ఫోన్‌ చేస్తే ఆ హీరోలు కట్‌ చేస్తున్నారు: సోహైల్‌ ఆవేదన | Syed Sohel Ryan Emotional on Bootcut Balaraju Movie | Sakshi
Sakshi News home page

Syed Sohel Ryan: ఫోన్‌ చేస్తే స్పందన లేదు.. సోహైల్‌ అనగానే కట్‌..

Published Mon, Jan 22 2024 12:13 PM | Last Updated on Mon, Jan 22 2024 1:04 PM

Syed Sohel Ryan Emotional on Bootcut Balaraju Movie - Sakshi

బిగ్‌బాస్‌ షోతో గుర్తింపు తెచ్చుకుని వరుసగా సినిమా ఛాన్సులు అందుకుంటున్న వ్యక్తి సోహైల్‌. బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ ద్వారా జనాల్లో మంచి క్రేజ్‌ అందుకున్న ఇతడు మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ సినిమాతో ఓ చిన్న సాహసమే చేశాడు. ఈ మూవీ పాజిటివ్‌ రెస్పాన్స్‌ అందుకోవడంతో పాటు సోహైల్‌ నటనకూ మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడతడు బూట్‌కట్‌ బాలరాజు చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. శ్రీకోనేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో సోహైల్‌ ఎమోషనలయ్యాడు.

దానికి రెండే కారణాలు..
సోహైల్‌ మాట్లాడుతూ.. 'సినిమాలు చేసినా, వెబ్‌ సిరీస్‌లు చేసినా, రియాలిటీ షో చేసినా, షార్ట్‌ ఫిలిం చేసినా.. దానికి రెండే రెండు కారణాలుంటాయి. ఒకటి బతకడానికి, మరొకటి గుర్తింపు కోసం! ఇండస్ట్రీ ప్రయాణం ఎలా మొదలైందని పట్టించుకోవద్దు. నేను ఒక షార్ట్‌ ఫిలిం చేశా, ఆ తర్వాత కొత్త బంగారు లోకంలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నటించాను. ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చాను. మనపై మనం నమ్మకం పెట్టుకుని పోరాడుతూ ఉండాలి. అంతే!

యంగ్‌ హీరోలకు ఫోన్‌ చేస్తే..
మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. పదిరోజుల క్రితం.. సంక్రాంతి సమయంలో యంగ్‌ హీరోలకు ఫోన్‌ చేశాను. నేను సోహైల్‌ అనగానే ఫోన్‌ కట్‌ చేశారు. మళ్లీ ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదు. వాళ్లంతా సక్సెస్‌ఫుల్‌ హీరోలు.. ఎంతో పెద్ద స్థాయిలో ఉన్న వెంకటేశ్‌ సర్‌కు ఈ మధ్య మెసేజ్‌ పెడితే వెంటనే రిప్లై ఇచ్చారు. ఆల్‌ ద బెస్ట్‌ చెప్తూ వాయిస్‌ మెసేజ్‌ పంపారు. అది విని నాకు ఎంతో సంతోషమేసింది. నేను ఒకటే చెప్తున్నాను.. ఎప్పుడూ ఒకేలా ఉందాం. ఒకరికొకరం సపోర్ట్‌ చేసుకుందాం. ఎవరైనా నాలాంటి యంగ్‌స్టర్స్‌ మీ సాయం కావాలన్నప్పుడు ఒక మాట సాయం చేయండి, అంతే చాలు' అని భావోద్వేగానికి లోనయ్యాడు.

చదవండి: ప్రత్యేక విమానంలో అయోధ్యకు వెళ్లిన చిరంజీవి, చరణ్‌..

whatsapp channel

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement