
ప్రముఖ ర్యాపర్ ఎమివే బంటాయ్ (అసలు పేరు బిలాల్ షైఖ్) ప్రియురాలు స్వాలినాను పెళ్లి చేసుకున్నాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇది చూసిన అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

పెళ్లి డ్రెస్‌లో కొత్త జంట అదిరిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.

ఎమీవే షేర్వాణీ ధరించగా, స్వాలినా పర్పుల్ లెహంగాలో మెరిసిపోయింది.

స్వాలినా మోడల్, నటి. హిందీలో ఒకటీరెండు చిత్రాలతో పాటు పలు పంజాబీ, హిందీ మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ యాక్ట్ చేసింది.

ఈమె అసలు పేరు హలీనా కుచే. 2023లో ఎమివేతో కలిసి పని చేసింది.

అప్పుడే వీరి మధ్య ప్రేమ మొదలైంది. ఇప్పుడది పెళ్లితో మరింత బలపడింది.

















