బిగ్‌బాస్ షోలో పాల్గొనేవారికి క్రేజ్, పాపులారిటీ వస్తుంది. ఆ క్రేజ్‌ను కాపాడుకోవడం వారి చేతుల్లోనే ఉంటుంది. ఇకపోతే బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో పాల్గొన్న సోహైల్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. తనకు వచ్చిన క్రేజ్ చూసి ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. వరుస ఆఫర్లు వస్తుండటంతో సంతోషంగా ఓకే చేసేశాడు.
ఒకేసారి మూడు నాలుగు సినిమాల వరకు సంతం చేశాడు. కొత్త బంగారు లోకం సినిమాలో కేవలం ఒకటీరెండు సెకన్ల పాటు కనిపించిన సోహైల్ బిగ్‌బాస్ తర్వాత హీరోగా మారాడు. లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్‌కట్ బాలరాజు వంటి చిత్రాలు చేశాడు.
ఇందులో మిస్టర్ ప్రెగ్నెంట్ తప్ప మిగతావన్నింటినీ ప్రేక్షకులు తిరస్కరించారు. దాన్ని సోహైల్ తట్టుకోలేకపోయాడు. తన సినిమాను చూడమని, ఎంకరేజ్ చేయమని కన్నీళ్లు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్న అతడు కొత్త బిజినెస్‌లోకి దిగాడు. మణికొండలో కొత్త రెస్టారెంట్ ప్రారంభిస్తున్నాడు. డిసెంబర్ 23న ఈ రెస్టారెంట్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించాడు.
చదవండి: దుల్కర్ సల్మాన్‌కు జోడీగా ఛాన్స్ కొట్టేసిన టాలెంటెడ్ బ్యూటీ
Comments
Please login to add a commentAdd a comment