sujatha
-
కాశీలో ‘కేసీఆర్’ హీరో.. రోజాతో సెల్ఫీ (ఫోటోలు)
-
బాల్యం ఇక్కడ సేఫ్
సమస్యలు చూసి ‘అయ్యో!’ అనుకునే వాళ్లు కొందరు. సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కార మార్గాలు ఆలోచించేవారు కొందరు. సూరేపల్లి సుజాత రెండో కోవకు చెందిన యాక్టివిస్ట్. ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ‘శాతవాహన యూనివర్సిటీ’లో సోషియాలజీ డిపార్ట్మెంట్ హెడ్. ప్రాఫెసర్‌గా క్లాసు నాలుగు గోడలకే పరిమితం కాలేదు. పర్యావరణ సమస్యల నుంచి సామాజిక సమానత్వం వరకు ఎన్నో ఉద్యమాలలో భాగం అయింది. తన గళాన్ని గట్టిగా వినిపించింది. ‘సేఫ్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మురికివాడల్లోని పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తోంది...హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో 2021లో ఒక చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనపై నిరసన తెలియజేసేందుకు సుజాత అక్కడి మురికివాడకు వెళ్లింది. ఆ బస్తీలో కనీస సదుపాయాలు లేవు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక అత్యంత దయనీయ స్థితిలో ఉన్న పేదలను చూసి చలించిపోయింది. సాయంత్రమైతే ఆ బస్తీలో గంజాయి, మద్యం, మత్తుపదార్థాల వరద పారుతుంది. ‘ఇలా ఎందుకు?’ అని తెలుసుకోవడానికి ఆరునెలలపాటు అక్కడి సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసింది. తల్లిదండ్రులు వారి పిల్లలను బాల కార్మికులుగా చేస్తున్న తీరును గమనించి స్కూల్ పిల్లల్ని డ్రాపౌట్స్‌గా మారకుండా చూడడంపై దృష్టి పెట్టింది.మత్తు పదార్థాల ప్రభావం చిన్నారులపై పడకుండా, వారి భవిష్యత్‌ను కాపాడడం కోసం రంగంలోకి దిగిన సుజాత మొదటి అడుగుగా చిన్న స్థలాన్ని చూసి స్టడీ సెంటర్ ఏర్పాటు చేసింది. దీనికి ‘సావిత్రి బాయి పూలే స్టడీ సెంటర్’గా నామకరణం చేసింది. ఒకటితో మొదలైన స్టడీ సెంటర్ల సంఖ్య పదిహేనుకు పెరిగింది.మూడు అంగన్ వాడీ కేంద్రాలు, మూడు ప్రభుత్వ పాఠశాలలో చదివే మూడువందల మందికి పైగా విద్యార్థులు ఈ కేంద్రాల్లో సాయంత్రం చదువుకోవడానికి వస్తారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు పార్ట్‌టైం టీచర్లుగా పనిచేస్తున్నారు. డ్రాపౌట్లను తగ్గించడం, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం, చిన్నారులపై లైంగిక వేధింపులను నిరోధించడం లక్ష్యంగా ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. పిల్లల మానసిక వికాస అభివృద్ధి, పౌష్టికాహార లోపం అధిగమించడంపై ఈ విద్యాకేంద్రాలు దృష్టి పెట్టాయి.సింగరేణి కాలనీలో అంతా చెత్త ఏరుకుని బతికే పేదలే. వారి పిల్లలు అంగన్ వాడీ కేంద్రాలకు వెళ్తారు. నాలుగో తరగతి వరకు చదివించి ఆపై ఆపేస్తారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి, పిల్లలు పై చదువులు చదవడానికి ‘సావిత్రిబాయి పూలే సెంటర్’ల ద్వారా విశేష కృషి చేస్తోంది సుజాత.పదవ తరగతి చదివే పిల్లలకోసం బ్రేక్‌ఫాస్ట్ (డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు) అందించారు. ఇది సత్ఫలితాలను ఇచ్చి ఆ ఏడాది ఉత్తీర్ణతా శాతాన్ని పెంచింది. ఏటా పిల్లల కోసం సమ్మర్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆటల నుంచి ఆత్మరక్షణ విద్య, సైన్స్ ప్రాజెక్ట్‌ల వరకు ఈ క్యాంప్‌లో ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి. మత్తు పదార్థాల దుష్ప్రభావంపై అవగాహన కలిగించడం మరో కీలక అంశం.తొలిసారిగా తాను ఆ మురికివాడలో అడుగు పెట్టినప్పటితో పోల్చితే విద్యార్థుల చదువుకు సంబంధించి ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. అది రాత్రికి రాత్రి వచ్చిన మార్పు కాదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎంతో శ్రమిస్తే వచ్చిన మార్పు. ‘తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు తీసుకు వస్తే పిల్లల భవిష్యత్‌కు బంగారుబాట వేయవచ్చు’ అని నిరూపించిన మార్పు. – భాషబోయిన అనిల్ కుమార్, సాక్షి, కరీంనగర్సమాజంలోని అవలక్షణాలను వదిలించి, మనిషి సన్మార్గంలో నడిచేలా పనిచేయడమే మా లక్ష్యం. – ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత -
వైద్యుల రక్షణ బాధ్యత రాష్ట్రాలదే
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఇటీవల వైద్యులపై జరిగిన దాడులు నన్ను కలిచివేశాయి. ఇలాంటి అమానవీయ ఘటనలు చూడాల్సి రావడం దురదృష్టకరం. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్లకపోతే భవిష్యత్‌లో సామాన్య రోగులకు వైద్యం అందే పరిస్థితి ఉండదు. వైద్య వృత్తి భయంతో కాదు.. అంకితభావంతో చేసేది. వైద్యులకు ప్రశాంతత, స్వేచ్ఛ అవసరం’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు అన్నారు. సుదీర్ఘకాలం పాటు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేసిన సుజాతారావు.. ఆరోగ్య రంగంలో తీసుకువచి్చన ఎన్నో సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యుల భద్రత కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన పలు చర్యలను ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..ప్రత్యేక చట్టం తీసుకురావాలి.. వైద్యులపై దాడుల నియంత్రణ రాష్ట్రాల పరిధిలో ని సమస్య. దీనికీ, కేంద్ర ప్రభుత్వానికీ సంబంధం లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేక చట్టం తీసుకువచ్చి రక్షణ కల్పించాలి. ఈ విషయంలో పూర్తిగా రాష్ట్రాలదే బాధ్యత. రక్షణ కల్పించడమంటే ఆస్పత్రి దగ్గర ఇద్దరు లేదా ముగ్గురు పోలీసులను ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఆస్పత్రుల్లో పోలీస్ వ్యవస్థ ఏర్పాటుకు కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ప్రత్యేక వ్యవస్థ ఉంటే తప్ప దాడులను నియంత్రించడం సాధ్యపడదు. నేను పనిచేసిన సమయంలో ఇలాంటి ఘటనలు జరగలేదు. ఏవైనా ఘటనలు జరిగినప్పుడు ఆయా రాష్ట్రాల పరిధిలోనే కఠిన చర్యలు తీసుకొని శాంతిభద్రతలను అదుపు చేసేవారు. భయంతో వైద్యం ఎలా చేస్తారు?కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటన నన్ను కలిచివేసింది. మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నామా అనిపించింది. నాకైతే దీని వెనుక కుట్రకోణం ఉందనిపించింది. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలతో వైద్యుల మనోభావాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. వైద్యులు కూడా మనుషులే కదా. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగుల కుటుంబసభ్యులు, బంధువుల పరిస్థితి వేరేరకంగా ఉంటుంది. తమ మనిషి పోతే వారికి చాలా బాధ ఉంటుంది. కానీ దానిని వైద్యులపై చూపించడం సరికాదు. భయంభయంగా ఎన్నిరోజులని వైద్యం చేయగలరు? రోగుల సహాయకులను నియంత్రించాలిప్రస్తుతం ప్రభుత్వాస్పత్రులకు ఒక విధానమంటూ లేదు. మెయిన్ గేట్ నుంచి ఎమర్జెన్సీ వార్డు వరకూ రోగుల బంధువులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇది సరికాదు. మెయిన్ గేటు నుంచే నియంత్రణ జరగాలి. క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ, ఐసీయూ తదితరాల చోట్ల ఒకరికి మించి ఎక్కువ మంది సహాయకులను అనుమతించకూడదు. వారిని నియంత్రించి.. సరైన విధానంలో కౌన్సెలింగ్ ఇవ్వడం అవసరం. ప్రభుత్వాస్పత్రుల్లో ఇలాంటి విధానాలు అమలు చేయకపోతే వైద్యులు పనిచేసే పరిస్థితి ఉండదు. -
మహారాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా సుజాతా సౌనిక్ రికార్డు
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి సుజాతా సౌనిక్ నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారి నితిన్ కరీర్ పదవీ విరమణ అనంతరం సుజాతా సౌనిక్‌కు బాధ్యతలు అప్పగించారు. దక్షిణ ముంబైలోని రాష్ట్ర సచివాలయం మంత్రాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సౌనిక్ బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర చరిత్రలో అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. 1987 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సుజాత మరో ఏడాది పాటు పదవిలో ఉంటారు. ఆమె భర్త మనోజ్ సౌనిక్ కొన్నేళ్ల క్రితం ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఇప్పుడు రాష్ట్ర హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. -
సింగర్ సుజాత మోహన్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
అప్పట్లో వైఎస్ఆర్ పెట్టిన గొప్ప పథకం. ఇప్పుడు సీఎం జగన్ చేసి చూపించారు
-
హైదర్‌నగర్‌లో ఫ్యాబ్రిక్ స్టూడియో ప్రారంభించిన రాకింగ్ రాకేష్,సుజాత (ఫొటోలు)
-
విదేశాల నుంచి కూతురు వచ్చాకే అంత్యక్రియలు..
కరీంనగర్: కొత్త ఏడాది సందర్భంగా దైవదర్శనం కోసం ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొని మృత్యువాత పడింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లాకేంద్రంలోని మహాలక్ష్మీనగర్‌కు చెందిన సామ సుజాతరెడ్డి, హేమేందర్ రెడ్డి దంపతులు. సుజాతరెడ్డి (45) గృహిణి. సోమవారం ఉదయం పొలాస గ్రామంలోని పౌలస్తేశ్వరస్వామి దర్శనానికి ద్విచక్రవాహనంపై బయల్దేరింది. జగిత్యాల–ధర్మపురి ప్రధాన రహదారి వెళ్దుండగా.. ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో సుజాత తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించేలోపే మృతిచెందింది. రూరల్ సీఐ ఆరీఫ్‌అలీఖాన్, ఎస్సై సదాకర్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆస్పత్రికి చేరుకుని మృతురాలి కుటుంబసభ్యులను ఓదార్చారు. హేమేందర్రెడ్డి ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. సుజాతరెడ్డికి ఒకే కూతురు సంతానం. ఆమె విదేశాల్లో ఉన్నారు. ఆమె వచ్చాకే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెల్సింది. ఇవి చదవండి: 'అమ్మా.. ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను.. నీతోనే ఉంటానని' అనంత లోకాలకు -
చిరంజీవి పక్కన హీరోయిన్గా, చెల్లిగా, తల్లిగా కనిపించిన నటి!
హీరోల సంగతి ఎలా ఉన్నా హీరోయిన్స్ మాత్రం రకరకాల పాత్రలు చేస్తుంటారు. తొలినాళ్లలో హీరోయిన్గా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఆ తర్వాత తల్లిగా, వదినగా.. వయసు మీద పడే కొద్దీ పాత్రల ఎంపిక పూర్తిగా మారిపోతూ ఉంటుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఏ వుడ్ అయినా అందుకు అతీతం కాదు. అయితే కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయలేక సినిమాలకు ముగింపు పలికినవాళ్లూ ఉన్నారు. ఇకపోతే చిరంజీవితో స్టెప్పులేసి హీరోయిన్గా వెలుగు వెలిగి తర్వాత క్రమంలో చెల్లి, అమ్మగా నటించిన సీనియర్ నటి ఎవరో తెలుసా? సుజాత. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో జత కట్టిన సుజాత దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించింది. 1980లో కృష్ణంరాజు, చిరంజీవి కాంబినేషన్లో ప్రేమతరంగాలు అనే మల్టీస్టారర్ మూవీ వచ్చింది. ఇందులో చిరుకు జోడీగా నటించింది సుజాత. రెండేళ్ల తర్వాత 1982లో సీతాదేవి చిత్రంలో చిరుకు చెల్లిగా యాక్ట్ చేసింది. ప్రేయసి కాస్తా చెల్లెలు అయిపోయిందేంటి? అనుకుంటున్న సమయంలో ఏకంగా మెగాస్టార్‌కు తల్లిగా మారిపోయింది నటి. 1995లో బిగ్‌బాస్ మూవీలో చిరు తల్లిగా కనిపించింది. చిరుకు చెల్లెలిగా నటించి రొమాంటిక్ స్టెప్పులేసినవారు ఉన్నారు కానీ ఇలా హీరోయిన్, చెల్లి, అమ్మ.. అన్ని రకాల పాత్రలను పోషించిన ఏకైక నటి సుజాత కావడం విశేషం. నటిగా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆమె అనారోగ్యంతో బాధపడుతూ 2011 ఏప్రిల్ 6న కన్నుమూసింది. ఇకపోతే ప్రేమతరంగాలు సినిమాలో డ్యాన్సర్‌గా నటించిన జయసుధ రిక్షావోడు చిత్రంలో చిరుకు తల్లిగా నటించింది. చదవండి: ఇదేందిది.. ఇది ప్రభాస్ విగ్రహమా? నెట్టింట ట్రోలింగ్.. బాహుబలి నిర్మాత సీరియస్ -
తల్లిని సజీవదహనం చేసిన తనయుడు
కంబదూరు: నవమాసాలు మోసి.. జన్మనిచ్చి.. కంటికి రెప్పలా కాపాడి.. పెంచి పెద్ద చేసిన కన్నతల్లినే ఓ కుమారుడు పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కంబదూరులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కంబదూరులోని ఓబయ్య కాలనీకి చెందిన ఈడిగ గోపీనాథ్, సుజాతమ్మ(59) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు ఇద్దరికీ పెళ్లిళ్లు కావడంతోపాటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంటర్ చదివిన కుమారుడు ప్రణీత్ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. తాగుడుకు బానిసైన అతను ఉద్యోగం మానేసి స్వగ్రామం చేరుకున్నాడు. రోజూ మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను హింసించేవాడు. సోమవారం కూడా మద్యం తాగడానికి డబ్బు ఇవ్వాలని అనారోగ్యంతో మంచంలో పడుకుని ఉన్న తల్లి సుజాతమ్మను అడిగాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చుట్టుపక్కలవారు మంటలను గమనించి సుజాతమ్మ భర్త గోపీనాథ్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చేలోపే పూర్తిగా కాలిపోయిన సుజాతమ్మ మృతి చెందింది. ఘటనాస్థలాన్ని కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుడు ప్రణీత్‌ను అరెస్ట్ చేశారు. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో.. పోలీస్‌స్టేషన్ ఆవరణలో యువతి ఒక్కసారిగా..
ఆదిలాబాద్: ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇచ్చోడ పోలీస్‌స్టేషన్ ఆవరణలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ముసాయిపేట్కు చెందిన సుజాత (28), ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్‌కాలనీకి చెందిన చందల హరీశ్‌కుమార్ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. హైదరాబాద్‌లో చదువుతున్న సమయంలో వీరు ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతుండడంతో 2022 మార్చిలో ప్రియుడు ఇంటి వద్ద సుజాత భైఠాయించింది. ఈ క్రమంలో హరీశ్ తల్లిదండ్రులు నిర్మల్‌కు మకాం మార్చారు. దాదాపు 18 నెలల నుంచి సుజాత తన సమీప బంధువులతో కలిసి ప్రియుడు హరీశ్‌కుమార్ ఇంట్లో ఉంటోంది. ఆదివారం ఇరువర్గాల కుల పెద్దలతో పంచాయితీ నిర్వహించారు. ఈ వివరాలను ఇచ్చోడ పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించానికి వెళ్లారు. పెళ్లికి హరీశ్‌కుమార్ నిరాకరించడంతో యువతి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. వెంటనే స్థానిక ఎస్సై నరేశ్ పోలీసు వాహనంలో పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ప్రసుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎస్సై వివరణ కోరగా ఇరువర్గాల కులపెద్దలు పోలీస్‌స్టేషన్ బయట మాట్లాడుకున్నారు. హరీశ్‌కుమార్ పెళ్లికి నిరాకరించడంతో పోలీస్‌స్టేషన్ గేటు బయట సుజాత పురుగుల మందు తాగినట్లు తెలిపారు. -
TS Election 2023: అరుపులు, కేకలతో గందరగోళ పరిస్థితి.. ‘కంది’ పై సస్పెండ్ ప్రకటన..
ఆదిలాబాద్: కాంగ్రెస్‌లో వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. జిల్లాలో హస్తం పార్టీలో ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. దీంతో లొల్లి రచ్చకెక్కింది. పట్టణంలోని విద్యుత్ తరంగిణి భవన్లో సోమవారం నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీసీ ఐక్యవేదిక సభ రసాభాసగా మారడమే ఇందుకు నిదర్శనం. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ సినీయర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత్‌రావు సమక్షంలో పార్టీ ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల పార్టీలో చేరిన ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి రాకను వ్యతిరేకిస్తూ డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, పార్టీ సీనియర్ నేత గండ్రత్ సుజాత వర్గీయులు గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో తన వర్గీయులు గేటు దూకి తాళాన్ని పగులకొట్టగా.. శ్రీనివాసరెడ్డి బౌన్సర్లతో కలిసి లోపలికి వెళ్లారు. సభహాలులోకి వస్తుండగా మరోసారి సుజాత, సాజీద్‌ఖాన్ వర్గీయులు గేటు మూసివేయడంతో శ్రీనివాసరెడ్డి వర్గీయులు తోసుకుని లోపలకు వెళ్లారు. తమ నాయకుడిని వేదికపైకి పిలువాలంటూ వీహెచ్‌తో వాగ్వాదానికి దిగారు. బెంచీలను గట్టిగా చరుస్తూ నినదించారు. మరోవర్గం కార్యకర్తలు వారిని అడ్డుకునే యత్నం చేయగా ఇరువర్గాల అరుపులు, కేకలతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని గందోరగోళ పరిస్థితి. ఈ క్రమంలో వీహెచ్ శ్రీనివాస రెడ్డిని వేదికపైగా పిలువగా వచ్చి కూర్చున్నారు. అయినా ఇరువర్గాల మధ్య ఘర్షణ తగ్గలేదు. ఓ క్రమంలో నేతలపై దాడిచేసినంత పనిచేశారు. వీహెచ్ మెడలోని కండువాను శ్రీనివాసరెడ్డి వర్గీయుడు లాక్కోవడం ఉద్రిక్తతకు కారణమైంది. ఈ క్రమంలో వీహెచ్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినకుండా ఆందోళన కొనసాగించడంతో చేసేదిలేక వీహెచ్‌తో సహా నేతలంతా బయటకు వెళ్లిపోయారు. కొద్దిసేపు అక్కడే వేచి చూసిన శ్రీనివాసరెడ్డి తన వర్గీయులతో కలిసి బయటకు వెళ్లారు. కాగా వీహెచ్‌కు వ్యతిరేకంగా ఆయన వర్గీయులు నినాదాలు చేశారు. 15 నిమిషాల తర్వాత తిరిగి సభ ప్రారంభం కాగా వీహెచ్ ప్రసంగించారు. సీఆర్ఆర్కు నివాళి.. ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డికి మాజీ ఎంపీ వి.హనుమంతరావు నివాళులర్పించారు. శాంతినగర్‌లోని సీఆర్ఆర్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఆయన వెంట ఏఐసీసీ సభ్యుడు డాక్టర్ నరేష్ జాదవ్ , డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, తదితరులు ఉన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి.. దేశవ్యాప్తంగా బీసీల గణనను నిర్వహించడంతో పాటు కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని వీహెచ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీంతో బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపుతో పాటు పిల్లల చదువులు, స్కాలర్షిప్ అందేలా రిజర్వేషన్లు లభిస్తాయన్నారు. దేశంలో 52శాతం, రాష్ట్రంలో 54శాతం జనాభా కలిగిన బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కొన్ని బీసీ కులాలు ఇప్పటికీ అసెంబ్లీలో అడుగుపెట్టలేదన్నారు. అలాంటి వారికి బీసీ రిజర్వేషన్లు తోడ్పడనున్నాయన్నారు. రాహుల్‌గాంధీ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించిన న్యాయవ్యవస్థకు సెల్యూట్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. దేశంలో రాహుల్ హవా నడుస్తుందని కేంద్రంలో ఆయన ప్రధాని కావడంతో పాటు రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దెదించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. టికెట్ హైకమాండ్ నిర్ణయిస్తుందని అది ఖరారు కాకముందే బౌన్సర్లతో వచ్చి దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదని కంది శ్రీనివాసరెడ్డిపై మండిపడ్డారు. అమెరికా నుంచి ప్రజాసేవ చేసేందుకు వచ్చిన వ్యక్తి అందరినీ కలుపుకుని పోవాలే తప్ప బౌన్సర్లతో ఇతర నేతలపై దాడులు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. -
బతికుండగానే చితికి నిప్పుపెట్టినట్లు నటి 'సుజాత' జీవితం ముగిసిందా?
టాలీవుడ్లో ఎందరో స్టార్ హీరోలకు తల్లిగా నటించి, అలరించిన సుజాత అందరికీ గుర్తుండే ఉంటారు. పాత తరం అందరి అగ్రకథానాయకల సరసన సుజాత హీరోయిన్గా నటించి ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళ, మళయాల, కన్నడ చిత్రాలలో నటించి అలరించిన సుజాత కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించారు. సహజనటిగా పేరు సంపాదించిన సుజాత అనేక తెలుగు చిత్రాలలో కీలక పాత్రలు పోషించి ఇక్కడ చెరగని ముద్ర వేశారు. (ఇదీ చదవండి: వీళ్లది అలాంటి ఫ్రెండ్షిప్.. స్టార్ హీరోలు అయినా సరే!) సుజాత స్వతహాగ మళయాలి. కానీ ఆమె శ్రీలంకలోని గల్లేలో జన్మించింది. ఆమె బాల్యం కూడా శ్రీలంకలోనే గడిచింది. హైస్కూల్ చదువు పూర్తి కాగానే తొలిసారి 'ఎమకులమ్ జంక్షన్' అనే మళయాళ చిత్రంలో తొలిసారి నటించారామె. తర్వాత కె.బాలచందర్ దృష్టిని సుజాత ఆకర్షించారు. బాలచందర్ తెరకెక్కించిన 'అవల్ ఒరు తోడర్ కథై'లో ప్రధాన పాత్ర పోషించారామె. సుజాత నటించిన తొలి తమిళ చిత్రం ఇదే. తెలుగులో 'అంతులేని కథ'గా వచ్చింది. తర్వాత బాలచందర్ తెరకెక్కించిన 'అవర్గల్' (ఇది కథ కాదు) మూవీ కూడా సుజాతకు నటిగా మంచి పేరు తెచ్చి పెట్టింది. దాసరి నారాయణరావు సినిమాతో ఎంట్రీ అలా మంచి క్రేజ్‌లో ఉన్న సుజాతను దాసరి నారాయణరావు 'గోరింటాకు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేశారు. తెలుగులో మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్‌ను అందుకుంది. తర్వాత దాసరి డైరెక్షన్లో ఏయన్నార్, సీనియర్ ఎన్టీఆర్,కృష్ణంరాజు, కృష్ణలతో పలు సినిమాల్లో నటించారు. గుప్పెడు మనసు, పండంటి జీవితం, రగిలే జ్వాల, ప్రేమతరంగాలు, బంగారు కానుక, బహుదూరపు బాటసారి, సూత్రధారులు వంటి సూపర్ హిట్ చిత్రాలలో సుజాత కీలక పాత్రలు పోషించారు. వెంకటేష్ 'చంటి'లో తల్లి పాత్రలో అలరించిన సుజాత.. 'పెళ్ళి'లో పృథ్వీకి తల్లిగా కనిపించి మెప్పించారు. భర్త అనుమానంతో ఎన్నో ఇబ్బందులు అలా తెలుగు తెరకు పరిచయం ఉన్న ప్రముఖ హీరోలందరీ సినిమాల్లో నటించిన ఆమె నిజ జీవితం మొత్తం కన్నీటి గాథలే. ఇంట్లో పెద్దలకు నచ్చకపోయిన జయశంకర్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో అతను పచ్చళ్ల వ్యాపారం చేసేవాడు. అప్పట్లోనే విదేశాలకు కూడా తన వ్యాపారాన్ని విస్తరించాడు. కొద్దిరోజుల తర్వాత తన వ్యాపారం అంతగా జరగకపోవడంతో రానురాను పూర్తిగా సుజాత సంపాదన మీదనే ఆధారాపడ్డాడు. అక్కడి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. పచ్చళ్ల వ్యాపారాన్ని క్లోజ్ చేసిన తర్వాత జయశంకర్ కూడా సుజాతతో పాటు సినిమా షూటింగ్ వద్దకు వెళ్లేవాడు. అక్కడ ఆమె ఎవరితోనైనా మాట్లాడుతూ కనిపిస్తే చాలు అనుమానంతో ఆమెపై రెచ్చిపోయేవాడు. ఇంటికి వెళ్లిన తర్వాత సుజాతపై మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా హింసించేవాడు. ఆ భయంతో ఆమె సినిమా సెట్లో ఎవరితో మాట్లాడకుండా ఉండేవారు. భర్తతో ఎన్ని గొడవలు ఉన్నా పిల్లల చదువుల విషయంలో ఆమె నిర్లక్ష్యం చేయలేదు. కుమారుడు సాజిత్ సాఫ్ట్వేర్ రంగంలో, కూతురు దివ్య డాక్టర్‌గా స్థిరపడ్డారు. అయితే భర్తకు ఆమెపై ఉన్న అనుమానం రోజురోజుకూ పెరుగుతూ రావడం వల్ల చాలా సినిమా అవకాశాలను వదులుకుంది. (ఇదీ చదవండి: రామ్ చరణ్,జూ.ఎన్టీఆర్.. ఉత్తమ హీరో ఎవరో తేలనుందా..?) తర్వాత ఆమె ఆరోగ్యం దెబ్బతింది. రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఆమెకు మంచి గుర్తింపుతో పాటు సినిమా అవకాశాలు భారీగా వస్తున్న సమయంలో మంచాన పడ్డారు. అలా 2011 ఏప్రిల్ 6న చెన్నైలో గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. అలా ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో కన్నీటితోనే కాపురం చేసింది. అలా బతికుండగానే చితికి నిప్పుపెట్టినట్లు ఆమె జీవితం ముగిసింది. -
వివాహేతర సంబంధం: కలిసి ఉండలేక.. విడిగా బతకలేక!
హైదరాబాద్: హయత్‌నగర్‌లో జరిగిన జంట మరణాల కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధాన్ని కొనసాగించలేక మానసికంగా కుంగిపోయిన అల్లవుల రాజేశ్, బత్తుల సుజాతలు బలవన్మరణాలకు పాల్పడ్డారని హయత్‌నగర్ పోలీసుల దర్యాప్తులో తేలింది. పెళ్లయి ముగ్గురు పిల్లలున్న సుజాత వివాహేతర సంబంధాన్ని కొనసాగించలేక, ఆమె ఎడబాటును భరించలేక రాజేశ్‌లు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారని, పథకం ప్రకారమే ఇద్దరూ కలిసి పురుగుల మందు కొనుగోలు చేసి, తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని రాచకొండ పోలీసు కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ వెల్లడించారు. తొలుత హత్యగా కేసు దర్యాప్తును ప్రారంభించిన హయత్‌నగర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఇవి ఆత్మహత్యలను తేల్చి చెప్పారు. పూర్తి వివరాలను వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డితో కలిసి గురువారం మీడియాకు వివరించారు. ► ములుగు జిల్లా పంచోత్కులపల్లికి చెందిన రాజేశ్ పై చదువుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి చైతన్యపురిలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. ఏడాది క్రితం రాజేశ్ అనుకోకుండా హయత్‌నగర్‌లోని సిద్దివినాయకనగర్‌లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బత్తుల సుజాతకు మిస్డ్ కాల్ ఇచ్చాడు. అటువైపు కాలర్ ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలంతో మెసేజ్ చేశాడు. దీంతో సుజాత రిప్లై ఇచ్చింది. అలా ఒకరికొకరు పరిచయం ఏర్పడి నిరంతరం చాటింగ్ చేసుకునేవారు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. చిట్‌చాట్‌తో మొదలైన వారి ప్రేమ.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ► కొంతకాలం తర్వాత సుజాత తరచూ గుర్తు తెలియని వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుండటం ఆమె కుటుంబ సభ్యులు గమనించారు. 15 రోజుల క్రితం సుజాత అనారోగ్యానికి గురైంది. ఆ సమయంలో రాజేశ్ ఆమెకు తరచూ ఫోన్లు, వాట్సాప్ సందేశాలు చేశాడు. అనారోగ్యం కారణంగా ఆమె రిప్లై ఇవ్వలేకపోయింది. ► దీంతో రాజేశ్ ఆమె ఇంటి పరిసరాల్లోకి వచ్చాడు. అతని అనుమానాస్పద కదలికలను గమనించిన సుజాత కూతురు శివాని తన స్నేహితుడు క్రాంతి వంశీకి ఫోన్లో సమాచారం ఇవ్వడంతో అతను ఇంటికి వచ్చాడు. ఇప్పటికే రాజేశ్ అక్కడి నుంచి కుంట్లూరు రోడ్‌లోని మిస్టర్ చాయ్ టీ స్టాల్‌కు వెళ్లిపోయాడు. అతన్ని అనుసరిస్తూ వంశీ కూడా వెళ్లాడు. ఇదే విషయాన్ని శివానికి ఫోన్ చేసి చెప్పడంతో ఆమె తన సోదరుడు జైచంద్రకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే అతను తన స్నేహితుడు జస్వంత్‌ను తీసుకొని, టీ స్టాల్ వద్దకు చేరుకున్నారు. జైచంద్ర, జస్వంత్, వంశీ ముగ్గురు కలిసి సుజాత ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావని రాజేశ్‌ను ఆరా తీశారు. ఒకట్రెండు దెబ్బలు కొట్టేసరికి అసలు విషయాన్ని రాజేశ్ వివరించాడు. ► ఆ తరువాత రాజేశ్‌ను బైక్ మీద ఎక్కించుకొని జై చంద్ర, జస్వంత్‌లు వెళ్లిపోయారు. ముగ్గురూ కలిసి సూర్యానగర్ కాలనీ వెనుక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ రాజేశ్ వివరాలను సేకరించి, తన తల్లి సుజాత ఆత్మహత్యాయత్నం చేసుకుందని, తనని వేధించవద్దని హెచ్చరించి, రాజేశ్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ► మే 24న సాయంత్రం సమయంలో మృతురాలు సుజాత కుంట్లూరు క్రాస్ రోడ్‌కు వచ్చి, ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి, రాఘవేంద్ర ఆగ్రో ఏజెన్సీ దుకాణానికి వెళ్లి పురుగుల మందు కొనుగోలు చేసింది. ఆ తర్వాత రిలయన్స్ మార్ట్ వద్దకు చేరుకొని, అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న రాజేశ్ చేతికి బాటిల్‌ను ఇచ్చింది. ఆపై ఆమె రిలయన్స్ మార్ట్‌లోకి వెళ్లి యాపిల్స్, చాక్లెట్లు, ఇడ్లీ రవ, మైదా వంటి వస్తువులను కొనుగోలు చేసింది. మార్ట్ నుంచి బయటకు వచ్చాక రాజేశ్ అక్కడి నుంచి కుంట్లూరులోని పాపాయిగూడ రోడ్ శివారు ప్రాంతానికి వెళ్లిపోయి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ► ఇంటికి వెళ్లిన సుజాత మే 24న రాత్రి సమయంలో విషం తాగడంతో కుటుంబ సభ్యులు ఆమెను హయత్‌నగర్‌లోని శ్రీనివాస ఆసుపత్రికి తరలించారు. మెరుగైన ఆరోగ్యం నిమిత్తం ఎల్బీనగర్లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. మే 29న సాయంత్రం 4 గంటలకు సుజాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కూడా మరణించింది. ► మే 29న సాయంత్రం 6:30 గంటలకు సీఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న పోలోజు వెంకటేశ్వర్లు కుంట్లూరు వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. బహిరంగ ప్రదేశంలో దుర్వాసన రావటంతో పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రాజేశ్ మృతదేహాన్ని గుర్తించారు. రాజేశ్, సుజాతలవి బలవన్మరణాలే మిస్టరీ వీడిన హయత్‌నగర్ జంట మరణాల కేసు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడి -
హయత్ నగర్ హత్యకేసులో సంచలన విషయాలు..!
-
రాజేష్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
సాక్షి, రంగారెడ్డి: హయత్‌నగర్‌లో దారుణంగా హత్యకు గురైన రాజేష్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్నాయి. సుజాతతో వివాహేతర సంబంధం కారణంగానే.. ఆమె భర్త రాజేష్‌ను హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఈలోపు నాగేశ్వర్రావు పెద్ద ట్విస్టే ఇచ్చాడు. తన భార్యది సూసైడ్ కాదని.. రాజేష్ చంపాడంటూ సాక్షి టీవీతో చెప్పాడు. ‘‘నా భార్యను రాజేషే చంపాడు. విషం తెచ్చి బలవంతంగా నా భార్యకు తాగించాడు. నేను కానీ.. నా కొడుకులు కానీ రాజేష్‌ను కొట్టలేదు. కొన్ని నెలలుగా నా భార్యను రాజేష్ టార్చర్ పెడుతున్నాడు’’ అని సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడాయన. ఇదిలా ఉంటే ఈ కేసులో వివాహేతర సంబంధమే రాజేష్ హత్యకు కారణమనే విషయాన్ని పోలీసులు దాదాపుగా ధృవీకరించుకున్నారు. ప్రభుత్వ టీచర్ అయిన సుజాతతో రాజేష్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. పురుగుల మందు తాగిందని పేర్కొంటూ.. ఈ నెల 24వ తేదీన సుజాతను ఆస్పత్రిలో చేర్పించాడు నాగేశ్వరరావు. చికిత్స పొందుతూ సోమవారం ఆమె కన్నుమూసింది. అయితే ఆమె విషం తాగిందని చెబుతున్న సమయానికి ముందు ఆమె ఇంటి వద్ద రాజేష్ కనిపించాడని, అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ద్వారా తెలుస్తోంది. మరోవైపు రాకేష్ హత్య కేసులో హయత్‌నగర్ పోలీసులు నాగేశ్వర్రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజేష్‌ను నాగేశ్వరరావు కొట్టి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్
కర్నూలు: కర్నూలు కృష్ణానగర్‌లోని డివిజనల్ కోఆపరేటివ్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న పి.సుజాతపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆమె నివాసం ఉంటున్న కర్నూలు శ్రీరామ్‌నగర్‌లోని నాగులకట్ట వద్దనున్న ఇంటితో పాటు బంధువుల ఇళ్లు, కోఆపరేటివ్ కార్యాలయంలో మొత్తం ఆరు చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, కృష్ణయ్య, ఇంతియాజ్ బాషా, వంశీనాథ్ తదితరులు బృందాలుగా ఏర్పడి మంగళవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే దాకా విస్తృతంగా సోదాలు జరిపారు. వీటిలో అక్రమ స్థిర, చరాస్తులను గుర్తించారు. కర్నూలుకు చెందిన సుజాత 1993 డిసెంబర్ 9న జూనియర్ ఇన్స్పెక్టర్ హోదాలో కోఆపరేటివ్ శాఖలో ఉద్యోగంలో చేరారు. 1999లో సీనియర్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది కర్నూలు, ఆత్మకూరు ప్రాంతాల్లో పనిచేశారు. 2009లో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొందారు. ఆత్మకూరుతో పాటు కలెక్టరేట్లోని డీసీవో కార్యా లయంలో విధులు నిర్వర్తించారు. గత ఆరేళ్లుగా కర్నూలు కృష్ణానగర్‌లోని డివిజనల్ కోఆపరేటివ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. సోదాల్లో గుర్తించిన అక్రమాస్తులు ఇవే.. కర్నూలులోని శ్రీరామ్ నగర్లో జి+2 ఇల్లు, అశోక్ నగర్లో జి+1 ఇల్లు, కస్తూరి నగర్లో ఒక ఇల్లు, బుధవారపేటలో జి+1తో పాటు సమీపంలోనే మరో వ్యాపార దుకాణం, కర్నూలు మండలం సుంకేసులలో 2.53 ఎకరాల వ్యవసాయ భూమి, కర్నూ లు చుట్టుపక్కల 8 ఇళ్ల స్థలాలు, బ్యాంకు లాకర్లో 40 తులాల బంగారు నగలు, టాటా విస్టా కారు, హోండా యాక్టివా స్కూటీతో పాటు ఖరీదైన ఎల క్ట్రానిక్ గృహోపకరణాలు, రూ.8.21 లక్షల నగ దుతో పాటు కొన్ని ప్రామిసరీ నోట్లు గుర్తింపు. డాక్యుమెంట్ ప్రకారం వీటి విలువ రూ.1.80 కోట్లు కాగా బహిరంగ మార్కెట్లో అక్రమాస్తుల విలువ రూ.10 కోట్ల పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. దర్యాప్తు అనంతరం సుజా తను కర్నూలులోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చ నున్నట్లు డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. పటమట సబ్ రిజిస్ట్రార్ ఇంట్లోనూ సోదాలు సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్ అజ్జా రాఘవరావు కార్యాలయం, నివాసంతోపాటు మరో నాలుగు ప్రదేశాల్లో ఉన్న ఆయన బంధువుల నివాసాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయనికి మించి ఆర్జించిన స్థిర, చరాస్తులు ఆర్జించారన్న పక్కా సమాచారంతో ఈ సోదాలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి వరకు నిర్వహిస్తున్న సోదాలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. అనంతరం తాము గుర్తించిన ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలను వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
గ్రాండ్‌గా జబర్దస్త్ కమెడియన్స్ రాకేశ్, సుజాతల హల్దీ ఫంక్షన్ (ఫొటోలు)
-
వివాహ బంధంలోకి రాకింగ్ రాకేశ్-జోర్దార్ సుజాత (ఫొటోలు)
-
జబర్దస్థ్ కమెడియన్‌ను పెళ్లాడిన యాంకర్.. ఫోటోలు వైరల్
జబర్దస్థ్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ తన ప్రేయసి జోర్దార్ సుజాతను పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట నిశ్చితార్థం ఇటీవలె జరగ్గా, తాజాగా వీరు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. బుల్లితెరపై పలు షోస్‌తో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ రియల్ కపుల్ అనిపించుకున్నారు. కుటుంబంసభ్యులు, సన్నిహితుల సమక్షంలో తిరుపతిలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పలువురు బుల్లితెర నటీనటులు సహా నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సుజాత తెలంగాన యాసలో మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. బిగ్‌బాస్ షోలో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక జబర్దస్థ్ షోతో గుర్తింపు పొందిన రాకేశ్‌తో కలిసి పలు షోల్లో జంటగా పాల్గొంది. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబసభ్యుల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కారు. -
Sujata Seshadrinathan: ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్
సార్క్ రీజన్ ‘ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని స్వీకరించిన సుజాత శేషాద్రినాథ్ వ్యాపార అనుభవాలే తన పాఠాలు అని చెబుతుంది... సాఫ్ట్వేర్, ఫైనాన్స్,అకౌంటింగ్ స్పెషలిస్ట్‌గా తనదైన ముద్ర వేసింది సుజాత శేషాద్రినాథన్. ఫండ్ బిజినెస్‌లో అకౌంటింగ్ అప్లికేషన్స్ కోసం ఆటోమేటెడ్ టెక్నాలజీ సొల్యూషన్స్ క్రియేట్ చేసింది. ‘అద్భుతమైన పురస్కారాన్ని స్వీకరిస్తున్నందుకు గర్వంగా ఉంది. నా ప్రయాణంలో సహకరించిన వ్యక్తులు, సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్న భారతీయ మహిళలకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను. శ్రీలంక కేంద్రంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఏర్పాటయిన సంస్థ ఉమెన్స్ ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్. భవిష్యత్తరం మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ఉమెన్స్ ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ ఉన్నత ప్రమాణాలు నెలకొల్పింది. ఈ ఉద్యమంలో నేను కూడా భాగం కావడం సంతోషంగా ఉంది’ అంటుంది సుజాత శేషాద్రినాథన్. ఎస్పీజైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మెనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసిన సుజాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్డీ చేసింది. సాఫ్ట్వేర్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్, ఫండ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసులలో సుజాతకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న బసిజ్ ఫండ్ సర్వీస్ ప్రైవెట్ లిమిటెడ్‌కు సుజాత డైరెక్టర్. ఫండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫైనాన్షియల్ రిపోర్టింగ్ వరకు ఈ సంస్థ ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. రకరకాల విషయాలలో క్లయింట్స్‌కు సంబంధించి జటిలమైన సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుంది. -
పిఠాపురం జమీందారుతో పెళ్లి, ఆస్తులన్నీ పోయాయి: సీనియర్ నటి
అరవై దశకంలో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తార సుజాత. భీష్మ సినిమాలో మత్స్యకన్యగా నటించి అందరికీ దగ్గరైన ఆమె భీష్మ సుజాతగా స్థిరపడారు. నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం.. ఇలా ఎన్టీఆర్‌తో అనేక సినిమాలు చేశారు. నాగేశ్వరరావుతో ఒకే ఒక్క సినిమా 'మహాత్ముడు' చేసినప్పటికీ చివరకు తన పాత్రను ఎడిటింగ్‌లో తీసేశారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చారు. 'మాది తెనాలి. స్కూలు ఫంక్షన్లో నాటకాలు వేసేవాళ్లం. అమ్మానాన్న నన్ను బాగా ప్రోత్సహించేవారు. వాళ్ల ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వచ్చాను. ఇకపోతే అప్పట్లో నా పెళ్లి పెద్ద సంచలనం. పిఠాపురం జమీందారును పెళ్లి చేసుకున్నా. అప్పుడే పెళ్లెందుకమ్మా, తర్వాత ఫీలవుతావు అని శోభన్‌బాబు చెప్పినా నేను వినిపించుకోలేదు. పైగా పిఠాపురం జమీందారుకు అప్పటికే పెళ్లయింది. ఆయన మొదటి భార్య ఒప్పుకున్న తర్వాతే నేను అతడిని పెళ్లి చేసుకున్నా. ఆ సమయంలో నేను నిశ్చింతగా సినిమాలు చేసుకోవచ్చని చెప్పారు. కానీ తర్వాత మాత్రం సినిమాలే వద్దన్నారు. మా ఆయన దానధర్మాలు ఎక్కువగా చేసే వారు. అలా ఉన్న ఆస్తంతా పోయింది. మిగిలిన కొన్ని ఆస్తులు కోర్టు ఆధీనంలోకి పోయాయి. ఆర్థిక స్థితి బాగోలేకపోవడంతో తిరిగి మళ్లీ సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. కానీ ఈసారి డ్రామాలు, సినిమాలు, డబ్బింగ్‌లు, కోరస్‌లు.. ఇలా అన్నీ చేయాల్సి వచ్చింది' అని పేర్కొన్నారు భీష్మ సుజాత. చదవండి: షారుక్ ఖాన్ పని అయిపోయిందంటూ ఆర్జీవీ ట్వీట్ ఎన్టీఆర్‌ను జమున కాలితో తన్నడంపై వివాదం -
రాకింగ్ రాకేశ్-జోర్దార్ సుజాత నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్
-
రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత ఎంగేజ్మెంట్.. పిక్స్ వైరల్
రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట తాజాగా నిశ్చితార్థం జరుపుకున్నారు. బుల్లితెరపై పలు షోస్‌లో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ ఒక్కటవ్వనుంది. ఈ వేడుకకు జబర్దస్త్ నటులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా, యాంకర్ రవి, అనసూయ, గెటప్ శ్రీను తదితరులు పాల్గొని జంటను ఆశీర్వదించారు. ఇటీవలే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించింది సుజాత. తమ నిర్ణయాన్ని పెద్దలు గౌరవించి, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపింది. రాకేశ్‌తో పరిచయం దగ్గర్నుంచి స్నేహం, ప్రేమ, చివరికి పెళ్లి వరకు ఎన్నో మధురమైన ఙ్ఞాపకాలకో ఓ వీడియోలో షేర్ చేసింది సుజాత. త్వరలోనే పెళ్లి డేట్‌ను అనౌన్స్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంటకు పలువురు సినీతారలు శుభాంకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) -
షేక్‌పేట మాజీ తహసీల్దార్ సుజాత మృతి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: అవినీతి అరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌లో ఉన్న షేక్‌పేట మాజీ తహసీల్దార్ సి.హెచ్. సుజాత (46) శనివారం గుండెపోటుతో మృతిచెందారు. 45 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె నిమ్స్‌లో చేరగా డెంగ్యూతోపాటు కేన్సర్ నిర్ధారణ అయింది. దీంతో చికిత్స తీసుకొని ఇటీవలే ఆమె డిశ్చార్జి అయ్యా రు. అయితే ఈ నెల 2న ఆరోగ్యం విషమించడంతో బంధువులు ఆమెను మళ్లీ నిమ్స్‌కు తరలించారు. శనివారం ఉదయం చికిత్స పొందుతున్న క్రమంలో తీవ్ర గుండెపోటు రావడంతో మర ణించారు. సుజాత భౌతికకాయాన్ని చిక్కడపల్లి లోని ఆమె నివాసానికి తరలించిన బంధువులు... అనంతరం అంబర్‌పేట శ్మశానవాటికలో అంత్య క్రియలు నిర్వహించారు. ఆమె భౌతికకాయాన్ని సంగారెడ్డి డీఆర్వో రాధికారమణి, తహసీల్దార్లు శైలజ, లలిత, జానకి, రామకృష్ణ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. రూ. 40 కోట్ల భూమి వ్యవహారంలో... బంజారాహిల్స్‌లో రూ. 40 కోట్ల విలువజేసే ఓ భూమిని సర్వే చేసి ఆన్లైన్లో రికార్డులు నమోదు చేసేందుకు రూ. 30 లక్షలు లంచం డిమాండ్ చేసి నట్లు సుజాతపై ఆరోపణలు రావడంతో 2020 జూన్ 7న ఏసీబీ అధికారులు ఆమెతో పాటు ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ను, నాటి బంజారాహిల్స్ ఎస్సైని అరెస్టు చేశారు. అలాగే ఆమె నివాసం నుంచి రూ. 30 లక్షల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ కోర్టు ఆదేశంతో అప్పట్లో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే సుజాత అరెస్ట్‌తో ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే ఆమె భర్త అజయ్ కుమార్ తీవ్ర మనోవేదనకు గురై 2020 జూన్ 17న ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో భర్త అంత్యక్రి యల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా బెయిల్‌పై విడు దలైన సుజాత... ఆ తర్వాత మధ్యంతర బెయిల్ పొంది సరూర్‌నగర్‌లోని తన తల్లి ఇంట్లో కుమా రుడు భరత్చంద్రతో కలిసి ఉంటున్నారు. 2005లో తహసీల్దార్‌గా ఉద్యోగంలో చేరిన సుజాత మెదక్, అంబర్‌పేట, ముషీరాబాద్, హిమాయత్‌నగర్ తదితర మండలాల్లో పని చేశారు. తహసీల్దార్ కాకముందు ఆమె కొంతకాలం ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగానూ పనిచేశారు.