతోంది. తాజాగా వెలుగు చూసిన బంజారాహిల్స్ భూ వివాదంలో ఇరువర్గాల సరికొత్త వ్యూహం బెడిసికొట్టినట్లయింది. ఒకవైపు మధ్యంతర ఉత్తర్యులు అడ్డం పెట్టుకొని స్థలం సర్వే, ఆన్లైన్లో అప్డేట్కోసం ప్రయత్నించడం..మరోవైపు ఒక స్థలంపై ఫిర్యాదు చేసి అసలు వివాదాస్పద స్థలంపై బేరసారాలు నడిపి కాసులుదండుకుంటూ ఏసీబీ చేతిలో చిక్కక తప్పలేదు. ఏకంగా రూ.30 లక్షల డీల్ కుదుర్చుకొని రూ.15 లక్షలు తీసుకుంటూ షేక్‌పేట ఆర్ఐ నాగార్జునరెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడం సంచలనం సృష్టించగా, తహసీల్దార్ సుజాత ఇంట్లో రూ.30 లక్షల నగదు, అరకిలో బంగారు నగలు ఏసీబీ అధికారులకు లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా ఏసీబీ విచారణలో మరి కొందరి చేతివాటం కూడా వెలుగు చూడటం రెవెన్యూ యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, తహాసీల్దార్ సుజాతను కలెక్టరేట్‌కు బదిలీ చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ అయ్యాయి. అమీర్‌పేట తహసీల్దార్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. (షేక్‌పేట భూవివాదం కేసు : రూ.30 లక్షలు ఎక్కడివి?) ఇదీ కథ.. నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 సర్వేనెంబర్ 129/59లో అత్యంత విలువగల 4,865 చదరపు గజాల భూమిపై గత రెండు దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. హైదరాబాద్ పాతబస్తీ మీరాలం మండికి చెందిన సయ్యద్ అబ్దుల్ ఖలీద్ అనే వ్యక్తి తన తండ్రి అబ్దుల్ రషీద్ 1969లో ఈ భూమిని కొనుగోలు చేశాడని పేర్కొంటుండగా.. అది ప్రభుత్వ స్థలమంటూ సివిల్ కోర్టు 1998లో తీర్పుచెప్పింది. దీనిపై అబ్దుల్ ఖలీద్ హైకోర్టును ఆశ్రయించి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు పొందారు. కోర్టులో వివాదం పెండింగ్‌లో ఉన్నప్పటికి మధ్యంతర ఉత్తర్వులు ఆధారంగా తన భూమిని సర్వే చేసి ఆన్లైన్లో అప్డేట్ చేయాలని షేక్‌పేట్ రెవెన్యూ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆ భూమి వ్యవహారంలో ఎలాంటి జోక్యం చేసుకునేందుకు వీల్లేకుండా పోయింది. మరో స్థలంపై ఫిర్యాదు. వివాదాస్పద భూమి అయినా..కాసులు దండుకునేందుకు రెవెన్యూ అధికారులు అతితెలివి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అసలు వివాదాస్పద స్థలాన్ని వదిలి..దాని పక్కన గల స్థలంపై ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తోంది. బంజరాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని ఆశా హాస్పిటల్ దగ్గర వివాదాస్పద స్థలానికి సమీపంలోని సర్వే నెంబర్ 403/పీలోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు అబ్దుల్ ఖలీద్ ప్రయత్నం చేశారని షేక్‌పేట తహసీల్దార్ ఏప్రిల్ 30న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సూచిక బోర్డునుసైతం తొలగించడంతో పాటు తమ సిబ్బంది అడ్డుకున్నప్పటికి పదేపదే తన సొంత భూమి అంటూ బోర్డు ఏర్పాటు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. (ఎమ్మార్వో ఇంట్లో మరిన్ని ల్యాండ్ డాక్యుమెంట్లు) కేసు తర్వాతనే అసలు కథ.. బంజారాహిల్స్‌లోని సర్వే నెంబర్ 403/పీలోని స్థలంపై ఫిర్యాదుతోనే అసలు కథ మొదలైంది. ఒకవైపు పోలీసుల వత్తిడి పెరగడంతో అసలు వివాదాస్పద భూమి వ్యవహారంపై బేరసారాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇందులో పోలీసుల ఉచిత సలహాల కూడా ఉన్నట్లు సమాచారం. . దీంతో వివాదాస్పద స్థలానికి అన్ని విధాలుగా సహకరించేందుకు స్థలం విలువలో పది శాతం డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. అధికారుల అత్యాశ ఫలితంగా పూర్తి స్థాయిలో వ్యవహరం చక్కబడకముందే బహిర్గతమైంది. ఇక ప్రభుత్వ భూములను పర్యవేక్షించాల్సిన వారే భక్షించడంపట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షేక్‌పేట తహసీల్దార్ అరెస్టు రెవెన్యూ శాఖలో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ భూవివాదం కేసులో షేక్‌పేట తహసీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం నుంచి సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ అధికారులు.. భూ వివాదం కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దీంతో అరెస్ట్ చేసి, అనంతరం వైద్యపరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మార్వో సుజాత పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇంట్లో దొరికిన రూ.30 లక్షలకు ఆధారాలు చూపలేకపోయారని సమాచారం. మరోవైపు సుజాత ఇంట్లో షేక్‌పేట్‌కు చెందిన మరికొన్ని ల్యాండ్ డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉన్న అందరి కాల్‌లిస్ట్‌లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో వసంత కుమారిని అధికారులు విచారించారు. -
షేక్‌పేట్ ఎమ్మార్వో సుజాత అరెస్ట్
-
షేక్‌పేట్ ఎమ్మార్వో సుజాత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ భూవివాదం కేసులో ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం నుంచి సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ అధికారులు.. భూ వివాదం కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఎమ్మార్వో సుజాతను అరెస్ట్ చేసి, అనంతరం వైద్యపరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరికాసేపట్లో ఎమ్మార్వో సుజాతను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మార్వో సుజాత పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇంట్లో దొరికిన రూ.30 లక్షలకు ఆధారాలు చూపలేకపోయరని సమాచారం. ఇదే కేసులో ఇప్పటికే బంజారాహిల్స్ ఎస్సై రవి నాయక్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
ఎమ్మార్వో సుజాత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
ఎమ్మార్వో చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: షేక్‌పేట్ భూ వ్యవహారంలో ఎమ్మార్వో సుజాత మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆదివారం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ఎమ్మార్వో సుజాతను అధికారులు సుదీర్ఘంగా విచారించిన కూడా ఇంట్లో దొరికిన రూ.30 లక్షలు, నగలు విషయంలో సుజాత ఆధారాలు చూపించలేదని తెలిసింది. శాలరీ డబ్బులు బ్యాంకు నుంచి డ్రా చేశానని సమాధానం చెప్పినట్లు సమాచారం. బ్యాంక్ నుంచి డ్రా చేస్తే డాక్యుమెంట్లు చూపించాలని ఏసీబీ అధికారులు అడిగినా కూడా ఆమె స్పందించ లేదని సమాచారం. సుజాత ఇంట్లో షేక్‌పేట్‌కు చెందిన మరిన్ని ల్యాండ్ డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. సోమవారం మరో ఆమెను విచారించే అవకాశం ఉంది. (రూ.30 లక్షలు ఎక్కడివి?) కాల్ లిస్టులు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు ఈ కేసులో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉన్న అందరి కాల్‌లిస్ట్‌లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో వసంత కుమారిని అధికారులు విచారించారు. రెండు రోజుల పాటు ఆర్ఐ నాగార్జున రెడ్డి, ఎస్సై రవీందర్ నాయక్, ఎమ్మార్వో సుజాతలను సుదీర్ఘంగా అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ముగ్గురి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఆర్ఐ నాగార్జున రెడ్డి, ఎస్సై రవీందర్ నాయక్ లను రిమాండ్ కు తరలించారు. లంచం కేసులో సుజాత పాత్ర ఉందని తేలితే సుజాతను కూడా రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. (అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. 3 లక్షలు డిమాండ్) -
ఇంట్లో దొరికిన రూ.30 లక్షలు ఎక్కడివి?
సాక్షి, హైదరాబాద్ : షేక్‌పేట భూవివాదం కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ఎమ్మార్వో సుజాతను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు తొమ్మిది గంటల విచారణ తర్వాత ఎమ్మార్వో సుజాతను ఇంటికి పంపించారు. ఇంట్లో దొరికిన రూ.30 లక్షలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఆర్డీవో వసంత కుమారిని పిలిచి అధికారులు వివరాలు సేకరించారు. (చదవండి : అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. 3 లక్షలు డిమాండ్) మరోవైపు ఆర్ఐ నాగార్జున రెడ్డి విచారణ కొనసాగుతోంది. మరికాసేపట్లో నాగార్జునరెడ్డిని రిమాండ్‌కు తరలించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎస్సై రవీంద్రనాయక్‌ను రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌లోని 4865 గజాల భూ వివాదంలో షేక్‌పేట ఆర్ఐ నాగార్జునరెడ్డి, బంజారాహిల్స్ ఎస్సై రవీందర్లను ఏసీబీ అధికారులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
బంజారాహిల్స్ పీఎస్ ఎస్ఐ అరెస్ట్
సాక్షి, జూబ్లీహిల్స్ : భూ ఆక్రమణ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ.3 లక్షలు డిమాండ్ చేసినందుకుగాను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవీందర్ నాయక్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం 14లో ఉన్న రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని ఖాలీద్ అనే వ్యక్తి ఆక్రమించాడు. దీనిపై షేక్‌పేట మండల తహసీల్దార్ సుజాత గత ఏప్రిల్ 30న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఖాలీద్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండేందుకు గాను రూ. 3 లక్షలు ఇవ్వాలని ఎస్ఐ రవీందర్ డిమాండ్ చేశాడు.(లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఆర్ఐ) ఖాలీద్ ఇటీవల రూ.1.50 లక్షలు రవీందర్ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి వచ్చాడు. అందుకు సంబంధించిన ఆధారాలను ఏసీబీ అధికారులకు అందించిన ఖాలీద్ అతను మరో రూ. 3 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నాలుగు బృందాలుగా ఏర్పడిన ఏసీబీ అధికారులు షేక్‌పేట మండల కార్యాలయం, ఆర్ఐ నివాసం, తహసీల్దార్ ఇంట్లో, ఎస్ఐ రవీందర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. కాగా అర్థరాత్రి వరకు తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు. అర్థరాత్రి రాత్రి 12 గంటలకు తహసిల్దార్ సుజాతను ఇంటికి పంపించారు. నేడు కూడా ఈ కేసుకు సంబంధించి తహిసిల్దార్ సుజాతను విచారించనున్నారు. ఎస్ఐ రవీందర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రోజు కూడా తహసిల్దార్ సుజాతను విచారించనున్న ఏసీబీ అధికారులు. అసలు ఏం జరిగిదంటే.. బంజారాహిల్స్ రోడ్ నెం. 14 సర్వే నంబర్ 129/59లో ఉన్న 4865 గజాల ప్రభుత్వ స్థలాన్ని సయ్యద్ అబ్దుల్ ఖాలిద్ అనే వ్యక్తి ఆక్రమించి హెచ్చరిక బోర్డును తొలగించి తన పేరుతో బోర్డు ఏర్పాటు చేశాడు. సదరు స్థలాన్ని తాను కోర్టులో గెలిచినట్లు అందులో పేర్కొన్నాడు. ఈ స్థలాన్ని తన పేరిట క్రమబద్దీకరించి హద్దులు చూపించాల్సిందిగా షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అది ప్రభుత్వ స్థలం కావడంతో తహసిల్దార్ సుజాత గత జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సదరు స్థలాన్ని ప్రైవేట్ పరం చేస్తూ హద్దులు చూపిస్తానంటూ అదే కార్యాలయంలో పని చేస్తున్న ఆర్ఐ నాగార్జున రెడ్డి ఖాలిద్ నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా శనివారం ఖాలిద్ రూ.15 లక్షల నగదును సాగర్‌సొసైటీ రోడ్డులో హార్లి డేవిడ్ సన్ షోరూం పక్క సందులో నాగార్జున్ రెడ్డికి ఇస్తుండగా అప్పటికే అక్కడ వేచి ఉన్న ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నాగార్జునరెడ్డి నుంచి రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్న అధికారులు యూసుఫ్‌గూడలోని అతడి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. నిందితుడిని కార్యాలయానికి తీసుకువచ్చి విచారించగా కలెక్టరేట్లో ఓ అధికారికి రూ. 15 లక్షలు ఇవ్వాల్సి ఉందని అందుకే రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిపారు. -
బల్లకింద బుక్కయ్యారు
-
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఆర్ఐ
-
రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన షేక్‌పేట ఆర్ఐ
సాక్షి, హైదరాబాద్: రూ.15 లక్షల లంచం తీసుకుంటూ షేక్‌పేట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు యజమాని నుంచి ఆయన రూ.50 లక్షలు డిమాండ్ చేసినట్టు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. బయానాగా రూ.15 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఆర్ఐ నాగార్జునను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదే స్థల వివాదంలో ఆర్ఐ నాగార్జునతో పాటు బంజారాహిల్స్ ఎస్సై రవీందర్ కూడా డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఎస్సై రవీందర్‌ను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఒకటిన్నర ఎకరాల స్థల వివాదంలో వీరిద్దరూ లంచాలు డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఎస్సై రవీందర్‌పై ఆరోపణల నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. (చదవండడి: జీహెచ్ఎంసీ పరిధిలో పరీక్షలు వాయిదా) స్థల వివాదమిదే! బంజారాహిల్స్‌లో సయ్యద్ అబ్దుల్‌కు చెందిన స్థలాన్ని ప్రభుత్వం రెవెన్యూ స్థలంగా పేర్కొంది. స్థలం తమదేనంటూ సయ్యద్ అబ్దుల్ కోర్టుకెక్కారు. స్థలం సయ్యద్ అబ్దుల్‌దేనంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ బోర్డు తీసి సయ్యద్ అబ్దుల్ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో రెవెన్యూ శాఖ ఫిర్యాదు మేరకు సయ్యద్ అబ్దుల్పై కేసు నమోదైంది. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు ఆర్ఐ నాగార్జున, బంజారాహిల్స్ ఎస్సై రవీందర్ 50 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం.