Syed Sohel Ryan
-
మొన్నటిదాకా సినిమాలతో బిజీ.. ఇప్పుడు కొత్తగా వ్యాపారంలోకి!
బిగ్‌బాస్ షోలో పాల్గొనేవారికి క్రేజ్, పాపులారిటీ వస్తుంది. ఆ క్రేజ్‌ను కాపాడుకోవడం వారి చేతుల్లోనే ఉంటుంది. ఇకపోతే బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొన్న సోహైల్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. తనకు వచ్చిన క్రేజ్ చూసి ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. వరుస ఆఫర్లు వస్తుండటంతో సంతోషంగా ఓకే చేసేశాడు. ఒకేసారి మూడు నాలుగు సినిమాల వరకు సంతం చేశాడు. కొత్త బంగారు లోకం సినిమాలో కేవలం ఒకటీరెండు సెకన్ల పాటు కనిపించిన సోహైల్ బిగ్‌బాస్ తర్వాత హీరోగా మారాడు. లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్‌కట్ బాలరాజు వంటి చిత్రాలు చేశాడు.ఇందులో మిస్టర్ ప్రెగ్నెంట్ తప్ప మిగతావన్నింటినీ ప్రేక్షకులు తిరస్కరించారు. దాన్ని సోహైల్ తట్టుకోలేకపోయాడు. తన సినిమాను చూడమని, ఎంకరేజ్ చేయమని కన్నీళ్లు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్న అతడు కొత్త బిజినెస్‌లోకి దిగాడు. మణికొండలో కొత్త రెస్టారెంట్ ప్రారంభిస్తున్నాడు. డిసెంబర్ 23న ఈ రెస్టారెంట్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించాడు.చదవండి: దుల్కర్ సల్మాన్‌కు జోడీగా ఛాన్స్ కొట్టేసిన టాలెంటెడ్ బ్యూటీ -
నెం.1 స్థానంలో నిఖిల్.. గౌతమ్ సాయాన్ని మర్చిపోని సోహైల్
వారమంతా కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ వచ్చారు. ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు కంటెస్టెంట్ల ఫ్రెండ్స్ కూడా స్టేజీపైకి వచ్చారు. వారికి నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. తమ కుటుంబ సభ్యుడిని మినహాయించి మిగతావారిలో ఎవరు టాప్ 5లో ఉంటారో చెప్పాలన్నాడు. మరి ఎవరెవరు ఏయే కంటెస్టెంట్లను టాప్ 5లో పెట్టారో నేటి (నవంబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..టాప్ 5 ర్యాంకులుమొదట ప్రేరణ తల్లి రూప, చెల్లి ప్రకృతితో పాటు నటి ప్రియ వచ్చారు. ప్రకృతి మిస్ ఇండియా తెలంగాణతో పాటు బెనెటి యూనివర్సిటీ మిస్ సుడోకుగా నిలిచిందంటూ నాగ్ అభినందించాడు. తర్వాత ప్రేరణ తల్లి.. నిఖిల్‌ను మొదటి స్థానంలో, నబీల్ను రెండో స్థానంలో, గౌతమ్, యష్మి, రోహిణిలను మిగతా మూడు స్థానాల్లో పెట్టారు.రవి సలహాను లెక్కచేయని విష్ణుతర్వాత విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి పావని, యాంకర్ రవి వచ్చారు. నీకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చుకోకపోతే జనాలు నీకెందుకు ఓట్లు వేస్తారు? ముందు నీకు నువ్వు ముఖ్యం అనుకుని గేమ్ ఆడమని రవి సలహా ఇచ్చాడు. కానీ విష్ణుప్రియ వింటేగా..? నాకోసం నేను ఆలోచిస్తే అహంకారమంటూ పిచ్చిగా మాట్లాడింది. దీంతో పావని నీపై నువ్వు ఫోకస్ చేయు అని హెచ్చరించడంతో కాస్త వెనక్కు తగ్గింది.కోవై సరళ కంటే పెద్ద ఆర్టిస్టు..వీరు గౌతమ్‌ను 1, నిఖిల్‌ను 2, నబీల్ను 3, పృథ్వీని 4, రోహిణిని 5వ స్థానంలో పెట్టారు. రోహిణి కోసం నాన్నతో పాటు నటుడు శివాజీ స్టేజీపైకి వచ్చారు. కోవై సరళ కంటే కూడా పెద్ద ఆర్టిస్టు అవుతావు అని శివాజీ.. రోహిణిని మెచ్చుకున్నాడు. టాప్ 5 గురించి మాట్లాడుతూ.. విష్ణు 1, నబీల్ 2, నిఖిల్ 3, గౌతమ్ 4, తేజ 5వ స్థానంలో ఉంటారన్నాడు.గౌతమ్ సాయం మర్చిపోని సోహైల్పృథ్వీ కోసం తమ్ముడు విక్రమ్, నటి దర్శిని వచ్చారు. నిఖిల్, నబీల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియను టాప్ 5లో వరుస స్థానాల్లో ఉంచారు. పృథ్వీ సేవ్ అయినట్లు ప్రకటించారు. గౌతమ్ తల్లి మంగమ్మతో పాటు నటుడు సోహైల్ వచ్చారు. ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ.. నా సినిమా రిలీజ్ సమయంలో 120 టికెట్లు స్పాన్సర్ చేసి జనాలకు చూపించాడు అని తెలిపాడు.నబీల్ కోసం భోలెఇక నబీల్ను 1, నిఖిల్‌ను 2, ప్రేరణను 3, తేజను 4, అవినాష్‌ను 5వ స్థానాల్లో పెట్టారు. తర్వాత గౌతమ్‌ను సేవ్ చేశారు. నబీల్ కోసం అతడి సోదరుడు సజీల్తో పాటు సింగర్ భోలె షావళి వచ్చారు. వీళ్లు నిఖిల్, గౌతమ్, అవినాష్, తేజ, విష్ణుప్రియకు టాప్ 5 ర్యాంకుల్ని వరుసగా ఇచ్చారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ సొహెల్ ఇంట్లో విషాదం.. ఏమైంది?
తెలుగు బిగ్‌బాస్ 4వ సీజన్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న సొహెల్ ఇంట్లో విషాదం. ఇతడి తల్లి చనిపోయింది. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో ఇబ్బందిపడుతున్న ఈమెని డయాలసిస్ కోసం హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్చారు. కానీ పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ప్రముఖ సింగర్ మనో ఇద్దరు కొడుకులు అరెస్ట్)సొహెల్ సొంతూరు కరీంనగర్. తండ్రి సయ్యద్ సలీంతో పాటు తల్లి, తమ్ముడు ఉన్నారు. సొహెల్ కెరీర్ విషయానికొస్తే 'కొత్తబంగారు లోకం' సినిమాలో కనీకనిపించని పాత్ర చేశాడు. 'జనతా గ్యారేజ్' సినిమాలో సైడ్ క్యారెక్టర్లో కనిపించాడు. ఇక బిగ్ బాస్ షోలోకి వచ్చిన తర్వాత మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అలా హీరో కూడా అయిపోయాడు.లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు తదితర సినిమాల్లో సొహెల్ హీరోగా చేశాడు. ప్రస్తుతం కొత్త మూవీస్ ఏం చేస్తున్నాడా లేదా అనేది తెలియాలి. ఇక సొహెల్ తల్లి పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి సొంతూరు కరీంనగర్‌కి తీసుకెళ్లి, అక్కడే అంత్యక్రియలు చేయనున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఇండస్ట్రీ పెద్దలు.. డైరెక్టర్ త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి: పూనమ్ కౌర్) -
అలాంటి కాల్స్‌తో అమ్మాయిల టార్చర్.. పోలీసుల మాటకు షాక్ అయ్యా..: సోహెల్
బుల్లితెర నుంచి మినిమమ్ హీరోగా ఎదిగిన సయ్యద్ సోహెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఆయన కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే సోహెల్ పలు సినిమాల్లో హీరోగా మెప్పించాడు. తాజాగా 'బూట్‌కట్ బాలరాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఆయన వచ్చాడు. ఫిబ్రవరి 2న విడుదలైన ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ఆడకపోయిన తన నటన,కామెడీతో సోహెల్ మెప్పించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు అమ్మాయిల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ గురించి ఆయన ఇలా రియాక్ట్ అయ్యాడు. 'ఒక అమ్మాయి నుంచి నాకు రోజు ఫోన్ కాల్ వస్తుంది.. ఫోన్ లిఫ్ట్ చేస్తే చాలు గలీజ్‌గా మాట్లాడుతుంది. ఇలా ఇప్పటి వరకు సుమారుగా 11 మంది అమ్మాయిలు కాల్స్ చేస్తున్నారు. అందుకే వారి పేర్లకు బదులు టార్చర్-1, టార్చర్-2 అంటూ నా ఫోన్లో నంబర్స్ సేవ్ చేసుకున్నాను. డ్రైవ్‌కు వెళ్దాం.. చేద్దాం... కావాలి అంటూ గలీజ్‌గా మెసేజ్‌లు చేస్తున్నారు. (ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్లపై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు) ఒక అమ్మాయి అయితే ఏకంగా ఇంటి దగ్గర వచ్చేస్తుంది. ఎక్కడికైనా వెళ్దాం అంటుంది. మా అమ్మ వార్నింగ్ ఇచ్చి పంపినా కూడా మళ్లీ వచ్చి టార్చర్ చూపుతుంది. నేను ఎక్కడికి పోతే అక్కడకు ఆ అమ్మాయి రావడం పదా పోదాం అంటూ టార్చర్ పెట్టేది. ఆ అమ్మాయి మీద కేసు పెడదామని అరియానతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాను. కేసు పెడితే నాకే ఇబ్బంది ఉంటుందని పోలీసులు తెలిపారు. దీంతో షాక్ అయ్యాను. ఏం చేయలేక అక్కడి నుంచి వచ్చేశాను. అదే ఒక అమ్మాయి ఇంటికి అబ్బాయి వెళ్లి ఇలా రచ్చ చేస్తే పోలీసులు ఊరుకుంటారా..? లోపలేసి నాలుగు తగిలిస్తారు. అబ్బాయిలకు ఒక న్యాయం, అమ్మాయిలకు ఒక న్యాయం ఉంటుందా అనిపిస్తుంది. ఇవన్నీ చూశాక మగవారి సంఘానికి లీడర్‌గా ఉండాలని ఉంది. అమ్మాయిల వల్ల ఎవరైన మోసపోయిన వారికి అండగా ఉండడంతో పాటు వారి వల్ల ఎవరైన టార్చర్‌కు గురి అవుతున్నవారికి అండగా ఉంటాను.' అని సోహెల్ అన్నాడు. -
ఓటీటీలోకి 'బూట్ కట్ బాలరాజు'.. కనీసం ఇప్పుడైన చూడండయ్యా!
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ హీరోగా శ్రీ కోనేటి తెరకెక్కించిన చిత్రం 'బూట్ కట్ బాలరాజు' ఓటీటలోకి వచ్చేందుకు రెడీగా ఉంది. ఫిబ్రవరి 2న రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్‌పై సోహైల్ నిర్మించాడు. ఈ చిత్రంలో మేఘ లేఖ హీరోయిన్గా నటించగా.. సునీల్, సిరి హన్మంత్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. వినోదాత్మకంగా సాగే ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను మాత్రం పెద్దగా మెప్పించలేదని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మార్చి 1 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన కూడా రావచ్చని ప్రచారం ఉంది. సినిమా విడుదల సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడంతో సోహైల్ ఎమోషనల్ అయ్యాడు.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. కానీ అప్పటికీ కూడా పెద్దగా ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టలేదు. సినిమా కథ బాగున్నప్పటికీ కొత్త దనం లేకపోవడంతో సినిమా ఫెయిల్‌కు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో సోహైల్ కామెడీ మరో రేంజ్లో ఉంటుంది. పేద, ధనిక అంతరాలతో కథ నడిపించిన తీరు బాగానే ఉన్న కమర్షియల్‌గా పెద్దగా మెప్పించలేదని చెప్పవచ్చు. థియేటర్లో చూడలేకపోయిన వారు ఓటీటీలో తప్పక చూడాల్సిన సినిమా అని చెబుతూ.. కనీసం ఇప్పుడైన 'బూట్ కట్ బాలరాజు'పై ఒక లుక్ వేయండయ్యా అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మార్చి 1న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి 'బూట్ కట్ బాలరాజు' వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇంట్లోనే చూసేయండి. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. -
నా సినిమా కూడా చూడండి...బోరున ఏడ్చిన సోహైల్
-
Bootcut Balaraju: బూట్‌కట్ బాలరాజు మూవీ రివ్యూ
బిగ్‌బాస్‌తో వచ్చిన ఫేమ్‌ను కాపాడుకుంటూ హీరోగా నిలదొక్కుకుంటున్నాడు సోహైల్. గతంలో మిస్టర్ ప్రెగ్నెంట్‌తో మెప్పించిన ఇతడు తాజాగా(ఫిబ్రవరి 2న) బూట్‌కట్ బాలరాజుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సోహైల్ నిర్మాతగానూ వ్యవహరించాడు. మేఘలేఖ హీరోయిన్గా నటించగా సునీల్, ఇంద్రజ, అవినాష్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస్ కోనేటి దర్శకత్వం వహించారు. కథ ఏంటంటే.. తండ్రి (సుమన్)కు ఇచ్చిన మాట కోసం పటేలమ్మ(ఇంద్రజ) తన భర్తను కూడా వదిలేసి ఊరిపెద్దగా మారుతుంది. ఆమె కూతురు మహాలక్ష్మి(మేఘలేఖ)ని అందరూ గౌరవించేవారు. అదే సమయంలో భయంతో ఎవరూ దగ్గరకు వచ్చేవారు కాదు. స్కూల్లో కూడా ఎవరూ తనతో స్నేహం చేయరు. అలాంటి సమయంలో బాలరాజు (సోహైల్) మహాలక్ష్మిని అందరితో సమానంగా చూస్తాడు. అలా వీరిమధ్య స్నేహం మొదలవుతుంది. కట్ చేస్తే.. కాలేజీ లైఫ్‌లో బాలరాజును అదే కళాశాలలో చదువుకునే సిరి(సిరి హన్మంతు) ప్రేమిస్తుంది. అయితే మహాలక్ష్మి కూడా తనకు తెలియకుండానే బాలరాజుతో ప్రేమలో పడుతుంది. సిరి కన్నా ముందే మహాలక్ష్మి తన మనసులోని మాట చెప్పేస్తుంది. అలా ఇద్దరి ప్రేమ మొదలవుతుంది. ఈ విషయం తెలిసి పటేలమ్మ.. బాలరాజును ఊరువదిలి వెళ్లిపోవాలంటుంది. ఆ సమయంలో ఇద్దరికీ మాటామాటా పెరుగుతుంది. నా మీద గెలిచి సర్పంచ్ అయితే నా కూతురిని నీకిచ్చి పెళ్లి చేస్తా అంటుంది పటేలమ్మ. ఊరిలో మంచి పేరు లేని బాలరాజు సర్పంచ్ అయ్యాడా? తన ప్రేమ గెలిచిందా? లేదా? అన్న వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ఎలా ఉందంటే? గొప్పింటి అమ్మాయిని పేదింటి కుర్రాడు ప్రేమించడం, ఏదో ఒక ఛాలెంజ్ వేసి తన ప్రేమ గెలిపించుకోవడం చాలా సినిమాల్లో చూశాం. ఈ మూవీ కూడా దాదాపు అదే కోవలోకి వస్తుంది. కథ అంత కొత్తగా అనిపించదు కానీ దాన్ని డీల్ చేసిన విధానం పర్వాలేదనిపించింది. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం, హీరోహీరోయిన్ల మధ్య స్నేహం ప్రేమగా మారిన వైనాన్ని చూపించారు. సెకండాఫ్‌లో బాలరాజు సర్పంచ్ అవడానికి ఏం చేశాడనేది చూపించారు. కామెడీ బాగానే వర్కవుట్ అయింది. సోహైల్ హైపర్ యాక్టివ్‌గా ఉండే కుర్రాడిగా మెప్పించాడు. చివర్లో ఎమోషన్స్ కూడా పిండేశాడు. పటేలమ్మగా ఇంద్రజ నటనకు వంక పెట్టాల్సిన పని లేదు. హీరోయిన్ మేఘలేఖ పల్లెటూరమ్మాయిగా ఒదిగిపోయింది. అవినాష్, సద్దాం కామెడీ బాగుంది. సినిమా చూస్తున్నంతసేపు నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడనట్లు కనిపిస్తుంది. పల్లెటూరి విజువల్స్ అంత చక్కగా ఉన్నాయి. పాటలు కొన్ని బోర్ కొట్టిస్తాయి. దర్శకుడు కథను ఇంకాస్త బెటర్‌గా ప్రజెంట్ చేసుంటే బాగుండేది. ఓవరాల్‌గా సినిమా పర్వాలేదు. -
'బిగ్‌బాస్‌లో సపోర్ట్.. ఇప్పుడేమైంది? ప్లీజ్, నా సినిమాకు వెళ్లండి'
బిగ్‌బాస్ వల్ల వచ్చే ఫేమ్ శాశ్వతంగా ఉండదు. దాన్ని నిలబెట్టుకోవడం కంటెస్టెంట్ల చేతిలోనే ఉంటుంది. విజేతలతో సహా చాలామంది కంటెస్టెంట్లు దాన్ని సరిగా వాడుకోలేకపోయారు. సినిమాల్లో నిలదొక్కుకోలేకపోయారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ సోహైల్ మాత్రం వరుసపెట్టి సినిమాలకు సంతకం చేశాడు. ఆ మధ్య మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ చేయగా దీనికి పాజిటివ్ స్పందన వచ్చింది. సోహైల్ నటనకు మార్కులు పడటంతో పాటు కలెక్షన్లు కూడా వచ్చాయి. హీరో, నిర్మాతగా సోహైల్ తాజాగా అతడు నటించిన బూట్‌కట్ బాలరాజు మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సోహైల్ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు. మేఘలేఖ హీరోయిన్గా నటించింది. సునీల్, ఇంద్రజ, ముక్కు అవినాష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీనివాస్ కోనేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో సోహైల్ కంటతడి పెట్టుకున్నాడు. నేను కూడా అలాంటివి చేయను అతడు మాట్లాడుతూ.. 'ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాను. ఇందులో కంటెంట్ ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. రూ.5 కోట్లు పెట్టి తీసిన సినిమాకు నో షో బోర్డులు పెట్టడమేంటన్నా? జనాలు ఎక్కువగా లేరని షోలు క్యాన్సిల్ చేస్తున్నారు. ఒక థియేటర్‌కు కనీసం 30 మందైనా వెళ్లండన్నా.. ఫ్యామిలీ చూడగలిగే సినిమాలు తీయండన్నారు కదా మరి ఇప్పుడేమైందన్నా? నేను తీస్తే ఎందుకు ఆదరించడం లేదు? ప్రమోషన్స్ చేయడానికి మా దగ్గర అంత డబ్బులు కూడా లేవు. నా స్థోమతలో ప్రీరిలీజ్ ఈవెంట్ ఒక్కటే చేయగలిగాను. అయినా ఫ్యామిలీ సినిమాలు చూడరు కదా.. నేను కూడా ఇకపై అలాంటివి చేయను. ముద్దు సన్నివేశాలుండేవే చేస్తాను. అరె.. కుటుంబమంతా కలిసి చూడగలిగే సినిమా ఇది! క్యూట్ సినిమా తీశావని కొందరు మెచ్చుకుంటున్నారు. నిజంగానే బూట్‌కట్ బాలరాజు బానే ఉంది కదా.. ఏం చేస్తున్నారు మరి? ఎప్పుడూ స్నేహితులతోనే కాదు ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడండి. నా సినిమాకు వెళ్లండన్నా.. బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడు నాకు మద్దతుగా వేల కామెంట్లు పెట్టారు కదా.. ఇప్పుడేమైందన్నా?' అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ పక్కనే ఉన్న అవినాష్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన కొందరు.. బిగ్‌బాస్ గుర్తింపుతో సినిమాల్లో రాణించవచ్చనుకోవడం నీ పొరపాటని విమర్శిస్తున్నారు. నీ సినిమాలో దమ్ముంటే నువ్వు అడక్కపోయినా జనాలు వస్తారని కామెంట్లు చేస్తున్నారు. కంటెంట్ ఉండే చిత్రాలపై దృష్టి సారించమని సలహా ఇస్తున్నారు. #BootcutBalaraju - Mee Jeethalatho maa Jeevithalu marchandi ✅pic.twitter.com/1cUsZWMj9a — GetsCinema (@GetsCinema) February 2, 2024 చదవండి: భర్తతో కలిసి ఉదకశాంతి పూజ చేసిన గీతా మాధురి.. 'దమ్ మసాలా' సాంగ్‌కు సితార డ్యాన్స్.. మిలియన్లకొద్ది వ్యూస్ -
యాంకర్ సుమ సాయం.. ఎమోషనల్ అయిన 'బిగ్ బాస్' సోహైల్
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ హీరోగా శ్రీ కోనేటి తెరకెక్కించిన చిత్రం 'బూట్ కట్ బాలరాజు'. గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్‌పై నిర్మాతగా ఈ చిత్రాన్ని సోహైల్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో మేఘ లేఖ హీరోయిన్గా నటిస్తుండగా.. సునీల్, సిరి హన్మంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వినోదాత్మకంగా సాగే ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇందులోని పాటలకు కూడా మంచి గుర్తింపు దక్కింది. 'బూట్ కట్ బాలరాజు' చిత్రానికి నిర్మాతగా మారిన సయ్యద్ సోహైల్ ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభించాడు. సినిమాను ప్రజల్లోకి తీసుకుపోవాలంటే పలు ఈవెంట్స్‌తో ప్రమోట్ చేసుకోవాలి. అప్పుడే ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. ఇలాంటి వేడుకలకు భారీగానే ఖర్చు కూడా అవుతుంది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే యాంకర్‌కు కూడా అధిక మొత్తంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంపై రీసెంట్గా సోహైల్ పలు వ్యాఖ్యలు చేశాడు. 'బూట్ కట్ బాలరాజు' చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానున్నడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశామని అందులో యాంకర్‌గా సుమ ఉంటే బాగుంటుందని అనుకున్నట్లు సోహైల్ ఇలా చెప్పాడు.. 'సుమ అక్కతో మాట్లాడాలని మేనేజర్‌కు కాల్ చేశాను. ఆయనతో మాట్లాడుతూ ఈవెంట్ కోసం ఎక్కువ డబ్బులు ఇవ్వలేను అని కొంచెం తగ్గించాలని కోరాను. దీంతో సుమ గారితో మాట్లాడి చెబుతానని ఆయన తెలిపాడు. కానీ కొంత సమయం తర్వాత సుమ అక్క నుంచి కాల్ వచ్చింది. అక్కా.. ఈ కార్యక్రమం కోసం నేను తక్కువ డబ్బు ఇద్దాం అనుకుంటున్నాను. ఈ సినిమాకు నేనే ప్రొడ్యూసర్, అంత డబ్బు నా వద్ద లేదు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాను అని చెప్పాను. దీంతో వెంటనే నీ దగ్గర డబ్బు తీసుకోను.. ఉచితంగానే ఈవెంట్ చేస్తాను. లైఫ్‌లో ఇంత ఎదిగిన తర్వాత కూడా మీలాంటి వాళ్లకు సాయం చేయలేకపోతే ఎందుకు.. తప్పకుండా 'బూట్ కట్ బాలరాజు' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంటానని సుమ చెప్పినట్లు సోహైల్ ఎమోషనల్ అయ్యాడు. -
బూట్‌కట్ బాలరాజు ట్రైలర్
-
ఫోన్ చేస్తే ఆ హీరోలు కట్ చేస్తున్నారు: సోహైల్ ఆవేదన
బిగ్‌బాస్ షోతో గుర్తింపు తెచ్చుకుని వరుసగా సినిమా ఛాన్సులు అందుకుంటున్న వ్యక్తి సోహైల్. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ద్వారా జనాల్లో మంచి క్రేజ్ అందుకున్న ఇతడు మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో ఓ చిన్న సాహసమే చేశాడు. ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవడంతో పాటు సోహైల్ నటనకూ మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడతడు బూట్‌కట్ బాలరాజు చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. శ్రీకోనేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో సోహైల్ ఎమోషనలయ్యాడు. దానికి రెండే కారణాలు.. సోహైల్ మాట్లాడుతూ.. 'సినిమాలు చేసినా, వెబ్ సిరీస్‌లు చేసినా, రియాలిటీ షో చేసినా, షార్ట్ ఫిలిం చేసినా.. దానికి రెండే రెండు కారణాలుంటాయి. ఒకటి బతకడానికి, మరొకటి గుర్తింపు కోసం! ఇండస్ట్రీ ప్రయాణం ఎలా మొదలైందని పట్టించుకోవద్దు. నేను ఒక షార్ట్ ఫిలిం చేశా, ఆ తర్వాత కొత్త బంగారు లోకంలో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించాను. ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చాను. మనపై మనం నమ్మకం పెట్టుకుని పోరాడుతూ ఉండాలి. అంతే! యంగ్ హీరోలకు ఫోన్ చేస్తే.. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. పదిరోజుల క్రితం.. సంక్రాంతి సమయంలో యంగ్ హీరోలకు ఫోన్ చేశాను. నేను సోహైల్ అనగానే ఫోన్ కట్ చేశారు. మళ్లీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. వాళ్లంతా సక్సెస్ఫుల్ హీరోలు.. ఎంతో పెద్ద స్థాయిలో ఉన్న వెంకటేశ్ సర్‌కు ఈ మధ్య మెసేజ్ పెడితే వెంటనే రిప్లై ఇచ్చారు. ఆల్ ద బెస్ట్ చెప్తూ వాయిస్ మెసేజ్ పంపారు. అది విని నాకు ఎంతో సంతోషమేసింది. నేను ఒకటే చెప్తున్నాను.. ఎప్పుడూ ఒకేలా ఉందాం. ఒకరికొకరం సపోర్ట్ చేసుకుందాం. ఎవరైనా నాలాంటి యంగ్‌స్టర్స్ మీ సాయం కావాలన్నప్పుడు ఒక మాట సాయం చేయండి, అంతే చాలు' అని భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: ప్రత్యేక విమానంలో అయోధ్యకు వెళ్లిన చిరంజీవి, చరణ్.. -
నేనైతే కారుతో గుద్దిపడేసేవాడిని.. అమర్ విషయంపై సోహైల్ ఫైర్
బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్‌ను రైతుబిడ్డ అని చెప్పుకుంటున్న పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. ఈ సీజన్ రన్నర్‌గా బుల్లితెర నటుడు అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్‌లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్‌ను ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. ఈ విషయంపై చాలామంది రియాక్ట్ అవుతున్నారు. తాజాగా సయ్యద్ సోహైల్ రియాక్ట్ అయ్యాడు. 'ఒక వ్యక్తిపై అభిమానం ఉండాలి కానీ ఉన్మాదం పనికిరాదు.. అమర్ కారుపై దాడి చేసింది అందరూ కూడా యువకులే. మనకు ఉద్యోగాలు లేక ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఇలాంటి పనులు చేసి తల్లిదండ్రులకు చెడ్డపేరు తీసుకు రాకండి. అభిమానం ముసుగులో ఇలా అమర్‌పై దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్... ఆ దాడి సమయంలో అమర్‌తో పాటు ఆయన అమ్మగారు, భార్య తేజు ఉన్నారు. వారి కారును చుట్టుముట్టి అద్దాలు పగులకొట్టి ఆపై వారందరినీ నోటికి వచ్చిన బూతులు తిట్టారు. అమర్ భార్య, అమ్మగారిని చెప్పలేని పదాలతో తిట్టారు. మరోకడు అయితే ఆ బూతులు వినలేడు కూడా.. అలాంటి పదాలతో తిట్టడం ఎంత వరకు కరెక్ట్... నేను కూడా ఒక కొడుకుగా చెబుతున్నా.. ఇలాంటి మాటలు నాకే ఏదురైతే గనుకా ఆ సమయంలో కారుతోనే గుద్దిపడేసేవాడిని తర్వాత ఏదైతే అది జరగని.. తన తల్లిదండ్రులను అంటే ఎవరిలోనైనా ఇదే అభిప్రాయం వస్తుంది. భార్య, అమ్మను తన ముందే ఇలా తిడితే ఎవడూ సహించడు. కారుతో అలానే గుద్ది పారేస్తాడు.. కానీ అమర్ సైలెంట్‌గా వెళ్లిపోయాడు. నిజానికి వాడు చాలా మంచోడు ఇండస్ట్రీలో ఎవరినీ అడిగినా అదే చెబుతాడు.. అంత గొడవ జరిగినా తర్వాత కూడా తన అమ్మ, భార్య జోలికి మాత్రం రాకండి. ఏమైనా చేయాలనుకుంటే తనను మాత్రమే చేసుకోండి అని చెప్పాడు. ఇంతలా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం దేనికి..?' అని సోహైల్ రియాక్ట్ అయ్యాడు. -
మైక్ లాకొక్కు నీకంటే బలం ఎక్కువ నాకు..!
-
పల్లవి ప్రశాంత్ వల్ల నన్ను బాధపెట్టారు.. నా సపోర్ట్ ఎవరికంటే: సోహైల్
'బిగ్ బాస్' ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ అందరికీ పరిచయమే ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందుకున్నాడు. త్వరలో సోహైల్ 'బూట్‌కట్ బాలరాజు' సినిమాతో త్వరలో వస్తున్నాడు. ఈ సినిమా పనిలో ఆయన చాలారోజుల నుంచి బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సినిమాకు ఎం.డి.పాషా నిర్మాత. మేఘ లేఖ కథానాయిక. సునీల్, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన బిగ్‌బాస్ సీజన్ 7 గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. బిగ్‌బాస్ షోను రెగ్యులర్‌గా తాను చూడటం లేదని చెప్పిన సోహైల్.. పల్లవి ప్రశాంత్‌ను మెచ్చుకున్నాడు. 'బిగ్‌బాస్ షోలో ఉన్న కంటెస్టెంట్ల పట్ల ప్రశాంత్ ఎక్కడ కూడా దురుసు మాటలు మాట్లడలేదు. లూజ్ టంగ్ ఉపయోగించలేదు. వాడు పెద్దగా చదువుకోలేదు.. కానీ ఎక్కడా ఇతరుల పట్ల అగౌరవంగా ప్రవర్తించలేదు. అది నాకు నచ్చింది కాబట్టి ఒకసారి నా సోషల్ మీడియాలో 'ఫార్మర్' అని మాత్రమే మెసేజ్ పెట్టాను. అందుకు నన్ను తిడుతూ వెంటనే ఎన్నో మెసేజ్‌లు వచ్చాయి. నేను ఏం తప్పు చేశాను. ప్రశాంత్ తీరు నచ్చి ఆ మెసేజ్ మాత్రమే చేసినా.. అందుకు కొందరు నన్ను దొంగ, ఫాల్తు, ఫ్రాడ్ గాడు అంటూ గలీజు కామెంట్లు చేశారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. దీంతో బిగ్‌బాస్ గురించి ఎక్కడా మాట్లడటం లేదు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఒక్కోసారి నేను కూడా ట్రిగ్గర్ అవుతాను. అప్పుడు నేను కూడా నాలుగు మాటలు అనవచ్చు.. అందువల్ల వాళ్లు కూడా బాధపడుతారు. ఎందుకు ఇవన్నీ అని దూరంగా ఉన్నాను.' అని సోహైల్ తెలిపాడు. తనకు అమర్ దీప్తో పాటు హోస్లో చాలమంది స్నేహితులు ఉన్నారు. వారి పేరును చెప్పనందుకు బాధ కలగవచ్చు అందుకు తానేమీ చేయలేనని సోహైల్ చెప్పాడు. వాడు నా కోసం కష్టపడ్డాడు సోహైల్ నటించిన లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాల కోసం పల్లవి ప్రశాంత్ చాలా కష్టపడ్డాడని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సినిమాల ప్రమోషన్స్ కోసం వాడు కనీసం నిద్రపోకుండా కష్టపడ్డాడు. నా రూమ్ వద్దకు వచ్చి వాడే ఆ సినిమా ప్రమోషన్స్ పనులను చూసుకున్నాడు అని సోహైల్ తెలిపాడు. ఈ వ్యాఖ్యలతో పల్లివి ప్రశాంత్‌ను అభిమానించే వారు ఆశ్చర్యపోతున్నారు. సోహైల్ కోసం ఇంతలా కష్టపడినా ఓట్ల కోసం ఆయన పేరును హోస్లో ప్రశాంత్ ఎక్కడా ప్రస్థావించలేదని చెప్పుకొస్తున్నారు. -
మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
సయ్యద్ సోహైల్ రియాన్.. బిగ్‌బాస్ తర్వాతే ఈ పేరు చాలామందికి తెలిసొచ్చింది. అప్పటికే కొత్తబంగారు లోకం, జనతా గ్యారేజ్ వంటి చిత్రాల్లో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఒకరిగా కనిపించిన అతడు వెండితెరపై హీరోగా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే యురేక, లక్కీ లక్ష్మణ్ సినిమా చేసిన సోహైల్ ఇటీవలే మిస్టర్ ప్రెగ్నెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో రూపా కొడువాయుర్ హీరోయిన్గా నటించింది. ఆగస్టు 18న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఫలితంగా రోజురోజుకూ వసూళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం 4 రోజుల్లోనే రూ.4.6 కోట్లు రాబట్టింది. ఈ మేరకు చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. సోహైల్ ఎట్టకేలకు మంచి హిట్ కొట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడిగా పరిచయమయ్యాడు. మైక్ మూవీస్ బ్యానర్లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. నిజానికి మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాను శ్రీనివాస్ ఎవరైనా పెద్ద హీరోతో చేయాలనుకున్నాడు. ఎందుకంటే కొత్తవాళ్లతో చేస్తే సినిమాకు క్రేజ్ రాదని భావించాడు. అలా తన స్నేహితుడైన సోహైల్‌ను పక్కనపెట్టాడు. కానీ అతడు బిగ్‌బాస్ నుంచి రాగానే నువ్వే హీరో అని చెప్పి సోహైల్‌తో సినిమా తీసి హిట్ కొట్టాడు. ప్రస్తుతం సోహైల్.. బూట్ కట్ బాలరాజుతో పాటు, కథ వేరే ఉంటది అనే సినిమా చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Mic Movies (@mic_movies) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) చదవండి: బర్త్‌డే పార్టీలో డ్యాన్స్ చేసేదాన్ని.. ఆ డబ్బుతో పూట గడిచేది.. -
ముక్కు అవినాశ్ భార్య సీమంతం ఫంక్షన్లో సోహైల్ రచ్చ..
బిగ్‌బాస్ షోతో బడా క్రేజ్ సంపాదించుకున్న నటుడు సయ్యద్ సోహైల్ రియాన్. అప్పటిదాకా చిన్నాచితకా పాత్రలు చేసిన సోహైల్ ఈ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో హీరోగా మారాడు. ప్రస్తుతం అతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించగా మైక్ మూవీస్ బ్యానర్లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాగా పాజిటివ్ టాక్ అందుకుంటోంది. ఇకపోతే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోహైల్ జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ ఇంట జరిగిన ఫంక్షన్‌కు వెళ్లాడు. అవినాశ్ భార్య అనూజ సీమంతం వేడుక జరిగిన విషయం తెలిసిందే! ఈ వేడుకకు వెళ్లిన సోహైల్ తనకూ సీమంతం చేయాలని పట్టుపట్టాడు. తాను కూడా ప్రెగ్నెంటేనని, తనకెందుకు ఫంక్షన్ చేయరని అడిగాడు. మగవాళ్లకు గర్భం రావడం ఏంటి? అని తిడుతూనే అవినాశ్ అతడిని కూర్చోబెట్టి పట్టు బట్టలు పెట్టి నెత్తిన అక్షింతలు వేసి ఆశీర్వదించాడు. చివర్లో ఆగస్టు 18 డెలివరీ డేట్.. మిస్టర్ ప్రెగ్నెంట్ థియేటర్లలో చూడండి అని కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చేశాక సోహైల్‌పై చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే అతడిని ప్రేమించే వారు ఉన్నట్లే, ఇష్టం లేని వారూ ఉంటారని లైట్ తీసుకున్నాడు. అంతదాకా ఎందుకు, ఈ సినిమా గురించి అతడి తల్లి కూడా మొదట్లో నెగిటివ్‌గా మాట్లాడింది. కానీ సినిమా చూశాక గర్వంగా ఫీలైంది. కన్నీళ్లు పెట్టుకుంది. ఓ మంచి సినిమా చేశావంటూ సోహైల్‌ను మెచ్చుకుంది. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) చదవండి: ‘మిస్టర్ ప్రెగ్నెంట్’మూవీ రివ్యూ జైలర్‌లో డ్యాన్స్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఫేమస్ అవ్వడానికి ముందే గదిలో శవమై.. -
‘మిస్టర్ ప్రెగ్నెంట్’మూవీ రివ్యూ
టైటిల్: మిస్టర్ ప్రెగ్నెంట్ నటీనటులు: సోహైల్, రూపా కొడవాయుర్ ,సుహాసిని మణిరత్నం, వైవా హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర తదితరులు నిర్మాణ సంస్థ: మైక్ మూవీస్ నిర్మాతలు: అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి దర్శకత్వం: శ్రీనివాస్ వింజనంపాటి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ విడుదల తేది: ఆగస్ట్ 18, 2023 కథేంటంటే.. గౌతమ్(సోహైల్) ఓ ఫేమస్ టాటూ ఆర్టిస్ట్. చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తుంటాడు. గౌతమ్ అంటే మహి(రూపా కొడవాయుర్)కి చాలా ఇష్టం. కాలేజీ డేస్ నుంచి అతన్ని ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. ఓ సారి ఫుల్‌గా తాగి ఉన్న గౌతమ్‌ని దగ్గరకి వచ్చి ప్రపోజ్ చేస్తుంది మహి. పెళ్లి చేసుకుందాం అని కోరుతుంది. దానికి ఒప్పుకున్న గౌతమ్.. పిల్లలు వద్దనుకుంటేనే పెళ్లి చేసుకుందామని కండీషన్ పెడతాడు. అయితే ఇదంతా గౌతమ్ మద్యంమత్తులో చెప్తాడు. కానీ మహి మాత్రం గౌతమ్ కోసం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చెయించుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. విషయం తెలుసుకున్న గౌతమ్.. మహికి తనపై ఉన్న ప్రేమను అర్థం చేసుకొని పెళ్లికి ఓకే చెబుతాడు. మహి పేరెంట్స్ మాత్రం పెళ్లికి అంగీకరించరు. దీంతో మహి ఇంట్లో నుంచి బయటకు వచ్చి గౌతమ్‌ని పెళ్లి చేసుకుంటుంది. కొన్నాళ్లపాటు ఎంతో అనోన్యంగా వీరి జీవితం సాగుతుంది. పిల్లలే వద్దనుకున్న గౌతమ్‌కి పెద్ద షాక్ తగులుతుంది. మహి గర్భం దాల్చుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గౌతమ్ ఎందుకు గర్భం మోయాల్సి వచ్చింది? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఓ మగాడు ప్రెగ్నెంట్ అయితే సమాజం అతన్ని ఎలా చూసింది? చివరకు అతని డెలివరీ సాఫీగా సాగిందా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఓ మగాడు గర్భం దాల్చడం అనే కాస్సెప్టే చాలా కొత్తగా ఉంది. ఇదొక ప్రయోగం కూడా. ఇలాంటి కథలను తెరపై చూపించడం కత్తిమీద సాములాంటిదే. కాస్త తేడా కొట్టినా.. ‘కథ వేరుంటుంది’. తొలి ప్రయత్నంలోనే దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఇలాంటి క్రేజీ పాయింట్‌ని ఎంచుకొని, దాన్ని తెరపై కన్విన్సింగ్‌గా చూపించాడు. కామెడీ, ఎమోషన్స్, ప్రేమ, రొమాన్స్ ఇలా అన్ని ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అయితే వాటిని పూర్తిగా వాడుకోవడంలో మాత్రం కాస్త తడబడ్డారు. ఫస్టాఫ్‌లో కథ రొటీన్‌గా సాగుతుంది. గౌతమ్‌ని మహి ప్రేమించడం.. అతని చుట్టూ తిరగడం..మధ్యలో టాటూ పోటీ నిర్వహించడం.. క్లైమాక్స్ కోసమే అన్నట్లు ఓ విలన్ని పరిచయం చేయడం..ఇలా కథనం సాగుతుంది. అసలు హీరోయిన్ హీరోని ఎందుకు అంత పిచ్చిగా ప్రేమిస్తుందనేది బలంగా చూపించలేకపోయారు. హీరో హీరోయిన్ల పెళ్లి తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. ఆటో సీన్‌తో కథ ఎమోషనల్ వైపు సాగుతుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా భావోద్వేగానికి గురిచేస్తుంది. హీరో ఎందుకు గర్భం దాల్చుతున్నారనేది కన్విన్సింగ్‌గా చూపించారు.ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో కథ ఆసక్తికరంగా, ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అప్పటివరకు వైవా హర్ష రొటీన్ కామెడీతో కాస్త విసిగిపోయిన ప్రేక్షకులకు బ్రహ్మాజీ ఎంట్రీ పెద్ద ఊరటనిస్తుంది. ‘గే’క్యారెక్టర్‌తో బ్రహ్మాజీ చేసే కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. ఆ తర్వాత వెంటనే కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. గౌతమ్ గర్భం దాల్చిన విషయం వైరల్ కావడం.. ఆ తర్వాత అతను పడే అవమానాలు, భార్య పడే ఇబ్బందులను చాలా బాగా డీల్ చేశారు. ఇక క్లైమాక్స్‌లో ఆడవారి గురించి, గర్భం దాల్చిన సమయంలో వారు పడే ఇబ్బందుల గురించి చేప్పే సీన్ ఎమోషనల్‌కు గురిచేస్తుంది. భార్యకు సాయం చేస్తే అర్థం చేసుకోవడం కానీ ఆడంగితనం ఎలా అవుతుంది? లాంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఓవరాల్‌గా ఓ డిఫరెంట్ మూవీ చూద్దామనుకుంటే 'మిస్టర్ ప్రెగ్నెంట్' ప్రయత్నించండి. ఎవరెలా చేశారంటే.. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. గౌతమ్ పాత్రలో సొహెల్ బాగా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ప్రేక్షకుల్ని కన్నీళ్లు పెట్టించాడు. హీరోయిన్గా చేసిన రూపకు మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. వైవా హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్ తమదైన కామెడీతో నవ్వించారు. డాక్టర్ వసుధగా సుహాసినికి మంచి పాత్ర దక్కింది. మిగతా యాక్టర్స్ తమ పరిధి మేరకు నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సినిమా స్థాయిని పెంచింది. పాటలు పర్వాలేదు. పిక్చరైజేషన్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ సినిమాకు సరిగా సరిపోయింది. సినిమాటోగ్రాఫర్ షఫీ.. తన లెన్స్‌తో మిస్టర్ ప్రెగ్నెంట్‌ని అందంగా చూపించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని మూవీ చూస్తే అర్థమవుతుంది. -
ప్రెగ్నెంట్‌గా నటించడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్: సోహైల్
‘నేను బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాను. అయితే సినిమాలో హీరోగా నటిస్తే నన్ను చూసేందుకు థియేటర్ దాకా వస్తారా అనే సందేహం ఉండేది. స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలు చేస్తే వర్కవుట్ అవుతుంది. వాళ్లకు అభిమానులు ఉంటారు. కానీ నాలాంటి యంగ్ హీరోస్ వెరైటీ మూవీస్, కొత్త ప్రయత్నాలు చేస్తే ప్రేక్షకులు మన సినిమాలకు వస్తారు అని నమ్మాను. అందుకే మిస్టర్ ప్రెగ్నంట్ వంటి న్యూ జానర్ మూవీ చేస్తున్నాను’ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ అన్నారు. . ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. మైక్ మూవీస్ బ్యానర్లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించారు. రేపు(ఆగస్ట్ 18)ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సోహైల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి నాకు ఎనిమిదేళ్లుగా ఫ్రెండ్. ఈ కథతో ఎవరైనా ఒక పెద్ద హీరోతో సినిమా చేయాలని అనుకున్నాడు. ఎందుకంటే మనిద్దరం కొత్తవాళ్లమే సినిమాకు క్రేజ్ రాదు అనేవాడు. నేను అప్పటికి బిగ్ బాస్ లోకి వెళ్లలేదు. నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక ఈ సినిమాకు నువ్వు హీరో అని చెప్పి సైన్ చేయించాడు. అలా ఈ మూవీ స్టార్ట్ అయ్యింది. ► మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ లో నటించడం నాకొక డిఫరెంట్ ఎక్సీపిరియన్స్. మా ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ నేను ఈ సినిమా ఒప్పుకునేప్పటికి ప్రెగ్నెంట్ గా ఉన్నారు. వాళ్లు ఎలా నడుస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా పనులు చేస్తున్నారు అంతా గమనించాను. అలాగే మా దర్శకుడు శ్రీనివాస్ గుడ్ ఫ్యామిలీ పర్సన్. ఆయన మంచి సూచనలు ఇచ్చేవారు. అలా ఈ క్యారెక్టర్ బాగా చేశాను. ఈ క్యారెక్టర్ చేసేప్పుడు మూడు కిలోల బరువున్న ప్రోత్సటిక్స్ ధరించాను. ఆ కొద్ది బరువే నాకు ఇబ్బందిగా అనిపించేది. తొమ్మిది నెలలు అమ్మ మనల్ని మోసేందుకు ఎంత కష్టపడుతుందో మనం ఊహించుకోవచ్చు. ► ఈ సినిమా షో చూసిన తర్వాత చాలా మంది మహిళలు అమ్మ పడే ఇబ్బందులు బాగా చూపించారని ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకుని చెప్పారు. మా సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందని అనేందుకు వాళ్ల రెస్పాన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. దీంతో మా ప్రయత్నం సక్సెస్ అయ్యిందనిపించింది. రేపు థియేటర్ లోనూ ఇదే రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. ► ఈ సినిమా అనౌన్స్ చేశాక చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే నన్ను ప్రేమించే వారు ఉన్నట్లే, ఇష్టం లేని వారూ ఉంటారని అనుకున్నా. ఈ సినిమా గురించి మా అమ్మ కూడా మొదట్లో నెగిటివ్ గా చెప్పింది. కానీ సినిమా చూశాక ప్రౌడ్ గా ఫీలయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఓ మంచి సినిమా చేశావని నన్ను మెచ్చుకుంది. ► మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా గ్లింప్స్ చూపించినప్పుడు నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు. నువ్వు డిఫరెంట్ మూవీ చేస్తున్నావు. కొత్త వాళ్లు ఇలాగే కొత్త ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ►ప్రస్తుతం బూట్ కట్ బాలరాజు షూటింగ్ జరుగుతోంది. కథ వేరే ఉంటది అనే మరో సినిమా చేస్తున్నాను. సెలెక్టెడ్ గా మూవీస్ చేయాలని ఉంది. బాలీవుడ్ లో ఆయుశ్మాన్ ఖురానాలా తెలుగులో డిఫరెంట్ మూవీస్ చేయాలని ఉంది. -
పెద్ద హీరోలతో సినిమాలు చేయడం కష్టమే: నిర్మాత అప్పిరెడ్డి
‘మా సంస్థలో పెద్ద హీరోలతోనూ సినిమాలు చేయాలని ఉంది. కానీ వాళ్లంతా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. వాస్తవానికి వాళ్లను ఒక స్క్రిప్ట్ తో అప్రోచ్ అవడమే కష్టం. వాళ్లకు నచ్చినా రెండు మూడేళ్లు వెయిట్ చేయాలి. ఎక్కువ టైమ్ వెయిట్ చేస్తే అప్పుడు అనుకున్న స్క్రిప్ట్ కూడా ఔట్ డేటెడ్ అయ్యే అవకాశాలుంటాయి. కానీ మాకు అన్నీ కుదిరితే తప్పకుండా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తాం’అని నిర్మాత అప్పిరెడ్డి అన్నారు. బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్, రూపా కొడవాయుర్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ.. మా మైక్ మూవీస్ సంస్థలో ప్రతి సినిమా కొత్తగా ఉండేలా చూసుకుంటున్నాం. మన ప్రేక్షకులకు నచ్చేలా, మన నేటివిటీ ఉంటే కథలతో సినిమాలు చేస్తున్నాం. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’కథలో మదర్ సెంటిమెంట్ బాగా నచ్చింది. అయితే మేల్ పెగ్నెన్సీ నేపథ్యం కాబట్టి ఇండస్ట్రీలో కొందరు స్నేహితులు ఇది కత్తి మీద సాము లాంటి సినిమా అని చెప్పారు. ఇది ఛాలెంజింగ్ స్క్రిప్ట్. మేము కూడా అలాగే తీసుకుని చేశాం. ఈ చిత్రం కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది’అని అన్నారు. వెంకట్ అన్నపరెడ్డి మాట్లాడుతూ.. ముందుగా‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు వేరే హీరోల్ని అనుకున్నాం. అయితే బిగ్ బాస్ చూసినప్పుడు ఆ గేమ్స్ లోని ఎమోషన్ ను సొహైల్ ఇంప్రెసివ్ గా చూపించాడు. అప్పుడే అనుకున్నాం ఈ కథకు హీరోగా బాగుంటాడని. అతనికి ఈ సినిమాలో మంచి పేరొస్తుంది. మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ ను ఎంతో సహజంగా చేశాడు. ఈ సినిమాను కమర్షియల్ మూవీ ఫార్మేట్ లో చూడకూడదు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చూశాక చాలా మంది తమ ఎక్సీపిరియన్స్ మాతో షేర్ చేసుకున్నారు. మా వైఫ్ ను ప్రెగ్నెంట్ టైమ్ లో ఇంకా బాగా చూసుకుని ఉండాల్సింది అన్నారు. అలా ఎవరికి వారిని వ్యక్తిగతంగా ఆలోచింపజేసే చిత్రమవుతుంది’ అన్నారు. ‘ఇలాంటి కథతో తెలుగులో ఇప్పటివరకు మూవీ రాలేదు. ఇంగ్లీష్ లో వచ్చినా...అది ఎక్స్ పర్ మెంటల్ గా చేశారు. కామెడీ మీద బేస్ అయి ఉంటుంది. ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్‌తో సాగే మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రం చూసి అంతా ఎంజాయ్ చేస్తారు’ అని రవీందర్ రెడ్డి సజ్జల అన్నారు. -
మిస్టర్ ప్రెగ్నెంట్.. అంతా ఉల్టా పల్టా
సయ్యద్ సోహైల్ రియాన్, రూపాకొడవాయుర్ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంలో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మించారు. ఈ నెల 18న ఈ చిత్రం విడుదల కానుంది. నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘ఉల్టా పల్టా..’ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వింజనంపాటి మాట్లాడుతూ – ‘‘అమ్మతనం బాధ్యతను ఒక అబ్బాయి తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ రాశాను. సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి జాగ్రత్తగా రూ΄÷ందించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నా సిస్టర్స్ ఇద్దరు ప్రెగ్నెంట్. వాళ్లను చూసి ప్రెగ్నెంట్ ఉమెన్ బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నాను’’ అన్నారు సోహైల్. ‘‘పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ చూసి, మంచి సినిమా చేశారని ప్రశంసించారు’’ అన్నారు అప్పిరెడ్డి. ‘‘యూఎస్‌లో 100 స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు వెంకట్ అన్నపరెడ్డి. ‘‘అప్పిరెడ్డి జడ్జిమెంట్ మీద నమ్మకంతో ఈ సినిమా చేశాం’’ అన్నారు రవీందర్ రెడ్డి సజ్జల. -
Mister Pregnant Trailer Launch Event: ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ట్రైలర్ లాంచ్.. ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున (ఫొటోలు)
-
అందరి ముందు కన్నీరు పెట్టుకున్న ‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్
‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. రూపా కొడవాయుర్ హీరోయిన్గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఆగస్టు 18న విడుదలకు సిద్ధమవుతోంది. (ఇదీ చదవండి: యంగ్ హీరోపై బాహుబలి నిర్మాత శోభు సంచలన వ్యాఖ్యలు) హీరో సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోహైల్‌తో పాటు దీప్తి నల్లమోతు,రూపా,అలీ రెజా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ సోహైల్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా సమయంలో చాలా మంది అవమానించారని ఆయన కన్నీరు పెట్టుకున్నాడు. (ఇదీ చదవండి: రూ. 500 కోట్లు అయినా సరే నచ్చకపోతే నో చెప్పేస్తా: హీరోయిన్) ఇక్కడ లైఫ్‌లో ముందుకెళ్లాలి.. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా లేదా..? వీడు రియాల్టీ షో నుంచి వచ్చాడు, చిన్న స్క్రీన్ నుంచి వచ్చాడు అని అంటూ ఉంటే ఒక్కోసారి భయమేస్తూ ఉంటుందని ఆయన ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు కొందరు నెగిటివ్ కామెంట్లు చేశారు. తర్వాత ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు చాలామంది ఏందిరా ఈ తేడా గాడు.. అది ఇది అంటూ హేళన చేశారని ఆయన స్టేజీపైనే అందరి ముందు కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో ఆయన్ను అభిమానించే వారు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. -
సోహైల్ సరికొత్త ప్రయోగం.. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ వచ్చేస్తుంది
‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ రియాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. రూపా కొడవాయుర్ హీరోయిన్గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఆగస్టు 18న విడుదలకు సిద్ధమవుతోంది. హీరో సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. తెలుగు తెరపై ఇదొక కొత్త తరహా ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. సినిమా ఔట్ పుట్ విషయంలో చిత్రబృందం సంతృప్తిగా ఉన్నారు. రిలీజ్ కు కూడా ఆగస్టు 18 మంచి డేట్ గా భావిస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలకు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సక్సెస్ సాధిస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. -
‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ వచ్చేస్తున్నారు
బిగ్‌బాస్ ఫేం సోహైల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. మార్చి 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషం. సునీల్, కృష్ణభగవాన్, సన, ప్రవీణ్, సప్తగిరి, అజయ్‌ఘోష్, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర లాంటి సీనియర్ నటులంతా ఇందులో ఉన్నారు. తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. -
'ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు' మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన లక్కీ లక్ష్మణ్
బిగ్‌బాస్ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ హీరోగా నటించిన చిత్రం లక్కీ లక్ష్మణ్. మోక్ష కథానాయికగా నటించింది. ఎఆర్ అభి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై హరిత గోగినేని నిర్మించారు. డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహాలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని సోహైల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. థియేటర్లో సినిమా చూడటం మిస్ అయిన ఫ్యాన్స్ ఇప్పుడు ఎంచక్కా ఓటీటీలో చూసేస్తామని కామెంట్లు చేస్తున్నారు. కథేంటంటే.. లక్ష్మణ్(సోహైల్) మధ్య తరగతి యువకుడు. చిన్నప్పటి నుంచి ఏదడిగినా డబ్బులు లేవని చెప్పే తండ్రిపై కోపం పెంచుకుంటాడు. అమ్మాయిలకు దూరంగా ఉంటూ బుద్ధిగా చదువుకుంటాడు. అయితే బీటెక్‌లో చేరిన తొలిరోజే శ్రేయ(మోక్ష) పరిచయం అవుతుంది. పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఆమె ధనవంతురాలు కావడంతో లక్కీకి కావాల్సినవన్నీ ఇస్తుంది. ఓ విషయంలో వీరు బ్రేకప్ చెప్పుకుంటారు. తర్వాత లక్ష్మణ్ మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేసి బాగా డబ్బులు సంపాదిస్తాడు. కట్ చేస్తే ఓరోజు స్టోర్ మేనేజర్లో పని చేస్తున్న శ్రేయను చూసి లక్కీ షాకవుతాడు. అసలు వీరికి బ్రేకప్ ఎందుకైంది? ధనవంతురాలైన శ్రేయ స్టోర్ మేనేజర్‌గా ఎందుకు పని చేస్తుంది? లక్ష్మణ్ కోసం తండ్రి చేసిన త్యాగం ఏంటి? తండ్రి విలువను హీరో ఎప్పుడు తెలుసుకుంటాడు? అనేదే కథ. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) చదవండి: కొడుకే నా భర్తను హత్య చేసి ఆ నింద నాపై వేశాడు -
‘లక్కీ లక్ష్మణ్’ మూవీ రివ్యూ
టైటిల్: లక్కీ లక్ష్మణ్ నటీనటులు: సయ్యద్ సోహైల్, మోక్ష, దేవీ ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని తదితరులు నిర్మాణ సంస్థ: దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాత: హరిత గోగినేని కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.అభి సంగీతం: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ: ఐ.అండ్రూ ఎడిటర్: ప్రవీణ్ పూడి విడుదల తేది: డిసెంబర్ 30, 2022 బిగ్ బాస్ ఫేం సయ్యద్ సోహైల్, మోక్ష హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఎ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. నేడు(డిసెంబర్ 30) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. లక్ష్మణ్(సోహైల్) ఓ మధ్య తరగతి యువకుడు. చిన్నప్పటి నుంచి తండ్రి(దేవీ ప్రసాద్) ఏది అడిగినా..డబ్బులు లేవని చెబుతాడు. దీంతో తండ్రిపై లక్ష్మణ్‌కు కోపం ఏర్పడుతుంది. పెద్దయ్యాక తన తండ్రిలాగా ఉండొద్దని, చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించిన విలాసవంతమైన జీవితం అనుభవించాలనుకుంటాడు. అందుకే అమ్మాయిలకు దూరంగా ఉంటూ బుద్దిగా చదువుకుంటాడు. అయితే బీటెక్‌లో చేరిన తొలి రోజే అతనికి శ్రేయ(మోక్ష) పరిచయం అవుతుంది. ఆమె బాగా ధనవంతురాలు. అయినా ఆ పొగరు ఎక్కడా చూపించదు. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి..అది కాస్త ప్రేమగా మారుతుంది. లక్ష్మణ్ కుటుంబ నేపథ్యం తెలుకున్న శ్రేయ.. అతనికి కావాల్సినవన్నీ ఇస్తుంది. లక్ష్మణ్ ఇంటి నుంచి బయటకు వచ్చేసి ఒక్కడే ఓ అపార్ట్మెంట్లో ఉంటాడు. ఓ విషయంలో శ్రేయ, లక్ష్మణ్ మధ్య గొడవ జరిగి బ్రేకప్ చెప్పుకుంటారు. ఆ తర్వాత లక్ష్మణ్ ఓ మ్యారేజ్ బ్యూరో స్టార్ చేసి నాలుగేళ్లలో బాగా డబ్బులు సంపాదిస్తాడు. కట్ చేస్తే.. ఓ రోజు ఒక స్టోర్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న శ్రేయను చూసి లక్ష్మణ్ షాకవుతాడు. బాగా డబ్బులున్న శ్రేయ స్టోర్ మేనేజర్‌గా ఎందుకు ఉద్యోగం చేస్తుంది? లక్ష్మణ్, శ్రేయల బ్రేకప్‌కి కారణం ఏంటి? ఒకప్పుడు మంచి ఇల్లు.. ఆస్తులు ఉన్న లక్ష్మణ్ తల్లిదండ్రులు ఇప్పుడు ఎందుకు అద్దె ఇంట్లో ఉన్నారు? లక్ష్మణ్ కోసం తండ్రి చేసిన త్యాగం ఏంటి? పేరెంట్స్ విలువను లక్ష్మణ్ ఎప్పుడు తెలుసుకున్నాడు? చివరకు శ్రేయ, లక్ష్మణ్‌లు మళ్లీ ఎలా ఒకటయ్యారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘డబ్బులు ఉంటే చాలు.. అన్ని వచ్చేస్తాయి. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత సుఖంగా బతుకుతాం’అని చాలా మంది భావిస్తారు. అలా అనుకున్న ఓ యువకుడి కథే ఈ ‘లక్కీ లక్ష్మణ్’. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు.. అమ్మాయి ప్రేమ ... ఏదీ తక్కువ కాదు. అలాంటి వాటి కంటే డబ్బు గొప్పది కాదనే ఓ మంచి సందేశాన్ని అందించిన సినిమా ఇది. దర్శకనిర్మాతలు కమర్షియల్‌గా ఆలోచించకుండా ఓ మంచి సందేశాన్ని అందించారు. ఈ విషయంలో వారిని మెచ్చుకోవాల్సిందే. అయితే ఈ మూవీ కథనం మాత్రం రొటీన్‌గా సాగుతుంది. కాలేజీ నేపథ్యం.. ప్రేమ.. బ్రేకప్ ఇలా ప్రతీది గత సినిమాలలో చూసిన సన్నివేశాలే. కొన్ని చోట్ల లాజిక్ లేకుండా కొన్ని సీన్స్ వచ్చిపోతుంటాయి. మధుతో లక్ష్మణ్ ఫోన్ కాల్ సీన్ నవ్విస్తుంది. ఇంటర్వెల్ వరకూ రొటీన్‌గా సాగే ఈ కథ.. సెకండాఫ్ నుంచి టర్న్ తీసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే ఫస్టాఫ్‌కు సెకండాఫ్‌కు సంబంధమే లేదన్నట్లుగా కథనం సాగుతుంది. లక్ష్మణ్ మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేయడం.. ఎమ్మెల్యే కొడుకు పెళ్లి జరిపించడం..బాగా డబ్బులు సంపాదించన తర్వాత పెరెంట్స్ విలువ తెలుకొవడం..ఇలా సెకండాఫ్ సాగుతుంది. క్లైమాక్స్‌కు 20 నిమిషాల ముందు ప్రేక్షలు కథలో లీనం అవుతారు. క్లైమాక్స్ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో సోహైల్ నటన సింప్లీ సూపర్బ్. లక్ష్మణ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. శ్రీ పాత్రకు మోక్ష న్యాయం చేసింది. కాలేజీ సీన్స్‌లో తెరపై అందంగా కనిపిస్తుంది. హీరో తండ్రి స్నేహితుడిగా కాబందరి ఒకే ఒక సీన్లో కనిపిస్తాడు. కానీ అతను చెప్పే సంభాషణలు అలా గుర్తిండిపోతాయి. ఇక హీరో తండ్రిగా దేవి ప్రసాద్ తన పాత్రకు న్యాయం చేశాడు. హీరో స్నేహితులు కిరణ్, చరణ్ పాత్రలు పోషించిన వారి నటన, కామెడీ బాగుంది. ఎమ్మెల్యేగా రాజా రవీంద్ర, కాలేజీ స్టూడెంట్‌గా యాదమ్మ రాజుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అనూబ్ రూబెన్స్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ ఐ.అండ్రూ పనితీరు బాగుంది. నిర్మాత హరిత గోగినేని ఖర్చుకు వెనకాడకుండా సినిమాను చాలా రిచ్‌గా తెరకెక్కించారు. -
‘ఇచ్చిపడేస్తా కొడకల్లారా’ అంటే లక్షా ఇరవై వేల వ్యూస్, 700 కామెంట్స్: సోహైల్
‘‘ఇండస్ట్రీలో అందరిలానే మేం కూడా మంచి హిట్ సాధించాలనే ‘లక్కీ లక్ష్మణ్’ తీశాం. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. అయితే మా సినిమా ప్రివ్యూ చూసిన ఓ సీనియర్ నిర్మాత ‘సోహైల్ నువ్వు సేఫ్’ అన్నారు.. ఆ మాట చాలనిపించింది’’ అని సయ్యద్ సోహైల్ అన్నారు. ఏఆర్ అభి దర్శకత్వంలో ‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష జంటగా తెరకెక్కిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. హరిత గోగినేని నిర్మించిన ఈ సినిమా నేడు(డిసెంబర్ 30) విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ – ‘‘బిగ్‌బాస్’ షో తర్వాత నేను కమిట్ అయిన తొలి చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఇంకా రిలీజ్ కాకపోవడంతో డిప్రెషన్‌కి లోనయ్యాను. ఆ తర్వాత ‘బూట్‌కట్ బాలరాజు’, ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘లక్కీ లక్ష్మణ్’ సినిమాలు చేశాను. అయితే ‘లక్కీ లక్ష్మణ్’ ముందు విడుదలవుతోంది. ఫ్యామిలీతో సహా యూత్‌కు నచ్చే అందమైన ప్రేమకథ ఇది. మన లైఫ్‌లో కష్టంతో పాటు అదృష్టం కూడా కావాలి. నేను సినిమాల్లోకి వెళతానన్నప్పుడు మా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఎవరూ నన్ను సపోర్ట్ చేయలేదు. కానీ, మా నాన్న సలీం మాత్రం నాపై నమ్మకంతో వెళ్లమన్నారు. హైదరాబాద్ వచ్చాక సీరియల్స్‌లో నటిస్తూ నెలకు 40 వేలు సంపాదించేవాణ్ణి. అందులో సగం ఇంటికి పంపేవాణ్ణి. ఆ తర్వాత ‘బిగ్ బాస్’ చాన్స్ వచ్చింది.. ఆ షో తర్వాత సినిమా చాన్స్‌లు వస్తున్నాయి. అభిగారు ‘లక్కీ లక్ష్మణ్’ని బాగా తీశారు. మా నిర్మాత హరితగారు సినిమాపై నమ్మకంతో సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. ఇక ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’లో హీరోగా నన్ను తీసుకోవద్దని కొందరు చెప్పినా నాకే అవకాశం ఇచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డిగారి మేలు ఎప్పటికీ మరచిపోలేను. వ్యక్తిగతంగా ‘సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్’ పేరుతో నాతో పాటు 30 మంది స్నేహితులు కలిసి సాయం చేస్తున్నారు. ఇప్పటివరకు ఐదుగురికి గుండె ఆపరేషన్ చేయించాం. ఏడు కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నాం. 10 మంది పిల్లల విద్యకి సాయం చేస్తున్నాం. ఇప్పుడు నా చేతిలో నాలుగు సినిమాలున్నాయి’’ అన్నారు. ‘ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే కొంత మంది నెగటివ్‌గా తీసుకుంటున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో మా ఇంట్లోని వాళ్లను కూడా తిడుతున్నారు.. అందుకే నేను రియాక్ట్ అయ్యాను. అలా అవటం సమస్య అవుతోంది. ‘నా సక్సెస్‌కు మా నాన్నే కారణం’ అని ప్రీ రిలీజ్లో మాట్లాడిన ΄పాజిటివ్ వార్తకి కేవలం 500 వ్యూస్ మాత్రమే వచ్చాయి. అదే ‘ఇచ్చిపడేస్తా కొడకల్లారా’ అని అన్న మాటకు లక్షా ఇరవై వేల వ్యూస్, 700 కామెంట్స్, షేర్స్ వచ్చాయి. నెగిటివ్‌ని అంతగా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావటం లేదు’ అని సోహైల్ అన్నారు. -
మీ ఇంటికొచ్చి తరిమి తరిమి కొడతా: సోహైల్ వార్నింగ్
సయ్యద్ సోహైల్.. మొదటగా సీరియల్స్‌లో, సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించాడు. కానీ అంత గుర్తింపు రాలేదు. అయితే బిగ్‌బాస్ షో అతడి తలరాతనే మార్చేసింది. ఈ ఒక్క షో వల్ల చిన్నచిన్న రోల్స్ చేసుకునే స్టేజ్ నుంచి హీరోగా నటించే స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం మూడు, నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు సోహైల్. అయితే బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ గురించి ఎప్పుడు చర్చ వచ్చినా సోహైల్ పేరు తప్పకుండా వినిపిస్తోంది. బిగ్‌బాస్ ఆఫర్ చేయగానే రూ.25 లక్షలు తీసుకున్నాడంటూ కొందరు ఇప్పటికీ అతడిని విమర్శిస్తూనే ఉన్నారు. ఈ ట్రోలింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు సోహైల్. లక్కీ లక్ష్మణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సోహైల్ మాట్లాడుతూ.. 'సూట్‌కేస్ తీసుకెళ్లాడు, పెద్ద స్కామ్ చేశాడంటున్నారు. ఆ డబ్బులు మీ ఇంట్లో నుంచి తీసుకోలేదు. ఎవరినీ మోసం చేయలేదు, దొంగతనం అంతకన్నా చేయలేదు. నాకు ఆఫర్ వచ్చింది తీసుకున్నా.. ఎందుకంటే మాలాంటి మధ్యతరగతి వాళ్లకు రూ.25 లక్షలంటే రెండు కోట్లతో సమానం. ఆ డబ్బుతో నా చెల్లె పెళ్లి చేశాను. ప్రజలు వేసిన ఓట్లు ఏవీ వృథా కాలేదు. ఓ ఆడపిల్ల పెళ్లి చేశా, అంతకంటే ఏం కావాలి. నాకు వచ్చే డబ్బుల్లో పదిమందికి సాయం చేయడమే నాకు తెలుసు. నన్ను ఎవరైతే తిడుతున్నారో వాళ్లకు ఒకటే చెప్తున్నా.. నన్ను ఎంత హేట్ చేసినా పర్లేదు కానీ పేరెంట్స్‌ను తిడితే మాత్రం ఊరుకోను. కొడకల్లారా? మీ ఇంటికొచ్చి తరిమి తరిమి మరీ కొడ్తా.. సినిమా ఇండస్ట్రీలోని ఎవరినైనా సరే విమర్శించండి తప్పులేదు, కానీ వారి ఇంట్లోవాళ్లను గలీజ్ బూతులు తిడితే మాత్రం వెతికి మరీ కొడ్తా' అని స్టేజీపై వార్నింగ్ ఇచ్చాడు. కాగా లక్కీ లక్ష్మణ్ చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది. చదవండి: చెప్పులు కూడా వదిలేసి పారిపోయిన హీరోయిన్ కొడుకు చనిపోయాడు, అదే రోజు వాల్తేరు వీరయ్య షూటింగ్ -
'లక్కీ లక్ష్మణ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మోకాళ్లపై కూర్చొని సోహైల్‌కు ప్రపోజ్ చేసిన ఇనయా
బిగ్‌బాస్ షోలో లేడీ టైగర్‌గా పాపులర్ అయిన కంటెస్టెంట్ ఇనాయా సుల్తానా. ఆర్జీవీ బ్యూటీ అనే ట్యాగ్ లైన్‌తో హౌస్‌లోకి ఎంటర్ అయిన ఇనయా సివంగిలా బయటకు వచ్చింది. బిగ్‌బాస్‌తో బోలెడం పాపులారిటీని దక్కించుకుంది. ఇక తాజాగా మరోసారి ఇనాయా పేరు నెట్టింట చక్కర్లు కొడుతుంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ సోహైల్ తన క్రష్ అని ఎన్నోసార్లు చెప్పిన ఇనాయా ఇప్పుడు ఏకంగా అతడికి ప్రపోజ్ చేసేసింది. రెడ్ డ్రెస్‌లో గులాబీ చేతిలో పట్టుకొని మోకాళ్లపై కూర్చొని మరీ సోహైల్‌కు తన ప్రేమను వ్యక్తపరిచింది. ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా అంటూ రొమాంటిక్‌గా ప్రపోజ్ చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లోనే చెబుదాం అనుకున్నా నువ్వు అంటే నాకు పిచ్చి. ఇప్పుడు చెబుతున్నా ఐ లవ్యూ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు మరి హౌస్‌లో ఆర్జే సూర్య అంటే ఇష్టమన్నావ్ కదా మరి ఇప్పుడేంటి? అని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Inaya Sultan (@inayasulthanaofficial) -
నడి సముద్రంలో పడిపోయిన సోహైల్, కాలికి గాయాలు
సింగరేణి ముద్దుబిడ్డ సోహైల్ బిగ్‌బాస్ షోతో ఎక్కడలేని క్రేజ్ సంపాదించాడు. ఆ గుర్తింపుతోనే వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు నటించిన లక్కీ లక్ష్మణ్ డిసెంబర్ 30న విడుదల కానుంది. ఈ క్రమంలో వెరైటీ ప్రమోషన్స్ మొదలుపెట్టాడు సోహైల్. యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని కలిసశాడు. ఇతడు చేపలు పడుతూ అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుంటాడు. అతడిని కలవడానికి సోహైల్ వైజాగ్ వెళ్లాడు. మత్స్యకారుడు నానితో కలిసి చేపలు పట్టడానికి సముద్రం మధ్యలోకి బోట్లో వెళ్లాడు. వల ఎలా విసరాలి? చేపలు పట్టడం ఎలా? ఇవన్నీ దగ్గరుండి చూపించాడతడు. అవన్నీ చూసి సర్ప్రైజ్ అయిన సోహైల్ పడవ చివరంచున నిలబడి ఫోటోకు పోజివ్వడానికి ప్రయత్నించాడు. ఇంతలో పట్టు తప్పి నడి సముద్రంలో పడిపోయాడు. వెంటనే నాని సముద్రంలో దూకి అతడిని రక్షించి పైకి తీసుకొచ్చాడు. కానీ సోహైల్ కాలికి గాయాలై రక్తం కారింది. ఏదేమైనా సోహైల్ పెద్ద గండం నుంచి బయటపడ్డాడని ఊపిరి పీల్చుకుంటున్నారు. అతడి అభిమానులు. చదవండి: పారిపోయి పెళ్లి చేసుకున్నాం, మిస్ క్యారేజ్ అయింది: నటి ఎమోషనల్ ఐదేళ్లుగా నటి సీక్రెట్ లవ్, ప్రియుడెవరో తెలుసా? -
సినిమాలు వర్కవుట్ కాలేదు, చనిపోదామనుకున్నా: సోహైల్
సోహైల్.. బిగ్‌బాస్ షోకు ముందు ఇతడెవరో కూడా జనాలకు తెలీదు. కానీ బిగ్‌బాస్ నాలుగో సీజన్ తర్వాత కథ వేరే ఉంది. ప్రేక్షకుల్లో ఇతడికి విశేష గుర్తింపు, స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతమైంది. బిగ్‌బాస్ హౌస్‌లో తన ఆటతో, మాటతో, చేష్టలతో, అరియానాతో గొడవలతో.. ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. ఈ షో తర్వాత పలు సినిమాలకు సంతకం చేసి షూటింగ్స్‌తో బిజీబిజీగా మారాడు. తాజాగా సోహైల్ ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చీకటిరోజులను గుర్తు చేసుకున్నాడు. 'ఒకానొక సమయంలో నా సినిమాలు వర్కవుట్ కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఏమీ సెట్టయితలేదు, నా లైఫ్ అయిపోయింది అని చచ్చిపోదామనుకున్నా' అని చెప్తూ ఎమోషనలయ్యాడు సోహైల్. కానీ బిగ్‌బాస్ షో అతడిలోని ఆశలకు మళ్లీ ప్రాణం పోసింది. ప్రస్తుతం సోహైల్ లక్కీ లక్ష్మణ్, మిస్టర్ ప్రెగ్నెంట్, ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు సినిమాలు చేస్తున్నాడు. చదవండి: పుష్ప 2 నుంచి పవర్ఫుల్ డైలాగ్ లీక్ రేవంత్, ఇది నీ దగ్గరే నేర్చుకున్నా: నాగార్జున -
బిగ్‌బాస్ సోహైల్ నటించిన ‘లక్కీ లక్ష్మణ్’ టీజర్ చూశారా?
‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. ఎ.ఆర్. అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మింన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకలో సోహైల్ మాట్లాడుతూ– ‘‘సక్సెస్ ఉన్నా లేకపోయినా అభిమానులు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. వారే నా ధైర్యం. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేలా ‘లక్కీ లక్ష్మణ్’ ఉంటుంది’’ అన్నారు. ‘‘సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి’’ అన్నారు అభిరామ్. ‘‘మా సినిమా బాగా రావడానికి ఏం చేయాలో అవన్నీ చేశాం. ఇక ప్రేక్షకులదే బాధ్యత. సినిమా బావుందంటే చాలు’’ అన్నారు హరిత. -
రాజ్ ఎలిమినేట్, అంధురాలి పెన్షన్‌తో ఐదేళ్లు బతికామన్న ఆది!
Bigg Boss 6 Telugu, Episode 84: ఇంటిసభ్యుల రాకతో హౌస్మేట్స్ ఫుల్ జోష్ మీదున్నారు. వారి జోష్ రెట్టింపు చేయడానికి మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌ను రప్పించారు. అయితే వారి గొంతు గుర్తుపడితనే వారితో మాట్లాడే అవకాశం కల్పిస్తానని మెలిక పెట్టాడు నాగ్. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ గొంతును గుర్తుపట్టడం డెడ్ ఈజీ కాబట్టి అందరూ ఎంచక్కా ఫ్యామిలీస్‌తో కబుర్లాడారు. మొదటగా ఇనయ కోసం ఆమె తమ్ముడితోపాటు మాజీ కంటెస్టెంట్ సోహైల్ వచ్చారు. ఇనయను, ఆమె తల్లిని కలిపినందుకు బిగ్స్కు కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే ఫినాలేలో డబ్బు ఆఫర్ చేస్తే తనలా సూట్‌కేస్ తీసుకోమని సలహా ఇచ్చాడు. తనకోసం వచ్చిన సోహైల్‌కు థ్యాంక్స్ చెప్పిన ఇనయ బయటకు వచ్చాక ఫోన్ నెంబర్ తీసుకుంటానంటూ మెలికలు తిరిగింది. సోహైల్ కోసం ఆమె మణికొండకు వచ్చిందని, తన జిమ్ సెంటర్లో జాయిన్ అయిందంటూ ఆమె గుట్టంతా బయటపెట్టాడు సోహైల్. ఇనయకు హౌస్‌లో రేవంత్ టఫ్ కాంపిటీషనర్ అని, ఆదిరెడ్డి అసలు పోటీ ఇవ్వడని ఇనయ తమ్ముడు అభిప్రాయపడ్డాడు. తర్వాత శ్రీహాన్ కోసం అతడి తండ్రి, శివబాలాజీ వచ్చారు. ఈ సందర్భంగా శివబాలాజీ.. నేను షో గెలిచి బయటకు వచ్చినప్పుడు రేవంత్ హౌస్‌లో జరిగేదంతా నిజమేనా? అడిగాడు. అవునని చెప్పినప్పుడు చచ్చినా బిగ్‌బాస్‌కు వెళ్లనన్నాడు. మరి ఇప్పుడేంటి? అంటూ ఆటపట్టించాడు. తర్వాత శ్రీహాన్‌కు రేవంత్ కాంపిటీషన్ అయితే, ఫైమా పోటీనే కాదని చెప్పాడు. ఈ 12 వారాల ఆటకు శ్రీహాన్‌కు 9 మార్కులిచ్చాడు. ఫైమా తన అక్క సల్మాను, బుల్లెట్ భాస్కర్‌ను చూడగానే ఏడ్చేసింది. భాస్కర్ అయితే పంచులతో అందరినీ నవ్వించాడు. ఇనయను ఎలా భరిస్తున్నారో అర్థం కావట్లేదన్నాడు. ఫైమాకు ఇనయ గట్టి పోటీ ఇస్తుందని, శ్రీసత్య పోటీనే కాదని చెప్పాడు. ఫైమా మాట్లాడుతూ.. అమ్మవాళ్లకు సొంతిల్లు కట్టించి, బ్యాంక్ బ్యాలెన్స్ సెట్ చేశాకే తాను పెళ్లి చేసుకుంటానంది. అనంతరం రేవంత్ అన్నయ్య సంతోష్, స్నేహితుడు రోల్ రైడా స్టేజీపైకి వచ్చారు. తన తమ్ముడికి శ్రీహాన్ పోటీ అని, రోహిత్ అసలు పోటీనే కాదన్నాడు. తర్వాత రోహిత్ కోసం అతడి తమ్ముడు డింప్, నటుడు ప్రభాకర్ వచ్చి పలకరించారు. రోహిత్‌కు రేవంత్ పోటీ అని, రాజ్ పోటీయే కాదని చెప్పాడు ప్రభాకర్. రేవంత్‌ను గెలిస్తే టైటిల్ గెలవడం ఈజీ అని ఉన్నమాట చెప్పి అందరికీ హింటిచ్చాడు. తర్వాత ఆదిరెడ్డి కోసం చెల్లెలు నాగలక్ష్మి, మాజీ కంటెస్టెంట్ లహరి వచ్చారు. నువ్వు కనిపించనందుకు బాధగా ఉందన్నా అంటూ అంధురాలైన నాగలక్ష్మి బాధపడింది. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.. ఐదేళ్లు నేను ఖాళీగా ఉన్నసమయంలో మా కుటుంబమంతా చెల్లెలు పెన్షన్‌తో బతికాం అని చెప్పాడు. ఆదికి రేవంత్ కాంపిటీషన్ అని, శ్రీసత్య పోటీయే కాదని చెప్పింది నాగలక్ష్మి. కళ్లు లేని పిల్ల అని నాతో ఎవరూ ఫ్రెండ్షిప్ చేయరు. ఇప్పుడు లహరి నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంది అని మురిసిపోయింది. శ్రీసత్య కోసం తన బెస్ట్‌ఫ్రెండ్ హారిక, నటి విష్ణుప్రియ స్టేజీపైకి వచ్చారు. ఆమెకు రేవంత్ పోటీ అని, కీర్తి పోటీయే కాదని చెప్పారు. శ్రీసత్యను తన తల్లి కోసం టెన్షన్ పడొద్దని సూచించారు. అమ్మకు రెగ్యులర్‌గా ఫిజియోథెరపీ జరుగుతోందని, తన ఆరోగ్యం గురించిఆందోళన పడొద్దని చెప్పారు. తర్వాత రాజ్ ఫ్రెండ్ వెంకీ, హీరో సాయిరోనక్ వచ్చి రాజ్‌కు ఆటలో రేవంత్ కాంపిటీషన్ అయితే, ఇనయ పోటీయే కాదని స్పష్టం చేశారు. కీర్తి కోసం ప్రియాంక, వితికాషెరు వచ్చారు. ఎవరూ లేరని నువ్వు బాధపడుతున్నావు, కానీ బయట చాలామంది నిన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు అని కీర్తిలో ధ:ర్యం నింపింది వితికా. కీర్తికి హౌస్‌లో శ్రీహాన్ పోటీ అని, శ్రీసత్య పోటీయే కాదని కుండ బద్ధలు కొట్టారు ప్రియాంక, వితికా. ఇకపోతే సండే షూటింగ్ ఆల్రెడీ పూర్తవగా రాజ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: నటించినందుకు నా భార్య ఇప్పటికీ ఏదోలా ఫీలవుతుంది: విష్ణు విశాల్ ఆ హీరోకు అమ్మాయిల పిచ్చి?: స్పందించిన కూతురు -
టాప్ 9 కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ మరో సర్ప్రైజ్
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈపాటికే ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించిన బిగ్‌బాస్ వీకెండ్లో మిగతా ఇంటిసభ్యులను, ఫ్రెండ్స్‌ను స్టేజీపైకి రప్పించి వారిని సర్ప్రైజ్ చేయనున్నాడు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. టాప్ 9 కంటెస్టెంట్ల కోసం వీజే సన్ని, రోల్ రైడా, బుల్లెట్ భాస్కర్, సింగర్ సాకెత్, సోహైల్ ఇలా ఎంతోమంది వచ్చారు. అయితే ఈసారి వారితో ఎవరు టాప్5 అనే గేమ్‌కు బదులుగా మరో డిఫరెంట్ గేమ్ ఆడించాడట. అదేంటో తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: అలాంటి కథలు చిరంజీవికి సెట్ కావు: పరుచూరి ఫైమా చేతిలో ఎలిమినేషన్, అతడే ఎలిమినేట్ కానున్నాడా? -
ఆమాత్రం దానికి మేమెందుకు?: రమ్యకృష్ణ ఫైర్
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారం అవుతున్న డాన్స్ ఐకాన్ షో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తూ దూసుకుపోతుంది. ఈ షో లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ వచ్చీ రావడంతోనే మాటల యుద్ధం మొదలయ్యింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకి అసిఫ్ అండ్ రాజు కలిసి చేసిన డ్యాన్స్‌కు సోహైల్ రెడ్ బోర్డు చూపించాడు. దాంతో హర్ట్ అయిన శ్రీముఖి.. అది మోనాల్ కూర్చున్న సీట్ ప్రభావం అంటూ గొడవ మొదలుపెట్టింది. దానికి సోహైల్ వాళ్ళిద్దరి మధ్య కో ఆర్డినేషన్ లేదని చెప్పాడు. తర్వాత గోవింద్, సౌమ్య డ్యాన్స్ చేసినప్పుడు యష్ మాస్టర్, శ్రీముఖి పెదవి విరిచారు. దీంతో సోహైల్ డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించడంతో శ్రీముఖి వెటకారం స్టార్ట్ చేసింది. ఈ లోగా రమ్యకృష్ణ కూడా మీరు చెప్పినట్టు చెప్పడానికి ఈ సీట్లో మేము కూర్చోవడం ఎందుకు అంటూ సీరియస్ అయ్యింది. మరి ఈ డాన్స్ రియాలిటీ షోలో ఇంకా ఎన్ని ట్విస్టులు, టర్నులు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ వారం డాన్స్ ఐకాన్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే. చదవండి: కృష్ణ సినిమాల్లోకి రావడానికి కారణమెవరో తెలుసా? అదే సూపర్‌స్టార్ కృష్ణ చివరి సినిమా! -
యమలీల చేసిన వాణ్ణి మరో లీల చేయలేనా ?: ఎస్వీ కృష్ణారెడ్డి
‘ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు అంటే ఒక రిలీఫ్. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలను చక్కగా ఏర్చి, కూర్చి అద్భుతమైన సంగీతంతో మనకు అందిస్తారు. ఉరుకు, పరుగుల ప్రస్తుత జనరేషన్‌కు రిలీఫ్ కోసం కృష్ణారెడ్డిగారి సినిమాలు ఎంతో అవసరం అని నా భావన. ఆయన సినిమాలలో కమర్షియల్ హంగులతో పాటు పిల్లలకు కావాల్సిన అంశాలన్నీ ఉంటాయి. ‘ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు’ మూవీ కృష్ణారెడ్డికి మంచి కమ్‌బ్యాక్ సినిమా అని ప్రముఖ దర్శఖుడు శేఖర్ కమ్ముల అన్నారు. సోహైల్, మృణాళినీ రవి జంటగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా సినిమా ‘ఆర్గానిక్ మామ– హైబ్రీడ్ అల్లుడు’. ఈ సినిమాను కల్పన కోనేరు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ టీజర్ చాలా బాగుంది. ఈ సినిమాను ఇంత అద్భుతంగా నిర్మించిన నిర్మాత కోనేరు కల్పన గారికి యూనిట్ సభ్యులకు నా కృతజ్ఞతలు. కృష్ణారెడ్డి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత సీ.కల్యాణ్ మాట్లాడుతూ.. దాదాపు 30 ఏళ్ల క్రితం ఆలీని హీరోగా పరిచయం చేస్తూ కృష్ణారెడ్డి గారు ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత మళ్లీ సోహెల్‌ను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తుండటం మేం సెంటిమెంట్‌గా భావిస్తున్నాం. చిరంజీవి గారు కెరీర్ ప్రారంభంలో ఎలా కష్టపడ్డారో అలాగే ఈ సినిమా కోసం సోహెల్ కూడా కష్టపడ్డాడు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సినిమా అందరికీ హిట్ ఇస్తుందని ఆశిస్తున్నా అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆర్గానిక్ మామ ` హైబ్రిడ్ అల్లుడు సినిమా ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అవుతోంది అంటే దానికి నేను కూడా ఒక కారణం తప్ప.. నేనే కారణం కాదు. నేను 40 దాకా సినిమాలు చేశాను. ఈ సినిమా నిర్మాత కల్పన గారి డెడికేషన్, ప్లానింగ్ చూసిన తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ నా కెరీర్లో ది బెస్ట్ అని చెపుతున్నాను. ఈ సినిమా విషయంలో అచ్చిరెడ్డి గారికి, నిర్మాత కల్పన గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. 44 రోజుల్లోనే సినిమా పూర్తయిపోయింది. ఆర్టిస్ట్‌ల విషయంలో కూడా నేను బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని పాత్రలకు చిన్న వారిని, కొత్త వారిని ప్రపోజ్ చేసినా, ఆమె మాత్రం పేరున్న ఆర్టిస్ట్‌లను మాత్రమే తీసుకోవాలని పట్టుబట్టి మరీ వారి డేట్స్ సంపాదించారు. సోహైల్ కథ విని ఈ సినిమా చేస్తే నేను ఎక్కడికో వెళ్లిపోతాను సార్ అని ఆనందపడిపోయాడు. అతని కలవగానే.. యమలీల చేసిన వాణ్ణి మరో లీల చేయలేనా అనిపించింది. రాజేంద్రప్రసాద్ గారు అయితే.. డబ్బింగ్ టైంలో కొన్ని సీన్లు చూసి ఏంటి నేను ఇంత బాగా చేశానా, ఇంత ఎమోషన్ ఈ కేరెక్టర్లో ఉందా? అని ఆశ్చర్య పోయారు. ఇంతమంది మంచి మనుషులు నా చుట్టూ ఉంటే నా నుంచి ఒక పెద్ద హిట్ ఎందుకు రాకుండా ఉంటుంది?. ఈ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు. కచ్చితంగా అందరికి నచ్చుతుంది’ అన్నారు. ‘చిన్నప్పటి నుంచి కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసి పెరిగాను. ఇప్పుడు ఆయన దర్వకత్వంలో నటించడం అంటే ఇప్పటికీ నమ్మలేని విషయంగానే అనిపిస్తుంది. నాలోని టాలెంట్‌ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత కల్పన గారికి నా థ్యాంక్స్. బిగ్‌బాస్ వల్ల నేను చాలా మందికి పరిచయం అయ్యాను. ఇప్పుడు కృష్ణారెడ్డి గారి సినిమా అంటే ఇక ప్రతి కుటుంబానికి చేరువౌతాను అనే నమ్మకం ఉంది. ప్రతి సినిమా కోసం ఇలానే కష్టపడతాను’అన్నారు సోహైల్. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు, ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి , నటుడు అలీ, హేమ, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బిగ్‌బాస్ ఫేమ్ సొహైల్ ‘లక్కీ లక్ష్మణ్’ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్..
Bigg Boss Sohel Lucky Laxman Title Song Released By Shiva Nirvana: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా దత్తాత్రేయ మీడియా పతాకంపై రూపొందిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. చుట్టూ ఉన్న వారంతా లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీ ఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందింది ఈ చిత్రం. ఎ.ఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్గా మోక్ష నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్ లిరికల్ వీడియో సాంగ్‌ను డైరెక్టర్ శివ నిర్వాణ విడుదల చేశారు. "అదృష్టం హలో అందిరో.. చందమామ" అంటూ సాగే ఈ గీతం ఆకట్టుకునేలా ఉంది. కథానాయకుడు రాత్రికి రాత్రే ధనవంతుడు అవుతాడనే కాన్సెప్ట్ చుట్టూ ఈ పాట తిరుగుతుంది. ఈ పాటకు సోహైల్ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ప్రముఖ రచయిత భాస్కర భట్ల రాసిన ఈ గీతాన్ని సింగర్.. రామ్ మిరియాల చక్కగా ఆలపించారు. ఈ పాటకు విశాల్ అందించిన కొరియోగ్రఫీ చక్కగా కుదిరింది. డీఓపీ ఆండ్రు చక్కటి విజువల్స్ ఇచ్చాడు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ పాటలకు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రంలోని పాటలు కూడా ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తాయని చిత్రబృందం ఆశాభావం తెలిపింది. ఈ సందర్బంగా ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూలక్కీ ‘‘లక్ష్మణ్’ లోని ఈ టైటిల్ సాంగ్ చాలా బాగుంది. ఈ చిత్ర దర్శకుడు ఏ ఆర్.అభి, నిర్మాత హరిత గిగినేనిలకు ఇది మొదటి చిత్రమైనా చాలా చక్కగా తెరకెక్కించారు. వీరిద్దరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి. సోహైల్ నటన బాగుంటుంది. ఇందులో తన డ్యాన్స్ చూడముచ్చటగా ఉంది. వీరి ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అని తెలిపారు. -
లక్కీ లక్ష్మణ్ ఫస్ట్‌లుక్ చూశారా?
బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా నటిస్తున్న చిత్రం లక్కీ లక్ష్మణ్. ఎ.ఆర్.అభి దర్శకత్వం వహిస్తున్నారు. దత్తాత్రేయ మీడియాపై హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శకనిర్మాతలకు ఇది మొదటి సినిమా అయినా చక్కగా తెరకెక్కించారు. సోహైల్ నాకు బిగ్‌బాస్ నుంచి తెలుసు. తన నటన బాగుంటుంది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. అనిల్ రావిపూడి అన్న ఎంత బిజీగా ఉన్నా లక్కీ లక్ష్మణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేయడం సంతోషంగా ఉందన్నాడు సోహైల్. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. All smiles.. as director @AnilRavipudi garu launched the First Look of our #LuckyLakshman 💸 Launch video👇https://t.co/zdfqFmkCZO#LL #LLFirstLook💙@RyanSohel #ARABHI @GogineniHaritha @Mokksha06 @anuprubens @bhaskarabhatla @iandrewdop @beyondmediapres @Ticket_Factory pic.twitter.com/zvnlJNtxsU — Dattatreya Media (@DattatreyaMedia) July 6, 2022 View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) చదవండి: Tamannaah Bhatia: తమన్నా వద్ద ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద వజ్రం.. జూలై రెండో వారం రిలీజవుతున్న సినిమాలు, సిరీస్‌ల లిస్టు ఇదిగో! -
ఆయన నాకు దేవుడు ఇచ్చిన వరం: ఎస్వీ కృష్ణారెడ్డి
‘‘నన్ను నేను దర్శకుడిగా నిలబెట్టుకోవడానికి ఎంత శ్రమించానో.. ఎంత తపనపడ్డానో ఇప్పుడూ అంతే తపనతో సినిమాలు చేస్తున్నాను. ఆడవారిని కించపరిచే విధంగా ఎప్పుడూ సినిమా తీయను. కొందరు నన్ను ఆ మార్గంలో సినిమా తీయమన్నారు. అచ్చిరెడ్డిగారు వద్దని చెప్పి, మన శైలిలో వెళితే ఎప్పుడో ఒకప్పుడు మార్గం దొరుకుతుందన్నారు. ఆయన నాకు దేవుడు ఇచ్చిన వరంలా భావిస్తున్నాను’’ అన్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. సోహైల్, మృణాళినీ రవి జంటగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా సినిమా ‘ఆర్గానిక్ మామ– హైబ్రీడ్ అల్లుడు’. ఈ సినిమాను కల్పన కోనేరు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. (చదవండి: ‘మేజర్’ చూసి వాళ్లు హ్యాపీగా ఫీలయ్యారు :శశికిరణ్ తిక్క) బుధవారం (జూన్ 1) ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్‌డే. ఈ సందర్భంగా ఈ సినిమా సెట్స్‌లో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అనంతరం ఎస్వీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆర్గానిక్ మామ– హైబ్రీడ్ అల్లుడు’ కథ విని నిర్మాత కల్పనగారు నాన్‌స్టాప్‌గా నవ్వారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ కూడా అలానే నవ్వుతారు. ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడుతూనే ఉంటాను. సోహైల్ మంచి కమర్షియల్ లక్షణాలున్న హీరో. మృణాళిని మంచి నటి’’ అన్నారు. ‘‘ఎస్వీ కృష్ణారెడ్డిగారి కెరీర్‌కు ఈ సినిమా గొప్ప మలుపు కావాలి’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. ‘‘ఈ సినిమా నా లైఫ్‌లో ఓ టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సోహైల్. ‘‘మంచి ఎంటర్టైనింగ్ మూవీ చేస్తున్నందుకు హ్యాపీ’ అన్నారు కల్పన. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మృణాళినీ రవి, నటుడు కృష్ణభగవాన్, కెమెరామేన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
Mr Pregnant: ఆడవాళ్లు గ్రేట్ సార్.. ఆకట్టుకుంటున్న సోహైల్ డైలాగ్
ఆడవాళ్లు చాలా గ్రేట్ అంటున్నాడు ‘బిగ్‌బాస్’ ఫేమ్ సోహైల్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’రూపా కొడవాయుర్ హీరోయిన్గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. (చదవండి: మహేశ్ కోసం ఆ హీరోని పక్కకు పెట్టిన పరశురాం..నెక్ట్స్ అతనితోనే మూవీ!) కాగా, మదర్స్‌డే సందర్భంగా ఆదివారం ఆ చిత్రం నుంచి వీడియో గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియో గ్లింప్స్ లో అమ్మ గురించి సుహాసిని, సొహైల్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తొమ్మిది నెలల కష్టాన్ని నవ్వుతూ భరిస్తూ ఒక బిడ్డకి జన్మనివ్వడం.అది చావుకు తెగించి... ఈ ఆడవాళ్లు గ్రేట్ సార్ అంటూ సొహైల్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఉద్వేగంగా ఉంది. ఈ చిత్రంలో సోహైల్ ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. తుది దశలో ఉన్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
బ్రేకప్‌తో బిజీ అయ్యావా? షణ్ముఖ్‌పై నాగ్ సెటైర్లు
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఈ వారం సర్‌ప్రైజ్‌ల మీద సర్ప్రైజ్లు ఇస్తున్నాడు. ఈ వారం ఫ్యామిలీ మెంబర్స్‌ను పంపి హౌస్మేట్స్ ముఖాల్లో వెలుగులు తీసుకొచ్చిన బిగ్‌బాస్ వీకెండ్లో ఏకంగా వారి క్లోజ్‌ఫ్రెండ్స్‌ను, మరికొందరి పేరెంట్స్‌ను, బంధువులను స్టేజీమీదకు తీసుకొచ్చాడు. వారిని చూసి మరోసారి సర్ప్రైజ్ అయ్యారు కంటెస్టెంట్లు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. అఖిల్ కోసం సోహైల్ స్టేజీపైకి వచ్చి స్నేహితుడిని పొగిడేస్తుండగా... నాకోసం కూడా చెప్పరా అంటూ మధ్యలో అరియానా లేచి నిలబడింది. దీంతో సోహైల్.. నేను అన్నీ విన్నాలే, కూర్చో అన్నట్లుగా పంచ్ వేశాడు. తర్వాత అరియానా కోసం ఆమె సోదరి, దేవి నాగవల్లి, యాంకర్ శివ కోసం అతడి ఫ్రెండ్స్ ధనుష్, షణ్ముఖ్ వచ్చారు. చదవండి: మహేశ్‌బాబు పెన్నీ సాంగ్ కోసం సితార ఎందుకన్నారు: తమన్ షణ్నును చూసిన నాగ్ బిగ్‌బాస్ తర్వాత ఎక్కడా కనపడలేదేంటి, బ్రేకప్‌తో బిజీగా ఉన్నావా? అని ప్రశ్నించడంతో అతడికి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాడు. దొరికిందే ఛాన్స్ అనుకున్న అషూ.. దీప్తి సునయన ఎలా ఉందని అడుతూ షణ్నును మరింత ఉడికించింది. అనంతరం సిరి స్టేజీపైకి రాగా మిత్రశర్మ ఎమోషనలైంది. అనిల్ కోసం వచ్చిన తండ్రి మాట్లాడుతూ.. అతడు మాట్లాడకపోవడానికి కారణం నేనే, వాడిని అలా పెంచాను అంటూ గొప్పగా చెప్పాడు. దీంతో విషయం అర్థమైన నాగ్ మాట్లాడనివ్వకుండా పెంచారా? అని సెటైర్ వేశాడు. ఇక వచ్చినవారితో టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో చెప్పమని గేమ్ ఆడించాడు. ఈ గేమ్‌తో ఎవరు ఫినాలేలో చోటు దక్కించుకుంటారు? ఎవరికి టైటిల్ గెలిచే ఆస్కారం ఉందన్న విషయాలపై ఓ క్లారిటీ రానుంది. చదవండి: అనిల్ అదృష్టం, బిగ్‌బాస్ నుంచి హమీదా ఎలిమినేట్! -
లక్కీ లక్ష్మణ్‌గా సోహైల్.. మోషన్ పోస్టర్ చూశారా?
‘బిగ్ బాస్’ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్. అభి దర్శకత్వంలో ‘లక్కీ లక్ష్మణ్’ అనే సినిమాకి శ్రీకారం చుట్టారు. వైష్ణవి ఆర్ట్స్, దత్తాత్రేయ మీడియాపై హరిత గోగినేని, రమ్యా ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లాప్ ఇవ్వగా, నిర్మాత సి. కల్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మిర్యాల రవీందర్ రెడ్డి, బెక్కం వేణుగోపాల్, పుప్పాల రమేష్, నటుడు రాజా రవీంద్ర స్క్రిప్ట్‌ను చిత్రయూనిట్‌కి అందించారు. నిర్మాత అప్పిరెడ్డి ‘లక్కీ లక్ష్మణ్’ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరిత గోగినేని మాట్లాడుతూ– ‘‘ఐటీ రంగంతో నా ప్రయాణం ప్రారంభమైనా రియల్ ఎస్టేట్ రంగంలో సెటిల్ అయ్యాను. అభికి సినిమాపై ఉండే ప్యాషన్, తపన చూసి ఈ సినిమా నిర్మిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు అభి. ‘‘నాకు కథ నచ్చితేనే సినిమా చేసేందుకు ఒప్పుకుంటాను’’ అన్నారు సోహైల్. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ. ఆండ్రూ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయానంద్ కీత. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) చదవండి: ఆగని 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్లు.. ఎంత వసూలు చేసిందంటే ? కేజీఎఫ్ 2 మూవీపై అల్లు అర్జున్ ప్రశంసలు -
మజిలీ బ్యూటీతో బిగ్‌బాస్ సోహైల్ రొమాన్స్
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న ‘ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ఇందులో ‘బిగ్ బాస్’ ఫేమ్ సోహైల్ హీరోగా, ‘మజిలీ’ ఫేమ్ అనన్య హీరోయిన్గా నటిస్తున్నారు. కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సీన్‌కి నిర్మాత కె. అచ్చి రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కొబ్బరి బోండాం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు’ వంటి హిట్ చిత్రాలను నాతో తీసిన కృష్ణారెడ్డితో మళ్లీ చాలా కాలం తర్వాత సినిమా చేస్తుండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘నేను, కృష్ణారెడ్డి చెన్నైలో ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. తన దర్శకత్వంలో సినిమా నిర్మించాలనే నా కోరిక ఈ సినిమా ద్వారా తీరుతోంది’’ అన్నారు సి. కల్యాణ్. ‘‘అమెరికాలో ఒక ఇంగ్లిష్ సినిమా చేయడానికి నాకు మూడేళ్లు పట్టింది. అందుకే అక్కడ ఉండాలనిపించలేదు. తెలుగువారి ఆదరణ ఎప్పుడూ మనసుకి నిండుగా తృప్తిగా ఉంటుంది. అవే కావాలనుకుని ‘ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు’ స్టార్ట్ చేశా’’ అన్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) -
అప్పుడే కొత్త సినిమా మొదలుపెట్టిన సోహైల్
బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా కాకతీయ ఇన్నోవేటివ్స్, దొండపాటి సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్న తొలి చిత్రం పూజా కార్యక్రమం యాదాద్రిలో జరిగింది. సోహైల్, చిత్రనిర్మాతలు లక్ష్మణ్ మురారి, రమేష్ మాదాసు, వంశీ కృష్ణ దొండపాటి, గవ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ‘‘ఈ సినిమా కంటెంట్ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా సోహైల్ ఇటీవల 'మిస్టర్ ప్రెగ్నెంట్' అనే సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ఇందులోని పాటలు బాగా హిట్టయ్యాయి. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. -
సోహైల్‌కు అవమానం, సన్నీపై విరుచుకుపడ్డ అఖిల్!
తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ నటించిన తాజా చిత్రం సకలగుణాభిరామ. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీజే సన్నీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. గెలుస్తాడనుకుంటే నాల్గో సీజన్లో డబ్బులు తీసుకుని బయటకు వచ్చేశావంటూ సోహైల్ గురించి చులకనగా మాట్లాడాడు. 'నాల్గో సీజన్లో సోహైల్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ వీడు డబ్బులు తీసుకుని వచ్చేశిండు. నన్ను కూడా అందరూ అంతే అన్నారు. నీకన్నా 10 లక్షలు ఎక్కువే పెట్టిర్రు. అయినా సరే టెంప్ట్ కాలేదు. కళావతి(సన్నీ తల్లి)కి కప్పు ముఖ్యం బిగిలూ.. అందుకే గెలిచి వచ్చా' అని గర్వంగా చెప్పుకొచ్చాడు సన్నీ. ఈ కామెంట్లపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగుతోంది. గెలిచాక సన్నీకి గర్వం తలకెక్కిందని కామెంట్లు చేస్తున్నారు. స్టేజీమీద అందరి ముందు సోహైల్‌ను అవమానించడం సబబు కాదని మండిపడుతున్నారు. ఈ కామెంట్లపై అఖిల్ పరోక్షంగా స్పందించాడు. సన్నీ పేరు తీయకుండానే అతడిపై మండిపడ్డాడు. 'ఎవరినైనా ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు వారిని గౌరవించాలే తప్ప అవమానించకూడదు. మనం హీరో అవడానికి పక్కవాళ్లను జీరో చేయొద్దు బ్రదర్. నా స్నేహితుడిని అలాంటి పరిస్థితుల్లో స్టేజీ మీద చూడటం చాలా బాధనిపించింది. అప్పుడు నేనక్కడ ఉంటే బాగుండేది!' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఆ పోస్ట్ డిలీట్ చేశాడు. -
అతడే బిగ్‌బాస్ 5 విన్నర్, వాళ్లే టాప్‌లో ఉంటారు
Syed Sohel Ryan Predicted About Bigg Boss 5 Telugu Winner: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే రెండు వారాలు ఆగాల్సి ఉంది. కానీ విన్నర్‌గా ఎవరు నిలుస్తారనేది ముందుగానే జోస్యం చెప్తున్నాడు సోహైల్. బిగ్‌బాస్ నాల్గో సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచిన సోహైల్ ఈ సీజన్‌పై మాట్లాడటానికి చాలావరకు తటపటాయించాడు. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన ఫేమ్‌తో ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి వస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఒకరికి సపోర్ట్ చేసి మిగతావారి ఫ్యాన్స్ నుంచి విమర్శలు మూటగట్టుకోవడం ఎందుకని ఎవరికీ మద్దతు పలకకుండా వెనకడుగు వేశాడు. కానీ హౌస్‌లో ఉన్న సన్నీని చూసి తనను తాను చూసుకున్నట్లు ఉందంటూ మురిసిపోయాడు సోహైల్. ఆ మధ్య సన్నీ విన్నర్ అవుతాడంటూ ఏకంగా పోస్ట్ కూడా పెట్టాడు. సన్నీతో పాటు కాజల్, మానస్ కూడా ఫినాలేలో ఉంటారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. కానీ మిగతా కంటెస్టెంట్ల ఫ్యాన్స్ తన మీద యుద్ధానికి రావడంతో ఆ పోస్ట్‌నే డిలీట్ చేశాడు. అప్పటినుంచి ఈ షో గురించి మాట్లాడాలంటేనే జంకుతున్నాడు. తాజాగా ఇదే విషయం గురించి మాట్లాడుతూ.. 'ఎవరికి సపోర్ట్ చేసినా.. మావాడు ఏం చేశిండు? మా పిల్ల ఏం చేసింది? అని నన్ను వేసుకుంటున్నారు. కాజల్, మానస్, సన్నీ టాప్‌లో ఉంటారనిపిస్తుందని పోస్ట్ పెట్టా.. మా వాళ్లు ఎటు పోతారంటూ అందరూ నన్ను గట్టిగా వేసుకున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాలు స్టార్ట్ చేస్తున్నా. ఇదంతా ఎందుకులే అని భయం వేసింది. పోస్ట్ డిలీట్ చేశా. ఈ వారమైతే సిరి, కాజల్ డేంజర్ జోన్లో ఉన్నాడు. నాకు నచ్చిన కంటెస్టెంట్లు శ్రీరామ్, సన్నీ. వీళ్లిద్దరిలో ఒకరు టైటిల్ గెలుస్తారు' అని సోహైల్ జోస్యం పలికాడు. -
స్పీడు మీదున్న సోహైల్, వకీల్ సాబ్ బ్యూటీతో రెండో సినిమా
Bigg Boss Contestant Syed Sohel Ryan Second Movie Details: బిగ్‌బాస్ షోతో దశ తిరిగిపోయిన అతికొద్దిమందిలో సోహైల్ ఒకరు. బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్లో పాల్గొన్న సోహైల్ తన ప్రవర్తన, ఆటతీరుతో ప్రేక్షకులను కట్టిపటేశాడు. టైటిల్ గెలవలేకపోయినప్పటికీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. షో నుంచి బయటకు వచ్చాక మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా అతడి రెండో సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి 'బూట్ కట్ బాలరాజు' అని టైటిల్ ఫిక్స్ చేశారు. కోనేటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వకీల్‌సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్గా నటిస్తోంది. బెక్కం వేణుగోపాల్ నిర్మాగా వ్యవహరిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్‌నివ్వగా మిర్యాల రవీందర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనిల్ రావిపూడి మొదటి షాట్‌ను డైరెక్ట్ చేశాడు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ``లాక్డౌన్ టైమ్‌లో రిలీజైన పాగల్ మూవీని ప్రేక్షకులు బాగా ఆదరించారు. థియేటర్, ఓటీటీ, శాటిలైట్ అన్ని ప్లాట్‌ఫామ్‌లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఉత్సాహంతోనే మా బ్యానర్లో అల్లూరి సినిమా రూపొందిస్తున్నాం. ఈ సినిమా విషయానికి వస్తే గత ఆరేడు నెలలుగా సోహైల్‌తో ఒక పాయింట్ అనుకుని దాన్ని ఒక కథగా మార్చి ఈ రోజు ఓపెనింగ్ జరిపాం. ఇలాంటి కథ సోహైల్‌కి కరెక్ట్. హుషారు తర్వాత ఆ తరహాలో మరో మంచి కథలో వస్తున్న సినిమా బూట్‌కట్ బాలరాజు. జనవరి, పిబ్రవరిలో వరుసగా షెడ్యూల్స్ జరిపి సినిమా పూర్తి చేస్తాం. తెలంగాణ క్యారెక్టరైజేషన్ కావడంతో తెలుగమ్మాయి కావాలని అనన్యని తీసుకున్నాం అన్నారు. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) సోహెల్ మాట్లాడుతూ.. ``బిగ్‌బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత చేస్తున్న రెండో చిత్రమిది. దాదాపు తొమ్మిది నెలలు స్క్రిప్ట్ మీద వర్క్ చేశాం. మంచి స్క్రిప్ట్ కుదిరింది. డైలాగ్స్ చాలా బాగా వచ్చాయి. బూట్ కట్ బాలరాజు అనే క్యారెక్టర్ డెఫినెట్‌గా మీ అందరిలో ఉండిపోతుంది`` అన్నారు. దర్శకుడు శ్రీ కోనేటి మాట్లాడుతూ - ``ఈ కథ ఇంతబాగా రావడానికి నా చిన్ననాటి మిత్రుడు గోపి కారణం. మేం ఇద్దరం కలిసి చాలా రోజుల క్రితమే సినిమా చేయాల్సింది. కాస్త ఆలస్యమైంది. బూట్‌కట్ బలరాజు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. రెండు గంటలు హ్యాపీగా నవ్వుకునే సినిమా`` అన్నారు. ఈ సినిమాలో శ్రీమతి ఇంద్రజ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, ఆనంద్ చక్రపాణి, ఝాన్సి, జబర్దస్త్ రోహిణి, మాస్టర్ రామ్ తేజస్ తదితరులు నటించనున్నారు. -
ఊర'నాటు' స్టెప్పులేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు
Sohel And Mehaboob Mass Dance For Natu Natu Song From Rrr Movie: పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' నుంచి ఇటీవలె విడుదలైన మాస్ సాంగ్ నాటు నాటుకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగు నాట ఎక్కడ విన్నా ఈ పాటే మారుమోగుతోంది. 10మిలియన్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఈ సాంగ్‌ను ఇప్పటికే చాలామంది నెటిజన్లు రీక్రియేట్ చేస్తూ స్టెప్పులేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సోహేల్, మెహబూబ్ నాటు నాటు సాంగ్‌కు అదిరిపోయే మాస్ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. టాలీవుడ్ మాత్రమే కాకుండా ఇండియా వైడ్‌గా ఎదురుచూస్తున్న ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Ismart BB Danceeplus 6thsense (@biggboss5buzzofficial) -
దీపావళికి ఎంటర్టైన్మెంట్ మోత, బిగ్‌బాస్‌లోకి మాజీ కంటెస్టెంట్లు!
Bigg Boss 5 Telugu, Diwali Episode: పండగ వచ్చిందంటే చాలు సంబరాలు రెట్టింపు చేస్తుంది బిగ్‌బాస్ టీమ్. దసరాకు స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం చేసిన బిగ్‌బాస్ ఈసారి దీపావళికి మరో కొత్త ప్లాన్‌తో ముందుకు రాబోతోంది. ఎంటర్టైన్మెంట్ను రెట్టింపు చేసేందుకు మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లను రంగంలోకి దించుతోందట! అంటే ఈ వారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం బిగ్‌బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్ బాబా భాస్కర్, నాలుగో సీజన్ కంటెస్టెంట్లు అరియానా గ్లోరీ, మోనాల్ గజ్జర్, దివి, సోహైల్, ముక్కు అవినాష్ సండే రోజు నాగ్‌తో కలిసి సందడి చేయబోతున్నారట! మరి వీరిని లోనికి పంపిస్తారా? లేదా గతేడాది లాగే ఓ ప్రత్యేక గదిలో పెట్టి అక్కడినుంచే గేమ్స్ ఆడిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే మరోసారి వారిని బిగ్‌బాస్‌లో చూసే అవకాశం రావడంతో తెగ సంబరపడిపోతున్నారు వారి అభిమానులు. వారి రాకతో ఈ దీపావళి మరిత కలర్ఫుల్గా ఉండటం ఖాయమని జోస్యం చెప్తున్నారు. ఏదేమైనా ఈ మాజీ కంటెస్టెంట్లు షోలోకి వస్తున్నారన్న వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు బిగ్‌బాస్ లవర్స్, -
రేపటి నుంచి అరియానా కథ వేరే ఉంటది: సోహైల్
Bigg Boss 5 Telugu Buzz Host: తెలుగు ప్రేక్షకులకు టన్నుల కొద్దీ కిక్కిచ్చేందుకు బిగ్‌బాస్ సీజన్ 5 రెడీ అయింది. ఎప్పటిలాగే ఈసారి కూడా హౌస్‌లో సోషల్ మీడియా, బుల్లితెర సెలబ్రిటీల సంఖ్యే అధికంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున ముచ్చటగా మూడోసారి బిగ్‌బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఇక వారాంతాల్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేసే బిగ్‌బాస్ బజ్ ప్రోగ్రామ్‌కు గత సీజన్ నుంచి ఓ కంటెస్టెంట్‌ను నిర్వాహకులు సెలక్ట్ చేశారు. ఆమె మరెవరో కాదు బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. తాజాగా అరియానా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన వీడియోతో ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లైంది. 'అందరికీ నమస్కారం. బిగ్‌బాస్ 4 జర్నీకి ఏడాది పూర్తైంది. నాకోసం సమయం కేటాయించి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రేపు ఒక ఎగ్జయిటింగ్ వార్తను మీకు తెలియజేయబోతున్నాను, అప్పటివరకు వెయిట్ చేయండి' అని చెప్పుకొచ్చింది. తను షేర్ చేసిన మరో వీడియోలో సోహైల్ మాట్లాడుతూ.. 'అరియానా రేపు టీవీలో కనిపిస్తుంది. చాలా స్పెషల్. రేపటినుంచి కథ వేరే ఉంటది. ఆల్ ద బెస్ట్ అరియానా, నిన్ను చూస్తే గర్వంగా ఉంది. కుమ్మేసేయ్. ఆమె కోసం వెయిట్ చేయండి' అంటూ అరియానా బిగ్‌బాస్ బజ్ హోస్ట్‌గా రాబోతోందని చెప్పకనే చెప్పేశాడు. View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
Mr Pregnant: గర్భం దాల్చిన బిగ్‌బాస్ స్టార్ సోహైల్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో పాల్గొని తనదైన ఆటతీరుతో లక్షలాది మంది ప్రేక్షకులను సంపాధించుకున్నడాఉ సోహైల్. సినిమాపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన రియాల్టీ షో తర్వాత విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ఓ సినిమా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమాకి ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అని టైటిల్‌ని చిత్రబృందం ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం ఉదయం సినిమా టైటిల్, హీరో ఫస్ట్గ్లిమ్స్ని నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు. సాధారణంగా అమ్మాయిలు ప్రెగ్నెంట్ అవుతుంటారు. ఇందులో మన హీరో సోహైల్ ప్రెగ్నెంట్ కావడమే షాకింగ్ విషయం. ఈ విషయాన్ని తెలియజేసేలా టీజర్, పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పుడవి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. శ్రీనివాస్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుహాసిని, బ్రహ్మజీ, రాజా రవీంద్ర, తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
'కథ వేరేలా ఉందే'.. అనిల్ రావిపూడిని కలిసిన సోహైల్
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-4తో బాగా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్లలో సయ్యద్ సోహైల్ ముందుంటాడు. హౌజ్‌లో ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ సింగరేణి ముద్దు బిడ్డ. 100 రోజుల పాటు హౌస్‌లో సందడి చేసిన సోహైల్ ఈ సీజన్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అప్పటిదాకా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సోహైల్‌కు బిగ్‌బాస్‌తో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత సోహైల్ లైఫ్ టర్న్ అయ్యిందని చెప్పవచ్చు. రీసెంట్గా సోహైల్ .. డైరెక్టర్ అనిల్ రావిపూడిని కలిశాడు. ఈ సందర్భంగా ఇద్దరం కలిసి బిగ్‌బాస్ రోజుల్ని గుర్తుతెచ్చుకున్నామని తెలిపాడు. జీరో యాటిట్యూడ్, యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని కలిసే అవకాశం వచ్చిందని, అయితే ఇది జస్ట్ క్యాజువల్ మీటింగ్ మాత్రమేనని, సినిమాకు సంబంధించింది కాదని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ఇచ్చిన సలహాలు, సూచనల్ని తప్పకుండా పాటిస్తానని పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును షేర్ చేశాడు. బిగ్‌బాస్ అనంతరం వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సోహైల్.. హీరోగా ఓ సినిమాలో నటించనున్నాడు. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోహైల్ స్నేహితుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నాడు. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) చదవండి : బిగ్‌బాస్ ఫేం సొహైల్‌కు రైజింగ్ స్టార్ అవార్డు దూసుకెళ్తున్న ‘హీరో’..అప్పుడే 4M వ్యూస్ -
బిగ్‌బాస్ ఫేం సొహైల్‌కు రైజింగ్ స్టార్ అవార్డు
సాక్షి, కాచిగూడ: నటుడిగా పలు టీవీ ధారావాహికలు, సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న సయ్యద్ సొహైల్ రియాన్ బిగ్‌బాస్ సీజన్–4 ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. బిగ్‌బాస్ ద్వారా బహుమతిగా తనకు లభించిన రూ.25 లక్షల్లో రూ.10 లక్షలు అనాథ అశ్రమాలకు అందజేశారు. “సోహి హెల్పింగ్ హాండ్స్’ స్థాపించి తద్వారా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. కరోనా కష్ట కాలంలో పేద ప్రజలకు ఆర్థిక సాయంతో పాటు, నిత్యావసర సరుకులను అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. సొహైల్ సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించి భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో రైజింగ్ స్టార్ అవార్డుతో ఆదివారం సత్కరించారు. ఈ సందర్భంగా సొహైల్ మాట్లాడుతూ.. నటుడిగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న తృప్తితో పాటు నేను స్థాపించిన సోహి హెలి్పంగ్ హాండ్స్ ద్వారా తాను సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు వినియోగిస్తూ తద్వారా ఎంతో మానసిక ఆనందం పొందుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు లయన్ లలితారావు, ఏబీసీ ఫౌండేషన్ అధ్యక్షులు లయన్ కె.వి.రమణారావు, అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: అరియానా ఇంట్లో దొంగతనం! అరేయ్ చంపేస్తా.. అంటూ ఇప్పటివరకు రూ.24 లక్షలు పైనే ఖర్చు చేశాం: సోహైల్ -
అరియానా ఇంట్లో దొంగతనం! అరేయ్ చంపేస్తా.. అంటూ
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో టామ్ అండ్ జెర్రీ ఎవరు అనగానే సోహైల్, అరియానా అని టపీమని చెప్తారు. ఎంత కొట్టుకున్నా చివరికి కలిసిపోయే వీళ్లను అభిమానులు సోషల్ మీడియాలో సోహియానా అని పిల్చుకుంటారు. బిగ్‌బాస్ షో తర్వాత కూడా వీళ్లిద్దరూ తరచూ కలుసుకుంటూ షోలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా అరియానా మీద ప్రతీకారానికి సిద్ధమయ్యాడు సోహైల్. బిగ్‌బాస్ హౌస్‌లో తనకు, అరియానాకు చిచ్చు పెట్టిన చింటు(అరియానా ఫేవరెట్ కోతి బొమ్మ)ను దొంగిలించి ఎత్తుకొచ్చేశాడు. ఈ మేరకు సోహైల్ ఓ వీడియో షేర్ చేశాడు. 'బిగ్‌బాస్‌లో నాకు శత్రువు ఉంది. వాడి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టాలంటే దీన్ని తీసుకెళ్లండి. దీన్ని అమ్మేస్తున్నా. ఎవరైనా కొనేవాళ్లుంటే ముందుకు రండి' అని చెప్పుకొచ్చాడు. "మొట్టమొదటిసారి నాకు ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తోంది. నా అజాత శత్రువు.. బిగ్‌బాస్ జర్నీలో నాకున్న ఒకే ఒక ఎనీమీ. అతడే ఇతడు. వీడు దొరికేశాడు. ఇక వదిలేది లేదు. నన్ను ఆపొద్దు. అసలు వీడంటూ లేకపోయుంటే బిగ్‌బాస్‌లో నా జర్నీ మరింత బాగుండేది. వీడు నా చేతికి దొరికాడు, ప్రతీకారం తీర్చుకునేందుకు నాతో చేతులు కలపండి. వీడి మీద రివేంజ్ తీసుకునేందుకు చాలాకాలంగా ఎదురుచూస్తున్నా. భవిష్యత్తులో ఇంకెవరి మీదా ప్రతీకారం తీర్చుకోనని మాటిస్తున్నా.." అని చెప్పుకొచ్చాడు. తను ఎంతో ఇష్టపడే చింటును అమ్మేస్తాననడంపై అరియానా ఫైర్ అయింది. 'అరేయ్, నిన్ను చంపేస్తా.. అది అమ్మడానికి కాదు..' అంటూ వార్నింగ్ ఇచ్చింది. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) చదవండి: సారీ అరియానా.. ఆలస్యమైనందుకు క్షమించు: ఆర్జీవీ -
ఇప్పటివరకు రూ.24 లక్షలు పైనే ఖర్చు చేశాం: సోహైల్
బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ నాల్గో సీజన్‌తో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు సోహైల్. యాంగ్రీ మ్యాన్‌గా బిగ్‌బాస్ హౌస్‌లో అయన చూపించిన ఆటతీరుకు లక్షలాది మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఫ్రెండ్షిప్ అంటే ప్రాణాలిచ్చే అతడు తన స్నేహాన్ని, ఆటను బ్యాలెన్స్ చేస్తూ ఫినాలే వరకు వచ్చాడు. సెకండ్ రన్నరప్‌గా నిలిచిన సోహైల్‌ను మెగా స్టార్ చిరంజీవి కూడా మెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ రియాలిటీ షో తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ టాక్ అఫ్ ది టౌన్ గా మారాడు సోహైల్. సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా ఆయన ఇప్పటివరకు చాలామందికి సహాయం చేశాడు. తాజాగా అతడు లాక్ డౌన్లో ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు తనవంతు సాయంగా నిత్యావసర వస్తువులను సరఫరా చేశాడు. అంతేకాకుండా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చాడు. ఇది తానొక్కడి శ్రమ మాత్రమే కాదని, కొంతమంది ఫ్యాన్స్ కలిసి సోహిలియన్స్ గా ఫామ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపాడు. ఈ సంస్థ ద్వారా ఇప్పటికే 24 లక్షలకు పైగా ఖర్చుతో వైద్య సేవలు అందించామని వెల్లడించాడు. గుండె సంబంధిత వ్యాధులతో, బ్రెయిన్ ట్యూమర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆదుకున్నామని అయన తెలిపాడు. భవిష్యత్తులో కూడా ఇలానే చేస్తామని, అందుకు మీ ఆశీర్వాదాలు కావాలన్నాడు. ఈ సంస్థ ఇంత బాగా పనిచేయడానికి, ముందుకు వెళ్ళడానికి సోహిలియన్స్ ఎంతో కష్టపడుతున్నారని పేర్కొన్నాడు. చదవండి: సుశాంత్ మరణానికి ఏడాది.. మరి న్యాయం?? 'సంతోషం'లో నటించిన ఈ బుడ్డోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. -
అప్పుడు మొదలైన కథ ఇప్పటికీ నడుస్తుంది: సోహేల్
సోహేల్... బిగ్‌బాస్ షోతో ఎనలేని క్రేజ్ సంపాదిచుకున్నాడు. అప్పటిదాకా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సోహైల్‌కు తెలుగు బిగ్‌బాస్-4 సీజన్ ఒక్కసారిగా గుర్తింపునిచ్చింది.హౌజ్‌లో ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకన్నాడు ఈ సింగరేణి ముద్దు బిడ్డ. వంద రోజుల పాటు హౌస్‌లో సందడి చేసిన సోహేల్ ఈ సీజన్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. దీంతో ఒక్కసారిగా అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ వీపరితంగా పెరిగిపోయింది. సీజన్ విన్నర్ కన్నా అత్యధిక పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక సీజన్ ఫినాలే రోజు తనకు వచ్చిన డబ్బుల్లో కొంత పేదల కోసం ఖర్చుపెడతానని ప్రకటించిన సోహేల్‌కు నాగార్జున నుంచి 10 లక్షల ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. వీటితో పాటు 'సోహీ హెల్పింగ్ హ్యాండ్స్' అనే ఛారిటీ ద్వారా ఇప్పటివరకు తాను చేసిన సేవా కార్యక్రమాలు, దానికి అయిన మొత్తం ఖర్చు వివరాలను వెల్లడించాడు. 'నాలుగు ఆపరేషన్లు సక్సెస్ అయ్యాయి. చాలామందికి నిత్యావసరాలు అందించాం. సోహీ హెల్పింగ్ హ్యాండ్స్, సోహెలియన్స్ మద్దతుతో ఇదంతా చేశాం. అలా ఇప్పటివరకు 14 లక్షల 70వేల 250 రూపాయలు జమ అయ్యాయి. వీటితో పాటు నాగార్జున సర్ ఇచ్చిన పది లక్షలు కలిపి ఎంతో మంది అనాథలకు, నిరుపేదలకు సహాయం చేశాం. అప్పుడు మొదలైన కథ ఇప్పటికీ నడుస్తుంది. ఇంక ఇలానే ఇది కొనసాగుతూనే ఉంటుంది' అని పేర్కొన్నాడు. భవిష్యత్తులో తన సినిమాలకు వచ్చే రెమ్యునరేషన్లో కొంత వీటికి ఖర్చుపెడతానని తెలిపాడు. అంతేకాకుండా త్వరలోనే 100మంది జూనియర్ ఆర్టిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తామని వివరించాడు. ఎవరికి తోచినంత వారు పక్కన వాళ్లకి సహాయం చేస్తే ఆ కిక్కే వేరు అంటూ తన స్టైల్లో పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం శ్రీనివాస్ వింజనంపతి డైరెక్షన్లో సోహేల్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) చదవండి : ఆట సందీప్‌కు వాయిస్ మెసేజ్ పంపిన మెగాస్టార్ చిరంజీవి సీరియల్స్ కంటే ముందు ‘వంటలక్క’ రియల్ ప్రొఫెషన్ ఇదే! -
సోహైల్‌కు ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన ఫ్యాన్
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ ఎంతోమందికి నేమ్, ఫేమ్ తీసుకొచ్చింది. బిగ్‌బాస్ ముందు వరకు అంతగా పరిచయం లేదని వారంతా ఈ షోతో ఎంతో ఫేమస్ అయిపోయారు. వీరిలో సింగరేణి ముద్దు బిడ్డ సయ్యద్ సోహైల్ ఒకడు. అప్పటిదాకా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సోహైల్‌కు తెలుగు బిగ్‌బాస్-4 సీజన్ ఒక్కసారిగా గుర్తింపునిచ్చింది. హౌజ్‌లో ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకన్నాడు ఈ సింగరేణి ముద్దు బిడ్డ. 100 రోజుల పాటు హౌస్‌లో సందడి చేసిన సోహైల్ ఈ సీజన్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. దీంతో సోహైల్‌కు ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ వీపరితంగా పెరిగిపోయిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బిగ్‌బాస్ షో నుంచి బయటకు రాగానే అతడి కోసం వందల సంఖ్యలో ఫ్యాన్స్ బారులు తీరిన దృశ్యమే ఇందుకు ఉదహరణ. తాజాగా ఓ అభిమాని సోహైల్ బర్త్‌డే సందర్భంగా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడట. ఏప్రీల్ 18న సోహైల్ పుట్టిన రోజు సందర్భంగా లక్కీ అనే అభిమాని సోహైల్‌కు ఖరిదైన స్పోర్ట్స్ బైక్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోహైల్ తన ఇన్‌స్ట్రాగ్రామ్ షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేగాక సదరు అభిమానికి ఈ సందర్భంగా సోహైల్ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత సోహైల్ లైఫ్ టర్న్ అయ్యిందని చెప్పవచ్చు. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించాలని ఉన్నట్లు తన మనసులోని మాటను సోహైల్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలా తన కోరికను బయట పెట్టాడో లేదో అలా సోహైల్‌కు దర్శక నిర్మాతల నుంచి సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో బిగ్‌బాస్ అనంతరం వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సోహైల్.. హీరోగా ఓ సినిమాలో నటించనున్నాడు. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోహైల్ స్నేహితుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నాడు. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) -
సినిమా షూటింగ్లో సొహైల్ గొడవ
బిగ్‌బాస్ రియాల్టీ షోతో వెలుగులోకి వచ్చిన నటుడు సొహైల్. అయన హీరోగా ఒక మూవీ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న సొహైల్ తన చిత్రబృందంలోని ఓ సభ్యుడితో గొడవకు దిగాడు. ఆ గొడవ కాస్త ఇద్దరు కొట్టుకునే స్థాయికి చేరింది. అక్కడ ఉన్న చిత్ర బృందం చెప్పిన వినకుండా ఇద్దరు పరస్పరం పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఒకరిమీద అరుసుకున్నారు. ఒక్కసారి గొడవ వల్ల షాక్ గురైన నిర్మాత తనకు ఇలాంటివి నచ్చవని.. వెంటనే గొడవ ఆపాలని వారికీ సూచించాడు. ఈ గొడవను చూసిన మూవీ హీరోయిన్ సైతం షాక్ గురైంది. అయితే, ఇదంతా నిజం కాదని కేవలం ప్రాంక్ కోసం మాత్రమే గొడవపడినట్లు సొహైల్ తర్వాత వారికి చెప్పాడు. ఈ ప్రాంక్ గురించి నిర్మాతతోపాటు హీరోయిన్‌కీ తెలియదని సొహైల్ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: రజనీకాంత్ నటించిన తొలి తెలుగు చిత్రం తెలుసా? -
సోహైల్ సినిమా: హీరోయిన్గా డాక్టరమ్మ!
ఇస్మార్ట్ సోహైల్.. ఇప్పుడీ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. బిగ్‌బాస్ నాలుగో సీజన్లో అడుగు పెట్టిన అతడు తన యాటిట్యూడ్, ఫ్రెండ్షిప్తో ఎంతో మంది మనసులను దోచుకున్నాడు. అదే సమయంలో తన కోపంతో తోటి కంటెస్టెంట్లతో గొడవ పెట్టుకుని వ్యాఖ్యాత నాగార్జున చేత చీవాట్లు తిన్నాడు. దీంతో తను కోపాన్ని వదిలేస్తానని నాగ్‌కు మాటిచ్చి, అదే మాట మీద షో ఎండింగ్ వరకు నిలబడి సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. ఇక బిగ్‌బాస్ నుంచి వచ్చిన కొన్ని రోజులకే హీరోగా తన తొలి సినిమాను ప్రకటించాడు సోహైల్. శ్రీనివాస్ వింజనంపతి దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ మధ్యే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. తాజాగా హోలీ పండగను పురస్కరించుకుని సోహైల్ సరసన నటిస్తున్న హీరోయిన్ పేరును ప్రకటించారు. 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య'లో నటించిన నేచురల్ బ్యూటీ రూప కొడువాయర్ సోహైల్‌తో జోడీ కడుతున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హీరోహీరోయిన్లు రొమాంటిక్‌గా పోజిచ్చిన ఈ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ హీరోయిన్ రూప నిజ జీవితంలో డాక్టర్ కావడం విశేషం. జార్జి రెడ్డి, ప్రెషర్ కుక్కర్ చిత్ర నిర్మాతలు అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) ఇక పైసా పారితోషికం తీసుకోకుండా సోహైల్ సినిమాలో నటిస్తానని ఆ మధ్య బ్రహ్మానందం మాటిచ్చాడు. అలాగే చిరంజీవి కూడా అతడి సినిమాలో చిన్న పాత్ర చేస్తానని చెప్పాడు. మరి వీళ్లిద్దరూ ఈ సినిమాలో కనిపిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి. చదవండి: కొత్త కారు కొన్న సోహెల్.. కథ వేరుంటదని పోస్ట్ రాత్రి నడిరోడ్డు మీద కారు ఆపేసిన సన్నీలియోన్ భర్త -
నా బాధ తనలో చూస్తున్నాను: నిఖిల్
‘‘పెద్ద సినిమా, చిన్న సినిమా అనే మాటను చాలా ఏళ్లుగా వింటున్నాను. ఆ తేడా నాకు తెలియదు. బడ్జెట్ ఎంత? నటీనటులు ఎవరు? అనేదానికంటే సినిమా ఇచ్చే అనుభూతి ముఖ్యం అని నా భావన. అనుభూతిపరంగా చూస్తే ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ చాలా పెద్ద సినిమా అవుతుంది. నా యువత, అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్’ సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి నేను పడిన బాధ, తపన రంజిత్‌లో చూస్తున్నాను. మంచి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని ఈ సినిమాను ప్రోత్సహించడానికి ముందుకొచ్చా’’ అన్నారు హీరో నిఖిల్. రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా స్వీయ దర్శకత్వంలో వీరాస్వామి .జి నిర్మించిన ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ ఈ నెల 27న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో.. ‘‘ఈ సినిమా చూశాను. బాగా నచ్చింది’’ అన్నారు ‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సొహైల్. ‘‘మార్చి 5న మా సినిమాను విడుదల చేద్దామనుకున్నాం. కానీ, ఆ రోజు ఎక్కువ సినిమాలు విడుదలవుతుండటంతో ఈ 27న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు వీరాస్వామి. -
తండ్రితో కలిసి శుభవార్త చెప్పిన సోహెల్
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ ఎంతోమందికి నేమ్, ఫేమ్ రెండూ తీసుకొచ్చింది. బిగ్‌బాస్ ముందు వరకు అంతగా పరిచయం లేదని వారంతా ఈ షోతో ఫేమస్ అయిపోయారు. వీరిలో సోహైల్ ఒకడు. అప్పటిదాకా చిన్న చిన్న పాత్రల్లో నటించిన సయ్యద్ సోహైల్‌కు తెలుగు బిగ్‌బాస్-4 సీజన్ ఒక్కసారిగా ఎనలేని గుర్తింపునిచ్చింది. ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్‌తో ఈ ‘సింగరేణి ముద్దుబిడ్డ’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.100 రోజులపాటు హౌస్‌లో సందడి చేసిన ఈ కరీంనగర్ కుర్రోడు షోలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. విన్నర్ కాకపోయినా అదే రేంజ్లో తనపై దృష్టి పడేలా చేసుకున్నాడు. బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత సోహైల్ లైఫ్ టర్న్ అయ్యిందని చెప్పవచ్చు. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించాలని ఉన్నట్లు తన మనసులోని మాటను సోహైల్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలా తన ఉద్ధేశ్యం బయటకు చెప్పాడో లేదో అలా సోహైల్‌కు సినిమాల నుంచి అవకాశాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బిగ్‌బాస్ అనంతరం వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సోహైల్.. హీరోగా ఓ సినిమాలో నటించనున్నాడు. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోహైల్ స్నేహితుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. తాజాగా సోహైల్ మరోసారి వార్తల్లోకెక్కారు. అయితే ఈసారి వృత్తిపరంగా కాకుండా ఓ ముఖ్యమైన వ్యక్తిగత విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన తండ్రి, సోదరుడితో కలిసి ఓ శుభవార్త చెప్పాడు. అదే.. సోహైల్ కొత్త కారును కొనుగోలు చేశాడు. MG కంపెనీకి చెందిన దాని ధర దాదాపు రూ. 30 లక్షలు ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘కొత్త కారు కొనాలనే కల నిజమైంది. దీన్ని సాధ్యం చేసినందుకు బిగ్‌బాస్‌కు, అలాగే ఎప్పుడూ నాకు ఆదర్శంగా నిలిచే మా నాన్నకు కృతజ్ఞతలు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. ఇదిలా ఉండగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలో టాప్ 3లో ముగ్గురు అబ్బాయిలు మిగలగా.. బిగ్‌బాస్ నుంచి సోహైల్ స్వచ్ఛందంగా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. నాగార్జున ఇచ్చిన రూ.25లక్షల ఆఫర్‌ను సోహైల్ అంగీకరించి ఇంటిని వీడాడు. చదవండి: మెగాస్టార్ ఇంట్లో బిగ్‌బాస్ తురుమ్‌ఖాన్ సందడి అభిజీత్‌ను వెనక్కినెట్టిన అఖిల్.. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) -
విజయవాడలో రచ్చ లేపిన సోహైల్
సాక్షి, విజయవాడ: బిగ్‌బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ విజయవాడలో సందడి చేశాడు. ఆదివారం నాడు నగరంలోని పాతబస్తీ పంజా సెంటర్లో అభిమానులను కలిసి వారిని సంతోషపర్చాడు. నాలుగు చోట్ల అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని కేక్ కట్ చేశాడు. ఈ సందర్భంగా తనను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక సోహైల్ వస్తున్నాడని తెలుసుకుని అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఆయన్ను ఆహ్వానిస్తూ దారి పొడవునా కటౌట్లు వెలిశాయి. అభిమానులతో వేడుకల అనంతరం సోహైల్ మీడియాతో మాట్లాడుతూ.. నేను ఎవరో తెలీకపోయినా బిగ్‌బాస్ షోలో నన్ను ప్రోత్సహించిన అభిమానులను కలిసి కృతజ్ఞతలు చెప్పేందుకు విజయవాడ వచ్చాను. జార్జి రెడ్డి డైరెక్టర్ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో మార్చి ఒకటో తేదీ నుంచి ఒక సినిమా చేస్తున్నాను. విజయవాడలో ఉన్న నా మిత్రుడు మగ్బుల్ దగ్గరకు గతంలో చాలాసార్లు వచ్చాను. అప్పుడు నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు. కానీ బిగ్‌బాస్ షోకు వచ్చాక నాకు మంచి గుర్తింపు వచ్చింది. నాపై ఇంత ఆదరణ చూపిస్తున్న అభిమానులందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు. (చదవండి: ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పిన సమంత.. కారణం ఇదే!) (చదవండి: అల్లు అర్జున్ కార్వాన్కు ప్రమాదం) -
మెగాస్టార్ ఇంట్లో బిగ్‌బాస్ తురుమ్‌ఖాన్ సందడి
తనదైన ప్రదర్శనతో బిగ్‌బాస్ షోలో సయ్యద్ సోహేల్ సందడి చేశాడు. విజేత కన్నా అత్యధిక పాపులారిటీ సొంత చేసుకున్న ఈ తురుమ్‌ఖాన్ ఇప్పుడు తనను ప్రోత్సహించిన వారిని కలిసి కృతజ్ఞతలు చెబుతున్నాడు. మొన్న బిగ్‌బాస్ వ్యాఖ్యాత కింగ్ నాగార్జునను కలిశాడు. ఇప్పుడు తాజాగా శుక్రవారం మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు. చిరు నివాసానికి వెళ్లి సోహేల్ పుష్పగుచ్ఛం అందించాడు. చిరు కుటుంబంలో ఓ సభ్యుడిగా కలిసిపోయి సందడి చేశాడు. బిగ్‌బాస్ షో ఆఖరి రోజు మొత్తం సోహేల్ చుట్టే కథ నడిచింది. సోహేల్‌కు చిరంజీవి తన భార్య సురేఖతో బిర్యానీ వండించి తీసుకొచ్చాడు. దీంతోపాటు సోహేల్ అనాథాశ్రమానికి చేస్తానన్న సహాయం వద్దు.. తాను చేస్తానని ప్రకటించాడు. సోహెల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వస్తానని బిగ్‌బాస్ ఫైనల్లో చిరు ప్రకటించాడు. ఈ అనుకోని వరాలకు సోహేల్ ఉబ్బితబ్బిబై ఏడ్చేశాడు. అలాంటి సోహేల్ ఇప్పుడు తనను ప్రోత్సహించిన చిరును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవితో పాటు తనకోసం బిర్యానీ వండి పంపిన చిరు భార్య సురేఖ, చిరంజీవి తల్లి అంజనాదేవిని కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ కుటుంబసభ్యుడి మాదిరి చిరు ఇంట్లో సోహెల్ గడిపాడు. సోహెల్ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకుంటుంది. జార్జిరెడ్డి ఫేమ్ నిర్మాతలు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి హాజరయ్యే అవకాశం ఉంది. -
10 లక్షలు డొనేషన్ ఇచ్చిన సోహైల్
చౌటుప్పల్/పంజాగుట్ట(హైదరాబాద్): సంపాదనలో కొంత భాగం సేవకు ఖర్చు చేస్తే వచ్చే ఆనందమే వేరని బిగ్‌బాస్ ఫేం సయ్యద్ సోహైల్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలతోపాటు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఓ కుటుంబానికి రూ.10 లక్షలు అందించారు. అనంతరం సోహైల్ మాట్లాడుతూ బిగ్‌బాస్ ద్వారా తనకు వచ్చిన రూ.25 లక్షల్లో రూ.10 లక్షలు అనాథాశ్రమాలకు ఖర్చు చేస్తానని ప్రకటించానని చెప్పారు. ఇకపై తాను నటించే ప్రతి చిత్రంలోను వచ్చే పారితోషికంలో 10 నుంచి 15 శాతం సేవకు వినియోగిస్తానని ప్రకటించారు. రూ.10లక్షలను చెక్కుల రూపంలో మదర్స్ నెస్ట్ వృద్ధాశ్రమం(నేరేడ్మెట్), తబిత స్వచ్ఛంద సంస్థ(రామగుండం), పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్స్ సోషల్ ఆర్గనైజేషన్(ఆర్టీసీ క్రాస్‌రోడ్), జామియా మహదుల్ అష్రాఫ్(విజయవాడ) సేవాశ్రమాలతో పాటు మహ్మద్ మొయినుద్దీన్ కుటుంబానికి పంచారు. కాగా, చౌటుప్పల్‌లోని అమ్మానాన్న అనాథాశ్రమానికి రూ.2లక్షల చెక్కు అందించారు. ఆశ్రమంలో కాసేపు గడిపి, అక్కడి వారికి భోజనం వడ్డించారు. (అఖిల్ సార్థక్‌కు అభిమాని ఖరీదైన గిఫ్ట్ ) -
బాధపడ్డా.. కానీ పశ్చాత్తాపం లేదు: సోహైల్
అప్పటిదాకా చిన్న చిన్న పాత్రల్లో నటించిన సయ్యద్ సోహైల్‌కు తెలుగు బిగ్‌బాస్-4 సీజన్‌తో ఒక్కసారిగా ఎనలేని గుర్తింపు వచ్చింది. ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్స్‌తో ఈ ‘సింగరేణి ముద్దుబిడ్డ’ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఫినాలేలో అనూహ్య నిర్ణయంతో అతడు అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అభిజిత్, అఖిల్‌తో పాటు టాప్-3లో నిలిచిన సోహైల్.. బిగ్‌బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల డీల్‌కు అంగీకరించి ఇంటిని వీడాడు. అంతేగాక మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు అందుకోవడమే గాకుండా.. తన సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తానంటూ ఆయనే స్వయంగా చెప్పడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ ముగిసిన తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సోహైల్.. హీరోగా ఓ సినిమాలో నటించనున్నాడు. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఏ నిర్ణయంతో అయితే సోహైల్ సీజన్ మొత్తానికి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడో.. దాని కారణంగానే విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు. ముఖ్యంగా ఫినాలేకు ముందు అతడి స్నేహితుడు, తోటి కంటెస్టెంటు మెహబూబ్ చేసిన పనితో ట్రోలింగ్‌కు గురయ్యాడు. మెహబూబ్ సైగల కారణంగానే తాను మూడోస్థానంలో ఉన్నానని తెలుసుకున్న సోహైల్.. డబ్బు తీసుకునేందుకు అంగీకరించాడని.. ఇలా మోసపూరితంగా ఆడటం సరికాదంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. (చదవండి: బంపరాఫర్ కొట్టేసిన అఖిల్..!) ఈ విషయంపై ఇప్పటికే స్పష్టతనిచ్చిన సోహైల్ మరోసారి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఇలాంటి నిరాధార ఆరోపణలు, రాతల వల్ల నేనెంతో బాధపడ్డాను. నేను విజేతను కాదని తెలిసే రూ. 25 లక్షలు తీసుకున్నాననడం సరికాదు. అందులో ఎంతమాత్రం నిజం లేదు. 25 లక్షలు అంటే నాకు పెద్ద మొత్తం. ఆ డబ్బు తీసుకుని షో నుంచి బయటకు రావడం పట్ల నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక బిగ్‌బాస్‌లో పాల్గొనడం తనకెన్నో మధుర జ్ఞాపకాలు మిగిల్చిందని, తన జీవితంలో ఇది భావోద్వేగపూరిత ప్రయాణం అని పేర్కొన్నాడు. తన పదేళ్ల కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కిందని ఉద్వేగానికి లోనయ్యాడు. -
బిగ్‌బాస్ : సోహైల్‌కు ఫ్యాన్స్ ఘన స్వాగతం
హుస్నాబాద్: బుల్లితెర వీక్షకులను అలరించిన తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సోహైల్‌కు శనివారం రాత్రి హుస్నాబాద్ పట్టణంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. వరంగల్ నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న సోహైల్‌కు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో అభిమానులు స్వాగతం పలికారు. కొద్ది సేపు ఆగి వారితో మాట్లాడారు. కాగా సోహైల్‌కు స్నేహితుడు ఒకరు అతని వాహనంలో ప్రయాణించడంతో.. స్నేహితుడి స్వగ్రామం హుస్నాబాద్ కావడంతో అతని కోరిక మేరకు హుస్నాబాద్ నుంచి వెళ్దామని కోరడంతో సోహైల్ వరంగల్ నుంచి హుస్నాబాద్ మీదుగా కరీంనగర్‌కు వెళ్లేందుకు పయనమయ్యాడు. అప్పటికే తన స్నేహితుడి సమాచారం మేరకు అయనను కలుసుకునేందుకు హుస్నాబాద్ పట్టణంలో అభిమానులు సిద్ధమయ్యారు. అంబేడ్కర్ చౌరస్తాలో సోహైల్‌కు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా బిగ్‌బాస్ షోలో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా, చివరకు 5గురు టాప్ 5 ఫైనల్ కంటెస్టెంట్స్‌గా నిలిచారు. కాగా చివరి ముగ్గురిలో వెళ్లిపోవడానికి ఇష్టపడిన వారిలో సోహైల్ అంగీకరించడంతో అతను రూ.25లక్షలు ప్రైజ్‌మనీ పొందాడు. -
ఈసారి వేరే సినిమా
‘బిగ్‌బాస్ సీజన్ 4’తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సయ్యద్ సోహైల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సోహైల్ స్నేహితుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘‘ఇండియాలో ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇంతవరకు సినిమా రాలేదు’’ అన్నారు అప్పిరెడ్డి. ‘‘నేను సోహైల్‌తో ఎన్నో కథలు పంచుకున్నాను. ఈ సినిమా ద్వారా మా కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు దర్శకుడు. ‘‘బిగ్‌బాస్‌కు వెళ్లకముందు చాలా సినిమాల్లో నటించా. అవేమీ గుర్తింపునివ్వలేదు. బిగ్ బాస్ తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడని చాలామంది అనుకుంటారు. నిజంగానే ఈ సినిమా వేరేగా ఉంటుంది. అన్ని వర్గాల మనసునూ గెలుచుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు సోహైల్. -
అభిజిత్ ఛాలెంజ్ స్వీకరించిన సోహైల్
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంబించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్‌ను రెండో రన్నరప్ సోహైల్ స్వీకరించాడు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని పార్క్‌లో సోహైల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ.. ప్రకృతి మనకు చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు. అలసిపోయి వచ్చిన పచ్చని చెట్టు కింద కూర్చుని పచ్చడి మెతుకులు వేసుకొని తింటే ఆ ఆనందమే వేరు ఉంటుందని పేర్కొన్నారు. మనం ఇప్పుడు మంచి నీటిని డబ్బులు ఇచ్చి కోనుకుంటున్నామని, రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొనుక్కొనే పరిస్థితి రాకుడదంటే బాధ్యతగా మనం అందరం మొక్కలు నాటాలని సోహైల్ కోరారు. చదవండి: హీరోగా ఎంట్రీ.. సోహైల్ కొత్త సినిమా ఫిక్స్! దయచేసి నన్ను అభిమానించే అందరూ మొక్కలు నాటి ఎంపీ సంతోష్ కుమార్, నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేయగలరు అని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తను మరో ముగ్గురికి( అరియానా, మెహబూబ్, అఖిల్) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు ఈ సందర్భంగా సోహైల్‌కు వృక్షవేదం పుస్తకాన్ని అందజేశారు. చదవండి: సమంతతో ఆఫర్ కొట్టేసిన అభిజిత్ బిగ్‌బాస్ 4 కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
హీరోగా ఎంట్రీ.. సోహైల్ కొత్త సినిమా ఫిక్స్!
బిగ్‌బాస్ సీజన్ 4 సీజన్లో మూడో ప్లేస్‌లో నిలిచిన సోహైల్ ప్రజల్లో విన్నర్ కంటే ఎక్కువ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. సెకండ్ రన్నరఫ్‌గా నిలిచినా.. విన్నర్ సాధించినంత ఫ్రైజ్ మనీని సొంతం చేసుకుకున్నాడు. రూ.25లక్షలు తీసుకోవడానికి ముందుకు వచ్చిన సోహైల్ నిర్ణయం అందరిని ఆకట్టుకుంది. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించాలని ఉన్నట్లు తన మనసులోని మాటను సోహైల్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఒకటి రెండు సినిమాల్లో నటించిప్పటికీ సోహైల్‌కు పెద్దగా పేరును తెచ్చిపెట్టలేదు. అయితే బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత సోహైల్ లైఫ్ టర్న్ అయ్యిందని చెప్పవచ్చు. అయితే ఇలా తన ఉద్ధేశ్యం బయటకు చెప్పాడో లేదో అలా సోహైల్‌కు సినిమాల నుంచి అవకాశాల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, కమెడీయన్ బ్రహ్మనందం వంటి స్టార్ సెలబ్రిటీలు సోహైల్ చిత్రంలో నటిస్తామని మాటివ్వగా.. హౌజ్ నుంచి బయటకు వచ్చిన రోజే ఓ సినిమా స్టోరీ కూడా విన్నట్లు సోహైల్ చెప్పాడు. చదవడి: మెహబూబ్ సైగలపై సోహైల్ రియాక్షన్ ఈ క్రమంలో తాజాగా సోహైల్ హీరోగా తన మొదటి సినిమాకు ఓకే చెప్పాడు. జార్జిరెడ్డి, ప్రెషర్ కుక్కర్ సినిమాలను నిర్మించిన అప్పిరెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీనివాస్ డైరెక్ట్ చేయనున్నారు. దర్శకుడు మంచి స్క్రిప్ట్ రెడీ చేసి సోహైల్ దగ్గరకు తీసుకెళ్లగా కథ విన్న అతడు ఓకే కూడా చెప్పాడు. దీంతో ఈ చిత్రం ప్రీ పప్రొడక్షన్ పనులు 2021 న్యూయర్ తర్వాత ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. దీన్ని పక్కన పెడితే హీరో కావాలన్న సోహైల్ ఆశ తొందరలోనే నెరవేరనుంది. ఇప్పటికే బిగ్‌బాస్ విన్నర్ ప్రకటించేందుకు వచ్చిన చీఫ్ గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సోహైల్ మేనరిజం.. ‘కథ వేరే ఉంటది’ తన సినిమాల్లో వాడుకుంటానని చిరు చెప్పడమే కాకుండా ఎప్పటికైనా సోహైల్‌తో తనొక మంచి సినిమా చేస్తానని మాటిచ్చాడు. అదే విధంగా టాలీవుడ్ కమెడీయన్ బ్రహ్మానందం కూడా సోహెల్ చేసే సినిమాలో రూపాయి తీసుకోకుండా నటిస్తానని తెలిపినట్లు సోహైల్ స్వయంగా వెల్లడించారు. చదవండి: సోహైల్‌కు బ్రహ్మానందం బంపర్ ఆఫర్ కథ వేరే ఉంటది 🔥🤘 Pics from @SohelRyan's new film announcement press meet. Produced by #GoergeReddy and #PressureCooker fame @Appireddya#SrinivasVinjanampati to direct Shoot 🎬 starts from February.@Mic_Movies @GskMedia_PR pic.twitter.com/dYXr7Tw7uV — BARaju (@baraju_SuperHit) December 24, 2020 ఇక బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలో టాప్ 3లో ముగ్గురు అబ్బాయిలు మిగలగా.. బిగ్‌బాస్ నుంచి సోహైల్ స్వచ్ఛందంగా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. నాగార్జున ఇచ్చిన రూ.25లక్షల ఆఫర్‌ను సోహైల్ అంగీకరించి.. ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సోహైల్ నిర్ణయాన్ని అతని కుటుంబ సభ్యులు కూడా స్వాగతించారు. వచ్చిన ఆ 25 లక్షల రూపాయాల్లో అయిదు లక్షలు అనాథశ్రమానికి, మరో ఐదు మెహబూబ్ ఇల్లు కట్టుకునేందుకు ఇస్తానని చెప్పాడు. కానీ మెహబూబ్ అతడి ఆఫర్‌ను తిరస్కరిస్తూ ఆ ఐదు లక్షలు కూడా అనాథశ్రమానికే ఇచ్చేయమన్నాడు. వీరి ఆలోచన మెచ్చిన నాగ్ ఆ పది లక్షలు అనాథశ్రమానికి తాను ఇస్తానని, సోహైల్‌ను 25 లక్షలు ఇంటికే తీసుకెళ్లమని చెప్పారు. చదవండి: సోహైల్, దివికి చిరు బంపర్ ఆఫర్! -
మెహబూబ్ సైగలపై సోహైల్ రియాక్షన్
బిగ్‌బాస్ నాలుగో సీజన్.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది. ఆటలు, పాటలు, అలకలు, గొడవలు, కోపాలు, బుజ్జగింపులు, ప్రేమ, గాసిప్స్ ఇలా అన్నీ పంచిపెట్టింది. ఈ సీజన్లో మొత్తం 19 మంది బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టగా వారిలో కొంత మందికి మాత్రమే సరైన గుర్తింపు లభించింది. తమ తలరాతను మార్చేలా భవిష్యత్తు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. బిగ్‌బాస్‌తో లైఫ్ చేంజ్ అయిన వారిలో సోహైల్ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటి వరకు అడపాదడపా సినిమాల్లో నటించిన సోహైల్‌కు పెద్దగా చెప్పుకునే అంతా పేరు రాలేదు. కానీ బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత తన లైఫ్ వేరేలా మారిపోయింది. సీజన్ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు. అయితే ఇంత పాపులారిటీ సంపాదించిన సోహైల్‌కు ఒక్కసారిగా ట్రోల్స్, మీమ్స్‌తో గట్టి ఎదురుదెబ్బ ఎదురయ్యింది. చదవండి: బిగ్‌బాస్: బయటపడ్డ సోహైల్, మెహబూబ్ కుట్ర! బిగ్‌బాస్ చివరి అంకానికి చేరుకున్న సమయంలో ఎలిమినేట్ అయిన సభ్యులు ఇంట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అద్దాలతో ఏర్పాటు చేసిన గది నుంచి ఒక్కొక్కరూ వచ్చి టాప్ 5 కంటెస్టెంట్లను కలిసి కాసేపు అలరించారు. అయితే మెహబూబ్ మాత్రం సోహైల్‌తో ఏవో సైగలు చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అందరితో కూల్‌గా మాట్లాడినట్లు నటించిన నటించిన మెహబూబ్.. తన సంజ్ఞలతో సోహైల్‌కు ఏదో చెప్పాడని నెటిజన్లు మండిపడ్డారు. సోహైల్ నెంబర్ త్రీలో ఉన్నట్టు మెహబూబ్ అద్దంపై మూడు వేళ్లతో సూచించినట్టు ఆరోపిస్తున్నారు. అలాగే, డబ్బులు తీసుకునే ఆఫర్ గనుక వస్తే వదిలిపెట్టొదని సిగ్నల్ ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు. ఇక మెహబూబ్ చెప్పినట్లుగానే టాప్ 3 కంటెస్టెంట్లుగా మిగిలిన అఖిల్, అభిజిత్, సోహైల్‌కు బిగ్‌బాస్ భారీ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోటీ నుంచి తప్పుకున్నవారికి రూ.25 లక్షలు ఇస్తామని బిగ్‌బాస్ చెప్పగా.. సోహైల్ ఆ డీల్‌కు అంగీకరించాడు. రూ.25 లక్షలు తీసుకుని హౌజ్ నుంచి బయటికొచ్చాడు. దీంతో మెహబూబ్ చెప్పడం వల్లే ఎలాగూ తనది మూడో స్థానం అని సోహైల్ డబ్బులు తీసుకున్నాడని, తద్వారా విన్నర్ అభిజిత్‌కు ప్రైజ్ మనీలో సగం కోత పడిందని అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సోహైల్‌కు బ్రహ్మానందం బంపర్ ఆఫర్ కాగా తాజాగా మంగళవారం సోహైల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియోలోకి వచ్చారు. ఎవరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చేప్తానని చెప్పడంతో అనేకమంది మెహబూబ్ సైగా విఫయాన్ని కామెంట్ల రూపంలో ప్రశ్నించారు. దీంతో మెహబూబ్ సైగలపై స్పందిస్తూ ఆగ్రహానికి గురయ్యాడు. బిగ్‌బాస్‌లో తరువాత ఏం జరుగుతుందనేది అసలు ఎవరికి తెలియదని, ఎవరు ఉంటారు, ఎవరు పోతరని ఎవరికి తెలియదు. ‘అంతా సీన్ లేదు అక్కడ. అట్ల ఉంటే మంచిగుండు. ఏరోజు అలాంటి పరిస్థితి రాలేదు. అలాగే చిన్న లాజిక్ చెబుతా. జాగ్రత్తగా వినండి. వాడు ఏదో గ్లాస్‌ను పట్టుకుని ఊరికే చేతి వేళ్లను అలా అన్నాడు. అసలు వాడేమన్నడో నాకు తెలియదు. టాప్ 3లో ఎవరుంటరనేది ఎవరూ జడ్జ్ చేయలేదు. నేడు విన్నర్ అయ్యే వాడినేమో, టాప్ 2లో ఉండే వాడినేమో. వాడు ఎలా చెప్తడు. వాడికి ఎలా తెలుస్తోంది. మెహబూబ్ బిగ్‌బాస్ కాదు. వాడు డబ్బులు గెలుచుకొని రారా అని సిగ్నల్ చేసిండేమో.. తను చెప్పింది అర్థం కాలేదని తర్వాత అఖిల్‌తో కూడా చర్చిందాను. దాన్ని పట్టుకొని వీడియోలు చేసి, కథలు పడి ఇవన్నీ చేయడం నాకు నచ్చలేదు. నా పది సంవత్సరాల కష్టం. నా కెరీర్ మీద ఒట్టేసి చెప్తున్నా. నిజంగా అలా అన్నది ఎందుకు అన్నాడో నాకు తెలీదు. టాప్ 3 అని నేను అన్నది తెలీదు. నేను నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత అని అడిగాను. అంతే అయినా థర్డ్ ప్లేస్‌లో ఉన్న వాళ్లకు డబ్బులు ఇస్తారని మెహబూబ్‌కు ఎలా తెలుసు. 25 లక్షలు 25 లక్షలు ఆఫర్ ఇస్తే మనం వినియోగించుకుందాం అని అఖిల్ నేను అనుకున్నాం. అంతేగాని మూడో ప్లేస్‌లో ఉంటే డబ్బులు ఇస్తారని ఎవరికి తెలియదు. నేను అలా స్కాం చేసి చేసి గెలిస్తే నా కెరీర్లోనే బాగుపడను. అసలు అది ఫ్రాడ్, స్కాం కాదు. అభిజిత్ ఫ్యాన్స్‌కు కూడా చెబుతున్నా. నేను తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా చెప్తా. బిగ్‌బాస్ హౌజ్‌లో అసలేం జరుగుతుందో ముందే ఎవరికి తెలియదు’ అని సోహైల్ వివరించాడు. -
సోహైల్‌కు బ్రహ్మానందం బంపర్ ఆఫర్
బుల్లితెర ప్రేక్షకులను 106 రోజుల పాటు అలరించిన బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ నాల్గో సీజన్ మొన్నటి ఆదివారంతో ముగిసింది. నాల్గో సీజన్ విన్నర్‌గా అభిజిత్ నిలిచినా... అంతకు మించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు సోహైల్. సెకండ్ రన్నరఫ్‌గా నిలిచినా.. విన్నర్ సాధించినంత ఫ్రైజ్ మనీని సొంతం చేసుకుకున్నాడు. రూ.25లక్షలు తీసుకోవడానికి ముందుకు వచ్చిన సోహైల్ నిర్ణయం అందరిని ఆకట్టుకుంది. (చదవండి : బిగ్‌బాస్ : హారిక నా చెల్లి.. అభిజిత్ షాకింగ్ కామెంట్స్) అందులో నుంచి రూ.10 లక్షలు అనాథశ్రయాలకు ఇస్తానంటే.. వద్దని, ఆమొత్తాన్ని నేనే ఇస్తానని నాగార్జున్ చెప్పాడు. ఐదు లక్షలు మిత్రుడు మెహబూబ్‌కి ఇస్తానంటే.. వద్దొద్దు.. నేనే మెహబూబ్‌కి పది లక్షలు ఇస్తానని షోకు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి చెప్పాడు. దీంతో సోహైల్‌కు మంచి పేరు రావడంతో పాటు రూ.25లక్షలు దక్కాయి. అంతే కాకుండా తను తీయబోయే సినిమాలో గెస్ట్ రోల్ చేస్తానని మెగాస్టార్ చిరంజీవి చెప్పడం సోహెల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది ఇలా ఉంటే సోహైల్‌ను మరో బంపర్ ఆఫర్ వరించింది. ప్రముఖ టాలీవుడ్ కమెడీయన్ బ్రహ్మానందం కూడా సోహెల్ చేసే సినిమాలో రూపాయి తీసుకోకుండా నటిస్తానని తెలిపాడట. ఈ విషయాన్ని సోహైలే స్వయంగా వెల్లడించాడు. ‘బ్రహ్మనందం ఫోన్ చేసి.. సోహైల్ నీ కోసమే బిగ్‌బాస్ చూశా అన్ని అన్నారు. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు నేనే వచ్చి కలుస్తానని చెప్పారు. అలాగే నేను తీయబోయే సినిమాలో ఫ్రీగా నటిస్తానని హామీ ఇచ్చారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి’ అని సోహైల్ చెప్పుకొచ్చాడు ఓ వైపు చిరంజీవి, నాగార్జున అండ, మరోవైపు బ్రహ్మానందం వంటి స్టార్ కమెడీయన్ కూడా సోహెల్‌కు తోడుగా తన సినిమాలో నటిస్తాననడం సూపర్ అంటున్నారు నెటిజన్స్. ఇలా ఓ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Telugu Entertainment Page🔥 (@dubcaffehub) -
మెహబూబ్ వల్లే సోహైల్ అలా చేశాడా?!
బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 కంటెస్టెంట్ మెహబూబ్ దిల్‌సేపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. హౌజ్‌లోనూ, బయట కూడా అతను ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని బిగ్‌బాస్ ప్రేక్షకులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రూపాయి పెర్మార్మెన్స్ చేయమంటే మూడు రూపాయల యాక్టింగ్‌తో బిల్డప్ ఇస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఆదివారం జరిగిన బిగ్‌బాస్-4 గ్రాండ్ ఫినాలే సందర్భంలోనూ అతని అతి కనిపించిందని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. చీఫ్ గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మెహబూబ్ గురించి మాట్లాడుతుంటే ప్రాణం పోయినట్టుగా చేశాడని, అతనికి చిరంజీవి రూ.10 లక్షలు ఇస్తానని చెప్పినప్పుడు కూడా ఆ ఓవర్ కనిపించిందని పోస్టులు పెడుతున్నారు. బిగ్‌బాస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అతని ప్రవర్తనలో మార్పు లేదని మండిపడుతున్నారు. (అఖిల్ నిజంగానే బకరా అయ్యాడా?!) ఇదిలాఉంటే.. గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. హౌజ్ నుంచి ఎలిమినేట్ అయినవారు టాప్ 5 కంటెస్టెంట్లతో కలుసుకునే అవకాశాన్ని బిగ్‌బాస్ కల్పించాడు. అద్దాలతో బిగించిన రూమ్లోకొచ్చి మాజీ కంటెస్టెంట్లు ఒక్కొక్కరూ హౌజ్‌లో ఉన్న అఖిల్, అభిజిత్, సోహైల్, అరియానా, హారికను తమ మాటలు, పాటలు, డ్యాన్సులతో హుషారెత్తించారు. అయితే, మెహబూబ్ మాత్రం సోహైల్‌తో ఏవేవో సైగలు చేసినట్టు వీడియోలో అతని కదలికల ద్వారా తెలుస్తోంది. అందరితో మామూలుగానే జోష్ నింపినట్టు నటించిన మెహబూబ్.. తన సంజ్ఞలతో సోహైల్‌కు ఏదో చెప్పాడని మిగతా కంటెస్టెంట్ల అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బహుశా, సోహైల్ నెంబర్ త్రీలో ఉన్నట్టు మెహబూబ్ అద్దంపై మూడు వేళ్లతో సూచించినట్టు ఆరోపిస్తున్నారు. అలాగే, డబ్బులు తీసుకునే ఆఫర్ గనుక వస్తే వదిలిపెట్టొదని సిగ్నల్ ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు. కాగా, టాప్ 3 కంటెస్టెంట్లుగా మిగిలిన అఖిల్, అభిజిత్, సోహైల్‌కు బిగ్‌బాస్ భారీ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోటీ నుంచి తప్పుకున్నవారికి రూ.25 లక్షలు ఇస్తామని బిగ్‌బాస్ చెప్పగా.. సోహైల్ ఆ డీల్‌కు అంగీకరించాడు. రూ.25 లక్షలు తీసుకుని హౌజ్ నుంచి బయటికొచ్చాడు. ఇక మెహబూబ్ చెప్పడం వల్లే ఎలాగూ తనది మూడో స్థానం అని సోహైల్ డబ్బులు తీసుకున్నాడని, తద్వారా విన్నర్ అభిజిత్‌కు ప్రైజ్ మనీలో సగం కోత పడిందని అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో కింద చూడవచ్చు 👇 Mehaboob Leaked Sohel's Position Yesterday that he is not the Winner😂 So Today, Sohel preferred 25L instead of 2,3 places which he got from audience votes👍#BiggBossTelugu4#BBTeluguGrandFinale pic.twitter.com/mENk78bsxa — Vinod Reddy (@Vinod_Since1990) December 21, 2020 -
సోహైల్, దివికి చిరు బంపర్ ఆఫర్!
తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన బిగ్‌బాస్ సీజన్ 4 ఆదివారంతో ముగిసింది. షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల తలరాతని మార్చేసింది. ముఖ్యంగా విన్నర్ అభిజిత్, రన్నరప్ అఖిల్, రెండో రన్నరప్ సోహైల్ ఎక్కువగా లాభపడ్డారు. అభిజిత్ రూ.25 లక్షలు గెలుచుకోగా.. సోహైల్ బిగ్‌బాస్ ఇచ్చిన రూ.25 లక్షల ఆఫర్ తీసుకుని తుది పోరు నుంచి తప్పుకున్నాడు. తనకు వచ్చే రూ.25 లక్షల్లో 5 లక్షలు అనాథ శరణాలయానికి, మరో 5 లక్షలు తన స్నేహితుడు మెహబూబ్‌కు ఇస్తానని చెప్పడంతో అతను అభిమానులు, హోస్ట్ నాగార్జున మనసులూ దోచుకున్నాడు. దాంతో సోహైల్ దాతృత్వం తెలుసుకున్న నాగార్జున.. అతను అనాథ శరణాలయానికి, మెహబూబ్‌కు ఇద్దామనుకున్న మొత్తాన్ని తాను అందిస్తానని హామినిచ్చారు. ఇక విన్నర్‌ని ప్రకటించేందుకు వచ్చిన చీఫ్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి సోహైల్ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించారు. నాగార్జున స్ఫూర్తితో తాను కూడా మెహబూబ్‌కు రూ.10 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఆమేరకు చెక్కు కూడా వెంటనే అందించారు. దాంతో మెహబూబ్ కళ్లనీరు పెట్టుకుంటూ చిరుకు పాదాభివందనం చేశాడు. కళాకారులు కన్నీరు పెట్టొద్దని చిరు వ్యాఖ్యానించారు. (చదవండి: బిగ్‌బాస్ తీరుపై అభిమానుల ఆగ్రహం) స్వయంగా బిర్యానీ సోహైల్ మేనరిజం.. ‘కథ వేరే ఉంటది’ తన సినిమాల్లో వాడుకుంటానని చిరు చెప్పుకొచ్చారు. తన సతీమణి సురేఖ సోహైల్ కోసం ప్రత్యేకంగా మటన్ బిర్యానీ చేసి పంపించారని చెప్పారు. దాంతో సోహైల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి తనకు ఇంత మద్దతు ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని అతను కంటతడి పెట్టాడు. అలాగే, చిరంజీవి ఎదుట తన మనసులో మాటను సోహైల్ బయటపెట్టాడు. ఎప్పటికైనా తానొక మంచి సినిమా చేస్తానని, ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లేక ఆడియో ఫంక్షన్‌కి చిరు సర్ రావాలని కోరాడు. అతని అభ్యర్థనపై స్పందించిన చిరు తప్పకుండా.. సోహైల్ రెక్వెస్ట్‌ను గౌరవిస్తానని చెప్పారు. కుదిరితే అతని సినిమాలో తనకూ ఓ చిన్న క్యారెక్టర్ ఇవ్వాలని అన్నారు. మెగాస్టార్ నుంచి ఊహించని ఆఫర్‌తో సోహైల్ మరింత ఉప్పొంగిపోయాడు. (చదవండి: బిగ్‌బాస్: పది లక్షలు వదిలేసుకున్న అరియానా) దివికి చిరు బంపర్ ఆఫర్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ దివి వైద్యకు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి బంపర్ ఆఫర్ ఇచ్చారు. దివితో స్టెప్పులు వేయాలని ఉందని అన్నారు. మరో ఐదారు నెలల్లో మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న తన సినిమాలో దివికి పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇవ్వనున్నట్టు చిరు ప్రకటించారు. కాగా, తమిళ్లో అజిత్ హీరోగా సూపర్‌హిట్‌గా నిలిచిన ‘వేలాయుధం’ సినిమాను తెలుగులో రిమేక్ చేయనున్నారు. చిరు హీరోగా మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇదిలాఉండగా.. రన్నరప్‌గా నిలిచిన అఖిల్‌కు కూడా బిగ్‌బాస్ కొంత మొత్తాన్ని ఇస్తాడని తెలిసింది. హౌజ్ నుంచి బయటికొచ్చిన కంటెస్టెంట్లు గంగవ్వకు హోస్ట్ నాగార్జున ఇల్లు నిర్మించి ఇస్తున్నారు. బిగ్‌బాస్ పాపులారిటీతో చాలామంది కంటెస్టెంట్లు యూట్యూబ్ చానెల్స్ పెట్టి లక్షలాది వ్యూయర్షిప్ను సొంతం చేసుకున్నారు. (చదవండి: బిగ్‌బాస్: రూ.25 లక్షలకు సోహైల్ టెంప్ట్) -
మెహబూబ్‌కు రూ.10 లక్షలిచ్చిన చిరు
పెద్ద హీరోలది పెద్ద మనసని చాటి చెప్పారు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే సాక్షిగా కంటెస్టెంట్ల ఆశయాలకు మద్దతు తెలుపుతూ వారికి సాయం చేశారు. గ్రాండ్ ఫినాలేకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ తన మాటలు, పంచ్‌లతో షోను మరో మెట్టు పైకి ఎక్కించారు. అలాగే బిగ్‌బాస్ సాక్షిగా యువ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు కంకణం కట్టుకున్నట్లు కనిపించింది. ఈ క్రమంలో సోహైల్‌కు ఏం కావాలో కోరుకోమని అడిగారు. దానికి అతడు తను తీయబోయే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రావాలని ఆహ్వానించాడు. ఇది సరిపోదనుకున్న చిరు ఏకంగా అతడి సినిమాలో నటిస్తానని కోట్లాది మంది ప్రేక్షకుల సాక్షిగా మాటిచ్చారు. అంతేకాకుండా ఆ సినిమా ప్రమోషన్ బాధ్యత కూడా భుజాన వేసుకున్నారు. ఇక దివికి తన నెక్స్ట్ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ ఇస్తున్నట్లు తెలిపారు. నన్ను నేను చూసుకున్నట్లుంది: చిరు మెహబూబ్ గురించి మాట్లాడుతూ.. అతడిని చూస్తుంటే చిన్నప్పుడు తనను తాను చూసుకున్నట్లుంది అని చిరంజీవి చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి రావాలని నా చిన్నప్పుడు ఎలా తపన చెందానో అది నీలో కనిపిస్తుందన్నారు. ఈ సందర్భంగా నాగార్జున కలగజేసుకుని సోహైల్ గెలుచుకున్న డబ్బు గురించి ప్రస్తావించారు. 'సోహైల్ అందుకున్న 25 లక్షల రూపాయల్లో అనాథశ్రమానికి రూ.5 లక్షలు మెహబూబ్ ఇంటి కోసం రూ.5 లక్షలు ఇస్తానన్నాడు. అయితే మెహబూబ్ మాత్రం దాన్ని తిరస్కరించాడు. తనకివ్వాలనుకున్నదాన్ని కూడా అనాథశ్రమానికి ఇచ్చేయమని సూచించాడు' అని వివరించారు. (చదవండి: 25 లక్షలకు సోహైల్ టెంప్ట్) సోహైల్‌కు మరో పది లక్షలిచ్చిన నాగ్ అయితే సోహైల్ గెలుచుకున్న మొత్తాన్ని అతడి కోసమే వాడుకోవాలని నాగ్ సూచించారు. అతడు దానం చేద్దామనుకున్న పది లక్షలను తన జేబులో నుంచి ఇస్తానని నాగ్ ప్రకటించారు. దీంతో నాగార్జునను ప్రేరణగా తీసుకున్న చిరంజీవి మెహబూబ్‌కు అవసరమయ్యే డబ్బు నేనిస్తాను అంటూ స్టేజీ మీదనే రూ.10 లక్షల చెక్ రాసిచ్చారు. మెగాస్టార్ తనకు చెక్ రాసివ్వడాన్ని నమ్మలేకపోయిన మెహబూబ్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఏడ్చుకుంటూ వచ్చి ఆయన కాళ్ల మీద పడ్డాడు. దీంతో చిరంజీవి అతడిని ఓదార్చుతూ.. మీరు కళాకారులయ్యా.. కళాకారులు కన్నీళ్లు పెట్టకూడదు అంటూ దగ్గరకు చేరదీసి హత్తుకున్నాడు. అతడికి ప్రేమగా ముద్దు పెట్టి పది లక్షల చెక్ ఇచ్చారు. మొత్తానికి సోహైల్ సినిమాలో నటిస్తాననడం, దివికి సినిమా ఛాన్స్, మెహబూబ్‌కు చెక్ ఇవ్వడం మెగాస్టార్ ప్రత్యేకతను చాటుతున్నాయి. మనసున్న మారాజుగా ఆయన్ను అభిమానుల గుండెల్లో నిలబెట్టాయి.(చదవండి: బిగ్‌బాస్: నెరవేరుతున్న గంగవ్వ కల) -
బిగ్‌బాస్: రూ.25 లక్షలకు సోహైల్ టెంప్ట్
తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్ నాల్గో సీజన్‌కు శుభం కార్డు పడింది. గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున అభిజిత్‌ను విజేతగా ప్రకటించారు. అఖిల్‌ను రన్నరప్‌గా వెల్లడించారు. మూడో సీజన్ ఫినాలేకు 8 కోట్ల ఓట్లు రాగా నాల్గో సీజన్‌కు రికార్డు స్థాయిలో 15.65 కోట్ల ఓట్లు వచ్చాయని నాగ్ వెల్లడించారు. కాగా 19 మంది కంటెస్టెంట్లతో.. వారానికి ఒక ఎలిమినేషన్ చొప్పున 105 రోజులపాటు సాగిన ఈ రియాటీ షో ప్రేక్షకులను గణనీయంగా అలరించింది. సెప్టెంబర్ 6న అట్టహాసంగా ప్రారంభమైన ఈ సీజన్ తెలుగు ప్రజలకు త్వరగానే చేరువైంది. తొలి రోజు నుంచే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ..15 వారాలపాటు ఒకే ఇంట్లో ఉంటూ ఎన్నో ఎమోషన్స్‌ను తట్టుకుంటూ ఐదుగురు ఇంటి సభ్యులు అభిజిత్, అఖిల్, సోహైల్, అరియానా, హారిక ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. వీరిలో ఒకరిని విన్నర్‌గా ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన నేటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ విశేషాలేంటో చదివేయండి.. క్షమాపణ చెప్పిన నోయల్ నాగార్జున, ఆ తర్వాత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు 14 మంది స్టన్నింగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో ఎంటర్టైన్ చేశారు. దేవి నాగవల్లి మాత్రం ఫినాలే ముగిసే సమయానికి హాజరైంది. ఇక నోయల్ మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్‌కు ముందు రాజమౌళి, సుకుమార్ ఇచ్చిన అవకాశాలతో నన్ను గుర్తు పట్టేవారు. బిగ్‌బాస్ తర్వాత నాకు మరింత పాపులారిటీ సంపాదించుకున్నాను. ఇంటిలో అవినాష్, అమ్మా రాజశేఖర్‌తో జరిగిన గొడవ వల్ల వాళ్లు ఏమైనా హర్ట్ అయితే అందుకు సారీ. అవినాష్ కామెడీ ఓ మెడిసిన్.. ఆయనలా ఎప్పుడు నేను కామెడీ చేయలేను' అంటూ ఇద్దరికీ క్షమాపణలు తెలిపాడు. బిగ్‌బాస్ తర్వాత నా లైఫ్ చాలా వేరుగా ఉంది : అవినాష్ గ్రాండ్ ఫినాలేకి వచ్చిన అవినాష్ నాగ్‌తో తన బిగ్‌బాస్ జర్నీ అనుభవాలను పంచుకుంటూ.. ‘మీరు చెప్పినట్టే.. బిగ్‌బాస్‌కు ముందు, బిగ్‌బాస్ తర్వాత నా లైఫ్ చాలా వేరుగా ఉంది. ఇంతకు ముందు మా ఊరు వాళ్లే ఫోటోలు దిగేవారు. కానీ బిగ్‌బాస్ తర్వాత ఇతర జిల్లాల వాళ్లు వచ్చి నాతో ఫోటో దిగుతున్నారు. నాతోనే కాకుండా నా తల్లితో కూడా ఫోటోలు దిగుతున్నారు అని సంతోషం వ్యక్తం చేశాడు. ఫొటోలు దిగలేకపోతున్నా : గంగవ్వ గంగవ్వ అయితే ఇంటికొచ్చే వాళ్లతో ఫొటోలు దిగలేకపోతున్నానని వాపోయింది. వచ్చిన వాళ్లు వారి కుటుంబ సభ్యులతో ఫోన్లో తనతో తెగ మాట్లాడిస్తున్నారని, దాని వల్ల గొంతు నొప్పి పుడుతోందని నాగార్జునతో చెప్పుకొచ్చింది. దీనికి బదులు బిగ్ బాస్ హౌస్‌లో ఉండిపోయినా బాగుండని అనిపిస్తోందని చెప్పింది. రోజుకి 500 మంది తనను కలవడానికి వస్తున్నారంది. తన కోరిక మేరకు ఇల్లు కట్టిస్తున్నారని, చాలా సంతోషం అంటూ నాగార్జునకు ధన్యవాదాలు తెలిపింది. జర్నీ చూసి కంటెస్టెంట్స్ కంటతడి బిగ్‌బాస్ ఫినాలే సందర్భంగా ఇంటి సభ్యులందరికి 105 రోజుల జర్నీని చూపించి అందరినీ ఏడిపించారు. 19 మందితో మొదలైన బిగ్‌బాస్ నాల్గో సీజన్ ప్రస్తుతం 5 మంది ఉన్నారు. ఇన్నాళ్లు వాళ్లు చూపించిన ప్రేమ, కోపం,ఆప్యాయతలు అన్నింటినీ ఏవీలో వేసి చూపించారు. తమ జర్నీ చూసి ఇంట్లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ అభిజిత్, హారిక, అరియానా, సోహైల్, అఖిల్‌తో పాటు ఎలిమినేట్ అయినవారు కూడా కంటతడి పెట్టారు. అనిల్ రావిపుడి రచ్చ రచ్చ బిగ్‌బాస్ ఎలిమినేట్ అయిన వ్యక్తిని బయటకు తీసుకొచ్చే బాధ్యతను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపుడికి అప్పగించారు. అయితే తాను నవ్విస్తాను కానీ ఎలిమినేట్ చేయలేనని నాగ్‌కు విజ్ఞప్తి చేశాడు. దీంతో నాగ్ ఆ బాధ్యతను ఎఫ్2 హీరోయిన్ మెహరిన్‌కు అప్పగించారు. దీంతో బ్యాండ్ బాజాలతో అనిల్ రావిపుడి, మెహరిన్ హౌస్‌లోకి అడుగుపెట్టారు.ఇక ఇంట్లోకి వెళ్లిన అనిల్‌తో టాస్క్‌లు ఆడించారు నాగ్. పలు చిలిపి ప్రశ్నలు అడిగి ఎంటర్‌టైన్‌మ్మెంట్ చేశాడు. హౌస్‌మేట్స్‌ని ఇమిటేట్ చేసి కడుపుబ్బా నవ్వించాడు. హారిక అవుట్ ఫినాలే పోరులో నుంచి తొలుతగా హారిక ఎలిమినేట్ అయింది. హౌస్‌లోకి వెళ్లిన మెహరిన్, అనిల్ రావిపుడి కలిసి హారికను ఎలిమినేట్ చేశారు. మొదటగా హౌస్మేట్స్ అందరికి కళ్లకి గంతలు కట్టి ఎలిమినేట్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. టాప్ 5లో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సిందిగా మెహరిన్‌కు నాగ్ సూచించారు. కాసెపు అందరికి టెన్షన్ పెట్టి చివరగా హారికను ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఆ తరవాత హారిక గంతలు విప్పిన మెహ్రీన్, అనిల్.. ఆమెను తీసుకెళ్లి ఒక పంజరం లాంటి ఐరన్ రూమ్‌లోకి పంపారు. ఆ పంజరాన్ని ఒక క్రేన్ గాల్లోకి లేపుతూ బయటికి తీసుకెళ్లిపోయింది. హారిక గాల్లో ఉన్నప్పుడు మిగిలిన నలుగురు ఫైనలిస్ట్‌ల గంతలు విప్పగా దేత్తడి వెళ్లిపోవడం చూసి విస్తుపోయారు. 10 లక్షలు తిరస్కరించిన హౌస్మేట్స్ రెండో వ్యక్తిని ఎలిమినేట్ చేయాల్సిన బాధ్యతను నాగ్ హీరోయిన్లు లక్ష్మీరాయ్, ప్రణీతలకు అప్పగించారు. దీంతో ఆ ఇద్దరు బ్యూటీలు బ్యాండ్ బాజాలతో ఇంట్లోకి వెళ్లి రచ్చ రచ్చ చేశారు. మొదటగా ప్రణీత 10 లక్షలు రూపాయలు ఉన్న సూట్ కేస్‌తో వెళ్లి కంటెస్టెంట్స్‌ను టెంప్ట్ చేసే ప్రయత్నం చేశారు. రూ.10లక్షలు తీసుకొని ఎవరైనా వెళ్లొచ్చు అని ఆఫర్ ఇవ్వగా అందరూ తిరస్కరించారు. ప్రేక్షకులు మాకు ఓట్లు వేసి ఇంత దూరం తీసుకొచ్చారని, డబ్బుతో వాళ్ల ప్రేమను పొగొట్టుకోలేమని తేల్చి చెప్పారు. దీంతో ప్రణీత 10 లక్షలు తీసుకొని బయటకు వచ్చేసింది. తర్వాత హీరోయిన్ లక్ష్మీరాయ్ వెళ్లి అరియానాను ఎలిమినేట్ చేశారు. రూ. 25 లక్షలకు సోహైల్ టెంప్ట్ టాప్ 3లో ముగ్గురు అబ్బాయిలు మిగలగా.. బిగ్‌బాస్ నుంచి సోహైల్ స్వచ్ఛందంగా ఎలిమినేట్ అయ్యాడు. నాగార్జున ఇచ్చిన రూ.25లక్షల ఆఫర్‌కు సోహైల్ టెంప్ట్ అయ్యాడు. ఇంట్లో ఉన్న అభిజిత్, అఖిల్, సోహైల్‌లో ఎవరైనా 25లక్షల రూపాయలు తీసుకొని బయటకు రావొచ్చని నాగ్ సూచించగా.. అఖిల్, అభిజిత్ తిరస్కరించారు. సోహైల్ మాత్రం తాను ఈ డబ్బును తీసుకొని వెళ్తానని చెప్పాడు. సోహైల్ నిర్ణయాన్ని అతని కుటుంబ సభ్యులు కూడా స్వాగతించారు. వచ్చిన ఆ 25 లక్షల రూపాయాల్లో ఐదు లక్షలు అనాథశ్రమానికి, మరో ఐదు మెహబూబ్ ఇల్లు కట్టుకునేందుకు ఇస్తానని చెప్పాడు. కానీ మెహబూబ్ అతడి ఆఫర్‌ను తిరస్కరిస్తూ ఆ ఐదు లక్షలు కూడా అనాథశ్రమానికే ఇచ్చేయమన్నాడు. వీరి ఆలోచన మెచ్చిన నాగ్ ఆ పది లక్షలు అనాథశ్రమానికి తాను ఇస్తానని, సోహైల్‌ను 25 లక్షలు ఇంటికే తీసుకెళ్లమని చెప్పారు. సోహైల్ పర్మిషన్ తీసుకున్న చిరు లక్ష్మీ రాయ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకోగా తర్వాత వచ్చిన తమన్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు. అనంతరం స్వయంగా నాగార్జునే హౌస్‌లోకి వెళ్లి టాప్ 2 కంటెస్టెంట్లు అభిజిత్, అఖిల్‌ను స్టేజీ మీదకు తీసుకొచ్చారు. బిగ్‌బాస్ ట్రోఫీ ఇచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. నాగార్జున ఫిట్నెస్ను చూస్తే కుళ్లు వేస్తోందన్నారు. అలాగే పది సీజన్ల వరకు కూడా నాగార్జునే వ్యాఖ్యాతగా ఉండాలన్నారు. ఆ తర్వాత నాగ్ జర్నీ చూపించారు. అనంతరం అభిజిత్ మీద పంచులేస్తూనే అతడి వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు. ప్రతిదాంట్లో గెలవాలన్న తాపత్రయం కనిపించేదని, ప్రేమోనాల్ను గెలిచేవాడని తెలిపారు. మన కథ వేరన్న డైలాగ్ తర్వాతి సినిమాలో పెడతాను, అందుకు పర్మిషన్ ఇవ్వంటూ సోహైల్‌ను అడిగారు. అభి విన్నర్ అభిజిత్, అఖిల్‌ను స్టేజీ మీదకు తీసుకొచ్చిన నాగ్.. అభి విజయానికి సంకేతంగా అతడి చేయి పైకెత్తారు. ఇద్దరు మిత్రులు చిరు, నాగ్ కలిసి అతడికి ట్రోఫీ అందించారు. స్టైలిష్ బైక్‌ను కూడా అందజేశారు. ఈ విజయాన్ని ఊహించలేకపోయిన అభి సంతోషం కట్టలు తెంచుకుంది. తనకు ఓట్లేసిన ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలిపాడు.. 63 ఏళ్లలో ఇది తనకు గొప్ప వేడుకలాంటిదని అభిని చూసి అతడి తండ్రి గర్వపడ్డారు. -
నోయల్ టైటిల్ గెలవాల్సింది: అభిజిత్
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు ఆఖరుసారి సంతోషంగా డ్యాన్సులు చేసుకుంటూ గడిపారు. ఎలిమినేట్ అయినవాళ్లను తిరిగి హౌస్‌లో చూస్తున్నందుకు ఓపక్క సంతోషం, తర్వాతి రోజు నుంచి ఈ హౌస్ ఉండదన్న మరో వైపు బాధ వాళ్లను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో హౌస్‌లో చివరి రోజు కొంత ఎమోషనల్‌గా సాగింది. అయితే దేవి నాగవల్లి, సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్ మాత్రం రీయూనియన్ పార్టీకి రాకపోవడం గమనార్హం. మరి సంతోషాలు వెల్లివెరిసిన నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో చదివేయండి.. ఇంటి నుంచి సందేశం.. అఖిలూ, ఓ అఖిలూ.. అని పిలుచుకుంటూనే గంగవ్వ లోపలకు వచ్చింది. అవ్వ పిలుపు వినగానే అఖిల్ ఉత్సాహం ఉరకలెత్తింది. ఆమెను చూడగానే పిల్లాడిలా సంబరపడిపోయాడు. తర్వాత జోర్దార్ సుజాత లోనికి రాగా అవ్వతో కలిసి ఫైనలిస్టులతో ఆటాడించారు. నన్ను ఇంప్రెస్ చేస్తే మీ ఇంటి నుంచి వచ్చిన మెస్సేజ్‌ను చూపిస్తానని సుజాత బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో అభిజిత్ సోహైల్ పోటీపడుతూ ఇంట్లోకి పరుగెత్తారు. ఈ క్రమంలో అభి మైకు విరగొట్టుకుని మరీ మొదటగా కాఫీ మగ్గు తీసుకొచ్చాడు. తర్వాత సోహైల్ ప్లేటు మీద ఐ లవ్ యూ అని రాసుకొచ్చి మరీ అందించాడు. ఇలా ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేయగా.. ఫైనలిస్టులందరికీ కుటుంబ సభ్యులు మాట్లాడిన వీడియోలు చూపించారు. అనంతరం గంగవ్వ, సుజాత ఇద్దరూ వీడ్కోలు తీసుకున్నారు. (చదవండి: కృష్ణుడిలాంటి భర్త కావాలి: మోనాల్) నేను నిన్ను గెలిచాను.. తర్వాత వచ్చిన నోయల్ ర్యాప్‌తో ఊపేస్తూ అందరి సంతోషాన్ని రెట్టింపు చేశాడు. అతడి కోసం ఓ సందేశాన్ని రాసిన బాటిల్‌ను అభి నోయల్ చేతికందించాడు. దానిపై 'నోయల్ టైటిల్ గెలిచేందుకు అర్హుడు' అని ఉంది. ఇది చదివిన నోయల్ నేను నిన్ను గెలిచాను, ఇది చాలదా.. అంటూ అభిజిత్‌తో చెప్పుకొచ్చాడు. హౌస్‌ను మిస్సవలేదు, కానీ మిమ్మల్ని మిస్ అవుతున్నానని పేర్కొన్నాడు. ఈ బిగ్‌బాస్ తనకు ఎంతో ఇచ్చిందని, కానీ తను ఏమీ తిరిగివ్వలేకపోతే క్షమించండి అంటూ హౌస్‌కు గుడ్‌బై చెప్పాడు. (చదవండి: బిగ్‌బాస్ : నోయల్‌కు వచ్చిన వ్యాధి ఇదే) దివి.. దీపిక పదుకొణెలా ఉన్నావు తర్వాత మెహబూబ్‌ను చూడగానే సోహైల్ తెగ ఎగ్జైట్ అయ్యాడు. అతడు మాత్రం తన ఆతృతను లోలోపలే అణుచుకుంటూ దివితో స్టెప్పులేశాడు. అనంతరం తన జిగిరీ దోస్తులు సోహైల్, అఖిల్, అభిజిత్‌తో కబుర్లు చెప్పాడు. అటు అఖిల్ మాత్రం దీపిక పదుకొణెలా ఉన్నావంటూ దివిని పొగడ్తలతో ముంచెత్తాడు. చాలా బాగున్నావంటూ అభిజిత్ కూడా మెచ్చుకోవడంతో ఏంటి పులిహోరా? అని దివి ప్రశ్నించింది. మరోపక్క మెహబూబ్, సోహైల్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం ఫైనలిస్టులు అన్ని హార్ట్ దిండులను మెహబూబ్, దివికి బహుమతిగా ఇచ్చారు. మీ ఐదుగురు విన్నర్లే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండని మెహబూబ్ పదే పదే చెప్తూ సెలవు తీసుకున్నాడు. (చదవండి: బిగ్‌బాస్: పెద్దగా ఆకట్టుకోని కంటెస్టెంట్లు వీళ్లే..) మిస్ అవుతున్నానంటూ ఏడ్చేసిన అరియానా తర్వాత అవినాష్ ఎంట్రీ ఇవ్వడంతో అరియానా ఆనందంతో గెంతులేసింది. కానీ ఆ వెంటనే నిన్ను మిస్ అవుతున్నానంటూ గుక్కపెట్టి ఏడవటంతో ఆమెను ఓదార్చాడు. తననిప్పుడు అవినాష్ అని కాకుండా ఎంటర్టైనర్ అని పిలుస్తున్నాడని చెప్పుకొచ్చాడు. తన ఇంటికి వేరే వేరే జిల్లాల నుంచి అభిమానులు కలిసేందుకు వస్తున్నారని తెలిపాడు. అఖిల్ పులిహోర మామూలుగా కలపడం లేదంటూ సెటైర్లు వేశాడు. హారిక అలాగే చూస్తుండటం చూసి ఏంటి? దినాలకు పిట్టకు పెట్టినట్లు చూస్తున్నావు అని పంచ్ వేశాడు. అనంతరం అందరి హౌస్‌కు గుడ్‌బై చెప్తూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. తర్వాత ఫైనలిస్టులు డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. (చదవండి: బిగ్‌బాస్ విన్నర్ అతడే: అలీ రెజా) -
బిగ్‌బాస్: అరియానా, ఇంత అందంగా ఎట్లున్నవే
బిగ్‌బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లు సోహైల్, అరియానా పేర్లు చెప్పగానే అందరికీ టామ్ అండ్ జెర్రీ గుర్తొస్తుంది. వీళ్లు ఎంత కొట్టుకున్నా అది టామ్ అండ్ జెర్రీ ఫైట్లాగే కనిపించేది. కానీ గతవారంలో మాత్రం ఇద్దరూ బద్ధ శత్రువుల్లా మారి పూనకం వచ్చినట్లుగా ప్రవర్తించారు. మాటల తూటాలు పేలుస్తూ ఒకరి మీదకు ఒకరు దూసుకెళ్లారు. వీళ్లను శాంతింపజేయడం ఎవరి తరమూ కాలేదు. చివరకు వీకెండ్లో నాగార్జున వీళ్ల పంచాయితీని పరిష్కరిస్తూ తలా రెండు మొట్టికాయలు వేశారు. దీంతో ఇద్దరూ ఒకరికి ఒకరు సారీ చెప్పుకుంటూ మళ్లీ కలిసిపోయారు. ఒకరినొకరు జెండూబామ్ అనుకున్నవాళ్లే బబుల్‌గమ్‌లా అతుక్కుపోయారు. కానీ ఏడిపించడం మాత్రం మానుకోలేదు. (చదవండి: అభి ఫ్యాన్స్ఫై పోలీసులకు మోనాల్ ఫిర్యాదు) నాకు పెట్టకుండా తింటున్నావా? తాజాగా బిగ్‌బాస్ అన్‌సీన్‌లో సోహైల్, అఖిల్ గార్డెన్ ఏరియాలో పడుకున్నారు. అరియానా కప్పులో ఏదో తినుకుంటూ వస్తోంది. ఇది చూసిన సోహైల్ నాకు పెట్టకుండానే తింటున్నావా? ఇదేనా దోస్తానా? అని భారీ డైలాగులు కొట్టాడు. దీంతో అరియానా అతడికి స్పూన్‌తో తినిపించింది. సరిగ్గా తినిపించట్లేదు, అవసరం లేదు, పో అని సోహైల్ హర్ట్ అవ్వడంతో నువ్వు జోక్ చేయొచ్చు, కానీ నేను చేయొద్దా అంటూ ఆమె అరిచేసింది. (చదవండి: మోనాల్ వెళ్లిపోయాక ఊపిరి ఆడలేదు: అఖిల్) 24 ఏళ్ల వయసులో పదహారేళ్ల పిల్లలా ఎలా? దీంతో తాను కూడా జోక్‌గా అన్నా అంటూ సోహైల్ ఆమెను బంగారుతల్లి అంటూ బుజ్జగించాడు. ఇంత అందంగా ఎట్లున్నావు? అంటూ పులిహోర కలిపాడు. సోహైల్‌లో ఈ కొత్త యాంగిల్ చూసిన అరియానా షాక్ తింది. ఈ వయసులో కూడా ఇంత అందంగా ఎలా ఉన్నావు? అని బిస్కెట్లు వేస్తూ ..32 ఏళ్లు ఉంటాయ్ కదా? అన్నాడు. అది నీకు అంటూ అరియానా పంచ్ వేసింది. నాకు 28 అని సోహైల్ చెప్పడంతో తనకు 24 అని అరియానా సమాధానమిచ్చింది. అయినా 24 ఏళ్ల వయసులో పదహారేళ్ల పిల్లలాగా ఎలా కన్పిస్తున్నావే.. అంటూ అడుగుతూనే ఉన్నాడు. దీంతో ఈ పులిహోర ఘాటు తట్టుకోలేక అరియానా ఇది మనకు సెట్టవ్వదు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. (చదవండి: బిగ్‌బాస్: మాట మీద నిలబడ్డ దేవి నాగవల్లి) Day 103 Unseen 💥 Telegram ➡️ @biggboss4_unseen#BiggBossTelugu4 #BiggBoss4Telugu #BiggBossUNSEEN #Ariyana #Sohel pic.twitter.com/PIZdgmNjwC — BB4 Telugu UNSEEN (@BiggBoss4Unseen) December 19, 2020 -
పీఆర్ టీమ్ పెట్టుకుంటే సోహైల్ కథ వేరే ఉండేది
బిగ్‌బాస్ ఫైనలిస్టు హారిక చెప్పినట్లుగా పోరాటం ముగిసింది. అటు కంటెస్టెంట్లతో పాటు, వారిని గెలిపించేందుకు విశ్వప్రయత్నాలు చేసిన అభిమానుల పోరాటం ముగిసింది. దీని ఫలితం మాత్రం తేలాల్సి ఉంది. ఈసారి గత సీజన్ల కంటే భారీ స్థాయిలో ఓట్లు పడినట్లు తెలుస్తోంది. మరోపక్క నెట్టింట్లో అభిజితే విన్నర్ అన్న పేరు వినిపిస్తోంది. కానీ అది బిగ్‌బాస్ షో. అంచనాలు తారుమారు చేసేందుకు బిగ్‌బాస్‌కు ఓ క్షణం పట్టదు. గెలుపోటముల లెక్క రేపు నాగార్జున చూసుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే మాజీ కంటెస్టెంటు అలీ రెజా కాబోయే విజేత ఎవరనేది చెప్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్రోఫీ కన్నా అదే ముఖ్యం "సోహైల్ నాకు 8 ఏళ్లుగా తెలుసు. అతడు నా తమ్ముడు లాంటి వాడు. తనేంటో ప్రూవ్ చేసుకుంటేనే సపోర్ట్ చేస్తానని ముందే చెప్పాను. రెండు మూడు వారాల్లోనే అతడేంటో నిరూపించుకున్నాడు. అప్పుడే అనుకున్నా, వీడు కచ్చితంగా టాప్ 5లో ఉంటాడని! కొందరు అతడు ముస్లిం కాబట్టి సపోర్ట్ చేస్తున్నా అంటున్నారు. అది పూర్తిగా అబద్ధం. ఇలా మతాలను అడ్డు పెట్టుకుని నేను ఏ పనీ చేయను. అతడికే కాదు, గతంలోనూ ఎవరికీ మతపరంగా పక్షపాతం చూపించలేదు. సోహైల్ జెన్యూన్, చిన్న పిల్లాడి మనస్తత్వం. అవి చూశాకే మూడో వారం నుంచి అతడికి సపోర్ట్ చేయడం ప్రారంభించాను. అతడు షోకి వెళ్లేముందు కొన్ని సలహాలు ఇచ్చాను. ట్రోఫీ అందుకోవడం కన్నా ప్రత్యేకతను చాటుకోవడం ముఖ్యమని చెప్పాను. ఎలాంటి పరిస్థితిలోనైనా నువ్వు నీలాగే ఉండమని సూచించాను. అతడు అలాగే ఉన్నాడు కూడా! అందుకే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా నామినేషన్లంటే భయపడొద్దన్నాను. ఎందుకంటే డేంజర్ జోన్లో ఉంటేనే ప్రేక్షకులకు మనకు ఓట్లు వేసే అలవాటు పెరుగుతుంది" అని చెప్పుకొచ్చాడు. (చదవండి: ఆ ఒక్కరికే రాహుల్ సిప్లిగంజ్సపోర్ట్!) అభిజిత్ వల్ల కాదు "కోపాన్ని జయించి తనను తాను ఎంతగానో మార్చుకున్న సోహైల్ ట్రోఫీ గెలిచేందుకు అన్ని విధాలా అర్హుడు. ఈసారి అమ్మాయి గెలిచేందుకు జీరో ఛాన్స్ ఉంది. సోషల్ మీడియా ప్రకారం అభిజిత్, సోహైల్ మధ్య గట్టి పోటీ ఉంది. కానీ సోహైల్ కూడా మంచి పీఆర్ టీమ్‌ను పెట్టుకుంటే ఫలితం మరోలా ఉండేది. అయితే అతడి కుటుంబానికి పీఆర్ టీమ్ పెట్టుకునేంత ఆర్థిక స్థోమత లేదు. కానీ ఇప్పటికీ సోహైల్ గెలిచేందుకు అవకాశాలున్నాయి. సోహైల్ వల్లే ఈ సీజన్ ముందుకు నడిచింది తప్ప అభిజిత్ వల్ల కాదు అని స్పష్టం చేశాడు. ఏదేమైనా తన దృష్టిలో సోహైల్ ఇప్పటికే గెలిచేశాడని అలీ రెజా పేర్కొన్నాడు. (చదవండి: బిగ్‌బాస్ గిఫ్ట్: బంగారం కొన్న గంగవ్వ)