బెంగెట్, బెర్గెండాల్, బెర్నార్డినా, బ్లూమౌంటెన్, బోర్బన్.. చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు కాఫీల్లో. కతుర్రా, ఛారియర్, హరార్, ఫ్రెంచ్ మిషన్ ఇలా ఒక్కో దేశంలో కాఫీది ఒక్కో రుచి. కోన, జావా అంటూ దీవుల్లో, మోచా, పాకాస్ అంటూ లాటిన్ అమెరికాల్లో, సగడ, శాంటోస్ పేరిట దక్షిణాది దేశాల్లో.. ఇలా కాఫీ అంటే ప్రాణం ఇచ్చేవారు లోకమంతా కనిపిస్తారు.
కాఫీ రుచులు, ఐస్ క్రీం టేస్టులు అందించే లా రొసెట్టా, సౌత్ పోల్ షాపులను షేక్‌పేట, ఓయూ కాలనీలో ప్రారంభించిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. నాణ్యత, ప్రామాణికాలే వ్యాపారాభివృద్ధికి దోహదపడతాయన్నారు. నాణ్యత ప్రమాణాలు కలిగి రుచికరమైన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించగలిగితే వ్యాపారం అంచలంచెలుగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని సూచించారు.
కల్తీలేని ఆహార పదార్థాలు, రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్న చోటుకు వినియోగదారులు వెతుక్కుంటూ రావడానికి ఇష్టపడతారన్నారు. పిల్లలకు యువతకు ఇష్టకరమైన అన్ని ఐటమ్స్ ఉంచగలిగితే వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ ఛైర్మన్ నరేందర్ ముదిరాజ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి. బి.ఆర్.ఎస్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, నేపథ్య గాయకుడు, సంభాషణల రచయిత రాకేందు మౌళి వెన్నెలకంటి, శ్యామ, శ్రీనివాసరావు, ప్రశాంతి, శ్యామ్ సుందర్, శిరీష, రవికాంత్ , శ్రీకాంత్ మరియు సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment