బిగ్‌బాస్ సొహెల్ ఇంట్లో విషాదం.. ఏమైంది? | Bigg Boss Telugu Syed Sohel Mother Passed Away | Sakshi
Sakshi News home page

Syed Sohel: బాధలో బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సొహెల్

Sep 17 2024 4:27 PM | Updated on Sep 17 2024 4:38 PM

Bigg Boss Telugu Syed Sohel Mother Passed Away

తెలుగు బిగ్‌బాస్ 4వ సీజన్‌లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న సొహెల్ ఇంట్లో విషాదం. ఇతడి తల్లి చనిపోయింది. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో ఇబ్బందిపడుతున్న ఈమెని డయాలసిస్ కోసం హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్చారు. కానీ పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ప్రముఖ సింగర్ మనో ఇద్దరు కొడుకులు అరెస్ట్)

సొహెల్ సొంతూరు కరీంనగర్. తండ్రి సయ్యద్ సలీంతో పాటు తల్లి, తమ్ముడు ఉన్నారు. సొహెల్ కెరీర్ విషయానికొస్తే 'కొత్తబంగారు లోకం' సినిమాలో కనీకనిపించని పాత్ర చేశాడు. 'జనతా గ్యారేజ్' సినిమాలో సైడ్ క్యారెక్టర్‌లో కనిపించాడు. ఇక బిగ్ బాస్ షోలోకి వచ్చిన తర్వాత మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అలా హీరో కూడా అయిపోయాడు.

లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు తదితర సినిమాల్లో సొహెల్ హీరోగా చేశాడు. ప్రస్తుతం కొత్త మూవీస్ ఏం చేస్తున్నాడా లేదా అనేది తెలియాలి. ఇక సొహెల్ తల్లి పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి సొంతూరు కరీంనగర్‌కి తీసుకెళ్లి, అక్కడే అంత్యక్రియలు చేయనున్నట్లు తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: ఇండస్ట్రీ పెద్దలు.. డైరెక్టర్ త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి: పూనమ్ కౌర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement