Alekhya Harika
-
రెడ్ శారీలో అలేఖ్య హారిక స్టన్నింగ్ లుక్స్.. (ఫోటోలు)
-
కొత్తింటి కల సాకారం చేసుకున్న దేత్తడి హారిక..
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లే రేపటి స్టార్లు.. ఈ మాటను ఎప్పుడో రుజువు చేసి చూపించింది దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక. సాంగ్ ఆల్బమ్స్, రీల్స్ చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ హడావుడి చేసే ఈ బ్యూటీ పలు షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వెబ్ సిరీస్‌లు చేసింది. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో టాప్ 5 వరకు చేరుకుని తన సత్తా చూపించింది. సినిమాల్లో అక్కడక్కడా కనిపించినా పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలు మాత్రం చేయలేదు. అయితే తను త్వరలోనే హీరోయిన్‌గానూ వెండితెరపై కనిపించనుంది. బేబి ఫేమ్ సాయి రాజేశ్ డైరెక్షన్లో సంతోష, హారిక హీరోహీరోయిన్లుగా నిస్తున్నారు. మొత్తానికి చాలాకాలానికి హారిక పంట పండిందని అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. తాజాగా మరో శుభవార్త చెప్పింది దేత్తడి పాప. తను కొత్తిల్లు కొనుక్కుంది. గృహప్రవేశానికి తారలను, స్నేహితులను ఆహ్వానించింది. ఈ క్రమంలో నూతన గృహప్రవేశానికి వచ్చిన దీప్తి సునయన తదితరులు కొత్తింటి కల సాకారమైనందుకు సంతోషంగా ఉందంటూ శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఇంటికి వచ్చినవారిని వట్టి చేతులతో పంపించకుండా బహుమతులు కూడా అందించింది. చదవండి: అప్పట్లో నిశ్చితార్థం రద్దు.. 11 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న హీరోయిన్ -
దేత్తడి హారికకు గోల్డెన్ ఛాన్స్...హీరోయిన్ గా ఎంట్రీ (ఫొటోలు)
-
'మీరు బాదకముందే చెబుతున్నా ఆరు 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు ఉన్నాయి'
బేబీ సినిమాతో డైరెక్టర్‌గా సాయి రాజేష్‌కు గుర్తింపు వచ్చినా ఆయన మొదటగా ‘హృదయకాలేయం’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తర్వాత కొబ్బరి మట్ట సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. ఆ రెండూ సినిమాలకు సంబంధించిన మీమ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. తర్వాత కలర్ ఫోటోతో నిర్మాతగా మెప్పించాడు.బేబీ సినిమాను నిర్మాత ఎస్కేఎన్తో కలిసి సాయి రాజేష్ తెరకెక్కించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అందుకుంది. మొత్తం ఆరు ప్రేమకథలు నిర్మించబోతున్నట్లు ‘బేబి’ దర్శకుడు సాయి రాజేష్ ప్రకటించారు. (ఇదీ చదవండి: దొరికిపోయిన రతిక.. మోకాళ్లపై కూర్చుని దండం పెట్టిన అమర్!) కలర్ ఫోటో,బేబీ సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి.. మరో రెండు ప్రేమకథలు నిర్మాణంలో ఉన్నాయి. త్వరలో ఇంకో రెండు కథలు త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా కొనసాగుతున్న సాయి రాజేష్, ఎస్కేఎన్ ఇద్దరూ.. గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లో ఉంటూ చాలా రోజులుగా కలిసి పనిచేస్తున్నారు. అలా బేబీ హిట్‌తో వారిద్దరి పేర్లు సెన్సేషన్ అయ్యాయి. తాజాగా వీరి నుంచి మరో సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.. సంతోష్ శోభన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. వారి బ్యాచ్‌లో ఉన్న మరో స్నేహితుడు సుమన్ పాతూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు హిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరో తెలుగమ్మాయి.. 'బిగ్ బాస్' ఫేమ్ అలేఖ్య హారికను కథానాయకిగా పరిచయం చేయడం విషేశం. 'అమృత ప్రొడక్షన్స్' నుంచి ఇప్పటి వరకు మూడు సినిమాలు నిర్మించిగా. ఆఖరి సినిమాగా కలర్ ఫోటో వచ్చిందని సాయి రాజేష్ గుర్తు చేశారు. ఆ చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. నేనేమీ లోకేష్ కనగరాజ్ కాదు ఆ తర్వాత తాను నిర్మాతగా సినిమాలు నిర్మించలేదని సాయి రాజేష్ ఇలా చెప్పుకొచ్చాడు. ఒక మంచి కథ వచ్చినప్పుడు నేను మళ్లీ సినిమా నిర్మించాలని అనుకున్నాను. ఈ కథ ప్రేక్షకులను మెప్పిస్తుంది. సోషల్ మీడియాలో కొందరు ఎన్ని తీస్తారురా 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు అని బాదకముందే నేనే ముందుగా చెప్తున్నాను. నాది, ఎస్కేఎన్ కాంబినేషన్లో మొత్తం 6 ప్రేమకథలు రాబోతున్నాయి. వీటిలో రెండు మీరు చూసేశారు. ఒకటి కలర్ ఫోటో.. రెండోది బేబి. రెండు నిర్మాణంలో ఉన్నాయి.. వైష్ణవి, ఆనంద్ కాంబినేషన్లో రీసెంట్గా ఒక సినిమా ప్రకటించాం. ఇప్పుడు సంతోష్, హారిక కాంబినేషన్లో ఈ సినిమా రానుంది. ఇవి కాకుండా ఇంకో రెండు లవ్ స్టోరీలు ఉంటాయి. కొందరు మాత్రం ఇదేమైనా సినిమాటిక్ యూనివర్సా.. స్టోరీలో ఏమైనా లింక్ అయ్యాయా..? సీక్వెల్ ఉంటుందా..? అంటే నేనేమీ లోకేష్ కనగరాజ్ కాదు.. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ.. మీ అందర్నీ మెప్పించేలా ఆరు ప్రేమ కథలు ఉన్నాయి. అవి నేను, ఎస్కేఎన్ కలిసి మీకు అందిస్తున్నాం. వాటిలో ఇదీ ఒకటి. ఇది నా మనసుకు చాలా దగ్గరైన ప్రేమ కథ. ఈ ప్రాజెక్ట్‌లో నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ సుమన్ పాతూరి, హారిక అలేఖ్య, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్, సుహాస్, మేమందరం చాలా సంత్సరాలుగా స్నేహితులం. ఎస్కేఎన్, నేను చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్. అందరం ఫ్రెండ్స్ కలిసి ఫ్రెండ్స్ కోసం చేస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా తీస్తున్నాం.' అని సాయి రాజేష్ చెప్పారు. -
'కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి'.. బేబీ డైరెక్టర్ మరో సంచలన కథ!
బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు సాయి రాజేశ్. తాజాగా మరో కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాకు సాయి రాజేశ్ కథను అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో యువ నటుడు సంతోశ్ శోభన్, బిగ్ బాస్ బ్యూటీ అలేఖ్య హారిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస కుమార్, సాయిరాజేశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగ చైతన్య ముఖ్య అతిథిగా హాజరై హీరో, హీరోయిన్లపై క్లాప్ కొట్టారు. కాగా.. ఈ చిత్రం ద్వారా హారిక హీరోయిన్గా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను సాయి రాజేశ్ రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్ లిప్‌లాక్‌తో ఉన్న ఫోటో చూస్తే ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. బేబీ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కథకు మరో సూపర్ హిట్ ఖాయంగా కనిపిస్తోంది. బేబీ తరహాలోనే మరో ప్రేమకథా చిత్రంతో టాలీవుడ్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. కాగా.. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్నారు. View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) -
క్రేజీ హీరోకు జోడీగా దేత్తడి హారిక.. బేబీ టీమ్‌తో గోల్డెన్ ఛాన్స్
బిగ్‌బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేత్తడి అనే యూట్యూబ్ చానల్ ద్వారా తెలంగాణ యాసలో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తోనే బిగ్‌బాస్ సీజన్-4 ఆఫర్ అందుకున్నఆమె టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకుంది. తర్వాత ఆమె పలు షోలలో మెరిసింది. కానీ కొంత కాలంగా ఆమె బుల్లితెరకు దూరంగానే ఉంటూ వస్తుంది. తాజాగా అలేఖ్య హారిక హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అందులో యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన కథానాయకుడు కాగా ఆయనకు జోడీగా ఆలేఖ్య హారిక హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను బేబీ మేకర్స్ నిర్మాత SKN, డైరెక్టర్ సాయి రాజేష్‌లు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నట్లు టాక్. సాయి రాజేష్ ఇప్పటికే బేబీ సనిమాతో యూట్యూబర్ వైష్ణవి చైతన్యకు బిగ్ ఛాన్స్ ఇచ్చాడు. యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన హారికను హీరోయిన్గా సాయి రాజేష్ పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించాలని వారు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే స్టోరీ, ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. రేపు ఈ సినిమా పూజా కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. చిన్న సినిమాలకు బెస్ట్ ఆప్షన్‌గా సంతోష్ శోభన్ ఉన్నారు. ఆతనితో తెరికెక్కించిన ప్రతి సినిమా మినిమమ్ ఆడియన్స్‌కు రీచ్ అవుతుందని తెలిసిందే. బిగ్‌బాస్ నుంచి వచ్చాక హారిక సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా మారింది. తర్వాత కొద్దిరోజులకే ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదరు. కానీ సోషల్ మీడియాలో తరచూ వీడియోలు, హాట్‌హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట ఫుల్ యాక్టివ్‌గా ఉంది. ఈ సినిమా ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కుతే ఆమెకు మళ్లీ పలు ఛాన్స్‌లు రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. -
అలేఖ్యకు రూ.50వేలు ఆర్థికసాయం అందజేత
నల్గొండ: గుర్రంపోడు మండలం కొత్తలాపురం గ్రామానికి చెందిన కట్టెబోయిన అలేఖ్య నిడమనూరు ఆదర్శ పాఠశాలలో చదువుతూ ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో 9.7 జీపీఏ సాధించింది. అలేఖ్య తల్లి లక్ష్మమ్మ కేన్సర్‌తో బాధపడుతూ ఫిబ్రవరి 11న మృతిచెందింది. ఆమె తండ్రి వారిని వదిలి వెళ్లిపోయాడు. ‘పది’లో సత్తా చాటిన విద్యార్థిని, అలేఖ్యకు బాసటగా నిలుస్తాం అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనాలకు పలువురు దాతలు స్పందించి ఆమెకు ఆర్థికసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు పటాన్చెరువు సీఐ నూకల వేణుగోపాల్‌రెడ్డి తాను చేపట్టిన వన్ చాలెంజ్ ద్వారా హైదరాబాద్‌లోని ఓ బట్టల షాపులో పనిచేస్తున్న కట్టెబోయిన అలేఖ్యను బుధవారం కలిసి రూ.50వేలు ఆర్థికసాయం అందజేశారు. సాయం అందిచాలనుకునే వారు: కట్టెబోయిన అలేఖ్య యూనియన్ బ్యాంక్(పెద్దవూర బ్రాంచ్) A/C NO: 194612120000001 IFSC CODE:UBIN 0819468 -
పళ్లు తోముకోలేదా? అంటూ సెటైర్.. కౌంటరిచ్చిన దేత్తడి హారిక
తెలంగాణ యాసలో గలగలా మాట్లాడే దేత్తడి హారిక తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వీడియోలతో హల్చల్ చేసే ఆమె బిగ్‌బాస్ షోలోనూ పాల్గొని అందరినీ అలరించింది. ప్రస్తుతం తన పేరిట ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ ఓపెన్ చేసి దానిద్వారా అభిమానులకు కావాల్సిన రీతిలో ఆడియో, వీడియో విషెస్ చెప్తూ డబ్బులు సంపాదిస్తోందీ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫోటోషూట్స్, రీల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆమె 'ఒక కొంటెపిల్లనే చూశా.. సెంటిమీటర్ నవ్వమని అడిగా.. తను నవ్వే నవ్వితే వంద మంది సచ్చిపోయారే..' పాటకు రీల్ చేసింది. నీలిరంగు చీరలో చిరునవ్వు విసురుతూ కవ్వించింది దేత్తడిపాప. ఇది చూసిన ఓ నెటిజన్ వందమంది చనిపోయారంటే నువ్వు సరిగా బ్రష్ చేసుకోలేదేమో అని సెటైర్ వేశాడు. దీనికి హారిక స్పందిస్తూ.. అబ్బే ఏం పేలలేదు అని కౌంటరిచ్చింది. చాలామంది ఇలాగే వెటకారంగా కామెంట్లు చేస్తుండేసరికి ఏకంగా కామెంట్ సెక్షన్నే ఆఫ్ చేసుకుంది హారిక. View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) చదవండి: 20 తులాల బంగారం వేసుకుని తిరిగేదాన్ని, చివరికి తిండి లేక..: నటి -
సైలెంట్‌గా పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ! వరుడు అతడేనా?
బిగ్‌బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేత్తడి అనే యూట్యూబ్ చానల్‌తో ద్వారా తెలంగాణ యాసలో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తోనే బిగ్‌బాస్ ఆఫర్ అందుకున్న ఆమె అభిమానులకు మరింత చేరువయ్యింది. హౌజ్‌లో అభి-హారిక బాండింగ్ చూసి వారిద్దరి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉందంటూ చర్చించుకున్నారు. చదవండి: నేనేమి పెద్ద అందగత్తెను కాదు..: జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే ఆ రిలేషన్ హౌజ్ వరకే పరిమితమైంది, బయటకు వచ్చాక వీరిద్దరు కలుసుకుంది కూడా చాలా తక్కువ. దీంతో వారిద్దరి మధ్య ఏం లేదని స్పష్టమైంది. బిగ్‌బాస్ నుంచి వచ్చాక హారిక సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా మారింది. మరోవైపు సోషల్ మీడియాలో తరచూ వీడియోలు, హాట్‌హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. చదవండి: దీపావళికి ఓటీటీలో ‘కృష్ణ వ్రింద విహారి’ సందడి, స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, ఎక్కడంటే ఈ తాజా బజ్ ప్రకారం.. ఓ యూట్యూబర్‌తో హారిక ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడితో కొంతకాలంగా సీక్రెట్ డేటింగ్లో ఉందని అంటున్నారు. ఇక ప్రస్తుతం వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇదే విషయాన్ని ఇరు కుటుంబాల్లో చెప్పడంతో వారు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య హారిక ప్రియుడితో సైలెంట్‌గా ఏడడుగుల వేయబోతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే హారిక స్పందించేవరకు వేచి చూడాల్సిందే. -
పప్పులో కాలేసి బుక్కైన దేత్తడి హారిక, చూసుకోమ్మా ఇంగ్లీష్ పాప అంటూ ట్రోల్స్..
బిగ్‌బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వీపరితమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్‌తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఆమె అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ 4 సీజన్లో పాల్గొనే చాన్స్ కొట్టేసింది. తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. బిగ్‌బాస్ తర్వాత ఆమెకు స్టార్డమ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఖాళీ సమయంలో సోషల్ మీడియాలో వరస వీడియోలు, రీల్స్‌తో పాటు హాట్‌హాట్ ఫొటోషూట్లు షేర్ చేస్తోంది. చదవండి: ఘనంగా అనిల్ అంబానీ కుమారుడి వివాహం, బచ్చన్ ఫ్యామిలీ సందడి ఈ క్రమంలో ఆమెకు అభిమానుల సంఖ్యతో పాటు ట్రోలర్స్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఆమె షేర్ చేసిన వీడియోలు, ఫొటోలపై ఓవరాక్స్ ఎక్కువైందంటూ విమర్శించడమే కాకుండా బుడ్డది, పొట్టిది అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రీసెంట్గా ఆ ట్రోల్స్ స్పందించిన హారిక ‘ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా.. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమాని అయి ఉండాలి’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్‌తో ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి ట్రోలర్స్‌కు అవకాశం ఇస్తూ ఓ వీడియో షేర్ చేసింది. తన నటన ప్రతిభను చూపిస్తూ వింత వింత ఎక్స్‌ప్రెషన్స్‌తో ఓ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేస్తూ.. దానికి ఎక్స్ప్రెషన్ క్వీన్ (Expresstion Queen) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఇక్కడే పప్పులో కాలేసింది హారిక. Expression బదులుగా Expresstion అని స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టింది. దీంతో అది చూసిన ట్రోలర్స్ హరీకను ఆడేసుకుంటున్నారు. ‘బిగ్‌బాస్ హౌజ్‌లో మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతూ ఇంగ్లీష్ పాపల బిల్డప్ ఇచ్చావు.. కాస్తా స్పెల్లింగ్ చూసుకోమ్మా’ అని ‘ఎక్స్ప్రెషన్ ఇవ్వడం ఎలాగూ రాదు.. కనీసం స్పెల్లింగ్ అయినా సరిగా రాయడం నేర్చుకోమ్మా ఇంగ్లీష్ పాప’ అంటూ సటైరికల్‌గా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తనన ఇలా ట్రోల్ చేయడానికి కారణం లేకపోలేదు. చదవండి: భీమ్లా నాయక్ ట్రైలర్‌పై వర్మ షాకింగ్ కామెంట్స్, పవన్‌పై వరస సటైరికల్ ట్వీట్స్ ఇంత చిన్ని విషయానికే ఆమెకు నెటిజన్ల ఎందుకు టార్గేట్ చేశారంటే.. బిగ్‌బాస్ హౌజ్‌లో తరచూ ఇంగ్లీష్ మాట్లాడుతూ బిగ్‌బాస్‌కు హారిక కోపం తెప్పించిన సంగతి తెలిసిందే. తెలుగులోనే ఎక్కువగా మాట్లాడాలని ఎన్నిసార్లు చెప్పిన హారిక మాత్రం ఇంగ్లీష్ ఎక్కువగా.. తెలుగు తక్కువగా మాట్లాడేది. బెసిగ్గా ఆమె తెలుగు అమ్మాయే అయినప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడానికి ఆమె ఇష్టపడటంతో ప్రేక్షకుల అసహనానికి గురైంది. అంతేకాదు హోస్ట్ నాగార్జున సైతం ప్రతివారం తెలుగులోనే మాట్లాడు హారిక అంటూ నొక్కి మరి చెప్పేవారు. ఇక ఇంగ్లీష్ మాట్లాడితే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని బిగ్‌బాస్ హెచ్చరించిన హారిక తన తీరును మాత్రం మార్చుకోలేదు. -
అలా పిలిస్తే గుడ్డలూడదీసి కొడతా: దేత్తడి హారిక వార్నింగ్!
వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్‌తో క్రేజ్ సంపాదించుకుంది దేత్తడి హారిక. తెలంగాణ యాసలో ఆమె పలికించే డైలాగులు, నటనకు ఎంతోమంది అభిమానులున్నారు. ఈ యూట్యూబ్ స్టార్ బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొని ఫినాలే వరకు వెళ్లింది. ప్రైవేట్ అల్బమ్స్‌తో పాటు అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తోంది. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండే హారికకు ఈ మధ్య కామెంట్ల బెడద ఎక్కువైంది. ఆమె ఫొటోను చూసి హైట్ గురించి చులకన చేసి మాట్లాడుతున్నారు కొందరు. పొట్టిది, బుడ్డది అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఇష్టారీతిన కామెంట్లు పెట్టేవారికి గట్టి కౌంటరిచ్చింది హారిక. ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా.. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమాని అయి ఉండాలి అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌ను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. అదీ.. అర్థమైంది కదా.. అని ట్రోలర్స్‌కు వార్నింగ్ ఇచ్చింది. -
విన్నర్ గురించి హింట్ ఇచ్చిన దీప్తి సునయన? దేత్తడి హారిక ఫైర్!
Bigg boss 5 Telugu: బిగ్‌బాస్ విజేత ఎవరై ఉంటారు? సన్నీ గెలిచాడా? లేదా యూట్యూబ్ స్టార్ షణ్ను గెలిచాడా? అబ్బే.. సింగర్ శ్రీరామ్ ట్రోఫీ సాధిస్తాడేమో, సిరి, మానస్ ముందే ఎలిమినేట్ అయిపోతారేమో! ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. నిన్నటిదాకా ఓటింగ్ వేస్తూ అభిమాన కంటెస్టెంట్‌ను గెలిపించుకోవడానికి నానాతంటాలు పడ్డ బుల్లితెర ప్రేక్షకులు రిజల్ట్ ఏమని వస్తుందా? అని ఊపిరి బిగపట్టుకుని ఎదురు చూస్తున్నారు. అనఫీషియల్ ఓటింగ్‌లో సన్నీ గెలుస్తాడని ప్రచారం జరుగుతోంది కానీ ఇదే నిజమని పూర్తిగా నమ్మలేం. ఎందుకంటే కొన్ని షాకింగ్ ఎలిమినేషన్లతో బిగ్‌బాస్ మనం ఊహించనివి కూడా చేసి చూపిస్తాడని నిరూపించాడు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం సన్నీ విన్నర్ అని, షణ్ముఖ్ ట్రోఫీ గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయాడని పుకార్లు మొదలయ్యాయి. ఇది షణ్ను ప్రేయసి దీప్తి సునయన కంట కూడా పడిందో ఏమో కానీ ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టింది. 'జీవితంలో ప్రతీది ఏదో ఒక కారణంతోనే జరుగుతోంది, షణ్ముఖ్ కోసం నిలబడినందుకు, మీ ప్రేమ అందించినందుకు ధన్యవాదాలు' అని రాసుకొచ్చింది. ఇక బిగ్‌బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్ దేత్తడి హారిక అయితే ఏకంగా స్టార్ మాను తిడుతూ పోస్ట్ పెట్టింది. ఇది చెత్త నిర్ణయం స్టార్ మా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పోస్ట్‌తో వీక్షకుల్లో ఎన్నో సందేహాలు తలెత్తాయి. ఇంతకీ ఎవరు గెలిచారని హారిక అలా పోస్ట్ పెట్టిందని గుసగుసలు పెడుతున్నారు. -
దేత్తడి హారిక ఇల్లు ఎంత బాగుందో చూడండి!
Bigg Boss Fame Dethadi Harika Beautiful Home Tour: అలేఖ్య హారిక.. యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయిందీ తెలంగాణ పిల్ల. దేత్తడి ఛానల్లో ఆమె చేసే వీడియోలను లక్షలాది మంది వీక్షిస్తున్నారంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ క్రేజ్‌తో హారికకు బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అవకాశం రావడం.. వెంటకే ఓకే చెప్పేయడం, అక్కడ టాస్కుల్లో విజృంభిస్తూ శివంగిగా పోరాడటం ఆమెను మరింత పాపులర్ చేశాయి. ప్రస్తుతం షార్ట్ ఫిలింస్, సాంగ్స్, సరదా వీడియోలతో ఫుల్ బిజీగా ఉంది హారిక. ఇదిలా వుంటే తాజాగా దేత్తడి పాప ఇల్లు ఎలా ఉందో చూపిస్తూ ఆమె తల్లి హోమ్ టూర్ వీడియో చేసింది. మరి ఆమె ఇంటి విశేషాలేంటో చూసేద్దాం.. హారిక ఇంట్లో హాల్, కిచెన్, పూజ గది, మూడు పడక గదులు, రెండు బాల్కనీలు, చిన్నపాటి స్టోర్ రూమ్ ఉన్నాయి. ఏ గదికాగది శుభ్రంగా సర్దేసినట్లుగా ఉంది. హారికకు ఇల్లు సర్దేంత ఓపిక ఉండదు కాబట్టి అన్నీ తానే నీట్‌గా సర్దుతానని చెప్తోంది ఆమె తల్లి. దాదాపు ప్రతి గదిలోనూ హారిక ఫొటోలే కనిపించాయి. మరీ ముఖ్యంగా అభిమానులిచ్చిన ఫొటోలను ఎంతో భద్రంగా దాచుకుందీ దేత్తడి పాప. షూటింగ్స్‌తో బిజీగా ఉండే హారిక ఖాళీ సమయాల్లో పెయింటింగ్ కూడా వేస్తుందట! ఆమె బెడ్రూమ్లో తను గీసిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. బిగ్‌బాస్ షోకు గుర్తుగా హౌస్‌లోని నీటి జార్‌ను, నామినేషన్స్‌లో వాడే ఫొటోను, తనకిచ్చిన ఫిదా టైటిల్‌ను ఇంటికి తెచ్చేసుకుని దాచుకుంది. 'షో మస్ట్ గో ఆన్..' పాట హారికకు ఇష్టమని, త్వరలోనే దాన్ని టాటూ వేయించుకోబోతుందన్న విషయాన్ని అభిమానులకు లీక్ చేసింది ఆమె తల్లి. నిజానికి తనకు ఈ పచ్చబొట్టు పొడిపించుకోవడాలు ఇష్టం లేకపోయినా.. తన కూతురికి ఆ సాంగ్ అంటే తెగ ఇష్టం కావడంతో ఈసారికి తనెలాంటి అభ్యంతరం తెలపడం లేదంటోంది. బిగ్‌బాస్ నుంచి వచ్చాక సైకిల్ కొనివ్వమని సోహైల్‌ను అడిగిందట హారిక! కానీ అతడు కొనిచ్చేలోపే తనే వెళ్లి ఓ సైకిల్‌ను ఇంటికి తెచ్చుకుందని చెప్పింది. కొత్త మురిపెంతో రెండు మూడు రోజులు దాన్ని వాడిందని, కానీ బయట సైకిల్ తొక్కడం వల్ల ముఖం నల్లగా అయిపోతుందని దాన్ని మూలనపడేసిందని చెప్పుకొచ్చింది. అలాగే హారికకు ఇప్పటివరకు వచ్చిన అవార్డులన్నింటినీ వీడియోలో చూపించింది. మీరూ ఆమె ఇంటిని చూసేయండి.. -
హల్చల్ : అలా ఉండాలంటున్న వర్మ .. మిస్ అవుతున్న అనన్య
► బిగ్‌బాస్ బ్యూటీస్‌తో ఆర్జీవీ ► ఆలోచనల్లో పడిపోయిన రాశీ ఖన్నా ► మిస్ అవుతానంటున్న అనన్య పాండే ► రీల్స్‌లో మునిగిపోయిన అలేఖ్య ► ఒకే ఫ్రేములో బిగ్‌బాస్ బజ్ హోస్టులు ► అఖిల్ తన ఫర్ఎవర్ ఫ్రెండ్ అంటున్న మోనాల్ View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) View this post on Instagram A post shared by Marina Abraham Sahni (@marina.a1203) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
హల్చల్ : లాస్ట్ నైట్ సెలబ్రేషన్స్‌లో హారిక.. గ్లిట్టర్ డ్రెస్‌లో పూజా
► తెలంగాణలో టెంపుల్ విజిట్ చేసిన మోనాల్ ► మిర్చీ లాంటి డ్రెస్‌లో హీరోయిన్ సదా ► బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న పూజా హెగ్డే ► పాజిటివ్ స్పిరిట్ అంటున్న షెఫాలీ ► బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో అలేఖ్య హారిఖ ► దాన్ని ఎవరూ బ్రేక్ చేయలేరు అంటున్న లావణ్య ► మోడల్‌తో బిగ్‌బాస్ ఫేం కౌశల్ ఫోజులు ► కొత్త సాంగ్‌తో రెడీగా ఉన్న నేహా కక్కడ్ View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Shefali Jariwala 🧿 (@shefalijariwala) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) -
హల్చల్ : వింటేజ్ లుక్‌లో సదా..షూట్ మూడ్‌లో రాశీ
♦ ఎర్రటి చీరలో మెరిసిపోతున్న కొత్త పెళ్లికూతురు దిశ ♦ ట్రెండింగ్ రీల్స్ చేస్తున్న టిక్‌టాక్ స్టార్ భాను ♦ రష్మీకి ఎవరైనా అబ్బాయినా వెతుకుదాం అంటున్న టిక్‌టాక్ స్టార్ ♦ వింటేజ్ లుక్‌లో సదా ♦ వీకెండ్ జోష్‌లో బిగ్‌బాస్ ఫేం హారిక ♦ జర్నీ ఎలా ఎండ్ అవుతుందో చెబుతున్న నేహా కక్కర్ ♦ పెట్ లవ్ అంటున్న మెహ్రీన్ ♦ తల్లి సురేఖవాణితో సుప్రీత చిరునవ్వులు ♦ షూట్ లైఫ్ అంటున్న రాశీ ఖన్నా ♦ పచ్చని చీరలో చూడముచ్చటగా ముస్తాబైన హిమజ View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by BANDARU SUPRITHA NAIDU✨ (@_supritha_9) View this post on Instagram A post shared by Ivana_Designers (@ivana_designers) View this post on Instagram A post shared by DPV (@dishaparmar) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
గరం గరం ముచ్చట్లు 01 August 2021
-
హల్చల్ : కవ్విస్తున్న హారిక.. ఎంజాయ్ చేస్తోన్న మెహ్రీన్
♦ బీచ్‌లో ఎంజాయ్ చేస్తోన్న మెహ్రీన్ ♦ అరియానాతో రిల్స్ చేసిన మెహబూబ్ ♦ వెకేషన్ మూడ్‌లో అశ్మిత ♦ ఉన్నది ఒకటే జిందగీ రీ యూనియన్ ♦ బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న శ్రీముఖి ♦ మిడ్ నైట్ క్రేవింగ్స్ అంటోన్న షెహ్నాజ్ ♦ బ్లాక్ అండ్ వైట్ ఎప్పటికీ మోడ్రన్ అంటున్న సోనమ్ ♦ మూవీ ప్రమోషన్స్‌లో శిల్పా శెట్టి ♦ బిగ్‌బాస్ బ్యూటీ హారిక హాట్ స్టిల్స్ View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by SAINA NEHWAL (@nehwalsaina) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) -
హల్చల్ : వెయిటింగ్ అంటోన్న బుట్టబొమ్మ..విలేజ్ లుక్‌లో శిల్పా
♦ ఏం జరిగినా ఒక కారణం ఉంటందున్న నేహా ♦దానికోసం వెయిటింగ్ అంటున్న బుట్టబొమ్మ ♦ వెడ్డింగ్ యానివర్సిరీ వేడుకల్లో అష్మిత ♦ కవ్విస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ హారిక ♦ సాఫ్ట్ హార్ట్ ఉండాలంటున్న హీనా ఖాన్ ♦ గుర్రపు స్వారీలో కౌశల్ మండా ♦ బాధలో ఉన్న యాంకర్ రష్మీ..ఆన్సర్ ఇదేనట ♦ వర్కవుట్ గ్లో అంటోన్న నటి షెఫాలి ♦ విలేజ్ లుక్‌లో టీవీ నటి శిల్పా ♦ ఫన్ వీకెండ్ అంటోన్న అదితి View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Sekhar Master (@sekharmaster) View this post on Instagram A post shared by Anchor Shilpa Chakravarthy (@tvshilpa) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Shefali Jariwala 🧿 (@shefalijariwala) -
కుక్కతో విజయ్ ఆటలు, బిర్యానీ కావాలన్న ధన్య
♦ తన వయసు పెరగకుండా పరిష్కారం కనిపెడతానంటున్న సుమ కనకాల ♦ కుక్కతో ఆడుకుంటున్న విజయ్ దేవరకొండ ♦ గ్యాంగ్‌తో కరీష్మా కపూర్ ♦ ఫొటోలతో హీటు పెంచుతున్న ఆండ్రియా ♦ ప్యారడైస్లో మరొక రోజు అంటోన్న లావణ్య త్రిపాఠి ♦ బిర్యానీ పార్సిల్ కావాలంటున్న ధన్య బాలకృష్ణ ♦ గోవాను మిస్ అవుతున్నానంటోన్న అప్సర రాణి ♦ స్విమ్ సూట్లో ఉన్న ఫొటోను షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ♦ లైట్ల మధ్య చందమామలా వెలిగిపోతున్న ప్రియాంక చోప్రా ♦ చీరకట్టులో ఏంజెల్లా మెరిసిపోతున్న మోనాల్ గజ్జర్ ♦ వ్యాక్సిన్ వేయించుకున్న మలైకా అరోరా View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Karisma Kapoor (@therealkarismakapoor) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
హల్చల్: నన్ను చూడు, నా అందం చూడంటోన్న భామలు
♦ లైట్ల మధ్య నక్షత్రంలా వెలిగిపోతున్న వితికా శెరు ♦ ఎల్లో డ్రెస్‌లో ఎల్లోరా శిల్పంలా మెరిసిపోతున్న రష్మీ గౌతమ్ ♦ పని మొదలైందంటున్న అషిమా నర్వాల్ ♦ దేత్తడి హారికతో దీప్తి సునయన స్టెప్పులు ♦ పొన్నంబళంతో ఫైటింగ్ మామూలుగా లేదంటున్న అదాశర్మ ♦ సెల్ఫీ దిగిన రుహానీ శర్మ ♦ ఈ పాట ఎంతో నచ్చిందంటున్న రకుల్ ప్రీత్ సింగ్ ♦ చాలా రోజులవుతోందంటూ పలకరించిన ప్రగ్యా జైస్వాల్ ♦ తల్లికి బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రియాంక చోప్రా ♦ మాస్కో అందాలను ఆస్వాదిస్తోన్న తాప్సీ ♦ వ్యాక్సిన్ వేయించుకున్న నివేదా థామస్ ♦ జూమ్ చేసి తనను డిస్టర్బ్ చేయకండంటోన్న అనుపమ పరమేశ్వరన్ View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Ashima Narwal (@iamashimanarwal) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Esha Guupta (@egupta) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Ariana Grande (@arianagrande) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
తళుకు బెళుకు తారలు, అందాల సొగసులు..
♦ అదితి భాటియా సెల్ఫీ మోడ్ ♦ నేనిలాగే ఉంటా, కానీ ఇది యాటిట్యూడ్ మాత్రం కాదంటోన్న కౌశల్ మండా ♦ ఆకాశమే హద్దుగా సాగిపో అని చెప్తోన్న ముమైత్ ఖాన్ ♦ మంచు లక్ష్మీకి కూతురి సర్ప్రైజ్ ♦ అప్పట్లో ఎంతో సేఫ్‌గా ప్రయాణించేవాళ్లమంటోన్న నోయల్ సేన్ ♦ గుడ్ హెయిర్డే అంటోన్న మాధురీ దీక్షిత్ ♦ ఎందుకో తెలీదు గానీ నిన్నుచూసిన మరుక్షణం నా పెదాల మీద చిరునవ్వు ప్రత్యక్షమవుతుందంటోన్న అషూ రెడ్డి ♦ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఆర్ ఎక్స్ 100 భామ ♦ నన్ను నమ్మండి, నేను నిజంగానే పని చేస్తున్నాను అంటోన్న సన్నీలియోన్ View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Niveditha Gowda 👑 (@niveditha__gowda) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Mumait Khan (@mumait) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Noel (@mr.noelsean) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Akanksha Puri🧚♀️ (@akanksha8000) View this post on Instagram A post shared by Akanksha Puri🧚♀️ (@akanksha8000) View this post on Instagram A post shared by Archana Gupta🧿 (@archannaguptaa) View this post on Instagram A post shared by Archana Gupta🧿 (@archannaguptaa) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
స్నేహితులను మిస్ అవుతున్న లావణ్య, హ్యాపీ ఫేస్‌తో అనుపమ
♦ తన బలం తన సోదరుడే అంటోన్న రకుల్ ప్రీత్ సింగ్ ♦ అనుపమ పరమేశ్వరన్ చేయి కొరుకుతున్న సోదరుడు అక్షయ్ ♦ ఈ ఫొటో నచ్చిందంటోన్న హెబ్బా పటేల్ ♦ స్త్రీ కంటే ఎక్కువగా ఎవరూ కష్టపడరు అంటోన్న నటి ప్రగతి ♦ మీరే ప్రశాంతతను నెలకొల్పి అక్కడే సేద తీరండి అంటోన్న వితికా షెరు ♦ అలీ రెజాకు బర్త్‌డే విషెస్ చెప్పిన రాహుల్ సిప్లిగంజ్ ♦ డ్యాన్స్ ఇరగదీసిన దేత్తడి హారిక ♦ స్నేహితులను మిస్ అవుతున్న లావణ్య త్రిపాఠి View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by I N D H U J A (@indhuja_ravichandran) View this post on Instagram A post shared by I N D H U J A (@indhuja_ravichandran) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Devi Sri Prasad (@thisisdsp) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) -
లవ్ పాఠాలు నేర్పిస్తున్న దేత్తడి పాప, సెట్ చేసుకో అంటున్న లాస్య
♦ ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నానంటోన్న పరిణీతి చోప్రా ♦ 'భేడియా' షెడ్యూల్ హోగయా అంటున్న కృతీసనన్ ♦ సూరీడు ముద్దులు పెడుతున్నాడంటోన్న జాన్వీ కపూర్ ♦ నన్ను అక్కడికి తీసుకెళ్లండి అంటోన్న ప్రీతి జింటా ♦ నవ్వును కోల్పోకండి అంటున్న పూజా రామచంద్రన్ ♦ రేపు ఘనంగా ఉండాలంటే నిన్నటి కంటే ఎక్కువగా శ్రమించాల్సిందే అంటోన్న శిల్పాశెట్టి ♦ సెట్ చేసుకోవాలంటున్న యాంకర్ లాస్య ♦ దీనికి క్యాప్షన్ ఇవ్వొచ్చుగా అంటోన్న రెజీనా కసాండ్రా View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Regina Cassandra (@reginaacassandraa) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Keerthi Pandian (@keerthipandian) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Vidyu Raman (@vidyuraman) -
బిగ్‌బాస్ భామల బ్యూటిఫుల్ ఫోటోలు
-
దేత్తడి హారిక షాకింగ్ నిర్ణయం
తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బాస్ ఫేమ్ దేత్తడి హారిక నియామకంపై రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. దీనిపై తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హారిక ఎవరో తెలియదు అని చెప్పడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దేత్తడి హారిక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు హారిక ప్రకటించింది. యూట్యూబ్ స్టార్‌గా ఉన్న హారిక బిగ్‌బాస్ సీజన్ 4లో టాప్ -5లో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) బ్రాండ్ అంబాసిడర్‌గా మహిళా దినోత్సవం రోజు ప్రకటించారు. అప్పటి నుంచి వివాదం ఏర్పడింది. అయితే తాజాగా హారిక ఆ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేసింది. ‘‘అందరికీ నమస్తే. ఒక చిన్న క్విక్ అప్డేట్.. మహిళా దినోత్సవం రోజు నన్ను టీఎస్‌టీడీసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం దగ్గర నుంచీ ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే.. కొన్ని కారణాలతో ఆ పదవి నుంచి తప్పుకుంటున్నా. నాకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. లవ్యూ ఆల్’’ అంటూ హారిక చెప్పుకొచ్చింది. హారిక బ్రాండ్అంబాసిడర్ అంశం తెలంగాణతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మూడు రోజులుగా ఆమె చుట్టూనే వార్తలు నడిచిన విషయం తెలిసిందే. అయితే హారిక నియామకం వెనకాల ఏం జరిగిందో అనే విషయం సస్పెన్స్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. Here is the update .As you all know, Was appointed for Promoting and Marketing the Tourism dept hotels and properties earlier,but then will not be continuing it further due to several other reasons .And thanks to all my well-wishers,and sorry for all the disappointment,love u all pic.twitter.com/SzLAaIPxwR — Alekhya Harika (@harika_alekhya) March 10, 2021 -
దేత్తడి హారిక ఎవరో తెలియదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారికను నియమించడంపై అనేక విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా స్పందించారు. హారిక నియామకం పట్ల సీఎంవోకు గానీ, ఉన్నతాధికారులకు గానీ ఎలాంటి సమాచారం లేదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు హారిక ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని, తొందరలోనే దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. దీని వెనుక ఎవరున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, త్వరలోనే ఒక మంచి సెలబ్రిటీని తెలంగాణ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తామని వెల్లడించారు. చదవండి: ఆసియాలోనే అతిపెద్ద పాలరాతి శివుడు మన దగ్గరే! బిగ్‌బాస్ హారికకు భారీ షాక్..! -
దేత్తడి హారిక వివాదం: క్లారిటీ ఇచ్చిన శ్రీనివాస్ గుప్తా
-
దేత్తడి హారిక వివాదం: క్లారిటీ ఇచ్చిన గుప్తా!
తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బాస్ ఫేం, యూట్యూబర్ దేత్తడి హారికను నియమించడంపై పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఆమెకు ఏం అర్హత ఉందని బ్రాండ్ అంబాసిడర్‌ను చేశారని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. చిన్న వయసులోనే ఎవరెస్ట్, కిలిమంజారో లాంటి పర్వతాలను అధిరోహించి తెలంగాణ ఘనతని విశ్వవ్యాప్తం చేసిన మలావత్ పూర్ణ, మిస్ ఇండియాగా ఎంపికైన వారణాసి మానస పేర్లు కనిపించడం లేదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ తెలంగాణ టూరిజం అంబాసిడర్‌గా హారికను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడమే కాక ఆమెకు అపాయిట్మెంట్ ఆర్డర్ సైతం అందజేశారు. అయితే దేత్తడి హారికను టీఎస్‌టీడీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన విషయం టూరిజం మంత్రికి కూడా తెలీయదని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబ్ స్టార్ దేత్తడి హారికే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. హిమాయత్ నగర్‌లోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ రావుతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్‌టీడీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారికను తొలగించారని వస్తున్న వార్తలను ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారిక కొనసాగుతారని మరోసారి స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. కోట్లు వెచ్చించి హారికను తీసుకోలేదు ‘తెలంగాణ ఆడబిడ్డ, కరీంనగర్ వాస్తవ్యురాలైన దేత్తడి హారికకు ప్రమోషన్ ఇచ్చేవిధంగా టీఎస్‌టీడీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాం. మార్కెటింగ్‌లో ప్రమోషన్స్ కోసం హోటల్స్, బోటింగ్, బస్సులు నడవడానికి హారికను నియమించాం. కానీ ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ వల్ల ఆమెను తొలగించారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివి నమ్మొద్దు. దీని గురించే ఎండీ గారు, మేమంతా కూర్చొని చర్చించాం. టూరిజాన్ని ప్రమోట్ చేసుకునేందుకు తక్కువ ఖర్చుతో ప్రచారం చేస్తున్నాం. అందుకే హారికను తీసుకున్నాం. అంతేగాని ఆమెను కోట్లు పెట్టి మేము తీసుకోలేదు. కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. కాబట్టి హారికను పెడితే కొద్దీగా ప్రమోషన్ వస్తుందని మా ఆలోచన. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో తెలంగాణ టూరిజాన్ని నెంబర్ వన్‌గా డెవలప్ చేసేందుకు కృషిచేస్తున్నాం.’ అని ఇన్‌స్టాలో పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Uppala Srinivas (@usrinivasgupta) .చదవండి: స్టార్ హీరోయినే నా డ్రీమ్: దేత్తడి హారిక బిగ్‌బాస్ హారికకు భారీ షాక్..! -
బిగ్‌బాస్ హారికకు భారీ షాక్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలైన దేత్తడి హారికకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ హారికను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడమే కాక ఆమెకు అపాయిట్మెంట్ ఆర్డర్ సైతం అందజేశారు. అయితే దీనిపై వివాదం రాజుకుంది. మంత్రికి, ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా నియామకం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై టూరిజం శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వ్యవహారం చీఫ్ సెక్రటరీ వరకు వెళ్లింది. దీంతో వెంటనే అలర్టెయిన అధికారులు అధికారిక వెబ్సైట్లో హారికకు నియామకానికి సంబంధించిన వివరాలను తొలగించారు. అయితే తెలంగాణ టూరిజం అధికారిక ట్విట్టర్లో మాత్రం ఆమె నియామకానికి సంబంధించిన వివరాలు అలాగే ఉన్నాయి. హారికకు ముందు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా నియమించిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో తాజాగా హారికను నియమించగా.. ప్రస్తుతం ఆమె పేరును వెబ్సైట్ నుంచి తొలగించడం కలకలం రేపుతుంది. ఇక హారిక నియామకంపై ఓ రేంజ్లో విమర్శలు వచ్చాయి. అసలు ఏ అర్హత ఆధారంగా ఆమెని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారంటూ నెటిజనులు విమర్శించారు. యూట్యూబ్ స్టార్‌గా సత్తా చాటడం, బిగ్ బాస్‌లో పాల్గొనడమే అర్హతలా అని ప్రశ్నించారు. ఎవరెస్ట్ సహా ప్రపంచంలోని ఆరు ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన మాలావత్ పూర్ణ, మిస్ ఇండియాగా ఎంపికై వారణాసి మానస తదితరులను ఎంపిక చేయవచ్చు కదా అంటూ సూచించారు. చదవండి: స్టార్ హీరోయినే నా డ్రీమ్: దేత్తడి హారిక -
హారిక నియామకానికి సంబంధించిన వివరాలు తొలగింపు
-
స్టార్ హీరోయినే నా డ్రీమ్: దేత్తడి హారిక
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ ఫేం..‘దేత్తడి’ హారిక బంపర్ ఆఫర్ అందుకున్నారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా హారిక నియమితులయ్యారు. బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఫైనల్ వరకు వచ్చిన హారిక ఈ నియామకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి మంచి అవకాశాన్ని దక్కించుకున్నారు. సోమవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక భవన్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా ఈ మేరకు ఆమెకు నియామక పత్రాన్ని అందించారు. అలాగే దీనికి సంబంధించిన వివరాలను తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన వెల్లడించారు. కాగా తెలంగాణ యాసతో యూట్యూబ్ ద్వారా పాపులారిటీని సాధించిన దేత్తడి హారిక ఎంతోమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నారు. ఆ క్రేజ్‌తోనే తెలుగు బిగ్‌బాస్ 4 సీజన్‌కు సెలక్ట్ అయ్యారు. హౌజ్‌లో మిగతా కంటెస్టెంట్లకు గట్టిపోటినిచ్చి ఫైనల్ వరకు పోరాడారు. టాప్ 5కు చేరి ప్రేక్షకుల మన్ననలు పొందారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా హారిక వరుస అవకాశాలు అందుకుంటున్నారు. పలు ప్రాజెక్టులతోపాటు సినిమా చాన్స్‌లు కొట్టేశారు హారిక. మరోవైపు.. ప్రస్తుత తన ప్రయాణం ప్రారంభమే అని, ఎప్పటికైనా హీరోయిన్ సినిమాలు చేయడమే తన లక్ష్యమని మనసులో మాటని బయటపెట్టింది బిగ్‌బాస్–4 ఫేమ్ దేత్తడి హారిక(అలేఖ్య హారిక). నగరంలోని మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలో సీఈఓ హరికాంత్, డాక్టర్ పూర్ణిమతో పాటు ముఖ్య అతిథిగా దేత్తడి హారిక పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఒక అమ్మాయిగా తనకెప్పుడూ అమ్మే ఆదర్శమని, అంతకుమించి ఎవరినీ స్ఫూర్తిగా తీసుకోనని పేర్కొంది. ముఖ్యంగా తాను తీసుకునే మంచి నిర్ణయాలే తనకు స్ఫూర్తి అని తెలిపింది. ప్రస్తుతం వరుడు కావలెను అనే సినిమాతో పాటు మరిన్ని సినిమాల్లో చేస్తున్నాని, అంతేకాకుండా తన యూట్యూబ్ చానెల్లో మరో వెబ్ సిరీస్ రానుందన్నారు. ఎప్పటికైనా సినిమాల్లోనే.. మంచి కథాంశంతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో హీరోయిన్గా నటించాలనుందని దేత్తడి హారిక తెలిపింది. మహానటి లాంటి సినిమాలో చేయాలనుందని, అంతేకాకుండా రామ్ జామ్ తరహా సినిమాలన్నా తనకు ఎంతో ఆసక్తి అని పేర్కొంది. Sri Uppal Srinivas Gupta Garu, Chairman of Telangana state tourism Development corporation, appointed Miss Alekhya Harika as the new brand ambassador for TSTDC@USrinivasGupta @VSrinivasGoud @KTRTRS @harika_alekhya #Telanganatourism #TSTDC pic.twitter.com/cMIyK4yRlp — Telangana State Tourism (@tstdcofficial) March 8, 2021 చదవండి: ‘బిగ్‌బాస్ 4 రికార్డ్ చేసి నా పిల్లలకు చూపిస్తా’ నాగార్జునతో అభిజిత్ బిగ్ డీల్! -
బిగ్‌బాస్ : హారిక నా చెల్లి.. అభిజిత్ షాకింగ్ కామెంట్స్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో మొదట్లో అభిజిత్-మోనాల్-అఖిల్ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఎంత హైలెట్ అయిందో చెప్పనక్కర్లేదు. గంట సేపు ప్రసారమయ్యేలో షోలో.. ఈ ముగ్గురికే ఎక్కువ స్క్రీన్ స్పెస్ ఇచ్చేవాడు బిగ్‌బాస్. అయితే బిగ్‌బాస్ ఎత్తుగడను పసిగట్టిన మిస్టర్ కూల్ అభిజిత్.. మోనాల్‌తో కాస్త దూరంగా ఉండటం మొదలు పెట్టాడు. దీంతో అఖిల్- మోనాల్ ప్రేమాయణాన్ని హైలెట్ చేసి చూపించాడు బిగ్‌బాస్. ఇక వీరిద్దరంతా కాకపోయినా.. అభి-హారికల మధ్య కూడా ఏదో నడుస్తుందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. నోయల్, లాస్య ఎలిమినేట్ అయ్యాక అభి, ఎక్కువగా హారికతోనే గడిపాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకున్న మాటలు, హగ్‌లు, ముద్దులను హైలెట్ చేసి చూపించాడు బిగ్‌బాస్. దీంతో అభికి హారిక మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. (చదవండి: బిగ్‌బాస్: అభిజిత్ విజయానికి కారణాలివే) ఇక ఆ పుకార్లు నిజమే అన్నట్లు హారిక కూడా అభిజిత్ లేకుండా ఒక్క క్షణం ఉండలేకపోయింది. చాలా సందర్భంలో వీళ్లిద్దరి మధ్య రొమాంటిక్ సీన్లను హైలైట్ చేస్తూ ఏదో నడుస్తుందని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేశారు బిగ్ బాస్. దీంతో అభి-హారిక పేర్లను ఏకం చేసి అభిక అని ఫ్యాన్స్ పేజ్‌లు కూడా వచ్చేశాయి. వీరిద్దరూ కొత్త లవ్ ట్రాక్ మొదలుపెట్టారని రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇక వీరిద్దరి పేరెంట్స్ కూడా పరోక్షంగా వాళ్లు లవ్‌లోనే ఉన్నారని ఒప్పేసుకున్నారు. హారిక లాంటి కోడలు కావాలని అభి తల్లి.. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే హారిక తల్లి చెప్పడంతో వీరద్దరి గుండెల్లో గంట మోగిందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. అయితే ఇదంతా తప్పని, బిగ్‌బాస్ తమ రిలేషన్‌ని వేరేలా చూపించారని చెబుతున్నాడు నాల్గో సీజన్ విన్నర్ అభిజిత్. తాజాగా ఆయన ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హారిక తన చెల్లి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు ఒక తమ్ముడు ఉన్నాడని, ఇక హారిక లాంటి చెల్లెలు కూడా ఉంటే బాగుంటుందని అనుకునేవాడినని, అందుకే ఆమెతో ఎక్కు టైం స్పెండ్ చేశానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ విషయాన్ని హౌస్‌లో హారికకు ఎన్నోసార్లు చెప్పానని, అది బయటకు రాలేదని ఇప్పుడే తెలిసిందని అభి చెప్పుకొచ్చాడు. రేటింగ్ కోసమే బిగ్‌బాస్ అభి, హారిక రిలేషన్‌ని వేరుగా చూపించినట్లు అర్థమవుతుంది. -
బిగ్‌బాస్: బ్రదర్స్ అంటూ షాకిచ్చిన హారిక
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ట్రోఫీ గెలుచుకునేందుకు అరియానా, సోహైల్, హారిక, అఖిల్, అభిజిత్ హోరాహోరీగా పోరాడారు. కానీ అందరిలో హారికకే తక్కువ ఓట్లు పడటంతో ఆమె టైటిల్ రేసు నుంచి నిష్క్రమించక తప్పలేదు. కానీ వెళ్లిపోయేముందు దేత్తడి హౌస్‌మేట్స్‌ను బ్రదర్ అని పిలుస్తూ షాకిచ్చింది. కొత్తగా ఈ పిలుపేంటని అఖిల్, సోహైల్ ఖంగు తిన్నారు. తమను అలా పిలవొద్దని వేడుకున్నారు. స్టేజీ మీదకు వచ్చిన తర్వాత హారిక మాట్లాడుతూ.. మా అమ్మ నన్ను వదిలేసి ఇన్ని రోజులు ఉండటం మొదటిసారి అని చెప్పింది. అమ్మ, అన్నయ్య గర్వపడేలా చేశాననుకుంటున్నానని తెలిపింది. ఇక ట్రోఫీ ఎవరు గెలిచినా హ్యాపీనే అని చెప్పుకొచ్చింది. (చదవండి:బిగ్‌బాస్: నెరవేరుతున్న గంగవ్వ కల) కాగా హారిక జర్నీ చూసుకుంటే మొదట్లో ఆమె అభిజిత్, లాస్య, నోయల్‌తో మాత్రమే ఉండేది. నోయల్‌ను తండ్రిలా ఫీలయ్యేది. కానీ కేవలం ఈ గ్రూపుతో మాత్రమే ఉంటోందని, అందరితో కలవడం లేదన్న కారణంతో ఆమెను ఇంటిసభ్యులు పదేపదే నామినేట్ చేసేవారు. అయితే గేమ్ చివరికి వచ్చేసరికి మాత్రం ఆమె అందరితోనూ కలిసిపోయింది. ఈ క్రమంలో తనను పట్టించుకోవడం లేదని అభి కొన్నిసార్లు హర్ట్ అయ్యాడు కూడా! కాగా హౌస్‌లో ఎన్నో టాస్కుల్లో ఒంటరిగా పోరాడిన ఆమె ఎనిమిది సార్లు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచి రికార్డు సృష్టించింది. చివరికి 13వ వారంలో కెప్టెన్‌గా అవతరించింది. అంతేకాకుండా ఈ సీజన్లోనే బెస్ట్ కెప్టెన్‌గా అవతరించింది. టాస్కులతో పాటు డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న హారిక.. అవినాష్‌ను ఏడిపించాలన్న సీక్రెట్ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. మొత్తానికి హారిక చోటా ప్యాకెట్ బడా ధమాకా అన్న వాక్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా మారింది. (చదవండి:బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అప్డేట్స్) -
బిగ్‌బాస్: రూ.25 లక్షలకు సోహైల్ టెంప్ట్
తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్ నాల్గో సీజన్‌కు శుభం కార్డు పడింది. గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున అభిజిత్‌ను విజేతగా ప్రకటించారు. అఖిల్‌ను రన్నరప్‌గా వెల్లడించారు. మూడో సీజన్ ఫినాలేకు 8 కోట్ల ఓట్లు రాగా నాల్గో సీజన్‌కు రికార్డు స్థాయిలో 15.65 కోట్ల ఓట్లు వచ్చాయని నాగ్ వెల్లడించారు. కాగా 19 మంది కంటెస్టెంట్లతో.. వారానికి ఒక ఎలిమినేషన్ చొప్పున 105 రోజులపాటు సాగిన ఈ రియాటీ షో ప్రేక్షకులను గణనీయంగా అలరించింది. సెప్టెంబర్ 6న అట్టహాసంగా ప్రారంభమైన ఈ సీజన్ తెలుగు ప్రజలకు త్వరగానే చేరువైంది. తొలి రోజు నుంచే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ..15 వారాలపాటు ఒకే ఇంట్లో ఉంటూ ఎన్నో ఎమోషన్స్‌ను తట్టుకుంటూ ఐదుగురు ఇంటి సభ్యులు అభిజిత్, అఖిల్, సోహైల్, అరియానా, హారిక ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. వీరిలో ఒకరిని విన్నర్‌గా ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన నేటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ విశేషాలేంటో చదివేయండి.. క్షమాపణ చెప్పిన నోయల్ నాగార్జున, ఆ తర్వాత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు 14 మంది స్టన్నింగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో ఎంటర్టైన్ చేశారు. దేవి నాగవల్లి మాత్రం ఫినాలే ముగిసే సమయానికి హాజరైంది. ఇక నోయల్ మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్‌కు ముందు రాజమౌళి, సుకుమార్ ఇచ్చిన అవకాశాలతో నన్ను గుర్తు పట్టేవారు. బిగ్‌బాస్ తర్వాత నాకు మరింత పాపులారిటీ సంపాదించుకున్నాను. ఇంటిలో అవినాష్, అమ్మా రాజశేఖర్‌తో జరిగిన గొడవ వల్ల వాళ్లు ఏమైనా హర్ట్ అయితే అందుకు సారీ. అవినాష్ కామెడీ ఓ మెడిసిన్.. ఆయనలా ఎప్పుడు నేను కామెడీ చేయలేను' అంటూ ఇద్దరికీ క్షమాపణలు తెలిపాడు. బిగ్‌బాస్ తర్వాత నా లైఫ్ చాలా వేరుగా ఉంది : అవినాష్ గ్రాండ్ ఫినాలేకి వచ్చిన అవినాష్ నాగ్‌తో తన బిగ్‌బాస్ జర్నీ అనుభవాలను పంచుకుంటూ.. ‘మీరు చెప్పినట్టే.. బిగ్‌బాస్‌కు ముందు, బిగ్‌బాస్ తర్వాత నా లైఫ్ చాలా వేరుగా ఉంది. ఇంతకు ముందు మా ఊరు వాళ్లే ఫోటోలు దిగేవారు. కానీ బిగ్‌బాస్ తర్వాత ఇతర జిల్లాల వాళ్లు వచ్చి నాతో ఫోటో దిగుతున్నారు. నాతోనే కాకుండా నా తల్లితో కూడా ఫోటోలు దిగుతున్నారు అని సంతోషం వ్యక్తం చేశాడు. ఫొటోలు దిగలేకపోతున్నా : గంగవ్వ గంగవ్వ అయితే ఇంటికొచ్చే వాళ్లతో ఫొటోలు దిగలేకపోతున్నానని వాపోయింది. వచ్చిన వాళ్లు వారి కుటుంబ సభ్యులతో ఫోన్లో తనతో తెగ మాట్లాడిస్తున్నారని, దాని వల్ల గొంతు నొప్పి పుడుతోందని నాగార్జునతో చెప్పుకొచ్చింది. దీనికి బదులు బిగ్ బాస్ హౌస్‌లో ఉండిపోయినా బాగుండని అనిపిస్తోందని చెప్పింది. రోజుకి 500 మంది తనను కలవడానికి వస్తున్నారంది. తన కోరిక మేరకు ఇల్లు కట్టిస్తున్నారని, చాలా సంతోషం అంటూ నాగార్జునకు ధన్యవాదాలు తెలిపింది. జర్నీ చూసి కంటెస్టెంట్స్ కంటతడి బిగ్‌బాస్ ఫినాలే సందర్భంగా ఇంటి సభ్యులందరికి 105 రోజుల జర్నీని చూపించి అందరినీ ఏడిపించారు. 19 మందితో మొదలైన బిగ్‌బాస్ నాల్గో సీజన్ ప్రస్తుతం 5 మంది ఉన్నారు. ఇన్నాళ్లు వాళ్లు చూపించిన ప్రేమ, కోపం,ఆప్యాయతలు అన్నింటినీ ఏవీలో వేసి చూపించారు. తమ జర్నీ చూసి ఇంట్లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ అభిజిత్, హారిక, అరియానా, సోహైల్, అఖిల్‌తో పాటు ఎలిమినేట్ అయినవారు కూడా కంటతడి పెట్టారు. అనిల్ రావిపుడి రచ్చ రచ్చ బిగ్‌బాస్ ఎలిమినేట్ అయిన వ్యక్తిని బయటకు తీసుకొచ్చే బాధ్యతను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపుడికి అప్పగించారు. అయితే తాను నవ్విస్తాను కానీ ఎలిమినేట్ చేయలేనని నాగ్‌కు విజ్ఞప్తి చేశాడు. దీంతో నాగ్ ఆ బాధ్యతను ఎఫ్2 హీరోయిన్ మెహరిన్‌కు అప్పగించారు. దీంతో బ్యాండ్ బాజాలతో అనిల్ రావిపుడి, మెహరిన్ హౌస్‌లోకి అడుగుపెట్టారు.ఇక ఇంట్లోకి వెళ్లిన అనిల్‌తో టాస్క్‌లు ఆడించారు నాగ్. పలు చిలిపి ప్రశ్నలు అడిగి ఎంటర్‌టైన్‌మ్మెంట్ చేశాడు. హౌస్‌మేట్స్‌ని ఇమిటేట్ చేసి కడుపుబ్బా నవ్వించాడు. హారిక అవుట్ ఫినాలే పోరులో నుంచి తొలుతగా హారిక ఎలిమినేట్ అయింది. హౌస్‌లోకి వెళ్లిన మెహరిన్, అనిల్ రావిపుడి కలిసి హారికను ఎలిమినేట్ చేశారు. మొదటగా హౌస్మేట్స్ అందరికి కళ్లకి గంతలు కట్టి ఎలిమినేట్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. టాప్ 5లో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సిందిగా మెహరిన్‌కు నాగ్ సూచించారు. కాసెపు అందరికి టెన్షన్ పెట్టి చివరగా హారికను ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఆ తరవాత హారిక గంతలు విప్పిన మెహ్రీన్, అనిల్.. ఆమెను తీసుకెళ్లి ఒక పంజరం లాంటి ఐరన్ రూమ్‌లోకి పంపారు. ఆ పంజరాన్ని ఒక క్రేన్ గాల్లోకి లేపుతూ బయటికి తీసుకెళ్లిపోయింది. హారిక గాల్లో ఉన్నప్పుడు మిగిలిన నలుగురు ఫైనలిస్ట్‌ల గంతలు విప్పగా దేత్తడి వెళ్లిపోవడం చూసి విస్తుపోయారు. 10 లక్షలు తిరస్కరించిన హౌస్మేట్స్ రెండో వ్యక్తిని ఎలిమినేట్ చేయాల్సిన బాధ్యతను నాగ్ హీరోయిన్లు లక్ష్మీరాయ్, ప్రణీతలకు అప్పగించారు. దీంతో ఆ ఇద్దరు బ్యూటీలు బ్యాండ్ బాజాలతో ఇంట్లోకి వెళ్లి రచ్చ రచ్చ చేశారు. మొదటగా ప్రణీత 10 లక్షలు రూపాయలు ఉన్న సూట్ కేస్‌తో వెళ్లి కంటెస్టెంట్స్‌ను టెంప్ట్ చేసే ప్రయత్నం చేశారు. రూ.10లక్షలు తీసుకొని ఎవరైనా వెళ్లొచ్చు అని ఆఫర్ ఇవ్వగా అందరూ తిరస్కరించారు. ప్రేక్షకులు మాకు ఓట్లు వేసి ఇంత దూరం తీసుకొచ్చారని, డబ్బుతో వాళ్ల ప్రేమను పొగొట్టుకోలేమని తేల్చి చెప్పారు. దీంతో ప్రణీత 10 లక్షలు తీసుకొని బయటకు వచ్చేసింది. తర్వాత హీరోయిన్ లక్ష్మీరాయ్ వెళ్లి అరియానాను ఎలిమినేట్ చేశారు. రూ. 25 లక్షలకు సోహైల్ టెంప్ట్ టాప్ 3లో ముగ్గురు అబ్బాయిలు మిగలగా.. బిగ్‌బాస్ నుంచి సోహైల్ స్వచ్ఛందంగా ఎలిమినేట్ అయ్యాడు. నాగార్జున ఇచ్చిన రూ.25లక్షల ఆఫర్‌కు సోహైల్ టెంప్ట్ అయ్యాడు. ఇంట్లో ఉన్న అభిజిత్, అఖిల్, సోహైల్‌లో ఎవరైనా 25లక్షల రూపాయలు తీసుకొని బయటకు రావొచ్చని నాగ్ సూచించగా.. అఖిల్, అభిజిత్ తిరస్కరించారు. సోహైల్ మాత్రం తాను ఈ డబ్బును తీసుకొని వెళ్తానని చెప్పాడు. సోహైల్ నిర్ణయాన్ని అతని కుటుంబ సభ్యులు కూడా స్వాగతించారు. వచ్చిన ఆ 25 లక్షల రూపాయాల్లో ఐదు లక్షలు అనాథశ్రమానికి, మరో ఐదు మెహబూబ్ ఇల్లు కట్టుకునేందుకు ఇస్తానని చెప్పాడు. కానీ మెహబూబ్ అతడి ఆఫర్‌ను తిరస్కరిస్తూ ఆ ఐదు లక్షలు కూడా అనాథశ్రమానికే ఇచ్చేయమన్నాడు. వీరి ఆలోచన మెచ్చిన నాగ్ ఆ పది లక్షలు అనాథశ్రమానికి తాను ఇస్తానని, సోహైల్‌ను 25 లక్షలు ఇంటికే తీసుకెళ్లమని చెప్పారు. సోహైల్ పర్మిషన్ తీసుకున్న చిరు లక్ష్మీ రాయ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకోగా తర్వాత వచ్చిన తమన్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు. అనంతరం స్వయంగా నాగార్జునే హౌస్‌లోకి వెళ్లి టాప్ 2 కంటెస్టెంట్లు అభిజిత్, అఖిల్‌ను స్టేజీ మీదకు తీసుకొచ్చారు. బిగ్‌బాస్ ట్రోఫీ ఇచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. నాగార్జున ఫిట్నెస్ను చూస్తే కుళ్లు వేస్తోందన్నారు. అలాగే పది సీజన్ల వరకు కూడా నాగార్జునే వ్యాఖ్యాతగా ఉండాలన్నారు. ఆ తర్వాత నాగ్ జర్నీ చూపించారు. అనంతరం అభిజిత్ మీద పంచులేస్తూనే అతడి వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు. ప్రతిదాంట్లో గెలవాలన్న తాపత్రయం కనిపించేదని, ప్రేమోనాల్ను గెలిచేవాడని తెలిపారు. మన కథ వేరన్న డైలాగ్ తర్వాతి సినిమాలో పెడతాను, అందుకు పర్మిషన్ ఇవ్వంటూ సోహైల్‌ను అడిగారు. అభి విన్నర్ అభిజిత్, అఖిల్‌ను స్టేజీ మీదకు తీసుకొచ్చిన నాగ్.. అభి విజయానికి సంకేతంగా అతడి చేయి పైకెత్తారు. ఇద్దరు మిత్రులు చిరు, నాగ్ కలిసి అతడికి ట్రోఫీ అందించారు. స్టైలిష్ బైక్‌ను కూడా అందజేశారు. ఈ విజయాన్ని ఊహించలేకపోయిన అభి సంతోషం కట్టలు తెంచుకుంది. తనకు ఓట్లేసిన ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలిపాడు.. 63 ఏళ్లలో ఇది తనకు గొప్ప వేడుకలాంటిదని అభిని చూసి అతడి తండ్రి గర్వపడ్డారు. -
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే: హారిక అవుట్!?
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ట్రోఫీ దక్కించుకునేందుకు 19 మంది కంటెస్టెంట్లు పోరాడారు. ఈ పోరాటంలో తుది వరకు నిలిచిన అరియానా, సోహైల్, అఖిల్, అభిజిత్, హారిక ఫినాలేకు చేరుకున్నారు. ఈ ఐదుగురి మధ్య జరుగుతున్న ఓట్ల యుద్ధంలో గెలుపు ఒక్కరినే వరించనుంది. ఆ విజేత ఎవరనేది రేపు తేలనుంది. ఈ గ్రాండ్ ఫినాలేను ప్రీమియర్ ఎపిసోడ్ కంటే వైభవంగా నిర్వహించేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. హీరోయిన్ల డ్యాన్సులు, తమన్ లాంటి గొప్ప సింగర్ల పాటలతో షోను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. దీనికితోడు మాజీ కంటెస్టెంట్ల డ్యాన్సులతో ఫినాలే మరింత వినోదాత్మకంగా సాగనుంది. ముఖ్యంగా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఎలిమినేషన్ ప్రక్రియ రసవత్తరంగా మారనుంది. (చదవండి: హారిక హగ్గిచ్చి ఎన్నిరోజులైతుందో: అభిజిత్) అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. దేత్తడి హారికకు తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఫైనల్ ఎలిమినేషన్లో హారిక హౌస్‌లో నుంచి వెళ్లిపోనున్న మొదటి కంటెస్టెంటుగా నిలవనుంది. అరియానా, సోహైల్, అభిజిత్, అఖిల్.. ట్రోఫీ కోసం పోటీపడనున్నారు. అనధికారిక పోల్స్ ప్రకారం ఓట్ల సంఖ్యలో అఖిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. సోహైల్, అరియానాలు రెండో స్థానం కోసం పోటీపడుతున్నారు. అభిజిత్ తొలి స్థానంలో నిలుస్తూ వస్తున్నాడు. అయితే హాట్‌స్టార్ ఓట్లు అందరూ వేస్తారు, కానీ మిస్డ్ కాల్స్ కూడా చేసే ఓపిక చాలా తక్కువ మందికే ఉంటుంది. ఈ మిస్డ్ కాల్స్ ఓట్లే విన్నర్, రన్నర్‌ను డిసైడ్ చేయనున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి ఈ అనఫీషియల్ పోల్స్ చెప్తున్నట్లుగా రేపు అభిజిత్‌నే విన్నర్‌ను ప్రకటిస్తారనేది కచ్చితంగా చెప్పలేం. ఇక ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రేపు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం కానుంది. అప్పుడే నాగార్జునతోపాటు ప్రత్యేక అతిథులు విజేతను అధికారికంగా ప్రకటిస్తారు. అప్పటివరకు వేచి చూడక తప్పదు. (చదవండి: నువ్వు ఫేక్, ఇది నీ ఎథిక్స్: అఖిల్ ఫైర్) -
నా పోరాటం ముగిసింది: హారిక
ఇప్పటివరకు ఎన్నో ఒడిదొడుకులను దాటుకుని టాప్ 5కు చేరుకున్న కంటెస్టెంట్లను సంతృప్తి పరిచేందుకు బిగ్‌బాస్ వారి జర్నీ వీడియోలను చూపించారు. ఈ ప్రయాణాన్ని తనివితీరా వీక్షించిన ఫైనలిస్టులు వారి భయాందోళనలను మర్చిపోయి మనసు తేలిక చేసుకున్నారు. బిగ్‌బాస్ తమకు ఎంతో గుర్తింపునిచ్చిందని సంతోషంగా ఫీలయ్యారు. మరి ఈ సందర్భంగా బిగ్‌బాస్ ఎవరికి ఏమేం చెప్పాడో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. చిన్న ప్యాకెట్ పెద్ద ధమాకా.. నిన్న అఖిల్, అభిజిత్ ప్రయాణాన్ని చూపించిన బిగ్‌బాస్ నేడు మరో ముగ్గురి జర్నీ వీడియోలను ప్రదర్శించారు. ముందుగా గార్డెన్ ఏరియాలోకి వచ్చిన హారికను... ఈ ప్రయాణంలో ప్రత్యేకంగా నిలిచారని, ఎవరి సపోర్ట్ లేకపోయినా పట్టుదల, మొండిదలతో ఇక్కడివరకు వచ్చారని బిగ్‌బాస్ అభినందించాడు. చిన్న ప్యాకెట్ పెద్ద ధమాకా అన్న వాక్యాన్ని నిజం చేస్తూ ఫైనలిస్టుగా నిలిచారని చెప్తూ జర్నీ వీడియో చూపించారు. ఇందులో అభిజిత్‌తో కలిసున్న క్షణాలను చూపించడంతో హారిక సంతోషపడింది. (చదవండి:ఓటింగ్‌లో అభిజిత్‌ను దాటేసిన అరియానా!) నిద్ర లేని రాత్రిళ్లు గడిపాను అలాగే తను చేసిన అల్లరి, టాస్కులను అన్నింటినీ చూపించడంతో భావోద్వేగానికి లోనైంది. మిక్చర్ పొట్లంలా అన్ని ఎమోషన్స్ కలగలపి ఉన్న తన జర్నీ చూసి ఈ బిగ్‌బాస్ ప్రయాణం తనకు గొప్ప అనుభవమని చెప్పుకొచ్చింది. ఎన్నో రోజులు నిద్ర లేని రాత్రిళ్లు గడిపానని, కానీ ఈ జర్నీ చూడగానే ఆ కష్టమంతా ఎగిరిపోయిందని పేర్కొంది. రేపు తను ఉన్నా లేకపోయినా తన జీవితాన్ని తెరిచి చూస్తే అందులో బిగ్‌బాస్ ప్రత్యేక పాత్ర పోషిస్తుందని తెలిపింది. అయితే తనకు సంతృప్తినిచ్చిన బిగ్‌బాస్ షోలో తన పోరాటం ఇక్కడితో ముగిసిందని చెప్పడం ఆమె అభిమానులకు రుచించడం లేదు. (చదవండి:బిగ్‌బాస్: రీయూనియన్ పార్టీ ఉంటుందా?) నా సినిమాకు 20 మంది కూడా ఉండరు తర్వాత సోహైల్ వెళ్లగా.. మీరు అన్ని భావోద్వేగాలను చూపించారని బిగ్‌బాస్ తెలిపాడు. స్నేహం అనే పదానికి కొత్త అర్థాన్ని సృష్టించారని మెచ్చుకున్నాడు. ఆట పట్ల అతడికి ఉన్న ధ్యాస, తాపత్రయానికి బిగ్‌బాస్ సెల్యూట్ చేశాడు. మీ శ్రమ, ప్రతిభ ఊరికే పోదని, ఇకపై మీ కథ వేరేలా ఉంటుందని సోహైల్ డైలాగ్‌ను అతడికే అప్పజెప్పాడు. అనంతరం అతడి జర్నీ వీడియోను చూపించగా... అందులో బాధ, కోపం, స్నేహం, ప్రేమ అన్నింటినీ చూపించడంతో సోహైల్ కంటతడి పెట్టుకున్నాడు. నా సినిమాకు నేనే టికెట్టు కొనుక్కునేవాడిని. నా సినిమాకు 20 మంది కూడా రాలేదని హేళన చేసేవారు. కానీ ఇప్పుడు నన్ను బిగ్‌బాస్‌లో కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. రేపు నేను సినిమా చేస్తే ప్రేక్షకులు హిట్ కొడతారని ఆశిస్తున్నా. పది సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం 105 రోజుల్లో ఇచ్చారన్నాడు. ట్రోఫీ రాకపోయినా మనసుకు సంతోషాన్నిచ్చారు, అది చాలంటూ ఉప్పొంగిపోయాడు. అనంతరం తన స్నేహితులు మెహబూబ్, అఖిల్ ఉన్న ఫొటోలతో పాటు తన సింగిల్ ఫొటోను తీసుకుని లోపలకు వెళ్లాడు. అరియానా.. షైనింగ్ స్టార్ తర్వాత వచ్చిన అరియానాను ఉద్దేశించి బిగ్‌బాస్ మీరొక సంచలనం అని పేర్కొన్నాడు. సొంత నియమాలతో సొంత ఆటను ఆడారని, కానీ కొన్నిసార్లు ఒంటరయ్యారని గుర్తు చేశాడు. అందరి గురి మీమీదే ఉన్నా ధైర్యంగా ముందుకు సాగారని మెచ్చుకుంటూ ఆమెను షైనింగ్ స్టార్‌గా అభివర్ణించాడు. అనంతరం ఆమె జర్నీ చూపించడంతో అరియానా ఎమోషనల్ అయంది. సమాజంలో తనకు ప్రత్యేక గుర్తింపునిచ్చారని ధన్యవాదాలు తెలిపింది. అనంతరం అవినాష్ తనకు తినిపించిన ఫొటోతో పాటు బిగ్‌బాస్ ఇచ్చిన చింటూ బొమ్మను హత్తుకున్న ఫొటోను తీసుకుంది. (చదవండి: ఆరేళ్లు రిలేషన్షిప్, డిప్రెషన్లోకి వెళ్లిపోయా) -
బిగ్‌బాస్ తర్వాత మీ కథ వేరే ఉంటది!
బిగ్‌బాస్ నాల్గో సీజన్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఈ క్రమంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ప్రయాణాన్ని వారి కళ్లముందుంచుతూ ఎమోషనల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే అఖిల్, అభిజిత్ వారి జర్నీ వీడియోలు చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ.. విన్నర్ అయ్యేది తానేనంటూ విశ్వాసం కనబరిచాడు. తర్వాత అభిజిత్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు రావడమే తను తీసుకున్న గొప్ప నిర్ణయమని అభిప్రాయపడ్డాడు. అటు బిగ్‌బాస్ కూడా అభి లాంటి తెలివైన కంటెస్టెంటు హౌస్‌లో ఉండటం బిగ్‌బాస్‌కే గర్వకారణం అని చెప్పడం విశేషం. అయితే వీరి ఇద్దరి వీడియోలలో మోనాల్ ఆకర్షణగా నిలిచింది. అంటే బిగ్‌బాస్ ఎడిటర్లు ట్రయాంగిల్ స్టోరీ మీదనే పెద్దగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అభిజిత్ జర్నీ వీడియోలో హారికతో గడిపిన క్షణాలు తక్కువగా చూపించారు. నోయల్, లాస్యలకు కూడా పెద్దగా స్థానాన్ని కల్పించలేదు. దీంతో మిస్టర్ కూల్ అభిమానులు కొంత నిరుత్సాహానికి లోనయ్యారు. (చదవండి: ఆ పాట పాడుతూ ప్రపోజ్ చేయాలి: మోనాల్) నేడు మిగిలిన ముగ్గురికి బిగ్‌బాస్ హౌస్‌లో వారి మజిలీని చూపించనున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుంచే ఆమె ఒక సంచలనం అంటూ బిగ్‌బాస్ అరియానాను ప్రశంసించాడు. చిన్న ప్యాకెట్ పెద్ద ధమాకా అన్న వాక్యాన్ని నిజం చేస్తూ హారిక ఫైనలిస్టుగా నిలిచిందని ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మీరు పడ్డ ప్రతిభ, శ్రమకు ఇకపై మీ కథ వేరేలా ఉంటుందంటూ సోహైల్‌ను పొగిడాడు. ఓవైపు 100 రోజుల జర్నీ, మరోవైపు బిగ్‌బాస్ చూపిస్తున్న ప్రేమతో ఇంటి సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి మధుర క్షణాలు మళ్లీ మళ్లీ రావని తలుచుకుని లోలోపలే కొంత బాధపడుతున్నా పైకి మాత్రం ఆనంద భాష్పాలు కారుస్తున్నారు. వీరి సంతోషాన్ని, జర్నీ వీడియోను వీక్షించాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: బిగ్‌బాస్: నెట్టింట అభి, హారిక ఫ్యాన్స్ ఫైట్) -
బిగ్‌బాస్: చీలిపోతున్న అభిక ఓట్లు?!
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ఓటింగ్ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అన్నట్లుగా మారింది. ఇంతకుముందు తమ అభిమాన కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో లేకపోతే వారికిష్టమైన ఫ్రెండ్స్‌ను సేవ్ చేసే బాధ్యతను అభిమానులు వారి భుజాన వేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం తమకిష్టమైన కంటెస్టెంట్ల మీదనే ఫోకస్ చేస్తున్నారు. ఇదిలా వుంటే హౌస్‌లో ఉన్న ఫైనలిస్టులతో బిగ్‌బాస్ "టైటిల్ గెలిచేందుకు ఎవరు అనర్హులు?" అని ఓ టాస్క్ ఆడించిన విషయం తెలిసిందే కదా! ఇందులో అఖిల్, హారిక.. అరియానా గెలవడానికి అనర్హురాలు అని చెప్పారు. సోహైల్ మాత్రం అభిజిత్, అరియానాకు విజేతగా నిలిచే అర్హత లేదని అభిప్రాయపడ్డాడు. హారికకు ఝలక్ ఇచ్చిన అభిజిత్ అటు అభిజిత్ మాత్రం హారిక అనర్హురాలు కావాలని కోరుకున్నాడు. ఈ ఆటలో ఇద్దరమే మిగిలితే అందులో హారిక ఓడిపోవడం ఇష్టం లేదని, అలా అని తాను ఓడిపోలేనని, ఎలాగైనా గెలవాలని, అందుకే ఆమె అనర్హురాలుగా మిగిలిపోవాలని కోరుకుంటున్నట్లు వివరణ ఇచ్చాడు. అభిజిత్ ఏం చెప్తున్నాడో అర్థం కాని హారిక కాస్త డల్ అయినట్లు అనిపించింది. ఏదేమైనా అభిజిత్ తనను అనర్హురాలు అని చెప్పడాన్ని ఆమె మనసులో నుంచి తీసేయలేకపోయింది. ఈ క్రమంలో అభిజిత్, హారిక ఫ్యాన్స్ మద్ద మాటల యుద్ధం నడుస్తోంది. (చదవండి: మోనాల్ మనసులో నేనున్నా అంది: అభి) చీలిపోతున్న అభిక ఓట్లు ఇప్పుడు కూడా అభిక అంటే కుదరదని వారు వాదిస్తున్నారు. అభిజిత్, హారిక.. ఇద్దరిలో ఒకరికే ఓటేయాలని చెప్తున్నారు. దీంతో అభిక ఫ్యాన్స్ రెండు వర్గాలుగా చీలిపోయాయి. ఇందులో మొదటి వర్గం.. అభికి మాత్రమే ఓటేయాలని, అభి లేనిదే హారిక లేదని అంటున్నారు. అభి ఫ్యాన్స్ ఆమెను చాలాసార్లు నామినేషన్ నుంచి సేవ్ చేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడిక ఫినాలే వీక్‌లో ఆమెకు ఓటేయాల్సిన అవసరం లేదని, ప్రతి ఓటు అభికే వేయండని ఆయన అభిమానులు సూచిస్తున్నారు. పైగా కన్ఫెషన్ రూమ్‌లో నాగార్జున క్లాస్ పీకిన తర్వాత ఆమె అభిని దూరం పెట్టి అఖిల్‌తో క్లోజ్ అయిందని విమర్శిస్తున్నారు. (చదవండి: అరియానాను కాపాడుకుందామంటోన్న దేవి) అభిక ఫ్యాన్స్ ఓటు ఎటువైపు? దీనిపై రెండో వర్గానికి చెందిన హారిక ఫ్యాన్స్ కూడా దీటుగానే స్పందిస్తున్నారు. మా క్యూటీ లేకపోతే అభి లేడని కౌంటరిస్తున్నారు. హారిక.. అభిజిత్లాగా బద్ధకంగా టాస్కు చేయకుండా కూర్చోలేదని, అన్నింట్లోనూ తన సత్తా చూపిస్తూ, ఒంటరి పోరాటంతో ఇక్కడివరకు వచ్చిందంటున్నారు. అభిజిత్‌ను సేవ్ చేయడం కోసం ఆమెను కెప్టెన్ చేసిన మోనాల్‌ను నామినేషన్లోకి పంపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హారికను తక్కువ అంచనా వేయకండని హెచ్చరిస్తూ, ఆమెకు ఓటేయాలంటూ పిలుపునిస్తున్నారు. ఏదేమైనా గెలుపును నిర్దేశించడంలో అభిక ఫ్యాన్స్ ఓట్లు కీలకంగా మారనున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: అభిజిత్‌ను గెలిపించండి: యువ హీరో) -
బిగ్‌బాస్: అదరగొట్టిన ఆ నలుగురు.. కరీంనగర్ బిడ్డలే
బిగ్‌బాస్ సీజన్–4 రియాల్టీ షో చివరి అంకానికి చేరింది. వంద రోజులుగా కొనసాగుతున్న కార్యక్రమంలో వచ్చే ఆదివారం విజేత ఎవరో తేలనుంది. ఈ క్రమంలో ఫినాలే పోరులో నిలిచిన సయ్యద్ సోహెల్‌ది పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీ కాగా.. దేత్తడి హారిక సుల్తానాబాద్ ఆడబిడ్డే. సీజన్–4ను రక్తికట్టించిన వారిలో జగిత్యాల జిల్లా లంబాడిపల్లికి చెందిన గంగవ్వ షోకే ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. వైల్డ్‌కార్డుతో ఎంట్రీ ఇచ్చి షోను జబర్దస్త్‌గా నడిచేలా చేసిన అవినాష్ గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందినవాడు. ఈ సందర్భంగా అవినాష్ ‘సాక్షి’తో తన జీవన ప్రయాణ అనుభవాన్ని పంచుకోగా.. సోహెల్ గురించి ప్రత్యేక కథనం.. బిగ్‌బాస్ నుంచి కాల్ వచ్చింది ఒకరోజు బిగ్‌బాస్ షో నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చింది. రియాల్టీషోలో పని చేయాలని ఆహ్వానించారు. అయితే ఓ టీవీ చానల్లో ఎనిమిదేళ్లుగా చేస్తున్నా... రానన్నాను. ఒక్కసారి ట్రై చేయండి అన్నారు. నాకున్న ఆర్థిక పరిస్థితులు నన్ను కన్విన్స్ చేశాయి. ఓకే చెప్పాను. ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే ఒప్పుకోలేదు. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు. దాంతో పాటు ఒక్కసారి వెళ్లినవారికి మరో అవకాశం ఉండదన్నారు. అప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్నా. ఏం చేయాలో తోచలేదు. ఈ క్రమంలో గెటప్ సీను, శ్రీముఖి, చంద్ర నాకు అండగా నిలిచారు. వాళ్లే రూ.10లక్షలు ఫైన్ కట్టారు. అలా నటనలో జన్మనచ్చిన షోను వదిలి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాను. పునర్జన్మనిచ్చింది: అవినాష్ గొల్లపల్లి(ధర్మపురి): నాన్న ఉపాధికోసం ఎడాదిదేశాలకు వెళ్తే.. అమ్మా, అన్నయ్యలు వ్యవసాయం చేస్తూ.. కుటుంబాన్ని పోషించేవారు. చదువుకునే వయసులో స్నేహితుల ప్రోత్సాహం, అన్నయ్య సాయంతో నటనవైపు మళ్లాడు తను. హైదరాబాద్‌లో అందరిలాగే క్రిష్ణానగర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అవకాశాలు రాలేదు. చిన్నచిన్న ప్రోగ్రాంలతో జీవితాన్ని గడిపాడు. అనుకోకుండా వచ్చిన చాన్స్‌ను అందిపుచ్చుకున్నాడు. ఓ టీవీచానల్లోని కామెడీ షో జన్మనిస్తే.. బిగ్‌బాస్ పునర్జన్మనిచ్చిందని చెబుతున్నాడు ముక్కు అవినాష్. సాధారణ కుటుంబమే.. మాది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామం. నాన్న లక్ష్మణ్, అమ్మ మల్లమ్మ. ఐదుగురం అన్నదమ్ములం. నేను మూడోవాణ్ని. నాన్న నా చిన్నప్పటినుంచి దుబాయ్ వెళ్లేవాడు. అమ్మ, అన్నలు వ్యవసాయం చేస్తుండేవారు. నేను జగిత్యాలలో పదోతరగతి వరకు, కరీంనగర్లో ఇంటర్, హైదరాబాద్‌లో బీటెక్ పూర్తిచేశా. స్కూల్ టైంనుంచే నటన అంటే ఇంట్రెస్టు. కల్చరల్ ప్రోగ్రాముల్లో మిమిక్రీ, డ్యాన్స్‌లు చేసేవాడ్ని. ఇంటర్లో నా ప్రతిభను చూసిన స్నేహితులు ప్రోత్సహించారు. ఇండస్ట్రీకి వెళ్తాఅంటే అమ్మానాన్న ఒప్పుకోలేదు. మా పెద్దన్నయ్య వారిని మెప్పించి నన్ను హైదరాబాద్‌లోని ఓ యాక్టింగ్ స్కూల్లో చేర్పించాడు. ఆఫీస్ బాయ్‌గా చేసిన.. ఐస్‌క్రీం అమ్మిన రెండునెలలు యాక్టింగ్ నేర్చుకున్నా. బతకడానికి డబ్బులు అవసరం కాబట్టి మూడు నెలలు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆఫీస్‌బాయ్‌గా పనిచేశా. ఐస్‌క్రీం బండి నడిపా. కిరాణాషాపులో పనిచేశా. బీటెక్ చేస్తుండగా.. సిటీలోని ఓ లోకల్ చానెల్లో పనిచేస్తూ.. రూంరెంట్, ఖర్చులు వెల్లదీసుకున్నా. సినిమాల్లో అవకాశం కోసం కృష్ణానగర్ చుట్టూ తిరిగా. ఆడిషన్లకు వెళ్తే.. నా ఫొటోలు డస్ట్‌బిన్‌లో వేసిన సందర్భాలున్నాయి. 16 రోజులకు రూ.వెయ్యి ఇచ్చారు మొట్టమొదటిసారి ఓ సినిమా షూటింగ్ కోసం అండమాన్ నికోబార్ తీసుకెళ్లారు. అక్కడ టీ బాయ్‌గా ప్రొడక్షన్ చూసుకునేది. 16 రోజులు పనిచేస్తే రూ.వెయ్యి ఇచ్చారు. ‘వాట్హాపెండ్ 6టు6’ సినిమాలో అవకాశం రాగా రెండురోజులు ఆడింది. వరంగల్‌కు చెందిన కిరణ్ నా యాక్టింగ్‌ను చూసి కెవ్వుకేక ప్రోగ్రాంలో అవకాశం ఇప్పించారు. ఈ క్రమంలో ఓ టీవీలో వచ్చిన తడాఖా ప్రోగ్రాంలో చాన్స్ వచ్చింది. అప్పుడే చమ్మక్‌చంద్ర నా యాక్టింగ్‌ను గుర్తించి తనటీంలో చేర్చుకున్నారు. తరువాత వేణు వండర్స్ టీంలో చేశాను. అలా ఎనిమిదేళ్లలో టీం లీడర్‌స్థాయికి ఎదిగాను. ఓ వైపు కామెడీ షో చేసూ్తనే పలు ఈవెంట్లు, షోలు చేసేవాడ్ని. వచ్చిన సంపాదనతో 2019లో మణికొండలో ఇల్లు కొన్నా. చీకట్లు నింపిన లాక్డౌన్ ఇల్లు కొన్న సమయంలోనే అమ్మ అనారోగ్యానికి గురైంది. రూ.10 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించా. ఆపై రూ.15లక్షలు అప్పు చేశా. ఈ క్రమంలో కరోనా లాక్డౌన్ నా జీవితంలో చీకట్లు నింపింది. లాక్‌డౌన్‌తో కామెడీ షో షూటింగ్ నిలిచిపోయింది. షోలు, ఈవెంట్లు లేవు. అప్పు కట్టేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏం చేయాలో అర్థంకాక నేను కొనుక్కున్న ఇంటి పైనుంచే దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. అదే సమయంలో గెటప్ సీను ఫోన్ చేశాడు. మేమున్నామని ధైర్యం చెప్పాడు. 13 వారాలున్నా.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా బిస్‌బాస్ రియాల్టీషోలో అడుగుపెట్టిన నేను 13 వారాలు హౌస్‌లో ఉన్నా. హౌస్‌లో బాగానే ఉన్నప్పటికీ అమ్మానాన్నలకు దూరం ఉండడం కొంత బాధేసింది. కానీ నాకున్న కష్టాలు పోవాలంటే గెలవాలనే కసితో ఆడాను. టాప్–5లో నిలుద్దామని అనుకున్నా. కుదరలేదు. ఏదేమైనా అన్నిరోజులు హౌస్‌లో ఉండేలా నాకు ఓట్లువేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఆఫర్లు వస్తున్నాయి షోనుంచి బయటకు వచ్చాక చాలా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఆర్థిక కష్టాలు కూడా తీరాయి. అందరిని నవ్విస్తూ.. అందరితో నవ్వుతూ ఉండాలన్నది నా కోరిక. మళ్లీ కామెడీ షో నిర్వాహకుల నుంచి పిలుపు వస్తే.. తప్పకుండా వెళ్తా. ఫైనల్లో సింగరేణి కుర్రోడు రామగిరి(మంథని): ‘అరె ఏందిబై.. నేను గిట్లనే ఉంటా. నా ఇష్టమున్నట్టు చేస్తా.. ఊరమాస్ ఇక్కడా..!’ బిస్బాస్లో ఈ డైలాగులు ఎంతో ఫేమస్. ఆ మాస్ క్యారెక్టరే.. సయ్యద్ సోహైల్. అతడిప్పుడో యూత్ ఐకాన్. సింగరేణి పొత్తిళ్లలో పెరిగి ప్రస్తుతం బిగ్‌బాస్ ఫైనల్లో నిలిచాడు. సింగరేణి ఉద్యోగం వద్దని.. పెద్దపల్లి మండలం మారేడుగొండ గ్రామానికి చెందిన సయ్యద్ సలీం–ఫాహీమా సుల్తానా దంపతులకు సయ్యద్ సోహెల్ రెండో సంతానం. సలీం సింగరేణి ఉద్యోగం రీత్యా కుటుంబంతో సహా సెంటినరీకాలనీలో స్థిరపడ్డారు. మైనింగ్ సర్దార్‌గా పనిచేస్తున్న సలీంకు 2016లో ఓపెన్‌హార్ట్ సర్జరీ అయ్యింది. యాజమాన్యం అతడ్ని అన్‌ఫిట్ చేసింది. వారసత్వంగా తండ్రి ఉద్యోగాన్ని స్వీకరించేందుకు సోహెల్ నిరాకరించాడు. దీంతో సలీంకు డిమోషన్ కల్పించి జనరల్ మజ్దూర్‌గా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఓసీపీ–2లో విధులు నిర్వహిస్తున్నాడు. బిగ్‌బాస్ ఫైనల్లో.. ఈ క్రమంలో బిగ్‌బాస్ షోనుంచి ఆహ్వానం అందింది. ఎంట్రీతోనే సీక్రెట్ కంటిస్టెంట్గా ఉన్న సయ్యద్ సోహెల్ మొదటినుంచి చురుగ్గా ఆడాడు. ఇచ్చిన ప్రతీటాస్క్లో విజయం సాధించాడు. మాస్ క్యారెక్టర్‌గా పేరు, ఫ్యాన్స్‌ని సంపాదించాడు. మనసున్న స్నేహితుడిగా మన్ననలు పొందాడు. బిగ్‌బాస్ ఫైనల్లో అడుగుపెట్టాడు. విజేతగా తిరిగిరావాలని జిల్లా ప్రజలు, కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుతున్నారు. డ్యాన్స్ అంటే ప్రాణం.. నటన అంటే ఇష్టం సయ్యద్ సోహెల్‌కు చిన్ననాటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. 2005లో 9వ తరగతి చదువుతున్న సమయంలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమానికి ఎంపిక య్యాడు. ఇంటర్ కరీంనగర్లో చదివి, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తిచేశాడు. 2009లో దిల్‌రాజ్ దృష్టిని ఆకర్షించిన సయ్యద్ సోహెల్ కొత్తబంగారు లోకం సినిమాలో సైడ్ క్యారెక్టర్‌కు ఎంపికయ్యాడు. 2010లో యూఅండ్ఐ, 2013లో మ్యాజిక్ మ్యూజిక్, 2015లో దిబెల్స్, 2017లో సినీ మహల్ సినిమాల్లో నటించాడు. నాతిచరామి, కృష్ణవేణి సీరియల్స్‌లో నటించి పేరు తెచ్చుకున్నాడు. విజేతగా వస్తాడు సోహెల్ ఏదైనా సాధించాలంటే పట్టుదలతో ఉంటాడు. అదే సంకల్పంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ రాణిస్తున్నాడు. సోహెల్ యూత్ ఐకాన్‌గా నిలవడం గర్వంగా ఉంది. బిగ్‌బాస్ షోలో విజేతగా నిలుస్తాడనే నమ్మకం ఉంది. – సయ్యద్ సలీం, సోహెల్ తండ్రి -
హారిక అర్హురాలు కాదు: బాంబు పేల్చిన అభి
బిగ్‌బాస్ నాల్గో సీజన్ పదిహేనో వారంలో ప్రస్తుతం ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. వీరు ఎన్నో ఆటంకాలను దాటుకుంటూ, సమస్యలకు ఎదురీదుతూ ప్రీ ఫైనల్స్ నుంచి ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ముందైతే టాప్ 5లో అర్హత సాధించాలని కలలు నెరవేరడంతో అభిజిత్, అఖిల్, సోహైల్, హారిక, అరియానా ఇప్పుడు కప్పు గెలిచేందుకు తాపత్రయపడుతున్నారు. వీరి గెలుపు అంతా ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంది. ఎవరు విన్నర్ అవుతారో, ఎవరు రన్నరప్‌గా నిలుస్తారో అనేది తేలడానికి కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో బిగ్‌బాస్ ఫైనలిస్టులతో ఓ ఆటాడించాడు. (చదవండి: బిగ్‌బాస్: నెరవేరని మోనాల్ కల!) ఇప్పుడున్న ఐదుగురిలో విజేత అవడానికి అర్హత లేని ఇంటి సభ్యుడి పేరు చెప్పమని ఆదేశించాడు. దీంతో అభిజిత్.. హారిక అర్హురాలు కావద్దు అనుకుంటున్నానని చెప్పి బాంబు పేల్చాడు. అయితే హారిక విజేత అయ్యేందుకు అర్హురాలు కాదన్నాడా? లేదా చివరలో ఉండేందుకు అర్హురాలు కాదన్నాడా? అనేది తెలియాల్సి ఉంది. అఖిల్, హారిక.. టైటిల్ గెలిచేందుకు అరియానా అనర్హురాలని అభిప్రాయపడ్డారు. అందరూ తనను అర్హురాలు కాదని గుచ్చిగుచ్చి చెప్పడాన్ని అరియానా పాజిటివ్‌గా తీసుకుంది. "నేను స్ట్రాంగ్ ప్లేయర్ అని ఇక్కడే తెలిసిపోతుంది. అందరి బుర్రలోకి దూరానంటే నేను గేమర్‌ను అని అర్థం. ఇది నాకు సంతోషాన్నిస్తోంది" అని చెప్పుకొచ్చింది. మరి ఈ గేమ్ పూర్తయ్యేసరికి ఎవరిని అనర్హురాలిగా ప్రకటించారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: అవినాష్‌ను కాదని అభికే ఓటేస్తానంటోన్న బుల్లెట్ భాస్కర్) -
బిగ్‌బాస్: దేత్తడిపై ట్రోలింగ్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో ఇప్పుడు మూడు జంటలు మాత్రమే మిగిలాయి. అది అభిజిత్- హారిక, అఖిల్-మోనాల్, సోహైల్-అరియానా. వీరిలో సోహైల్ జంట ఎప్పుడూ తిట్టుకుంటూ కొట్టుకోవడానికే సరిపోతుంది. మరోవైపు అఖిల్ జోడీ మధ్య దూరం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలింది అభిక జోడీ. మొదటి నుంచి కలిసి ఉన్న ఈ జోడీ ఈ మధ్య పెద్దగా కలిసి కనిపించడం లేదు. నీకోసం ఎప్పుడూ నేనుంటా అని చెప్పిన హారిక ఈ మధ్య అభితో ఎక్కువ సమయం గడపట్లేదు. నాగార్జున వచ్చినప్పుడు కూడా అభి ఇదే విషయాన్ని చెప్తూ కాస్త డల్‌గా ఫీలయ్యాడు. చూస్తుంటే అభిజిత్ చెప్పింది కూడా నిజమేననిపిస్తోంది. ఎప్పుడూ అతడితో మాత్రమే ఉండే హారిక ఇప్పుడు అందరితో కలిసిపోయింది. ముఖ్యంగా అఖిల్‌తో ఎక్కువగా కనిపిస్తోంది. ఇది అభిజిత్ అభిమానులకు బొత్తిగా నచ్చడం లేదు. అభిని వదిలేసి, అఖిల్‌తో.. నిన్నటి టాస్కులో మహారాణిగా అవతారమెత్తిన హారిక తను పిలవగానే అభి రాలేదని అతడి బట్టలను స్విమ్మింగ్ పూల్‌లో పడేసింది. అది చూసిన అభి ఆమెపై ఏ మాత్రం కోప్పడలేదు. అవి నోయల్ బట్టలు అని ఆమెకు వివరణ ఇచ్చాడు. పైగా హారిక అనుమతి తీసుకుని ఆ బట్టలను నీళ్లలో నుంచి బయటకు తీసి ఆరేశాడు. అయితే హారిక కావాలనే అభి మీద కోపాన్ని చూపిస్తోందని కొందరు తప్పులో కాలేస్తున్నారు. హారిక తీరు ఈ మధ్య అస్సలు బాగోలేదని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా అభిజిత్‌కు దూరంగా ఉండటంపై ఆయన అభిమానులు కొందరు గుర్రుగా ఉన్నారు. ఇన్ని వారాలు అభితో ఉండి, ఇప్పుడు మాత్రం అతడిని ఒంటరిగా వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు ఓట్లు వేసేదే లేదని తేల్చి చెప్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్: అందరికీ దూరంగా నోయల్) గంట ఎపిసోడ్ చూసి జడ్జ్ చేయకండి: నోయల్ ఈ ట్రోలింగ్‌పై హారిక ఫ్యాన్స్ కూడా ధీటుగా సమాధానమిస్తున్నారు. 'అభితో మాత్రమే ఉంటే ఎవరితో కలవట్లేదని తిడతారు, ఇప్పుడు అందరితో కలిస్తే అభిని వదిలేసిందని ట్రోల్ చేస్తారు, ఆమె ఏం చేసినా నిందిస్తారా?' అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. 'ఒకరితో క్లోజ్‌గా ఉన్నట్లు చూపించినంత మాత్రాన అభితో ఉండట్లేదని ఎలా అనుకుంటారు?' అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. హారికను టార్గెట్ చేయడంపై ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ నోయల్ సైతం స్పందించారు. అభిజిత్, హారికల బంధం ఎలాంటిదో తనకు తెలుసని, ఒక్క గంట ఎపిసోడ్ చూసి వారిని జడ్జ్ చేయకండని కోరాడు. కేవలం టాస్క్‌లో భాగంగానే హారిక తన బట్టలను నీళ్లలో పడేసిందని స్పష్టం చేశాడు. (చదవండి: సోహైల్ చేస్తే ఒప్పు? హారిక చేస్తే తప్పా?) -
హారికకు సోహైల్ వార్నింగ్: కథే వేరే ఉందిగా!
కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదన్నది లోకోక్తి. కానీ బిగ్‌బాస్‌లో ఉన్న సోహైల్‌కు సంతోషమేసినా, కోపమొచ్చినా దేన్నీ దాచుకోలేడు. అతడి ఆనందం కళ్లల్లో కనిపిస్తే, కోపంలో మాత్రం బాడీ నరాలు బయటకొచ్చేలా కనిపిస్తాయి. అయితే అర్జున్ రెడ్డిలా ఉండే సోహైల్ వ్యాఖ్యాత నాగార్జున చెప్పారని తన కోపాన్ని అణుచుకుని అందరి బంధువుగా మారిపోయాడు. అలాంటి సోహైల్‌కు తాజాగా కొందరు ఇంటిసభ్యులు కోపం తెచ్చినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ప్రోమో కూడా రిలీజైంది. బిగ్‌బాస్ ఇచ్చిన రాజారాణి టాస్కులో అప్పుడు సోహైల్ రాజవగా ఇప్పుడా అదృష్టం హారికను వరించినట్లు కనిపిస్తోంది. హౌస్‌లో ఆమె మహారాణిగా కొలువు దీరింది. అఖిల్ మంత్రిగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: ఈ ఇద్దరిలో ఒకరే బిగ్‌బాస్ విజేత: కౌశల్) పది సెకన్లలో నా కళ్ల ముందుండాలి గార్డెన్ ఏరియాలో కూర్చున్న హారిక అభిజిత్‌ను రమ్మని ఆదేశించింది. దాన్ని అతడు పెద్దగా పట్టించుకోలేడు. దీంతో మహారాణికి కోపం రాగా, పది సెకండ్లలో నా ఎదుట ప్రత్యక్షం కాకపోతే మీ బట్టలు స్విమ్మింగ్ పూల్‌లో పడేస్తానని హెచ్చరించింది. తన బట్టలు పడేస్తే చుక్కలు చూపిస్తానని సోహైల్ వార్నింగ్ ఇచ్చాడు. అయినా సరే, హారిక తను చెప్పినదాని ప్రకారం బట్టలు పూల్‌లో పడేసింది. అది అభిజిత్వా? సోహైల్వా? అన్నదానిపై స్పష్టత లేదు. ఆమె అన్నంత పని చేస్తుందని అర్థమైన సోహైల్ తర్వాత ఆమె ముందు నిలబడ్డాడు. (చదవండి: అవినాష్ అవుట్: అభిజిత్‌పై బిగ్‌బాంబ్) సోహైల్ చేస్తే ఒప్పు, హారిక చేస్తే తప్పా! చెప్పిన పని అయిందా? అని హారిక హుంకరించగా.. దానికి కొంచెం సమయం పడుతుందని దురుసుగా సమాధానమిచ్చాడు. అతడి తీరును అక్కడే ఉన్న అఖిల్ తప్పుపట్టగా బరాబర్.. ఇట్లనే మాట్లాడతా అంటూ సోహైల్ అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయాడు. ఎప్పటిలాగే తన కోపాన్ని వస్తువుల మీద తీస్తూ కుర్చీని విసిరిగొట్టాడు. మరి సోహైల్ కోపానికి కారణమేంటన్నది తెలియరాలేదు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత సోహైల్ కోపాన్ని చూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో సోహైల్ అరియానాకు పనులు చెప్పి ఆమెను టార్చర్ చేయడం కరెక్ట్ కానీ హారిక మాత్రం అతడిని ఏమీ అనకూడదా? అని విమర్శిస్తున్నారు. అబ్బాయికి కోపం వస్తే ఆటిట్యూడ్ బాగుందంటారు, కానీ అమ్మాయి అలా ప్రవర్తిస్తే పొగరని తిడతారు? ఇదేం న్యాయమని కడిగి పారేస్తున్నారు. -
మోనాల్ మనసులో నేనున్నా అంది: అభి
కెట్ టు ఫినాలే రేసు నేడు మూడో లెవల్లోకి అడుగుపెట్టింది. ఈసారి బిగ్‌బాస్ ఫిజికల్ టాస్కు లాంటివి కాకుండా సహనానికి, ఓపికకు పరీక్ష పెట్టాడు. ఉయ్యాలో ఊగమని చెప్పాడు. వినడానికి ఓస్ ఇంతేనా అనిపించినా, అది అంత ఈజీ కాదు. పూటకోసారి తీసుకొచ్చే జ్యూసులు తాగుతూ చలిలో కూర్చున్నచోటు నుంచి కదలకూడదు అంటే మాటలు కావు. పొట్ట ఉబ్బి అవస్థ పడుతూ పట్టపగలే చుక్కలు చూస్తారు. ఈ టాస్కులో ఇద్దరు స్నేహితులూ పట్టువిడవకుండా ఉయ్యాల మీదే ఉండిపోయారు. ఇక అభిజిత్ మోనాల్ గుట్టును బయటపెట్టాడు. ఆ వివరాలన్నీ తెలియాలంటే ఈ స్టోరీని చదివేయండి.. అవినాష్- బ్రదర్ ఆఫ్ మోనాలి 'టికెట్ టు ఫినాలే' రేస్ మూడో లెవల్లో అఖిల్, సోహైల్ ఊయలపై కూర్చుని పాటలు పాడుకున్నారు, సరదాగా కొట్టుకున్నారు కూడా! ఈ టాస్క్‌కు సంచాలకుడిగా వ్యవహరించిన అభిజిత్ అఖిల్‌కు ఎండ కొడుతుంటే కాసేపు అతడికి నీడలా నిలబడ్డాడు. ఈ ఇద్దరినీ 48 గంటలు ఉయ్యాల మీద నుంచి దింపకండని అవినాష్ తన అక్కసు వెళ్లగక్కుతూ బిగ్‌బాస్‌ను అభ్యర్థించాడు. తర్వాత మోనాల్‌ను వెంటేసుకుని అవినాష్ బయటకు రావడాన్ని చూసిన అఖిల్.. అతడు మీ తమ్ముడా అని మోనాల్‌ను అడిగాడు. అందుకు హర్ట్ అయిన అవినాష్ నేను నీకు అన్నయ్యనా? అవినాష్నా? అని అడగ్గా మోనాల్ అవినాష్ అన్నయ్య అని టపీమని చెప్పేసింది. దీంతో తలెక్కడ పెట్టుకోవాలో తెలీక అవినాష్ కాసేపు అవమానంతో చచ్చిపోయాడు. వీరి రిలేషన్‌కు అఖిల్ "బ్రదర్ ఆఫ్ మోనాలి" అని టైటిల్ కూడా ఇచ్చేశాడు. (చదవండి: బిగ్‌బాస్: అవినాష్‌కు గడ్డు కాలం?) ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టిన బిగ్‌బాస్ పోటీదారులను తిప్పలు పెట్టేందుకు బిగ్‌బాస్ పాలను పంపించాడు. అఖిల్‌కు పాలు తాగడం అలవాటు లేకపోయినా తప్పక తాగాడు. తర్వాత కూర్చున్నదగ్గరే పరదాలు చుట్టి వాష్‌రూమ్‌కు వెళ్లారు. రాత్రి బిగ్‌బాస్ తుపాకీ పేలుడు శబ్ధాలు చేయడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. కానీ అఖిల్, సోహైల్ మాత్రం కూర్చున్నచోట నుంచి అంగుళం కూడా కదల్లేదు. వీరు భయపడటం లేదని తెలుసుకున్న బిగ్‌బాస్ ఈసారి కొట్టుకుని చావండంటూ ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టాడు. ముల్లంగి రసాన్ని ఒకరికి ఒకరు చెంచాతో తాగించుకోమని చెప్పాడు. అయితే తాగించే సభ్యుడు తను ఉయ్యాల మీద ఉండటానికి ఎందుకు అర్హుడు? ఎదుటివాడు ఎందుకు అనర్హుడు? అన్న విషయాన్ని చెప్పాలని ఆదేశించాడు. ఈ క్రమంలో ఇద్దరికీ చిన్నపాటి గొడవ జరిగింది. తర్వాత ఇదంతా కాదని చిన్నచిన్న కారణాలు చెప్తూ జ్యూస్ తాగించుకున్నారు. అక్కడే ఉన్న అరియానా మధ్యలో దూరి మీరు చెప్పే కారణాలు సరిగా లేవని విమర్శించింది. దీంతో ఇద్దరూ ఏకమై మాలో ఇద్దరం అర్హులమే, అందుకే చిన్నచిన్నవి అయినా లెక్కలోకి తీసుకుంటున్నామని క్లారిటీ ఇఇస్తూ ఆమె నోరు మూయించారు. (చదవండి: హారిక బెస్ట్ కెప్టెన్ కానే కాదు: నాగార్జున) హారిక మీద సీరియస్ అయిన అభి హారిక.. తనకు నాగ్ క్లాస్ పీకిన విషయాన్ని అభిజిత్ ముందు ఏకరువు పెట్టింది. ఒక కెప్టెన్‌గా మోనాల్‌తో డేట్‌కు వెళ్లాల్సిన టాస్క్ నీతో చేయించకపోవడం తప్పని నాగ్ సర్ చెప్పారని బాధపడింది. దీంతో అభిజిత్ కలగజేసుకుంటూ ఎన్నో రోజులుగా తన గుండెలో దాచుకున్న నిజాన్ని బయటకు వెల్లడించాడు. 'నేనంటే ఇష్టమని మోనాల్ స్వయంగా నాతో చెప్పింది. తర్వాత ప్రతిసారి ఆమె మనసులో ఒక A ఉందంటున్నారు కదా! ఆ A ఎవరు అని అడిగితే నేనే అంది. కానీ ఇది ఎప్పుడూ అందరి ముందు బయట పెట్టలేదు. అయినా సరే ఆమె నాకు స్టాండ్ తీసుకోలేదు, ఇంకా నామినేట్ చేసింది' అని తన బాధను బయటకు కక్కాడు. అయితే అతడు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే.. హారిక తెలుగు తెలుగు అని పదే పదే గుర్తు చేసింది. దీంతో చిర్రెత్తిన అభి.. నువ్వు నాతో మాట్లాడాలంటే ఇంకో 5 సంవత్సరాలు ఎదగాలి అన్నాడు. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు అని మండిపడ్డాడు. (బిగ్‌బాస్ : ఆ ఇద్దరికే నా సపోర్ట్.. నాగబాబు) అవినాష్ మీద అరియానా తిట్ల పురాణం ఇక టాస్క్ జరిగేటప్పుడు లైట్లు ఆర్పేయమని బిగ్‌బాస్ తేల్చి చెప్పడంతో కంటెస్టెంట్లు జాగరణ చేశారు. అఖిల్ అరియానాతో పులిహోర కలుపుతున్నాడని హారిక మోనాల్ చెవిలో ఊదింది. ఇదెప్పుడు జరిగిందని మోనాల్ అవాక్కైంది. అవినాష్ జోకులు పేల్చుతూ అరియానా మీద కూడా జోకేశాడు. దీంతో ఆమె వచ్చి అవినాష్‌కు నాలుగు తగిలించడమే కాక అతడి మీద కొత్త కొత్త బూతులను ప్రయోగించింది. ఇక తెల్లవారు కోడి కూసే వేళకు కూడా అఖిల్, సోహైల్ ఉయ్యాల మీదనే ఉన్నట్లు చూపించారు. సహనంతో కాలాన్ని నెట్టుకొచ్చిన ఈ ఇద్దరు రేపటి ఎపిసోడ్లో మాత్రం ఉయ్యాల మీద నుంచి కిందకు దిగినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం అఖిల్ గెలిచాడా? లేదా సోహైలా? అన్న విషయం రేపు తేలనుంది. (చదవండి: సిటీకి దూరంగా నోయల్) -
బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్లానా అనిపించింది: నోయల్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అనారోగ్య కారణాలతో నోయల్ షో మధ్యలో నుంచే వెళ్లిపోయాడు. ఆ మధ్య తన రీఎంట్రీ ఉంటుందని హోరెత్తించాడు. గేమ్ ఈజ్ స్టిల్ ఆన్.. ఈసారి వెళ్తే మామూలుగా ఉండదు అంటూ పోస్టులు పెట్టాడు. దీంతో రీఎంట్రీ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ చివరాఖరకు అదంతా ఉత్తిదే అని తేలింది. దీంతో అతడు తన స్నేహితులకు సపోర్ట్ చేయడం ప్రారంభించాడు. అభిజిత్, హారికకు ఓటేయమని ప్రచారం చేపట్టాడు. ఆ ఇద్దరి గెలుపు గురించి అనునిత్యం అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. అందుకే సిటీకి దూరంగా ఉంటున్నా.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అందరూ జోరుగా ఇంటర్వ్యూలు చేస్తుంటే నోయల్ మాత్రం వాటికి దూరంగా ఉన్నాడు. తాజాగా ఎక్కడో సిటీకి దూరంగా, రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న నోయల్ నివాసానికి హారిక అన్నయ్య వంశీ, ఆమె స్నేహితుడు, యాంకర్ నిఖిల్ వెళ్లి సర్ప్రైజ్ చేశారు. నోయల్‌కు చెప్పాపెట్టకుండా అతడి ఇంటికి చేరుకుని ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా నిఖిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నోయల్ షాకింగ్ విషయాలను వెల్లడించాడు. 'మనుషులను ఎంత ఇష్టపడితే అంత దూరంగా ఉండాలి. వాళ్లకు ఎంత దగ్గరగా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకే సిటీకి దూరంగా ఉంటున్నా'నని పూర్తి వైరాగ్యంలో ఉన్నట్లుగా మాట్లాడాడు. ఏడాదిన్నర క్రితమే ఈ ఇల్లు కొన్నానని తెలిపాడు. (చదవండి: కాళ్లు పట్టుకుంటే బాగోదు, ప్లీజ్..: అవినాష్) అమ్మాయిని గెలిపించండి.. బిగ్‌బాస్ షో గురించి చెప్తూ అది మనకవసరం లేదని అర్థమైందన్నాడు. ఆ షోకు ఎందుకెళ్లానో, ఏమో అనిపించిందని బాధపడ్డాడు. షో చూడటం కూడా మానేశానని తెలిపాడు. హౌస్‌లో అందరూ మంచివాళ్లేనని, తన సపోర్ట్ మాత్రం అభిజిత్, హారికకు ఉంటుందని స్పష్టం చేశాడు. ఎనిమిది సార్లు కెప్టెన్సీ పోటీదారులుగా నిలబడటం మామూలు విషయం కాదని హారికను మెచ్చుకున్నాడు. ఆమె మనుషుల్ని వాడుకుని గేమ్ ఆడి టైటిల్ కొట్టాలి, రూ.50 లక్షలు తీసుకోవాలి, వాడేమైపోతే ఏంటి? వీడేమైపోతే ఏంటి? అనుకుని ఆడే రకం కాదు. తాను గెలవాలన్న కోణంలోనే ఆడుతుందని చెప్పుకొచ్చాడు. హారికకు లవ్ ట్రాకులు, కామెడీ ట్రాకులు లేవని కష్టపడి ఆడి ఇక్కడివరకు వచ్చిందన్నాడు. జీవితంలో కూడా ఎన్నో కష్టాలు పడిందని, ఈసారైనా అమ్మాయిని గెలిపించమని అభిమానులకు పిలుపునిచ్చాడు. (చదవండి: నోయల్ అవుట్, మోకరిల్లి దండం పెట్టిన అవినాష్) -
బిగ్‌బాస్: ఈ సారి కూడా అమ్మాయిలకు నో ఛాన్స్
అమ్మాయిలు ఆకాశంలో సగం అంటారు. ఇంటి మహా లక్ష్మి అని కీర్తిస్తారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానమేనని చెప్తారు. కానీ బిగ్‌బాస్‌కు వచ్చేసరికి కథ అడ్డం తిరుగుతోంది. మిగతా భాషల్లోని సంగతి పక్కనపెడితే తెలుగులో మాత్రం బిగ్‌బాస్ అమ్మాయిలకు కలిసి రావడం లేదని తెలుస్తోంది. గత మూడు సీజనల్లో వరుసగా శివ బాలాజీ, కౌశల్ మండా, రాహుల్ సిప్లిగంజ్ విజేతలుగా నిలిచారు. అమ్మాయిలు మాత్రం రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నారు. కనీసం ఈ సీజన్లో అయినా అమ్మాయిలు గెలిచేందుకు ఆస్కారం ఉంటుందేమోనని మొదట్లో అంతా భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అంచనాలు తలకిందులు అవుతున్నాయి. గేమ్ వన్‌సైడ్ అయినట్లు అనిపిస్తోంది. పది మందిలో ముగ్గురే మిగిలారు.. 19 మంది కంటెస్టెంట్లతో నిండిపోయిన బిగ్‌బాస్ హౌస్‌లో 10 మంది అమ్మాయిలే ఉండేవారు. కానీ ఆ సంఖ్య ఇప్పుడు మూడుకు చేరింది. మోనాల్, హారిక, అరియానా మాత్రమే ఇంకా హౌస్‌లో నిలదొక్కుకోగలిగారు. స్ట్రాంగ్‌గా ఉంటూ అందరినీ గడగడలాడించిన అరియానా.. అవినాష్ చెంతన చేరి తన గేమ్ తనే నాశనం చేసుకుంటోంది. అటు హారిక మగాళ్లతో సమానంగా పోటీపడుతున్నప్పటికీ రిలేషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ కేరాఫ్ అభిజిత్‌గా మారిపోయింది. మోనాల్ మీద వ్యతిరేకత ఇప్పుడిప్పుడే తగ్గుతోంది కానీ టైటిల్ కొట్టేంత శక్తిసామర్థ్యాలను ఆమె ఇంకా బయటకు తీయడం లేదు. మిగతావాళ్ల ఆటతో పోలిస్తే వీళ్లలో ఒకరు టైటిల్ చేజిక్కించుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. (చదవండి: ఆ బిగ్‌బాస్ కంటెస్టెంటు నా భార్య, మోసం చేసింది) ఆడవాళ్లకు నాలుగో'సారీ'.. దీంతో ఈ సీజన్లో కూడా ట్రోఫీని అమ్మాయిలు ఎగరేసుకుపోవడమనేది పగటి కలగానే మారనున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఎనీ టైమ్ అభిజిత్ ట్రెండింగ్‌లో ఉంటున్నాడు. అతడే విన్నర్ అని తేల్చేస్తున్నారు. ఏ పోలింగ్ సైట్లు చూసినా అతడికే సుమారు 40 శాతం ఓట్లు పడుతుండటం విశేషం. తర్వాత టైటిల్ రేసులో సోహైల్, అఖిల్ ఉన్నారు. ఈ ఇద్దరిలో ఇప్పటికే అఖిల్ టాప్ 5లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ సీజన్ టైటిల్ పోరు అభిజిత్, అఖిల్, సోహైల్ మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ మూడు వారాల్లో ఏదైనా అద్భుతం జరిగి అమ్మాయిలు టాస్కుల్లో అబ్బాయిలను డామినేట్ చేసినా వాళ్లు టాప్ 3కి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. (చదవండి: బిగ్‌బాస్: అవినాష్‌కు గడ్డు కాలం?) -
బిగ్‌బాస్ ఫినాలే రేస్: అతడే విజేత!
నామినేషన్లు అనే అడ్డంకులే లేకుండా నేరుగా ఫినాలేలో అడుగుపెట్టాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే కంటెస్టెంట్లు బిగ్‌బాస్ ప్రవేశపెట్టిన టికెట్ టు ఫినాలే మెడల్ కోసం హోరాహోరీగా పోరాడుతున్నారు. కానీ మెడల్ సాధించాలని అందరికీ ఉన్నా వశమయ్యేది మాత్రం ఒక్కరికే. ఈ క్రమంలో టికెట్ టు ఫినాలే మొదటి లెవల్లో అఖిల్, అభిజిత్, హారిక, సోహైల్ విజయం సాధించారు. వీరి మధ్య నేడు రెండో లెవల్ పోటీ జరగనుంది. నిన్న పాలు పితడకడం అనే టాస్క్ పెట్టిన బిగ్‌బాస్ నేడు పూలు విసరడం టాస్క్ పెట్టాడు. ఇందులో హారిక మగాళ్లతో ధీటుగా ఆడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. (చదవండి: బిగ్‌బాస్: అవినాష్ కొంప ముంచిన అతి తెలివి) కానీ సోహైల్ ఆమెకు పూలు అందకుండా లాగి పడేసినట్లు చూపించారు. దీంతో విసిగిపోయిన హారిక.. చేతుల్లోంచి లాక్కోవద్దంటారు, అక్కడ మట్టిలో పీకొద్దంటారు. ఇలాగైతే ఎట్లా గెలిచేది? బ్లడీ.. అంటూ ఏడ్చేసింది. దీంతో అవినాష్ వెళ్లి ఆమె కన్నీళ్లు తుడిచాడు. మరోవైపు అఖిల్-సోహైల్ నిన్న కలిసి ఆడినందుకు అవినాష్ అక్కసు వెళ్లగక్కాడు. వాళ్లు ఒంటరిగా ఆడి గెలవలేదన్నట్లు మాట్లాడాడు. దీంతో మండిపడ్డ సోహైల్ మేమేదో తప్పు చేసినట్లుగా మాట్లాడకు, మా తెలివితో ఆడాం అని వాదించినా ఆయన చెవికెక్కించుకోలేదు. ఇక సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్, సోహైల్ మూడో లెవల్‌కు అర్హత సాధించారు. అందులో అఖిల్ మెడల్ సొంతం చేసుకుని టాప్ 5లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నట్లు సమాచారం. (చదవండి: రికార్డు సృష్టిస్తోన్న మోనాల్, అంతా అభి వల్లే!) -
బిగ్‌బాస్: అభిని నామినేట్ చేసిన హారిక
బిగ్‌బాస్ నాల్గో సీజన్ గ్రాండ్ ఫినాలేకు మరో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో కంటెస్టెంట్లు పోటీని తట్టుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా నామినేషన్ అనే సంద్రాన్ని ఈదాల్సి ఉంటుంది. ఈ రోజు ఆ సమయం రానే వచ్చింది. పదమూడో వారానికిగా గానూ నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో జంట పక్షులు విడిపోయినట్లు కనిపిస్తోంది. ఇప్పటి నుంచి తన గేమ్ ఆడతానని చెప్పిన మోనాల్ అన్నంతపనే చేసింది. కానీ మొదటి నుంచి ఆమెకు నీడలా తోడున్న అఖిల్‌ను నామినేట్ చేసి అందరికీ షాకిచ్చింది. కలలో కూడా ఊహించని ఈ పరిణామానికి అఖిల్ ఆగ్రహానికి లోనయ్యాడు. నీకోసం ఎంతో కొట్లాడాను,.. చివరికి ప్రేక్షకుల దగ్గర నన్ను బ్యాడ్ చేయాలనుకుంటున్నావు, అంతే కదా! అని మండిపడ్డాడు. (చదవండి: బిగ్‌బాస్: నాగ్‌పై అభిజిత్ ఫ్యాన్స్ ఫైర్) ఓవర్ కాన్ఫిడెన్స్ నీకే ఎక్కువ అటు అవినాష్, అఖిల్ కూడా ఒకరినొకరు నామినేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అవినాష్ నాకన్నా వీక్ ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. నేనెందుకు ఎలిమినేట్ అవ్వాలని ఫ్రస్టేట్ అయ్యాడు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని అఖిల్ అభిప్రాయపడ్డాడు. మరి అఖిలే నెంబర్ 1 అని నువ్వు అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదా? అని అవినాష్ ఎదురు ప్రశ్నించాడు. అసలు మొదటి నుంచి అరియానాకు, మోనాల్‌కు పడదన్న విషయం ఈ నామినేషన్‌తో మరోసారి బయటపడింది. ఈ ఇద్దరూ మాటల తూటాలు పేల్చుకుంటుండగా తెలుగులో మాట్లాడమని అవినాష్ సలహా ఇచ్చాడు. దీంతో రెచ్చిపోయిన మోనాల్ మధ్యలోకి రావద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. (చదవండి: బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం ) నువ్వు కూడా అర్థం చేసుకోలేదా.. అన్నింటికీ మించి ప్రోమోలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన అంశం హారిక అభిజిత్‌ను నామినేట్ చేయడం! ఫేవరెటిజమ్ చూపించకుండా సొంతంగా గేమ్ ఆడంటూ నాగార్జున ఆమెకు క్లాస్ పీకిన విషయం తెలిసిందే కదా! దీంతో గతవారంలో టాస్క్ ఆడని తన క్లోజ్ ఫ్రెండ్ అభిని ఆమె నామినేట్ చేస్తున్నట్లుగా ప్రోమోలో చూపించారు. అయితే మనసు వద్దని చెప్తున్నా తప్పని పరిస్థితుల్లో ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని హారిక ముఖం చూస్తే అర్థమవుతుంది. కానీ దీనివల్ల అభి మనసు నొచ్చుకుంది. నువ్వు అర్థం చేసుకోకపోతే.. ఇక్కడ ఇంకెవరూ అర్థం చేసుకోలేరు అని బాధపడ్డాడు. ఏదేమైనా బిగ్‌బాస్ విజయవంతంగా రెండు జంటలను విడగొట్టినట్లు సులువుగా స్పష్టమవుతోంది. మొత్తానికి ఈ వారం అభిజిత్, అఖిల్, మోనాల్, అవినాష్, హారిక నామినేషన్లో ఉన్నట్లు సమాచారం. టామ్ అండ్ జెర్రీ సోహైల్, అరియానా మాత్రం నామినేషన్ నుంచి తప్పించుకున్నారు. -
ట్రోలింగ్: నాగార్జునతోనే ఆటలా?
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ట్రోఫీ గెలుచుకునేందుకు ఇంకా మూడు వారాలే మిగిలి ఉన్నాయి. కానీ ఇప్పటికీ కంటెస్టెంట్లు ఎవరి ఆట వాళ్లు ఆడటం లేదన్న విషయం నాగార్జున కంట్లో పడింది. అంతేకాక బెస్ట్ కెప్టెన్‌గా హారికను, వరస్ట్ కెప్టెన్‌గా అరియానాను ఎన్నుకోవడాన్ని కూడా ఆయన సమర్థించలేదు. దీంతో హారికను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి నువ్వు బెస్ట్ కెప్టెన్ కాదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఈ వారమంతా ఆమె చేసిన తప్పులను వీడియోల మీద వీడియోలు వేసి మరీ కళ్లకు కట్టినట్లు చూపించారు. మోనాల్ వల్ల కెప్టెన్ అయిన నువ్వు అభిజిత్ కోసం పని చేశావని నిందించారు. అభి మీద ఫేవరెటిజమ్ చూపించావని విమర్శించారు. బిగ్‌బాస్ షోలో గెలవాలంటే నీ గేమ్ నువ్వు ఆడాల్సిందే అని ఆమెకు సలహా ఇచ్చారు. ఇద్దరి తప్పులే కనిపించాయా? మరోవైపు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులు ఆడలేదని అభిజిత్ మీద మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా చూపించారు. గేట్లు ఎత్తి పంపించేస్తానని బెదిరించారు. ఈ క్రమంలో అభి కాస్త ఎమోషనల్ అయ్యి మోకాళ్ల మీద కూచుని తన తప్పును క్షమించమని అభ్యర్థించారు. అయితే నాగార్జున ఈ ఇద్దరి వీడియోలు మాత్రమే చూపించి క్లాస్ పీకడం నెటిజన్లకు మింగుడు పడలేదు. కావాలనే హారిక, అభిజిత్‌ను నాగ్ టార్గెట్ చేశారని విశ్వసించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా నాగ్ తీరును తప్పుపడుతున్నారు. (చదవండి: మోనాల్‌తో లింక్ చేయకండి: అభి వేడుకోలు) నాగ్ సినిమాను అట్టర్ ఫ్లాప్ చేస్తాం అసలు సిసలు ఫేవరెటిజమ్ చూపించేది నాగార్జునే అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన కళ్లకు ఎవరి తప్పులూ కనిపించడం లేదా అని కడిగిపారేశారు. ఆయన నటించిన వైల్డ్ డాగ్ సినిమాను అట్టర్ ఫ్లాప్ చేస్తామని ప్రతిజ్ఞ పూనుతున్నారు. ఈ ట్రోలింగ్ చూసిన నాగ్ అభిమానులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఓ మామూలు కంటెస్టెంటు కోసం స్టార్ హీరో నాగ్‌ను అన్నేసి మాటలంటారా? అని గరమవుతున్నారు. ఉన్న మాట చెప్పినందుకు ఎగిరెగిరిపడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎంత నెగెటివ్ ట్రెండ్ చేసినా మా కింగ్‌కు అది గడ్డ పరకతో సమానం అని ఏకిపారేస్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్: టాప్ 5 కంటెస్టెంట్లు వీళ్లే) అప్పుడు నాని, ఇప్పుడు నాగ్ నిజానికి నాగార్జున కంటెస్టెంట్ల తప్పులను ఎత్తి చూపి వారిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ వారంలో ఎవరైతే దిద్దుకోలేని తప్పులు చేశారో, వాటినే ప్రస్తావిస్తూ ఆ తప్పు మళ్లీ జరగకుండా చూసుకోమని సలహా ఇచ్చారు. అది తమ మంచి కోరే చెప్పారన్న విషయం హారిక, అభిజిత్‌లకు అర్థమైంది కూడా. కానీ వాళ్ల అభిమానులే అనవసరంగా రెచ్చిపోయి నాగ్‌తో పెట్టుకుంటున్నారు. నోటికొచ్చినట్లుగా విమర్శిస్తున్నారు. కాగా రెండో సీజన్లో కౌశల్ మండా అభిమానులు హోస్ట్ నానిని విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ వ్యతిరేకతను తట్టుకోలేక నాని మరోసారి బిగ్‌బాస్ షోనే చేయనని కరాఖండిగా చెప్పేశారు. ఈ సీజన్లో అభిజిత్ కోసం ఏకంగా నాగార్జుననే ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి. -
దండం పెడతా, గేమ్ ఆడండి: నాగార్జున
బిగ్‌బాస్ ప్రయాణం చివరి మజిలీకి చేరుకుంటున్న దశలో కొందరి గ్రాఫ్ తగ్గుతోంటే మరికొందరి గ్రాఫ్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్‌కు గురయ్యే మోనాల్‌కు ఈ సారి అత్యధిక ఓట్లు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తుండగా నాగ్ సైతం తొలుత మోనాల్‌నే సేవ్ చేయడం విశేషం. ఇక హౌస్‌లో ఎవరూ తప్పు చేయకుండా చూసుకోవాల్సిన కెప్టెన్ హారికే సరిదిద్దుకోలేని తప్పులు చేసింది. దీంతో మరోసారి ఇలాంటి తప్పులు చేయకుండా నాగ్ ఆమెకు గట్టి క్లాస్ పీకారు. అభి ఇంగ్లీష్ మాట్లాడుతున్నా ఆపలేదని, టాస్క్ చేయకపోయినా శిక్షించకుండా వెనకేసుకొస్తూ ఫేవెరెటిజిమ్ చూపించావని మండిపడ్డారు. మోనాల్‌కు ఎప్పుడు సాయం చేశావు? అఖిల్ కోసం సోహైల్ నామినేట్ అవడానికి రెడీగా ఉన్నప్పటికీ నిన్ను కెప్టెన్ చేసిన మోనాల్‌ను అభి కోసం నామినేషన్లోకి పంపావని గరమయ్యారు. మోనాల్‌కు సాయం చేశావని పదేపదే చెప్పావు కానీ ఎక్కడ చేశావంటూ వీడియో చూపించారు. అందులో హారిక బట్టలు పట్టుకుని శిలా విగ్రహంలా నిలబడిందే తప్ప మోనాల్ పేరు రాసి ఉన్న బుట్టలో వేయలేదు. బజర్ మోగిన తర్వాతే ఆమె బెడ్ దగ్గర నుంచి కదలింది, కానీ దానివల్ల ఏ ప్రయోజనమూ లేదు. ఇలా ఎన్నో తప్పిదాలు చేసినందున హారిక బెస్ట్ కెప్టెన్ కాదని నాగార్జున తేల్చేశారు. అరియానాను మాత్రం వరస్ట్ కెప్టెన్ కాదని, బిగ్‌బాస్ నియమాలు అందరూ పాటించేలా కృషి చేసిందని వెనకేసుకొచ్చారు. (చదవండి: బిగ్‌బాస్: ఆ వీడియోలు వేసి ఇజ్జత్ తీయకండి) బహుశా అఖిల్‌తో స్వాప్ చేయకపోవడమే నా పొరపాటు తర్వాత హౌస్‌లో ఈ వారం ఎవరెవరు ఏమేం తప్పులు చేశారో చెప్పమని నాగ్ ఆదేశించారు. తొలుత సోహైల్ మాట్లాడుతూ.. తను అరియానాను వెక్కిరించడం తప్పని చెప్తూ ఆమెకు సారీ చెప్పాడు. అలాగే దెయ్యం టాస్కులో అఖిల్, నేను భయపడ్డామంటూ అసలు నిజాన్ని బయటపెట్టాడు. తర్వాత అరియానా వంతు రాగా ఆమె వరస్ట్ కెప్టెన్ కాదని గుడ్ కెప్టెన్ అని మెచ్చుకున్నారు. అవినాష్.. నేను వెర్రిపప్పలా కనపడుతున్నానానా అని అరియానా మీద సీరియస్ అయ్యాను అని చెప్పుకురాగా ఫ్రెండ్స్ మీద నోరు జారొద్దని నాగ్ అతడిని హెచ్చరించారు. దీంతో అవినాష్.. అరియానాను లైఫ్‌లో మర్చిపోలేని ఫ్రెండ్ అని తెలిపాడు. అలాగే శ్మశానం టాస్కులో ఎక్కువ ఆలోచించడం కూడా తప్పేనని పేర్కొన్నాడు. మోనాల్.. అఖిల్‌తో స్వాప్ చేయకపోవడమే తన పొరపాటు అనిపిస్తోందని తెలిపింది. చివరికి కరెక్ట్ పర్సన్‌తో స్వాప్ చేయమంటే హారిక.. అఖిల్‌తో కాకుండా అభితో చేసిందని బాధపడింది. (చదవండి: ఇలాగైతే బిగ్‌బాస్ నుంచి తప్పుకుంటా: నాగ్ వార్నింగ్) మోనాల్‌తో లింక్ చేయకండి: అభి తర్వాత అఖిల్ మాట్లాడుతూ.. సీక్రెట్ రూమ్ నుంచి వచ్చినప్పుడు హారిక ఐ హేట్ యూ అంటే నువ్వు ఎప్పుడు నన్ను ఇష్టపడ్డావు అని ఏదో కోపంలో అన్నాను, కానీ తర్వాత సారీ చెప్పాను అని తెలిపాడు. అనంతరం నాగ్ బిగ్‌బాస్ హౌస్ గేట్లు తెరవండని చెప్పి అభి వైపు తిరిగి అతడిని తప్పుల చిట్టా చదమన్నారు. దీంతో అభి టాస్కు చేయలేదని నిర్మొహమాటంగా చెప్పేశాడు. మోనాల్‌తో లింక్ చేయకండని ఎన్నోసార్లు అభ్యర్థించాను. పైగా దెయ్యం ఇచ్చిన టాస్క్‌లో నేను మోనాల్‌ను ఏడిపించానని చెప్పారు. కానీ నేను ఏడిపించలేదని చెప్పడంతో నాగ్ ఓ వీడియో చూపించారు. అందులో అభిజితే మోనాల్‌ను ఏడిపించినట్లు ఒప్పుకున్నాడు. కళ్లెదురుగా తను మాట్లాడింది కనిపించడంతో అభి సారీ చెప్పాడు. (చదవండి: రంగంలోకి ‘ఆర్జీవీ’, వణికిపోయిన హౌస్మేట్స్) కంటెస్టెంట్ల తీరుతో చేతులెత్తి వేడుకున్న నాగ్ ఇది మొదటిసారి కాదని నాగ్ మండిపడటంతో అభి మోకాళ్ల మీద కూర్చుని అభ్యర్థించాడు. నా సీజన్లో మోనాల్ కోణమే నన్ను ఇబ్బందికి గురి చేస్తోందని వివరించాడు. చివరాఖరకు టాస్కు చేయకపోవడమే తన తప్పని అంగీకరించడంతో నాగ్ గేట్స్ క్లోజ్ చేయమన్నాడు. తప్పును అంగీకరించకపోతే నువ్వు బయటకు వెళ్లిపోయేవాడివని నాగ్ హెచ్చరించారు. పన్నెండు వారాలు ముగుస్తున్నా, ఎన్నిసార్లు హెచ్చరించినా, నవ్వుతూ చెప్పినా ఇంకా సరిగా గేమ్ ఆడటం లేదని నాగ్ ఆవేదన చెందారు. మీ అందరికీ దండం పెడుతున్నా, గేమ్ ఆడండి అంటూ కంటెస్టెంట్లను చేతులెత్తి వేడుకున్నారు. దీంతో సారీ సార్ అంటూ ఇంటి సభ్యులు బాగా ఆడతామని హామీ ఇచ్చారు. తర్వాత మోనాల్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. -
సాక్ష్యాలతో సహా హారిక నిజ స్వరూపం బట్టబయలు
బిగ్‌బాస్ నాల్గో సీజన్లోనే ఈ వారం అత్యధికంగా 9.5 కోట్ల ఓట్లు వచ్చాయని నాగ్ సగర్వంగా వెల్లడించారు. అలాగే గుంటూరులో ఓ వ్యక్తికి బిగ్‌బాస్ చూపిస్తూ సర్జరీ చేశారన్న వార్తను కంటెస్టెంట్లతో పంచుకున్నారు. ఇక ఇంటిసభ్యులు హారికను బెస్ట్ కెప్టెన్‌గా, అరియానాను వరస్ట్ కెప్టెన్‌గా పేర్కొన్నప్పటికీ నాగ్ అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. అరియానా వరస్ట్ కెప్టెన్ కాదని తేల్చి చెప్పగా హారిక బెస్ట్ కెప్టెన్ కానే కాదని కుంబ బద్ధలు కొట్టి వీడియోలతో సహా నిరూపించడం విశేషం. హారిక చేసిన తప్పులన్నింటినీ సాక్ష్యాధారాలతో సహా ఆమె ముందుంచాడు. మొదట కవర్ చేయడానికి ప్రయత్నించిన హారిక ఒక్కో వీడియోను చూపిస్తూ ఉండేసరికి సమాధానం దొరక్క నీళ్లు నమిలింది. వీడియోలతో హారిక గుట్టు రట్టు నాగార్జున స్టేజీపైకి వచ్చీరాగానే హారికను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి పంచాయితీ పెట్టారు. ఈ వారం ఆమె చేసిన తప్పుల చిట్టాను ఒక్కొక్కటిగా చెప్తూ ఆమె కళ్ల ముందు కమ్ముకున్న మేఘాలను తొలగించాడు. మొదటి వీడియో క్లిప్పింగ్‌లో అభిజిత్ మోనాల్‌ను డేట్‌కు తీసుకెళ్లడమేంటని ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ తెగ ఫ్రస్టేట్ అయ్యాడు. ఓ నిమిషం కూడా ఆలోచించకుండా ఆ టాస్కే చేయనని తేల్చి చెప్పాడు. దీని గురించి నాగ్ స్పందిస్తూ.. ఒక కెప్టెన్‌గా నువ్వు.. అతడు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నా ఆపలేదు, అలాగే టాస్క్ ఆడకపోయినా ఏమీ చేయలేదు అని విమర్శించారు. అయితే అభిజిత్ మోనాల్‌ను ఏడిపించలేదని టాస్క్ చేయలేదని హారిక చెప్పగా మరో రెండు వీడియో ప్లే చేశారు. మీ మమ్మీ వస్తే నేను దాక్కుంటా, లేకపోతే నేను ఏడిపించాను అని నన్ను తిడతారు అని అభిజిత్ మోనాల్‌ను ఏడిపించానని అతడే స్వయంగా ఒప్పుకున్నాడు. () అభిజిత్‌కు ఫేవరిటిజమ్ చూపించావు మరో దాంట్లో.. మీ మమ్మీ చూస్తుంది కానీ నువ్వెందుకు నావైపు చూడట్లేదు అని అభి మోనాల్‌తో మాట్లాడాడు. మోనాల్ చూడట్లేదని బాధపడతూనే మళ్లీ ఆమె విషయంలోకి లాగొద్దని అభి బీరాలు పలుకుతాడని నాగార్జున అన్నారు. కెప్టెన్‌గా నువ్వు అభికి ఫేవరిటిజమ్ చూపించావు అని హారికను విమర్శించారు. నువ్వు మోనాల్ వల్ల కెప్టెన్ అయ్యావు కానీ అభి కోసం పని చేశావు అని ఒక్కమాటలో తేల్చి చెప్పారు. అబ్బాయిలతో పోరాడి మరీ మోనాల్ నిన్ను కెప్టెన్ చేసిందని గుర్తు చేశాడు. కానీ నామినేషన్లో నువ్వు మాత్రం సోహైల్ అఖిల్‌తో స్వాప్ కావడానికి రెడీగా ఉన్నా కూడా నిన్ను కెప్టెన్ చేసిన మోనాల్‌ను అభితో స్వాప్ చేశావు అని విమర్శించారు. (చదవండి: బిగ్‌బాస్ బిగ్ షాక్.. వరస్ట్ పెర్ఫార్మర్గా అభిజిత్) నువ్వు బెస్ట్ కెప్టెన్ కాదు.. సరైన వ్యక్తి(అఖిల్)తో స్వాప్ చేయమని అడిగితే నువ్వు అభితో చేశావు. తర్వాత ఆమె దగ్గరకు వెళ్లి కూడా అదే అన్నావు. అఖిల్‌తో అయితే నేను స్వాప్ చేయలేను అని చెప్పావు. ఈ విషయం కాసేపు పక్కన పెడితే మోనాల్‌కు సాయం చేశాను కాబట్టి ఈసారి అవినాష్‌కు సపోర్ట్ చేస్తున్నా అని ఎవిక్షన్ ఫ్రీ పాస్ అతడే పొందేలా చేశావు. కానీ అసలు మోనాల్‌కు ఎక్కడ సాయం చేశావు? అని నిలదీస్తూ దానికి సంబంధించిన వీడియో చూపించారు. అందులో బజర్ మోగిన తర్వాత హారిక నిదానంగా బట్టలు మోసుకుంటూ వచ్చింది. ఆరోజు అవినాషే గెలిచాడు. అలాంటప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం అతడికే ఎందుకు సపోర్ట్ చేశావు అని నిలదీయడంతో ఆమె సమాధానం చెప్పలేక నీళ్లు నమిలింది. అభిజిత్ అటు ఆకులు లెక్కపెట్టలేదు, మోనాల్‌తో డేట్ చేసే టాస్క్ చేయలేదు. అయినా కెప్టెన్‌గా నువ్వు ఏమీ అనలేదు.. అంటే నువ్వు ఫేవరిటిజమ్ చూపించావు. కాబట్టి నువ్వు బెస్ట్ కెప్టెన్ కాదని నాగ్ తేల్చి చెప్పడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: అవినాష్‌ను కాదని అభికే ఓటేస్తానంటోన్న బుల్లెట్ భాస్కర్) చివరికి తన తప్పిదాలను అన్నింటినీ ఒప్పుకుంటూ హారిక తన తప్పుల చిట్టాను ఏకరువు పెట్టింది. ► నామినేషన్లో మోనాల్‌ను తన కోరిక మేరకు నచ్చినవాళ్లతో స్వాప్ చేయలేదు ► ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినప్పుడు అవినాష్‌కు కాకుండా మిగతావాళ్లకు సపోర్ట్ చేయలేదు. ► అభిజిత్ టాస్కులు ఆడనప్పుడు కూడా ఏమీ అనలేదు. ► అభిజిత్ ఇంగ్లీష్ మాట్లాడితే ఏమీ అనలేదు అంటూ తన కెప్టెన్సీలో జరిగిన తప్పులను అంగీకరించింది. -
బిగ్‌బాస్ బిగ్ షాక్.. ఇక అందరూ ఎలిమినేషన్‌లోనే!
టెలివిజన్ బిగ్ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’కు లభించిన ఆదరణ మరే ఇతర షోలకు లభించదనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో గత మూడు సీజన్ల మాదిరే నాల్గో సీజన్‌కు కూడా మంచి స్పందన వస్తుంది. ఇప్పటికే ఈ సీజన్ విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకొని ముగింపు దశకు ఆమడ దూరంలో ఉంది. మరో 23 రోజుల్లో నాల్గో సీజన్ ముగుస్తుంది. ఈ తరుణంలో మిగిలిన 3 వారాలలో గతంలో చూడని టాస్కులను, ట్విస్ట్‌లను ఇచ్చి షోని మరింత రసవత్తంగా మార్చనున్నారట బిగ్‌బాస్ నిర్వాహకులు. అందులో భాగంగా ఇంటి సభ్యులకు మరో భారీ షాక్ ఇవ్వబోతున్నాడట బిగ్‌బాస్. ఇకపై బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్ ఉండడట. ప్రస్తుతం ఉన్న హారికనే బిగ్‌బాస్ నాల్గో సీజన్‌కి చివరి కెప్టెన్ అని తెలుస్తోంది. అంటే వచ్చే మూడు వారాలు ఎవరికీ ఇమ్యూనిటీ లభించదు. అందరు కంటెస్టెంట్లూ ఎలిమినేషన్ జోన్లో ఉన్నట్లే లెక్క. ఒకవేళ నామినేట్ కాని వాళ్లో లేదా స్పెషల్ పవర్ గెలుచుకున్న వాళ్లు తప్పితే.. ప్రత్యేకంగా కెప్టెన్‌కి లభించే ఇమ్యూనిటితో తప్పించుకునే చాన్స్ లేనట్లే. వీటితో పాటు హౌస్‌లో మరెన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి. -
కాళ్లు పట్టుకుంటే బాగోదు, ప్లీజ్..: అవినాష్
బిగ్‌బాస్ పెట్టిన నామినేషన్ మంట కంటెస్టెంట్ల గుండెల్లో జ్వాలగా రగులుతోంది. ఆ అగ్ని కొందరిని దహిస్తోంటే మరికొందరిలో కొత్త ఆలోచనలకు నాందిగా మారుతోంది. వెరసి తన గేమ్ తను ఆడదామనుకున్న మోనాల్ మనసు పరిపరివిధాలా ఆలోచిస్తోంది. ఇలాంటి సమయంలో అభిజిత్ ఆమెకు తోడుగా నిలుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఒకరి కోసం ఒకరు త్యాగానికి సిద్ధపడటం లేదని తెలుసుకున్న బిగ్‌బాస్ నామినేట్ అయినవారికి నామినేషన్ నుంచి తప్పించుకునేందుకు మరో అవకాశం ఇచ్చాడు. అయితే ఇందులో అవినాష్ గెలిచాడన్నది సోషల్ మీడియాలో ఎప్పుడో తేల్చేసింది. కాకపోతే ఓ చిన్న ట్విస్టుంది. అదేమిటో తెలియాలంటే నేటి బిగ్‌బాస్ స్టోరీ మీద ఓ కన్నేయండి.. మనసు విప్పి మాట్లాడుకున్న అభి, మోనాల్ నామినేషన్స్‌లో లక్ కలిసి రాలేదని అరియానా ఏడ్చేసింది. తర్వాత మోనాల్ ఒంటరిగా ఏడుస్తుంటే ఆమెను నామినేట్ చేసి హారిక వెళ్లి ఓదార్చింది. కరెక్ట్ పర్సన్‌తో స్వాప్ చేయమని చెప్పింది అఖిల్ గురించి అని మోనాల్ అసలు విషయం చెప్పడంతో హారిక తన తప్పును తెలుసుకుని సారీ చెప్పింది. నామినేషన్లో తనపై ఇష్టమొచ్చినట్లుగా అరిచిన అరియానాకు బుద్ధి లేదని కోప్పడింది. మరోవైపు ఒకరిని తొక్కి ముందుకు వెళ్లడం ఇష్టం లేదన్న అభి.. మోనాల్‌తో స్వాప్‌కు ఎలా ఒప్పుకున్నాడని అఖిల్ సందేహం వ్యక్తం చేశాడు. తర్వాత అభి, మోనాల్ రాత్రిపూట మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఒకరికి ఒకరు సారీ చెప్పుకున్నారు. జనాలను కరెక్ట్‌గా అంచనా వేసే మా నాన్నకు నచ్చావని చెప్పుకొచ్చాడు. మీ అమ్మ నన్ను చూస్తుంది.. కానీ నువ్వు చూడట్లేదు అని తన మనసులో మాట బయట పెట్టాడు. (చదవండి: బిగ్‌బాస్: అఖిల్‌కి హ్యాండిచ్చిన మోనాల్) హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం తర్వాత బిగ్‌బాస్ "ఎవిక్షన్ ఫ్రీ పాస్" ప్రవేశపెడుతూ నామినేట్ అయినవారు దాన్ని పొందేందుకు టాస్కు ఇచ్చాడు. మొదటి లెవల్లో అవినాష్, అరియానా, అఖిల్, మోనాల్ పోటీపడగా అవినాష్, అఖిల్ ఎక్కువ జెండాలు సేకరించి రెండో లెవల్‌కు వెళ్లారు. ఇందులో 'బీబీ- కష్టానికే గెలుపు 'అన్న పార్టీ పేరుతో అఖిల్, 'గమ్యం చేరే వరకు' పార్టీ పేరుతో అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కన్నీటితో అవినాష్ ప్రచారం ఇప్పుడు నాకు ఓటేస్తే నా జీవితంలో మర్చిపోలేను అంటూ అవినాష్ హారిక దగ్గర ఏడ్చేశాడు. దీంతో అరియానా అతడికి ధైర్యం నూరిపోసింది. తర్వాత ప్రచార సభలు మొదలు పెట్టారు. ఇందులో అవినాష్ మాట్లాడుతూ.. మీ ఇంటి మనిషే అనుకుని ఓటేయండి, ఫ్రెండ్స్ కాళ్లు పట్టుకుంటే బాగోదు కదా ప్లీజ్ ఓటేయండి అని మరోసారి ఎమోషనల్ అయ్యాడు. (చదవండి: సోహైల్ అర్ధరాత్రి అమ్మాయిలతో ఛాటింగ్ చేస్తాడు) హారికను అమ్మ అని పిలుస్తా... తర్వాత అఖిల్.. నా గుర్తింపే బీబీ. ఇప్పుడు మీరు వేసే ఓటు నాకు చాలా అవసరం. ఒక్క ఓటు నా జీవితాన్ని మార్చేస్తుంది అని అభ్యర్థించాడు. కానీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యేసరికి మోనాల్, సోహైల్.. అఖిల్‌కు పూలమాల వేసి ఓటేయగా అరియానా, అభి.. అవినాష్‌కు ఓటేశారు. హారిక వేసే చివరి ఓటే కీలకం కాగా ఆమె అవినాష్‌కే సపోర్ట్ చేసింది. దీంతో అవినాష్ ఇప్పటి నుంచి హారికను జీవితంలో మర్చిపోలేనని ఆమెను అమ్మ అని పిలుస్తానంటూ ఓవర్ ఎమోషనల్ అయ్యాడు. అనంతరం అతడికి రెండు వారాల వాలిడిటీ ఉండే ఇమ్యూనిటీ దక్కింది. దీన్ని ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు. దీంతో అతడికి రెండు వారాలపాటు ఇమ్యూనిటీ అన్న విషయంలో ఏమాత్రం నిజం లేదని తేలింది. (చదవండి: అభిజిత్‌కు క్లాస్ పీకిన మోనాల్ సోదరి) -
నామినేషన్స్: హారిక వల్ల మోనాల్ బలి కానుందా?
బిగ్‌బాస్ ప్రయాణం ముగింపుకు వచ్చే కొద్దీ ఇంట్లో లెక్కలు మారుతున్నాయి. ముఖ్యంగా సీక్రెట్ రూమ్ ఘట్టం నుంచి అఖిల్ గ్రాఫ్ పడిపోతూ వస్తుండగా సోహైల్‌కు ఉన్న ఆదరణ రెట్టింపు అవుతోంది. కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పాయి. అభిజిత్, సోహైల్ టాప్ 5లో ఉండటం ఖాయమని బల్లగుద్ది చెప్పాయి. ఆఖరికి అఖిల్ అన్న బబ్లూ కూడా టాప్ 5లో ఎవరుంటారన్న ప్రశ్నకు మొదట సోహైల్ పేరే చెప్పి సొంత తమ్ముడు అఖిల్‌కు షాకిచ్చాడు. అటు మోనాల్ తల్లి.. అభిజిత్ తనకు నచ్చే కంటెస్టెంట్ అని చెప్పి అఖిల్‌కు షాకిచ్చింది. అభిజిత్ తండ్రి మాత్రం కోపాన్ని తగ్గించుకుంటేనే టాప్ 2లో ఉంటావని అఖిల్‌కు విలువైన సూచన అందించాడు. మొత్తానికి టాప్ 2లో ఉంటాడనుకున్న అఖిల్ తన గొయ్యి తానే తవ్వుకుంటూ విజేత అయ్యే అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకుంటున్నాడు. గుడ్లు బయటకు తీసి బెదిరిస్తోన్న అఖిల్ తనకు ఎవరి సపోర్ట్ లేదని ఎప్పుడూ చెప్పే అఖిల్ మాట నేడు మరోసారి నిజమవుతోంది. నామినేషన్లోకి వెళ్లిన అఖిల్ తన కోసం త్యాగం చేయమని మోనాల్‌ను కోరగా ఆమె అంగీకరించలేదు. రెండు సార్లు తనను నామినేషన్లోకి పంపిన అఖిల్ కోసం ఆమె డేంజర్ జోన్లోకి వెళ్లడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అయితే ప్రోమోలో మాత్రం అభిజిత్‌తో స్వాప్ చేసుకుని మోనాల్ నామినేషన్లోకి వెళ్లినట్లు చూపించారు. దీంతో అఖిల్ కోపంగా గుడ్లు బయటకు తీసి మోనాల్‌ను మింగేసేలా చూస్తున్నాడు. ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు మోనాల్ గురించి చర్చలు మొదలు పెట్టారు. (చదవండి: అభికి లేరెవరూ పోటీ.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ..) నిజంగానే మోనాల్ అఖిల్‌కు మోసం చేసిందా? ఇన్ని రోజులు అఖిల్‌తో ఉండి, అతడి అభిమానులు వేసిన ఓట్ల వల్లే ఇంకా హౌస్‌లో ఉండగలిగిన ఆమె అతడిని మోసం చేసిందని విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం అభి పాపులారిటీ తెలుసుకుని అతడి కోసం త్యాగం చేసి హౌస్‌లో తన స్థానాన్ని పదిలంగా కాపాడుకునే ప్రయత్నమని కామెంట్లు చేస్తున్నారు. కానీ మోనాల్ తనంతట తానుగా వెళ్లి అభి కోసం త్యాగం చేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఇంట్లో ఎవరిని నమ్మకుండా ఉంటే బాగుండేది అని నాగ్ అడిగినప్పుడు ఆమె మరో ఆలోచనే లేకుండా అభిజిత్ పేరు చెప్పింది. అలాంటిది అఖిల్‌ను కాదని అభి కోసం త్యాగం చేయడంలో అర్థం లేనట్లు కనిపిస్తోంది. (చదవండి: మెహబూబ్ బదులు మోనాల్ వెళ్లిపోవాల్సింది: అభి) సాయం చేసిన మోనాల్‌కు హారిక వెన్నుపోటు! కేవలం హారిక తన కెప్టెన్సీ పవర్‌ను ఉపయోగించి అభిని కాపాడి, అతని స్థానంలోకి మోనాల్‌ను పంపించినట్లుగా కనిపిస్తోంది. అదే నిజమైతే హారిక ఇబ్బందుల్లో పడటం ఖాయం. కెప్టెన్ అవ్వాలన్న ఆమె కలను నిజం చేసిన మోనాల్‌ను నామినేషన్లోకి పంపిస్తే హారిక ఇమేజీ డ్యామేజీ అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టాప్ 5కు చేరుకునేందుకు కీలకమైన ఈ రెండు వారాల్లో తన స్నేహితుడైన అభిని రక్షించుకోవడంలో తప్పేమీ లేదని అభిక ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా మోనాల్ నామినేషన్ ఆసక్తికరంగా మారగా.. ఈ వారం అఖిల్ - మోనాల్, అవినాష్- అరియానా జంటలు నామినేషన్లో ఉన్నట్లు సమాచారం. -
ఆ అలవాటు మాత్రం పోలేదు: హారిక తల్లి
జ్యోతిని ‘స్టార్’ మదర్ అని గానీ.. ‘బిగ్’ మదర్ అని గానీ.. అనాలి! ఆమె కూతురు హారిక యూట్యూబ్ స్టార్. అందుకే ఆమె స్టార్ మదర్. హారిక ప్రస్తుతం బిగ్‌బాస్ కంటెస్టెంట్.అందుకే ఆమె బిగ్ మదర్. సింగిల్ మదర్‌గా అయితే మాత్రం.. జ్యోతిని బిగ్ స్టార్ మదర్ అనాలి! ధైర్యంగా నిలబడ్డారు. పిల్లల్ని తన సమాధానంగా పెంచారు. ‘‘నా కూతురు అని చెప్పుకోవడం కాదు గానీ ఎంత క్రియేటివ్‌గా ఆలోచిస్తుందో.. అంత హార్డ్ వర్క్ చేస్తుంది. ఇంటి పరిస్థితులను, నన్ను బాగా అర్ధం చేసుకుంటూ పెరిగింది. ఎవరైనా ఏ కొంచెం తనను ఇన్సల్ట్ చేసినా గెలిచి చూపాల్సిందే అని పట్టుపడుతుంది’’ అని కూతురు హారిక గురించి చెబుతూ మురిసిపోయారు జ్యోతి. ఆమె సింగిల్ మదర్. కూతురు అలేఖ్య హారిక, కొడుకు వంశీ కార్తీక్‌తో హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రధానంగా సింగిల్ మదర్‌గా ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లు, పిల్లల పెంపకం గురించి ‘సాక్షి’ ఆమెతో ముచ్చటించింది. చదువు గురించే ఆలోచన ‘‘పిల్లలకు డబ్బు విలువ బాగా తెలుసు. అమ్మ కష్టపడుతుంది. మనం ఇంకా ఎక్కువ కష్టపెట్టకూడదు అనేది ఇద్దరూ చిన్నతనం నుంచీ అర్ధం చేసుకున్నారు. పిల్లలు చదివే స్కూల్లోనే టీచర్‌గా చేశాను. బ్యాంక్ ఉద్యోగిగా కొన్నాళ్లు పనిచేశాను. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశాను. కుటుంబ పెద్ద ఇంటిని పట్టించుకోకపోతే ఎలాంటి అవస్థలు ఎదుర్కోవలసి వస్తుందో అన్నీ ఎదుర్కొన్నాను. తప్పనిసరై తొమ్మిదేళ్ల క్రితం ఓ రోజు పిల్లల్తో పాటు ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆ సమయంలో మొదటగా ఆలోచించింది వాళ్ల చదువులు, వాళ్ల ఫీజుల గురించే. గతమేదైనా అది పిల్లల చదువులపై ప్రభావం పడకూడదు అని ఆ రోజే గట్టిగా అనుకున్నాను. వేలెత్తి చూపినవారే..! ‘‘నా చేతిలో ఎం.ఏ సర్టిఫికెట్ తప్ప మరే ధైర్యమూ లేదు. ఎవరి సాయమూ లేదు. రెండు మూడేళ్లు చిన్నా చితకా ఉద్యోగాలు చేశాను. దగ్గర ఉన్న కొంత బంగారం కొన్ని రోజులు ఆదుకుంది. సింగిల్ మదర్‌గా సమాజంలో వివక్షను ఎదుర్కోవడం చాలా కష్టం. ఆ కష్టం అద్దె ఇంటిని వెతుక్కోవడంతో మొదలైంది. ఎవరో ఒకరి రికమెండేషన్ ఉంటే తప్ప ఇల్లు అద్దెకు ఇచ్చేవారు కాదు. పిల్లలు ఎదిగే సమయంలో వేరుపడి బయటికి రావడం అవసరమా అని అన్నవాళ్లూ ఉన్నారు. ఆ మాటలన్నీ పడుతూ కుమిలిపోతుంటే పిల్లలు డిస్టర్బ్ అవుతారని అనిపించింది. ఎంత కష్టమొచ్చినా పిల్లల కోసం నిలబడాలని బలంగా అనుకున్నాను. గతంలో చేసిన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు బొటిక్ పెట్టుకోడానికి ఉపయోగపడింది. ఆరేళ్లుగా బొటిక్ నడుపుతున్నాను. మొదట్లో వేలెత్తి చూపినవారే.. ఇప్పుడు ‘మా వాళ్లు’ అని మాట్లాడుతుంటారు. సమాజం నన్ను అన్న మాటలన్నిటికీ నా పిల్లలు సరైన సమాధానం ఇచ్చారు అనుకుంటాను. నా ధైర్యమే వచ్చింది ‘‘ఈ పనే చేయాలి, ఇది చేయకూడదు.. అని నేనెప్పుడూ పిల్లలకు ఆంక్షలు పెట్టలేదు. వాళ్లు అడిగినవన్నీ ఇవ్వగలిగాను. ఏదైనా నా శక్తికి మించినది, అంతగా అవసరం లేదని అనుకున్నదీ అడిగినప్పుడు మాత్రం వాళ్లకు నచ్చచెబుతాను. లేదంటే, వాయిదా వేస్తాను. మెల్లగా వాళ్లే అర్ధం చేసుకుంటారు. స్నేహితుల ఎంపికలోనూ వాళ్లకు కండిషన్స్ పెట్టలేదు. వంశీకన్నా హారికకు స్నేహితులు ఎక్కువ. అందరితోనూ బాగుంటుంది. ఈ కాలం పిల్లలు చాలా బాలెన్సింగ్‌గా ఉంటున్నారు. తనూ అలాగే ఉంటుంది. నా బిడ్డలపై అపోహలు, అపనమ్మకాలు, భయాలు.. ఏవీ పెట్టుకోను. ఏ వర్క్ చేయాలన్నా ధైర్యంగా మొదలు పెట్టమంటాను. వాళ్లు కూడా నాలాంటి వాళ్లే. ఒకటి అనుకుంటే వెనుకంజ వేయరు. (నవ్వుతూ). హారిక సర్ప్రైజ్ హారిక బిబిఎ మొదటి సంవత్సరంలో ఉన్నప్పటి నుంచీ పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ వచ్చింది. తనకు నెలకు ఏడు వేల రూపాయలు వచ్చేవి. అందులో రెండు వేలు తను పాకెట్‌మనీగా పెట్టుకొని ఐదు వేలు ఇంటికి ఇచ్చేది. ఆ రెండువేలను కూడా పొదుపు చేసి నా బర్త్‌డేకి ఏదో ఒక బహుమతి తెచ్చి నన్ను సర్ప్రైజ్ చేసేది. ఇప్పటికీ అదే అలవాటు ఉంది తనకు. నా కూతురే నాకు నటనలో ఓనమాలు నేర్పింది. నిజానికి తను కూడా ఎక్కడా యాక్టింగ్ క్లాస్‌కు వెళ్లింది లేదు. చిన్నప్పుడు కొంత వరకు సంగీతం నేర్చుకుంది. మోడ్రన్ డ్యాన్సులంటే తనకు బాగా ఇష్టం. ఆరేడు గంటలు విరామం లేకుండా డ్యాన్స్ చేయమన్నా చేస్తుంది. ఎక్కువ సమయం పిల్లలతో ఉంటుంటాను కాబట్టి ఇద్దరూ వాళ్ల వర్క్‌లో నన్నూ ఇన్వాల్వ్ చేస్తుంటారు. ఆ విధంగానే హారిక తను చేసే స్కిట్లలోకి నన్నూ తీసుకుంది. వంశీని కూడా. వంశీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. హారిక క్రియేటివ్ సైడ్ ఎంచుకొని వెళుతోంది. ‘‘ఇంక వర్క్ చేయకమ్మా! నీకేం కావాలో చెప్పు.. రెస్ట్ తీసుకో’’ అని పిల్లలు అంటుంటారు. ‘‘నేను డిజైన్ చేసే దుస్తుల్లో నువ్వింకా మెరవాలి కదా! అప్పుడే రెస్ట్ ఎందుకు?’’ అని హరికతో అంటూ నవ్వేస్తాను. పిల్లల పెళ్లిళ్లు గురించి అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. తమను అర్ధం చేసుకున్నవాళ్లు, అందరం కలిసి ఉమ్మడి కుటుంబంగా కొనసాగడానికి ఇష్టపడేవారైతే నెక్ట్స్ స్టెప్ అంటుంటారు పిల్లలిద్దరూ. ఇద్దరూ వారు ఎంచుకున్న రంగంలో వృద్ధిలోకి రావాలన్నదే నేను కోరుకునేది’’ అని ముగించారు జ్యోతి. – నిర్మలారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
బిగ్‌బాస్: తల్లి ప్రేమ, అందరినీ కలిపేసింది
బిగ్‌బాస్ జర్నీలో కంటెస్టెంట్లు వారి కుటుంబాలను కలసుకునే ఎపిసోడ్ ఎంతో ప్రత్యేకమైనది. ఇంటిసభ్యుల తప్పొప్పులను సరిచేస్తూ ఆటతీరు మెరుగుపర్చుకునేందుకు వారిచ్చే సలహాలు ఎంతో విలువైనవి. కానీ ఈసారి అలాంటి అవకాశమేమీ లభించలేదు. పర్సనల్‌గా మాట్లాడుకునే స్పేస్ దొరక్కపోయినా కావాల్సినంత ప్రేమను పంచారు. అదేంటో కానీ కంటెస్టెంట్ల ఒక్కో పేరెంట్ లోనికి అడుగు పెట్టేకొద్దీ లోపల ఉన్న కంటెస్టెంట్ల మనసులు శుద్ధిగా మారిపోయాయి. నామినేషన్ గొడవలను గాలికొదిలేసి అంతా ఒకే కుటుంబం అన్నట్లుగా కలిసిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఇన్ని వింతలు చోటు చేసుకున్న నేటి 74వ ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలుసుకోవాలంటే ఆలస్యం చేయకుండా చదివేసేయండి.. అవినాష్‌ను ఆడుకున్న సోహైల్ ఓ వైపు మటన్ పాడు చేసినందుకు కంటెస్టెంట్లతో చీవాట్లు, మరోవైపు నాన్‌వెజ్ తినకూడదన్న బిగ్‌బాంబ్ అవినాష్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇలాంటి సమయంలో సోహైల్, అవినాష్ పక్కన చేరి మటన్ ఆవురావురుమని లాగిస్తూ అతడికి ఊరిళ్లు తెప్పించాడు. దీంతో అవినాష్ తన జిహ్వ చాపల్యాన్ని కంట్రోల్ చేసుకునేందుకు నానా తంటాలు పడ్డాడు. సోహైల్ మాత్రం నేల మీద పాకుతూ మరీ ప్లేటు ఖాళీ చేశాడు. తర్వాత హౌస్‌లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను ఒక్కొక్కరిగా పంపించాడు. ముందుగా అఖిల్ అమ్మ దుర్గ రాగానే అతడు చంటిపిల్లాడిలా ఏడ్చాడు. (చదవండి: బిగ్‌బాస్: హారికకు ఇచ్చి పడేసిన సోహైల్) మోనాల్ ఇచ్చిన చాక్లెట్‌ను అమ్మకు.. మోనాల్ ఇచ్చిన చాక్లెట్‌ను అఖిల్ తన అమ్మకు ఇచ్చాడు. ఆమె హారికను పట్టుకుని నీలాంటి ఆడపిల్ల కావాలి అనడంతో హారిక ఆనందంతో గాల్లో తేలియాడింది. అందరి గురించి అన్నీ చెప్తున్న ఆమె మోనాల్ గురించి ఏమీ మాట్లాడకపోవడంతో తన గురించి కూడా చెప్పమని అఖిల్ నోరు తెరిచి అడిగాడు. దీంతో ఆమె మోనాల్ నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. అద్దం తెర చాటు నుంచే కొడుక్కు ముద్దు పెట్టింది. అలాగే అఖిల్‌కు అభిజిత్ అన్న, లాస్య అక్క అని చెప్పింది. ఆమె వీడ్కోలు తీసుకోగానే ఏదో మంత్రం వేసినట్టుగా అభిజిత్, అఖిల్, సోహైల్ కలిసిపోయారు. (చదవండి: ఇక చాలు ఆపండి, అభిజిత్ విన్నరేంటి?) హారికతో చక్కర్లు కొట్టేందుకు అభి ప్లానింగ్ ప్లాంక్ వాక్(నేలమీద పాకడం) పెట్టకండని అరియానా బిగ్‌బాస్‌ను వేడుకుంది. ఆ వెంటనే అందరూ పాకాలని బిగ్‌బాస్ బజర్ మోగించాడు. దీంతో చచ్చినట్లు నేలమీద పడి పాకడం మొదలుపెట్టారు. వారిని పవర్ సేవ్ మోడ్‌లో ఉంచిన బిగ్‌బాస్ హారిక తల్లి జ్యోతిని లోనికి పంపించారు. హారికను చూసుకుంటున్నందుకు ఆమె అభిజిత్‌కు ధన్యవాదాలు తెలిపింది. కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచానని హారిక గుడ్‌న్యూస్ చెప్పగా ఈసారైనా గెలుస్తావా? అని ఏడిపించింది. ఇంతలో అభిజిత్ అందుకుంటూ మీరు అనుమతిస్తే హారికను ఓసారి ఓ చోటుకు తీసుకెళ్తాను అని అడగ్గా ఆమె అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేస్ట్‌గాడు అన్నందుకు సారీ: హారిక తర్వాత లోనికి వచ్చిన అభిజిత్ అమ్మ లక్ష్మి కొడుకును చూడగానే సంతోషంతో ఏడ్చేసింది. దీంతో ఎమోషనల్ అవొద్దు అంటూ అభి తల్లిని ఓదార్చాడు. ఆమె కొడుకు కన్నా ఎక్కువగా అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా తనకు కూడా హౌస్‌లో ఓ రోజు ఉండాలనుందని మనసులోని మాట చెప్పింది. ఈ అవకాశం మళ్లీ దొరకదని బాగా ఎంజాయ్ చేయండి, కొట్టుకోండి అని సలహా ఇచ్చింది. సంతోషం పట్టలేని కంటెస్టెంట్లు డ్యాన్సు చేస్తూ కుప్పిగంతులు వేశారు. బయటకు వెళ్లాక మనం కొట్టుకున్నది చూసి నవ్వుకుంటామని అభిజిత్ చెప్పుకొచ్చాడు. దానికంతటికీ కారణమైనందుకు అఖిల్, సోహైల్‌కు థ్యాంక్స్ చెప్పిన అభి హారికకు ధన్యవాదాలు చెప్పకుండా హారికకు హగ్గిచ్చాడు. తర్వాత హారిక వేస్ట్‌గాడు అన్నందుకు సోహైల్‌కు సారీ చెప్పింది. (చదవండి: నేను గేమ్ ఆడటానికి రాలేదు: అభిజిత్) ప్రతిసారి పెళ్లి అనకు, వచ్చాక చేస్తా తర్వాత అవినాష్ అమ్మ మల్లవ్వ లోపలకు వచ్చింది. కొడుకు మీద ముద్దుల వర్షం కురిపించింది. కంటెస్టెంట్లు అందరూ బాగుండాలని రోజూ దేవుళ్లకు పూజలు చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఊరికే పెళ్లి అంటూ కలవరించొద్దని, బయటకు వచ్చాక చేస్తానని హామీ ఇచ్చింది. చాలా మంది ఇంటికొచ్చి తనను సెల్ఫీ అడుగుతున్నారని తెలిపింది. వెళ్లిపోయే ముందు హౌస్‌మేట్స్‌తో కలిసి హుషారుగా స్టెప్పులేసింది. ఆమె వెళ్లిపోగానే అవినాష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన రెండు మోకాళ్లు అరిగిపోయి ఆపరేషన్ అయిందని, తాను వచ్చేముందు నడవలేని స్థితిలో ఉండేదని అరియానాతో చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు నడవగలుగుతోందని ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి నేటి ఎపిసోడ్ కొంత భారంగా మరికొంత వినోదాత్మకంగా సాగింది. వచ్చిన వాళ్లందరూ అఖిల్‌కు బర్త్‌డే విషెస్ చెప్తూ అవినాష్‌కు పిల్లను చూస్తున్నామని చెప్పుకొచ్చారు. కానీ ఈ ఎపిసోడ్ అందరినీ మార్చేసింది. వారి మధ్య ఉన్న గొడవలను తుంచి, మనస్పర్థలను చెరిపేసింది. అందరి మనసుల్లో ప్రేమను మాత్రమే వ్యాపింపజేసింది. -
అఖిల్ బర్త్‌డే: ముద్దులు కురిపించిన మోనాల్
క్రమశిక్షణ లేకుండా పోయిన హౌస్‌ను బిగ్‌బాస్ కమాండో ఇన్స్టిట్యూట్గా మార్చాడు. ఇది టాస్క్ కాదు శిక్ష అనేట్టుగా వారితో సకల ఆటలు ఆడించాడు. పడుతూ లేస్తూ, నవ్వుతూ తుళ్లుతూ, ఆయాసపడుతూ ఆటాడుతూ చచ్చినట్లు బిగ్‌బాస్ చెప్పినట్లు నడుచుకుంటున్నారు. మరోవైపు నామినేషన్ ప్రక్రియ రోజు నిప్పులు తొక్కిన కంటెస్టెంట్ల ఆవేశం నేడు చల్లారినట్లు కనిపిస్తోంది. గొడవలు పక్కనపెట్టి తిరిగి ఎప్పటిలాగే మాట్లాడుకున్నారు. మరి నేటి బిగ్‌బాస్ షోలోని 73వ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. కమాండోలుగా మారిన కంటెస్టెంట్లు బిగ్‌బాస్ ఇల్లు కమాండో ఇన్స్టిట్యూట్గా మారింది. ఈ టాస్క్‌లో యూనిఫామ్ ధరించిన ఇంటిసభ్యులు కొన్ని డ్రిల్స్ చేయాలి. అఖిల్ కేడట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. ట్రంపెట్ సౌండ్ వస్తే మార్చి ఫాస్ట్, ఎక్సర్సైజ్, గన్‌షాట్స్ వస్తే దాక్కోవడం, పవర్ సేవ్ అనగానే ఫ్రీజ్ అవడం, స్లో మోషన్ అన్నప్పుడు స్లో మోషన్లో, ఫాస్ట్ ఫార్వర్డ్ అన్నప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో, డ్రమ్ రోల్స్ వస్తే నేలపై పాకడం వంటివి అన్నీ చేయాలి. బజర్ మోగినప్పుడు దాన్ని ముందుగా కొట్టే వ్యక్తి ఒక ఛాలెంజ్ చేసే అవకాశం పొందుతారు. ఇలా నాలుగు సార్లు బజర్ మోగుతుంది. ఒకసారి ఛాలెంజ్ పూర్తి చేసిన వ్యక్తికి మరోసారి బజర్ కొట్టే అవకాశం లేదు. (చదవండి: కెప్టెన్ అఖిల్: ఆ ముగ్గురికీ దుమ్ము దులిపాడు) పోరాడి ఓడిన సోహైల్ టాస్క్ మొదలవగానే బిగ్‌బాస్ చెప్పినట్టుగా ఆడుతూ ఎంజాయ్ చేశారు. కానీ పదేపదే స్టంట్లు చేసేందుకు మాత్రం తెగ ఆయాసపడ్డారు. మొదటి బజర్ మోగగానే సోహైల్ అన్నింటికన్నా కఠినమైన ఛాలెంజ్ స్వీకరించాడు. ఇందులో సోహైల్ స్విమ్మింగ్ పూల్‌లో ఒకవైపున ఉన్న బరువైన వస్తువులను మరోవైపుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మెహబూబ్ కోసం ఈ ఆటాడుతున్నానని చెప్పిన సోహైల్ చివరికి ఓడిపోవడంతో ఎమోషనల్ అయ్యాడు. తర్వాత బజర్ కొట్టిన అఖిల్.. పోల్‌ను వాటేసుకుని కిందకు దిగకూడదన్న సవాలు స్వీకరించి విజయం సాధించాడు. (చదవండి: బిగ్ సర్ప్రైజ్: హౌస్‌లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీస్!) ఇక నుంచి నామినేట్ చేయకండి: అభి తర్వాతది నువ్వే కొట్టాలని హారిక అభిజిత్‌కు చెప్పింది. అనుకున్నట్లుగానే అభి బజర్ కొట్టి మంకీ బార్ ఛాలెంజ్ స్వీకరించి గెలుపొందాడు. 100 శాతం ఇస్తున్నా కదా, ఈ సారి నన్ను నామినేట్ చేయకండి అని అభి అభ్యర్థించాడు. మరోవైపు అవినాష్ సరిగా దాక్కోలేదని అభిజిత్ ఫిర్యాదు చేయగా అవునని అరియానా సమర్థించింది. దీంతో అవినాష్, అరియానా కొట్టుకు చచ్చారు. నాకెవ్వరితో మాట్లాడాల్సిన అవసరం లేదు అని అరియానా స్పష్టం చేసింది. తర్వాత బజర్ కొట్టిన హారిక టైర్‌ను గార్డెన్ ఏరియాలో పది రౌండ్లు ఫ్లిప్ చేసే సవాలును స్వీకరించి పూర్తి చేసింది. (చదవండి: నాతో మర్యాదగా మాట్లాడు: అభిజిత్) అఖిల్‌కు మోనాల్ రొమాంటిక్ గిఫ్ట్ అనంతరం రాత్రి పూట హౌస్‌లో అఖిల్ పుట్టినరోజు వేడుకలు జరిపారు. అఖిలే నం.1 అని కేక్ మీద రాసి బర్త్‌డే బాయ్‌తో కేక్ కట్ చేయించారు. మొదట ఎవరికి తినిపిస్తాడు అన్న సస్పెన్స్‌కు తూట్లు పొడుస్తూ కేకు ముక్క తనే తిన్నాడు. తర్వాత మోనాల్ అఖిల్‌ను హత్తుకుని తొలిసారిగా ముద్దులు కురిపించింది. దీంతో గాల్లో తేలిపోయిన అఖిల్ రోజు నా బర్త్‌డే ఉంటే బాగుండని మనసులోని మాట బయటపెట్టాడు. ఇక ఈ సెలబ్రేషన్స్‌లో సోహైల్ ఎక్కడా కనిపించలేదు. (చదవండి: ఎలిమినేషన్: సోహైల్‌కు షాకుల మీద షాకులు) -
బిగ్‌బాస్: హారికకు ఇచ్చి పడేసిన సోహైల్
బిగ్‌బాస్ షోలో ఎలిమినేషన్ కన్నా నామినేషనే రసవత్తరంగా ఉంటోంది. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ముందే లీకవుతుండటంతో సండే ఎపిసోడ్ మీద ప్రేక్షకులకు ఆసక్తి సన్నగిల్లుతోంది. అయితే నామినేషన్ లిస్టు కూడా కొన్నిసార్లు ముందే లీకవుతున్నా వారి మధ్య జరిగే ఫైట్ చూడటానికి ప్రేక్షకులు కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. అప్పటివరకు స్నేహగీతాలు పాడుకుంటూ సంక్రాంతి సినిమా చూపించే కంటెస్టెంట్లు నామినేషన్లో కత్తులు దూసుకుంటూ ఆర్జీవీ క్రైమ్ సినిమా చూపిస్తారు. బిగ్‌బాస్ కూడా ఎల్లప్పుడూ అగ్నికి ఆజ్యం పోసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక నేటి మండే మంటలో నామినేషన్ ప్రక్రియ వేరే లెవల్లో ఉండనున్నట్లు కనిపిస్తోంది. హారిక గుండెల్లో గుచ్చిన సోహైల్ చెత్త పర్ఫామెన్స్ ఎవరు అనిపిస్తున్నారో వారి గుండెల్లో బాణాన్ని గుచ్చి నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో పదునైన మాటలతోనూ బాణాలు విసురుతూ ఇంటిసభ్యులు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అరియానా మాట్లాడుతూ.. 'నేను లాస్యకు కాంపిటీషనే కాదని అంది' అని చెప్తుండగా ఇప్పటికీ అదే ఫీలవుతున్నా అని లాస్య స్పష్టం చేసింది. దీంతో అరియానా కసితో ఆమె గుండెల్లో గునపాన్ని దింపింది. ఇక మొన్నటి ఎపిసోడ్లో హారిక సోహైల్‌ను అవమానించిన విషయం తెలిసిందే కదా! సోహైల్ వేస్ట్‌గాడు, అతడిని ఎవ్వరూ దేఖరు అని నోటికొచ్చినట్లు మాట్లాడేసింది. దీనికి హర్ట్ అయిన సోహైల్ నామినేషన్ ప్రక్రియలో తన ప్రతాపాన్ని చూపించాడు. గింతంత లేవు అంటూ ఆమె హైట్ గురించి వెక్కిరించాడు. (నేను గేమ్ ఆడటానికి రాలేదు: అభిజిత్) అంటే, నేను నాలా ఉండకూడదు: సోహైల్ మరోవైపు అభిజిత్ కూడా ఎంతచెప్పి చూసినా తన మాటతీరు మార్చుకోవడం లేదంటూ సోహైల్‌ను నామినేట్ చేశాడు. దీనికి సోహైల్ కౌంటరిస్తూ.. అంటే నేను నాలాగా ఉండకూడదు.. పాశ్గా మాట్లాడాలి అని చెప్పడంతో అభి సైలెంట్ అయిపోయాడు. వీళ్ల గొడవ ఎటు తిరిగి ఎక్కడికి వెళుతుందో కానీ సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు ప్రోమో మీద తెగ చర్చించుకుంటున్నారు. ఈ సీజన్‌కు లాస్య తొలి కెప్టెన్ అవడం మినహా అంతకు మించి ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. లాస్యతో పోలిస్తే అరియానా వందరెట్లు నయమని కామెంట్లు చేస్తున్నారు. కేవలం అభిమానుల ఓట్ల వల్లే ఆమె ఇంకా హౌస్‌లో ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక సోహైల్-అభి గొడవలో మెజారిటీ జనాలు సోహైల్కే సపోర్ట్ చేస్తున్నారు. అతడి యాసను ఎలా మార్చుకోగలడని ప్రశ్నిస్తున్నారు. ఇక అందరిముందే తనను కించపరిచిన హారికకు కూడా సోహైల్ ఇచ్చి పడేశిండు అని ఆయన అభిమానులు అంటున్నారు. కాగా సోహైల్, అరియానా, లాస్య, అభిజిత్, హారిక, మోనాల్ ఈ వారం నామినేషన్లో ఉన్నట్లు సమాచారం. (మెహబూబ్ గుడ్‌బై: అవినాష్‌పై బిగ్‌బాంబ్) -
కెప్టెన్ అఖిల్: ఆ ముగ్గురికీ దుమ్ము దులిపాడు
ఒకప్పుడు నాగార్జున ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని అభిజిత్‌ను హెచ్చరించేవారు. కానీ ఇప్పుడు సీను మారింది. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దంటూ అఖిల్‌కు చీవాట్లు పెట్టారు. అఖిల్‌ను వెళ్లగొట్టినంత పని చేసి తిరిగి లోనికి పంపించారు. ఇక కంటెస్టెంట్ల కోసం నాగార్జున భార్య అమల డ్రైఫ్రూట్స్ పంపించగా, నాగ్ మటన్ పంపిస్తానని మాటిచ్చారు. మరి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. బిగ్‌బాస్ సంధించిన ప్రశ్నలు అర్థం చేసుకోరా? కంటెస్టెంట్లు అందరూ జంటలుగా విడిపోయి నాగార్జున సాంగ్స్‌కు డ్యాన్స్ చేసి ఆయన్ను సర్ప్రైజ్ చేశారు. అందరితోపాటు అభిజిత్ కూడా డ్యాన్స్ బాగా చేశాడని నాగ్ మెచ్చుకున్నారు. అనంతరం తన భార్య అమల ఇచ్చిన బహుమతులను పంపించాడు. అందులో సంచుల కొద్దీ డ్రైఫ్రూట్స్ ఉండటంతో ఇంటిసభ్యులు సంతోషంతో ఎగిరి గంతేశారు. తర్వాత అఖిల్ ఎలిమినేషన్ గురించి మాట్లాడారు. బిగ్‌బాస్ మిమ్మల్ని ఒంటిగంటకు నిద్ర లేపి ఏకగ్రీవంగా ఒక పేరు చెప్పమన్నాడు. ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు? ఎవరు మీ గేమ్‌కు అడ్డుపడతారు? ఫైనల్స్‌కు మీకు అడ్డొచ్చేది ఎవరు? అని మూడు కండీషన్లు పెట్టారు. కానీ మీరందరూ మొదటి కండీషన్‌ను మాత్రమే పట్టుకుని వేలాడారు. అభిజిత్, లాస్య, హారిక ఎవరి పేరు వాళ్లే చెప్పుకోవడాన్ని కూడా తప్పు పట్టారు. ఈ చర్చతో హౌస్‌లో వాతావరణం వేడెక్కగా దాన్ని చల్లబరిచేందుకు గేమ్ ఆడించారు. సెల్ఫ్‌డబ్బా కొట్టుకున్న హారిక త్వరగా ఆరిపోయే చిచ్చుబుడ్డి, అందర్నీ షేక్ చేసే ఆటంబాంబు ఎవరు అని ఆటాడించారు. మెహబూబ్.. అరియానా చిచ్చుబుడ్డి, అభిజిత్ ఆటంబాంబు అని చెప్పాడు ఇక అరియానా.. చాలా ఎఫెక్టివ్‌గా కనిపించాలనుకుంటాడు, కానీ ఏమీ ఉండదని మెహబూబ్‌ను చిచ్చుబుడ్డి, దొంగ మొహపోడు అవినాష్ ఆటంబాంబు అని చెప్పుకొచ్చింది. సోహైల్.. అరియానా చిచ్చుబుడ్డి, అభి ఆటంబాంబ్ అని అభిప్రాయపడ్డాడు. మోనాల్.. సోహైల్ చిచ్చుబుడ్డి, అభి ఆటంబాంబ్ అని తెలిపింది. అభి.. సోహైల్ చిచ్చుబుడ్డి, మెహబూబ్ ఆటంబాంబు అని తెలిపాడు. హారిక.. సోహైల్ వేస్ట్‌గాడు, ఎవ్వరూ పట్టించుకోరు అంటూ అతడికి చిచ్చుబుడ్డి ఇచ్చింది. తానే ఆటంబాంబు అని సెల్ఫ్‌డబ్బా కొట్టుకుంది. సరే కానీ ఎవరికి ఇస్తావు అని నాగ్ కూడా విసుగు చెందుతూ ఆమెలా గెంతుతూ నాగ్ ఇమిటేట్ చేయడంతో కంటెస్టెంట్లు పడీ పడీ నవ్వారు. అవినాష్, నువ్వు పెళ్లికి పనికి రావేమో దీంతో బుంగమూతి పెట్టిన హారిక.. మెహబూబ్‌కు ఆటంబాంబు ఇచ్చింది. లాస్య.. సోహైల్‌కు చిచ్చుబుడ్డి, అభికి ఆటంబాంబు ఇచ్చింది. అవును కానీ లాస్యను ఆంటీ అని ఏడిపించారేంటి అంటూ నాగ్ ఆమెను పదే పదే ఆంటీ అని గుచ్చి గుచ్చి పిలిచారు. తర్వాత అవినాష్.. మోనాల్ చిచ్చుబుడ్డి, అరియానా ఆటంబాంబు అని చెప్పాడు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ నువ్వు ఆటంబాంబు ఇచ్చినా ఆమె పడదు అని తేల్చి చెప్పారు. దీంతో అవినాష్ తాము ఫ్రెండ్స్ మాత్రమేనని స్పష్టం చేశాడు. అయినా సరే నాగ్ మాత్రం నువ్వు పెళ్లికి పనికిరావేమో అని అవినాష్ మీద జోకేశారు. (చదవండి: అబ్బాయితో రిలేషన్లో ఉన్నా, కానీ బ్రేకప్ అయింది: హారిక) చంటిపిల్లాడిలా ఏడ్చేసిన అఖిల్ సీక్రెట్ రూమ్‌లో ఉన్న అఖిల్‌తో నాగ్ మాట్లాడుతూ.. "నువ్వు ఫైటర్, మరి అంత ఈజీగా ఎందుకు వచ్చేశావు?" అని నాగ్ అనుమానం వ్యక్తం చేశారు. దీనికి అఖిల్ సమాధానమిస్తూ.. "ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంటును ఎందుకు పంపిస్తారు. వీక్ కంటెస్టెంట్లతో గేమ్స్ ఆడిస్తారా? నన్ను పంపించరు అని నమ్మకముండే" అని చెప్పుకొచ్చాడు. దీనికి నాగ్ స్పందిస్తూ 'నీ అంచనా తప్పు. చాలా సీజన్లలో ఇలాగే కంటెస్టెంట్లను సీక్రెట్ రూమ్ నుంచే ఇంటికి పంపించేసిన సందర్భాలున్నాయి. నువ్వు బ్యాగు సర్దుకొని బయటకు వచ్చేయ్' అని ఆదేశించారు. దీంతో ఖంగు తిన్న అఖిల్ తనను పంపించొద్దని ప్రాధేయపడ్డాడు. దయచేసి పంపకండని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయినా సరే అంగీకరించని నాగ్ కంటెస్టెంట్లతో ఫొటో దిగి వచ్చేయ్ అని చెప్పాడు. (చదవండి: మాస్టర్ మీద కావాలని కాఫీ పోసిన హారిక) అభిజిత్ ఆలోచన దిగజారిపోయింది.. ఈ విషయం తెలిసిన మోనాల్ అఖిల్‌కు బదులు తాను వెళ్లిపోతానంటూ ముందుకొచ్చింది. కానీ అది కుదరదని నాగ్ తేల్చి చెప్పారు. అనంతరం అఖిల్‌తో టాస్క్ ఆడించారు. ఇద్దరు ఫ్రెండ్స్, నలుగురు శత్రువుల పేర్లు చెప్పమన్నారు. దీంతో అఖిల్.. సోహైల్‌కు, మోనాల్‌కు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాడు. అభి ఆమెను ఛీ కొట్టినా అతడు టాప్ 5లో ఉంటాడని మోనాల్ పాజిటివ్‌గా మాట్లాడేదని చెప్పాడు. ఇక అభిజిత్, లాస్య, హారిక, మెహబూబ్‌ను శత్రువుల జాబితాలో చేర్చాడు. మొదట అభిజిత్ గురించి మాట్లాడుతూ నీ ఆలోచన దిగజారిపోయింది అని విమర్శించాడు. "పచ్చకామెర్లు ఉన్నోడికి లోకమంత పచ్చగ కనిపిస్తదట. నువ్వు ఫేక్ అయితేనే నీకు వేరేవారు ఫేక్ అనిపిస్తారు" అని చెంపపెట్టుగా సమాధానమిచ్చాడు. (చదవండి: ఒక్కమాటతో మనసు దోచుకున్న మోనాల్) నా మీద అలాంటి జోకులా, ఇది నీ ఎథిక్స్ "సింపథీ కార్డు ఎప్పుడు పని చేయదు అన్నావు. నువ్వెన్నిసార్లు వాడావు. నేను వెళ్లిపోయేటప్పుడు ఐ హేట్ యూ అని చెప్పావు. అసలు నన్నో ఫ్రెండ్‌గా ఎప్పుడు ఇష్టపడ్డావు" అని హారికను నిలదీశాడు. నేను లేనప్పుడు నా మీద జోక్స్ వేశావు. అది నీ మెచ్యూరిటీ, ఎథిక్స్ అని లాస్యను విమర్శించాడు. ఎప్పుడూ నీకే అన్నీ చేయాలి అంటే ఎవరూ ఏం చేయరు అని మెహబూబ్‌కు బోధించాడు. తర్వాత లాస్య తన జోక్‌కు హర్ట్ అయినందుకు సారీ చెప్పగా హారిక మొదటి సారి ఐ లవ్యూ అని అఖిల్‌తో చెప్పింది. అనంతరం అఖిల్ హౌస్‌లోనే ఉంటున్నాడని నాగ్ స్పష్టం చేయడంతో సోహైల్, మోనాల్ తెగ సంతోషపడ్డారు. తర్వాత అఖిల్‌కు బంపరాఫర్ ఇచ్చారు. రెండు కుండలు పెట్టి అందులో ఒకదాంట్లో నామినేషన్, మరొకదాంట్లో కెప్టెన్సీ ఉంటుందని చెప్పాడు. అఖిల్ చేయి పెట్టిన కుండలోకెప్టెన్ ట్యాగ్ ఉండటంతో తర్వాతి వారం ఇమ్యూనిటీ పొందాడు. తర్వాత అభిజిత్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. చివర్లో రెండు కిలోల మటన్ పంపించండని అవినాష్ నాగ్‌ను అభ్యర్థించాడు. దీంతో అతడి విన్నపాన్ని ఆలకించిన నాగ్ తప్పకుండా పంపుతానని హామీ ఇచ్చారు. -
బిగ్‌బాస్: లాఠీ దెబ్బలు తిన్నాం, కోర్టు మెట్లు ఎక్కాం
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు వారి రహస్యాల గుట్టును బయటపెట్టగా లేఖలు అందుకుని ఎమోషనల్ అయ్యారు. అయితే ఇద్దరికి మాత్రం అఖిల్ లేఖలు పంపలేదు. వాళ్లకు లెటర్స్ ఎందుకు పంపలేదు? కంటెస్టెంట్లు ఏయే సీక్రెట్లను వెల్లడించారో చదివేయండి..బిగ్‌బాస్ లైఫ్ చూపిస్తుంది అని అఖిల్‌కు బోధపడింది. మరోవైపు అఖిల్ గురించి అభిజిత్ అతడి స్నేహితులతో మాట్లాడాడు. మళ్లీ లోపలికి పంపిస్తారన్న నమ్మకంతోనే కదా.. అందరూ అతడి పేరు చెప్పగానే ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు అని చెప్పుకొచ్చాడు. సీక్రెట్ రూమ్‌లో ఉన్న అఖిల్ ఈ మాటలను పూర్తిగా వ్యతిరేకించాడు. అయితే ఇదంతా ఏదో స్క్రిప్టెడ్ అని అభికి లోపల బలమైన అనుమానమే ఉంది. ఇక మటన్ చెడిపోవడంతో రేషన్ మేనేజర్ అవినాష్ మీద అందరూ గరమయ్యారు. దీంతో ఒక్క కిలో మటన్ పంపమని అతడు కెమెరాల ముందు వేడుకున్నాడు. అయినా సరే శాంతించని సోహైల్, మెహబూబ్, అరియానా.. అవినాష్‌ను చితకబాదారు. అతడిని స్విమ్మింగ్ పూల్‌లో నిమజ్జనం చేశారు. లాఠీలతో కొట్టి స్టేషన్లో వేశారు: మెహబూబ్ అనంతరం ఇంటిసభ్యుల కోసం వారి ఆప్తులు లేఖలు పంపించారు. వాటిని హౌస్‌మేట్స్‌కు ఇవ్వాలా? వద్దా? అనేది అఖిల్ నిర్ణయానికి వదిలేశారు. మరోవైపు హౌస్‌లో ఉన్న ఇంటిసభ్యులు ఇప్పటికీ ఎవరితోనూ పంచుకోని అతిపెద్ద రహస్యాన్ని చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. అప్పుడే వారికి లేఖలు అందుతాయని స్పష్టం చేశాడు. మొదట కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన మెహబూబ్ మాట్లాడుతూ.. "నా బెస్ట్ ఫ్రెండ్‌ను రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేశాను. ఆమె కోసం టికెట్ తీసుకోడానికి లోపలకు వెళ్లాను. అయితే హడావుడిలో రాంగ్ ప్లేస్‌లో బండి పార్క్ చేశాను. దీంతో అక్కడ పోలీసులు ఆమ్మాయిని అనుమానిస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నేను వెళ్లేసరికి ఆమె ఏడుస్తుండటంతో పోలీసుల మీదకు తిరగబడ్డాను. అప్పుడు వాళ్లు నా కాలర్ పట్టుకుని లాఠీలతో కొట్టారు. నన్ను, అమ్మాయిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అమ్మాయిని వెంటనే వదిలేశారు. కానీ నన్ను మాత్రం రెండు రోజుల వరకు పోలీస్ స్టేషన్ నుంచి పంపించలేదు" అని చెప్పుకొచ్చాడు. దీంతో అఖిల్ అతడికి లేఖ పంపించాడు. అవమానాలను గెలుపుగా మార్చుకున్న దేత్తడి హారిక మాట్లాడుతూ.. "అమ్మ దగ్గర దాచిన ఏకైక రహస్యం ఇది. ఆరేళ్లుగా చెప్పాలనుకుంటున్నా, ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు చెప్తున్నా. హారికను చూసి నేర్చుకోండి. లవ్వుల జోలికే వెళ్లదు అని నన్ను ఆదర్శంగా తీసుకోమని అందరికీ చెప్పేదానివి. సారీ అమ్మా.. నాలుగన్నరేళ్లు ఓ అబ్బాయితో రిలేషన్లో ఉన్నాను. ఇది రెండేళ్ల క్రితం ముచ్చట. ఎక్కువ కేరింగ్ చూపించేసరికి అలా జరిగిపోయింది. కానీ ఇప్పుడు బ్రేకప్ అయింది" అని చెప్పుకొచ్చింది. దీంతో హారికకు కూడా లేఖ అందింది. అవమానాలను గెలుపుగా మార్చుకున్నావు తల్లీ అంటూ ఆమె అన్నయ్య రాసిన ఒక్కో వాక్యం చదువుతూ కన్నీటి పర్యంతం అయ్యింది. (ఇప్పటికిప్పుడు హగ్గిస్తే కుర్చీలో నుంచి కింద పడిపోతావు) సినిమా ఛాన్స్ అనగానే రూ.80 వేలు ఇచ్చాను అవినాష్ మాట్లాడుతూ.. "సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే కిరాణ షాపులో, తర్వాత ఓ కంపెనీలో ఆఫీసు బాయ్‌గా పని చేశాను. ఓసారి ఆడిషన్ కోసం మణికొండ వెళ్లాను. రూ.80 వేలు ఇస్తే లీడ్ క్యారెక్టర్ ఇస్తామని చెప్పారు. సినిమా పిచ్చితో నేను మా నాన్నను అడిగితే ఆయన అప్పు చేసి మరీ తెచ్చారు. దాన్ని తీసుకెళ్లి నిర్మాత చేతిలో పెట్టాను. నువ్విక్కడే ఉండు, రెండు రోజుల్లో ఖమ్మం షూటింగ్ వెళ్తున్నాం అని చెప్పి జంప్ అయ్యారు. మొదటిసారి అలా మోసపోయాను. ఇప్పటికీ ఇది మా తల్లిదండ్రులకు తెలీదు" అని చెప్పాడు. అయితే ఈ విషయం తనతో చెప్పాడని అఖిల్ అతడి లేఖను చించేశాడు. కానీ అవినాష్ మాత్రం చించిన లేఖ ముక్కలను ఒకచోట చేర్చి చదివే ప్రయత్నం చేశాడు. (జబర్దస్త్‌లోకి మళ్లీ తీసుకుంటారు: అవినాష్ తమ్ముళ్లు) నా భర్త నాకంటే ఓ ఏడాది చిన్న: లాస్య లాస్య మాట్లాడుతూ.. 2017లో పెద్దల సమక్షంలో పెళ్లయింది. నేను పెళ్లాడిన వ్యక్తి పేదవాడు, నాకన్నా ఒక ఏడాది చిన్న. ఈ విషయం ఎవరికీ తెలీదు. ఈ షోకు వచ్చాక అమ్మకు షాకుల మీద షాకులిస్తున్నా. వయసు చిన్నదే అయినా మనసు గొప్పది" అని లాస్య కన్నీళ్లతో చెప్పుకొచ్చింది. ఆమెకు లేఖ అందగా దాన్ని చదువుకుంటూ మరోసారి కంటతడి పెట్టుకుంది. అభిజిత్ మాట్లాడుతూ.. "మొదటిసారి అమెరికా వెళ్లినప్పుడు న్యూయార్క్‌లో ఓ రెస్టారెంటుకు వెళ్లాను. ఆర్డర్ ఇచ్చాను. అక్కడున్న ఓ వ్యక్తి నీకోసం నేను డ్రింక్ తీసుకోవచ్చా అని అడిగాడు. ఇదేదో బాగుందని సరే అన్నాను. ఇద్దరం ఒకరి గురించి ఒకరం మాట్లాడుకున్నాం. నెంబర్ అడిగాడు. అనుమానపడుతూనే ఇచ్చాను. ఆ తర్వాత అతడు మీదమీదకొస్తుంటే ఏం చేస్తున్నావు అని అడిగితే ఇది గే బార్ అని చెప్పాడు. అప్పుడు నేను బయటకు వెళ్లి బోర్డు చదివాను" అని సీక్రెట్‌ను వెల్లడించాడు. అఖికి అందిన లేఖ చదవడం పూర్తవగానే హారిక వెళ్లి అతడికి హగ్గిచ్చింది. అర్ధరాత్రి కారు యాక్సిడెంట్.. అరియానా మాట్లాడుతూ.. "ఈ జూలై 13కు నాతో పాటు నలుగురు చనిపోయి ఒక సంవత్సరం అయ్యేది. మా ఊరుకు వెళ్దాం అని అర్ధరాత్రి కారులో బయలుదేరాం.. ఒక మనిషి బైకు మీద అడ్డు వచ్చాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒక కిలోమీటర్ వరకు కారు దూసుకెళ్లి ఎలక్ట్రిక్ పోల్‌ను గుద్దింది. కారు నుజ్జయ్యింది. బయటకు వస్తే వైరులు తగిలి షాక్ కొట్టేది. ఆ ప్రమాదం నుంచి బయట పడకుండే ఈ రోజు నేనిక్కడ ఉండేదాన్నే కాదు" అని ఎమోషనల్ అయింది. ఇది సీక్రెట్ కాదని అఖిల్ ఆమె లెటర్ చించేశాడు. (మొదటి బిడ్డను చంపుకున్నా: లాస్య కన్నీళ్లు) కుటుంబం కోసం చదువు త్యాగం చేశా: మోనాల్ మోనాల్ మాట్లాడుతూ.. "పన్నెండో తరగతి పూర్తయ్యాక నాకు బ్యాంక్‌లో జాబ్ వచ్చింది. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ చదవాలనుకున్నాను. కానీ కాలేజీ టైమింగ్, జాబ్ టైమింగ్ సెట్ కాలేదు. దీంతో ఫైనలియర్ డ్రాప్ అవుట్ అయ్యాను. ఎందుకంటే నా ఫ్యామిలీ కోసం చదువు త్యాగం చేశాను. ఇది ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు" అని ఏడ్చేసింది. దీంతో అఖిల్ ఆమెకు లేఖ పంపించాడు. అది చదువుతున్న మోనాల్ కన్నీటిని సోహైల్ తుడుస్తూ దగ్గరకు తీసుకున్నాడు. (బిగ్‌బాస్: సోహైల్‌కు గట్టి షాక్ ఇచ్చిన మెహబూబ్) డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 102 రీడింగ్ వచ్చింది: సోహైల్ సోహైల్ మాట్లాడుతూ.. "ఇప్పుడు మందు మానేశాను. కానీ కొన్నేళ్ల క్రితం ఓసారి పబ్బు నుంచి తాగొస్తున్నా. అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే 102 రీడింగ్ వచ్చింది. కారు తీసుకుపోయారు. తర్వాతి రోజు స్టేషన్‌కు వెళ్లి చలానా కట్టిన. అప్పుడు కోర్టు స్లాట్ తీసుకోమన్నారు. తల్లిదండ్రులను తీసుకురమ్మన్నారు. డూప్లికేట్ పేరెంట్స్‌ను మాట్లాడిన. కానీ మా ఫ్రెండ్ అట్లా నడవదని చెప్పిండు. కోర్టుకు వెళ్లాక ప్రతి ఒక్కడూ పదో తరగతి రిజల్ట్ వచ్చినట్టు నీ రీడింగ్ ఎంత అని అడుగుతూనే ఉన్నారు. ఆఖరికి మా తమ్ముడిని పిలిపించిన. ఇది అమ్మావాళ్లకు తెల్వదు" అని సీక్రెట్ బయటపెట్టాడు. బిగ్‌బాస్‌ను అర్థిస్తున్న అఖిల్ మా తమ్ముడు ఈ రహస్యం నాకు కూడా చెప్పలేదని అఖిల్ అతడికి లేఖను అందించాడు. అందులో మంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయని, అఖిల్, మెహబూబ్ నిన్ను బాగా చూసుకుంటున్నారని చెప్పినప్పుడు సంతోషంగా అనిపించింది అని అతని తండ్రి రాసుకొచ్చాడు. లేఖను చదివి సోహైల్ ఒక్కసారిగా ఏడ్చేశాడు. అఖిల్ గుర్తొచ్చి బాధపడ్డాడు. మరోవైపు అఖిల్ తనకు లెటర్ కావాలని బిగ్‌బాస్‌ను ప్రాధేయపడుతున్నాడు. మరి అతనికి లేఖ అందిందా? లేదా? అనేది రేపు తేలనుంది. -
రెండేళ్ల క్రితం రిలేషన్లో ఉన్నా: హారిక
అఖిల్ వెళ్లిపోయాడని మోనాల్, సోహైల్ తెగ బాధపడ్డారు. కానీ మిగతావాళ్లు మాత్రం అతడు లేడన్న విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఇక అభిజిత్ అయితే హౌస్‌లో పెద్ద తేడా ఏమీ కనిపించట్లేదని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా లక్కీ ఛాన్స్ కొట్టేసిన అఖిల్.. ఇప్పుడు అందరి ఆటను దగ్గరుండి చూస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు వారి పాలిట మరో బిగ్‌బాస్ అయి కూర్చున్నాడు. కంటెస్టెంట్ల కోసం వారి ఇంటి నుంచి లేఖలు వచ్చాయి. వాటిని అందరికీ ఇవ్వాలా? లేదా? అన్న నిర్ణయం అఖిల్ చేతిలో ఉంది. ఎలాగో మోనాల్, సోహైల్ లేఖలను వారికి అందించకుండా ఉండే ప్రసక్తే లేదు. వారితో పాటు హారిక, లాస్య, మెహబూబ్‌కు కూడా లెటర్స్ వచ్చినట్లు తాజా ప్రోమోను చూస్తుంటే తెలుస్తోంది. కానీ కొందరి లేఖలు ముక్కలు ముక్కలు చేసి పంపించడంతో వారు షాక్ తిన్నారు. ఎప్పుడూ తన ఎమోషన్‌ను బ్యాలెన్స్ చేసుకునే అభిజిత్‌కు అఖిల్ లేఖ పంపించకోవచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఆరిపోయే దీపం, నామినేషన్స్.. ఈ రెండూ అరియానా ధైర్యాన్ని దెబ్బతీశాయి. ఈ సమయంలో ఆమెకు ఇంటి నుంచి లెటర్ వస్తే ఆమె తిరిగి మామూలయ్యేందుకు అవకాశముంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: బిగ్ ట్విస్ట్: సీక్రెట్ రూమ్‌లోకి అఖిల్!) మరోవైపు ఇంటి సభ్యులు ఇంతవరకు ఎవరికీ చెప్పని రహస్యాలను బయటపెట్టాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. తుంటరి పనులు చేసే సోహైల్ తన జీవితంలో ఓ సారి నకిలీ తల్లిదండ్రులను మాట్లాడుకున్నానని చెప్పాడు. రెండేళ్ల క్రితం ఓ అబ్బాయితో రిలేషన్లో ఉన్నానని హారిక తన ప్రేమ విషయాన్ని భయపడుతూనే చెప్పేసింది. మొదటిసారి ఇండస్ట్రీలో డబ్బులు మోసపోయానని అవినాష్ తన కెరీర్లో ఎదుర్కొన్న సవాళ్లను చెప్పాడు. గతాన్ని తవ్వుతున్న అరియానా.. ఈపాటికి అలా జరిగుంటే నాతోపాటు నలుగురు చనిపోయేవాళ్లు అని చెప్పుకొచ్చింది. లాస్య.. ఈరోజు మా అమ్మకు ఇంకో షాక్ ఇవ్వబోతున్నానంటూ మరో రహస్యాన్ని బట్టబయలు చేయనుంది. ఇలా వారి గతంలో చోటు చేసుకున్న రహస్యాలను తెలుసుకోవాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: అవినాష్‌ను వెంటాడుతున్న ఆత్మహత్య ఆలోచనలు?) -
హారిక హగ్గిచ్చి ఎన్నిరోజులైతుందో: అభిజిత్
కండబలం ఉంది కానీ బుద్ధి బలం లేదని నిరూపించుకున్నారు అఖిల్, మెహబూబ్. కెప్టెన్సీ నాకు తప్ప నా ఫ్రెండుకు కూడా దక్కకూడదన్న మూర్ఖత్వంతో ప్రవర్తించి టాస్కు రద్దయ్యేందుకు కారణమయ్యారు. ఫలితంగా హౌస్‌లో ఉండేందుకు అవసరమైన ప్రాణవాయువులాంటి ఇమ్యూనిటీ ఎవరికీ అందకుండా పోయింది. వీళ్ల గొడవను చూసి అగ్లీ అన్న అభిజిత్.. హారికతో అంతకన్నా అగ్లీ గొడవకు దిగాడు. తనను పక్కనపెట్టి అఖిల్‌కే హగ్గులిస్తుందని నొచ్చుకున్నాడు. వెళ్లి వాళ్లకే నీ హగ్గులు ఇచ్చుకో అని పదే పదే అంటూ జనాలకు విసుగు తెప్పించాడు. మరి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలియాలంటే దీన్ని చదివేయండి.. గేమ్‌లో ఒంటరైన మోనాల్ బిగ్‌బాస్ ఈ వారం బాస్కెట్ బాల్స్‌ను గోల్ చేసే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఎవరి బంతిని వాళ్లే కాకుండా మిగతావాళ్లు గోల్ చేయాల్సి ఉంటుంది. బజర్ మోగినప్పుడు ఆలస్యంగా గోల్ చేసిన బంతి మీద ఎవరి ముఖం ఉంటే వాళ్లు అవుట్ అవుతారు. ఆఖరి రౌండ్లో గోల్ చేసిన బంతి మీద ఎవరి ముఖం ఉంటే వాళ్లే గెలిచినట్లు. ఈ గేమ్‌లో అభిజిత్ మైండ్ గేమ్ ఆడాడు. అతడు, హారిక కలిసి తనకు గిట్టని వ్యక్తి ముఖం ఉన్న బంతిని తీసుకుని కావాలని ఆలస్యంగా వేశారు. మోనాల్ బంతిని ఎవరూ తీసుకోలేదు. ఈ గేమ్‌లో చివరికి మెహబూబ్, అఖిల్ ఇద్దరే మిగిలారు. (అభిజిత్‌కు హౌస్‌లో ఉండే అర్హత లేదు: అమ్మ రాజశేఖర్ ) తొక్కలో రిలేషన్స్, అంతా నటిస్తారు: అఖిల్ ఈసారి నాకు సపోర్ట్ కావాలంటే నాకు సపోర్ట్ కావాలని ఇద్దరూ వాదులాడుకున్నారు. బజర్ మోగిన విషయం మర్చిపోయి బాల్ వేయకుండా కీచులాడుతూనే ఉన్నారు. చివరికి నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఎవరి బంతి వారు గోల్ చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్‌బాస్ ఇద్దరి బాధ్యతారాహిత్యం కారణంగా టాస్క్ మొత్తాన్ని రద్దు చేస్తునట్లు వెల్లడించారు. ఈ వారానికి హౌస్‌లో కెప్టెనే ఉండరని ప్రకటించాడు. దీంతో స్నేహితుల కోసం గేమ్ నుంచి తప్పుకున్న సోహైల్ చిందులు తొక్కాడు. అనవసరంగా ఇమ్యూనిటీ రాకుండా చేసుకున్నారని బాధపడ్డాడు. ఇంట్లో నాకు ఒక్కడు సపోర్ట్ చేయలేదు. ఈ ఒక్కసారి చేయుమన్నా.. అని అఖిల్ ఫ్రస్టేట్ అయ్యాడు. అందుకే ఈ తొక్కలో రిలేషన్స్ వద్దంటా, అంతా నటిస్తారు అని అలిగాడు. పనిలో పనిగా మోనాల్ మీద విసుగు ప్రదర్శించాడు. ప్రతిసారి నీ కోసం ఆడతా అని ఎందుకనుకుంటున్నావు అని మోనాల్ ముఖం పట్టుకుని అడగ్గా నాకోసం ఆడమని నీకు చెప్పలేదని ఆమె స్పష్టం చేసింది. మరోవైపు తన నెత్తి మీద దరిద్రం డ్యాన్స్ చేస్తోందని మెహబూబ్ కన్నీళ్లు పెట్టుకోగా మోనాల్, సోహైల్ ఓదార్చారు. నేను హగ్గిస్తే కుర్చీలో నుంచి పడిపోతావు.. కెప్టెన్సీ చేజారిన బాధలో నుంచి బయటకు రాని అఖిల్.. మెహబూబ్, సోహైల్‌తో మాట్లాడుతూ మీరిద్దరే ఫ్రెండ్స్, నేనే అప్పుడప్పుడు మధ్యలోకి వస్తా. ఈ రిలేషన్స్, ఫ్రెండ్షిప్స్ బక్వాస్. అందుకే దివాళీ గిఫ్ట్‌కు మీ ఇద్దరితో పాటు మోనాల్ పేరు కూడా రాయలేదు అని అసలు విషయం చెప్పాడు. వీళ్ల పంచాయితీ మీద అభిజిత్ సెటైర్లు వేశాడు. ఎందుకింత అగ్లీగా ప్రవర్తిస్తున్నారు, మంచిగా ఆడొచ్చు కదా అని తన టీమ్‌తో చర్చించాడు. కానీ మరుక్షణమే అతడు అగ్లీ టాపిక్కు తెర తీశాడు. పోయి(అఖిల్‌కు) హగ్గులిచ్చుకో పో అని హారిక మీద కోప్పడ్డాడు. నాకు హగ్గిచ్చి ఎన్ని రోజులైతుందో తెలుసా? అని అభి అలగడంతో ఈరోజు పొద్దున్నే కదా ఇచ్చానని హారిక జవాబిచ్చింది. అయినా ఇప్పటికిప్పుడు నేను హగ్గిస్తే కుర్చీలో నుంచి కింద పడిపోతావు అని హెచ్చరించింది. ఎప్పుడూ ఏదో అని, దాన్ని కవర్ చేసేందుకు హగ్గిచ్చావే కానీ సొంతంగా హగ్గిచ్చావా అని నిలదీశాడు. అలా కాసేపటి వరకు ఈ హగ్గుల గురించి హద్దులు దాటి మాట్లాడుకున్నారు. (మనసు గెలిచేసిన మోనాల్) సూట్‌కేసులు సర్దుకున్న కంటెస్టెంట్లు మరోవైపు అలక బూనిన ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సోహైల్ నలిగిపోయాడు. రేపు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను, అఖిల్ ఉంటే.. నువ్వు కచ్చితంగా అఖిల్‌నే సేఫ్ చేస్తావు అని మోనాల్‌తో అన్నాడు. దానికి ఆమె స్పందిస్తూ కానీ నేను, నువ్వు ఉంటే మాత్రం అఖిల్ నిన్నే సేఫ్ చేస్తాడని క్లారిటీ ఇచ్చింది. ఎటొచ్చీ ఈరోజు మోనాల్ మళ్లీ ఒంటరిగా మారగా అప్పటివరకూ గొడవపడ్డ సోహైల్, అఖిల్, మెహబూబ్ మళ్లీ ఒక్కటైపోయారు. ఇక అరియానా దగ్గర మోనాల్ సేఫ్ గేమ్ ఆడుతుందని చెప్పిన అవినాష్.. తర్వాత మాత్రం ఆమె దగ్గరకు వెళ్లి టాప్ 5లో ఉంటావంటూ క్రీమ్ బిస్కెట్లు వేశాడు. అనంతరం అర్ధరాత్రి ఇంటిసభ్యులను నిద్ర లేపిన బిగ్‌బాస్ వారి సూట్‌కేసులను సర్దుకోమన్నాడు. ఫినాలేకు వెళ్లడానికి ఎవరు అడ్డుపడుతారనుకుంటున్నారో వారి పేర్లను చెప్పమన్నాడు. ఎవరు ఎవరి పేర్లను చెప్పనున్నారో రేపటి ఎపిసోడ్లో తేలనుంది. (అభికి జీరో టాలెంట్, అఖిల్‌కు అహంకారం) -
అప్పులున్నాయి, ప్లీజ్ సపోర్ట్: అవినాష్ సింపథీ గేమ్?
బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ప్రేక్షకుల ఓటింగ్ మీదే ఆధారపడి ఉందని నాగార్జున మరోసారి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో చెప్పేది నమ్మకండని సూచిస్తూ షో ప్రారంభించారు. కెప్టెన్ అమ్మ రాజశేఖర్ ఇంట్లో అందరినీ శివాలెత్తిస్తారని చెప్పుకొచ్చారు. హౌస్‌లో ఎవరి మీదైనా ఫిర్యాదులున్నాయా అని ఇంటిసభ్యులను ఆరా తీశారు. అభిజిత్ మాస్టర్ తాము చెప్పేది వినిపించుకోవడం లేదని చెప్పాడు. కానీ నాగార్జున మాత్రం మాస్టర్ కెప్టెన్ అంటూ అతడినే వెనకేసుకురావడం గమనార్హం. అలాగే టీ స్టాండు టాస్క్‌లో దగ్గర ఆత్మగౌరవం అంటూ ఆట మధ్యలో నుంచి నిష్క్రమించడాన్ని తప్పు పట్టారు. ఎవరు వెలిగే దీపం, ఎవరు ఆరిపోయే దీపం? కంటెస్టెంటు వెలిగే దీపం ఆరిపోయే దీపం అభిజిత్ మోనాల్ అమ్మ రాజశేఖర్ అరియానా అవినాష్ అభిజిత్ మోనాల్ అఖిల్ అరియానా సోహైల్ మెహబూబ్ అరియానా అవినాష్ అరియానా మోనాల్ హారిక లాస్య అవినాష్ లాస్య హారిక అరియానా మెహబూబ్ సోహైల్ అరియానా అమ్మ రాజశేఖర్ అరియానా అఖిల్ అఖిల్ మోనాల్ అమ్మ రాజశేఖర్ మోనాల్‌ను దగ్గరకు తీసుకున్న అఖిల్ మోనాల్ ఒంటరిగా ఫీలవడాన్ని చూసి ఏమైందని నాగ్ ప్రశ్నించారు. అఖిల్ నామినేట్ చేయడం తట్టుకోలేకపోయానని, తనతో మాట్లాడేందుకు ప్రయత్నించా కానీ పట్టించుకోలేదని వాపోయింది.. ఈ హౌస్‌లో అతడు నా ఫ్యామిలీ మెంబర్ అనుకున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీని గురించి అఖిల్ స్పందిస్తూ ఆమె స్ట్రాంగ్ అవ్వాలనే అలా చేశానని సమాధానమిచ్చాడు. దీంతో నాగ్ ఆమె నీకు ఫ్రెండా? అంత కన్నా ఎక్కువా? అని సూటి ప్రశ్న విసిరాడు. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డ అఖిల్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఇదే ప్రశ్నను మోనాల్‌ను అడగ్గా ఆమె కూడా జస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. (చదవండి: నోయల్ అవుట్, మోకరిల్లి దండం పెట్టిన అవినాష్) తన ముఖంలో చిరునవ్వులు వెలిగించే దీపం అఖిల్.. అయితే అఖిల్‌ను వెలిగే దీపమని మోనాల్ చెప్పడంతో అతడు సంతోషం పట్టలేక ఆమెను హత్తుకుంటూ ఇన్నాళ్ల ఎడబాటుకు చెక్ పెట్టాడు. ఇక అరియానా డిక్టేటర్ కెప్టెన్ అని చాలామంది ఇంటిసభ్యులు అభిప్రాయపడ్డారు. కానీ ఆమె మాత్రం దాన్ని అంగీకరించలేదు. ఆమె కెప్టెన్ అయినప్పుడు అందరికీ సమానంగా పనులు అప్పగించలేదని మెహబూబ్ చెప్పుకొచ్చాడు. ఎందుకని ప్రశ్నిస్తే నాకు కొందరి కంఫర్ట్ కావాలని సమాధానమిచ్చిందని అరియానాలోని మరో కోణాన్ని వెల్లడించాడు. ఇక మోనాల్‌ను నామినేట్ చేసినందుకు అఖిల్‌ను ఆరిపోయే దీపమని చెప్పాడు. అఖిల్ ఆమెకు ట్రూ ఫ్రెండ్ కాదన్నాడు. (చదవండి: ఏయ్ హారిక, నోర్మూయ్: చెలరేగిన మాస్టర్) హారికను సేఫ్ చేసిన కమల్ హాసన్ నిజంగానే నాగ్ చెప్పినట్టు తొలిసారి బిగ్‌బాస్ షోలో అద్భుతం జరిగింది. కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా వర్చువల్ తెరమీద కనిపించారు. మన కంటెస్టెంట్లను వారికి, అక్కడి వాళ్లను మనవారికి పరిచయం చేశారు. మీ హౌస్ ఫుల్లుగా ఉందేంటి అనగా అది నాకు నచ్చని మాట అని కమల్ కౌంటరేశారు. అలా కాసేపు సరదాగా సంభాషించి తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించారు. అనంతరం కమల్ తెలుగు బిగ్‌బాస్‌కు వీడ్కోలు తీసుకునే ముందు హారికను సేఫ్ చేశారు. తర్వాత నాగ్ మరో ట్విస్టు ఇచ్చారు. టీ స్టాండు టాస్కులో చివరి వరకు ఆడిన మోనాల్, అవినాష్‌లు తర్వాతి వారం ఇమ్యూనిటీ పొందేందుకు మరో అవకాశాన్ని ఇచ్చారు. అందులో భాగంగా ఇద్దరికీ చెరో బుట్ట ఇచ్చి అందులో ఇంటిసభ్యులను ఒప్పించి వారి వస్తువులను త్యాగం చేయాలని కోరాలి. ఎవరి బుట్ట బరువెక్కితే వారు ఇమ్యూనిటీ పొందుతారు. (చదవండి: హిమాలయాలకు వీడ్కోలు) షో వదులుకున్నా, అప్పులున్నాయి, సపోర్ట్ చేయండి.. దీంతో అవినాష్ మిగతా మిగతా కంటెస్టెంట్ల దగ్గర బేరసారాలాడాడు. "నేను షోను వదులుకుని వచ్చాను. మళ్లీ తీసుకోమన్నారు. ఇల్లు అప్పులు క్లియర్ చేసుకోవాలి. మా కుటుంబాన్ని నేనే చూసుకోవాలి" అని తన బాధను ఏకరువు పెట్టాడు. మరోవైపు మోనాల్ తనకు ఇమ్యూనిటీ అవసరమంటూ సపోర్ట్ చేయమని కోరింది. ఇప్పుడు చేయలేనని లాస్య నిర్మొహమాటంగా చెప్పింది. మిగతావాళ్లు సపోర్ట్ చేయలేమని నేరుగా చెప్పకుండా చేతల్లో నిరూపించారు. మోనాల్‌కు సపోర్ట్ చేద్దామనుకున్న సోహైల్‌ను మెహబూబ్ వద్దని వారించాడంతో అవినాష్ కోసం తన వస్తువుల త్యాగానికి సిద్ధపడ్డాడు. ఇమ్యూనిటీ పొందిన అవినాష్ హారికకు మోనాల్‌కు సపోర్ట్ చేయాలని ఉన్నప్పటికీ అవినాష్ తనకే చేయాలని పట్టుపట్టాడు. కానీ అతడు పక్కు వెళ్లగానే మోనాల్ బుట్టలో తన వస్తువులను వేయడానికి సిద్ధపడగా అప్పటికే బజర్ మోగింది. దీంతో అఖిల్ ఒక్కడే మోనాల్‌కు సపోర్ట్ చేయగా లాస్య, సోహైల్, మెహబూబ్, అరియానా.. అవినాష్‌కు మద్దతు తెలిపారు. దీంతో మోనాల్ బుట్ట 13 కిలోలు, అవినాష్ బుట్ట 23 కిలోల బరువు తూగగా తర్వాతి వారానికి గానూ అవినాష్‌కు ఇమ్యూనిటీ లభించిందని నాగ్ ప్రకటించారు. ఇక కెప్టెన్‌గా అందరి మీదా అజమాయిషీ చేస్తోన్న అమ్మ రాజశేఖర్ రేపటి ఎపిసోడ్లో ఎలిమినేట్ అయినట్లు సమాచారం. (చదవండి: బిగ్‌బాస్: కెప్టెన్‌గా మాస్టర్, మరి ఎలిమినేషన్?) -
మొదటి బిడ్డను చంపుకున్నా: లాస్య కన్నీళ్లు
పరమ బోరింగ్‌గా మారిన పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్కు ముగియడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. బిగ్‌బాస్ ఆదేశాల ప్రకారం అన్ని హత్యలు చేస్తూనే ఏమీ ఎరగనట్టు తెగ నటించేసింది. దీంతో టాస్క్ విజయవంతంగా పూర్తి చేసింది. కానీ హత్యలన్నీ జరిగిపోయాక సోహైల్ హంతకురాలు హారిక అని తీర్పు చెప్పడంతో లాభం లేకపోయింది. ఇక ఇంటిసభ్యులు వారు చేసిన త్యాగం, సాయాలను చెప్తూ ఎమోషనల్ అయ్యారు. యాంకర్‌గా వెలుగు వెలిగిన లాస్య తన జీవితంలో చీకటి రోజులను మరోసారి గుర్తు చేసి కంటతడి పెట్టించింది. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేసేయండి.. తిండి దగ్గరే టాస్క్ ఆపేస్తారు: అరియానా ఆగ్రహం తనకు ఆమ్లెట్ కావాలని అరియానా కోరగా కుదరదని అభిజిత్ చెప్పాడు. దీంతో ప్రతిసారి ఆహారం దగ్గరే టాస్క్ ఆపేస్తారు అని అరియానా మండిపడింది. ఇందుకే, నీ గేమ్ నచ్చదని అభిజిత్‌ను ముఖం పట్టుకుని అనేసింది. దీంతో తిక్క లేచిన అభి.. నాన్సెన్స్, తెలుసుకుని మాట్లాడు అంటూ సీరియస్ అయ్యాడు. ఇక అరియానా ఆకలి బాధ చూడలేక మాస్టర్ కిచెన్‌లో దూరాడు. అతడు చెప్పినదానికి వారు తలూపకపోవడంతో మోనాల్ ప్లేటులో పట్టుకున్న ఫుడ్డును పాడు చేసి వెళ్లిపోయాడు. తర్వాత సీక్రెట్ టాస్క్‌లో భాగంగా హారిక అవినాష్‌ను రెచ్చగొట్టింది. కానీ అసలు గొడవ మాత్రం మెహబూబ్, అఖిల్ మధ్య రాజుకోవడం గమనార్హం. ఆ వెంటనే గ్రామంలో మరో హత్య జరిగిందని బిగ్‌బాస్ ప్రకటించగా అమ్మ రాజశేఖరే ఈ హత్యలు చేస్తున్నాడని అందరూ అనుమానించారు. (చదవండి: అఖిల్, నన్ను బే అనకు: సోహైల్ వార్నింగ్) సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసిన హారిక 'వెనక నుంచి హత్య చేయడమేంటి? మనిషా, దున్నాపోతా? ఛీ, తూ..' అంటూ అవినాష్ నానా మాటలు అన్నాడు. మరోవైపు హారిక మాత్రం హౌస్ లోపల అద్దంపై లిప్‌స్టిక్‌తో మెహబూబ్ చనిపోయాడు అని రాయడంతో ఆఖరు హత్య కూడా జరిగిపోయింది. తర్వాత పంచాయితీలో కూడా గ్రామపెద్ద సోహైల్ హారికే హంతకురాలని తీర్పు చెప్పాడు. కానీ అప్పటికే హత్యలు జరిగిపోవడంతో లాభం లేకపోయింది. ఇంటిసభ్యులందరూ మంటను మాత్రం చివరి వరకు ఆర్పకుండా కాపాడగలిగారు. ఇంతటితో టాస్క్ ముగిసినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. నాగార్జున చెప్పినదాని ప్రకారం మాస్టర్, సీక్రెట్ టాస్క్ గెలిచి హారిక, కెప్టెన్ అరియానా కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. నా గురించి మాట్లాడకు అరియానా: అవినాష్ టాస్కులో అనవసరంగా కోపానికి వస్తున్నావు అని అరియానా అవినాష్‌తో చెప్పుకొచ్చింది. టాస్కులో వరస్ట్ పర్ఫామెన్స్ అడిగితే నీ పేరే చెప్పేదాన్ని అనడంతో అవినాష్ హర్ట్ అయ్యాడు. 'నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు, అది నాకు నచ్చట్లేదు, నా గురించి నువ్వు మాట్లాడకపోతేనే బెటర్' అని సలహా ఇచ్చాడు. అనంతరం ఇంటిసభ్యులు సమాజం కోసం కానీ, వేరే వారి జీవితాల్లో వెలుగులు నింపిన సంఘటనలను కానీ చెప్పాల్సి ఉంటుంది. ఎవరు చెప్పింది అందరినీ కదిలించివేస్తుందో వారిని బెస్ట్‌గా ఎంపిక చేయాల్సి ఉంటుంది. (చదవండి: బిగ్‌బాస్: సోహైల్, అఖిల్ మళ్లీ గొడవపడ్డారు!) అర్ధరాత్రి అర్జంటుగా డబ్బులు కావాలన్నాడు: సోహైల్ మొదట సోహైల్ మాట్లాడుతూ.. "నా స్నేహితుడి భార్యకు అప్పటికే రెండుసార్లు గర్భస్రావం అయ్యింది. మూడోసారి గర్భం దాల్చిన సమయంలో ఓ రోజు నాకు వాడు అర్ధరాత్రి ఫోన్ చేశాడు. అర్జంట్‌గా డబ్బులు కావాలన్నాడు. సమయానికి నా దగ్గర లేకపోయేసరికి మా వాళ్లను అడిగి 15 వేలు ఇచ్చాను. కానీ తర్వాతి రోజే 10 లక్షలు అవుతుందన్నారు. సోషల్ మీడియాలో సాయం కోసం పోస్టు పెట్టి 10 లక్షలు సమకూర్చాను. వాడు ఎమోషనలై.. జీవితాంతం నీకు, సమాజానికి రుణపడి ఉంటానని నాతో అన్నాడు నాకు కూడా గర్వంగా అనిపించింది" అని చెప్పుకొచ్చాడు. (చదవండి: బిగ్‌బాస్ : ‘అమ్మ’బాబోయ్.. ఊహించని ట్విస్ట్ ఇది) జున్ను వచ్చాక నా లైఫ్ మారిపోయింది: లాస్య లాస్య మాట్లాడుతూ.. "2010లో నాకు పెళ్లి అయింది. 2012లో కలిసి ఉన్నాం. 2014 జనవరిలో నాన్న దగ్గరి నుంచి ఫోన్ వచ్చింది. ముందు సెటిల్ అవండి. తర్వాత వాళ్లే స్వయంగా పెళ్లి చేస్తాం అన్నారు. అది చూసి హ్యాపీగా ఫీలయ్యాను. కానీ అదే వారం నేను ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రికి వెళ్తే గర్భవతిని అని చెప్పారు. కానీ ఫ్యామిలీకి చెప్పుకోలేక అబార్షన్ చేసుకున్నాను. 2017లో మళ్లీ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. ఐదు నెలలకే నేను మళ్లీ గర్భవతినయ్యా. కానీ నిలవలేదు. 2018లో నా పొట్టలోకి జున్ను వచ్చాడు. ఆ తర్వాత నా లైఫ్ మారిపోయింది. కానీ నా మొదటి బిడ్డను నేనే చంపేసుకున్నాను అన్న బాధ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది" అని ఏడ్చేసింది. అందరూ లాస్య చెప్పిన ఘటనతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె చెప్పిన సంఘటనే అందరి వాటిలో ది బెస్ట్ అనిపించడంతో ఆమెకు ఒప్పో దివాళి ఎడిషన్ ఫోన్‌ను అందించారు. -
అరవకు.. అవినాష్‌ను రెచ్చగొట్టిన హారిక
"పల్లెకు పోదాం ఛలో ఛలో" టాస్కు బిగ్‌బాస్ చరిత్రలోనే బోరింగ్‌గా నిలిచిపోయేటట్లు కనిపిస్తోంది. ఈ టాస్కులో పాత్రల చిత్రీకరణ బాగానే ఉన్నా కంటెస్టెంట్ల పర్ఫామెన్స్ మరీ నీరసంగా ఉంది. ఒక్క సోహైల్ మాత్రం గ్రామపెద్దగా ఒదిగిపోయి పల్లెటూరు యాస మాట్లాడుతూ పాత్రకు న్యాయం చేశాడు. కానీ మిగతా ఇంటి సభ్యులు ఎవరూ ఆయన పెద్దరికానికి గౌరవం ఇవ్వకపోవడం గమనార్హం. కొందరు కంటెస్టెంట్లు పల్లె యాస మాట్లాడేందుకు ప్రయత్నించినా అది ఎబ్బెట్టుగా అనిపించింది. మరికొందరైతే 'రాని పని రాజా పని' అన్నట్లుగా పల్లెటూరి యాస మాట్లాడేందుకు బొత్తిగా ప్రయత్నించనేలేదు. పుకార్లు పుట్టించే పోకిరీ పిల్ల హారిక సీక్రెట్ టాస్క్ ఒక్కటే కొద్దో గొప్పో నయం అనిపించింది. అమ్మ రాజశేఖర్ మీద కాఫీ గుమ్మరించడం, అవినాష్‌కు కోపం తెప్పించడం, మెహబూబ్ పేరును లిప్‌స్టిక్‌తో రాయడం వంటి మూడు హత్యలు చేయాలని బిగ్‌బాస్ హారికను ఆదేశించాడు. వెంటనే ఆమె మాస్టర్ మీద కాఫీ పోసి ఏమీ తెలీనట్లుగా అమాయకత్వం ప్రదర్శించింది. ఇది చూసి అక్కడే ఉన్న అభికి అనుమానం వచ్చింది. ఆఖరికి మాస్టర్ కూడా ఇది టాస్క్ కావచ్చేమో అనేశాడు. కానీ అంతలోనే హారిక టాపిక్ డైవర్ట్ చేయడంతో దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. (చదవండి: సంకేతాలిచ్చిన బిగ్‌బాస్: మాస్టర్ ఎలిమినేట్?!) నేడు రెండో హత్య చేసేందుకు హారిక నడుం కట్టింది. నవ్వించే అవినాష్ నిప్పులు చెరిగేలా రెచ్చగొట్టింది. పాన్ షాపు మీద కావాలని దౌర్జన్యం చేసింది. అక్కడున్న వస్తువులను నేలపైకి విసిరి నెట్టింది. దీంతో అవినాష్‌కు బీపీ పెరిగింది. దీనికి తోడు అఖిల్ కూడా పాను షాపును చిందరవందర చేయడంతో అవినాష్ తన షాపునే నేలమట్టం చేశాడు. తమాషా చేస్తున్నారా? అని అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అరవకు, నాకు కూడా బరాబర్ వాయిస్ వస్తది అంటూ హారిక అతడిని మరింత రెచ్చిగొట్టింది. ఈ గొడవలో అఖిల్ దూరి తనకు తెలియకుండానే హారిక టాస్కు విజయవంతం అయ్యేందుకు దోహదపడ్డాడు. కాగా ఈ సీజన్లో తొలి సీక్రెట్ టాస్కును అవినాష్ విజయవంతంగా పూర్తి చేశాడు. హోటల్ టాస్కులో హోటల్ సిబ్బందిగా ఉంటూనే ఆ టీమ్ గెలవకుండా కృషి చేశాడు. ఇప్పుడు హారిక కూడా బిగ్‌బాస్ ఇచ్చిన మూడు హత్యలను పూర్తి చేసి కెప్టెన్సీ పోటీదారులుగా నిలవనున్నట్లు స్పష్టమవుతోంది. (చదవండి: అఖిల్ మాటిచ్చాడు, ఎవర్నీ లవ్ చేయడు) -
మాస్టర్ మీద కావాలని కాఫీ పోసిన హారిక
నామినేట్ అయిన వాళ్లకు ఇమ్యూనిటీ దక్కించుకునేందుకు బిగ్‌బాస్ ముఖం జాగ్రత్త టాస్క్ ద్వారా అవకాశం కల్పించినప్పటికీ ఏ ఒక్కరూ దాన్ని పొందలేకపోయారు. ఫలితంగా అభిజిత్, హారిక, అవినాష్, అమ్మ రాజశేఖర్, మోనాల్ ఈ వారం నామినేషన్లో ఉన్నారు. మరోవైపు అఖిల్, మోనాల్ మధ్య ఇంకా దూరం తగ్గలేదు. కానీ ఒంటరిగా ఉన్న మోనాల్‌కు అభి కంపెనీ ఇచ్చాడు. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో జోష్ కనిపించినా ఇంటిసభ్యులు దాన్ని నీరసంగా చేస్తున్నారు. మరి ఈ టాస్కులో ఎవరెవరు ఎలాంటి పాత్రలు పోషించారు? అసలు ఏం జరిగిందనేది తెలియాలంటే ఇది చదివేయండి.. పల్లెకు పోదాం ఛలో ఛలో బిగ్‌బాస్ ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం "పల్లెకు పోదాం ఛలో ఛలో" అనే టాస్కు ఇచ్చాడు. ఈ టాస్కులో ప్రధానమైనది మండే మంటను ఆరకుండా చూడటం. గ్రామపెద్దగా సోహైల్‌ను, అతడి భార్యగా లాస్య, వీరి కూతురిగా అరియానాను నియమించాడు. ఈ తల్లీకూతుళ్లకు అమ్మ రాజశేఖర్, అవినాష్ లైన్ వేస్తుంటారు. బాధ్యత లేని గ్రామస్థుడిగా, లాస్య తమ్ముడిగా అఖిల్ పాత్ర పోషించాడు. అభి, మోనాల్ వంటమనుషులుగా మారిపోయారు. వీరికి మిగతావారు వడ్లను దంచి చెరిగిన బియ్యం ఇస్తేనే ఆహారం ఇస్తారు. (చదవండి: 'అమ్మో' రాజశేఖర్: దేని కోసం ఇంత డ్రామా?) మూడు హత్యలు చేయమని బిగ్‌బాస్ ఆదేశం పుకార్లు పుట్టించే అమ్మాయిగా హారిక పేరును చెప్తూ ఆమెకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. రాజశేఖర్‌పై కాఫీ చల్లడం, అవినాష్‌కు కోపం తెప్పించి అరిచేలా చేయడం, చంపాలనుకునే వ్యక్తి పేరు లిప్‌స్టిక్‌తో కిటికీ మీద రాయడం వంటి మూడు హత్యలు హారిక చేయాల్సి ఉంటుంది. మాస్టర్ మీద కాఫీ పోస్తే రచ్చ అవుతుందని బిగ్‌బాస్ భావించాడు కానీ అలా జరగలేదు. ఇక పాను షాపు యజమాని అయిన అవినాష్ అరియానాను ప్రేమిస్తూ ఉంటాడు. అతడి తమ్ముడు మెహబూబ్ రౌడీయిజం చేస్తూ హారికతో లవ్ సాంగ్స్ పాడుకుంటాడు. (చదవండి: బిగ్‌బాస్ : నోయల్ రీఎంట్రీ.. సర్ప్రైజ్ వీడియో) అందరికీ కన్ను గీటి సైగలు చేసిన హారిక పల్లెటూరు టాస్క్ అని చాలామందికి పల్లె యాస మాట్లాడటానికి ప్రయత్నించారే కానీ సఫలీకృతం కాలేకపోయారు. టాస్కును కూడా పెద్దగా అర్థం చేసుకున్నట్లు కనిపించలేదు. అయితే హారిక మాత్రం పర్ఫామెన్స్ ఇరగదీసింది. మెహబూబ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూనే అబ్బాయిలందరికీ కన్ను గీటింది. అటుపక్క అరియానాను బుట్టలో వేసేందుకు నానాప్రయత్నాలు చేసిన అవినాష్‌పై సోహైల్ కన్నెర్ర జేశాడు. ఇంకోసారి ఇలాంటివి చేస్తే బహిష్కరిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇక సోహైల్, అఖిల్.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను గుర్తు చేశారు. ఇద్దరూ హీరోలు మహేశ్‌బాబు, వెంకటేష్‌లా ఫీల్ అయి కాసేపు వాదులాడుకున్నారు. అఖిల్ అలగడంతో సోహైల్ వెళ్లి బుజ్జగించాడు. అయినా సరే అఖిల్ కనీసం స్పందించకుండా అక్కడి నుంచి మౌనంగా నిష్క్రమించాడు. తిండి కోసం మెహబూబ్ ఆగ్రహం తర్వాత హారిక సరైన సమయం చూసుకుని మాస్టర్ మీద టీ గుమ్మరించి అనుకోకుండా పడిపోయినట్లు సారీ చెప్పింది. ఇక్కడ అభిజిత్‌కు అనుమానం వచ్చింది కానీ హారిక టాపిక్ డైవర్ట్ చేసి తప్పించేసుకుంది. ఆ తర్వాత మీ గ్రామంలో ఒక హత్య జరిగిందని బిగ్‌బాస్ ప్రకటించాడు. తర్వాత తనకు భోజనం పెట్టడం లేదని మెహబూబ్ నీళ్లతో మంటను ఆర్పే ప్రయత్నం చేశాడు. దీంతో సోహైల్ మగ్గును కాళ్లతో తన్నేయగా అతడు నిప్పు పెట్టేందుకు అవసరమయ్యే వంటచెరుకును దొంగిలించాడు. కానీ సోహైల్, అఖిల్ దాన్ని తిరిగి తెచ్చేసుకున్నారు. ఈరోజు నీరసంగా సాగిన ఈ టాస్క్ రేపైనా జోష్‌గా ఉంటుందేమో చూడాలి. (చదవండి: బిగ్‌బాస్: మోనాల్ కోసం మెహబూబ్ బలవుతాడా?) -
హారికకు సీక్రెట్ టాస్క్, అస్సలు ఆగట్లేదుగా!
నామినేషన్స్‌తో కాక మీదున్న హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ "పల్లెకు పోదాం చలో చలో" అనే టాస్కు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇందులో గ్రామ పెద్దగా సోహైల్, ఆయన భార్యగా లాస్య నటిస్తున్నారు. మాస్టర్ లాస్యను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మెహబూబ్ రౌడీయిజం చూపించనున్నాడు. చూస్తుంటే అతడు హౌస్‌లో విలన్‌గానే స్థిరపడిపోయేటట్లు కనిపిస్తున్నాడు. రాక్షసుల టాస్క్ నుంచి అతడికి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలనే ఇస్తున్నారు. ఈ క్రమంలో నేటి పల్లె టాస్కులో కూడా మెహబూబ్ విలన్‌గా విధ్వంసం సృష్టించనున్నాడని ప్రోమో చూస్తుంటేనే అర్థమవుతోంది. ఇక అవినాష్ పాన్ షాపును నడుపుకునే వ్యక్తిలా జీవిస్తున్నాడు. పనిలో పనిగా గ్రామ పెద్ద కూతురు అరియానాను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. (చదవండి: విశ్వాసం లేదు, చెప్పుతో కొట్టినట్లు ఉంది: మాస్టర్) ఈ వేషాలు కళ్లారా చూసిన సోహైల్ కళ్లు ఎరుపెక్కాయి. దీంతో అవినాష్ అతడి కాళ్లు పట్టుకుని బతిమాలాడు. అయినా సరే కనికరించని సోహైల్.. తన కూతురిని పటాయించాలని చూస్తే ఊర్లో నుంచి బహిష్కరిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇదిలా వుంటే సినిమా టాస్కులో మోనాల్, అఖిల్‌ను ప్రేమికులుగా చూడలేకపోయిన అభిజిత్‌కు బంపరాఫర్ లభించింది దొరికింది. మోనాల్‌కు భర్తగా నటించే ఛాన్స్ దక్కింది. టాస్కులో భాగంగా బిగ్‌బాస్ పల్లెలో ఓ హత్య కూడా జరిగింది. దీంతో అందరికీ రౌడీ రాజా మెహబూబ్ మీదే అనుమానం వస్తోంది. మరోవైపు హారికకు బిగ్‌బాస్ సీక్రెట్ ఇచ్చాడు. ఈ అవకాశం కోసం ఎన్నాళ్లుగా ఎదురు చూస్తుందో ఏమో కానీ సీక్రెట్ టాస్క్ అనగానే ఆమె సంతోషంతో ఎగిరి గంతేసినంత పని చేసింది. మరి బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఏంటి? దాన్ని దేత్తడి విజయవంతంగా పూర్తి చేసిందా? లేదా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. (చదవండి: చాక్లెట్ లొల్లి: అభి హారిక మధ్య చిచ్చు పెట్టింది) -
విశ్వాసం లేదు, చెప్పుతో కొట్టినట్లు ఉంది: మాస్టర్
అనారోగ్యంతో అవస్థ పడుతున్న నోయల్.. గంగవ్వ లాగే బిగ్‌బాస్ షో నుంచి అనూహ్యంగా వెళ్లిపోయాడు. దీంతో ఇంటిసభ్యులు భారంగా వీడ్కోలు పలికారు. కానీ వీలైనంత త్వరగా కోలుకుని నోయల్ మళ్లీ తిరిగి రానున్నాడు. మళ్లీ వచ్చేస్తాడన్న సంతోషం కన్నా ఇప్పుడు వెళ్లిపోతున్నాడన్న బాధే హారికను ఎక్కువగా కుంగదీసింది. దీంతో అభిజిత్ ఆమెను ఆప్యాయంగా హత్తుకుని ఊరడించాడు. ఇక ముందుగా ఊహించినట్లుగానే అరియానా ఎనిమిదో కెప్టెన్‌గా అవతరించింది. కానీ ప్రోమోలో మాస్టర్, అవినాష్ కలిసి ఇంటిసభ్యులను ఆటపట్టించిన క్లిప్పింగులను మాత్రం మొత్తానికే చూపించలేదు. ఇదిలా వుంటే నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో ఇంకా ఏమేం విశేషాలు, గొడవలు జరిగాయో చదివేసేయండి... ఆడవాళ్లకు మాత్రమే కెప్టెన్సీ టాస్క్ అనారోగ్యంతో బాధపడుతున్న నోయల్‌కు అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టలేదు. దీంతో ఒంటరిగా పాటలు పాడుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాతి రోజు అభి నోయల్ దగ్గర కూర్చుని మోనాల్‌పై సెటైర్ వేశాడు. ఆమె పెద్ద పెద్దగా అడుగులేసుకుంటూ ఒంటెలా నడుస్తుందని కామెంట్ చేశాడు. మరి నువ్వు దుబాయ్ షేక్‌లా కూర్చున్నావని నోయల్ అభి గురించి చెప్పుకొచ్చాడు. అనంతరం బిగ్‌బాస్ "ఆడవాళ్లకు మాత్రమే" కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఒక యాపిల్ చెట్టు, దానిపై పోటీదారుల ఫొటోలు అతికించి ఉన్నాయి. దానిపక్కనే ఒక డబ్బా(అందులో కత్తి), దాని తాళం ఉన్నాయి. మూడుసార్లు బజర్ మోగినప్పుడు అబ్బాయిలు ఆ తాళపుచెవిని సంపాదించి నచ్చిన అమ్మాయికి ఇవ్వొచ్చు. అప్పుడు ఆమె తాళంచెవి సాయంతో డబ్బాలోని కత్తి తీసుకుని ఎవరు కెప్టెన్ అవడానికి వీల్లేదని భావిస్తారో ఆమె ఫొటో అతికించి ఉన్న యాపిల్‌ను తెంపి ముక్కలు ముక్కలుగా కోయాల్సి ఉంటుంది. (చదవండి: బిగ్‌బాస్: అస్వస్థతకు గురైన నోయల్) నీ తెలివి పని చేయలేదు: హారిక ఈ టాస్క్‌లో మొదట తాళపు చెవిని దక్కించుకున్న అఖిల్‌ను తాళపు చెవి తనకివ్వమంటే తనకివ్వండని అమ్మాయిలు అర్జీ పెట్టుకున్నారు. కానీ అతడు మాత్రం అందరూ ఊహించినట్లుగా మోనాల్‌కే ఇచ్చాడు. కత్తి చేతబట్టిన మోనాల్.. హారిక కెప్టెన్సీకు అర్హురాలు కాదంటూ ఆమె ఫొటో ఉన్న పండును ముక్కలు ముక్కలు చేయడంతో దేత్తడి హర్టయ్యింది. తర్వాత తాళపు చెవిని దక్కించుకున్న మెహబూబ్ దాన్ని అరియానాకు ఇచ్చాడు. కత్తి అందుకున్న అరియానా.. లాస్య ఫొటో ఉన్న పండును నాశనం చేసి ఆమెను కెప్టెన్సీ పోటీ నుంచి తొలగించింది. తర్వాత కీ చేజీక్కించుకున్న మాస్టర్ దాన్ని అరియానాకు ఇవ్వగా ఆమె మోనాల్‌ను సైడ్ చేసేసింది. దీంతో అరియానా హౌస్‌లో రెండో మహిళా కెప్టెన్‌గా అవతరించింది. అప్పటికే ఫ్రస్టేషన్లో ఉన్న హారిక.. నీకు తెలివి ఉంది కానీ ఈ రోజు పని చేయలేదని మోనాల్‌ను నవ్వుతూనే తిట్టింది. రేషన్ మేనేజర్‌గా ఉంటే సేఫ్ అయ్యేవాడిని కెప్టెన్ అరియానా రేషన్ మేనేజర్‌గా మోనాల్‌ను ఎంచుకుంది. దీంతో మాస్టర్ ముఖం మాడ్చుకున్నాడు. నామినేషన్లో ఉన్నప్పుడు రేషన్ మేనేజర్‌గా ఇస్తే తనకు సపోర్ట్ అయ్యేదని అర్థం పర్థం లేని మాటలు అన్నాడు. అసలు తాను మోనాల్‌కు సపోర్ట్ చేసి ఉండాల్సిందని, నీకు విశ్వాసం లేదని అసహనం వ్యక్తం చేశాడు. కన్నీళ్లు రాకపోయినా కెమెరాల ముందు ఏడుపు నటించినట్లు ఈజీగా అర్థమవుతోంది. అతని ప్రవర్తనతో విసుగెత్తిన అరియానా.. రేషన్ మేనేజర్‌గా ఉంటే సేవ్ అవుతారని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. అయినా సరే పట్టించుకోని మాస్టర్.. నువ్వు చేసిన పనికి నాకు చెప్పుతో కొట్టినట్లుగా ఉందంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు. ఈ గొడవతో అరియానా తల బొప్పి కట్టింది. (చదవండి: కమెడియన్‌కు ముద్దు పెట్టిన హీరోయిన్) నీకోసం ఎదురు చూస్తూ ఉంటా: హారిక అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న నోయల్‌ను వైద్యులు పరీక్షించారు. అతడు మెడికల్ రూమ్‌కు వెళ్లడం చూసిన హారిక.. నోయల్ వెళ్లిపోవడం నాకిష్టం లేదంటూ గుక్కపెట్టి ఏడ్వడంతో ఆమెను అభిజిత్ హత్తుకుని ఓదార్చాడు. ఇక నోయల్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్.. స్పెషలిస్టుల సలహా మేరకు మరింత మెరుగైన వైద్యం అందుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిపోవాలని సూచించాడు. అయితే త్వరలోనే పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి రావాలన్నాడు. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానని హారిక నోయల్ వెళ్లిపోయిన చాలాసేపటివరకు ఏడుస్తూనే ఉంది. (చదవండి: నాన్న డిఫెన్స్ ఉద్యోగి, కానీ..: నోయల్ తమ్ముడు) -
మోనాల్ బ్రష్ చేశావా? లేదా?: అవినాష్
ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారిన బీబీ డేకేర్ టాస్క్‌కు బిగ్‌బాస్ శుభంకార్డు పలికిన విషయం తెలిసిందే. అయితే ఈ టాస్కులో చంటిపిల్లలా మారిన హారిక అమ్మ రాజశేఖర్ దగ్గర చాక్లెట్లు కొట్టేసింది. దీంతో అతడు పెద్ద సీనే క్రియేట్ చేశాడు. హారిక స్నేహితుడు అభిజిత్ కూడా ఆమె వైఖరిని తప్పుపట్టి నిందించడం గమనార్హం. దీంతో హర్టైన హారిక కన్నీళ్లు పెట్టుకుంటూ మాస్టర్ దగ్గరకు వెళ్లి అతని చాక్లెట్‌ను తిరిగిచ్చేసింది మరోవైపు మెహబూబ్ పిల్లాడిలా నవ్వుతూ అరియానాకు పదే పదే ఐ లవ్ యూ చెప్పడం గమనార్హం. (చదవండి: బిగ్‌బాస్ టాప్ 5లో ఉండేది వాళ్లే: కౌశల్) ఇక టాస్క్‌లో ఆడుకుంది చాలదని నేడు అవినాష్ ఇంటిసభ్యులను ఆటపట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు. హారికను చూసి వావ్ అని పొగుడుతూ చివర్లో తాను పరోటా బాగుంది అన్నానని పంచ్ వేశాడు. తన జుట్టు ఏమైనా పెరిగిందా? అని హారిక అడగ్గా, ఘోరంగా పెరిగిందంటూ అవినాష్ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. దీంతో ఆమె రెండు తగిలించి బుద్ధి చెప్పింది. మాస్టర్‌తో కలిసి మోనాల్ దగ్గరకు వెళ్లి పులిహోర కలుపుదామని ప్రయత్నించాడు. ఇంతకీ బ్రష్ చేశావా? లేదా అంటూనే తలకు నూనె పెట్టుకుందని అక్కడి నుంచి జారుకున్నారు. మరి అందరినీ ఆడుకుంటున్న ఈ ఇద్దరికీ ఎవరైనా కౌంటర్ ఇస్తారేమో చూడాలి. (చదవండి: సమంత హోస్టింగ్‌పై నెటిజన్ల రియాక్షన్!) -
బిగ్‌బాస్: అస్వస్థతకు గురైన నోయల్
బీబీ డే కేర్ బిగ్‌బాస్ హౌస్‌లోని కేర్టేకర్లకు మాత్రమే కాదు, బయట ప్రేక్షకులకు కూడా విసుగును తెప్పించింది. దీంతో బిగ్‌బాస్ నేడు ఆ టాస్క్‌కు ముగింపు పలికాడు. అందులో హింస-సహనానికి మారుపేర్లుగా నిలిచిన అరియానా- సోహైల్ జోడీ విజేతగా నిలిచింది. దీంతో అప్పటివరకు ఎంతో అల్లరి చేస్తూ కొంటె పనులు చేసిన హారిక కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యింది. ఇక గత కొంత కాలంగా టాస్కులు ఆడలేక ఇబ్బందులు పడుతున్న నోయల్ మరింత అనారోగ్యానికి గురయ్యాడు. నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డ అతడిని వైద్యులు పరీక్షించనున్నారు. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. చాక్లెట్ దొంగిలించిన పాపానికి హారికపై కోపం చిన్నపిల్లల్లా మారిన కంటెస్టెంట్లు దాగుడు మూతలు ఆడుకున్నారు. తర్వాత మాస్టర్ జేబులో నుంచి హారిక చాక్లెట్ కొట్టేసింది. దీంతో మాస్టర్‌తో పాటు అతడి కేర్ టేకర్ అభిజిత్ కూడా కోపానికి వచ్చాడు. చాక్లెట్ పోయిందని మాస్టర్ పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. అందరిమీద కోపంతో కేకలేశాడు. చివరికి హారిక తనే స్వయంగా వెళ్లి ఆయనతో మాట్లాడి సారీ చెప్పినా అతడు కూల్ అవలేదు. చాక్లెట్ కొట్టేసిందన్న కోపంలో అతడు హారిక మెడలు పట్టుకున్నాడని అభిజిత్.. లాస్య, నోయల్‌తో చెప్పుకొచ్చాడు. (చదవండి: నాగ్ కన్నా ఎక్కువ తీసుకుంటున్న సమంత) హారిక మీద సీరియస్ అయిన అభి పాకెట్లో నుంచి తీసుకోవడం లాక్కోవడమా? దొంగతనమా అని అభి ప్రశ్నించాడు. అది దొంగతనమే అని క్లారిటీ ఇచ్చిన హారిక ఆ సంఘటన జరిగినప్పుడే మాట్లాడకపోయావేనని తిరిగి ప్రశ్నించింది. ఎదురు ప్రశ్నకు చిర్రెత్తిన అభి.. నేనెప్పుడు మాట్లాడాలో నువ్వు నాకు నేర్పకు. ఏం మాట్లాడుతున్నావు? నాకు నచ్చినప్పుడే చెప్తానని సీరియస్ అయ్యాడు. అయితే అంతకుముందు వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లుంది. దాన్ని అభి ప్రస్తావిస్తూ.. అప్పుడు వేస్ట్ అనుకుంటూ మధ్యలో నుంచి ఎందుకు వెళ్లిపోయావు? అని మండిపడ్డాడు. దీంతో హారిక అతడికి క్షమాపణలు చెప్పి, ఇంకోసారి అలా చేయనంటూ అక్కడ నుంచి బయటకు వెళ్లిపోయింది. అభి మాటలతో కన్నీళ్లు పెట్టుకున్న హారిక ఈ గొడవకంతటికీ మూలకారణమైన చాక్లెట్‌ను మాస్టర్‌కు తిరిగిచ్చేసింది. (చదవండి: ఈసారి మహిళా విజేత ఉండకపోవచ్చు: కౌశల్) అది నా గేమ్ ప్లాన్: అభి సమయం చూసి పులిలా పంజా కొట్టడమే తన గేమ్ ప్లాన్ అని అభిజిత్ మెహబూబ్‌తో చెప్పుకొచ్చాడు. ఎంత సేపు అబ్జర్వ్ చేస్తే అన్ని సమాధానాలు దొరుకుతాయని, అది మోనాల్ విషయంలో తెలిసొచ్చిందని చెప్పాడు. మరోవైపు హారిక అందరూ పడుకున్నాక లాస్య దగ్గర చాక్లెట్లు కొట్టేసి భద్రంగా దాచుకుంది. తర్వాతి రోజు పొద్దున లేవగానే చాక్లెట్లు కనిపించక లాస్య కంగారు పడింది. రాత్రి హారిక ఇల్లంతా కలియ తిరగడం తాను చూశానని అవినాష్ చెప్పాడు. దీంతో ఆమె వెళ్లి హారికను అడగడంతో దొంగిలించిన చాక్లెట్లు ఇచ్చేస్తానంది. (చదవండి: పట్టపగలే చుక్కలు చూపించిన అరియానా) నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న నోయల్ పాపం సోహైల్‌కు అరియానా బాధ నుంచి క్షణం కూడా విముక్తి దొరకడం లేదు. ఆమెను మళ్లీ ఎత్తుకుని ఆడించాడు. నిమ్మకాయను పిండు కానీ తనను పిండద్దొని వేడుకున్నాడు. ఎప్పుడూ తన మీదే ఎక్కుతున్నావు, నేల మీద కూడా నడవాలని అరియానాకు సూచించాడు. తర్వాత మెహబూబ్ సోహైల్‌ను గట్టిగా కొరికేయడంతో ఏడవలేక నవ్వేశాడు. ఇక మోనాల్ క్లాస్ చెప్పడం కోసం అఖిల్ బ్లాక్‌బోర్డ్ మీద బొమ్మ వేశాడు. క్లాసు మొదలవగానే లవ్ అంటే మోనాల్ అని అవినాష్ ప్రేమపాఠాలు వల్లించాడు. నోయల్‌కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో అవినాష్‌కు కూడా అభిజితే కేర్ టేకర్‌గా వ్యవహరించాడు. భుజాలు కదలడం లేదని, మెడపై నరాలు పట్టేశాయని, కాళ్లు నడవడానికి కూడా రావట్లేదని నోయల్ బాధపడ్డాడు. రాత్రంతా నిద్ర కూడా పోలేదని చెప్పాడు. అయితే ఇవన్నీ భవిష్యత్తులో పెద్దది కాకుండా చూసుకోమని అభి అతడికి సలహా ఇచ్చాడు. బిగ్‌బాస్ కూడా అనారోగ్యం కారణంగా నోయల్‌కు విశ్రాంతి కల్పించాడు. అల్లరితో ఏడిపించి చివరికి తనే ఏడ్చేసింది తర్వాత బిగ్‌బాస్ ఇంటిసభ్యులతో సరదాగా నేల, నీళ్లు, మంట ఆడించారు. ఈ టాస్క్‌లో అభి కాళ్లు జారి కిందపడగా అఖిల్ గెలిచాడు. అనంతరం బీబీ డే కేర్ టాస్క్ ముగిసినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ఈ టాస్క్‌లో విన్నర్ జోడీని ఎంపిక చేయమని లాస్యను ఆదేశించగా ఆమె సోహైల్-అరియానా పేర్లను వెల్లడించింది. దీంతో బిగ్‌బాస్ వారికి స్పెషల్ గిఫ్టులు పంపారు. ఇక తనకొచ్చిన మటన్‌ను ఎవరికీ ఇవ్వనని, ఒక్కడినే తింటానని, ఎవరాపుతారో చూస్తానని సోహైల్.. అవినాష్‌కు సవాలు విసిరాడు. మరోవైపు అప్పటివరకు టాస్క్‌లో భాగంగా ఆడుకున్న చింపాంజీ బొమ్మను తనకే ఇచ్చేయమని, దాన్ని చూస్తే ఇంట్లోవాళ్లను చూసినట్లుందని అరియానా ఏడ్చేసింది. (చదవండి: నామినేషన్ అప్పుడు చూపిస్తా: అవినాష్) -
బిగ్‌బాస్: ఈ కొరుక్కోవడమేంట్రా నాయనా!
పిల్లలు దైవసమానం అంటారు. కానీ పిల్లల్లా అవతారమెత్తిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు మాత్రం రాక్షసుల్లా మారిపోయి హౌస్‌లో అరాచకం సృష్టిస్తున్నారు. కేర్ టేకర్లను బెంబేలెత్తిస్తున్నారు. తనను నామినేట్ చేశాడన్న కోపంతోనో ఏమోకానీ అరియానా.. సోహైల్‌కు నరకం అంటే ఏంటో చూపిస్తోంది. అతడు కూడా నామినేట్ చేసిన పాపానికి ఎంత టార్చర్ పెట్టినా నవ్వుతూనే భరిస్తున్నాడు. అటు అమ్మ రాజశేఖర్‌కు అభిజిత్ డైపర్ తొడగాల్సిన దుస్థితి వచ్చింది. కండల వీరుడు మెహబూబ్‌ను అఖిల్ చచ్చినట్లు ఎత్తుకుని తిప్పక తప్పలేదు. (బిగ్‌బాస్: అవినాష్‌కు ముద్దు పెట్టిన మోనాల్) సోహైల్‌కు డబుల్ టార్చర్ ఈ టాస్క్‌లో అవినాష్ అరియానాతోనే ఎక్కువ సేపు ఉంటున్నాడు. దీంతో వాళ్లిద్దరినీ వీపు మీద ఎక్కించుకుని తిప్పుతూ సోహైల్ తెగ అవస్థ పడుతున్నాడు. అలాగే లాస్యతో కలిసి అరియానాకు చుక్‌చుక్ బుండి వస్తుంది అంటూ పద్యం నేర్పిస్తుంటే వెనక నుంచి మాస్టర్ అతడి చొక్కా మీద పిచ్చి గీతలు గీశాడు. మరోవైపు హారిక కొంటె పిల్లగా మారి తోటి పిల్లల పెన్సుళ్లు కొట్టేస్తోంది. మాస్టర్‌ను గిచ్చుతూ, గిల్లుతూ ఏడిపిస్తోంది. దీంతో హారికను మాస్టర్ వచ్చి చెంప మీద కొట్టాడు. దీంతో దెబ్బకు దెబ్బ తీయాలని పరుగెత్తుకుంటూ వెళ్లిన హారిక అతడికి రెండు తగిలించింది. దీంతో మాస్టర్ హారికను కొరకగా ప్రతీకారంగా ఆమె అతడిని కొరికింది. ఇలా కాసేపటివరకు ఇద్దరూ దెబ్బలాడుకున్నారు. దీంతో అభి వచ్చి హారికను మెంటల్ అనేశాడు. (పట్టపగలే చుక్కలు చూపించిన అరియానా) అభికి దగ్గరయ్యేది ఎవరు? ఈ అన్‌సీన్ వీడియోను చూసిన నెటిజన్లు ఈ కొరుక్కోవడమేంట్రా నాయనా అని తలలు పట్టుకుంటున్నారు. టాస్క్ ముగిసే సమయానికి కేర్ టేకర్లను బతకనిచ్చేలా లేరని కామెంట్లు చేస్తున్నారు. కాగా నేటి ఎపిసోడ్లో వింతలు చోటు చేసుకోనున్నాయి. ఎప్పుడూ హారికను నిందించని అభిజిత్ ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య వైరం పెరగనున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే పెరిగిన దూరాన్ని తగ్గించుకుని అభితో క్లోజ్ అయ్యేందుకు మోనాల్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆమెతో కూర్చుని ఇప్పటివరకు తలెత్తిన బేధాభిప్రాయాలను సెటిల్ చేసుకునేందుకు అభి ఓకే చెప్పడం విశేషం. మరి నేటి ఎపిసోడ్లో అభికి ఎవరు దగ్గర కానున్నారు? ఎవరు దూరమవనున్నారు? అనేది తెలియాలంటే ఇంకొద్ది గంటలు వేచి ఆగాల్సిందే! (బిగ్‌బాస్ టాప్ 5లో ఉండేది వాళ్లే: కౌశల్) -
నేనేమైనా బేకార్ గాడినా: హారికపై అభి ఫైర్
బిగ్‌బాస్ హౌస్‌లో 50 రోజులు దాటినా ఇప్పటికీ ఫిజికల్ టాస్కులు చేయడానికి చాలామంది వెనకడుగు వేస్తున్నారు. దీంతో పోటీ లేని ఫైట్లు పెట్టే బదులు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే టాస్కులు పెడదామనుకున్నాడు బిగ్‌బాస్. అలా ఇంటిసభ్యులకు బీబీ డేకేర్ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్కులో అరియానా, అవినాష్, హారిక, మెహబూబ్, అమ్మ రాజశేఖర్ చిన్నపిల్లల్లా మారిపోయి తెగ అల్లరి చేస్తూ హౌస్‌ను దద్దరిల్లేలా చేశారు. వారి పిచ్చి చేష్టలను భరిస్తూ లాలించడం డేకేర్లకు కత్తి మీద సాముగా మారింది. ఇక నిన్నటి ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు కొందరు అది బిగ్‌బాస్ హౌసా? ఎర్రగడ్డ పిచ్చాసుపత్రా? అని విమర్శిస్తున్నారు. మరీ ఇంత అరాచకంగా ప్రవర్తిస్తారా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే వాళ్లు సరదాగా చేసిన అల్లరి నేడు గొడవలకు కారణమవనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: మా ఆయనేంటో నాకు తెలుసు: మాస్టర్ భార్య ఫైర్) పెన్సిల్ గొడవలో దెబ్బలు తగిలించుకున్నారు పిల్లలంటేనే చిలిపిచేష్టలు, అల్లరి, గిల్లికజ్జాలు, మారాం చేయడం చేస్తుంటారు. ఈ క్రమంలో కొంటె పిల్లగా మారిన హారిక.. అమ్మ రాజశేఖర్‌ను పదేపదే ఏడిపించసాగింది. ఆయన కూడా గుక్కపెట్టి నోట్లో వేలేసుకుని ఏడ్చినట్లు నటించాడు. తర్వాత మాస్టర్ హారిక దగ్గర నుంచి పౌచ్ దొంగిలించాడు. అప్పుడు ఇద్దరికీ తగవులాట జరిగింది. ఇది పూర్తవగానే హారిక.. అరియానా దగ్గర పెన్సిల్ లాక్కుని మరో గొడవ రాజేసింది. అయితే తన వస్తువు లాక్కుంటే అరియానా ఊరుకుంటుందా.. మీద పడి మరీ తీసుకోవడంతో హారికకు దెబ్బలు తగిలాయి. (చదవండి: పట్టపగలే చుక్కలు చూపించిన అరియానా) పంచాయితీకి దారి తీస్తున్న అల్లరి పనులు ఇక ఈ పిల్ల గొడవలు నేడు పెద్ద తగాదాలుగా మారనున్నట్లు కనిపిస్తోంది. దొంగతనం గురించి తెలియకపోతే మధ్యలో రాకు అని మాస్టర్ మోనాల్ మీద అరిచాడు. ఇక హారికపై కూడా అభి ఫైర్ అయ్యాడు. పాకెట్లలో నుంచి తీసుకోవడమంటే లాక్కోవడమా? దొంగతనమా? అని అడిగాడు. అది అప్పుడే మాట్లాడాల్సి ఉంటుంది అని హారిక కౌంటర్ వేయడంతో నేనెప్పుడు మాట్లాడాలో నువ్వు నాకు నేర్పకు అని సీరియస్ అయ్యాడు. నేనేమైనా బేకార్ గాడినా, నీతో కూర్చుని మాట్లాడటం తప్పితే వేరే పనిలేదా? అని నోటికొచ్చినట్లు అంటున్నాడు. అభి అంత కఠినంగా మాట్లాడతాడని కలలో కూడా ఊహించని హారిక వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. మరి ఈ గొడవ సద్దుమణుగుతుందా? లేదా? అనేది తెలియాంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. -
మోనాల్‌కు మంచి చెప్పినా చెడే చేసింది
బిగ్‌బాస్ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎలాగుంటుంది అనేది కళ్లకు కట్టినట్లు చూపించారు హౌస్మేట్స్. టాస్క్‌లో భాగంగా చిన్నపిల్లల్లా మారిపోయిన కంటెస్టెంట్లు వీళ్లు పిల్లలు కాదు, పిడుగులు కూడా కాదు. రాక్షసులు అనిపించారు. కేర్ టేకర్లకు అంతలా నరకం చూపించారు. మరోసారి సోహైల్, అరియానాకే జోడీ పడింది. దీంతో తనను నామినేట్ చేసిన సోహైల్‌కు అరియానా పట్టపగలే చుక్కలు చూపించింది. మరి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో వాళ్లు ఎంత హంగామా చేశారు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో చదివేసేయండి.. నామినేట్ చేసినందుకు మాస్టర్ కంటతడి అభిజిత్‌తో మాట్లాడి అన్నింటినీ క్లియర్ చేస్కో అని అఖిల్ మోనాల్‌కు సూచించాడు. ఆమె బాధలో కూరుకుపోవడంతో ఇతడే ముందుకు వచ్చి పోనీ నేను మాట్లాడనా అని అనుమతి తీసుకుని అభిజిత్ దగ్గరకు వెళ్లాడు. ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే క్లారిటీ వస్తుందని అఖిల్ సూచించడంతో అందుకు ఓకే చెప్పిన అభి రేపు మాట్లాడదామన్నాడు. ఇక సోహైల్ నామినేట్ చేసినందుకు మాస్టర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే మాస్టర్ చేయెత్తి సైగలు చేయడం వల్లే తనను నామినేట్ చేశానని సోహైల్ స్పష్టం చేశాడు. అయినా సరే అతడు అర్థం చేసుకోకపోవడంతో ఫ్రస్టేట్ అయ్యాడు. తర్వాతి వారం నామినేషన్ కోసం ఇప్పటినుంచే తనతో గొడవలు పెట్టుకోండని సోహైల్ ఇంటిసభ్యులకు సూచించాడు. (చదవండి: మా ఆయనేంటో నాకు తెలుసు: మాస్టర్ భార్య ఫైర్) మోనాల్ ముద్దుతో గాల్లో తేలిన అవినాష్ గార్డెన్ ఏరియాలో అఖిల్, మోనాల్ ఒకచోట అరియానా, అవినాష్ మరోచోట కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. మోనాల్‌ను చూసి అవినాష్ ఐ హేట్ యూ చెప్పగా, అతడిని కూల్ చేసేందుకు ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి నుదుటిపై ముద్దు పెట్టింది. ఊహించని పరిణామానికి షాకైన అవినాష్.. నా పొలంలో మొలకలొచ్చాయ్ అంటూ సంతోషంతో ఎగిరి గంతేశాడు. మై హీరోయిన్ మోనాల్ అని గొంతు చించుకుని కేకలు పెట్టాడు. అసలైన A అవినాష్ అని అర్థమైందంటూ సంబరపడిపోయాడు. (చదవండి: చెండాలమైన కారణాలతో నామినేట్ చేయకు) మోనాల్ వల్ల అఖిల్, సోహైల్‌కు మనస్పర్ధలు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అంటూ అఖిల్, మెహబూబ్‌ను నోయల్ నామినేట్ చేశాడని సోహైల్ అతనితోనే చర్చించాడు. ఇది విన్న మోనాల్.. అఖిల్ దగ్గరకు వెళ్లి నీ గురించి సోహైల్ మాట్లాడుతున్నాడని చెప్పడంతో మనస్పర్ధలు మొదలయ్యాయి. తన గురించి ఏదో వెనకాల మాట్లాడుతున్నాడని అఖిల్ అనవసరంగా ఏదేదో ఊహించుకుని ఫీలయ్యాడు. దీంతో తానేమీ మాట్లాడలేదని సోహైల్ అఖిల్‌కు క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇక్కడి విషయాలు అక్కడ చెప్పొద్దని చెప్పినా ఎందుకు ఇలానే చేస్తున్నావ్ అని సోహైల్ మోనాల్‌ను నిలదీశాడు. (చదవండి: సమంత హోస్టింగ్‌పై నెటిజన్ల రియాక్షన్!) అరియానాను రెడీ చేసిన అవినాష్ బిగ్‌బాస్ 'బీబీ డేకేర్' అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా అరియానా, అవినాష్, హారిక, మెహబూబ్ చంటిపిల్లలుగా మారిపోయారు. అవినాష్‌కు నోయల్, అరియానాకు సోహైల్, మెహబూబ్‌కు అఖిల్, హారికకు మోనాల్, అమ్మ రాజశేఖర్‌కు అభిజిత్ కేర్ టేకర్లుగా వ్యవహరించారు. లాస్య సంచాలకురాలిగా వ్యవహరించింది. కేర్ టేకర్లు పిల్లలకు అన్నం తినిపిస్తూ, బట్టలు మారుస్తూ, డైపర్లు వేయాల్సి ఉంటుంది. చదువు చెప్పడంతో పాటు ఎంటర్టైన్ చేయాలి. వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఏడుపు సౌండ్ వినిపించగానే డైపర్లు మార్చాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ఒకరు విజేతగా నిలవగా వారికి ప్రత్యేక ప్రయోజనం ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. సోహైల్‌కు టార్చర్ చూపిస్తున్న అరియానా టాస్క్ మొదలు కాగానే పిల్లలు పిడుగుల్లా మారిపోయి, ఆ తర్వాత రాక్షసుల్లా అవతరించారు. మెహబూబ్ కోరిక మేరకు అఖిల్ అతడిని పదేపదే ఎత్తుకుని తిప్పాడు. అరియానా సోహైల్ మీద ఎక్కి చల్‌చల్ గుర్రం ఆడుకుంది. ఇక తోటి చంటోడైన మాస్టర్‌ను హారిక రాచిరంపాన పెట్టింది. సోహైల్ తనను నాన్న అని పిలవద్దని ఎంత మొత్తుకున్నా సరే అరియానా అతడిని పదేపదే నాన్న అని పిలుస్తూ అమ్మ ఎక్కడ? అని ప్రశ్నలు కురిపించింది. తర్వాత ఆమెను సోహైల్ భుజాలపై ఎత్తుకుని ఊరేగించాడు. ఆమె మాత్రం ముఖానికి రంగు పూస్తూ తలపై నారింజ పొట్టు వేసి, పౌడర్ కొట్టి, పిలక వేసి నానా రకాలుగా టార్చర్ పెట్టింది. తర్వాత పిల్లలందరికీ డైపర్లు వేశారు. కొంటె హారిక అభిజిత్ మీద నీళ్లు పోస్తూ తెగ అల్లరి చేసింది. పెన్సిల్ కోసం హారిక, అరియానా ఫైట్ క్లాసులో ఏబీసీడీలు నేర్పుతున్న సోహైల్‌ను పిల్లలు తిక్క ప్రశ్నలతో విసిగించారు. ఎంత విసిగించినా సరే అతడు మాత్రం ఓపికతో సమాధానాలు చెప్తూ ముఖం మీద నవ్వును చెరగనీయలేదు. మాస్టర్ హారిక చాక్లెట్లు కొట్టేశాడు. తర్వాత ఆమె కోపంతో అరియానా పెన్సిల్ కొట్టేయడంతో ఇద్దరూ తలబడ్డారు. చివరకు అరియానా తన పెన్సిల్‌ను తాను దక్కించుకుంది. ఈ క్రమంలో ఇద్దరూ దెబ్బలు తగిలించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ టాస్క్ అయిపోయే సమయానికి ఈ చిచ్చరపిడుగులు.. కేర్ టేకర్లను ఎన్ని చెరువుల నీళ్లు తాగిస్తారో చూడాలి. (చదవండి: అభిజిత్‌కు అన్యాయం చేసిన అరియానా) -
వాళ్లకు సాయం చేయను: ఏడ్చేసిన హారిక
బిగ్‌బాస్ ఇంటిని కాపాడుకోవడం వచ్చో తెలీదో కానీ హౌస్‌ను చెడగొట్టమంటే మాత్రం క్షణాల్లో చేసి చూపించారు కంటెస్టెంట్లు. రాక్షసులు కూడా ఇంత క్రూరత్వంగా ప్రవర్తించరేమో అనిపించారు. మంచి మనుషులకు ముప్పు తిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగించారు. అయినా సరే వాటిని ఓపికగా భరిస్తూ సహనంతో ఒక్కో టాస్కు పూర్తి చేస్తూ వస్తున్న మనుషులు విజయానికి కేవలం ఓ అడుగు దూరంలో ఉన్నారు. ఇంతకీ వాళ్లు చేసిన టాస్కులేంటి? ఏయే రాక్షసులను మంచిగా మార్చారనేది చదివేయండి.. మంచి మనుషుల సహనానికి అగ్ని పరీక్ష బిగ్‌బాస్ "కొంటె రాక్షసుడు- మంచి మనుషులు" అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు. బిగ్‌బాస్‌పురం రాజ్యంలో అరియానా, అవినాష్, అఖిల్, మెహబూబ్, హారిక రాక్షసుల టీమ్‌లో ఉండగా, మిగతావారు మంచి మనుషుల టీమ్‌లో ఉన్నారు. ఒక్కో రాక్షసుడిని మంచి మనిషిగా మార్చిన ప్రతీసారి రావణుడి బొమ్మలోని పది తలల్లో రెండింటిని పగలగొట్టాల్సి ఉంటుంది. అలా ముగ్గురు రాక్షసులనైనా మార్చితేనే మనుషుల టీమ్ గెలిచినట్లు లెక్క. కానీ మంచి మనుషుల పనులకు కొంటె రాక్షసుల ఆటంకం కలిగిస్తూ ఉంటారు. అయినా సరే వాళ్లు సహనాన్ని వీడకూడదు. (చదవండి: తొలిసారి అవినాష్.. సోహైల్ రిక్వెస్ట్) తన ప్రతాపం చూపించిన అరియానా టాస్కు ప్రారంభం అవగానే అరియానా నిజమైన రాక్షసిలా మారిపోయింది. నోయల్‌పై గుడ్డు పగలగొట్టినా అతడు కిక్కురుమనలేదు. అవినాస్ రావణుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి డైలాగులు వల్లించాడు. మెహబూబ్ సోహైల్‌ను బతికుండగానే మమ్మీలా మార్చాడు. హారిక మనుషులను క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఇలా నానారకాలుగా చిత్ర చిత్ర హింసలు పెడుతూ వారిపై ముప్పేట దాడి చేశారు. ఇక మంచి మనుషుల టీమ్‌లోని నోయల్ రాక్షసులను మార్చేందుకు సూక్తులు చెప్తూ నానా యత్నాలు చేశాడు. రాక్షసుల ఆవేశాన్ని చల్లార్చేందుకు మాస్టర్ శాంతి శాంతి అంటూ మొత్తుకుంటున్నా ఆ మాట చెవినెక్కించుకునేవాళ్లే కరువయ్యారు. డ్రెస్సు లోపల ఐస్ గడ్డలు వేసినా మాస్టర్ శాంతి జపం వదల్లేదు. అవినాష్ వీరావేశంతో అరుంధతి డైలాగ్ చెప్పేయడంతో మోనాల్ అతడిని హత్తుకుంది. మంచి మనిషిగా మారిన రాక్షసుడు అఖిల్ కొంటె రాక్షసులను మంచిగా మార్చేందుకు బిగ్‌బాస్ మంచి మనుషులకు ఓ టాస్క్ ఇచ్చాడు. స్విమ్మింగ్ ఫూల్‌లోని పూలతో 50 దండాలు అల్లాల్సి ఉంటుందని తెలిపాడు. కానీ అల్లిన దండలను రాక్షసులు పారేస్తూ మెడలో చుట్టుకుంటూ సర్వనాశనం చేశారు. అయినా సరే మంచి మనుషులు ఎట్టకేలకు టాస్క్‌ను పూర్తి చేసి రాక్షసుడి రెండు తలలు పగలగొట్టారు. రాక్షసుడిగా ఉన్న అఖిల్‌ను వాళ్ల టీమ్‌లో కలిపేసుకున్నారు. అనంతరం మంచి మనుషులకు క్లేతో 100 ప్రమిదలను తయారు చేయాలని బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. కానీ వాళ్లు దీపాలు తయారు చేయడం మొదలు పెట్టగానే రాక్షసులు క్లేలను దొంగిలించారు. (చదవండి: పాపం..మోనాల్‌ను మళ్లీ టార్గెట్ చేశారు) గుట్టు చప్పుడు కాకుండా పని చేసిన నోయల్ నోయల్ స్టోర్ రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టకుని మరీ దీపాలు చేస్తుండటంతో మెహబూబ్, అవినాష్ ఆ రూమ్‌లోకి చొరబడి మరీ వాటిని దొంగిలించారు. మరోవైపు సోహైల్ హారికను ఆపేందుకు పట్టుకోగా ఆమె అతడిని పంటితో గాటు పెట్టడంతో కేకలు పెట్టాడు. ఇక లాస్య వాళ్లు కష్టపడి మాస్టర్ దగ్గర దీపాలు దాచిపెట్టగా మిగతావారు అతడి దగ్గరి నుంచి లేపేశారు. అయినా సరే 160 దీపాలు తయారు చేసి విజయం సాధించడంతో మంచి మనుషుల టీమ్ ఆనందం పట్టలేక ఇది ఫన్ అంటూ గెంతులేశారు. (చదవండి: నాన్న ఇస్త్రీ పని చేసేవాడు, ఇదిగో ప్రూఫ్: నోయల్) తన పేరు ముందు చెప్పలేదని ఫీలైన హారిక అయితే మంచి మనుషుల జాబితాలో కలిపేస్తారన్న భయంతో రాక్షసులు అరియానా, మెహబూబ్, అవినాష్ ఒక్క బాత్రూమ్లోనే దూరిపోయారు. ఇక అప్పటికే మెహబూబ్ పేరు చెప్పినప్పటికీ అతడి జాడ దొరక్కపోవడంతో చేతికి చిక్కిన హారికను మంచి మనిషిగా మార్చారు. నిజానికి హారికకు మనిషిగా మారడం ఇష్టమే అయినప్పటికీ మొదట తన పేరు చెప్పలేదని ఫీలయింది. అలాంటప్పుడు తాను మనిషిగా మారినా వారికి ఎలాంటి సాయం చేయను అంటూ ఏడుస్తూ కెమెరాలతో చెప్పుకొచ్చింది. (చదవండి: బిగ్‌బాస్: సోహైల్నే ఏడిపించిన అవినాష్!) -
చెప్పొద్దనుకున్నా, కానీ నా అసలు పేరు: అరియానా
నేడు బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు అందరూ వారి జీవితాలను కుదిపేసిన సంఘటనలను గురించి చెప్తూ విషాదంలో మునిగిపోయారు. తమతమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఓసారి జీవితంలోకి వెనుదిరిగి చూసుకున్నారు. ఈ క్రమంలో వారు కోల్పోయినవి, సంపాదించుకున్నవి గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అలా ప్రతీఒక్కరూ వారి వారి సంఘటనలను చెప్తూ ప్రేక్షకులను కంటతడి పెట్టించారు. ఎవరు ఏయే విషయాలను పంచుకున్నారో చదివేయండి.. అరియానాకు సారీ చెప్పి తినిపించిన సోహైల్ మోనాల్ అవినాష్‌కు గోరు ముద్దలు తినిపిస్తే అతడు మాత్రం అరియానాకు తినిపించాలని తహతహలాడాడు. అటువైపేమో తన ఫ్రెండ్స్ లిస్టులో లేదన్న అరియానాకు సోహైల్ సారీ చెప్తూ నూడుల్స్ తినిపించాడు. దీంతో అవినాష్ తినిపించబోతే వద్దని వారించింది. 'అతడు పెడితే తింటావు, కానీ నేను పెడితే తినవు కదా' అని అవినాష్ నిలదీయడంతో మారు మాట్లాడలేక తినేసింది. బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు. స్విమ్మింగ్ ఫూల్‌లోని బాటిల్స్ తీసుకుని ఎత్తిన బాటిల్ దించకుండా తాగాలి. ఇందులో ఇందులో మెహబూబ్ ఏడు బాటిల్స్ తాగేయగా కుమార్ ఆరింటిని తాగి టాస్క్ విజయవంతంగా పూర్తి చేశారు. తర్వాత అందరూ కలిసి పిచ్చి పట్టినవాళ్లలా అరిచారు. (చదవండి: బిట్టూ అని వాళ్లే పిలవమన్నారు: సుజాత) మా అమ్మానాన్న విడిపోయారు: అరియానా ఇంటి సభ్యులందరి చిన్ననాటి ఫొటోలను బిగ్‌బాస్ టీవీలో చూపించడంతో కంటెస్టెంట్లు ఎగ్జైట్ అవుతూనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత అందరికీ ఫొటోఫ్రేములను పంపించగా వారిని కదిలించిన స్టోరీలను చెప్పుకొచ్చారు. అరియానా తన అసలు పేరు అర్చన అని తెలిపింది. కానీ ఇది ఎవరికీ చెప్తాననుకోలేదని అంది. "మా అమ్మానాన్న లవ్ మ్యారేజ్. నేను కడుపులో ఉన్నప్పుడు విడిపోయారు. అమ్మ ఒక్కతే నన్ను, అక్కని పెంచింది. నాలుగు వేల జీతానికి యాంకరింగ్ చేశా. ఐదు వందలకు కూడా ఈవెంట్స్ చేశా. అలా అర్చన నుంచి అరియానాగా మారి ఇక్కడి వరకు వచ్చాను" అని చెప్పుకొచ్చింది. తన కుటుంబం అంటే ఇష్టమని చెప్పిన మోనాల్ బిగ్‌బాస్ తర్వాత ఇంకా ఎన్నో కుటుంబాలు తనకోసం ఉన్నాయని తెలిపింది. (చదవండి: నేను లేకపోతే ఏమైపోతావో: అవినాష్) సింగరేణి ముద్దుబిడ్డ బిగ్‌బాస్‌కు వచ్చిండు "సింగరేణిలో మా నాన్న పని చేస్తాడు. ఓసారి అండర్‌గ్రౌండ్‌లో తల మీద రాయి పడింది. దాని ప్రభావం ఈ మధ్య బయటపడింది. ఆయనకు తలలో రక్తం గడ్డకట్టింది. అంతకుముందే రోడ్డు ప్రమాదంలో ఒక కిడ్నీ పోయింది. అయినా ఉద్యోగం చేస్తూ మా ఐదుగురిని పెంచి పోషించాడు. నాన్నంటే నాకు చాలా ఇష్టం. సింగరేణి ముద్దుబిడ్డ సయ్యద్ సోహైల్ బిగ్‌బాస్‌కు వచ్చిండని మా నాన్న హ్యాపీగా ఫీలవుతాడు" అని సోహైల్ సంతోషించాడు. "మాది అద్దె ఇల్లు. తమ్ముడు కూరగాయలు అమ్మేవాడు. తల్లిదండ్రులు, తమ్ముడు నాకోసం కష్టపడేవారు. వాళ్లు బాగుంటే నాకంతే చాలు" అంటూ మెహబూబ్ భావోద్వేగానికి లోనయ్యాడు. అమ్మ అందరి ఇళ్లల్లో పని చేసేది: నోయల్ "నేను అమ్మతో క్లోజ్‌గా ఉంటాను. ఉన్న ఆస్తినంతా నాకిచ్చేస్తానని అమ్మ చెప్పింది. దీంతో అందరూ నాకు అమ్మను దూరం చేశారు. అమ్మకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆస్పత్రికి వెళ్లాను. బతకడం కష్టమన్నారు. డబ్బు ఇచ్చి అమ్మను రెండేళ్లపాటు కాపాడుకున్నాను. డబ్బు ఎప్పుడైనా వస్తుంది, కానీ మనుషులను మిస్ అవ్వద్దు 'అని మాస్టర్ అందరికీ మంచి సందేశం ఇచ్చాడు. "అమ్మ అందరి ఇళ్లల్లో పని చేసేది. నాన్న చిరంజీవి ఫ్యాన్. నేను మొదటిసారి 'ఈగ' సినిమాలో కనిపించా. నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాన్నను తీసుకుని థియేటర్‌కు వెళ్లాను. అందరూ నాతో ఫొటోలు దిగుతుంటే నాన్న షాకయ్యారు. కానీ తర్వాత నాన్నతో నేను సెల్ఫీ దిగాను" అని నోయల్ తెలిపాడు. (చదవండి: గంగవ్వలాగే నన్ను పంపించేయండి: నోయల్) నాన్న పేరు కూడా మర్చిపోయా: హారిక "అది నా ఇంటర్మీడియట్. అమ్మమ్మ ఇంటికి రమ్మంటే వెళ్లాను. అక్కడ మా అమ్మానాన్న విడిపోతున్నారని చెప్పారు. నాన్న దగ్గర ఉండమన్నారు. అమ్మ మాత్రం ఖాళీ బ్యాగుతో వెళ్లిపోయింది. ఆ తర్వాత ఒకరోజు నేను, అన్న అమ్మ దగ్గరకు వెళ్లిపోయాం. అలా ఐదు సంవత్సరాలుగా నాన్నకు చాలా దూరమొచ్చేశాను. ఓ సారైతే ఆయన పేరు కూడా గుర్తు రాలేదు. నాన్న.. మేమెప్పుడూ తిరిగి చూడలేదు, మీరెప్పుడు తిరిగి చూడలేదు. తిరిగి చూసినరోజు మేం ఆగిపోతాం. అందుకే మేం తిరగం. కానీ ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. అమ్మా.. నువ్వు లేని రోజు నేను లేను, నాన్న లేని లోటు అన్న తీర్చాడు, అతడు నా వెన్నెముక" అని హారిక ఎమోషనల్ అయింది. కిచెన్‌లో దొంగలు పడ్డారు రాత్రి పూట కిచెన్‌లో దొంగలు పడ్డారు. హారిక, లాస్య పిస్తాలు దొంగతనం చేసి తినేశారు. తర్వాత వాటితో గవ్వలాట ఆడారు. అయితే వీరిని దూరం నుంచి చూసిన అఖిల్ ఒక్కసారిగా భయపెట్టాడు. తర్వాత ఈ ముగ్గురినీ నోయల్ భయపెట్టాడు. అంతా కలిసి అక్కడి వస్తువులను లాగించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ విషయం కనిపెట్టిన దివి కూడా ఆ గ్యాంగ్‌లో చేరి దొరికినంత తినేసింది. (చదవండి: సుజాత ఎలిమినేట్, 'పోకిరీ'పై ప్రతీకారం) -
ఐదేళ్లుగా నాన్నకు దూరమయ్యా: హారిక
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో ఆరో వారం కొనసాగుతోంది. ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మరో కంటెస్టెంటు హౌస్‌ను వీడేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటికే ఫిజికల్ టాస్కులు, బ్రెయిన్ టాస్కులు ఇచ్చిన బిగ్‌బాస్ వారి అందరినీ తమ తమ జీవితాలలో ఓసారి వెనక్కు తిరిగి చూసుకునే అవకాశాన్ని కల్పించాడు. ఏం కోల్పోయారనేది గుర్తు చేస్తూ, ఏం సాధించారనేది వారితోనే చెప్పిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటిసభ్యులు ఎమోషనల్ అవుతున్నారు. ముఖ్యంగా కన్నీళ్ల వరద పారించే మోనాల్‌కు తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను పంపించారు. అది చూసి చనిపోయిన తండ్రిని గుర్తు చేసుకుంటూ నాన్న ప్రేమకు దూరమయ్యానని వెక్కివెక్కి ఏడ్చింది. నాన్నతో కలిసి దిగిన ఏకైక ఫొటో ఇదేనని దాన్ని గుండెకు హత్తుకుంది. (చదవండి: బిగ్‌బాస్ వాళ్లే బిట్టూ అని పిలవమన్నారు) 'డబ్బు ఎప్పుడైనా వస్తుంది, కానీ మనుషులను మిస్సయితే చాలా కష్టమ'ని మాస్టర్ కంటతడి పెట్టుకున్నాడు. ఇక దివి కూడా తన చిన్ననాటి ఫొటోను ముద్దాడుతూ.. డాడీ అంటే చాలా ఇష్టం, మమ్మీ అంటే ఇంకా ఎక్కువ ఇష్టమని కన్నీళ్లతో వారిపై ప్రేమ కురిపించింది. తాను బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చినందుకు మా నాన్న గర్వంగా ఫీలవుతాడని సోహైల్ సంతోషపడ్డాడు. జీవితంలో నిన్ను ఎప్పుడూ బాధపెట్టను అంటూ లాస్య బిగ్‌బాస్ షో సాక్షిగా తండ్రికి మాటిస్తోంది. ఇక హారిక తన తండ్రికి దూరంగా వచ్చేశానని, వెనక్కు తిరిగి చూసిన రోజు ఆగిపోతామని తెలుసని, అందుకే తాను ఆ పని చేయను అంటూ దుఃఖించింది. దీంతో హౌస్‌లో నేడు ఉద్విగ్న వాతావారణం నెలకొననున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: కెప్టెన్‌గా నోయల్, కానీ తప్పని ముప్పు) -
నేను లేకపోతే ఏమైపోతావో: అవినాష్
బిగ్‌బాస్ నేడు ఇంటిసభ్యులకు ఆసక్తికరమైన టాస్కులు ఇచ్చాడు. అందులో భాగంగా కంటెస్టెంట్లు కష్టమైనా నష్టమైనా సరే, టాస్కు గెలిచి తీరాల్సిందేనని హోరాహోరీగా పోరాడుతున్నారు. అయితే దూరంగా ఉందామని డిసైడ్ అయిన అభిజిత్, మోనాల్ ఒక టీమ్‌లో వచ్చి పడ్డారు. దీంతో వాళ్లిద్దరూ మాట్లాడుకోకుండా ఉండలేకపోయారు. అవినాష్ దివికి ఓ లెటర్ ఇచ్చాడు. అయితే అది లవ్ లెటర్ కాకుండా ఫ్రెండ్షిప్ లెటర్ కావడం గమనార్హం. కానీ అరియానాకు మాత్రం దగ్గరుండి మేకప్ వేశాడు. చంద్రముఖిలా ఉండే నువ్వు ఇప్పుడు ఎలా అయ్యావో చూడు అంటూ ఆమెపై ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేసేయండి.. కిచెన్‌గా మారిన సోహైల్‌ను చితక్కొట్టారు బిగ్‌బాస్ ఇచ్చిన మార్నింగ్ మస్తీలో సోహైల్ కిచెన్‌గా మారిపోయాడు. దీంతో దొరికిందే ఛాన్సని అందరూ అతడిని చపాతీలా రుబ్బుతూ, బోళ్లు తోముతున్నట్లూ సాకులు చెప్తూ చితక్కొట్టేశారు. అవినాష్ బెడ్‌లా మారిపోగా అమ్మ రాజశేఖర్ అతడిపై విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నాడు. అఖిల్ వాష్రూమ్గా మారిపోగా మాస్టర్ అందులోనే స్నానం, నిద్ర అన్నీ చేస్తూ ఛీ అనిపిస్తూనే నవ్వు తెప్పించారు. మోనాల్ తలుపుగా మారిపోగా అందరూ మరోసారి రోబో టాస్కును గుర్తు చేస్తూ డోర్ విరగ్గొట్టేలా విరుచుకుపడ్డారు. దివి కాసేపు డస్ట్‌బిన్‌లా చేసింది. (చదవండి: బిగ్‌బాస్ : కెప్టెన్ పవర్‌తో ఫ్రెండ్‌ని సేవ్ చేసిన సోహైల్) దివికి లెటర్ రాసిన అవినాష్ అనంతరం అవినాష్ ఓ లేఖ రాసి దివికి ఇమ్మని మాస్టర్‌కు ఇచ్చాడు. అందులో ఉన్నది చదివిన మాస్టర్.. నువ్వే ఇచ్చుకో పో అని ఆ లేఖను ముఖాన కొట్టాడు. దీంతో అతడే నేరుగా దివి బెడ్ దగ్గరకు వెళ్లి ఆమె చేతికి కూడా ఇవ్వకుండా బెడ్‌పై పెట్టేసి వెనుదిరిగాడు. అదేమిటా అని ఆమె తెరిచి చూసింది. అందులో దివి, అవి ఫ్రెండ్స్ అని రాసి ఉండటంతో ఓ స్మైల్ ఇచ్చింది, ఆ వెంటనే ఫ్రెండ్షిప్ గురించి ఓ సాంగ్ కూడా పాడింది. తర్వాత అవినాష్ అరియానా దగ్గర తేలాడు. ఆమెకు దగ్గరుండి కళ్లకు కాటుక పెడుతూ మేకప్ వేశాడు. నేను లేకపోతే ఏమైపోతావో అంటూ కబుర్లు చెప్పుకొచ్చాడు. మరోవైపు అభిజిత్ సోహైల్‌కు అందరూ ఇచ్చే సలహానే మళ్లీ గుర్తు చేశాడు. నువ్వు కోపం తగ్గించుకుంటే ఇంత మంచోడివా అనిపిస్తది, కాబట్టి కోపాన్ని కంట్రోల్లో ఉంచుకో అని సలహా ఇచ్చాడు. (చదవండి: గంగవ్వను బయటకు పంపిన బిగ్‌బాస్!) ఆరోవారం అమీతుమీ కెప్టెన్సీ టాస్క్ బిగ్‌బాస్ అమీ తుమీ అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విడగొట్టాడు. అరియానా 'రెడ్' టీమ్‌లో అభిజిత్, మెహబూబ్, లాస్య, అవినాష్, మోనాల్ ఉండగా అఖిల్ 'బ్లూ' టీమ్‌లో మిగిలిన ఇంటి సభ్యులు ఉంటారు. సోహైల్ సంచాలకుడిగా వ్యవహరిస్తాడు. ఇక ఈ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ రెండు టీమ్స్‌కు సమంగా బంగారు నాణాలు ఇస్తారు. టాస్క్ ముగిసే సమయానికి బిగ్‌బాస్‌తో ఎక్కువ డీల్స్ కుదుర్చుకుని ఏ టీమ్ ఎక్కువ నాణాలు ఖర్చుపెడుతుందో వారే గెలుపును సాధించినట్లు లెక్క. గెలిచిన టీమ్ సభ్యులే కెప్టెన్సీకి పోటీ పడతారు. (చదవండి: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: అవినాష్) ► మొదటి డీల్: మగ సభ్యుడు ఒంటి మీదున్న బట్టలను కత్తిరించేయాలి. ఇందుకు 10 బంగారు నాణాలు ఇవ్వాలి. మొదట అఖిల్ బెల్ కొట్టడంతో అతని టీమ్‌లో కుమార్ సాయి షర్టును ముక్కలు ముక్కలుగా కత్తిరించేశాడు. కానీ ఆ షర్టు సోహైల్‌ది కావడంతో ఆయన ఎక్కువగా బాధపడ్డాడు. ► రెండో డీల్: ఇంటి సభ్యుల్లో ఒకరు వారికి సంబంధించిన దుస్తులను, వస్తువులన్నింటినీ బయటకు పంపించేయాలి. చెల్లించాల్సిన నాణాలు: 20. అరియానా మొదట బెల్ కొట్టగా ఆమె టీమ్‌లోని అభిజిత్ ఒంటి మీదున్న బట్టలు మినహా తనకు చెందినవి అన్నింటినీ త్యాగం చేశాడు. ► మూడో డీల్: అమ్మాయి తన జుట్టును మెడపై వరకు కత్తిరించుకుని రెడ్ కలర్ వేసుకోవాలి. చెల్లించాల్సిన నాణాలు: 25 అఖిల్,గంట కొట్టడంతో హారిక హెయిర్ కట్ చేయించుకునేందుకు రెడీ అయింది. అయితే ఈ షోకు వచ్చేముందే ఇలా హెయిర్ కట్ చేయించుకోవద్దని అన్నయ్య మరీమరీ చెప్పాడని ఏడ్చేసింది. నోయల్ జుట్టు కత్తిరించేస్తుంటే అన్నను గుర్తు చేసుకుంటూ సారీ చెప్తూ కన్నీళ్లు కార్చింది. అయితే వెళ్లిపోయేలోపు తన జుట్టు పెరిగేలా మసాజ్ చేసే బాధ్యత ఇంటి సభ్యులదేనని వారిపై భారం వేసింది. ► నాలుగో డీల్: ఇసుక మూటను ఒక్క చేత్తో మార్కు కిందకు వెళ్లకుండా చూడాలి. బిగ్‌బాస్ తదుపరి ఆదేశాల వరకు అదే స్థానంలో కదలకుండా ఉండాలి. చెల్లించాల్సిన నాణాలు: 20 అఖిల్ టీమ్‌లో కుమార్ సాయి ఈ ఛాలెంజ్ స్వీకరించాడు. చాలాసేపు ఒకేచోట ఉండటంతో అతనికి నోయల్ నీళ్లు తాగిపించాడు. కానీ సమయం ఎక్కువయ్యేకొద్దీ అతడు నొప్పి భరించలేక కేకలు పెట్టాడు. ఏడ్చినంత పని చేశాడు. కానీ ఎట్టకేలకు ఛాలెంజ్ విజయవంతంగా పూర్తి చేశాడు. ► ఐదో డీల్: స్టోర్ రూమ్ ద్వారా పంపించే వస్తువులతో డ్రింక్ తయారు చేసి రెండు గ్లాసులు తాగాల్సి ఉంటుంది. చెల్లించాల్సిన నాణాలు: 20 అరియానా గంట కొట్టడంతో లాస్య ఛాలెంజ్ స్వీకరించింది. ముక్కు మూసుకుని రెండు గ్లాసులను గటగటా తాగేసింది. మా జున్ను కోసం చేశానని చెప్పుకొచ్చింది. లాస్య కోసం అఖిల్ సాంగ్ పాడి ఆమెను నవ్వించాడు. ► ఆరో డీల్: ఒక ఇంటి సభ్యుడు బిగ్‌బాస్ తదుపరి ఆదేశం వరకు జ్యూట్‌తో అల్లిన బట్టలను ధరించాలి. చెల్లించాల్సిన నాణాలు: 20 అఖిల్ కన్నా ముందు గంట కొట్టినందుకు అరియానా టాస్క్ గెలిచినంత ఆనందపడి గెంతులేసింది. ఇక ఆమె టీమ్‌లోని మోనాల్ జనపనారతో అల్లిన దుస్తులు ధరించింది. దీంతో మాస్టర్ ఆమెతో కోయ డ్యాన్స్ వేయించాడు. -
సారీ అన్నయ్యా: ఏడ్చేసిన హారిక
బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో ఐదు వారాలు గడిచిపోయాయి. ఆట ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతోంది. మొదట్లో గేమ్‌పై పెద్దగా ఫోకస్ పెట్టని వారు కూడా బరిలోకి దిగుతూ ఇతర కంటెస్టెంట్లకు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఈ క్రమంలో వారితో మరిన్ని కఠినతరమైన టాస్కులు ఆడించేందుకు బిగ్‌బాస్ రెడీ అయ్యాడు. అందులో భాగంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కొన్ని ఆసక్తికరమైన డీల్స్ ఇస్తున్నాడు. వాటిని చేసేందుకు కొందరు తెగ ఇబ్బంది పడుతుండగా మరికొందరు మాత్రం సునాయాసంగా ఒప్పేసుకుంటున్నారు. బిగ్‌బాస్ ఇచ్చిన డీల్‌లో భాగంగా కుమార్ సాయి ఒంటి మీదున్న దుస్తులను ముక్కలు ముక్కలుగా కత్తిరించేశాడు. (చదవండి: నాగార్జున ఒక్కసారి కూడా మెచ్చుకోలేదు) అభిజిత్ తన దుస్తులన్నింటినీ త్యాగం చేసేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. మరో డీల్‌లో ఒకమ్మాయి మెడ వరకు జుట్టును చిన్నగా కత్తిరించుకోవాలని ఆదేశించాడు. "దీనికి నేను అంగీకరించను, ఈ విషయం గురించి ఇక్కడికి వచ్చే ముందే మా అన్న నాకు వార్నింగ్ ఇచ్చి పంపించాడు" అని హారిక వెనకడుగు వేసింది. పైగా దీనివల్ల తన జుట్టు పెరగదు అని ఏడుస్తూనే హెయిర్ కత్తిరించుకునేందుకు అంగీకరించింది. అయితే ఇచ్చిన మాట తప్పుతున్నందుకుగానూ తన అన్నయ్యకు సారీ చెప్పింది. మరి బిగ్‌బాస్ ఇంకా ఏమేం డీల్స్ ఇచ్చాడో, వాటిని ఇంటి సభ్యులు పూర్తి చేశారో లేదో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: ఎలిమినేట్ అవుతా అనుకోలే: సుజాత) -
హారిక అలకను హగ్గుతో పోగొట్టిన అభిజిత్
బిగ్‌బాస్ హౌస్‌లో ముప్పై రెండవ రోజు కెప్టెన్సీ టాస్క్ కాస్త ఆసక్తికరంగా సాగింది. కానీ కెప్టెన్ సోహైల్ అనే విషయం ఎపిసోడ్ ప్రారంభానికి ముందే లీకవడం గమనార్హం. ఇక చాప కింద నీరులా అవినాష్, అరియానాల మధ్య ప్రేమ వ్యవహారం సాగుతున్నట్లు కనిపిస్తోంది. కెప్టెన్సీ టాస్కులో అవినాష్‌కు ఆమె తెగ సపోర్ట్ చేసింది. నిన్న అభి స్టార్లు లాక్కున్నాడని అలిగిన హారికకు అతడు హగ్ ఇవ్వడంతో ఆమె ముఖం మతాబులా వెలిగిపోయింది. కానీ నామినేషన్ ప్రక్రియ నుంచి వేరయిన అఖిల్, మోనాల్ మాత్రం ఇప్పటికీ కలివిడిగా ఉండలేకపోతున్నారు. నిన్న మోనాల్ వెనక నుంచి వచ్చి హగ్గిచ్చినా కూడా అఖిల్‌కు కోపం తగ్గలేదు. ఈ రోజు కూడా ఆమె మాట్లాడమని ఎంతగా బతిమిలాడినప్పటికీ మౌనమే సమాధానమైంది. ఇక నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. ఘోరంగా విఫలమైన అభిజిత్ ప్లాను అభిజిత్ తన చేతిలోని స్టార్లు లాగేసుకున్నాడని హారిక పదేపదే తల్చుకుంటూ ఏడ్చింది. తర్వాత బీబీ హోటల్ టాస్క్ ముగిసిందని బిగ్‌బాస్ ప్రకటించాడు. హోటల్ సిబ్బంది దగ్గర ఐదు స్టార్లు ఉన్నప్పటికీ అవి అతిథులు ఇష్టపూర్వకంగా ఇచ్చినవి కానందున అతిథులే గెలిచినట్లు వెల్లడించారు. దీంతో అభిజిత్ ప్లాన్ అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. దీనికోసం హారికతో గొడవ కూడా పెట్టుకున్నానే అని బుంగమూతి పెట్టుకున్న హారిక దగ్గరకు వెళ్లి ఆమెను హత్తుకుని ఓదార్చాడు. ఒక్క హగ్గుతో ఆమె అలక, కోపం అన్నీ పటాపంచలయ్యాయి. (చదవండి: సుజాతది ఫేక్ నవ్వు, మోనాల్ ఆడుకుంటోంది) ఒంటరిగా గేమ్ ఆడిన అఖిల్, సుజాత గోరుముద్దలు గెలిచిన టీమ్ నుంచి బెస్ట్ పర్ఫార్మర్ పేరును ఏకాభిప్రాయంతో చెప్పమన్నాడు. అప్పుడు మొదలైంది అసలు ముసలం.. ఎవరికి వారే తానే బెస్ట్ అని చెప్పుకున్నారు. అందరూ కలిసి ఒక్క పేరు చెప్పడానికి ముందుకు రాలేదు. దీంతో ఫ్రెండ్షిప్కు విలువిస్తే నాకు సపోర్ట్ చెయ్ అని మెహబూబ్‌కు ఒక్క ముక్కలో తేల్చి చెప్పాడు సోహైల్. అలా సోహైల్ పేరును బెస్ట్ పర్ఫార్మర్గా ఎంపిక చేశారు. అందరికన్నా ఎక్కువ డబ్బు ఉన్న అఖిల్, సీక్రెట్ టాస్క్‌లో గెలిచిన అవినాష్ కూడా కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ చేసేందుకు అర్హత సాధించారు. హోటల్ సిబ్బందిలో వరస్ట్ పర్ఫార్మర్గా ప్రకటించుకున్న అమ్మ రాజశేఖర్‌ను ఉల్లిపాయలు తరిగి స్టోర్ రూమ్‌లో పెట్టమన్నాడు. రాత్రి అఖిల్‌కు సుజాత గోరుముద్దలు తినిపించింది. ఇవాళ నేను ఒక్కడినే ఆడినందుకు మజా అనిపించింది అన్నాడు. (చదవండి: బిగ్ బాస్ : దివి ‘పప్పు’ రీజన్‌పై నెటిజన్ల ట్రోలింగ్) మంచు నిప్పు టాస్క్‌ను జయించిన సోహైల్ ముప్పై రెండవ రోజు బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు "మంచు నిప్పు- మధ్యలో ఓర్పు" అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్కుకు అభిజిత్ సంచాలకుడిగా వ్యవహరించారు. అఖిల్‌కు అభి ఆల్ ద బెస్ట్ చెప్పడం విశేషం. తర్వాత టాస్కు మొదలవగా కింద మంటల వేడి, చేతిలోని ఐస్ గడ్డ చల్లదనాన్ని తట్టుకునేందుకు గట్టిగానే ప్రయత్నించారు. అఖిల్‌కు కాళ్లు వణకడం ప్రారంభమయ్యాయి. తర్వాత నొప్పులు భరించలేక ఒక్కొక్కరు అరవడం ప్రారంభించాడు. అఖిల్ పడిపోవడంతో మిగతా ఇంటి సభ్యులు వెళ్లి అతడి చేతులు రుద్దారు. తర్వాత అవినాష్, ఆ వెంటనే సోహైల్ బయటకు వచ్చేశారు. దీంతో సోహైల్ ఇంటి కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. (చదవండి: ఈ వారం నామినేషన్లో ఉన్నది వీళ్లే) ఇంటికి పోతా: గంగవ్వ తర్వాత నేలపై పడుకున్న అఖిల్ దగ్గరకు వెళ్లి మోనాల్ ముద్దుముద్దుగా కోపమొస్తే ఏదైనా చెయ్ కానీ నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదురా అని అడిగింది. నేనేం చేశానో చెప్పు అని నిలదీసింది. అయినా అతడు మౌనం వీడకపోవడంతో చేసేదేం లేక రుసరుసా వెళ్లిపోయింది. కానీ అఖిల్ ఓ మూలన కూర్చుని బాధను కక్కేస్తూ ఏడ్చేశాడు. అఖిల్ బాధను పసి గట్టిన గంగవ్వ ఏమైందంటూ వెళ్లి అరుచుకుంది. తర్వాత అవినాష్ పులిహోర కబుర్లు మొదలుపెట్టేశాడు. దివి హైట్ తక్కువ ఉంటుందేమో, నాకేమైనా కలిసొస్తుందనుకున్నా అని నిరుత్సాహపడ్డాడు. మగవాడిలా నడుస్తుందని ఓసారి నడిచి చూపించాడు. నువ్వు దివిని చూస్తున్నావని మొదటిరోజే పసిగట్టానని అరియానా అనడంతో లేదు, నిన్ను చూశానంటూ డైలాగ్ కొట్టాడు. మళ్లీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి దివి, అవినాష్ గుసగుసలు పెట్టుకున్నారు. గంగవ్వకు మళ్లీ ఇంటి మీద మనసు పడింది. అన్నం పోతలేదు, ఇంటికి పోతా అని అఖిల్‌తో తన బాధ చెప్పుకొచ్చింది. (చదవండి: బిగ్ బాస్‌లో ఇక నాగార్జున కనిపించడా?) -
బిగ్‌బాస్: దేత్తడి హారికకు క్లాస్ పీకిన నాగ్
బిగ్‌బాస్ నాల్గవ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి షోపై ప్రేక్షకులకు ఒక ఫిర్యాదు ఉంది. అదేంటంటే చాలామంది ఇది తెలుగు బిగ్‌బాస్ అన్న విషయాన్ని మర్చిపోతూ నానా భాషలు మాట్లాడేస్తున్నారు. మొదట్లో గుర్రు పెట్టి నిద్రపోయిన బిగ్‌బాస్ దీన్నంతగా పట్టించుకోలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ ఇంగ్లీష్ పీస్ మా వల్ల కాదంటూ నెటిజన్లు తమ గోడు ఏకరువు పెట్టారు. దీంతో బిగ్‌బాస్ ఇంటి సభ్యులను హెచ్చరించాడు. కానీ ఇప్పటికీ కొందరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. గుజరాతీ భామ మోనాల్ కష్టపడి ఇష్టంతో తెలుగు నేర్చుకుని మాట్లాడుతుంటే తెలుగు రాష్ట్రాల్లోనే పుట్టి పెరిగిన ఓ ఇద్దరు మాత్రం ఎప్పుడు చూసినా ఇంగ్లీషులోనే కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇది ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. చక్కగా తెలుగులో మాట్లాడకుండా, ఇదేం గోల, వీళ్ల ఓవర్ యాక్షన్ వల్ల ఎపిసోడ్ చూడాలంటేనే విసుగు వస్తోందంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్: ఈ వారం నామినేషన్లో ఏడుగురు) ఈ విషయం నాగ్ చెవిన కూడా పడినట్లు కనిపిస్తోంది. ఇంగ్లీషులో మాట్లాడినందుకు హారిక, అభిజిత్ మీద నాగ్ గరమయ్యారు. తెలుగు వచ్చినా ఇంగ్లీషులో మాట్లాడుతున్నారని క్లాస్ పీకారు. కాగా అభిజిత్ తెలుగులో మాట్లాడుతున్నా హారిక ఇంగ్లీషులో ముచ్చట ప్రారంభించడంతో అతను కూడా తెలుగును పక్కన పెట్టేస్తున్నాడు. నిజానికి హారిక తెలంగాణ యాసతో వీడియోలు చేయడం వల్లే యూట్యూబ్ స్టార్‌గా ఎదిగింది. హౌస్‌లోనూ తన యాసతో అందరినీ మెప్పిస్తుందనుకుంటే యాస కాదు కదా తెలుగునే పక్కనపెట్టేసి అభిమానులను కూడా నిరుత్సాహపరుస్తోంది. మరి ఇప్పటికైనా ఈ ఇద్దరు కంటెస్టెంట్లు నాగ్ మాటను చెవినెక్కించుకుంటారో, లేదోనని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ రోజు కోసం ఎంతలా వేచి చూశామోనంటూ మరికొందరు సంతోషపడుతున్నారు. (చదవండి: బిగ్‌బాస్: అదృష్టాన్ని కాలితో తన్నేశాడు)