
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో టాస్క్‌ల డోస్ పెరుగుతోంది. ముందు తేలికపాటి ఆటలను ఇంటి సభ్యులకు పరిచయం చేసిన బిగ్ బాస్.. పోనుపోనూ మరింత కఠినతరం చేస్తున్నాడు. ఇక హౌజ్‌లో గురువారం సైతం కిల్లర్ కాయిన్స్ టాస్క్ కొనసాగుతోంది. బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో మోహబూబ్, సొహైల్ అందరికంటే ఎక్కవ కాయిన్స్ సంపాధించి మొదటి రెండు స్థానంలో ఉండగా.. కిల్లర్ కాయిన్స్ గేమ్ మొదటి లెవల్ ముగిసి రెండో లెవల్ జరుగుతోంది. ఈ గేమ్‌లో ఇంటిసభ్యులందరికి వెల్ ప్రో జాకెట్‌లను బిగ్‌బాస్ అందించగా కిల్లర్ కాయిన్‌ను ఇంట్లోని ఎవరైనా ఒకరి షర్ట్‌కు అతికించాలి. బజర్ మోగే సమయానికి ఎవరి వద్ద ఆ కాయిన్ ఉంటే వారి దగ్గర ఉన్న కాయిన్స్‌లో సగం కాయిన్స్ వేరే వారికి ఇచ్చేయాలి. కాగా తాజాగా విడుదలైన ప్రోమోలో కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా నలుగురు సభ్యుల మధ్య కాసుల వేట సాగుతోంది. (స్వాతి విషయంలో అభిజిత్‌ను నిలదీసిన హారిక)
ఈ టాస్క్‌లో అమ్మ రాజశేఖర్ మాస్టర్, కుమార్‌సాయి, సుజాత, అలేఖ్య హారిక తమ సత్తాను నిరూపించుకునేందుకు పోటీపడనున్నారు. వీరంతా మట్టితో ఉన్న దాంట్లోకి దిగి ఆ బురద నుంచి కాసులను వెతికి తమ బాస్కెట్స్‌లో వేయాలి. సమయం ముగిసే సరికి ఎవరి దగ్గర ఎక్కు కావయిన్స్ ఉంటే వారు ఈ వారం కెప్టెన్సీ అయినట్లు. ఈ క్రమంలో నలుగురు సభ్యులు తమ ఒంట్లోని శక్తినంతా కూడగట్టుకొని పోటీ బరిలో దిగారు. ఎక్కువ సంఖ్యలో కాసలను సొంతం చేసుకోవడానికి ఇంటి సభ్యులు ఎత్తుకుపై ఎత్తు వేస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఇంటి కెప్టెన్ అయ్యిందేకు రెడీ అయ్యారు. మరి ఈ ఆటలో గెలిచి నాలుగో ఇంటి కెప్టెన్ స్థానాన్ని ఎవరూ అధిష్టించారో తెలియాలంటే ఈరోజు ప్రసారమయ్యే బిగ్‌బాస్ షో చూడాల్సిందే. (కథ వేరే ఉంటది: మాస్టర్‌కు సోహైల్ వార్నింగ్)
Captaincy aatalo coins veta!!!#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/IOJYYkQsVB
— starmaa (@StarMaa) October 1, 2020
Comments
Please login to add a commentAdd a comment