షేక్‌పేట్ ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్‌దే హవా | shaikpet APSWR school sucessful in district school games | Sakshi
Sakshi News home page

షేక్‌పేట్ ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్‌దే హవా

Published Wed, Feb 26 2014 12:34 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

shaikpet APSWR school sucessful in district school games

హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్
 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య(హెచ్‌డీఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి క్రీడల్లో షేక్‌పేట్‌లోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (ఏపీఎస్‌డబ్ల్యూఆర్) జట్లు సత్తా చాటాయి. ఈ స్కూలుకు చెందిన జట్లు అండర్-14 బాలబాలికల విభాగాల్లో వాలీబాల్ టీమ్ టైటిల్స్ గెలుచుకున్నాయి. అండర్-14 బాలుర విభాగంలో కబడ్డీ, హ్యాండ్‌బాల్... అండర్-17 బాలుర విభాగంలో బీచ్ వాలీబాల్‌లో టీమ్ టైటిల్స్‌ను చేజిక్కించుకున్నాయి. అండర్-14 బేస్‌బాల్, అండర్-17 హ్యాండ్‌బాల్ క్రీడల్లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాయి. అండర్-17 బాలుర విభాగంలో వాలీబాల్, బేస్‌బాల్, ఖోఖో క్రీడల్లో మూడో స్థానం దక్కించుకున్నాయి. ఈ పోటీల విజేతలకు హైదరాబాద్ జిల్లా విద్యాధికారి ఎ.సుబ్బారెడ్డి ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ విద్యాశాఖాధికారి సుశీంద్రరావు, హెచ్‌డీఎస్‌జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి.యాదయ్య, ఎస్.సోమేశ్వర్‌రావు, డాక్టర్ ఎ.బాలరాజ్, డాక్టర్ రవీందర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వివిధ క్రీడల విజేతల వివరాలిలా ఉన్నాయి.
 
 ఫైనల్స్ ఫలితాలు: ఫుట్‌బాల్: అండర్-14 బాలురు: 1.బేగంపేట్ హెచ్‌పీఎస్, 2.ఆల్ సెయింట్స్ హైస్కూల్, 3. రామంతపూర్ హెచ్‌పీఎస్; అండర్-17 బాలురు:1.సెయింట్ మార్క్స్ బాయ్స్ టౌన్ హైస్కూల్, 2.బేగంపేట్ హెచ్‌పీఎస్, 3.జూబ్లీహిల్స్ బీవీబీపీఎస్; అండర్-14 బాలికలు: 1. అంబర్‌పేట్ శ్రీసత్య సాయి విద్యా విహార్, 2. మొజంషాహి గవర్నమెంట్ హైస్కూల్. 3.డాన్ బాస్కో హైస్కూల్. అండర్-17 బాలురు: 1.జూబ్లీహిల్స్ హైస్కూల్, 2.శ్రీసత్య సాయి విద్యా విహార్, 3. డాన్ బాస్కో హైస్కూల్. కబడ్డీ: అండర్-14 బాలురు: 1.ఏపీఎస్‌డబ్ల్యూఆర్ ఎస్, 2.మలక్‌పేట్ గవర్నమెంట్ హైస్కూల్ (జీహెచ్‌ఎస్), 3.ఆలియా గవర్నమెంట్ హైస్కూల్;  అండర్-14 బాలికలు: 1.వెస్ట్ మారేడ్‌పల్లి జీహెచ్‌ఎస్, 2.సీతాఫల్‌మండి జీహెచ్‌ఎస్, 3.వెస్ట్ మారేడ్‌పల్లి జీహెచ్‌ఎస్; అండర్-17 బాలురు: మలక్‌పేట్ జీహెచ్‌ఎస్, 2.రాంనగర్ జె.వి.హైస్కూల్, 3.లాల్ దర్వాజ వెంకట్రావు మెమోరియల్ హైస్కూల్. అండర్-17 బాలికలు: 1. ముసారంబాగ్ జీహెచ్‌ఎస్, 2. బాలంరాయి నల్లకుంట జీహెచ్‌ఎస్, 3.వెస్ట్ మారేడ్‌పల్లి జీహెచ్‌ఎస్; ఖోఖో: అండర్-14 బాలురు:1.యూసుఫ్‌గూడ జీహెచ్‌ఎస్, 2.నారాయణగూడ కేశవ మెమోరియల్ హైస్కూల్, 3.న్యూ ముసారంబాగ్ జీహెచ్‌ఎస్.
 
  అండర్-14 బాలికలు: 1.న్యూ ముసారంబాగ్ జీహెచ్‌ఎస్, 2. కాచిగూడ జీహెచ్‌ఎస్,3. కేశవ మెమోరియల్ హైస్కూల్; అండర్-17 బాలురు: 1.కేశవ మెమోరియల్ హైస్కూల్, 2.యూసుఫ్‌గూడ జీహెచ్‌ఎస్; అండర్-17 బాలికలు: 1.కేశవ మెమోరియల్ హైస్కూల్, 2. వెస్ట్ మారేడ్‌పల్లి గవర్నమెంట్ బాలికల హైస్కూల్, 3. న్యూ ముసారంబాగ్ జీహెచ్‌ఎస్; బాస్కెట్‌బాల్: అండర్-14 బాలురు: జూబీహిల్స్ పబ్లిక్ స్కూల్, 2.లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, 3.డాన్‌బాస్కో ైెహ స్కూల్; అండర్-14 బాలికలు: 1.హోలీ ఫ్యామిలీ హైస్కూల్, 2. జూబ్లీహిల్స్ బీవీబీపీఎస్, 3. రాంనగర్ సెయింట్ పాయిస్ హైస్కూల్; అండర్-17 బాలురు: 1.ఆల్ సెయింట్స్ హైస్కూల్, 2.సెయింట్ పాల్స్ హైస్కూల్, 3. డాన్‌బాస్కో హైస్కూల్; అండర్-17 బాలికలు: 1.హోలీ ఫ్యామిలీ హైస్కూల్, 2.మెరిడియన్ హైస్కూల్, 3.సెయింట్ పాయిస్ హైస్కూల్; వాలీబాల్: అండర్-14 బాలురు: 1.షేక్‌పేట్ ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, 2.బేగంపేట్ హెచ్‌పీఎస్, 3.రామంతపురం హెచ్‌పీఎస్; అండర్-14 బాలికలు: 1.షేక్‌పేట్ ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, 2.హోలీ ఫ్యామిలీ హైస్కూల్, 3.సెయింట్ పాయిస్ హైస్కూల్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement