నిన్న బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ నేడు కూడా కొనసాగింది. నిన్న జబర్దస్త్, నేడు ఢీ షోలతో కంటెస్టెంట్లు ఆకట్టుకున్నారు. ఇక పొద్దుపొద్దునే మోనాల్ గజ్జర్ కోసం అఖిల్ కారం దోశె వేయించుకుని మరీ తీసుకువచ్చాడు. కానీ తినిపించలేకపోయాడు. ఎందుకంటే అప్పటికే అతని స్థానంలో అభిజిత్ కూర్చుని కబుర్లు చెప్తున్నాడు. దీంతో ఏం మాట్లాడకుండానే అక్కడి నుంచి నిష్క్రమించాడు. అంతలోనే మోనాల్‌కు దగ్గు రావడంతో అభి నీళ్ల కోసం వెళ్లినప్పటికీ అఖిల్ ముందుగా వెళ్లి బాటిల్ ఇచ్చాడు. ఇస్తున్నావా? అని అభి అడిగినా ఏం సమాధానమివ్వకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. తర్వాత కాసేపటికి మోనాల్ అఖిల్ దగ్గర కూచుని కెమెరాల వైపు చూసింది. అందుకే ఆలోచించి మాట్లాడు, కెమెరాలు చూస్తున్నాయని అఖిల్ సూచించాడు. అభి ఏదైనా చెప్తే, దాన్ని తన దగ్గర చెప్పొద్దని కోరాడు. ఇక వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సాయి ఒంటరిగానే కూర్చుంటున్నాడు, ఎవరితో కలవట్లేదని లాస్య అభిప్రాయపడింది. బహుశా తొలిరోజే నామినేషన్లోకి వెళ్లినందుకే ఇలా ఉన్నాడేమోనని సందేహించింది.
అఖిల్ - మోనాల్ గురించి మొదలైన గుసగుసలు
అభిజిత్, మోనాల్, అఖిల్ మధ్య రిలేషన్‌షిప్ మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా అఖిల్, మోనాల్ మధ్య ఏదో ఉందని లాస్య, సుజాత బలంగా నమ్ముతున్నారు. సోహైల్‌తో కలిసి డ్యాన్సు చేస్తుంటే అఖిల్ ముఖంలో మారుతున్న వేరియేషన్స్‌నే తీక్షణంగా చూస్తున్నారు. వీరికి అభిజిత్ కూడా తోడవడం గమనార్హం. ఎప్పుడూ ఎవరో ఒకరు నీ పక్కన ఉండటం వల్లే నీతో కలవలేకపోతున్నామని లాస్య, సుజాత మోనాల్‌కు చెప్పారు. ఇదే విషయాన్ని మోనాల్ అఖిల్‌తో చెప్పుకొచ్చింది. మనం కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్నందుకు వారికి కష్టంగా ఉందట అని చెప్పింది. మనం ఫ్రెండ్స్ కదా, వాళ్లు ఏదో అనుకుంటున్నారు అని గుసగుసలాడింది. మరోవైపు తనకంటే చిన్నవాడైన అఖిల్ తనను రా అని పిలుస్తున్నాడని అభి నొచ్చుకున్నాడు. ఈ విషయం తనకు నేరుగాచెప్పినందు వల్లే ఈ రోజు తనతో వింతగా ప్రవర్తించాడని పేర్కొన్నాడు. (రొమాంటిక్ డ్యాన్స్; కళ్లు మూసుకున్న అరియానా)
హాట్ డ్యాన్స్ చూసి చొక్కా విప్పేసిన నోయల్
నేడు బీబీ టీవీలో బీబీ టాలెంట్ షో జరిగింది. దీనికి అరియానా యాంకర్‌గా, లాస్య, నోయల్ జడ్జిలుగా వ్యవహరించారు. మొదటగా అమ్మ రాజశేఖర్ సోలోగా డ్యాన్స్ చేశాడు. సినిమా చూపిస్త మామా అంటూ సితక్కొట్టేశాడు. పర్ఫామెన్స్ మధ్యలో అలా వచ్చి, ఇలా వెళ్లిపోయిన దివి, కళ్యాణి స్పెషల్ ఎట్రాక్షన్‌లుగా నిలిచారు. తర్వాత ఇస్మార్ట్ సోహైల్, మోనాల్ రొమాంటిక్ సాంగ్ "వానా వానా వెల్లువాయే" పాటకు అదరగొట్టేశారు. కమాన్ అంటూ అఖిల్ మోనాల్‌ను బాగానే ఎంకరేజ్ చేశాడు. హాట్ పర్ఫామెన్స్ అంటూ నోయల్ చొక్కా విప్పేశాడు. అనంతరం వచ్చిన యాడ్‌లో దేవి, కళ్యాణి, అభిజిత్, అఖిల్ బమ్‌చిక్ ఫ్యాన్‌కు ప్రచారం చేశారు. (మరోసారి నామినేట్ అయిన గంగవ్వ)
జోకర్ అంటూ వచ్చేస్తున్న కమెడియన్
తర్వాత మెహబూబ్, హారిక "టాప్ లేచిపోద్ది" పాటకు మాస్ డ్యాన్స్ చేశారు. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. బిగ్‌బాస్ హౌస్ టాపు లేచిపోయేలా దుమ్ము రేపారు. దీంతో మాస్టర్‌ని వెనక్కు నెట్టి మెహబూబ్, హారిక 'స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ద షో' అవార్డులు గెలుచుకున్నారు. కానీ మాస్టర్ చెప్పిన టిప్స్, కొరియోగ్రఫీ వల్లే ఈ అవార్డు గెలిచానని మెహబూబ్ ఉన్నమాట చెప్పేశాడు. గంగవ్వ 'మీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు' పాట పాడింది. ఈ కార్యక్రమం ముగిసిపోగానే ఇంటి సభ్యులందరూ కలిసి డ్యాన్స్ చేశారు. కాగా మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ హౌస్‌లో ఉన్నా లేనట్టుగానే ఉండటంతో ఇదే వారంలో రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ సిద్ధం చేశారు. "జోకర్ వెనక జీవితమే ఉందం'టూ ఓ కొత్త కంటెస్టెంటు రేపు హౌస్‌లో అడుగులో పెట్టబోతున్నాడు. అందర్ని నవ్వించే జోకర్ పాయింట్‌తో వస్తున్నాడు అంటే అది కచ్చితంగా ముక్కు అవినాష్ అయ్యుంటుంది. (వైల్డ్ కార్డ్ ఎంట్రీ: ఇద్దరా? ముగ్గురా?)
Comments
Please login to add a commentAdd a comment