జడ్చర్ల మండలం నాగసాలలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులపై ఆటోలో వచ్చిన నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. వేట కొడవళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా నరకడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యకు తీవ్రగాయాలు అయ్యాయి.